సయిన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్‌తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు.
హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు.
నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment