Shiva Kandukuri
-
మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి
శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ కి థాంక్స్. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్ కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది. సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడింది’ అన్నారు. హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి ఆనందంగా ఉంది. హౌస్ ఫుల్ థియేటర్స్ చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అన్నారు. ‘సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని దర్శకుడు పురుషోత్తం అన్నారు. ఈ సక్సెస్ మీట్లో రాజ్ కందుకూరి,ర్మాతలు స్నేహాల్, శశిధర్ పాల్గొన్నారు. -
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ
టైటిల్: భూతద్ధం భాస్కర్ నారాయణ నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై దర్శకత్వం : పురుషోత్తం రాజ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్ విడుదల తేది: మార్చి 1, 2024 డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా? కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిటెక్టివ్ థ్రిల్లర్స్‌కి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్, లవ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. సీరియల్ కిల్లర్ తెరపై వచ్చినప్పటి నుంచి సినిమా అంతా సీరియస్ మూడ్‌లోకి వెళ్తుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను మరింత ఆకట్టకుంటాయి. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు.దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉండడం.. ద్వితియార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్‌ని మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంతో దర్శకుడు సఫలం అయ్యాడు.థ్రిల్లర్స్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా ఉంది. శివ నటనగా కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. రిపోర్టర్ లక్ష్మీ గా రాశీ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా పరంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. కెమరాపనితనం రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ లో దిష్టి బొమ్మ గురించి చర్చించాం: హీరో శివ కందుకూరి
క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. భూతద్ధం భాస్కర్ నారాయణ కథలో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. అందుకే సినిమా ఒప్పుకున్నాను’అన్నారు యంగ్ హీరో శివ కందుకూరి. ఆయన హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోం. దాని గురించి చాలా మందికి తెలీదు. దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం ఉంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగ్‌గా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం ఉంది. ► దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో ఉన్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపధ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న ఓ సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది. ► వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది. మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది. ► ప్రస్తుతం మైథాలజీకల్ థ్రిల్లర్ జోనర్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే కథలో భాగమైయ్యే ఉంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే ఉంటుంది. ► ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం. ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలరు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకున్నారు. చాలా అంకితభావంతో పని చేశారు. ► శ్రీచరణ్ పాకాల అందించిన నేపధ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగే ఇందులో ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో చేశాం. అది మా ఆర్ట్ డైరెక్టర్ ఆలోచన. యాభై పెయింటింగ్ లు స్కాన్ చేసి ఎఐ లిరికల్ వీడియో చేశాం. తెలుగు చేసిన తొలి ఎఐ లిరికల్ వీడియో కావడం ఆనందంగా ఉంది. ► ప్రస్తుతం ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపధ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. -
దిష్టి బొమ్మ కథేంటి అని చూపిస్తున్నాం: స్నేహాల్, శశిధర్
‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రం డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందింది. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అని నిర్మాతలు స్నేహాల్, శశిధర్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న రిలీజవుతోంది. స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ– ‘‘2014లో ‘షీష్మహల్’ అనే ఇండిపెండెంట్ సినిమా, 2020లో ‘నీతో’ మూవీ చేశాం. 2022లో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రయాణం ఆరంభమైంది. ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది.. దాని వెనక ఉన్న కథ ఏంటి? అన్నదానికి ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని జోడించి ఈ కథని తీశాడు పురుషోత్తం’’ అన్నారు. -
గూస్ బంప్స్ తెప్పిస్తున్న 𝐀𝐈 జెనరేటడ్ 'శివ ట్రాప్ ట్రాన్స్'సాంగ్
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి 'శివ ట్రాప్ ట్రాన్స్' పాటని రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణీ ఈ పాటని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. సింగల్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. ఈ పాట లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం. హీరో సుహాస్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగింది. దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. -
Bhoothaddam Bhaskar Narayana Trailer: హత్యలు కాదు నరబలి..ట్రైలర్ అదిరింది!
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్నిమాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.. 'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మను చరిత్ర'
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించారు. చంద్రబోస్ ఈ సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించడం విశేషం. గోపీ సుందర్ సంగీత దర్శకుడిగా పనిచేసిన ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ స్పందనను అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మను చరిత్ర సినిమా యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కథేంటంటే.. హీరో చదువులో టాపర్. కాలికాట్ ఎన్ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతాడు. చిన్న చిన్న కారణాలతో వారికి బ్రేకప్ చెబుతుంటాడు. అసలు అతడు తాగుడుకు ఎందుకు బానిసయ్యాడు? రౌడీతో కలిసి ఎలాంటి పనులు చేశాడు? చివరకు అతడి జీవితం ఏమయ్యిందనేది కథ! Amazon Prime Video Link 🔗 https://t.co/KX7nfb3TPk Engage with the Intense & Joyful Love Stories of Manu❤️🔥#ManuCharitra Telugu Full Movie Now Streaming on @PrimeVideoIn#ManuCharitraOnPrime #MeghaAkash #ShivaKandukuri #PragathiShrivastav #PriyaVadlamani #GopiSundar… pic.twitter.com/SE88HMG0aJ — Sri Balaji Video (@sribalajivideos) July 21, 2023 చదవండి: మహిళా సెక్రటరీతో సహజీవనం.. పెళ్లై ఏడాది కాకముందే ఉరేసుకుని చనిపోయిన భర్త ప్రభాస్ కల్కి గ్లింప్స్‌లో కమల్ హాసన్ -
‘మనుచరిత్ర’ మూవీ రివ్యూ
టైటిల్: మనుచరిత్ర నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాశ్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ: ప్రొద్దుటూరు టాకీస్ నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వం: భరత్ పెదగాని సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: జూన్ 23, 2023 మనుచరిత్ర కథేంటంటే.. వరంగల్‌కు చెందిన మను (శివకందుకూరి) ఓ బ్రిలియంట్ స్టూడెంట్. కాలికాట్ ఎన్ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతాడు. శ్రావ్య, ఆయేషా, జాను.. ఇలా చాలా మందికి ఐ లవ్ యూ చెప్పి కొన్నాళ్ల తర్వాత చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెబుతుంటాడు. సిన్సియర్‌గా ప్రేమించే మను ఎందుకు అలా బ్రేకప్ చేబుతాడు? బ్రిలియట్ స్టూడెంట్‌గా ఉన్న ఆయన ఎందుకు మద్యానికి బానిసైనాడు? అసలు జేన్నీ(మేఘ ఆకాశ్) ఎవరు? ఆమెకి మనుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్థానిక రౌడీ రుద్ర (డాలి ధనంజయ)తో కలసి మను ఎలాంటి పనులు చేశాడు? చివరకు మను జీవితం ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వరంగల్ నేపథ్యంలో సాగే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ చిత్రం. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి, ఆమె ప్రేమని మరో అమ్మాయిలో వెతుక్కునే ఓ కుర్రాడి కథ ఇది. ఇలాంటి ప్రేమ కథకు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 తరహాలో గుండాయిజాన్ని తగిలించి కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఓ మర్డర్ సీన్ తో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత ఓ ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అసలు కథ ప్రారంభమయ్యాకే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిసారి ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం.. అర్థంలేని కారణాలతో బ్రేకప్ చెప్పడం..ఇలాగే సాగుతుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. ఇద్దరి ప్రేమని పెద్దవాళ్లకి చెప్పడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం, ఇక లైఫ్‌లో అంతా హ్యాపీ అనుకునే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఎదురైన ట్విస్ట్ లు ఉత్కంఠ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం నడపడానికి కథే ఉండదు. ఫస్టాఫ్‌లో చూపించిన సన్నివేశాల చుట్టే కథను నడిపాడు. హీరో రౌడీయిజంలోకి దిగడం..ఆ తర్వాత జాను అనే మరో పాత్రని ప్రవేశపెట్టి ఇంకో లవ్ స్టొరీ ని చూపించడం.. కథంతా రొటీన్‌గా ఉంటుంది. అక్కడక్కడ `అర్జున్‌రెడ్డి` `ఆర్ఎక్స్ 100` సినిమాలను గుర్తుచేసేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. మను పాత్రకు శివ కందుకూరి పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. ఈ చిత్రంతో మాస్ లుక్ ట్రై చేసి మెప్పించాడు. జెన్నీ పాత్రలో మేఘా ఆకాశ్ ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ పాత్రల నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. విలన్ రుద్రగా ధనుంజయ్ మెప్పించాడు. హీరో స్నేహితుడిగా సుహాన్ మరోసారి అదరగొట్టేశాడు. మధు సూదన్, శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. గోపీ సుందర్ సంగీతం బాగుంది. చంద్రబోస్ రాసిన ‘ఎక్కడ ఉంటదిరో ఆ పిల్ల’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్ఫుల్గా, రిచ్ లుక్‌నిస్తున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆ గ్యారంటీ ఇవ్వగలను
‘‘ఏ సీజన్లో అయినా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మేం తీసిన ‘మను చరిత్ర’ కూడా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే గ్యారంటీ ఇవ్వగలను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో శివ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మను అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. అందుకే ‘మను చరిత్ర’ అని టైటిల్ పెట్టాం. ట్రైలర్లో యాక్షన్ కనిపిస్తున్నప్పటికీ సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. తన నిజజీవితంలోని వ్యక్తుల నుంచి స్ఫూర్తి ΄÷ంది ఈ సినిమాలోని ΄ాత్రలను డిజైన్ చేసినట్లు, అలాగే తన ముగ్గురు స్నేహితుల వ్యక్తిత్వాలను మిళితం చేసి మను ΄ాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు భరత్ నాతో చె΄్పారు. మా నాన్నగారు (నిర్మాత రాజ్ కందుకూరి) ‘మను చరిత్ర’ సినిమా చూసి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాగా యాక్ట్ చేశావని అన్నారు. దాన్ని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అని అన్నారు. -
‘మనుచరిత్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మనుచరిత్ర పెద్ద హిట్ అవుతుంది: హీరో విశ్వక్ సేన్
‘‘లవ్, యాక్షన్ నా ఫేవరెట్ జోనర్. ‘మనుచరిత్ర’ అదే జానర్లో రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘మనుచరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న శ్రీ విజయ ఫిల్మ్ప్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజ్ కందుకూరిగారికి శివ ఎంతో.. నేనూ అంతే. శివ సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినంత ఆనందపడతాను’’ అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరాశ పరచదు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘మా సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు భరత్. ‘‘మనుచరిత్ర’ని థియేటర్లో చూసి మమ్మల్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు మేఘా ఆకాష్. ‘‘మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. -
‘మనుచరిత్ర’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇప్పుడే పరిచయమే...
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. ఈ మూవీతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇప్పుడే పరిచయమే...’ పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఆర్మాన్ మాలిక్ పాడారు. -
గాఢమైన ప్రేమకథ
శివ కందుకూరి హీరోగా నటించిన తాజా ఇంటెన్స్ లవ్ స్టోరీ (గాఢమైన ప్రేమకథ) ‘మను చరిత్ర’. ఇందులో మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ విజయ ఫిల్మ్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ‘‘వరంగల్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌ను శివ చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
డప్పుకొట్టి చెప్పుకోనా...
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ‘డప్పుకొట్టి చెప్పుకోనా..’ అనే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పా టకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పా డారు. ‘‘ఇందులో శివ డిటెక్టివ్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పా కాల, విజయ్ బుల్గానిన్, కెమెరా: గౌతమ్ జి. -
ఆకట్టుకుంటున్న ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఫస్ట్ గ్లింప్స్
సినిమాని తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తే.. అంత త్వరగా సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే టైటిల్ నుంచి క్యారెక్టర్ల పేర్ల వరకు కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు నేటి దర్శకులు. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి తొలి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా టైటిల్ పెడుతున్నారు. అలాంటి డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఓపెన్ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంట్రీ. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్ తీసుకుంటాడు. పోలీస్ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ గ్లింప్స్ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథలా కూడా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని ఏది పడితే అది చేయకూడదు
‘‘నేను వాణిజ్య అంశాలున్న కథలు మాత్రమే ఎంచుకోవాలనుకోవడం లేదు. అర్థవంతమైన, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ చిత్రాలు చేసినా ఆర్గానిక్ (స్వచ్ఛమైన)వి చేస్తాను. నా తాజా చిత్రం ‘మను చరిత్ర’ ఆర్గానిక్‌గా ఉంటుంది’’ అని శివ కందుకూరి అన్నారు. నేడు (శుక్రవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం శివ కందుకూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసి నటనపై ఆసక్తితో ‘చూసి చూడంగానే’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాను. రెండో సినిమా ‘గమనం’ మరింత పేరు తెచ్చింది. నేను ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌పై నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్‌గారు ‘పుష్ప’లోని పాత్రను నమ్మారు కాబట్టే ఆ సినిమా అందర్నీ మెప్పించింది. మా నాన్న (రాజ్ కందుకూరి) నిర్మాతే అయినా నేనేంటో నిరూపించుకోవాలనేదే నా కోరిక. ఫ్యామిలీ నేపథ్యం ఉందని ఏది పడితే అది చేయకూడదు. ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అనే నిర్ణయం నాపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం యువ హీరోల మధ్య పోటీ ఉన్నా పాజిటివ్ కోణంలోనే ఉంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు, కొత్తవారికి ఓటీటీ ఒక వరం. అయితే థియేటర్స్‌కి ఏదీ పోటీ కాదు. నేను నటిస్తున్న తాజా చిత్రం ‘మను చరిత్ర’ చిత్రీకరణ పూర్తయింది. నూతన దర్శకుడు పురుషోత్తమ్ రాజ్‌తో ఓ సినిమాతో పాటు నానీగారు నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ వెబ్ ఫిలిం చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ చర్చల్లో ఉంది’’ అన్నారు. -
‘గమనం’మూవీ రివ్యూ
టైటిల్ : గమనం నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ దర్శకత్వం: సుజనా రావు సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘గమనం’కథేంటంటే..? సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్‌గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్‌లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్‌లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. -
ఆ రోజు భయం వేసింది: ప్రియాంకా జవాల్కర్
‘‘కెరీర్లో ఎక్కువ సినిమాలు చేయాలనే కంగారు నాకు లేదు.. కథ నచ్చితేనే నటిస్తాను. కెరీర్లో స్లో అయిపోతామని వెంటవెంటనే సినిమాలు అంగీకరిస్తే.. వాటిలో ఎక్కువగా ఫ్లాప్ అయితే అప్పుడు కూడా కెరీర్‌కు ఇబ్బందే’’ అని హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అన్నారు. శ్రియా శరన్, శివ కందుకూరి, నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో సంజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంకా జవాల్కర్ మాట్లాడుతూ– ‘‘గమనం’ సినిమా కథ విన్నప్పుడు ‘వేదం’ గుర్తొచ్చింది. సంజనా రావు మహిళా దర్శకురాలు కావడంతో మరింత ఎక్కువగా కనెక్టయ్యాను. ఈ చిత్రంలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్రే అయినప్పటికీ కథ రీత్యా నా పాత్రకు పెద్దగా డైలాగ్స్ ఉండవు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి.. కళ్లతో హావభావాలు చూపించాలి. ఇదే కష్టంగా అనిపించింది. శివకందుకూరి గ్రాండ్ఫాదర్గా చారుహాసన్గారు కనిపిస్తారు. ఓ రెయిన్ సీక్వెన్స్‌లో చారుహాసన్గారితో కలిసి నటించాను. నటన, వయసు ప్రకారం ఆయన చాలా పెద్దాయన. నా నటనతో (ఎక్కువ టేకులు తీసుకోవడం) ఆయన్ను ఏమైనా ఇబ్బంది పెడతానేమోనన్న భయం షూటింగ్ రోజు కలిగింది. కానీ చిత్రీకరణ అనుకున్నట్టుగా బాగానే సాగింది. ఈ సినిమాకు ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారని తెలియగానే చాలా సంతోష పడ్డాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నాకు నచ్చింది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
నటనకు అవకాశం ఉంది
శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్టైన్ మెంట్ పతాకంపై వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ– ‘‘శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్‌లో ఒకటి. నటనకు అవకాశం ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్‌లో హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. కొడైకెనాల్లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, కూర్పు: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహ నిర్మాత: నభిషేక్. -
ముచ్చటైన ప్రేమ
శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుజనారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి జ్ఞానశేఖర్ నిర్మిస్తూ, కెమెరామెన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ కందుకూరి చేసిన అలీ, ప్రియాంకా జవాల్కర్ చేసిన జారా పాత్రల ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. శివ వైట్ జెర్సీలో క్రీడాకారునిగా కనిపిస్తుండగా, జారా పాత్రలో ప్రియాంక సంప్రదాయమైన దుస్తుల్లో ముస్లిమ్ అమ్మాయిలా కనిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య సాగే క్యూట్ లవ్‌స్టోరీ చూడముచ్చటగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్న నిత్యామీనన్, శ్రియ ఫస్ట్ లుక్స్‌ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ లుక్స్‌కి మంచి స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సాయిమాధవ్ బుర్రా రచయితగా చేసిన ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. -
‘చూసీ చూడంగానే’ కనెక్ట్ అవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చూసీ చూడంగానే’ సినిమాకు సానుకూల స్పందన రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేష సింధు ది బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ బాగా పండింది. హీరోయిన్గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు. దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాలా సహజంగా సినిమాను తీయాలనుకున్నాం. అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యువతతో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్ అవుతుంది. నాకిది తొలి చిత్రం అయినా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమాకి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ ఆశించలేదు’ అన్నారు. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. చదవండి: ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ -
‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ
చిత్రం : చూసీ చూడంగానే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్, పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా, వెంకటేశ్ కాకుమాను సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శేష సింధు రావు నిర్మాత : రాజ్ కందుకూరి బ్యానర్ : ధర్మపథ క్రియేషన్స్ పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాత రాజ్ కందుకూరి. తన సినిమాల్లో చాలా వరకు కొత్త నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించే రాజ్.. తన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘చూసీ చూడంగానే’. అలాగే ఈ చిత్రంతో శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేశారు. తమిళ చిత్రం 96లో ప్రభ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వర్ష బొల్లమ్మ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాలకు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించే రాజ్.. ఇది తన కుమారుడి తొలి సినిమా కావడంతో చిత్ర ప్రమోషన్స్‌ను భారీగానే చేశాడు. అలాగే సురేష్ ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సాంగ్స్, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టునేలా చేశారు. మరి తన కుమారుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంలో రాజ్ కందుకూరి సక్సెస్ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం. కథ : సిద్దు (శివ కందుకూరి) తల్లిదండ్రుల బలవంతం మేరకు ఇంజనీరింగ్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ వచ్చేసరికి ఐశ్వర్య సిద్దును వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రిపెషన్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయని సిద్దు.. ఫ్యాషన్ పొటోగ్రాఫర్ అవుదామనుకుంటాడు. కానీ మూడేళ్ల తర్వాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్ అవుతాడు. అలా ఓ పెళ్లిలో శృతిని (వర్ష) చూసి లవ్‌లో పడతాడు. శృతికి, సిద్దు వారి కామన్ ఫ్రెండ్ యోగి ద్వారా కలుస్తారు. వారిద్దరరు ఫ్రెండ్స్ అవుతుండగా.. స్టోరిలో చిన్నపాటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. సిద్దును శృతి ఇంజనీరింగ్‌లో లవ్ చేసిందని.. ఇప్పటికి అతన్నే ఇష్టపడుతుందని తెలుస్తుంది. అయితే సిద్దు తన ప్రేమ విషయాన్ని చెప్పేలోగానే.. శృతి బాయ్‌ఫ్రెండ్ విరాట్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అందుకు శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా? లేక విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమా అయినప్పటికీ శివ కందుకూరి తన నటనతో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ వర్ష.. శృతి పాత్రకు సరిగా సరిపోయింది. కళ్లతో మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ.. సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచింది. మరో హీరోయిన్ ఐశ్వర్య తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శివ తల్లిదండ్రుల పాత్రలో నటించిన పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా తమ పాత్రల మేరకు నటించారు. శృతి తండ్రి పాత్రలో కనిపించిన గురురాజ్ మానేపల్లి పాత్రకు అంత ప్రాధాన్యత లభించలేదు. శివ ఫ్రెండ్ యోగి పాత్రలో నటించిన వెంకటేశ్ కాకుమాను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. విశ్లేషణ : ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటన గోపి సుందర్ మ్యూజిక్ సెకాండఫ్‌లో కొన్ని సీన్లు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు తెరపై కథను బాగా ప్రజెంట్ చేయకపోవడం -సుమంత్ కనుకుల, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!
‘‘హీరోయిన్గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసినప్పుడే నటిగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలమని నా అభిప్రాయం. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉంటే డీ–గ్లామరస్ రోల్ చేస్తాను. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నా. నటిగా నాకు ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తాను’’ అన్నారు వర్ష బొల్లమ్మ. శేష సింధు దర్శకత్వంలో శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్ష చెప్పిన విశేషాలు. ► మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో స్టేజ్‌పై యాక్టర్‌గా చేయాలనుకున్నాను. కానీ మా కాలేజీ డ్రామా అసోసియేషన్‌వారు నన్ను సెలక్ట్ చేయలేదు. తొలిసారి తమిళంలో ‘వెట్రివేలన్’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత తమిళ హిట్ ‘96’లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. ‘96’లో నా నటనను చూసి శేష సింధు, రాజ్ కందుకూరి నాకు ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ► ఈ చిత్రంలో డ్రమ్మర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో నటించాను. కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను. డ్రమ్మింగ్ గురించి అసలు ఏం తెలియకుండా చేయడం చాలా కష్టం. ఓ డ్రమ్ బ్యాండ్ నుంచి డ్రమ్మర్‌కి కావాల్సిన బేసిక్స్ నేర్చుకున్నాను. ► మహిళా దర్శకులు ఉన్న సినిమాల్లో హీరోయిన్గా చేయడం కొంతవరకు ప్లస్ కావొచ్చు. కానీ శేష సెట్లో టామ్‌బాయ్‌లా ఉండేవారు. ఇది ముక్కోణపు ప్రేమకథే. కానీ కాస్త విభిన్నంగా ఉంటుంది. మా చిత్రంలో ఉన్న కొత్తదనం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ► కథలో నా పాత్ర బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తాను. విజయ్ ‘బిగిల్’ సినిమాలో గాయత్రి పాత్ర చేసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ‘96’ చేసిన తర్వాత ‘జాను’ (తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్) లో నటించే అవకాశం వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘యాక్టింగ్ చేయగల టాలెంట్ నాలో ఉందా? లేదా అని సందేహం ఉండేది. నా కాలేజ్ ఫైనల్ ఇయర్లో థియేటర్స్ కోర్స్ తీసుకున్నాను. నాలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అప్పుడే తెలిసింది. యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కందుకూరి చెప్పిన విశేషాలు. ►నేను సినిమాల్లోకి వస్తాను అని మా నాన్నగారితో చెప్పినప్పుడు ‘‘సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఇండస్ట్రీ ఇది. ఫైటర్ లాంటి ప్యాషన్ ఉంటే తప్ప నిలబడలేవు. టాలెంట్ ఉన్నా సక్సెస్ వస్తుంది అని చెప్పలేం. నిరంతరం కష్టపడుతూనే ఉండాలి’ అన్నారు. ►ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే... సినిమాలోని పాత్రలన్నీ నిజ జీవితంలో మనకు తెలిసిన పాత్రల్లానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు. నిర్మాత కొడుకు అని కాకుండా ఈ సినిమాకు కావాల్సిందే చేశారు. కథే హీరో.. ఆ తర్వాతే ఎవ్వరైనా అని నమ్మే స్టయిల్ మా నాన్నగారిది. ఈ కథ నాకోసం తయారు చేయించింది కాదు. ఈ కథ ఓకే అయ్యాకే నేను ఓకే అయ్యాను. ►ఈ తరహా సినిమాలే చేయాలి అని రూల్స్ ఏం పెట్టుకోలేదు. కథ బావుంటే కచ్చితంగా అందులో భాగం అవ్వాలి అనుకుంటాను. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు నన్ను నమ్మి చాన్స్ ఇవ్వడం నా అదృష్టం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.