![Auto Rajini Movie Team Hulchul In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/29/Auto-Rajini.jpg.webp?itok=LJm0Cwad)
సాక్షి, చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నగరంలోని జక్కంపూడి కాలనీలో సోమవారం సినిమా షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా ఆటో రజనీ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ సమీప ప్రాంతాల్లో టైటిల్ సాంగ్‌ను చిత్రీకరణ చేయగా, హీరోతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ స్టెప్పులేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హరికృష్ణ మాట్లాడుతూ.. ఆటో రజనీ పూర్తి మాస్ చిత్రమని, ఇందులో తాను రజనీకాంత్‌కు వీరాభిమాని పాత్ర చేస్తున్నానన్నారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీఎం జగన్ అభిమాని క్యారెక్టర్ చేయాలని కోరడంతో తాను ఒప్పుకున్నట్లు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారని, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment