
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారి చేతుల మీదగా ఇటీవల విడుదలైన మా సినిమా పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. వీడియో పాటలను జయప్రదగారు, క్రిష్, రవితేజగారు రిలీజ్ చేశారు.
సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది మా హరికృష్ణకి సపోర్ట్ చేయడం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘వైఎస్ జగన్‌గారు విడుదల చేసిన మా చిత్రం పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘అట్ట చూడమాకే...’ సాంగ్ విడుదల చేసిన జయప్రదగారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరువలేను. క్రిష్‌గారు, రవితేజగారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు’’ అన్నారు హరికృష్ణ. అక్షిత, సంగీత దర్శకుడు యాజమాన్య, పాటల రచయిత రాంబాబు గోసాల, ‘ఆదిత్య’ నిరంజన్ పాల్గొన్నారు.