
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’(Bhoothaddam Bhaskar Narayana). స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్‌ని పంచింది. ఆపై ఆహా ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను కొనసాగించింది. ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.
డిటెక్టివ్ థ్రిల్లర్స్ చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్‌లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. ఇప్పటికే ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.

కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment