Bhoothaddam Bhaskar Narayana Movie
-
మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి
శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ కి థాంక్స్. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్ కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది. సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడింది’ అన్నారు. హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి ఆనందంగా ఉంది. హౌస్ ఫుల్ థియేటర్స్ చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అన్నారు. ‘సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని దర్శకుడు పురుషోత్తం అన్నారు. ఈ సక్సెస్ మీట్లో రాజ్ కందుకూరి,ర్మాతలు స్నేహాల్, శశిధర్ పాల్గొన్నారు. -
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ
టైటిల్: భూతద్ధం భాస్కర్ నారాయణ నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై దర్శకత్వం : పురుషోత్తం రాజ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్ విడుదల తేది: మార్చి 1, 2024 డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా? కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిటెక్టివ్ థ్రిల్లర్స్‌కి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్, లవ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. సీరియల్ కిల్లర్ తెరపై వచ్చినప్పటి నుంచి సినిమా అంతా సీరియస్ మూడ్‌లోకి వెళ్తుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను మరింత ఆకట్టకుంటాయి. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు.దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉండడం.. ద్వితియార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్‌ని మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంతో దర్శకుడు సఫలం అయ్యాడు.థ్రిల్లర్స్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా ఉంది. శివ నటనగా కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. రిపోర్టర్ లక్ష్మీ గా రాశీ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా పరంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. కెమరాపనితనం రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ లో దిష్టి బొమ్మ గురించి చర్చించాం: హీరో శివ కందుకూరి
క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. భూతద్ధం భాస్కర్ నారాయణ కథలో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. అందుకే సినిమా ఒప్పుకున్నాను’అన్నారు యంగ్ హీరో శివ కందుకూరి. ఆయన హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోం. దాని గురించి చాలా మందికి తెలీదు. దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం ఉంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగ్‌గా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం ఉంది. ► దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో ఉన్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపధ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న ఓ సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది. ► వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది. మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది. ► ప్రస్తుతం మైథాలజీకల్ థ్రిల్లర్ జోనర్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే కథలో భాగమైయ్యే ఉంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే ఉంటుంది. ► ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం. ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలరు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకున్నారు. చాలా అంకితభావంతో పని చేశారు. ► శ్రీచరణ్ పాకాల అందించిన నేపధ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగే ఇందులో ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో చేశాం. అది మా ఆర్ట్ డైరెక్టర్ ఆలోచన. యాభై పెయింటింగ్ లు స్కాన్ చేసి ఎఐ లిరికల్ వీడియో చేశాం. తెలుగు చేసిన తొలి ఎఐ లిరికల్ వీడియో కావడం ఆనందంగా ఉంది. ► ప్రస్తుతం ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపధ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. -
దిష్టి బొమ్మ కథేంటి అని చూపిస్తున్నాం: స్నేహాల్, శశిధర్
‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రం డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందింది. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అని నిర్మాతలు స్నేహాల్, శశిధర్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న రిలీజవుతోంది. స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ– ‘‘2014లో ‘షీష్మహల్’ అనే ఇండిపెండెంట్ సినిమా, 2020లో ‘నీతో’ మూవీ చేశాం. 2022లో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రయాణం ఆరంభమైంది. ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది.. దాని వెనక ఉన్న కథ ఏంటి? అన్నదానికి ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని జోడించి ఈ కథని తీశాడు పురుషోత్తం’’ అన్నారు. -
గూస్ బంప్స్ తెప్పిస్తున్న 𝐀𝐈 జెనరేటడ్ 'శివ ట్రాప్ ట్రాన్స్'సాంగ్
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి 'శివ ట్రాప్ ట్రాన్స్' పాటని రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణీ ఈ పాటని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. సింగల్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. ఈ పాట లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం. హీరో సుహాస్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగింది. దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. -
Bhoothaddam Bhaskar Narayana Trailer: హత్యలు కాదు నరబలి..ట్రైలర్ అదిరింది!
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్నిమాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.. 'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది. -
ఆకట్టుకుంటున్న'భూతద్ధం భాస్కర్ నారాయణ' టైటిల్ సాంగ్
శివ కందుకూరి, రాశిసింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచిగా ఉంది. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి.