కడపసిటీ, న్యూస్‌లైన్ : నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ వైఎస్‌ఆర్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, పోలీసులు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల నిర్వహణ నిబంధనలను వివరించారు. పార్లమెంట్‌కు రూ.70లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఎన్నికల వ్యయానికి నోడల్ అధికారిగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి మహీధర్‌ను నియమించారన్నారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ వ్యయపరిశీలకులను నియమిస్తారన్నారు. అకౌంటింగ్ టీమ్ కూడా వీరితోపాటు పనిచేస్తుందన్నారు. అభ్యర్థులు పోలింగ్ లోపు మూ డుసార్లు ఖర్చుల వివరాలు తెలపాలన్నా రు.
సార్వత్రిక ఎన్నికల కోడ్, మున్సిపల్ ఎన్నికల కోడ్‌కు తేడా లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా ఉండకూడదని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. లోకల్ ఛానెల్స్‌లో ప్రకటనలు జారీచేయాలంటే జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఎంసీఎంసీ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలన్నారు.
రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల లోకల్ ఛానెల్స్ ప్రతినిధులు, ప్రింటర్స్‌తో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలు వివరించాలన్నారు. జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా శ్రద్ధతో పనిచేయాలన్నారు. చిన్న సంఘటనలకు కూడా అవకాశం ఇవ్వరాదన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి గోపాల్‌నాయక్, పరిశ్రమల కేంద్రం జీఎం గోపాల్ మాట్లాడారు.
కంట్రోల్ రూమ్ :
ఎన్నికల సమాచారం అందించేందుకు, ఫిర్యాదులు చేయాలంటే జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు 1800 4252027 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చన్నారు.
వేసవిలో తాగునీరు :
జిల్లాలో వేసవి సమయంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. పాతబోర్లు, నీటి సరఫరా ప థకాలు చెడిపోయి ఉంటే వాటిని మరమ్మతులు చేయించవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ తాగునీటి అవసరాలకు వర్తించదన్నారు. ఎంపీడీఓలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
నిష్పక్షపాతంగా ఎన్నికలు
Published Thu, Mar 6 2014 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement