Hidimba Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!
బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ పద్మిని - మలయాళ చిత్రం పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్ బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12 మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది) పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్) జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్) మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది) సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ కమాండో - హిందీ సిరీస్ జియో సినిమా జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా ఆహా వాన్ మూండ్రు - తమిళ మూవీ హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) జీ5 అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్ ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ సోనీ లివ్ పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా ద ఫేబుల్మన్స్ - ఇంగ్లీష్ మూవీ బ్రోకర్ - కొరియన్ చిత్రం పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా లయన్స్ గేట్ ప్లే హై హీట్ - ఇంగ్లీష్ సినిమా బుక్ మై షో రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!
This Week OTT Movies: ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అయితే ఈ వారం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', రజినీకాంత్ 'జైలర్' థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల హడావుడి మొదలైపోయింది. మరోవైపు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం ఏకంగా 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు సిద్ధమయైపోయాయి. వాటిలో పలు మూవీస్ ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) చిరు-రజినీ సినిమాల గురించి పక్కనబెడితే ఈ వారం ఓటీటీల్లోకి మంచి మంచి థ్రిల్లర్స్ రాబోతున్నాయి. వీటిలో తమిళ బ్లాక్‌బస్టర్ 'పోర్ తొడిల్' సినిమా ఒకటి. అలానే ఒక్క పాటతో సెన్సేషన్ అయిన హిందీ చిత్రం 'జరా హట్కే జరా బచ్కే' కూడా ఈ వారమే రానుంది. అలానే హిడింబ మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీ లిస్టులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలు. మరి ఏయే మూవీసే ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08 జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08 మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11 పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11 బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12 అమెజాన్ ప్రైమ్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10 రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 హాట్‌స్టార్ నెయ్మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08 ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11 జియో సినిమా జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11 ఆహా హిడింబ (తెలుగు సినిమా) - ఆగస్టు 10 వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10 వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11 జీ5 అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11 ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11 సోనీ లివ్ ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 09 పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11 ఆపిల్ ప్లస్ టీవీ స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 09 లయన్స్ గేట్ ప్లే హై హీట్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 (ఇదీ చదవండి: ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో) -
లైవ్ లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ నందితా
-
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్‌బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్‌గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
సురేష్ గారు ప్రొడ్యూసర్ నాకేం నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వలేదండి ..
-
Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ
టైటిల్: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: అనిల్ కన్నెగంటి విడుదల తేది: జులై 20, 2023 కథేంటంటే.. హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేతో(ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్‌గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది. నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఫస్టాఫ్ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్లు ప్రేక్షకులను ధ్రిల్కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్‌కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్