‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రం డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందింది. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’’ అని నిర్మాతలు స్నేహాల్, శశిధర్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న రిలీజవుతోంది.
స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ– ‘‘2014లో ‘షీష్‌మహల్’ అనే ఇండిపెండెంట్ సినిమా, 2020లో ‘నీతో’ మూవీ చేశాం. 2022లో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రయాణం ఆరంభమైంది. ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది.. దాని వెనక ఉన్న కథ ఏంటి? అన్నదానికి ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని జోడించి ఈ కథని తీశాడు పురుషోత్తం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment