రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’ | Raj Kandukuri's Son Shiva Kandukuri's Debut Film Titled Choosi Choodangaane | Sakshi
Sakshi News home page

రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’

Aug 4 2019 12:48 PM | Updated on Aug 4 2019 12:48 PM

Raj Kandukuri's Son Shiva Kandukuri's Debut Film Titled Choosi Choodangaane - Sakshi

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు.. జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మ‌హిళా ద‌ర్శకురాలిని ప‌రిచ‌యం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్లమూడి, సుకుమార్‌ల వ‌ద్ద ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది.

రొమాంటిక్ కామెడీ జాన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో వ‌ర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘96’ చిత్రంలో వ‌ర్ష హీరోయిన్‌గా న‌టించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంట‌ల్ మ‌దిలో’ కెమెరామేన్ వేద రామ‌న్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మ‌రో మూడు చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement