అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత మరుగుదొడ్డి కల్పనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. శుక్రవారం డ్వామాహాలులో స్వచ్చందసంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మరుగుదొడ్లు నిర్మాణంపై అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఆమోదం ఉంటే ఎన్ని గ్రామాల్లోనైనా మంజూరు చేస్తామని వివరించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ నిధుల ద్వారా ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్మించాల్సి ఉంటుందన్నారు.
పెన్నా సిమెంట్ కంపెనీ నుంచి రూ. 280లకే సిమెంట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇసుకను స్వచ్చంద సంస్థలే సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో పక్కాగా జరిగిందని, నిధులకు ఎలాంటి డోకా లేనందున స్వచ్ఛంద సంస్థలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అధికారులు, స్వచ్ఛందసంస్థలు అన్న తేడా లేకుండా క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూన్ 1వ తేదీ నాటికి జిల్లాలో లబ్దిదారులుగా ఎంపికైన వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి తీరాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కాంతానాథ్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవికుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అక్రమార్కులను ఉపేక్షించం
Published Sat, May 2 2015 3:14 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement