Jonnalagadda Srinivasa Rao
-
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్
జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. కాగా ‘ఆటో రజిని’ యూనిట్ గురువారం సాయంత్రం నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను వైఎస్ జగన్‌కి చూపించారు. శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘‘ హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆటో రజిని’. ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నందిగం సురేష్ అన్న, హరి కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ నేతృత్వంలో చిత్రీకరించాం. జూన్ 10 నుంచి తర్వాతి షెడ్యూల్ విజయవాడలోనే ప్రారంభిస్తాం. మా సినిమా షూటింగ్‌కి సహకరించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. -
హీరోతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ సందడి.. ఫోటోలు వైరల్
సాక్షి, చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నగరంలోని జక్కంపూడి కాలనీలో సోమవారం సినిమా షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా ఆటో రజనీ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ సమీప ప్రాంతాల్లో టైటిల్ సాంగ్‌ను చిత్రీకరణ చేయగా, హీరోతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హరికృష్ణ మాట్లాడుతూ.. ఆటో రజనీ పూర్తి మాస్ చిత్రమని, ఇందులో తాను రజనీకాంత్‌కు వీరాభిమాని పాత్ర చేస్తున్నానన్నారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీఎం జగన్ అభిమాని క్యారెక్టర్ చేయాలని కోరడంతో తాను ఒప్పుకున్నట్లు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారని, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని వివరించారు. -
ఆటో రజినికి ఆశీస్సులు
జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటో రజిని’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ చిత్రం ప్రారంభమైంది. బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘హరికృష్ణ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమే మంచి మాస్ ఎంటర్టైనర్ కావడం ఆనందంగా ఉంది. సీయంగా ఎంతో బిజీగా ఉండి కూడా మా హీరోకి జగన్‌గారి బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది. ఎలక్షన్ టైమ్‌లో మేము చేసిన ‘జననేత జగనన్న..’ పాట గురించి ప్రత్యేకంగా ఆయన మమ్మల్ని అభినందించటం జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు. -
సీఎం జగన్ ఆశీస్సులతో ‘ఆటో రజని’
జేఎస్సార్ మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఆటో రజని’. ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవర్‌పుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు అందించారు. ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్ర యూనిట్ సీఎం జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంది. సీఎం జగన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన తమ హీరోకి బ్లెస్సింగ్స్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్. సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రంగా ‘ ఆటో రజని’ నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము చేసిన ‘జననేత జగనన్న’ పాట గురించి ప్రత్యేకంగా జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేమమన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే దలవుతుందని వెల్లడించారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. -
సీఎం జగన్ ఆశీస్సులతో ‘ఆటో రజని’
-
సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత కథానాయికగా నటించారు. ఝాన్సీ కీలక పాత్ర చేశారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన నటుడు శ్రీకాంత్ ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావుకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఆయన తనయుడు హరిని హీరోగా పరిచయం చేస్తూ, తనే ఈ సినిమా అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారు. హరి బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. భవిష్యత్‌లో స్టార్ అవుతాడు’’ అన్నారు. ‘‘కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకి కొందరు ఇచ్చిన సలహాలు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. ‘‘ప్రేమకు కొత్త అర్థం చెప్పే చిత్రమిది. స్నేహం విలువను చాటిచెప్పే కథ’’ అన్నారు హరికృష్ణ. రచయిత మరుదూరి రాజా, నటుడు కాశీవిశ్వనాథ్, హీరోయిన్ అక్షిత మాట్లాడారు. -
‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
తన కుమారుడు హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. జొన్నలగడ్డ శ్రీనివాసరావు.. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ, అక్షిత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు శ్రీకాంత్ సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ.. అన్ని బాధ్యతలను తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా ప్యాషన్‌తో శ్రమించాడు. హరిలో మంచి జిల్ ఉంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడ’ని అన్నారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు గత చిత్రాల్లో నేను నటించాను. నచ్చావులే తర్వాత అలాంటి మంచి పాత్ర ఈ సినిమాలో దొరికింది. ఆ సినిమా కన్నా ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాల’ని కోరారు. మరుదూరి రాజా మాట్లాడుతూ.. హరిలో మంచి ఫైర్ ఉందన్నారు. మంచి కథతో హరి హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిపారు. హీరో, ఝాన్సీ పాత్రల మధ్య సవాల్‌తో ఈ కథ నడుస్తుందని పేర్కొన్నారు. సినిమా కోసం తండ్రీ కొడుకులిద్దరూ ఎంతగానో కష్టపడ్డారని చెప్పారు. హరికృష్ణ మాట్లాడుతూ.. రెగ్యూలర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి ఉంటే సరిపోతుందని అనుకుంటారు.. కానీ స్నేహితుడు లేకపోతే ప్రేమ లేదని చెప్పే సినిమా ఇది అని తెలిపారు. దర్శకనిర్మాతలు తల్లిదండ్రులైనా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అన్నారు. చాలా సన్నివేశాలు ఎమోషన్‌తో నడుస్తాయని తెలిపారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్‌తో పాటు చాలా సినిమాలకు నేను పనిచేసాను. తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అల్లు అరవింద్ మా సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంద’ని తెలిపారు. -
ఫిబ్రవరి 22న ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ ఈ సినిమానునిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేసాను. దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా. కథ వైవిధ్యంగా ఉందనే నా కుమారుడిని ఈ సినిమా తో హీరోగా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇండస్ట్రీ పెద్దల సహకారం, సూచనలతో ఫిబ్రవరి 22వ తేదిన రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’ అని అన్నారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘అన్నీ జనరేషన్లకు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తే ఓ కొత్త కథను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాకు మీడియా కూడా మంచి పబ్లిసీటీ ఇచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తాం’ అన్నారు. -
ఎదురులేని మనిషి
హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై భాగ్యలక్ష్మి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రబృందం ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే సాంగ్ రూపొందించారు. ఈ పాటను వైఎస్ జగన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లా డుతూ –‘‘జగన్‌గారి అభిమాని, మా హీరో హరి కోరిక మేరకు ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించాం. ఈ పాట వైఎస్‌గారి అభిమానులకు, జగన్‌గారిని ప్రేమించే వారికి నచ్చేలా ఉంటుంది. సీడీలను ఆవిష్కరించిన జగన్‌గారు మా హీరో హరి, చిత్ర యూనిట్‌ను అభినందించారు’’ అన్నారు. ‘‘ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకులు జగన్‌గారి కోసం ఓ పాట చేద్దామనే ఆలోచన వచ్చింది. నాన్నగారికి చెప్పటంతో ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించారు’’ అన్నారు హరి జొన్నలగడ్డ. అక్షిత, ఝాన్సీ, గంగారావు నటించిన ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ చిత్రానికి కెమెరా: పి.ఎస్ వంశీ ప్రకాశ్. -
జగన్‌గారంటే ఎంతో అభిమానం
‘‘మా అబ్బాయి హరికృష్ణకు వైఎస్ జగన్‌గారంటే అభిమానం. మా ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రంలోని ఒక్క పాటైనా ఆయన చేతుల మీదగా లాంచ్ చేయాలని మా అబ్బాయి పట్టు పట్టాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తోన్న జగన్‌గారిని కలిశాం. మా సినిమా పాటలను ఆయన విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా భాగ్యలక్ష్మి సమర్పణలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం ఆడియోను వైఎస్. జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ జగన్‌గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమా పాటలు లాంచ్ చేసి, మా అబ్బాయికి ఆశీర్వాదాలు అందించారు. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం సంతోషాన్ని ఇచ్చింది. ఈనెల రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేనెంతో అభిమానించే జగన్‌గారు మా చిత్రం ఆడియో లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాకూ మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరికృష్ణ జొన్నలగడ్డ. -
హరికృష్ణ మంచి హీరో అవుతాడు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత హీరోయిన్. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావు మంచి దర్శకుడు. ‘ఎదురులేని మనిషి, జగపతి, బంగారు బాబు, ఢీ అంటే ఢీ’ వంటి చాలా సినిమాలు చేశారు. హరికృష్ణ నటన, డాన్స్ చూస్తుంటే మంచి హీరో అవుతాడనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. హరికృష్ణకి మంచి ఎనర్జీ ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్. ‘‘నిజజీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో తీసిన సినిమా ఇది. లవ్ స్టోరీ అయినా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇది నా 9వ సినిమా. క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాలో హైలైట్. త్వరలోనే í విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. రచయిత పరచూరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్లు డాలీ, కిశోర్ కుమార్, హరికృష్ణ, అక్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భాగ్యలక్ష్మి, సంగీతం: యాజమాన్య, కెమెరా: పి.ఎస్. వంశీ ప్రకాష్. -
కాన్వెంట్ టీచర్ కహానీ!
ఢీ అంటే ఢీ అని రెడీ అయిపోయారు శ్రీకాంత్. ఆయన చేసిన తాజా చిత్రం పేరిది. స్వీయదర్శకత్వంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో జొన్నలగడ్డ రూపొందించిన ఈ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంటుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా బ్రహ్మానందం చేసిన రెండు పాత్రలూ బ్రహ్మాండంగా ఉంటాయి. కొడుకు పాత్ర వయసు తొమ్మిది. దీన్నిబట్టి వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు’’ అన్నారు. రచయిత రాజేంద్రకుమార్ మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రీకాంత్‌గారు కాన్వెంట్ టీచర్ పాత్ర చేశారు. ఛోటా భీమ్ పాత్ర చేయాలని చెప్పగానే బ్రహ్మానందంగారు చాలా ఎగ్జయిట్ అయ్యారు’’ అని చెప్పారు. జొన్నలగడ్డ మాట్లాడుతూ -‘‘భూపతిరాజాగారు చెప్పిన కథ నచ్చి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించాలనుకున్నాను. అప్పుడు సీయస్ రెడ్డి, జి. జ్యోతిక సహనిర్మాతలు చేస్తామని ముందుకొచ్చారు. కొంతమంది సాంకేతిక నిపుణులు పారితోషిం తీసుకోకుండా చేశారు. వినోదం, వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రం ఇది’’ అన్నారు. పంజాబీలో చాలా చిత్రాలు చేశాననీ, తెలుగులో ఇది తొలి చిత్రమనీ కథానాయిక సోనియా మాన్ తెలిపారు. -
యాంగ్రీమేన్గా శ్రీకాంత్
ఓ యాంగ్రీమేన్ తన సెలవుల్ని పిల్లలతో గడపాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వంలో సి.ఎస్.రెడ్డి-జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి సావిత్రి కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. వీఎన్ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘చిన్న పిల్లలందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని దర్శకుడు తెలిపారు. తెలుగులో తనకిదే తొలి చిత్రమని కథానాయిక సోనియా మాన్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సీహెచ్ గోపీనాథ్.