Shashidhar
-
దిష్టి బొమ్మ కథేంటి అని చూపిస్తున్నాం: స్నేహాల్, శశిధర్
‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రం డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందింది. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అని నిర్మాతలు స్నేహాల్, శశిధర్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న రిలీజవుతోంది. స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ– ‘‘2014లో ‘షీష్మహల్’ అనే ఇండిపెండెంట్ సినిమా, 2020లో ‘నీతో’ మూవీ చేశాం. 2022లో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రయాణం ఆరంభమైంది. ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది.. దాని వెనక ఉన్న కథ ఏంటి? అన్నదానికి ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని జోడించి ఈ కథని తీశాడు పురుషోత్తం’’ అన్నారు. -
పంట నష్టంతో యువరైతు ఆత్మహత్య
బజార్హత్నూర్: ఇటీవల కురిసిన భారీ వర్షా ల కారణంగా పంట నష్టపోయిన ఓ రైతు పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకెలారి శశిధర్(28)కు బజార్హత్నూర్ మండలం కొలారి శివారులో మూడెకరాల పొలం ఉంది. ఈ ఏడాది మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. నాలుగు ఎకరాల్లో పత్తి, మరో ఏడు ఎకరాల్లో సోయా పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం గ్రామీణ బ్యాంకులో రూ.90 వేలు, ప్రైవేటుగా రూ.3.8 లక్షలు అప్పు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం కొందరు రైతులు శశిధర్ తన చేను సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. శశిధర్‌కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అభిమాన హీరోను ఆలింగనం చేసుకుని..
తుమకూరు (కర్ణాటక): తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మనసారా ఆలింగనం చేసుకున్న ఆ అభిమాని గుండె ఆ ఆనందాన్ని పట్టలేకపోయిందేమో... ఒక్కసారిగా ఆగిపోయింది. కన్నడ సినీ హీరో, బహుభాషా నటుడు సుదీప్‌ను వాటేసుకున్న అభిమాని కాసేపటికే కన్నుమూశాడు. సుదీప్ తన కొత్త సినిమా హెబ్బులి విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్‌కు వచ్చాడు. సుదీప్‌ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. హోటల్ కార్మికుడైన శశిధర్(45)కు సుదీప్ అంటే వీరాభిమానం. అతడు సుదీప్తో కరచాలనం చేసి కార్యక్రమంలో సందడి చేశాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో గుండె పోటుతోకుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా శశిధర్ మరణించాడు. -
పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలుతుందా?
బెంగళూరు: ‘పోలీసులు సమ్మె చేస్తేనే ప్రభుత్వం కూలిపోతుందా? అసలు ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరాలు....పోలీసుల డిమాండ్ల పరిష్కారానికి గతంలో పోలీసుల సమ్మెకు కర్ణాటక పోలీసు మహా సంఘం అధ్యక్షుడు శశిధర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేసింది. దీంతో శశిధర్ జామీను కోసం హైకోర్టును ఆశ్రయించగా గురువారం వాదనలు జరిగాయి. శశిధర్ తరఫున న్యాయవాది అశోక్ హార్నల్లి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ...... ‘శశిధర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఇవ్వడం మీకు సమ్మతమేనా, ఫేస్బుక్, ట్విట్టర్ల వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధంతో పాటు ఇంటర్వూలు ఇవ్వరాదనే నిర్భంధనలతో బెయిల్‌ను మంజూరు చేస్తే మీకెలాంటి అభ్యంతరం లేదు కదా?’ అని శశిధర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. తమకెలాంటి అభ్యంతరం లేదని అశోక్ హార్నల్లి పేర్కొన్నారు. దీంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ కలగజేసుకుంటూ....‘శశిధర్ పోలీసులను రెచ్చగొట్టి సమ్మె చేయించాలనుకున్నారు? ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు? అందువల్ల అతనికి బెయిల్‌ను మంజూరు చేయవద్దు’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.... ‘పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలిపోతుందా? ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించంతో పొణ్ణన్న మిన్నకుండిపోయారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన తర్వాత శశిధర్ జామీనుకు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి రిజర్వ్‌లో ఉంచారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: శశిధర్ రెడ్డి
తమ్మరబండపాలెం(కోదాడరూరల్): నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బండపాలెంలో రూ. 4 లక్షలతో మంత్రి నిధుల నుంచి∙చేపట్టిన సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. ఇప్పటికే మంత్రి నిధులతో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగరాణి, సర్పంచ్ సుల్తానీ కాటయ్య, ఎంపీటీసీలు రమేష్, పిచ్చమ్మ, పీఆర్ఏఈ లక్ష్మారెడ్డి, కమతం వెంకటయ్య, ఎస్కె.మీరా, కరుణాకర్, గడిపూడి శ్రీకాంత్, నెల్లూరి వీరభద్రరావు, ఈదుల కృష్ణయ్య, వెంకటయ్య, డేగ కొండయ్య, నాగుల్‌మీరా, కనకయ్య, సైదులు, కార్యదర్శి జానిమియా తదితరులు పాల్గొన్నారు. -
సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో గోల్ మాల్
అనంతపురం: అనంతపురం జిల్లా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేయడానికి యత్నించారు. కలెక్టర్ కోనా శశిధర్ అనుమతి లేకుండానే రూ.6.38 కోట్లు డ్రా చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించని పీఓ జయకుమార్ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
క్రైమ్ కథ
ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ‘కదిలే బొమ్మల కథ’. వి.బాలు, ప్రియ. శ్రీతేజ్, అనన్యశెట్టి ముఖ్యపాత్రల్లో శశిధర్ బోయపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్ రావుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను సీనియర్ నటుడు నాజర్, ప్రసాద్‌లు ఆవిష్కరించారు. నాజర్ మాట్లాడుతూ-‘‘సినిమాల్లో పెద్దా, చిన్నా తేడాలుండవు. అన్నిటిలోనూ రిస్క్ ఒకటే. కథ చెప్పగానే వెంటనే నచ్చింది’’ అని చెప్పారు. ఈ వేడుకలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత బాలసాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులను ఉపేక్షించం
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత మరుగుదొడ్డి కల్పనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. శుక్రవారం డ్వామాహాలులో స్వచ్చందసంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మరుగుదొడ్లు నిర్మాణంపై అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఆమోదం ఉంటే ఎన్ని గ్రామాల్లోనైనా మంజూరు చేస్తామని వివరించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ నిధుల ద్వారా ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్మించాల్సి ఉంటుందన్నారు. పెన్నా సిమెంట్ కంపెనీ నుంచి రూ. 280లకే సిమెంట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇసుకను స్వచ్చంద సంస్థలే సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో పక్కాగా జరిగిందని, నిధులకు ఎలాంటి డోకా లేనందున స్వచ్ఛంద సంస్థలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అధికారులు, స్వచ్ఛందసంస్థలు అన్న తేడా లేకుండా క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నాటికి జిల్లాలో లబ్దిదారులుగా ఎంపికైన వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి తీరాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్, పంచాయతీరాజ్ ఎస్ఈ రవికుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిందితుడితో పోలీస్ దోస్తీ..!
కస్టడీ నిబంధనలకు నీళ్లు రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బిర్యానీ ఆరగింపు చంచల్‌గూడ: విచారణ నిమిత్తం ఓ నిందితుడిని నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి ఆదేశించింది. జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అతగాడికి రాచమర్యాదలు చేసిన విచిత్ర వైనం ఇది. కస్టడీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన పోలీసులు నిందితుడితో చెట్టాపట్టాలేసుకొని ఓ రెస్టారెంట్లో బిర్యానీ ఆరగించారు. ఈ దృశ్యాన్ని సాక్షి చిత్రీకరించింది.పూర్తి వివరాలు... బేగంపేటలోని అమెరికన్ దౌత్యకార్యాలయంలో విధులు నిర్వహించే తాత్కాలిక ఉద్యోగి కొండేరు శశిధర్ అమెరికాకు వె ళ్లాలనుకునే వారికి వీసాలిప్పిస్తానంటూ సుమారు 30 మంది దరఖాస్తుదారులను మోసం చేసి రూ.3 లక్షలకుపైగా దండుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతన్ని మరింతలోతుగా విచారించేందుకు సీసీఎస్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి శశిధర్ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సీసీఎస్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న శశిధర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీసుల రాచమర్యాదలు... పోలీసులు అతన్ని సీసీఎస్‌కు తరలించేందుకు ఏపీ 9పీ 5502 టాటాసుమోలో బయలు దేరారు. అయితే ఇక్కడే నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వద్దకు వచ్చారు. వీరందరూ కలిసి నల్గొండ చౌరస్తాలోని సోహెల్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి, పోలీసులు సైతం బిర్యానీ తిన్నారు. హోటల్ నుంచి మధ్యాహ్నం 3.30కి బయటికి వచ్చారు. కస్టడీలోకి తీసుకున్న నిందితుడికి కుటుంబ సభ్యులతో కలపడం నేరం. అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ హోటళ్లకు తీసుకుపోవడమూ నేరమే. అదను చూసి నేరస్తుడు పారిపోతే పరిస్థితి ఏమిటి..? నిందితుడిని కస్టడీలోకి తీసుకోగానే పోలీసులు అతన్ని నేరుగా సీసీఎస్‌కు తరలించాలి. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడే మిలాఖత్ అయిన పోలీసులు రేపు నిందితుడిని ఏమేరకు విచారిస్తారో ఇట్టే అర్థమవుతోంది. అతనికి విందు భోజనం ఏర్పాటు చేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
అందరికీ థ్యాంక్స్
కడప కల్చరల్ : జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరిచిపోలేనని బదిలీపై వెళుతున్న కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బంగ్లాలో అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తనను సొంత బిడ్డలా ఆదరించారని, వారిని ఎప్పటికీ గుర్తించుకుంటానని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖలు సంయుక్తంగా పనిచేస్తేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రక్షణ లభించగలవన్నారు. జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కీలక సమయంలో కీలక పదవికి వెళుతున్న కలెక్టర్‌కు ప్రత్యేక వీడ్కోలు తెలుపుతున్నామన్నారు. విభజన నేపధ్యంలో హైదరాబాదులో ఎక్కువగా పని ఉంటుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం కోన శశిధర్ ప్రతిభకు నిదర్శనమన్నారు. ఏజేసీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలని, ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి కలెక్టర్ విజయం సాధించారన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఏకైక కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, డీఆర్వో సులోచన, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, డీఆర్డీఏ,డ్వామాు, ఏపీఎంఐపీ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభా భారతి, స్టెప్ సీఈఓ మమత, నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, ఉద్యాన శాఖ ఏడీ మదుసూదన్‌రెడ్డి, ఇంకా పలువురు జిల్లా అధికారులు కోన శశిధర్ అందించిన సేవలను గురించి వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ, అధికారుల సంఘం ప్రతినిదులు కోన శశిధర్‌ను ఘనంగా సత్కరించారు. -
రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం
అబ్బాయి పుడితే రూ.800.. అమ్మాయి పుడితే రూ.500..గ్రూపులుగా మారి వసూళ్ల దందా బాధితులను పీక్కుతింటున్న సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. వైద్యం కోసం వచ్చే పేదల నుంచి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టిన బాబుకు, పాపకు ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నా.. రూ.వేల జీతా లు తీసుకుంటున్న సిబ్బంది అక్రమమార్గంలో వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆస్పత్రికి రోజూ సుమారు 30 నుంచి 40 ప్ర సూతి కేసులు వస్తుంటాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు బంధువుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులుగా వసూళ్లు ప్రసూతి కోసం వచ్చిన మహిళా బంధువుల నుంచి ప్రసూతి విభాగం సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది గ్రూపులుగా మారి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆస్పత్రికి వచ్చిన మహిళను ప్రసూతి విభాగంలో చేర్పిస్తారు. అక్కడి సిబ్బంది ఆపరేషన్‌కు సంబంధించిన దుస్తులు మహిళ ధరించిన తర్వాత రూ.200 తీసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్లో ఉండే ఇద్దరు సిబ్బంది పుట్టిన పాపకు లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు. బాబు పుడితే రూ.800, పాప పుడితే రూ.500 తీసుకుంటారు. సదరు బంధువులు డబ్బులు ఇచ్చేంత వరకు పుట్టిన బిడ్డను వారి చేతికివ్వకుండా ఇబ్బంది పెడతారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి బిడ్డను తీసుకుంటారు. ఇవేకాకుండా అదనంగా అక్కడి నుంచి ప్రసూతి వార్డుకు తరలించేందుకు వార్డు బాయ్‌కి రూ.100, ప్రసూతి వార్డులో పడక చూపించిన సిబ్బందికి రూ.300, పుట్టిన బిడ్డకు ఆయిల్ రాసి శుభ్రం చేసే సిబ్బందికి రూ.200 ఇలా ఎక్కడి సిబ్బంది అక్కడే దోచుకుంటున్నారు. మొత్తంగా సుమారు రూ.1500 వరకు వసూలు చేయందే విడిచిపెట్టరు. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సిబ్బంది ముందుగానే బాధితులకు చెబుతారు. తాము 10 నుంచి 15 మంది ఉంటామని, మీరిచ్చిన డబ్బులు అందరం పంచుకుంటామని స్వయంగా వారే చెప్పడం గమనార్హం. ప్రసూతి వార్డుకు తల్లిని, బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఒక మహిళ సిబ్బంది వచ్చి డబ్బులు వసూళు చేసుకొని వెళ్తొంది. ఆ తర్వాత మరో మహిళ సిబ్బంది వచ్చి అంతకుముందు ఇచ్చిన డబ్బులు తమకు కావని వారు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల కోసం మహిళ బంధువులు పీక్కుతింటున్నారు. ఒకవేళ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వారికి నరకం చూపేడుతున్నారు. ఇక గిరిజన మహిళల పరిస్థితి మరీ దారుణం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగష్టులో రిమ్స్ తనిఖీలకు వచ్చిన కలెక్టర్‌ను కలిసిన కొంత మంది బాధితులు తమ నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుల్లోకి మార్చాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రసూతి వార్డు ఇన్చార్జీ అధికారులు ఈ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఎవరికైన చెబితే ఎక్కడ మళ్లీ తమను హింసిస్తారనే భయంతో బాధితులు నోరు మెదపడం లేదు. ఏదేమైన ప్రసూతి వార్డులో అవినీతి కంపును తొలగించాలని పలువురు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం.. రిమ్స్ ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేసే సిబ్బంది చర్యలు తీసుకుంటాం. ఇకపై సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుకు బదిలీ చేయడం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిని సిబ్బంది డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలి. సదరు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్ -
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
-
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శశిధర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా పూరించి దాఖలు చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప లోక్‌సభ స్థానానికి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టరేట్లోనే నామినేషన్లు వేయాలన్నారు. ఒకవేళ ఆర్వో అందుబాటులో లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన డీఆర్వో వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్కడి ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. రాజంపేట లోక్‌సభకు నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు చిత్తూరుకు వెళ్లి ఆర్వో అయిన అక్కడి జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలలో నామినేషన్లు స్వీకరించబోరని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీన స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు లేని రాజకీయ పార్టీ అభ్యర్థికి పదిమంది బలపరచాల్సి ఉంటందని పేర్కొన్నారు. ఆర్వో గదిలోకి అభ్యర్థితోసహా ఐదు మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్వో గదికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక్కో వాహనంలో ఐదు మందికి మించకూడదన్నారు. నామినేషన్లు ముగిసే వరకు కలెక్టరేట్‌లోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను మాత్రమే దాఖలుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు అర్హత ఉంటుందని చెప్పారు. లోక్‌సభకు నామినేషన్ ఫీజు కింద రూ. 25 వేలు, అసెంబ్లీకి రూ. 10 వేలు చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మినహాయిం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్బంగా సమర్పించే ఫారం-26 (అఫిడవిట్లో) ఖాళీలు వదలరాదన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజమని రుజువైతే చర్యలు తప్పవన్నారు. అఫిడవిట్లను ఆర్వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని సీఈఓ వెబ్సైట్లో ఉంచుతామని, మీడియాకు ఉచితంగా అందజేస్తామని వివరించారు. అఫిడవిట్లలో ఖాళీలు వదిలితే అభ్యర్థికి నోటీసు జారీ చేస్తామని, ఆ అభ్యర్థి మళ్లీ నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసేందుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంకు అకౌంటును తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఓటున్న నియోజకవర్గం నుంచి సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా పొందుపరచాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద 50 వేల రూపాయల కంటేఎక్కువ ఉంటే సీజ్ చేస్తామన్నారు. ముగ్గురు వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నారని, వ్యయ నివేదికలను అభ్యర్థులు సక్రమంగా సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థికి తాము షాడో రిజిష్టర్లను నిర్వహిస్తామన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజున ఓటరు కుడి చూపుడు వేలుకు ఇంకు గుర్తు వేస్తారని తెలిపారు. స్లిప్పులు లేకపోయినా ఈసీ సూచించిన 24 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టినా ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 560 ర్యాంప్స్, టాయిలెట్స్, తాగునీరు, షామియానా వంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల వలే డిక్లరేషన్ సరిపోదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఒకరు మాత్రమే జనరల్ ఏజెంటుగా ఉంటారని, ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్న వారిని జనరల్ ఏజెంటుగా అనుమతించబోమన్నారు. -
ఎన్నికలకు రెడీ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుం చి రిటర్నింగ్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్, స్థానిక సంస్థలు, లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను వరుసగా నిర్వహించాల్సి న పరిస్థితి ఎదురైందన్నారు. అధికారులు జాగ్రత్తగా ఈ ఎన్నికల నిర్వహణను చేపట్టాలన్నారు. ఈ నెల 18 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉంటుందని, 19 నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావచ్చని, ఒకే విడతలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిసిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్, జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలన్నింటికీ రిటర్నింగ్ అధికారులను సూపర్వైజరీ అధికారిగా నియమించామని తెలిపారు. జనవరి 31 నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాను తొలుత గ్రామ పంచాయతీ వారీగా విడగొట్టి, తదుపరి ఎంపీటీసీ వారీగా విభజించి ప్రచురించాలని సూచించారు. ఒక గ్రామ పంచాయ తీ రెండు లేదా అంతకన్న ఎక్కువ ఎంపీటీసీ స్థానాలుగా విభజించి ఉంటే వార్డుల వారీగా విడగొట్టి ఎం పీటీసీ స్థానాల జాబితాను రూపొందించాలన్నారు. మండలాల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్ల వివరాలపై ఆరా.. పోలింగ్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1768 పోలింగ్ కేంద్రాలను గుర్తించారని పేర్కొన్నారు. వెయ్యికి దాటకూడదు.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్య వెయ్యికి దాటకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం ఉండాలన్నారు. రెండు కిలోమీటర్లు పరిధి దాటరాదని చెప్పారు. ఎస్సీ ఎస్టీల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల ను గుర్తించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఆయా సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, తహశీల్దార్లతో సమావేశమై జాబితాను రూపొందించి పంపించాలని కోరారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్ వాహనాలు అందజేశామని, వారు వెంటనే రంగంలోకి దిగాలని కలెక్టర్ తెలి పారు. స్కాటిక్ సర్వేలెన్స్ టీముల ద్వారా ఇప్పటికే రూ. 9.5 లక్షల నగదు, గ్యాస్ స్టవ్‌లు సీజ్ చేశామన్నా రు. ఫ్లయింగ్ స్వ్కాడ్‌లో ఉన్న వ్యక్తులకు మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించారని కొందరు ఆర్వోలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామని చెప్పారు. జేసీ రామారావు, జె డ్పీ సీఈఓ మాల్యాద్రి, డీపీఓ అపూర్వ సుందరి పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా ఎన్నికలు
కడపసిటీ, న్యూస్‌లైన్ : నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ వైఎస్ఆర్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, పోలీసులు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలను వివరించారు. పార్లమెంట్‌కు రూ.70లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఎన్నికల వ్యయానికి నోడల్ అధికారిగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి మహీధర్‌ను నియమించారన్నారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ వ్యయపరిశీలకులను నియమిస్తారన్నారు. అకౌంటింగ్ టీమ్ కూడా వీరితోపాటు పనిచేస్తుందన్నారు. అభ్యర్థులు పోలింగ్ లోపు మూ డుసార్లు ఖర్చుల వివరాలు తెలపాలన్నా రు. సార్వత్రిక ఎన్నికల కోడ్, మున్సిపల్ ఎన్నికల కోడ్‌కు తేడా లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా ఉండకూడదని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. లోకల్ ఛానెల్స్‌లో ప్రకటనలు జారీచేయాలంటే జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఎంసీఎంసీ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల లోకల్ ఛానెల్స్ ప్రతినిధులు, ప్రింటర్స్తో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలు వివరించాలన్నారు. జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా శ్రద్ధతో పనిచేయాలన్నారు. చిన్న సంఘటనలకు కూడా అవకాశం ఇవ్వరాదన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి గోపాల్‌నాయక్, పరిశ్రమల కేంద్రం జీఎం గోపాల్ మాట్లాడారు. కంట్రోల్ రూమ్ : ఎన్నికల సమాచారం అందించేందుకు, ఫిర్యాదులు చేయాలంటే జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు 1800 4252027 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చన్నారు. వేసవిలో తాగునీరు : జిల్లాలో వేసవి సమయంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. పాతబోర్లు, నీటి సరఫరా ప థకాలు చెడిపోయి ఉంటే వాటిని మరమ్మతులు చేయించవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ తాగునీటి అవసరాలకు వర్తించదన్నారు. ఎంపీడీఓలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. -
విజేతగా నిలవాలి
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలవాలని క్రీడాకారులకు కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. కడపలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ పోటీలకు విచ్చేసిన ఆయన తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తరువాత పోటీలను ప్రారంభించారు. గత ఏడాదే ఈ పోటీలు నిర్వహించాల్సి ఉన్నా, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయని ఏజేసీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పోటీలు విజయవంతం కావడంతో రానున్న కాలంలో మరిన్ని పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కడప నగర పాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్ప గౌరవ్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, కడప ఎంఈఓ నాగమునిరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రైజ్‌మనీ, సర్టిఫికెట్లు సిద్ధం ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్-జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికెట్లతో పాటు ప్రైజ్‌మనీ సిద్ధం చేశారు. ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి విచ్చేసి అన్ని సర్టిఫికెట్లపై సంతకం చేసి సిద్ధంగా ఉంచారు. అన్ని విభాగాల క్రీడాకారులకు దాదాపు రూ.5 లక్షల మేర ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అండర్-13 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగం, అండర్-15 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి, రన్నరప్‌గా నిలిచిన వారికి ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అభినందన అండర్-13 విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆలిండియా నంబర్-1 ర్యాంక్ క్రీడాకారుడు మైశ్నమ్ మైరభను కడప కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. -
క్రీడల ఖిల్లాగా కడప
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు సిద్ధమైన తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లేదా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీలకు కడపను వేదికగా ఎన్నుకుందుకు సంతోషంగా ఉందన్నారు. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయన్నారు. క్రీడాకారులు ఫిట్నెస్ను కలిగి ఉండాలని, ఆల్ ఇంగ్లాడ్ చాంపియన్ ప్రకాష్ పడుకునే గురించి వివరించారు. తాను బలంగా ఆడాలన్న కాంక్ష క్రీడాకారుడిలో ఉండాలే తప్ప ఎదుటి వ్యక్తి బలహీనమైనంగా ఉండాలనుకోకూడదన్నారు. టోర్నమెంట్ ఇన్చార్జ్, రెఫరీ పానీరావు మాట్లాడుతూ కడపలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉందన్నారు. క్రీడాకారులు బాగా ఆడాలని ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎం.సుదర్శన్‌రెడ్డి, చీఫ్ రెఫరీ మంజూషా సహస్త్ర బుద్ధి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, రెఫరీ సతీష్‌మాల్యా, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు మనోహర్, చీఫ్ ప్యాట్రన్ బాషాఖాన్, కోశాధికారి నాగరాజు, సభ్యులు రవిశంకర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, మదన్‌మోహన్‌రెడ్డి గంగాధర్ పాల్గొన్నారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
కడప రూరల్, న్యూస్‌లైన్: జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్‌గాంధీనగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాలులో ఆరవ విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 29 లక్షల మంది జనాభా ఉండగా, అందులో 3.17 లక్షల మంది పిల్లలను గుర్తించామన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 3.54 వేల పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 72 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించే పిల్లల కోసం ప్రత్యేకంగా 18 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం సోమ, మంగళ వారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక రెండు చుక్కలు వేయించాలన్నారు. మళ్లీ రెండవ విడత పల్స్‌పోలియో కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీన ఉంటుందన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా, పోలియో చుక్కలు ఎన్నిమార్లు వేయించినా, పోలియో లక్షణాలు ఉన్నా, లేకపోయినా తప్పక రెండు చుక్కలు వేయించాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 0-5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకోటిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ హరిత, డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాసు పోలియో చుక్కలను వేశారు. కార్యక్రమంలో డీఐఓ నాగరాజు, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వినోద్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంచి వైద్యం అందించండి
కడప అర్బన్, న్యూస్‌లైన్: రోగులకు మంచి వైద్యసేవలందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. రిమ్స్ లో ఏవైనా లోటుపాట్లుంటే సవరించి మెరుగైన వసతులు కల్పిస్తామని, అందు కు తగ్గట్లు వైద్య సేవలందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. రిమ్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో హెచ్‌డీఎస్ చైర్మన్ హోదా లో ఆయన మాట్లాడారు. వైద్యసేవల కోసం వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. హౌస్ సర్జన్లు, ఇతర డాక్టర్లు తప్పనిసరిగా ఎప్రాన్లు ధరించాలని, వాటితోపాటు నేమ్ప్లేట్లు కూడా ఉండాలని ఆదేశించారు. ‘ఆరోగ్యశ్రీ’ ఆపరేషన్లు చేయాలి.. ఆరోగ్యశ్రీ కింద రిమ్స్‌లో ఎందుకు రోగులకు వైద్యసేవలు అందించలేకపోతున్నారని కలెక్టర్ వైద్యులను ప్రశ్నించారు. రిమ్స్‌లో కంటే బయటి ఆస్పత్రుల్లో ఎక్కువగా చేస్తున్నారన్నారు. పెద్ద ఆస్పత్రి నిపుణులైన వైద్య బృందం ఉన్నా తక్కువ సంఖ్యలో రోగులు ఉన్నారన్నారు. ఇక నుంచి రిమ్స్‌లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పెరగాలని తెలిపారు. ల్యాబోరేటరీలు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా విభాగాలకు కేటాయించిన వైద్య పరికరాలను ఉపయోగించడం లేదని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ కలెక్టర్ దృష్టికి తీ సుకొచ్చారు. పరికరాలు ఉపయోగించే లా సిబ్బందికి బాధ్యతలు నిర్దారిస్తూ వెం టనే ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన పరికరాల కొనుగోలు,పెద్ద మొత్తంలో మరమ్మతుల కోసం నిధులను కోరుతూ వివరణాత్మకమైన నివేదికతో సరైన రూపంలో ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలు ఇవ్వాలి.. స్కానింగ్ చేసిన తర్వాత నివేదికలో బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలిసేలా వివరాలు ఇవ్వాలన్నారు. స్కానింగ్ వివరాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల రెండోసారి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలో ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు.. రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ చెప్పారు. ఈ అంశంపై అక్కడే వైద్య, ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడారు. నెలాఖరులోపు నీటి సమస్య పరిష్కారం.. రిమ్స్‌లో నీటి సమస్య పరిష్కారంపై కలెక్టర్ ఏపీహెచ్‌ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్లేశ్వరరెడ్డిని వివరణ కోరారు. ఈనెలాఖరులోపు ప్రస్తుతం ఉన్న పైపులైన్లను తొలగించి కొత్త పైపులు వేస్తామని ఈఈ తెలిపారు. బ్లడ్ బ్యాంక్‌లో ఏసీలు పనిచేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయించాలని ఈఈని ఆదేశించారు. రెండు నెలల అనంతరం మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పటిలోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌శరణ్, ప్రిన్సిపల్ డాక్టర్ బాలకృష్ణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, డీఎంహెచ్ఓ ప్రభుదాస్, డాక్టర్ బాలిరెడ్డి, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. -
పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ శశిధర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు ఆఫీసు నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఉదయం పూట పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు పర్యటించాలని, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటి సరఫరాలపై ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు. కడప నగరంతోపాటు ఇతర మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలని, నిబంధనలకు అనుగుణంగా పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి పొరపాట్లకు అవకాశం లేకుండా పన్ను పసూళ్ల లక్ష్యాలను సాధించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో చేపడుతున్న పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పనులు గడువులోపు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని స్పష్టం చేశారు. మున్సిపల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి డిసెంబరు వేతనం చెల్లించలేదని తెలియడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీతాలివ్వకపోతే పనులు ఎలా చేస్తారంటూ కమిషనర్లను ప్రశ్నించారు. తక్షణమే వర్కర్లకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పండుగ తర్వాత ప్రతి మున్సిపాలిటీని సందర్శిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్స్, వీధి లైట్లు తప్పక వేయాలని చెప్పారు. నీటి సరఫరా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుందో ఆయన ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా మెరుగుపరచాలన్నారు. ఎర్రగుంట్లలో డంపింగ్‌యార్డు స్థలానికి వారం రోజుల్లోపు ఆర్డీఓకు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. సెట్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నిర్మల, అసిస్టెంట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓలు హరిత, రఘునాథరెడ్డి, కడప మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి చేయూత
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో 58వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తొలుత జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల పంటలసాగు తగ్గిందన్నారు. ప్రధాన పంట వేరుశనగ 53శాతం మాత్రమే సాగైందన్నారు. రబీకి అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. గత ఖరీఫ్ పంట నష్టానికి రూ. 52కోట్లు మంజూరు కాగా రూ. 47కోట్లను 54వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాల్లో నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 43లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 9వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని, దీనిపై తుది నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం పీబీసీ ద్వారా 25వేల ఎకరాలకు, గండికోట ఎత్తిపోతల పథకం కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు, వామికొండ రిజర్వాయర్ కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల కోసం రూ. 488 కోట్ల రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజీవ్ యువకిరణాల కింద 9వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. బంగారు తల్లి పథకం క్రింద 2వేల మంది శిశువులను నమోదు చేయగా, అందులో 71 మందికి రూ. 2,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. గృహ నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద ఇప్పటివరకు 17వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద 198 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 32వేల మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఏడవ విడతలో 10వేల మంది లబ్ధిదారులకు 16వేల ఎకరాల భూమిని త్వరలో పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందిరమ్మ అమృతహస్తం ద్వారా గర్భవతులు, బాలింతలు, శిశువులకు ఒక్కపూట భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. మార్పు కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యపరీక్షలు నిర్వహించడమేగాక 9వేల మందికి శస్త్ర చికిత్సల కోసం రూ. 25కోట్లు ఖర్చు చేశామన్నారు. శకటాల ప్రదర్శన : రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పోలీసుల మైన్‌ప్రూఫ్, వజ్ర, వ్యవసాయ శాఖ, డ్వామా, నిర్మల్ భారత్, ఇందిర జలప్రభ లబ్ధిదారులు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాలు లబ్ధిదారులు, 108 వాహనం, బంగారు తల్లి, ఉపాధిహామీ పథకం వాహనాలు పెరేడ్లో పాల్గొన్నాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల, జియోన్ ఉన్నత పాఠశాల, సాయిబాబా, మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి, సాయిబాబా పాఠశాల విద్యార్థులకు రెండవ బహుమతి, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు మూడవ బహుమతి, జియోన్ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి అందుకున్నారు. ఆస్తుల పంపిణీ : డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, వికలాంగుల సహకార కార్పొరేషన్లకు చెందిన 4,335 మంది లబ్ధిదారులకు 1504.885 లక్షల రూపాయలు విలువ చేసే 456 యూనిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్ఓ ఈశ్వరయ్య, ఆర్డీఓ హరిత, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉప లోకాయుక్త సుడిగాలి పర్యటన
గంగావతి, న్యూస్‌లైన్ : కర్ణాటక రాష్ట్ర ఉప లోకాయుక్త బృందం గురువారం గంగావతి తాలూకాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులు, హాస్టల్, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించింది. గురువారం ఉదయం తాలూకాలోని సంగాపుర, రామదుర్గ, బసవనదుర్గ, కురిహట్టి క్యాంప్‌లలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఉప లోకాయుక్త శశిధర్ మజిగె పరిశీలించారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కాంపౌండ్ గోడలు, గ్రామాల్లో నిర్మించిన డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నగరంలోని బీసీఎం హాస్టల్లోకి ప్రవేశించి హాస్టల్ మరుగుదొడ్లు, వంటగది విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఆహారం సరిగా అందుతోందా? వసతులు సరిగా ఉన్నాయా? తాగునీటి సదుపాయం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్‌ను పరిశీలించారు. మహిళల కాన్పులకు సంబంధించిన ఫైళ్లను చూసి మడిలు కిట్లను సరైన రీతిలో అందించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని రోగుల వార్డులను సందర్శించి సరైన రీతిలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారా?అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకగిరి తదితర గ్రామాలకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించి కుష్టిగి తాలూకాలో ప్రవేశించారు. ఉప లోకాయుక్త వెంట కొప్పళ డీవైఎస్పీ ఎస్కే. మురనాళ్, లోకాయుక్త సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీంబాషా, గంగావతి తహ శీల్దార్ గంగన్న, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎస్ఎన్. మఠద్, నగరసభ కమిషనర్ నింగన్న కుంబణ్ణనవర్, స్థానిక టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జ్యోతిబా నిక్కం, ప్రభుత్వ ఆస్పత్రి పాలక మండలి అధికారి డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.