ఎదురులేని మనిషి | YS Jagan Launches Prementha Panichese Narayana Audio | Sakshi
Sakshi News home page

ఎదురులేని మనిషి

Published Mon, Aug 6 2018 6:19 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

YS Jagan Launches Prementha Panichese Narayana Audio - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, శివ, శ్రీనివాసరావు

హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. జెఎస్‌ఆర్‌ మూవీస్‌ పతాకంపై భాగ్యలక్ష్మి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రబృందం ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే సాంగ్‌ రూపొందించారు. ఈ పాటను వైఎస్‌ జగన్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లా డుతూ –‘‘జగన్‌గారి అభిమాని, మా హీరో హరి కోరిక మేరకు ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించాం. ఈ పాట వైఎస్‌గారి అభిమానులకు, జగన్‌గారిని ప్రేమించే వారికి నచ్చేలా ఉంటుంది. సీడీలను ఆవిష్కరించిన జగన్‌గారు మా హీరో హరి, చిత్ర యూనిట్‌ను అభినందించారు’’ అన్నారు. ‘‘ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకులు జగన్‌గారి కోసం ఓ పాట చేద్దామనే ఆలోచన వచ్చింది. నాన్నగారికి చెప్పటంతో ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించారు’’ అన్నారు హరి జొన్నలగడ్డ. అక్షిత, ఝాన్సీ, గంగారావు నటించిన ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ చిత్రానికి కెమెరా: పి.ఎస్‌ వంశీ ప్రకాశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement