Raj kandukuri
-
చిన్న చిత్రాలు పెద్ద సౌండ్ చేస్తున్నాయి: రాజ్ కందుకూరి
గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘భవానీ వార్డ్ 1997’. జీడీ నరసింహా దర్శకత్వంలో జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి(Raj Kandukuri ) మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు జీడీ నరసింహా. ‘‘ఈ మూవీలో ప్రతి సీన్‌కి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపారు పూజా కేంద్రే. ‘ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని సాయి సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ నిస్సీ జస్టిన్, కెమేరామేన్ అరవింద్, గణేశ్ రెడ్డి, పర్వతనేని రాంబాబు, సాయి సతీష్ మాట్లాడారు. -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
‘నాతో నేను’ టీజర్ బాగుంది: రాజ్ కందుకూరి
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాతో నేను’. జబర్దస్ట్ ఫేం శాంతి కుమార్ తూర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘టీజర్‌గా సినిమా పాయింట్ నచ్చింది. కొత్తగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొత్త లైన్, కొత్త టీమ్ చేసే ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది. కథలో కొత్తదనం ఉంది, చక్కని కథనం, సస్పెన్స్ క్యారీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్‌కు అభినందనలు అని అన్నారు. ‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం’అని శాంతికుమార్ అని అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’అని నిర్మాత చెప్పారు. -
'అం అః' నుంచి లవ్ సాంగ్ రిలీజ్..
Nee Manase Naa Dhani Video Song Released: సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’దీనికి ట్యాగ్‌లైన్. ఢిపరెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవలె హీరో శ్రీకాంత్ విడుదల చేసిన మూవీ పోస్టర్‌కు ఆధరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఈ చిత్రం నుంచి నీ మనసే నాదని వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. మధు సురేష్ లిరిక్స్‌పై ఇషాక్ వల్లి ఆలపించిన విధానం, సందీప్ కుమార్ కంగుల అందించిన బాణీలు హైలైట్ అయ్యాయి. విడుదలైన కాసేపటికే ఈ పాటకు మంచి ఆధరణ లభిస్తుంది. -
నాలుగు జంటల కథ
శ్రీజిత్ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెరసాల’. రాంప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మాదినేని సురేష్, సుధారాయ్ గుణ్ణం నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి, టైటిల్ లోగోని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. రాంప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి హారర్ ఎలిమెంట్‌ని మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది’’ అన్నారు. ‘‘మా సినిమా రష్ చూసుకున్నాక చెప్పిన దానికంటే దర్శకుడు చాలా బాగా తీశాడని అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్‌తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు మాదినేని సురేష్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ తమిరి. -
అన్ని హర్రర్ సినిమాల కన్నా భిన్నంగా..
రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం x’. శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్లో, బేబీ రాజశ్రీ సమర్పణలో పొలం గోవిందయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కొత్త దర్శకులైనా, మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. (ప్రభాస్ షూటింగ్ ఆగేది లేదు) నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. (భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’) హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. నటీనటులందరం ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్‌గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అన్నారు. ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్. -
అమాయక కుర్రాడి పెళ్లి
మహి రాథోడ్ హీరోగా నటిస్తూ, పీవీయమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో, ఒక పాటను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘1992’ టైటిల్, ఫస్ట్ సింగిల్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనెప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం విజయం సాధించాలి’’ అన్నారు. శివ పాలమూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. వేసవిలో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘శివగారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కి స్తున్నారు’’ అన్నారు హీరో, నిర్మాత మహి రాథోడ్. ‘‘యాత్ర’ సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తున్నాయి. ‘1992’లో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నా. ఒక అమాయక కుర్రాడు ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది చిత్ర కథ’’ అన్నారు నటుడు ‘దిల్’ రమేష్. ‘‘తెలుగులో నాకిది తొలి చిత్రం. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు మోనా ఠాగూర్. -
కథే ప్రాణం
అల్లు వంశీ, ఇతీ ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.ఎస్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లిరికల్ ఆడియో సాంగ్‌ను దర్శకులు కోదండరామిరెడ్డి, వీవీ వినాయక్‌లతో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డీ, 2డీ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. 2డీ బేబి, 3డీ టెడ్డీ బేర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు కథ ప్రాణం అయితే గ్రాఫిక్స్ ఊపిరి’’ అన్నారు. -
గౌరవం లేని చోట పని చేయలేను
శివ కందుకూరి హీరోగా శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లుగా నటించారు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం గత నెల 31న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చెబుతున్నారు దర్శకురాలు శేష సింధు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శేష మాట్లాడుతూ– ‘‘నేను దుబాయ్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. క్రిష్, సుకుమార్ వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కేవలం దర్శకత్వ విభాగంలోనే కాదు నాకు కెమెరా, కాస్ట్యూమ్, రైటింగ్ విభాగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. దర్శకురాలిగా నా తొలి సినిమా ‘చూసీ చూడంగానే’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషాన్నిచ్చింది. ముఖ్యంగా సినిమాలోని శృతీ, ఐశ్వర్య పాత్రలకు అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు. తమ లైఫ్‌లో నుంచి వెళ్లిపోయిన అబ్బాయిలు తిరిగి వచ్చాక అమ్మాయిలు తప్పక వారిని టెస్ట్ చేస్తారు. అదే ఈ సినిమాలో చూపించాం. కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తోంది. శివ కందుకూరి బాగా నటించాడు. ఈ సినిమా కథను కొంతమందికి వినిపించాను. అమ్మాయి కదా హ్యాండిల్ చేయగలదా? అని కొందరు అంటే... అమ్మాయిలైతే చెప్పిన మాట వింటారని అన్నవారూ లేకపోలేదు. రాజ్ కందుకూరిగారు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా దర్శకురాలిగా చాన్స్ ఇచ్చారు. నాకైతే గౌరవం లేని చోట పని చేయడం ఇష్టం ఉండదు. మా ఇద్దరు సిస్టర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇండస్ట్రీలో నేను ఇబ్బందిపడే సందర్భాలు ఎదురు కాలేదు. కానీ కొందరు వారికి ఎదురైన కొన్ని ఇబ్బందికర సంఘటనలను చెప్పారు’’ అని అన్నారు. -
‘చూసీ చూడంగానే’ కనెక్ట్ అవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చూసీ చూడంగానే’ సినిమాకు సానుకూల స్పందన రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేష సింధు ది బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ బాగా పండింది. హీరోయిన్గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు. దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాలా సహజంగా సినిమాను తీయాలనుకున్నాం. అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యువతతో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్ అవుతుంది. నాకిది తొలి చిత్రం అయినా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమాకి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ ఆశించలేదు’ అన్నారు. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. చదవండి: ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ -
‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ
చిత్రం : చూసీ చూడంగానే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్, పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా, వెంకటేశ్ కాకుమాను సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శేష సింధు రావు నిర్మాత : రాజ్ కందుకూరి బ్యానర్ : ధర్మపథ క్రియేషన్స్ పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాత రాజ్ కందుకూరి. తన సినిమాల్లో చాలా వరకు కొత్త నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించే రాజ్.. తన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘చూసీ చూడంగానే’. అలాగే ఈ చిత్రంతో శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేశారు. తమిళ చిత్రం 96లో ప్రభ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వర్ష బొల్లమ్మ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాలకు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించే రాజ్.. ఇది తన కుమారుడి తొలి సినిమా కావడంతో చిత్ర ప్రమోషన్స్‌ను భారీగానే చేశాడు. అలాగే సురేష్ ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సాంగ్స్, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టునేలా చేశారు. మరి తన కుమారుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంలో రాజ్ కందుకూరి సక్సెస్ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం. కథ : సిద్దు (శివ కందుకూరి) తల్లిదండ్రుల బలవంతం మేరకు ఇంజనీరింగ్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ వచ్చేసరికి ఐశ్వర్య సిద్దును వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రిపెషన్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయని సిద్దు.. ఫ్యాషన్ పొటోగ్రాఫర్ అవుదామనుకుంటాడు. కానీ మూడేళ్ల తర్వాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్ అవుతాడు. అలా ఓ పెళ్లిలో శృతిని (వర్ష) చూసి లవ్‌లో పడతాడు. శృతికి, సిద్దు వారి కామన్ ఫ్రెండ్ యోగి ద్వారా కలుస్తారు. వారిద్దరరు ఫ్రెండ్స్ అవుతుండగా.. స్టోరిలో చిన్నపాటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. సిద్దును శృతి ఇంజనీరింగ్‌లో లవ్ చేసిందని.. ఇప్పటికి అతన్నే ఇష్టపడుతుందని తెలుస్తుంది. అయితే సిద్దు తన ప్రేమ విషయాన్ని చెప్పేలోగానే.. శృతి బాయ్‌ఫ్రెండ్ విరాట్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అందుకు శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా? లేక విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమా అయినప్పటికీ శివ కందుకూరి తన నటనతో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ వర్ష.. శృతి పాత్రకు సరిగా సరిపోయింది. కళ్లతో మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ.. సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచింది. మరో హీరోయిన్ ఐశ్వర్య తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శివ తల్లిదండ్రుల పాత్రలో నటించిన పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా తమ పాత్రల మేరకు నటించారు. శృతి తండ్రి పాత్రలో కనిపించిన గురురాజ్ మానేపల్లి పాత్రకు అంత ప్రాధాన్యత లభించలేదు. శివ ఫ్రెండ్ యోగి పాత్రలో నటించిన వెంకటేశ్ కాకుమాను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. విశ్లేషణ : ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటన గోపి సుందర్ మ్యూజిక్ సెకాండఫ్‌లో కొన్ని సీన్లు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు తెరపై కథను బాగా ప్రజెంట్ చేయకపోవడం -సుమంత్ కనుకుల, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!
‘‘హీరోయిన్గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసినప్పుడే నటిగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలమని నా అభిప్రాయం. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉంటే డీ–గ్లామరస్ రోల్ చేస్తాను. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నా. నటిగా నాకు ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తాను’’ అన్నారు వర్ష బొల్లమ్మ. శేష సింధు దర్శకత్వంలో శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్ష చెప్పిన విశేషాలు. ► మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో స్టేజ్‌పై యాక్టర్‌గా చేయాలనుకున్నాను. కానీ మా కాలేజీ డ్రామా అసోసియేషన్‌వారు నన్ను సెలక్ట్ చేయలేదు. తొలిసారి తమిళంలో ‘వెట్రివేలన్’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత తమిళ హిట్ ‘96’లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. ‘96’లో నా నటనను చూసి శేష సింధు, రాజ్ కందుకూరి నాకు ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ► ఈ చిత్రంలో డ్రమ్మర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో నటించాను. కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను. డ్రమ్మింగ్ గురించి అసలు ఏం తెలియకుండా చేయడం చాలా కష్టం. ఓ డ్రమ్ బ్యాండ్ నుంచి డ్రమ్మర్‌కి కావాల్సిన బేసిక్స్ నేర్చుకున్నాను. ► మహిళా దర్శకులు ఉన్న సినిమాల్లో హీరోయిన్గా చేయడం కొంతవరకు ప్లస్ కావొచ్చు. కానీ శేష సెట్లో టామ్‌బాయ్‌లా ఉండేవారు. ఇది ముక్కోణపు ప్రేమకథే. కానీ కాస్త విభిన్నంగా ఉంటుంది. మా చిత్రంలో ఉన్న కొత్తదనం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ► కథలో నా పాత్ర బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తాను. విజయ్ ‘బిగిల్’ సినిమాలో గాయత్రి పాత్ర చేసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ‘96’ చేసిన తర్వాత ‘జాను’ (తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్) లో నటించే అవకాశం వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. -
వెండితెర నటుడిగానూ ఆదరించండి
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టీవీ షోస్ ద్వారా పాపులర్ అయిన ‘సుడి గాలి’ సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. నిర్మాత రాజ్ కందుకూరి, యాంకర్ సుమ అతిథులుగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక జరిగింది. ‘‘సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ బాగుంటుంది. ఈ ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమ. ‘‘కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు నన్ను బుల్లితెరపై ఎలా సపోర్ట్ చేశారో, అలాగే వెండితెరపై కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘ఈ సినిమాలో కథ కన్నా కొన్ని జీవితాలు కనిపిస్తాయి. కామెడీ టైమింగ్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. కథ నచ్చి ప్రజాగాయకుడు గద్దర్ ఇందులో ఓ పాట పాడి నటించారు’’ అన్నారు రాజశేఖర్. ‘‘మా బ్యానర్ ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శేఖర్. లిరిసిస్ట్ సురేష్ గంగుల, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
చూసీ చూడంగానే నచ్చుతుంది
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. ‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత డి. సురేష్‌బాబు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మా గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల కానుంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వేద రామన్ చక్కని విజువల్స్ అందించారు. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
‘‘పల్లెటూరి ప్రేమకథతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం రూపొందింది. ఏ సినిమాకైనా కంటెంటే కింగ్. ఈ సినిమా కథ బాగుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. కిరణ్ అబ్బవరమ్, రహస్యగోరక్ జంటగా రవికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. డి. మనోవికాస్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు రాజ్ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్ పాటలు విడుదల చేశారు. హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బిVŠ æసీడీని లాంచ్ చేశారు. ‘‘చిన్న పల్లెటూరులో జరిగే ప్రేమకథ ఇది’’ అన్నారు రవికిరణ్. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్‌సిద్ధారెడ్డి. ‘‘నా తల్లిదండ్రులు ఈ సినిమా తీయడానికి ప్రోత్సహించారు’’ అన్నారు మనోవికాస్. -
హ్యాపీడేస్‌లాంటి సినిమా
తమకు నచ్చిన ప్రముఖులను అనుకరిస్తూ సొంతంగా వీడియోలను తయారు చేయటాన్ని ‘డబ్స్మాష్ ’అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని లెజెండ్స్‌పై తీసిన పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర ప్రసాద్, రామ సత్యనారాయణలు విడుదల చేశారు. చిత్రనిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మా అన్నయ్య నటించినందుకు హ్యాపీగా ఉంది. ‘హ్యాపీడేస్’ తరహాలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా లెజెండ్స్‌పై మా సినిమాలో పాట ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.’’ అన్నారు దర్శకుడు కేశవ్ దేవర్. ‘‘ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు పవన్. ‘‘మా చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరోయిన్ సుప్రజ. -
ఓ విద్యార్థి జీవితం
హైస్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘బోయ్’. లక్ష్ , సాహితి జంటగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తొలి ప్రయత్నంగా ఓ కమర్షియల్ సినిమానో, ప్రేమకథో చేయవచ్చు. కానీ, ‘బోయ్’ లాంటి సినిమా చేయడం గొప్ప విషయం. నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘బోయ్’ కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ఇండియా మొత్తం వెతికాను. మా కెమెరామేన్ ఆష్కర్ ల„Š ని చూపించడంతో వెంటనే ఓకే చేశా. తను ఇండియాలోనే నంబర్ వన్ హీరో అవుతాడు’’ అన్నారు అమర్ విశ్వరాజ్. ‘‘ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్ . ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి. -
తూనీగ ఆడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ చిత్రం ఘన విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆకాంక్షించారు. తూనీగ చిత్ర స్వరాల వేడుక యూనిట్ సభ్యుల కుటుంబ సభ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల నడుమ రామానాయుడు స్టూడియోలో సోమవారం జరిగింది. సీనియర్ డైలాగ్ రైటర్ మరుధూరి రాజా, రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఇటీవల విడుదలయిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయని, అదే క్రమంలో ఈ సినిమా చేరాలన్నది తన అభిమతం అన్నారు. తనకూ ఉత్తరాంధ్ర నేలతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. మరుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని, అలాంటి నేల నుంచి వచ్చిన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో కష్టించారని, తొలి ప్రయత్నంతోనే విజయం సాధించాలని దీవించారు. వర్థమాన రచయిత రత్నకిశోర్ శంభు మహంతి తనకు అత్యంత ఆప్తుడని, సోదర సమానుడని అన్నారు. హీరో వినీత్ చంద్రతో సహా ఇతర నటీనటులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ స్వరాల వేడుకకు అతిథులుగా ప్రొడ్యూసర్ దేవీగ్రంథం, నెపోలియెన్ మూవీ ప్రొడ్యూసర్ బొగేంద్ర గుప్త మామిడిపల్లి, ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ పద్మిని నాగులపల్లి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు, యంగ్ హీరో మనోహర్ విచ్చేశారు. తొలి సీడీని చిత్ర సమర్పకులు పద్మావతి, దేవీప్రియ సంయుక్తంగా అందుకున్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు సిద్ధార్థ్ సదాశివుని, సినిమాటొగ్రఫర్ హరీష్ ఎదిగ, పోస్టర్ డిజైనర్ ఎంకేఎస్ మనోజ్, ప్రోమో డైలాగ్, లిరికల్ వీడియోస్ ఎడిటర్ నికిల్ కాలేపు, పాటల రచయితలు కిట్టు, ఫణి, గాయకులు కరీముల్లా, విశ్వ, ఇషాక్, సహ నిర్మాత కర్రి రమేశ్, నటీనటులు సిల్వర్ సురేశ్, చైత్రిక, తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
చూసీ చూడంగానే...
‘ఛలో’ సినిమాలోని ‘చూసీ చూడంగానే నచ్చేసావే..’ పాట గత ఏడాది ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాట పల్లవిలోని ‘చూసీ చూడంగానే...’ పదాలను టైటిల్‌గా పెట్టుకున్నారు శివ కందుకూరి. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం కాబోతున్నారు. శేష సింధురావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘చూసీ చూడంగానే...’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం. సురేశ్‌గారి బ్యానర్‌తో కలసి ఈ సినిమా విడుదల చేస్తాం. ‘96’ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వేద రామన్. -
రాజ్ కందుకూరి తనయుడు హీరోగా ‘చూసీ చూడంగానే’
‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోవడమే కాదు.. జాతీయ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మాతగా, ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా నటిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్లమూడి, సుకుమార్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రంలో వర్ష హీరోయిన్గా నటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంటల్ మదిలో’ కెమెరామేన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మరో మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. -
వెంటాడే ఫీల్‌తో..
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్తర’. లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై తిరుపతి ఎస్.ఆర్. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సురేశ్ బొబ్బిలి సంగీతం అంటే చాలా ఇష్టం. సినిమా కథలోని ఆత్మను తన సంగీతంతో పలికించే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు. ‘‘ట్రైలర్ కొత్త ఫీల్‌ని కలిగించింది. ప్రతిభ ఉన్నవాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ సినిమాలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన దర్శకునికి రుణపడి ఉంటాను. సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరూ ఆదరిస్తారు. అలాంటి మంచి సినిమానే మేం చేశాం’’ అన్నారు శ్రీరామ్. తిరుపతి మాట్లాడుతూ– ‘‘సహజమైన పాత్రలతో సినిమా ఉంటుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు ఆ ఫీల్ ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు. నిర్మాత శ్రీపతి గంగదాస్ మాట్లాడుతూ – ‘‘తిరుపతి సినిమాను బాగా తీశారు. అనుకున్నట్లుగానే సినిమా బాగా రావడానికి కారణం టీమ్’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య. -
ఉత్తర ట్రైలర్ లాంచ్
లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ లో నన్ను ఎక్కువుగా ఆకర్షించింది మ్యూజిక్. సురేష్ బొబ్బిలి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే లుక్ అండ్ ఫీల్ చాలా ప్రెష్ గా ఉన్నాయి. తెలంగాణా యాస తెరపై గమ్మత్తును చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయం తో పాటు రెస్సెక్ట్ వస్తుందని నమ్ముతున్నాను ’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బ్యాక్ డ్రాప్ బాగుంది. కొత్త ఫీల్ కలిగింది. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది’ అన్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఏ సినిమాలో అయినా కొత్తదనం ఉంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఆదరణ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొత్తదనం నిండిన సినిమాలను ప్రొత్సహించిన వారే. మా సినిమా కూడా అలాంటి కొత్తదనం తోనే వస్తుంది. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన దర్శకుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ టీం అందరూ నన్ను బాగా ఎంకేరేజ్ చేసారు. అలాగే కారుణ్య నటన ప్రత్యేకంగా చెప్పుకుంటారు’ అన్నారు. దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రలు చాలా సహాజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుతుంది. ఉత్తర సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ కారుణ్య, శ్రీరామ్‌ల పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఈ ట్రైలర్ లాంచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు’ అన్నారు. -
కాజల్ సమర్పణలో ‘మను చరిత్ర’
శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మను చరిత్ర’. ఈ చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా.. సి.కల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజయ్ భూపతి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, అనీల్ సుంకర, రాజ్ కందుకూరి, అనీల్ కన్నెగంటి, మధుర శ్రీధర్, సాహు గారపాటి, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, రాధాకృష్ణ, శివ నిర్వాణ, సుధీర్ వర్మ, అజయ్ భూపతి సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాతో రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. మేఘా ఆకాశ్, శివకుజంటగా నటిస్తున్నారు. భరత్ కుమార్.పి దర్శకుడు. గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఆయనతో కలిసి ఎన్.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జాయ్’ అనేది ట్యాగ్‌లైన్. డాలీ ధనుంజయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్ లోగో లాంచ్
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్‌తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు. -
చెలీ... రావే
‘‘కథ బాగుంటే చిన్న సినిమా అయినా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. ‘రావే నా చెలియ’ టైటిల్ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా కంటెంట్ కూడా బాగుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి పని చేస్తున్న వారందరికీ అభినందనలు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నెమలి అనిల్, సుబాంగి పంథ్ జంటగా ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావె నా చెలియ’. నెమలి సురేశ్ సమర్పణలో సూర్యచంద్ర ప్రొడక్షన్లో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ రూపొందిస్తున్న ఈ చిత్రం లోగోని రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. హీరో నెమలి అనిల్ మాట్లాడుతూ– ‘‘ఇది మా బ్యానర్‌కి, నాకు మొదటి సినిమా. మా నాన్న, బాబాయి ఎంతో నమ్మకంతో ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టీమ్ అంతా ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. నిర్మాతలు, అనిల్ నన్ను చాలా నమ్మి సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు ఎన్. మహేశ్వర రెడ్డి. నిర్వాహకుడు నెమలి సురేశ్, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కుమార్, కెమెరామేన్ విజయ్ దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు. -
‘స్వయంవద’ టైటిల్ ఆవిష్కరణ
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న సినిమా స్వయంవద. ఈ సినిమాను వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సీనియర్ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ‘స్వయంవద’ చిత్ర టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ, ‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయన నాతో కలిసి పనిచేసినప్పుడే నాకు విషయం అర్ధమైంది. యువత ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడింది? అన్నదే ఈ సినిమా కథ. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వివేక్ గురువుకు తగ్గ శిష్యుడని టైటిల్‌ను బట్టే తెలుస్తోంది. ఇదో డిఫరెంట్ మూవీ. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ, ‘స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే ఓ సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెటప్స్‌లో కనిపిస్తుంది. హీరో కూడా చక్కగా నటించాడు. టెక్నికల్ గాను సినిమా హైలైట్‌గా ఉంటుంది. ఒక పాట షూటింగ్ మినహా అంతా పూర్తయింద’న్నారు. -
టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది
‘‘ఉద్యమ సింహం’ టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేసీఆర్‌గారంటే నాకు ఇష్టం. నిర్మాతలంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో నాగేశ్వరరావుగారు కేసీఆర్‌పై సినిమా చేయడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా ఇది. కొన్ని సీన్స్ చూశా.. చాలా బాగా తీసారు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ప్రధాన పాత్రల్లో అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందించి, నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘జూన్‌లో ప్రారంభించిన ‘ఉద్యమ సింహం’ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయింది. మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ నెల 16న ఆడియో, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం. కేసీఆర్ పాత్ర ఎవరు పోషించారు? మిగతా నటీనటులు ఎవరు? అన్నది ఆడియో విడుదల రోజున చెబుతాం’’ అని అల్లూరి కృష్ణంరాజు అన్నారు. సంగీత దర్శకుడు దిలీప్ బండారి, మాటల రచయిత కృష్ణ రాపోలు, ఛాయాగ్రాహకుడు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ∙నాగేశ్వరరావు, రాజ్ కందుకూరి -
9 మంది ప్రముఖుల చేతుల మీదుగా..!
తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ మూవీ ‘హవా’. ఇటీవల రానా చేతుల మీదుగా విడుదల చేసిన ఈసినిమా మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి 9 మంది సినీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిని రెడ్డి, బీవీయస్ రవి, మధురా శ్రీధర్, వేణు ఊడుగుల, రాజ్ కందుకూరి, జానీ మాస్టర్లు కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. -
సోకులెక్కువ
మల్లిఖార్జున్, కవిత మెహతా జంటగా అన్నం చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలేజ్ పోరగాళ్ళు’. ‘సదువు తక్కువ.. సోకులెక్కువ’ అన్నది ఉప శీర్షిక. మంత్ర ఆర్ట్స్‌పై కెమెరామెన్ శ్రీధర్ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఎల్ఎం ప్రేమ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘మా చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం. సినిమా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు అన్నం చంద్ర శేఖర్. -
సందేశాత్మక కథతో ‘అనువంశికత’
కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అనువంశికత’. సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రమేష్ ముక్కెర దర్శకుడు. ఈ నెల 24న రిలీజ్‌కానున్న ఈ చిత్ర టైలర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరకొండ మధుసూదనాచారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సందేశాత్మక చిత్రం తీసి రిలీజ్ చేయటం మామూలు విషయం కాదన్న మధుసూదనా చారి.. ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుమన్ పైరసీ కారణంగా సినీ రంగం చాలా ఇబ్బంది పడుతుందని, ఇటీవల పలు చిత్రాల్లోని సన్నివేశాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో బయటకు రావటం బాధాకారమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘నిర్మాత దాము గారు నాకు ఇష్టమైన వ్యక్తి. మేనరికాల వల్ల అంగవైకల్యంతో ఉండే పిల్లలు పుడతారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వస్తుందన్న అంశంతో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు చాలా బాగా డీల్ చేశారు. పాటలు కూడా బాగా కుదిరాయి. ఇలాంటి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తే బావుంటుంది. ఈ సినిమాను చదలవాడ శ్రీనివాసరావు గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంద’న్నారు. -
‘ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు’
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన విభిన్న చిత్రం అంతర్వేదమ్. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని నటుడు తనికెళ్ల భరణికి అందించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ.. మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. మంచి విజయం సాధిస్తున్నారు. యువత ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటున్నారు కానీ.. అంతర్వేదం సినిమాలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’ అన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వాళ్ళందరూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను’ అన్నారు. దర్శకుడు చందిన రవికిషోర్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళ భరణి గారు ముందు కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను‘ అన్నారు. -
దసరాకి రాజా
కుమార్ రాజా, సాయికుమర్, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ, ఆక్సాఖాన్, జీత్‌సింగ్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కుమార్ రాజా’. టెల్ మీ బాస్ పిక్చర్స్ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో, హీరోయిన్లపై రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. శ్రీచక్ర మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో కథ చక్కగా కుదిరింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. దసరాకి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
'మెంటల్ మదిలో...' మూవీ రివ్యూ
టైటిల్ : మెంటల్ మదిలో... జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, శివాజీ రాజా సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి దర్శకత్వం : వివేక్ ఆత్రేయ నిర్మాత : రాజ్ కందుకూరి పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను తెరకెక్కించారు. సపోర్టింగ్ రోల్స్ లో మంచి ఇమేజ్ సంపాదించిన శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సోలో హీరోగా మెంటల్ మదిలో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సినిమాలోని కంటెంట్ నచ్చిన సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారిగా డైరెక్ట్ చేసిన మెంటల్ మదిలో.. మరోసారి రాజ్ కందుకూరికి సక్సెస్ అందించిందా? శ్రీవిష్ణు సోలో హీరోగా ఆకట్టుకున్నాడా..? కథ : అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం కలిగిన వ్యక్తి. కనీసం ఏ షర్ట్ వేసుకోవాలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ ఆప్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అంతేకాదు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అమ్మాయిలంటే కూడా అరవింద్ కు భయం కలుగుతుంది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరినా అమ్మాయిలతో మాత్రం మాట్లాడడు. పెళ్లి చేస్తే ఏమైన మార్పు వస్తుందని భావించిన అరవింద్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. (సాక్షి రివ్యూస్)డజనుకు పైగా పెళ్లిచూపులు చూసినా అరవింద్ ప్రవర్తన కారణంగా ఒక్కటి కూడా సెట్ కాదు. చివరకు స్వేచ్ఛ (నివేథ పెతురాజ్), అరవింద్ తో పెళ్లికి ఓకె చెపుతుంది. అరవింద్ కూడా తొలి చూపులోనే స్వేచ్ఛతో ప్రేమలో పడతాడు. తనతో పరిచయం అయిన తరువాత అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వీరి ఎంగేజ్ మెంట్ వాయిదా పడుతుంది. అదే సమయంలో అరవింద్ ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగానే ముంబై వెళ్లిన అరవింద్, కొద్ది రోజులు తరువాత స్వేచ్ఛకు ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్తాడు. అరవింద్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? ముంబైలో ఏం జరిగింది..? చివరకు అరవింద్, స్వేచ్ఛలు ఒక్కటయ్యారా అన్నదే మిగతా కథ. నటీనటులు : అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ. (సాక్షి రివ్యూస్)మరో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : పెళ్లిచూపులు లాంటి క్లాస్ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్న రాజ్ కందుకూరి మరోసారి అలాంటి అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేని వ్యక్తి, తన సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ప్రేమ విషయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. తొలి సినిమానే అయినా.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథను చాలా బాగా డీల్ చేశాడు. కథనంలో కాస్త వేగం తగ్గినా ఓ అందమైన ప్రేమకథను చూస్తున్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న టీం సినిమా అంత బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. (సాక్షి రివ్యూస్) తొలి చిత్రమే అయినా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి తన మార్క్ చూపించాడు. మనసును తాకే మెలోడీస్ తో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. కమర్షియల్ మూసలో కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న రాజ్ కందుకూరి ప్రయత్నాన్ని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. కథ ఎంపికలో ఆయన చూపిస్తున్న కొత్తదనం ఎంతో మంది కొత్త సాంకేతిక నిపుణులకు ప్రొత్సాహాన్ని ఇస్తుందంటున్నారు. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పురస్కార ప్రదానం
-
నిర్మాతల పేరు చెబితే సినిమాలు ఆడే రోజులు రావాలి
– బి. నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవంలో జగపతిబాబు ‘‘ఒకప్పడు బి. నాగిరెడ్డిలాంటి స్టార్ నిర్మాతలుండేవారు. ఇప్పడు నిర్మాత అంటే ఎవరు? అని అడుగుతున్నారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అన్నం పెట్టే నిర్మాత తెలియకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితి మారాలి. మళ్లీ నిర్మాతను బట్టి... వారి పేరు చెబితే సినిమాలు ఆడే పరిస్థితి రావాలి’’ అన్నారు ప్రముఖ నటుడు జగపతిబాబు. విజయ వాహినీ స్టూడియో అధినేత బి. నాగిరెడ్డి పేరిట ప్రతి ఏడాది చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన నిర్మాతకు ఇచ్చే ‘బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం’ 2016కు గాను ‘పెళ్లి చూపులు’ చిత్రనిర్మాత రాజ్ కందుకూరికి ప్రదానం చేశారు. ఆయనకు మొమెంటోతో పాటు రూ.1.5 లక్షల చెక్‌ను బి. నాగిరెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి–భారతీరెడ్డి దంపతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. జగపతిబాబు మాట్లాడుతూ – ‘‘చిన్న సినిమాలూ ఆడతాయనే నమ్మకాన్ని కలిగించిన ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు రావడం చిన్న నిర్మాతలకు ఎంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. నటి, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ – ‘‘కథను నమ్మి తీసిన ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు ఇచ్చి చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. జ్యూరీ సభ్యులు గొల్లపూడి మారుతీరావు, సింగీతం శ్రీనివాసరావులు ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన తర్వాత కొద్ది రోజులకు రెండు జాతీయ అవార్డులు కూడా రావడం వారి ఎంపికకు నిదర్శనం. బి. నాగిరెడ్డిగారి విజయ సంస్థలో నేను మూడు సినిమాల్లో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘నేను సినిమా రంగంలోకి రావడానికి మా నాన్నగారు ముఖ్య కారణం. ఆయన రాసిన కథతో తీసిన ‘గౌతమబుద్ధుడు’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. దలైలామా అభినందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ఆడియో ఆవిష్కరించారు. ‘పెళ్లి చూపులు’కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ బృందం విజయ ప్రొడక్షన్ చిత్రాలలోని పాటలను ఆలపించారు. గొల్లపూడి మారుతీరావు, సింగీతం శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి. విజయరామరాజు, బి. నాగిరెడ్ది కుటుంబీకులు ఆనం ప్రేమ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం. -
పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది
సదువు సక్కంగా బుర్రకు ఎక్కని ఓ ఆవారా కుర్రాడు బీటెక్ పూర్తి చేస్తాడు. షెఫ్ కావాలనేది అతడి కోరిక. పిల్లను సూడనీకి ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్తాడు. ఆ పిల్లేమో ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరక మంచిదే అన్నట్టు... రాంగ్ అడ్రస్‌కు వెళ్లడం వల్ల ఇద్దరికీ మేలు జరిగింది. విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రేమలో పడతారు. చిన్న సంఘర్షణ తర్వాత ఒక్కటవుతారు – తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమైన ‘పెళ్ళి చూపులు’ చిత్రకథ సాదాసీదాగానే అనిపిస్తుంది. మరి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒకటి, ఉత్తమ సంభాషణలకు గాను తరుణ్ భాస్కర్‌కి మరొకటి... రెండు నేషనల్ అవార్డులు ఎందుకొచ్చాయి? అనడిగితే... ‘పెళ్లి చూపులు’లో సహజత్వం ఉంది. ‘నా సావు నేను సస్తా... నీకెందుకు?’ వంటి మాటలు నుంచి మొదలుపెడితే... ఇప్పటి యువతీయువకుల ఆలోచనా ధోరణి వరకూ ప్రతి అంశంలోనూ దర్శకుడు సహజత్వం చూపించాడు. ఏదో మన పక్కింట్లో, మనింట్లో జరిగే కథగా అనిపిస్తుంది. అందుకే, సూపర్ హిట్టయ్యింది. కంటెంట్ ఈజ్ కింగ్ సినిమా సక్సెస్, ఇప్పటివరకూ వచ్చిన అవార్డులు ఒకెత్తు అయితే... నేషనల్ అవార్డు రావడం మరో ఎత్తు. సూపర్ స్టార్స్ చేసిన చిత్రమా? కొత్తవాళ్లు చేసిన చిత్రమా? అని ఆలోచించకుండా... సినిమా హైప్‌తో, బడ్జెట్‌తో సంబంధం లేకుండా... మా చిత్రాన్ని గౌరవించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నా. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని మేము ఏ నమ్మకంతో అయితే సినిమా తీశామో? ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ‘పెళ్లి చూపులు’కు భారీ విజయాన్ని అందించారు. దీనివల్ల నేను లేదా మరో కొత్త నిర్మాత... ఎవరైనా కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీయడానికి ముందుకొస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మరో పదిమంది స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తే... మిగతా అంశాలు ఏవీ చూడకుండా ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ‘పెళ్లి చూపులు’ టీమ్, నిర్మాత డి. సురేశ్‌బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – నిర్మాత రాజ్ కందుకూరి ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది! ‘‘సూపర్ హ్యాపీ. ‘పెళ్ళి చూపులు’కు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా రిలీజవుతుందా? లేదా? అని భయపడేవాణ్ణి. ప్రతి ఒక్కరి (ప్రేక్షకుల) ప్రశంసలతో ఇంత దూరం వచ్చింది. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ దక్కుతున్నాయని అనుకుంటున్నా. నాన్నగారు ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో. పైనుంచి ఆయన చూసి, ఆశీర్వదిస్తున్నారనే నమ్మకంతో హ్యాపీగా ఉన్నాను. ఇది పక్కన పెడితే... మా నిర్మాతలు నా ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశారు. మంచి ప్రయత్నం చేద్దామనుకున్నాం తప్ప... డబ్బులొస్తాయి, వందరోజులు ఆడుతుంది, నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. దీన్నో గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. – దర్శకుడు తరుణ్ భాస్కర్ -
పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో
పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లిచూపులు తరహాలోనే 'మెంటల్ మదిలో' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించిన శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. నివేథ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ లా కనిపిస్తున్నాడు. కథ ఎపింకలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానన్న నమ్మకంతో ఉన్నాడు. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. -
మనవి ఆలకించరాదటె!
శ్రీవిష్ణుకు పిచ్చి పట్టిందంటున్నారు అతడి స్నేహితులు. పక్కనున్న వాళ్లను పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేయసి ఊహల్లో విహరిస్తుండడంతో ‘అతడిది లవ్ మెంటల్’ అని డిసైడ్ చేశారట! ‘‘సిగ్గుతో మనసులో ఫీలింగ్స్ చెప్పలేకపోవడం, ప్రేమలో ఓ పనికి బదులు మరో పని చేయడం ‘మెంటల్’ అయితే.. నాది మెంటలే’’ అంటున్నారు శ్రీవిష్ణు. రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్ సంగతిది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్న సినిమా ‘మెంటల్ మదిలో’. మనవి ఆలకించరాదటె.. అనేది ఉపశీర్షిక. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఇందులో షై, ఇంట్రా వర్ట్, కన్ఫ్యూజ్డ్ కుర్రాడిగా శ్రీవిష్ణు నటిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూర్పు: విప్లవ్, కెమేరా: వేదా రామన్, సంగీతం: ప్రశాంత్ విహారి. -
కంటెంట్ ఈజ్ కింగ్!
‘‘సినిమాకు హీరో, బడ్జెట్ ముఖ్యమే. కంటెంట్ కూడా చాలా ముఖ్యం. అది కింగ్ లాంటిది. మంచి కథ, ఆ కథకు సూటయ్యే హీరో సినిమా చేస్తే విజయం సాధించ వచ్చు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘పెళ్లి చూపులు’తో ఘనవిజయం అందుకున్నారీయన. ఆ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో ‘సైన్మా’, విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్లానింగ్‌లో ఉన్నాయన్నారు. నేడు పుట్టినరోజు సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘9 ఏళ్లలో పది సినిమాలు తీశా. ‘పెళ్లి చూపులు’ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఒకట్రెండు కోట్ల బడ్జెట్లో కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది. నా దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అన్నారు. -
'23 ఏళ్ల తరువాత పెళ్లి చూపులు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన పెళ్లి చూపులు సినిమాకు ఇంకా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లను సాధించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ సినిమాను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి సినిమా చూసిన అజారుద్ధీన్ 'చాలా కాలం నుండి మా అబ్బాయి అబ్బాస్ తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు చూడమని చెపుతున్నాడు. నేను కూడా చాలా రోజులుగా చూద్దామని అనుకున్నా.. కానీ ఇప్పటికి కుదిరింది. పెళ్లిచూపులు సినిమా చాలా బాగుంది. దాదాపు 23 ఏళ్ల తరువాత తెలుగు సినిమా చూశా. చాలా ఏళ్ల క్రితం ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమాను వైజాగ్‌లో చూశా.. తరువాత ఇన్నేళ్లకు పెళ్లి చూపులు చూశాను. నాకు బాగా నచ్చింది' అన్నారు. -
అయిదు నిమిషాలకో దెయ్యం!
కనుమూర్తి భార్గవి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’. శశి, వెంకట భరద్వాజరెడ్డిలతో కలిసి స్వీయ దర్శకత్వంలో గంగాధర్ రాజరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో మల్టీ డైమన్షన్ వాసు, రాజ్ కందుకూరి, ‘మధురా’ శ్రీధర్ల చేతుల మీదుగా విడుదల చేశారు. ‘‘స్టడీకామ్ కెమెరాతో... ఇంట్లో ఉండే మామూలు లైట్లు వేసి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో ప్రతి అయిదు నిముషాలకూ ఒక దెయ్యం వస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు.