akshita
-
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
నందిగాం: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న లిమ్మక అక్షిత (16) మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపాల్ దమయంతి, నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం పారాపురం సమీపంలోని మహసింగి గ్రామానికి చెందిన లిమ్మక గిరి, శ్రావణిలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అక్షిత జూలై 24న జరిగి న రెండో విడత కౌన్సిలింగ్లో నందిగాం బాలికల గురుకులంలో ఇంటర్మీడియెట్‌లో చేరింది. 26వ తేదీన హోమ్ సిక్ అంటూ ఇంటికి వెళ్లి మరలా 29న గురుకులానికి వచ్చింది. యథావిధిగా తరగతులకు హాజరైంది. మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు స్టడీ అవర్‌లో చదివి అందరితో పాటు నిద్రపోయింది. బుధవారం వేకువజామున సెక్యూరిటీ గార్డులు వచ్చి విద్యార్థులను నిద్రలేపుతుండగా 6వ తరగతికి చెందిన వనగాల్ల పల్లవి టాయ్‌లెట్‌కు వెళ్లగా పక్కనే ఉన్న కిటికీకి అక్షిత వేలాడుతూ కనిపించింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వారు ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చారు. పక్కనే క్వార్టర్స్‌లో ఉన్న ప్రిన్సిపాల్ వచ్చి చూసి విషయా న్ని ఉన్నతాధికారులకు, నందిగాం ఎస్సైకు, తహసీల్దారు, విద్యార్థిని తల్లికి తెలియజేశారు. నందిగాం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.న్యాయం చేయాలి..అనంతరం గురుకులానికి చేరుకున్న విద్యార్థిని తల్లి దండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాము వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా ఆస్పత్రికి తరలించడంపై అభ్యంతం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్, ఎస్సైలను నిలదీశారు. అక్షిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లి శ్రావణి, మేనమామ బాడ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి అక్కురాడ లోకనాధం, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగాన తిరుపతిరావు, కులనిర్మూలన పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకరరావు, స్థానిక నాయకులు జడ్యాడ జయరాంలు మాట్లాడుతూ బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థినులు అధైర్యపడవద్దుశ్రీకాకుళం పాతబస్టాండ్: నందిగాంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వైనంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు అధైర్య పడవద్దని, సమస్యలు ఉంటే హెచ్ఎంకు తెలియజేయాలన్నారు. కాగా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి మనోధైర్యం కల్పించారు.శ్రీకాకుళం అర్బన్: విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంపై జిల్లా అధికారులు, గురుకులం జిల్లా కో–ఆర్డినేటర్లు పూర్తి నివేదిక అందించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. -
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. -
జాతీయ చేనేత ఐక్య వేదిక అధికార ప్రతినిధిగా అక్షిత
కరీంనగర్: జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ అక్షితను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కష్టపడేవారికి సరైన గుర్తింపు ఉంటుందని, సంఘం బలోపేతానికి పాటుపడుతున్న కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అక్షిత సేవలను మరింతగా వినియోగించుకునేందుకు రాష్ట స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ఇన్చార్జి కాటా రాందాస్, అధ్యక్షుడు మాడ రాజా, గౌరవ అధ్యక్షులు తిరందాస్ వేణుగోపాల్, కోట దామోదర్, యువజన విభాగం అధ్యక్షుడు చిలివేరి రామకృష్ణ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎలుబాక సుజాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...
జగిత్యాల క్రైం: జగిత్యా ల రూరల్ మండలంలని బాలపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతిని బెదిరించి, కొట్టి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత గత జూలై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమెపై కక్ష పెంచుకున్న తండ్రి భూమయ్య, మేనమామ సుంకశీల సత్తయ్యతోపాటు మరికొందరు రెండు కార్లలో మారణాయుధాలతో ఆదివారం బాలపల్లికి వచ్చారు. అక్షితపై దాడిచేసి, బలవంతంగా కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె అత్త్త, ఆడపడుచులపై దాడి చేయడంతో గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులపైనా ఆయుధాలతో వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. అనంతరం యువతిని తీసుకొని, వెళ్లిపోయారు. స్థానికులు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అక్షిత భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్‌పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
మైండ్ రీడింగ్ సైకో
అజయ్, రంగా, అక్షత ముఖ్య పాత్రల్లో నందమ్ శ్రీవాత్సవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘స్పెషల్’. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ క్రిమినల్ ఒక రకమైన ఇంజెక్షన్‌ను వాడుతూ చాలామందికి హాని తలపెడుతుంటాడు. అసలు ఆ ఇంజెక్షన్ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పోలీస్ అధికారి పాత్రలో నటించాను. నా కెరీర్లో ఇది ప్రత్యేకమైన చిత్రం’’ అని అజయ్ అన్నారు. ‘‘మైండ్ రీడర్‌గా మారిన ఓ సైకో ఏం చేశాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. మైండ్ రీడర్ పాత్రలో రంగా నటించారు. కీలకపాత్రలో అక్షత కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నందమ్. ఈ చిత్రానికి విన్.వి.ఎస్. మణ్యం సంగీతం అందించారు. బి. అమరకుమార్ ఛాయాగ్రాహకుడు. -
పాటలతో ప్రశ్నిస్తా
మనీష్ బాబు హీరోగా, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా హీరోయిన్స్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రారంభం రోజున మనీష్‌ని చూసాను. మంచి హైట్, ఫిజిక్‌తో బాగున్నాడు. ఇప్పుడు టీజర్ చూసాక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. భవిష్యత్తులో తను పెద్ద హీరోగా ఎదగాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలు డీల్ చేయడం చాలా కష్టం. కానీ, రాజా వన్నెంరెడ్డిగారు అలాంటి చిత్రాలు తీసి హిట్స్ కొట్టారు’’ అన్నారు.‘‘చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ ఐదు రెట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారయ్యింది. ఈ సినిమాతో మనీష్ 10కోట్ల రేంజ్ హీరో అవుతాడు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా పొలిటికల్ టచ్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాత మా సినిమాకి బిజినెస్ క్రేజ్ పెరిగింది’’ అని పి. సత్యారెడ్డి అన్నారు. మనీష్, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్ శివారెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్ లోగో లాంచ్
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్‌తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు. -
‘మరిన్ని థియేటర్లు దొరికితే బాగుండేది’
హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేమెంత పనిచేసే నారాయణ. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి ఈ సినిమా ఈనెల 22న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. మంచి రివ్యూలు వచ్చాయి. అంతా హరి బాగా చేసాడంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నటన, డాన్సులు, డైలాగులు బాగా చెప్పాడని క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాకు మరిన్ని థియేటర్లు దొరికితే బాగుండేది’ అన్నారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ఎదురు లేని మనిషి, మా అన్నయ్య బంగారం, బంగారు బాబు, జగపతి ఇలా చాలా సినిమాలను డైరెక్ట్ చేసాను. స్టార్ హీరోలు నాగార్జున, జగపతిబాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శ్రీకాంత్ గారితో చేసాను. కో డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఈ కథ కొత్త వాళ్లతో చేస్తేనే బాగుంటుందని చేసా. అందుకే మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసా. సినిమా చూసిన వారంతా హరి బాగా చేసాడని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇండస్ర్టీలో ఉన్న సన్నిహితులు కూడా హరి డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ చక్కగా చేసాడని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఎంతో బాగుంది. క్రిటిక్స్ సైతం ప్రశంసించారు. కానీ ఒకటే అసంతృప్తి... థియేటర్లు ఎక్కువగా దొరికి ఉంటే బాగుండేది. థియేటర్లు పెంచుతారని ఆశిస్తున్నా. అంత అనుభవం ఉన్నా థియేటర్లు సంపాదించుకోలేకపోయాననే బాధ ఉంది’ అని అన్నారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ, ‘మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. కొత్త వాళ్లని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత కథానాయికగా నటించారు. ఝాన్సీ కీలక పాత్ర చేశారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన నటుడు శ్రీకాంత్ ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావుకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఆయన తనయుడు హరిని హీరోగా పరిచయం చేస్తూ, తనే ఈ సినిమా అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారు. హరి బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. భవిష్యత్‌లో స్టార్ అవుతాడు’’ అన్నారు. ‘‘కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకి కొందరు ఇచ్చిన సలహాలు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. ‘‘ప్రేమకు కొత్త అర్థం చెప్పే చిత్రమిది. స్నేహం విలువను చాటిచెప్పే కథ’’ అన్నారు హరికృష్ణ. రచయిత మరుదూరి రాజా, నటుడు కాశీవిశ్వనాథ్, హీరోయిన్ అక్షిత మాట్లాడారు. -
మనసు చదివేస్తాడు
‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మించారు. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్ రీడర్ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి, వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్ చివరి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మన్యం, కెమెరా: బి అమర్ కుమార్. -
ఆడియన్స్ చప్పట్లు కొడతారు
‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ అనే పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కింది. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటించారు. భాగ్యలక్ష్మీ సమర్పణలో జె.ఆర్.యస్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సావిత్రి జొన్నలగడ్డ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నాకిది తొమ్మిదో చిత్రం. పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. ఈ కథ వైవిధ్యంగా ఉండటంతో నా కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నాను. ఇలాంటి పాయింట్ ఇంతవరకూ ఏ డైరెక్టర్ టచ్ చేయలేదు. క్లైమాక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు’’ అన్నారు. ‘‘అన్ని జనరేషన్స్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ కథ ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో బాధను ఈ సినిమా తెలియచేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. తప్పకుండా విజయం సాధిస్తాం’’ అన్నారు హీరో హరికృష్ణ. -
జగపతిబాబు వాయిస్ ప్లస్ అవుతుంది!
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి చేతుల మీదగా ఇటీవల విడుదలైన మా సినిమా పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. వీడియో పాటలను జయప్రదగారు, క్రిష్, రవితేజగారు రిలీజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది మా హరికృష్ణకి సపోర్ట్ చేయడం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘వైఎస్ జగన్‌గారు విడుదల చేసిన మా చిత్రం పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘అట్ట చూడమాకే...’ సాంగ్ విడుదల చేసిన జయప్రదగారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరువలేను. క్రిష్‌గారు, రవితేజగారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు’’ అన్నారు హరికృష్ణ. అక్షిత, సంగీత దర్శకుడు యాజమాన్య, పాటల రచయిత రాంబాబు గోసాల, ‘ఆదిత్య’ నిరంజన్ పాల్గొన్నారు. -
జగన్‌గారంటే ఎంతో అభిమానం
‘‘మా అబ్బాయి హరికృష్ణకు వైఎస్ జగన్‌గారంటే అభిమానం. మా ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రంలోని ఒక్క పాటైనా ఆయన చేతుల మీదగా లాంచ్ చేయాలని మా అబ్బాయి పట్టు పట్టాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తోన్న జగన్‌గారిని కలిశాం. మా సినిమా పాటలను ఆయన విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా భాగ్యలక్ష్మి సమర్పణలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం ఆడియోను వైఎస్. జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ జగన్‌గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమా పాటలు లాంచ్ చేసి, మా అబ్బాయికి ఆశీర్వాదాలు అందించారు. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం సంతోషాన్ని ఇచ్చింది. ఈనెల రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేనెంతో అభిమానించే జగన్‌గారు మా చిత్రం ఆడియో లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాకూ మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరికృష్ణ జొన్నలగడ్డ. -
హరికృష్ణ మంచి హీరో అవుతాడు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత హీరోయిన్. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావు మంచి దర్శకుడు. ‘ఎదురులేని మనిషి, జగపతి, బంగారు బాబు, ఢీ అంటే ఢీ’ వంటి చాలా సినిమాలు చేశారు. హరికృష్ణ నటన, డాన్స్ చూస్తుంటే మంచి హీరో అవుతాడనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. హరికృష్ణకి మంచి ఎనర్జీ ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్. ‘‘నిజజీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో తీసిన సినిమా ఇది. లవ్ స్టోరీ అయినా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇది నా 9వ సినిమా. క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాలో హైలైట్. త్వరలోనే í విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. రచయిత పరచూరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్లు డాలీ, కిశోర్ కుమార్, హరికృష్ణ, అక్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భాగ్యలక్ష్మి, సంగీతం: యాజమాన్య, కెమెరా: పి.ఎస్. వంశీ ప్రకాష్. -
హరి నటుడిగా మంచి స్థాయికి వెళ్తాడు
హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమెంత పని చేసె నారాయణ’. అక్షిత, ఝాన్సీ, చిలుకూరి గంగారావు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాటలు, ట్రైలర్‌తో పాటు కొన్ని సీన్స్ చూశాను. హీరో హరి డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. భవిష్యత్‌లో అతను మంచి స్థాయిలో ఉంటాడు. దర్శకుడు శ్రీనివాస్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా ఆయనకు మంచి విజయంతో పాటు డబ్బుల్ని కూడా తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, మా హరిని రవితేజ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను రిలీజ్ చేయనున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రవితేజగారు నేను హీరోగా చేసిన సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. నా ప్రయత్నాన్ని వారు దీవిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హరి. ఈ సినిమాకు సంగీతం: యాజమాన్య. -
తల్లిదండ్రుల గొప్పతనం చెబుతుంది
‘‘సాధారణంగా పుట్టుకతోనే అనాథలుగా మిగిలేవారికి, పుట్టిన తర్వాత అనాథలుగా మారేవారికి సమాజంలో గుర్తింపు ఉండదు. అటువంటి వారిని పట్టించుకోకపోతే వారు నేరస్థులుగా మారే అవకాశం ఉంది. అనాథలకు సంబంధించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘సత్యగ్యాంగ్’’ అని సుమన్ అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సుమన్ మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో అనాథలపై అద్భుతమైన సాంగ్ ఉంది. చంద్రబోస్‌గారు చక్కగా రాశారు. సాత్విక్‌కి హీరోగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేస్తున్న మంచి పనులు, తెలంగాణ అభివృద్ధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఏదైనా చేయాలని ఆయన్ను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో నా మద్దతు ఉంటుంది. హోదా వద్దు స్పెషల్ ప్యాకేజ్ కావాలనుకున్న సమయంలో ప్రధాని మోదీగారితో చంద్రబాబు నాయుడుగారే మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అసలు.. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలియజేస్తేనే కదా? వారికి ప్రత్యేక హోదా కావాలో? ప్రత్యేక ప్యాకేజీ కావాలో? నిర్ణయం తీసుకునేది’’ అన్నారు సుమన్. -
అనాథలు ఉండకూడదని...
‘‘చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఈ చిత్రంలో చెప్పాం. ‘సత్య గ్యాంగ్’ సినిమాకి కథే మెయిన్ హీరో’’ అని నిర్మాత మహేష్ ఖన్నా అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సత్య గ్యాంగ్’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ ఖన్నా మాట్లాడుతూ– ‘‘నలుగురు అనాథ కుర్రాళ్ల వల్ల ఒక ్రౖకైమ్ జరుగుతుంది. దానివల్ల వాళ్లెలాంటి ఇబ్బందులు పడ్డారు? అన్నదే సినిమా. గ్యాంగ్ వార్స్, లవ్ ట్రాక్ ఉంటుంది. భవిష్యత్తులో సమాజంలో అనాథలు ఉండకూడదని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ చిత్రానికి కథ, మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశా. ఎన్నో సినిమాల్లో నటించిన నేను తొలిసారి ఈ సినిమా నిర్మించా. కమర్షియల్ పాయింటాఫ్ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తీశాం. భారతదేశంలోని యువత ఏ విధంగా ఉండాలి? పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందని చూపించాం. సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాం. 150 థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
సరైన పరిష్కారం!
గ్యాంగ్‌లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్‌గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్కు మర్డర్‌కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్‌కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్‌ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి. -
నవరసాలతో ప్రశ్నిస్తా
‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, టామి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు నవ్వులు పంచిన దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. మనీష్‌బాబుని హీరోగా పరిచయం చేస్తూ తాజాగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయిక. బి.శేషుబాబు సమర్పణలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బాబీ (కె.ఎస్.రవీంద్ర) క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని ఇరవై ఏళ్ల కిందట నా స్నేహితుడు రాజా వన్నెంరెడ్డిని కోరా. అది నా బాధ్యత అని చెప్పిన ఆయన ఈరోజు హీరోగా పరిచయం చేస్తున్నారు’’ అన్నారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్ వెనకాలే ఉంటుంది. నా ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ సినిమా విడుదలైన తర్వాత ఉదయం ఆరుగంటలకే ఎందరి నుంచో ఫోన్లు వచ్చేవి. సక్సెస్ లేనప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. నవరసాలతో కూడిన చిత్రమిది. మా గురువు దాసరిగారితో ఓ సినిమా తీద్దామనుకున్నా. ఆయన దేవుని వద్దకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నా నాకు ఆశీర్వాదాలు ఉంటాయి’’ అన్నారు. మనీష్‌బాబు, అక్షిత, సంగీత దర్శకుడు ప్రేమ్, రచయిత రాజేంద్రకుమార్, బి.వి.రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యోగిరెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీష్ రెడ్డి, సహ నిర్మాతలు: కె.నారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి. -
సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి!
‘‘అనాథలకు సంబంధించిన కథతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. ఈ చిత్రంలో చంద్రబోస్‌గారు అనాథలపై రాసిన పాట బాగుందని అందరూ అంటున్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం కోటీ యాభైలక్షలు విలువ చేసే స్థలాన్ని అనాథలకు ఉచితంగా ఇచ్చా. మా సినిమా చూడండి. బాగా లేకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’’ అని నిర్మాత మహేశ్ ఖన్నా అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన‘సత్యగ్యాంగ్’ త్వరలో విడుదల కానుంది. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అనాథలపై ఓ మంచి పాట రాశా. ఇందుకు మహేశ్ ఖన్నాగారికి, ప్రభాస్‌గారికి థ్యాంక్స్. నా పాట విని, కీరవాణిగారు అభినందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘సత్యగ్యాంగ్’ వంటి మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అన్నారు సాత్విక్ ఈశ్వర్. ఈ చిత్రానికి నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం–దర్శకత్వం: ప్రభాస్. -
వినోదాత్మక సందేశం
సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. ఈ చిత్రానికి ప్రభాస్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించారు. మహేష్ ఖన్నా నిర్మాత. ఈ సినిమా ఆడియో సక్సెస్‌మీట్ కర్నూలులో నిర్వహించారు. మహేష్ ఖన్నా మాట్లాడుతూ– ‘‘సమాజంలో అనాథలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. మా డైరెక్టర్ ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ మంచి మార్కులు సంపాదించారు. మార్చి 15న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చిందన్నా.. మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందన్నా అందుకు కారణం మా నిర్మాత మహేష్ ఖన్నా’’ అన్నారు ప్రభాస్. ‘‘ సాత్విక్ ఈశ్వర్, అక్షిత, సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
నచ్చకుంటే డబ్బు వాపసు
సొసైటీలో అనాథలను లేకుండా చేయాలనే సందేశాత్మక కథకి వినోదం జోడించి రూపొందించిన సినిమా ‘సత్య గ్యాంగ్’. సాత్విక ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని అనాథ బాలల చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా మహేశ్ ఖన్నా వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. సినిమాపై మాకున్న నమ్మకం వల్ల ఇలా అంటున్నాం. త్వరలోనే ఆడియో లాంచ్ చేస్తాం’’ అన్నారు మహేశ్ ఖన్నా.