కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలవాలని క్రీడాకారులకు కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. కడపలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ పోటీలకు విచ్చేసిన ఆయన తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తరువాత పోటీలను ప్రారంభించారు.
గత ఏడాదే ఈ పోటీలు నిర్వహించాల్సి ఉన్నా, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయని ఏజేసీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పోటీలు విజయవంతం కావడంతో రానున్న కాలంలో మరిన్ని పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కడప నగర పాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్ప గౌరవ్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, కడప ఎంఈఓ నాగమునిరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రైజ్‌మనీ, సర్టిఫికెట్లు సిద్ధం
ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్-జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికెట్లతో పాటు ప్రైజ్‌మనీ సిద్ధం చేశారు. ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి విచ్చేసి అన్ని సర్టిఫికెట్లపై సంతకం చేసి సిద్ధంగా ఉంచారు. అన్ని విభాగాల క్రీడాకారులకు దాదాపు రూ.5 లక్షల మేర ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అండర్-13 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగం, అండర్-15 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి, రన్నరప్‌గా నిలిచిన వారికి ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.
అభినందన
అండర్-13 విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆలిండియా నంబర్-1 ర్యాంక్ క్రీడాకారుడు మైశ్నమ్ మైరభను కడప కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
విజేతగా నిలవాలి
Published Mon, Feb 10 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement