
ప్లాస్టిక్ కవర్లతో కప్పుకున్న గుడిసె పక్కన నిర్మించిన మరుగుదొడ్డి
దుగ్గొండి(నర్సంపేట) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత సోమవారం ఉదయం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు వచ్చారు. ఇదే సమయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రదేశాన్ని ఎస్సై కాలనీలో పరిశీలిస్తున్నారు. సాధారణ మహిళలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పక్కన కవర్లు పైకప్పుగా కట్టుకుని ఉన్న గుడిసె, దాని పక్కన నిర్మించిన ఉన్న మరుగుదొడ్డిని చూశారు.
ఇంటి యజమాని ఎలుదొండ భిక్షపతి మరుగుదొడ్డి గుంతలకు ఓడలు వేసి మట్టి నింపుతుండగా కలెక్టర్ ఆగి అభినందించారు. ‘ఇల్లు లేకున్నా.. మరుగుదొడ్డి కట్టావు.. భేష్! నీకు డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తా’నని చెప్పి వివరాలు నమోదు చేసుకోవాలని సీసీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment