కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుం చి రిటర్నింగ్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్, స్థానిక సంస్థలు, లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను వరుసగా నిర్వహించాల్సి న పరిస్థితి ఎదురైందన్నారు. అధికారులు జాగ్రత్తగా ఈ ఎన్నికల నిర్వహణను చేపట్టాలన్నారు. ఈ నెల 18 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉంటుందని, 19 నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావచ్చని, ఒకే విడతలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిసిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్, జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలన్నింటికీ రిటర్నింగ్ అధికారులను సూపర్‌వైజరీ అధికారిగా నియమించామని తెలిపారు. జనవరి 31 నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాను తొలుత గ్రామ పంచాయతీ వారీగా విడగొట్టి, తదుపరి ఎంపీటీసీ వారీగా విభజించి ప్రచురించాలని సూచించారు. ఒక గ్రామ పంచాయ తీ రెండు లేదా అంతకన్న ఎక్కువ ఎంపీటీసీ స్థానాలుగా విభజించి ఉంటే వార్డుల వారీగా విడగొట్టి ఎం పీటీసీ స్థానాల జాబితాను రూపొందించాలన్నారు. మండలాల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
పోలింగ్ ఏర్పాట్ల వివరాలపై ఆరా..
పోలింగ్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1768 పోలింగ్ కేంద్రాలను గుర్తించారని పేర్కొన్నారు.
వెయ్యికి దాటకూడదు..
ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్య వెయ్యికి దాటకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం ఉండాలన్నారు. రెండు కిలోమీటర్లు పరిధి దాటరాదని చెప్పారు. ఎస్సీ ఎస్టీల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల ను గుర్తించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఆయా సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, తహశీల్దార్లతో సమావేశమై జాబితాను రూపొందించి పంపించాలని కోరారు.
ఫ్లయింగ్ స్వ్కాడ్స్ వాహనాలు అందజేశామని, వారు వెంటనే రంగంలోకి దిగాలని కలెక్టర్ తెలి పారు. స్కాటిక్ సర్వేలెన్స్ టీముల ద్వారా ఇప్పటికే రూ. 9.5 లక్షల నగదు, గ్యాస్ స్టవ్‌లు సీజ్ చేశామన్నా రు. ఫ్లయింగ్ స్వ్కాడ్‌లో ఉన్న వ్యక్తులకు మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించారని కొందరు ఆర్వోలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామని చెప్పారు. జేసీ రామారావు, జె డ్పీ సీఈఓ మాల్యాద్రి, డీపీఓ అపూర్వ సుందరి పాల్గొన్నారు.
ఎన్నికలకు రెడీ
Published Mon, Mar 10 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement