
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయతే, అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్షన్‌లోనే హిడింబ మూవీ తాజాగా విడుదలైంది.
ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడిగా అశ్విన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజుగారి గది సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ చిత్రాలన్నింటికి ఓంకార్ దర్శకత్వం వహించడం గమనార్హం. అయితే, హిడింబ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై భారీ అశలు పెట్టకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్‌గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

కథేంటి..?
హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు.
అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment