Actress Nandita Swetha Cries On Hidimba Movie Success Meet - Sakshi
Sakshi News home page

Nandita Swetha: ఇది నాకు చాలా సెంటిమెంట్‌.. కన్నీటి పర్యంతమైన నందితా శ్వేత!

Published Sat, Jul 22 2023 9:02 PM | Last Updated on Sat, Jul 22 2023 9:12 PM

Hidimba Actress  Nandita Swetha Cries On hidimba Success Meet - Sakshi

అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్‌ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ క‌న్నెగంటి దర్శకత్వంలో  తెర‌కెక్కించారు.  అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఎస్‌వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించారు.  అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది.  అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్  నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 

(ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్‌ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!)

నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ  టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్‌ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు.  ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్‌ రోల్‌ నేను చేస్తానని  అనుకోలేదు.  దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్‌ - అనిల్‌ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు.' అని అన్నారు. 

నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్‌గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్‌ చనిపోయారు.  ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. 

(ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్‌ చేశాం.. కారణం ఇదే' )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement