క్రీడల ఖిల్లాగా కడప | Sports khillaga Kadapa | Sakshi

క్రీడల ఖిల్లాగా కడప

Feb 8 2014 2:43 AM | Updated on Sep 2 2017 3:27 AM

కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు.

కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని  కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు సిద్ధమైన తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లేదా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీలకు కడపను వేదికగా ఎన్నుకుందుకు సంతోషంగా ఉందన్నారు. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయన్నారు. క్రీడాకారులు ఫిట్‌నెస్‌ను కలిగి ఉండాలని, ఆల్ ఇంగ్లాడ్ చాంపియన్ ప్రకాష్ పడుకునే గురించి వివరించారు. తాను బలంగా ఆడాలన్న కాంక్ష క్రీడాకారుడిలో ఉండాలే తప్ప ఎదుటి వ్యక్తి బలహీనమైనంగా ఉండాలనుకోకూడదన్నారు. టోర్నమెంట్ ఇన్‌చార్జ్, రెఫరీ పానీరావు మాట్లాడుతూ కడపలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉందన్నారు. క్రీడాకారులు బాగా ఆడాలని ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు.
 
 వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎం.సుదర్శన్‌రెడ్డి, చీఫ్ రెఫరీ మంజూషా సహస్త్ర బుద్ధి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, రెఫరీ సతీష్‌మాల్యా, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు మనోహర్, చీఫ్ ప్యాట్రన్ బాషాఖాన్, కోశాధికారి నాగరాజు, సభ్యులు రవిశంకర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, మదన్‌మోహన్‌రెడ్డి గంగాధర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement