మరుగుదొడ్లకు అత్యంత ప్రాధాన్యత : కలెక్టర్‌ | most important for toilets is: Collector | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లకు అత్యంత ప్రాధాన్యత : కలెక్టర్‌

Published Sun, Aug 20 2017 3:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

మరుగుదొడ్లకు అత్యంత ప్రాధాన్యత : కలెక్టర్‌ - Sakshi

మరుగుదొడ్లకు అత్యంత ప్రాధాన్యత : కలెక్టర్‌

అనంతపురం అర్బన్‌: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అశ్రద్ధ వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై శనివారం కలెక్టరేట్‌ నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాము ఎంత తోడ్పాటు అందించినా పెద్దగా పురోగతి లేదంటూ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి చేసిన వాటిని జియో ట్యాగింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తేనే బిల్లులు చెల్లించేందుకు వీలవుతుందని, సాకులు చెప్పకుండా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్, జెడ్పీ సీఈఓ సూర్యనారాయణ, డ్వామా పీడీ నాగభూషణం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement