
జొన్నలగడ్డ శ్రీనివాస్, హరికృష్ణ, సావిత్రి, వైయస్ జగన్
‘‘మా అబ్బాయి హరికృష్ణకు వైఎస్ జగన్‌గారంటే అభిమానం. మా ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రంలోని ఒక్క పాటైనా ఆయన చేతుల మీదగా లాంచ్ చేయాలని మా అబ్బాయి పట్టు పట్టాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తోన్న జగన్‌గారిని కలిశాం. మా సినిమా పాటలను ఆయన విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా భాగ్యలక్ష్మి సమర్పణలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’.
యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం ఆడియోను వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ జగన్‌గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమా పాటలు లాంచ్ చేసి, మా అబ్బాయికి ఆశీర్వాదాలు అందించారు. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం సంతోషాన్ని ఇచ్చింది. ఈనెల రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేనెంతో అభిమానించే జగన్‌గారు మా చిత్రం ఆడియో లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాకూ మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరికృష్ణ జొన్నలగడ్డ.