audio launch event
-
అప్పుడే మంచి సినిమాలు వస్తాయి: సుమన్
చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. నూతన దర్శకులను, చిన్న చిత్రాలను ప్రొత్సహిస్తేనే మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు సీనియర్ హీరో సుమన్. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజా మార్కండేయ". "వేట మొదలైంది" అనేది ఉప శీర్షిక.చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలోని ఒక్కో పాటను విచ్చేసిన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్ ను రాపోలు భాస్కర్ విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. "రాజా మార్కండేయ" సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసినట్టు ఉంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి" అన్నారు.సంగీత దర్శకులు యస్ కె. మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. "బన్నీ ఆధ్వర్యంలో ఫోర్ ఫౌండర్స్ టీం మమ్ములను తీసుకొచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించారు. వారివల్లే మేము ఇండస్ట్రీకి రాగలిగాము. ఆడియోతోపాటు సినిమాని కూడా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అధ్బుతంగా వున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది" అన్నారు.దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. "ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలని నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన మా నిర్మాతలకు, స్నేహితులకి ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసి వర్క్ చేశారు.. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. మా సినిమా ప్రేక్షలందరికి నచ్చుతుంది" అన్నారు. ‘సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత సామా శ్రీధర్ అన్నారు. -
రేవు ఆడియో లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో సెలబ్రిటీల జోష్ (ఫోటోలు)
-
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్. గోల్డెన్ స్టూడియోస్ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్వీ ఉదయకుమార్ మాట్లాడుతూ ప్రూఫ్ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్‌గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.అయితే మేకింగ్ స్టైల్ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్ ఉండాలి.. ఇంటర్వెల్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్ సరిగా సెట్ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్‌కు తగినట్లుగా చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్ వదన్, మెమ్గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్ సంగీతం అందించారు. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
విజయ్ ఏమంటాడోనని తెగ భయపడిపోయా..: డైరెక్టర్
పాప్ సురేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ కన్గళ్. ప్రతాప్ నిర్మించిన ఈ మూవీలో డాలీ ఐశ్వర్య హీరోయిన్గా నటించారు. చార్లెస్ ధనా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు ప్రజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇరవిన్ కన్గళ్ఆడియో లాంచ్ దర్శకులు కథ సరిగా చెప్పట్లేదు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు పాప్ సురేష్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా ప్రారంభించిన ఈ చిత్రం విడుదలవుతుందా? అనే సందేహం కలిగిందన్నారు. అలాంటిది ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాప్ సురేష్ కథను చాలా బాగా చెబుతారని, నటుడు ప్రజన్ చెప్పారని.. నిజానికి ఇప్పుడు దర్శకులు కథను చెప్పడం లేదన్నారు. ఇంతకు ముందు కథ చెప్పగానే చిత్రం చూసినట్లు ఉండేదన్నారు. కొందరైతే చెప్పిన కథను అలానే తెరకెక్కించలేకపోతున్నారని, అక్కడే సమస్య తలెత్తుతుందన్నారు. తిరుపాచ్చి సినిమాలో ఓ స్టిల్ టాప్ 5లో ఉన్నా.. తాను తిరుపాచ్చి చిత్రానికిగానూ విజయ్‌కు కథ చెప్పి తెరకెక్కించానని, అయితే చిత్రం పూర్తి అయిన తరువాత ప్రసాద్ ల్యాబ్‌లో తానూ, విజయ్ కలిసి చిత్రాన్ని చూశామని అనంతరం విజయ్ ఏమంటారోనని బిక్కు బిక్కుగా ఉన్నానన్నారు. అయితే ఆయన మీరు కథ చెప్పిన దాని కంటే మూడు రెట్లు బాగా చిత్రం వచ్చిందని చెప్పారన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది టాప్ 10 దర్శకుల్లో మీరు ఉంటారని చెప్పారన్నారు. అయితే ఆ ఏడాది టాప్ ఐదుగురి దర్శకుల్లో తాను ఉన్నానని చెప్పారు. కాగా ఇరవిన్ కన్గళ్ చిత్రాన్ని ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేరరసు పేర్కొన్నారు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
అటు డాక్టర్‌గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్ టక్కర్..
ధీరజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్ టక్కర్. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని, గౌతమ్ రాజేంద్రన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్ మాట్లాడుతూ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్ టక్కర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్ చేసిన దర్శకుడు రవికుమార్, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్ టక్కర్ టైటిల్.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్ అయిన ధీరజ్ ఇప్పుడు యాక్టర్‌గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కు పెళ్లయిపోయింది -
పాత సినిమాల పోస్టర్లు అలా ఉండేవి.. కానీ ఇప్పుడు?: వైరముత్తు
మాపిల్ లీఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు ఈవీ గణేష్ బాబు కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కట్టిల్. ప్రముఖ ఎడిటర్ బి.లెనిన్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రంలో సృష్టిడాంగే హీరోయిన్గా నటించారు. వైరముత్తు మదన్ పాటలను రాసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. తుపాకీ శబ్ధాల మధ్య పిల్లనగ్రోవిలా ఉంటుందీ సినిమా ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ కట్టిల్ వంటి చిన్న చిత్రాలు బాగా ఆడితేనే తమిళ సినిమాకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలతోనే ప్రతిభావంతులైన నూతన కళాకారులు లభిస్తారన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చూడాలని ఆసక్తిని కలిగిస్తాయని.. అలాంటి తుపాకీ శబ్దాల మధ్య గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో పిల్లల గ్రోవి వాయిస్తున్నారని పేర్కొన్నారు. మంచి కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు మన మనసుల్ని ఉల్లాసపరిచి గాల్లో తేలేలా చేస్తాయన్నారు. కట్టిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణలో ప్రముఖులతో యూనిట్ సభ్యులు అలాంటివి చూస్తున్నారా? ఇలాంటి చిత్రాలే ఆలోచనలను పెంచుతాయన్నారు. పాత సినిమాల పోస్టర్లను చూస్తే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలను చూడగలుగుతున్నామా..? అని ప్రశ్నించారు. మహిళలకు సమానత్వం కలిగించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజయినప్పుడే అది మంచి కాలం అనీ, అలాంటి కాలాన్ని గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో తీసుకొచ్చారని వైరముత్తు పేర్కొన్నారు. ఆయన భావాలను, బాధను తెరపై ఆవిష్కరించిన చిత్రం కట్టిల్ అనీ, ఈ చిత్ర గీత రచయిత మదన్ కార్తీకి, దర్శకుడు గణేష్ బాబుకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
ఫ్రెండ్షిప్ నేఫథ్యంలో వస్తున్న కుంబారి.. ఆడియో రిలీజ్!
రాయల్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై టి.కుమారదాస్ నిర్మిస్తున్న చిత్రం 'కుంబారి'. ఈ చిత్రంలో విజయ్ విశ్వ, నటి నలీఫ్ జియా, మహిళా సంజీవి నాయకిగానూ, జాన్ విజయ్ పరుత్తివీరన్ సరవణన్, శ్యామ్స్, మధుమిత, సెంథి, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కవి జోసెఫ్ కథ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ చిత్రానికి జై ప్రకాష్ జై సన్, పృథ్వీ కలిసి సంగీతమందించారు. తాజాగా ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్ కుమార్, ఎస్సార్ ప్రభాకరన్, శరవణ శక్తి, జీవ, అప్పుకుట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఈ సందర్భంగా నిర్మాత కుమార్ దాస్ మాట్లాడుతూ.. స్నేహం కథాంశంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రేమ, వినోదం, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు మంచి జనరంజకమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా చిన్న చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారని, ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రముఖ స్టార్స్ తయారవుతున్నారని ఆయన అన్నారు. అప్పట్లో చిన్న చిత్రంలో నటించిన శివాజీరావు అనే వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ విశ్వ మాట్లాడుతూ.. కుంబారి చిత్ర షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాత చిత్ర బడ్జెట్ గురించి ఆలోచించ వద్దని మొదట్లోనే చెప్పారన్నారు. చిత్రం బాగా వచ్చిందని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
Jailer Audio Launch Photos: రజనీకాంత్ 'జైలర్' సినిమా ఆడియో లాంచ్.. సందడి చేసిన స్టార్లు (ఫోటోలు)
-
అలా.. హిట్ కావాలి
ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ హిందూపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌కి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ ‘ఆలా ఇలా ఎలా’ చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు చూసాం, చాలా బాగుంది, ఇలాంటి వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ ‘ఆలా ఇలా ఎలా’ ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మేము ఎంత విజయం సాధించామో నిర్మాత నాగరాజు గారు కూడా ఈ చిత్రం తో సినీరంగం లో కూడా అంతటి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు. హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం 83 రోజులు శ్రమించాం. మా డైరెక్టర్ రాఘవ ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా చాలా బాగుంటుంది.అందరికి నచ్చుతుంది’అని తెలిపారు. -
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
పొన్నియిన్ సెల్వన్ తీయాలంటే ధైర్యం కావాలి
‘‘పొన్నియిన్ సెల్వన్ ’ చిత్రాన్ని తీయాలంటే ధైర్యం కావాలి.. అది డైరెక్టర్ మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ గార్లకు ఉంది. అందుకే ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది’’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. సుభాస్కరన్ , మణిరత్నం నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుకని చెన్నైలో నిర్వహించారు. ఈ మూవీ ఆడియోను కమల్ హాసన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పొన్నియిన్ సెల్వన్ ’ నవల రాసిన కల్కీని చూసి ఇతర రచయితలు అసూయ పడుతున్నట్లుగా, మణిరత్నంగారిని చూసి రచయితలు, దర్శకులు అసూయ పడుతున్నారు.. వారిలో నేనూ ఒకణ్ణి. ఈ మూవీలో నటించే అవకాశం నాకు మిస్ అయ్యింది. తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగమే. దీన్ని కాపాడుకోవాలి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ఈ వేడుకలో తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమరుగన్, దర్శకుడు భారతీరాజా, నటుడు శింబు, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవివర్మన్ కెమెరామేన్‌గా పనిచేశారు. -
తల్లిదండ్రుల్ని పట్టించుకోని స్టార్ హీరో.. వారిని నిజంగానే అవమానించాడా?
దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు. కాగా.. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది. -
అలా ఎందుకు చేశానా అని ఇప్పటికి చింతిస్తున్నా: ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్(తమిళంలో వాతి). తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాష(తెలుగు, తమిళం) తెరకెక్కిన ఈచిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విద్యా వ్యవస్థ నేపథ్యం రూపొందిన ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ తన స్టూడెంట్ లైఫ్‌ని గుర్తు చేసుకున్నాడు. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చదువును నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని, తనలా ఎవరూ చేయొద్దని అభిమానులకు సూచించాడు. ‘‘మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నా పిల్లల్ని చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేస్తూ అల్లరి చేసేవాడిని. చదవడానికి కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరా. ట్యూషన్ టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాడిని. ట్యూషన్‌కి కూడా సరిగా వెళ్లకుండ బయట ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసేవాడిని. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. నేను వచ్చిన విషయం తనకి తెలియాలని బైక్ సౌండ్ చేస్తుండేవాడిని. అది గమనించిన మా ట్యూషన్ టీచర్ ‘మీరంతా బాగా చదువుకుని పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు మాత్రం వీధుల్లో డాన్స్ చేసుకోవాల్సిందే’ అన్నారట. ఆయన చెప్పినట్లు తమిళనాడులో నేను డాన్స్ చేయని వీధి లేదు(నవ్వుతూ చెప్పాడు). ఇక వెనక్కి తిరిగి చూస్తే నేనెందుకు చదువుని నిర్లక్ష్యం చేశానా? అని చింతిస్తున్నా. మీరు నాలా చేయకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. -
సార్ ఆడియో లాంచ్: స్టేజీపై పాట పాడిన ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ధాత్రి. తెలుగులో సార్ అనే పేరును నిర్ణయించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాల ఆవరణలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న కెప్టెన్ మిల్లుల చిత్ర గెటప్‌లో రావడం విశేషం. మరో విషయం ఏంటంటే ఆయన ఇద్దరు వారసులు లింగ, యాత్ర పాల్గొనడం మరో విశేషం. వేదిక ముందు ధనుష్‌కు ఇరువైపులా ఆయన కొడుకులు కూర్చోవడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్‌మనిపించారు. కాగా వేదికపై ధనుష్ చిత్రంలోని పాటను పాడి అభిమానులను అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వెంకీ తనకు లాక్డౌన్ టైంలో చెప్పారన్నారు. కథ నచ్చడంతో ఓకే చెప్పానన్నారు. ఇది 1990లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వడచెన్నై పార్ట్– 2 ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం దర్శకుడు వెట్రిమారన్‌ను అడగాలని, అయితే సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. #Dhanush X #SwethaMohan 🥺❤️#Vaathipic.twitter.com/H46Bfxewyr — AmuthaBharathi (@CinemaWithAB) February 5, 2023 చదవండి: పెళ్లి బిజీలో కియారా అద్వానీ, డ్యాన్సింగ్ టైం అంటున్న చరణ్ నయనతారను పొగిడిన షారుక్ -
స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్, వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం వారిసు(తెలుగులో వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజగా చిత్రం బృందం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్ ఎలా ఉందంటే! స్టేజ్ హీరో విజయ్, రష్మికకు దిష్టి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలోని రంజితమే.. రంజితమే.. పాట గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లో ఎక్కడ చూసిన ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సూపర్ హిట్ సాంగ్‌కు లైవ్‌లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది నటి రష్మిక మందన్నా. అభిమానులకు కోసం డాన్స్ చేయాలని కోరడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి ఆమె ఈ పాటకు కాలు కదిపింది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి ఇక రష్మిక డాన్స్ చూసి హీరో విజయ్‌తో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో విజయ్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. రష్మికపై ప్రశంసలు కురిపించాడు. రష్మికను ఉద్దేశిస్తూ.. ఆమె మంచి నటి. రీల్, రియల్ లైఫ్‌లోనూ ఒకేలా ఉంటుంది. స్టార్ నటి అయిన ఒదిగి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కోసం అందరి ముందు లైవ్‌లో డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆమెపై అందరి దృష్టి పడకుండా దిష్టి తీస్తున్నా’ అంటూ సరదాగా ఆయన తమిళంలో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియోను చూసి రష్మిక ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Rashmika Dance for #Ranjithame (HD) #Varisu • @actorvijay 🤩🔥#VarisuSecondSingle #VarisuAudioLaunch #VarisuUpdate pic.twitter.com/1OEHn02oSa — VMI IT WING HEAD-KUMBAKONAM YOUTH WING (@KUMVMIITWING) January 1, 2023 -
చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదు : డైరెక్టర్ ఆవేదన
తమిళసినిమా: చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని ఎం కళైంజియం ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్ న్యూస్ ఫిలిం పతాకంపై జవహర్ సమర్పణలో శ్రీమతి రతి జవహర్ నిర్మింన చిత్రం కల్లరై. ఏబీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఇందులో నూతన తారలు నటించారు. రాంజీ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియా, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లీ మ్యాజిక్ ల్యాంటన్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆర్.ముత్తరసన్, నిర్మాత, నటుడు కే రాజన్, దర్శకుడు ఎం కళంజియం, సంగీతకుడు సౌందర్యన్, నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యుడు విజయ మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రతి జవహర్ మాట్లాడుతూ.. ఇది తమ తొలి ప్రయత్నం అని, దర్శకుడు అనుకున్న బడ్జెట్లో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిం ఎంతగానో సహకరించారని చెప్పారు. రాజన్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమను బతికించేది చిన్న చిత్రాల నిర్మాతలే అన్నారు. ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకొస్తే ఈ నిర్మాతలు మళ్లీ చిత్రం చేస్తారన్నారు. పెద్ద చిత్రాల హీరోల వల్ల ఎవరికి ఏమీ వొరిగేది లేదని.. వారు సంపాదించుకోవడమేనని అన్నారు. దర్శకుడు ఎం కలైంజయం మాట్లాడుతూ.. చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని, పెద్ద హీరోల చిత్రాలే థియేటర్లను ఆక్రమిస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ తగిన చర్యలు తీసుకుని చిన్న చిత్రాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
టాలీవుడ్‌కి యువత రావాలి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలోనే ఉంటుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలకు తలసాని శ్రీనివాస్, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. యువత చూడాల్సిన చిత్రం ‘చెప్పాలని ఉంది’’ అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘‘మన యూత్ సినిమా ఇది.. థియేటర్లో చూద్దాం’’ అన్నారు నిఖిల్. ‘‘అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం ఒక విధంగా పాన్ ఇండియా ఫిలిం’’ అన్నారు అరుణ్ భారతి. యష్ పూరి, స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు అస్లాం కీ, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు. -
'కోలీవుడ్‌లో నిర్మాతలకు విలువ లేదు.. అందుకే తెలుగులో తీస్తున్నారు'
తమిళసినిమా: నృత్య దర్శకుడు దినేష్,యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం లోకల్ సరుకు. నటి ఉపాసన నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రేమ కథా త్రం అని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నిర్మాత, నటుడు కె.రాజన్, నటుడు రాధారవి, సంగీత దర్శకుడు శంకర్ గణేష్, విజయ్‌మురళి, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పెప్సీ శివ, గీత రచయిత స్నేహన్, నటి ఇనియ, సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దినా తదితరులు పాల్గొన్నారు. నటుడు కె.రాజన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న రాజేష్ నిర్మితగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. అయితే తమిళ సినీ రంగంలో నిర్మాతకు విలువ లేదని అందుకే ఆర్బీచౌదరి వంటి వారు కూడా ఇప్పుడు తమిళంలో చిత్రాలు చేయకుండా తెలుగులో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాజేష్‌కు ఇచ్చే సలహా ఏంటంటే సంగీత దర్శకుడిగా బాగా పేరు తెచ్చుకున్న తర్వాత నిర్మాతగా చిత్రాలలో చేయాలన్నారు. లోకల్ సరుకు చిత్ర ట్రైలర్ పాటలు బాగున్నాయని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నా సినిమా థియేటర్స్‌లో విడుదలై మూడేళ్లు అయ్యింది : విక్రమ్
తమిళసినిమా: పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు విక్రమ్. వైవిధ్యభరిత కథా చిత్రాల కోసం తపించే ఈయన తాజాగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని వీఆర్ మాల్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు విక్రమ్ వారసుడు, నటుడు ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తన తండ్రి విక్రమ్ నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు చెప్పారు. కోబ్రా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ చిత్రాలను ఒక్కో జానర్లో తెరకెక్కించారన్నారు. ఈ కోబ్రా చిత్రాన్ని తనదైన శైలిలో వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారని తెలిపారు. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారన్నారు. ఈయన కల్పన కథకు తామంతా సహకరించామని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు థియేటర్లలో విడుదలై మూడేళ్లు అయ్యిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ తిరిగొచ్చామని తెలిపారు. అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తూత్తుక్కుడి, తిరునెల్వెల్లి ప్రాంతాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోబ్రా చిత్రం కోసం చాలా శ్రమించామని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని విక్రమ్ కోరారు. -
శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? -
విక్రమ్ ‘కోబ్రా’ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్
తమిళ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయనకు ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన శనివారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడ ఉంది. అయితే మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గరయ్యారు. చదవండి: సమంత యశోద మూవీ షూటింగ్ పూర్తి, రిలీజ్ డేట్ ఖరారు ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కావేరి ఆస్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్ కొట్టిపారేశారు. ఆయనకు గుండెపోటు రాలేదని, చాతి భాగంలో స్వల్స అస్వస్థత కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఇదిలా ఉంటే నిన్న(జూలై 11న) జరిగిన కోబ్రా మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. స్టేజ్‌పై మాట్లాడుతుండగా విక్రమ్ తన చాతిపై చేయి వేసుకున్నాడు. దీంతో ‘నాకు తెలియకుండానే చాతిపై చేయి వేసుకున్నాను. దీన్ని కూడా గుండెపోటు అంటారేమో’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి అనంతరం రీసెంట్గా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్ని పుకార్లేనన్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తనకు వచ్చింది గుండెపోటు కాదని స్పష్టం చేసేందుకే కోబ్రా ఆడియో లాంచ్‌కు వచ్చానని విక్రమ్ చెప్పారు. అంతేకాక కాస్తా అస్వస్థతగా అనిపించడంతో హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. ఇక తనపై చూపించిన ప్రేమకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు విక్రమ్. కాగా విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు యాక్షన్ ఎంటర్టైనర్గా కోబ్రాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఇందులో ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్‌గా కనిపించనున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #ChiyaanVikram about the rumours about him..😅#CobraAudioLaunch #Cobrapic.twitter.com/7GQ08WD5Ry — Laxmi Kanth (@iammoviebuff007) July 11, 2022 -
ఓటీటీలతో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే: నటుడు
తమిళసినిమా: కణల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. నైటింగేల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయ్బాల నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సమయ మురళి నిర్వహించారు. నటి కావ్యా బెల్లు శ్రీధర్ మాస్టర్, స్వాతికృష్ణన్, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెన్భా, సతీష్ చక్రవర్తి ద్వయం సంగీతాన్ని అందించిన దీనికి భాస్కర్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు. నటుడు రాధారవి ముఖ్య అతిథిగా హాజరైన చిత్ర ఆడియోను ఆవిష్కరించి మాట్లాడారు. చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పారని చాలా బాగుందని పేర్కొన్నారు. నటి కావ్యా బెల్లు చాలా చక్కగా నటించారని ప్రశంసించారు. సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెరిగిపోతున్నాయని, వీటితో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే అని అన్నారు. దర్శకుడు సమయ మురళి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అన్నారు. -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఓటీటీలో ఆదరణ పెరుగుతోంది: నిర్మాత
చెన్నై సినిమా: క్రిమినల్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత ధనుంజయన్ తెలిపారు. కమలా ఆర్ట్స్ పతాకంపై మహేష్ సిపి నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం క్రిమినల్. ఆరుముగన్ దర్శకత్వం వహించిన చిత్రంలో హీరోయిన్గా కొత్త నటి జానవి నటించింది. పీఆర్వో అశ్వద్ పెస్సీ, ఎం.ఎన్.అరవింద్, షైనీ సీ జార్జ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణను గురువారం చెన్నైలో నిర్వహించారు. నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ చిత్ర ట్రైలర్, పాటలు బాగుండటంతో పాటు చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి కలుగుతోందన్నారు. చదవండి: త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు -
నా తొలి సినిమా తమిళంలో చేయాల్సింది: రామ్ పోతినేని
సాక్షి, చెన్నై: తన మొదటి చిత్రాన్ని తమిళంలో చేయాల్సిందని హీరో రామ్ అన్నారు. తాను చెన్నైలో పెరిగి చదివిన కుర్రాడినని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారని.. డీఎస్పీ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తమిళంలో రామ్ కథానాయకుడిగా (తెలుగు, తమిళం) చిత్రం ది వారియర్. చదవండి👉 ది వారియర్: ఒక్క పాటకు మూడు కోట్లు పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు బుల్లెట్ అనే పల్లవితో సాగే పాటను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని లక్స్ థియేటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. చదవండి👉 శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ -
ప్రమోషన్స్‌కు హీరో రాకపోవడమేంటి? డైరెక్టర్ సీరియస్
ఎలాంటి విభేదాలు ఉన్నా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని దర్శకుడు శీను రామస్వామి పేర్కొన్నారు. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ మదియళగన్ నిర్మించిన చిత్రం కల్లన్. కరు.పళనియప్పన్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ రచయిత్రి పాత్రికేయురాలు చంద్ర తంగరాజ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఫస్ట్ కాపీ చూసిన వెంటనే పీకాక్ పిక్చర్స్ అధినేత ఎస్ ఎస్ కుమరన్ విడుదల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు శీను రామస్వామి. ఈ వేడుకలో కథానాయకుడు కరు.పళణియప్పన్ పాల్గొనకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందన్నారు. దర్శకురాలు అవ్వాలన్న తన 20 ఏళ్ల కల ఈ చిత్రం అని డైరెక్టర్ చంద్ర తంగరాజ్ పేర్కొన్నారు. 100 మంది నిర్మాతలు తిరస్కరించిన ఈ కథను విన్న మదియళగన్ వెంటనే నిర్మించడానికి సమ్మతించారని తెలిపారు. -
సినిమా బాగుండకపోతే నా పేరు, బ్యానర్ పేరు వేయొద్దు: దర్శకుడు బాలా
Director Bala Speech at Visithiran Audio Launch: చిత్రం బాగుండకపోతే తన పేరు, బ్యానర్ పేరు వేయవద్దంటానని దర్శకుడు బాలా అన్నారు. ఈయన తన బి.స్టూడియో పతాకంపై నిర్మించిన చిత్రం విసిత్తిరన్. ఆర్.కె.సురేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి పూర్ణ, మధు వైశాలిని నాయికలుగా నటించారు. మలయాళ దర్శకుడు పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నిర్మాత, దర్శకుడు బాలా మాట్లాడుతూ మలయాళ చిత్రం జోసెఫ్ నచ్చడంతో తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నప్పుడు తాను నటిస్తానని ఆర్.కె.సురేష్ అడిగారన్నారు. ఇక మలయాళ దర్శకుడు పద్మకుమార్నే తమిళ వెర్షన్‌కు పని చేయాల్సిందిగా కోరామన్నారు. చిత్రం మళయాళంలో కంటే బాగా వచ్చిందన్నారు. ఆర్.కె.సురేష్ చక్కగా నటించారన్నారు. చదవండి: (నేను మీకు బాగా కావాల్సినవాడిని అంటున్న యంగ్ హీరో) -
సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'కూర్మన్'..
చెన్నై సినిమా: 'కూర్మన్' చిత్రం కొత్తగా ఉంటుందని దర్శకుడు బ్రయన్ బి. జార్జ్ అన్నారు. ఎంకె ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజాజీ, జనని అయ్యర్ జంటగా నటించారు. బాల సరవణన్, అడుగళం సరేన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. టోనీ బిట్టో సంగీతాన్ని, శక్తి అరవింద్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఇది మైండ్ రీడింగ్ ప్రధానాంశంగా రూపొందిన చిత్రమని, సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
'అరాచకాలు చూడలేకపోతున్నాం.. ఆ మహిళలను అరెస్ట్ చేయాలి'..
Director Perarasu Shocking Comments On Tik Tok Women Videos: పురుషుల వల్ల మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అనుకుంటారు. కానీ కొందరు మహిళలు టిక్‌టాక్ వీడియోల్లో చేస్తున్న అరాచకాలు చూడలేకపోతున్నాం అని ప్రముఖ డైరెక్టర్ పేరరసు అన్నారు. రెయిన్బో ప్రొడక్షన్స్ బ్యానరులో నిర్మాత వరదరాజ్ నిర్మించిన ‘పెణ్ విలై వెరుం రూ.999 మట్టుమే’ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న ఆయన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మహిళలే కారణమన్నారు. టిక్‌టాక్ వంటి షేరింగ్ యాప్స్‌లో అసభ్యకర, అశ్లీల వీడియోలు షేర్ చేసే మహిళలను గుర్తించి అరెస్ట్ చేయాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దేశ సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసి పోవడానికి మొబైల్ ఫోన్స్ కారణమని, అందువల్ల పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వొద్దని సూచించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన సినిమా పెణ్ విలై వెరుం అని.. ఈ సినిమాను ఆధరించాలని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ ఈవెంట్‌కు 10 ప్రత్యేక రైళ్లు.. అభిమానుల కోసం
Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్‌కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్‌కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK — NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022 ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
తిరుపతిలో హీరో విజయ్ ఆంటోని ‘విక్రమ్ రాథోడ్’ ఆడియో లాంచ్
-
ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్ కల్యాణ్: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీపెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని చెప్పారు. సినీపెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని తెలిపారు. బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తప్పా? అని ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలకు ఆన్లైన్ విధానాన్ని తీసుకువస్తే నీకు నష్టమేంటి? అని నిలదీశారు. శనివారం ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘పావలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచడానికే పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లు ఉంది. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలి. రెండేళ్లుగా ప్రజలే పవన్ తాట తీశారు. సినీ పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సినిమా కార్యక్రమంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడాడు?. రాజకీయాల్లో పనికి మాలిన స్టార్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్న నేత సీఎం జగన్’ అని తెలిపారు. -
ఆడియో లాంచ్: యాంకర్‌పై ఏఆర్ రెహమాన్ ట్రోలింగ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీలో మాట్లాడిన యాంకర్‌పై ఏఆర్ రెహమాన్ సరదాగా ట్రోల్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎహసాన్ భట్‌ను వేదికపై స్వాగతం పలికే సమయంలో యాంకర్ హిందీలో మాట్లాడింది. దీంతో పక్కనే ఉన్న రెహమాన్ హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజ్ మీదనే అనేశారు. తరువాత నవ్వుతూ సరదాగానే అన్నానని చెబుతూ స్టేజ్ దిగి కిందకు వెళ్లిపోయారు. ఇక ఈ విషయాన్ని యాంకర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో అక్కడితో ముగిసిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా తమిళ ప్రజలు హిందీ బాషను ద్వేషిస్తారనే విషయం సాధారణంగా తెలిసిందే. తమిళనాడులో హిందీ ఎవరూ మాట్లాడరు. కావున చెన్నైలో యాంకర్ హిందీలో మాట్లాడంతో ఎక్కడ కాంట్రవర్సీ అవుతందోనని ముందే గ్రహించిన రెహమాన్ వివాదాలకు దూరంగా ఉండటానికి హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ఫన్నీగా ట్రోల్ చేశాడు. చదవండి: రచయితగా.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ మూవీ రికార్డులు View this post on Instagram A post shared by Surya (@suryasurya5073) -
శ్రీకారం ఆడియో ఫంక్షన్లో గాయపడ్డ వ్యక్తి మృతి
సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ ప్రాంగణంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. ప్రకాష్ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా: చిరు -
ఆలోచింపజేసే చిత్రం
‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్ సేఫ్టీ వింగ్) అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్.శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్ మచ్చ. -
ఆహ్లాదంగా.. హాయిగా...
శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్ చిన్నా, రవీందర్ ముఖ్య తారలుగా వి. అంబికా విజయ్ దర్శకత్వంలో బాన వెంకట కొండారెడ్డి నిర్మించిన∙చిత్రం ‘వై తరుని రాణా’. నటుడు ‘జెమిని’ సురేష్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సీఈఓ నరేంద్ర ఈ సినిమా ఆడియో బిగ్ సీడీ, ట్రైలర్లను విడుదల చేశారు. ‘జెమిని’ సురేష్ మాట్లాడుతూ– ‘‘చిన్నా మంచి ఫోటోగ్రాఫర్. ఇప్పుడు నటుడిగా మారాడు. తనకు సినిమాలంటే ప్యాషన్. అలాంటివాళ్లు ఎప్పుడూ విజయం సాధిస్తారు. ఈ సినిమాలోని ప్రతి పాట డైరెక్టర్ వంశీగారి సినిమాల్లో ఉన్నట్లు ఆహ్లాదంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘నా మీద నమ్మకంతో కొండారెడ్డిగారు అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను’’ అన్నారు అంబికా విజయ్. ‘‘మా నాన్న కొండారెడ్డిగారు ముందు ఈ సినిమా నిర్మించనన్నారు. స్టోరీ విని, స్క్రిప్ట్‌పై మేం పడుతున్న కష్టం చూసి అంగీకరించారు. మార్చిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాత తనయుడు బుల్రెడ్డి. శాంతి రాజు, రాయంచ, కెమెరామేన్ బాలకృష్ణ, పాటల రచయిత సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎం. ప్రేమ్ రాయంచ, సదా చంద్ర, కెమెరా: రామ శ్రీనివాస్, నేపథ్య సంగీతం: ఆనంద్. -
ఉల్లాల.. ఉల్లాల మూవీ ఆడియో లాంచ్
-
‘దర్బార్’ ఆడియో ఫంక్షన్
-
మూడేళ్ల కష్టం
యోగీశ్వర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. అతిథి హీరోయిన్గా నటించారు. ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నటుడు సుమన్ విడుదల చేశారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ– ‘‘యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. ‘పరారి’ చిన్న సినిమా అనుకోవడానికి వీలు లేకుండా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం తెరకెక్కించారని తెలుస్తోంది’’ అన్నారు.‘‘చిత్ర నిర్మాత గిరి నాకు అభిమాని మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యుడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది’’ అన్నారు సుమన్. ‘‘ఈ కథ వెనక మూడేళ్ల కష్టం ఉంది. మహిత్గారి సంగీతం మా సినిమాకి పెద్ద సపోర్ట్‌గా నిలిచింది’’ అన్నారు సాయి శివాజీ. ‘‘నేను హీరోగా మారడానికి మా నాన్నగారే కారణం. సుమన్గారితో కలిసి నటించడం నా అదృష్టం’’ అన్నారు యోగీశ్వర్. ‘‘సుమన్‌గారు నా అభిమాన హీరో. ‘పరారి’ చూశాక నా కొడుకు యోగీశ్వర్కి అభిమానిగా మారాను’’ అని గిరి అన్నారు. ‘‘చక్రిగారు నాకు అన్నయ్యే కాదు.. గురువు కూడా. ఆయన పేరుని తీసుకొని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను’’ అన్నారు మహిత్ నారాయణ్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, నటుడు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
నీతోనే...
‘‘శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ ‘నీతోనే హాయ్ హాయ్’. ఇందులోని ఐదు పాటలు బావున్నాయి’’ అన్నారు నటుడు పృథ్వీ. అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. డా. యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా. యలమంచిలి ప్రవీణ్, డా. ఏయస్ కీర్తి, డా. జి.పార్థసారధి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ చిత్రం పాటలను పృథ్వీ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తోంది. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో, హీరోయిన్ మంచి నటన కనబరిచారు. ‘నీతోనే హాయ్ హాయ్’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నన్ను, నా కథని నమ్మి, నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తయింది’’ అన్నారు బియన్ రెడ్డి అభినయ. ‘‘వైవిధ్యమైన కథాంశంతో వస్తోన్న మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు డా. ఏయస్ కీర్తి, డా. పార్థసారధి రెడ్డి. ‘‘ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు డా. యలమంచిలి ప్రవీణ్. ‘‘ఈ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అరుణ్ తేజ్. -
కంటెంట్ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ
కేయస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్ , చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్`. డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థ సారధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంఛ్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో చిత్రాన్ని నిర్మించారు. హీరో , హీరోయిన్స్ మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’అన్నారు. ఆనంద్, బెనర్జి, నారాయణరావు, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, జబర్దస్త్ రాంప్రసాద్, శ్రీ ప్రియ, శిరీష, కృష్ణ ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి రవి కళ్యాణ్ సంగీతాన్ని అందించారు. -
పాటలు నచ్చడంతో సినిమా చేశా
‘‘ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఆదాయపు పన్ను విషయం ఏమో అనుకున్నా. ‘నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నారు.. మీరు అందులో నటించాలి’ అన్నారు. ఆ ఆఫీసర్ ఫ్రెండే మా దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే... మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పా’’ అని అలీ అన్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో అలీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి రిలీజ్ చేశారు. అలీ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాతో ఈ సినిమా నిర్మించారు. మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లి అయిపోతుంది అనేది ఈ చిత్ర కథ. రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డా. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దిలీప్ రాజా. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, నటీనటులు బాబూమోహన్, శ్రీకాంత్, నరేష్, ‘అల్లరి’ నరేష్, చార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల సక్సెస్ చూసినప్పుడే ఆనందం
‘‘మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్) నవ్వించేవారు.. నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావ్. ‘మహానటి’ చిత్రంతో నటన మొదలుపెట్టావు. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు. కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మించిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘నిర్మాతల్లో ఒకరైన బాషాకి రాఘవేంద్రరావు తెలుసు.. రాజమౌళి తెలుసు... అందరితోనూ పని చేశాడు. నా సినిమాలకు చాలా వరకు ఆయనే నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం లేకపోతే సినిమానే లేదు. సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్.. ఇలా ఏ పాత్రకైనా ప్రియమణి సరిపోతుంది’’ అన్నారు. నటుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన కీరవాణిగారిని, ఆర్.పి. పట్నాయక్.. ఇంకా ఇంత మంచి మహానుభావులను ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. మా మనవరాలు గురించి నేను చెప్పకూడదు.. ప్రేక్షకులే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. తేజస్విని బాగా నటించింది’’ అన్నారు ప్రియమణి. ‘‘నేను చేసిన ‘అనగనగా ఓ దుర్గ’ చిత్రం చూసి బాషాగారు కథ చెప్పమన్నప్పుడు ‘సిరివెన్నెల’ కథ చెప్పాను. బాషాగారికి, బోరాగారికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అన్నారు ఓం ప్రకాష్. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని బాషా, కమల్ బోరా అన్నారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, ఆర్.పి. పట్నాయక్, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కథల్ని ఆదరిస్తున్నారు
‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. ‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. -
డియర్ కామ్రేడ్ : మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్
-
వనవాసం పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నవీన్‌రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజయ్ కుమార్ నిర్మించారు. మోహన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమయ్యారు నరేశ్. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్‌గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్.పి, నరేంద్ర. నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ∙ నవీన్,శ్రావ్య -
టైటిల్ బాగుంది
శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్ నాయని దర్శకత్వంలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వి. వి వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ బాగుంది. అలాగే సాబు వర్గీస్ ఇచ్చిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. నవీన్ నాయని మాట్లాడుతూ – ‘‘మంచి కంటెంట్‌తో పాటు సందేశాత్మక చిత్రంగా ‘ఉండి పోరాదే’ని తెరకెక్కించాం’’ అన్నారు. -
‘కౌసల్య కృష్ణమూర్తి’ పాటల విడుదల వేడుక
-
అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా
‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐశ్వర్యారాజేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్‌గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్ హిట్లు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్‌కి నాంది అవుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు. ఐశ్వర్యారాజేష్ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు, కె. అశోక్ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్ రాజా కామరాజు, కెమెరామెన్ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
తాగిన మైకంలో...
విజయ్, మమత, రిషీ, బేబీ సుహాన, సతీష్, లడ్డు, తేజశ్విని ముఖ్య పాత్రల్లో రాజా విక్రమ నరేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్.పి. సమర్పణలో రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ బాలికల చేత ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేయించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రధాన కథ అనాథగా మారిన అంధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాం. మా బ్యానర్ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపైనా చేస్తాం’’ అన్నారు రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్. -
ఓ ప్రేమకథ
రామ్ ప్రణీత్, సుమయ జంటగా నిఖిలేష్ తొగరి దర్శకత్వంలో మహేష్ మొగుళ్ళూరి నిర్మించిన చిత్రం ‘ప్రేమజంట’. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ సాగర్, టి. ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆడియో సీడీలను విడుదల చేశారు. ‘‘నిర్మాత మహేశ్‌గారు పెట్టిన డబ్బు తిరిగి రావాలి’’అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ‘‘మా బ్యానర్లో ఈ సినిమా విడుదల కాబోతుండటం హ్యాపీగా ఉంది. కంటెంట్ తెలియగానే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు వరుణ్. ‘‘గ్రేస్‌ఫుల్ అబ్బాయిలు, బ్యూటిఫుల్ అమ్మాయిల ప్రేమే ఈ చిత్రం’’ అన్నారు మహేశ్. ‘‘దర్శకుడు కావాలనే నా 13 ఏళ్ల కల నెరవేరింది’’ అన్నారు దర్శకుడు నిఖిలేష్. -
‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో ఫంక్షన్
-
సినిమానే పెళ్లి చేసుకున్నాడు..
‘‘రెండు సినిమాలు చేయగానే ఎవరైనా కారు, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలనుకోవడం సహజం. కానీ, నాకు సినిమా ప్రాణం.. సినిమాయే నా జీవితం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమానే తన బిడ్డలుగా అనుకున్నాడు నారాయణమూర్తి’’ అన్నారు చిరంజీవి. ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తితో నా పరిచయం నాలుగు దశాబ్దాలది. 1978లో నేను ‘ప్రాణం ఖరీదు’ సినిమా చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్‌కి పేపర్ అందించే అసిస్టెంట్ కుర్రాడి పాత్ర చేశాడు తను. అప్పుడే చాలా హుషారుగా, మాట్లాడుతుండటంతో క్యూరియాసిటీతో ఏ ఊరు? అని అడిగితే రాజమండ్రి దగ్గర రావులపాలెం అని చెప్పాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు కూడా మా స్నేహం, అనుబంధం కొనసాగుతోంది. కష్టంతో, దీక్షతో అలుపెరుగని పోరాటం చేసి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ‘పీపుల్స్‌స్టార్’ ఆర్.నారాయణమూర్తి అనిపించుకునే కీర్తి సంపాదించుకున్నాడు. సినిమాల్లో ఎవరైనా పాపులారిటీ కోసం పొల్యూట్ అవడానికో, కమర్షియల్ వైపు మొగ్గు చూపడానికో ఇష్టపడతారు. కానీ, ఆయన మాత్రం నో అంటారు. తనది కమ్యూనిజం భావజాలం. సినిమాని ఓ సాధనంగా చేసుకుని తన భావాలతో ప్రజల్ని ఆలోచింపచేసే, సందేశాత్మక సినిమాలు తీయడం అన్నది ఓ అభ్యుదయవాదిగా ప్రతి ఒక్కరూ అభినందించాలి. 1984 నుంచి ఇప్పటి వరకూ 30 సినిమాలు ఓ నటుడిగా, నిర్మాతగా తను నమ్మిన బాటలో ముందుకు వెళుతూ మనందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడంటే అతని కమిట్మెంట్ అంతా ఇంతా కాదు. కమర్షియల్ సినిమాలవైపు ఎవరైనా కొంచెం ఆకర్షితులవుతారు.. కానీ అతడు అవ్వడు అనటానికి చిన్న ఉదాహరణ.. ‘టెంపర్’కి పూరి జగన్నాథ్‌గారు నారాయణమూర్తి పేరుతోనే ఓ పాత్ర రాసి, దీన్ని మీరు చేస్తేనే బాగుంటుందంటే, ‘కమర్షియల్ సినిమాల్లోకి నన్ను లాగకండి. నేను ఇలాంటి పాత్రకి న్యాయం చేయలేనేమో’ అని నో చెప్పాడు. తన వ్యక్తిగత జీవితం మొదటి నుంచి పరిశీలిస్తున్నా. పాండి బజార్లో హవాయ్ చెప్పులేసుకుని, తెల్లదుస్తులతో, భుజాన ఓ సంచి వేసుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లి, సినిమా ఆఫీసుల చుట్టూ వేషాల కోసం తిరిగేవాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అలా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ కలిపితే ఓ విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి మనిషి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెతికినా దొరకరు. అరుదైన వ్యక్తి నారాయణమూర్తి. తన సినిమాల్లో అన్ని విభాగాలు తానే చూసుకుంటూ ఆ రకంగా కూడా అరుదైన రికార్డు సాధించారాయన. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా కథాంశం ఏంటంటే.. భ్రష్టు పట్టిపోతున్న నేటి సమకాలీన రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి? మన బాధ్యత ఏంటి? అంటూ చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా మొన్న జరిగిన ఎన్నికల ముందు విడుదలై ఉంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. అయినా ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి, మనోడి జీవితంలో మరో కలికితురాయి కావాలి. నీ సక్సెస్ఫుల్ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘ఇటీవల చిరంజీవిగారిని కలిసి, ‘సార్.. నా సినిమా ఆడియో మీ చేతుల మీదుగా రిలీజ్ చేస్తే.. ప్రమోషన్‌కు పెద్ద హెల్ప్ అవుతుంది సార్.. ప్లీజ్ సార్’ అన్నాను. ‘నేను వస్తున్నాను’ అన్నారు. సాటి నటుడిపై ఆయనకు ఉన్న అభిమానానికి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. ఓ సందర్భంలో చిరంజీవిగారికి, నూతన్ ప్రసాద్‌గారికి, చంద్రమోహన్‌గారికి రాజమండ్రిలో అప్సర లాడ్జిలో బస ఏర్పాటు చేశారు. నన్ను కూడా అక్కడే పెడతారేమో అనుకుంటే వంటలు వండే పాకలో పెట్టారు. అప్పుడు నేను ఓ షాట్లోకి వెళ్తున్నాను. అప్పుడు వాక్‌మన్ పెట్టుకుని ఓ యంగ్ చార్మ్ వస్తున్నాడు. ఎట్రాక్టివ్‌గా ఉన్నాడు. ఎవర్రా బాబు అనుకున్నాను.. తీరా చూస్తే.. చిరంజీవిగారు. ఎడ్వర్డ్ ఫాక్స్, రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా వంటి నటులు రూల్ చేసినట్లే చిరంజీవిగారు కూడా తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తారనుకున్నాను. బాస్ యు ఆర్ గోయింగ్ టు రూల్ తెలుగు ఇండస్ట్రీ అన్నాను. థ్యాంక్స్ నారాయణ అన్నారు. చిరంజీవిగారు ‘ఖైదీ’ నుంచి ఇప్పటివరకు మెగాస్టార్‌గా కూర్చొని ఉన్నారు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా సరే. ఇవాళ ఆయన చేస్తున్న ‘సైరా’తో ఆయన జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్.. ‘సైరా’ విడుదల తర్వాత ఒమెగా స్టార్ అవుతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే అంశం ఆధారంగా తీసినదే నా‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’’ అన్నారు. దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, గోరేటి వెంకన్న, మాటల రచయిత గెడ్డం సుధాకర్, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఉమేశ్ గుప్తా, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా అంటే మూర్తికి పిచ్చి
-
మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. ‘నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం నాది. ఈ ఆడియో వేడుకకు రావడం సంతోషంగా ఉంది. సినిమా అంటే మూర్తికి పిచ్చి. కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో తన కమిటిమెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. ఆస్తులు, అంతస్తులు కాదు సినిమానే ప్రాణం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతోంది. నారాయణమూర్తి చిత్రం ఇందుకు నిదర్శనం’అన్నారు. సినిమా అంటే మూర్తికి పిచ్చి -
నవ ప్రపంచం కోసం
‘‘గాడ్ ఆఫ్ గాడ్స్’ చిత్రం ట్రైలర్ నా చేతుల మీదగా విడుదల కావడం నా అదృష్టం. మన దేశంలో ఉన్న మతాలు, వేరే ఏ దేశంలోనూ లేవు. బ్రహ్మకుమారీస్ వాళ్లు ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయదలచుకుంటే నేను వాళ్ల వెంట ఉంటాను’’ అన్నారు ‘దిల్’ రాజు. వెంకట్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఆఫ్ గాడ్స్’. డివిజన్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ సమర్పణలో జగన్మోహన్ గర్ల్, ఐఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజశ్వీ మనోజ్ఞ, త్రియిగమంత్రి, రాజసింహ వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. శాంతి, ప్రేమ, విలువలతో కూడిన నవ ప్రపంచ పునరుద్ధరణ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియోను ‘దిల్’ రాజు రిలీజ్ చేసి మాట్లాడుతూ – ‘‘నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదన్నది నా కాన్సెప్ట్’’ అన్నారు. ‘‘బ్రహ్మకుమారీస్ చేసే సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే’’ అన్నారు లయన్ సాయి వెంకట్. ‘‘ఎన్ని దేశాల్లో మా భక్తులు ఉన్నారన్నది ఈ చిత్రం ద్వారా తెలిసింది’’ అన్నారు కుల్దీప్ దీదీ. తేజశ్వీ మనోజ్ఞ, వెంకట్ గోపాల్, ఐఎంఎస్ రెడ్డి మాట్లాడారు. -
మంచి జరుగుతుంది.. విజయం దక్కుతుంది
‘‘విజయ్ రాజాను చూస్తుంటే ‘బొబ్బిలిరాజా’లో శివాజీరాజా గుర్తొస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘నేనేరాజు నేనే మంత్రి’తో సహా మా కాంబినేషన్లో వచ్చిన ప్రతి చిత్రం హిట్ అయింది. ‘ఏదైనా జరగొచ్చు’ అని టైటిల్ పెట్టారు.. మంచే జరుగుతుంది, హిట్టే వస్తుంది’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా కె.రమాకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్ కథానాయికలుగా కె. ఉమాకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శివాజీరాజా కూడా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు.. హీరోగా చేశాడు. మంచి నటుడిగా, మానవతావాదిగా పేరు సంపాదించాడు. వాళ్లబ్బాయి భవిష్యత్తు బాగుండాలి’’ అన్నారు. ‘‘పదేళ్లక్రితం మా సినిమా ‘విరోధి’లో విజయ్ నటించాడు. అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడా అనిపిస్తోంది’’ అన్నారు నటుడు శ్రీకాంత్. ‘‘విజయానికి కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘విజయ్ దేవరకొండ అంతటి సక్సెస్‌ను విజయ్ రాజా అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ‘‘నాకు కావాల్సిన వాళ్లంతా ఈ వేడుకకు రావడం హ్యాపీగా ఉంది. వీళ్లందరి ప్రేమాభిమానాలు, సపోర్ట్‌తోనే 450 సినిమాలు చేశా. అదే ప్రేమను నా కొడుకుపై చూపిస్తూ ఆశీర్వదించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘హాలీవుడ్లో నా ఫేవరెట్ డైరెక్టర్ క్వెంటిన్ టొరంటినో. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూశాక రమాకాంత్లోనూ ఆయన శైలి కనిపించింది’’ అని హీరో తరుణ్ అన్నారు. ‘‘శని, ఆదివారాలు శ్రీకాంత్‌గారి ఇంటికెళ్తే.. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతపైకి వస్తారని రోషన్‌కు, నాకు చెప్పి ప్రోత్సహించేవారు’’ అన్నారు విజయ్ రాజా. ‘‘ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. థ్రిల్లర్ అండ్ హారర్ కామెడీ ఉంటుంది’’ అన్నారు రమాకాంత్. నిర్మాత సి. కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నిర్మాతల కష్టసుఖాలు నాకు తెలుసు’
ధర్మప్రభు చిత్రంలో యమధర్మరాజు కుమారుడిగా యోగిబాబు నటించారు. హాస్య చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులు ఉన్నారని, యమలోకంలో తాను, భూలోకంలో శ్యామ్ నటిస్తున్నట్లు తెలిపారు. తాను ముత్తుకుమార్ 15 ఏళ్లుగా స్నేహితులమని తెలిపారు. తాము లొల్లుసభా నుంచి వచ్చే తక్కువ ఆదాయంతో జీవిస్తూ వచ్చామని, కొన్ని రోజులు భోంచేయకుండా డాబాపై పడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో అనుకున్న కథ ప్రస్తుతం చిత్రంగా రూపొందుతుందన్నారు. యోగి బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘చిత్రంలో నటిస్తారా, డేట్స్ దొరుకుతాయా’ అని ముత్తుకుమార్ ప్రశ్నించగానే వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో గుర్కా చిత్రంలోనూ నటించేందుకు ఒప్పుకున్నానని, ఇద్దరు దర్శకులు స్నేహితులు కావడంతో 45 రోజుల పాటు నిద్రలేకుండా రాత్రింబవళ్లు నటిస్తూ వచ్చానన్నారు. తాను యముడి గెటప్‌లో అందంగా కనిపిస్తున్నానని నటి రేఖ తెలిపారని, ఇదే విషయాన్ని తానూ అనుభూతి చెందినట్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తాను మాట్లాడే డైలాగ్స్ చూసి యూనిట్లో భయపడుతున్నారని, ఈ చిత్రం తన జీవితంలో మరచిపోనిదిగా మిగిలిపోతుందని అన్నారు. తాను అధిక పారితోషికం తీసుకునే వ్యక్తిని కాదని నిర్మాతల కష్టసుఖాలు తనకు తెలుసన్నారు యోగిబాబు. బయటి వ్యక్తులు వ్యాపింపజేసే వదంతులు నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. -
ఈ చిత్రం విజయం సాధించాలి
‘‘ఏ నిర్మాతకైనా తాను నమ్ముకున్న దర్శకుడు మంచి చిత్రాన్ని తీసినప్పుడు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. ఆ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చి సూపర్ హిట్ అయితే అదే నిజమైన ఆనందం. ‘ఎంతవారలైనా’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత కె. అచ్చిరెడ్డి. అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్య పాత్రల్లో గురు చిందేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారలైనా’. సంహిత, చిన్ని–చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నటించి, నిర్మించిన ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సీతారెడ్డిగారి భార్య లక్ష్మీగారిని నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కలిశా. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘వ్యాపారవేత్త సీతారెడ్డి నిర్మాణ రంగంలోకి వచ్చి, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న ఔత్సాహిక నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచారు’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా రంగం ఎలా ఉంటుందోనని భయపడ్డా. కానీ ప్రతి ఒక్కరూ మంచి సహకారాన్ని అందించారు’’ అన్నారు జి. సీతారెడ్డి. ‘‘న్యూ జనరేషన్ హారర్ థ్రిల్లర్ ఇది. ఎంతవారలైనా శిక్షార్హులే అనే నేపథ్యంలో సాగుతుంది’’ అన్నారు గురు చిందేపల్లి. -
మహేశ్‌బాబు ప్రపంచాన్ని ఏలేస్తాడు
‘‘ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేశ్‌బాబు. ‘మహర్షి’ ట్రైలర్ చూశారు కదా.. అదిరిపోయింది కదా. 25వ సినిమా అయినా వయసు 25లానే ఉన్నాడు మహేశ్. ప్రతి ఆర్టిస్ట్‌కి కెమేరా ఫేవర్ యాంగిల్ ఒకటుంటుంది. మహేశ్‌కు మాత్రం 360 డిగ్రీస్ ఎక్కడ పెట్టినా అందంగానే కనిపిస్తాడు. అందుకే సింగపూర్‌లో తన మైనపుబొమ్మ పెట్టారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా, ‘అల్లరి’ నరేష్ కీలక పాత్రలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్’ రాజు, సి.అశ్వినీదత్, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మహర్షి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. చిన్నోడు నా మీద కోపంగా పూలకుండీ తన్నాడు. ఆ సినిమా (సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు) ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మీకు తెలుసు. ఈ సినిమాతో మళ్లీ అన్ని రికార్డులను తన్నేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా అన్నయ్య వెంకటేశ్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏ సెట్‌కి వెళ్లినా, ఏ ఫంక్షన్‌కి వచ్చినా సినిమా సూపర్‌హిట్ అంటుంటారు.. అది పెద్ద సెంటిమెంట్. ఇక్కడికొచ్చినందుకు థ్యాంక్స్ సర్. యంగర్ జనరేషన్ హీరోల్లో నేను అభిమానించేది విజయ్ దేవరకొండని. తన పనిని నేను ఇష్టపడతాను. ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. ‘రాజకుమారుడు’తో నన్ను పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా. నేను యాక్ట్ చేయగలను అని నిరూపించిన సినిమా ‘మురారి’. ఇందుకు కృష్ణవంశీగారికి థ్యాంక్స్. నన్ను స్టార్‌ని చేసిన సినిమా ‘ఒక్కడు’. థ్యాంక్యూ వెరీమచ్ గుణశేఖర్ సార్. నన్ను కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఇందుకు త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ‘దూకుడు’.. దానికి శ్రీను వైట్లగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’తో రెండుసార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ సార్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు ‘మహర్షి’ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ సినిమా 20 నిమిషాల కథ వినగానే రెండు సినిమాల తర్వాత ఈ సినిమా చేయాల్సి వస్తుందన్నాను. పర్లేదు సార్... రెండేళ్లైనా మీకోసం వేచి చూస్తాను, మీరు తప్ప ఈ కథలో నేనెవర్నీ ఊహించలేదు అన్నాడు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ వద్ద కథ ఉన్నా రెండు నెలలు ఆలస్యమైతే వేరే హీరోల వద్దకు వెళ్లిపోతారు. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్లు చేయాలని నా ఫీలింగ్. యాక్టర్ యాక్టింగ్ చేయాలి.. డైరెక్టర్ డైరెక్షనే చేయాలి. ఈ 25 సినిమాల జర్నీ, ఈ 20 ఏళ్ల జర్నీలో మీరు (అభిమానులు) చూపించిన ప్రేమ, అభిమానానికి మాటలు రావడం లేదు.. చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ అభిమానం, ప్రేమ ఇంకో పాతిక సినిమాలు, ఇంకో ఇరవై ఏళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘ఆనాటి ‘అగ్నిపర్వతం’ నుంచి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో హిట్ సినిమాలు తీశా. మహేశ్‌బాబుని ‘రాజకుమారుడు’ చిత్రంతో పరిచయం చేశా. ఈ రోజు ఈ సినిమా అనుకోకుండా మే 1న ప్రీ రిలీజ్ ఫంక్షన్, మే 9న రిలీజ్ అవుతోంది. గతంలో నా రెండు సినిమాలు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’కి కూడా అలాగే జరిగింది. యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ ‘దిల్’రాజు, పీవీపీగార్లతో కలిసి ‘మహర్షి’ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారి 25వ సినిమాని మూడు పెద్ద బ్యానర్స్ కలిసి చేశాం. ఈ నెల 9న మీకు అద్భుతమైన సినిమాని ఇస్తున్నామని నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ‘ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారు’ అని నాకు ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. ‘ఊపిరి’ తర్వాత వంశీ ఈ ఐడియాని మహేశ్‌గారికి చెప్పారు. ఇది చేయాలా? వద్దా? అనే చిన్న డైలమాలో ఉన్నారు మహేశ్. కానీ అదే ఎనర్జీతో పూర్తి కథ రాసి మహేశ్‌గారిని ఒప్పించారు. ఈ కథ నేను చేస్తున్నాను అని మహేశ్‌గారు చెప్పినప్పుడు వంశీ కళ్లలో నీళ్లు తిరిగాయి. మొన్నే సినిమా చూపించాడు. క్లైమాక్స్ చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. లాస్ట్ డే షూటింగ్లో.. అందరి హీరోలతో నేను క్లోజ్‌గా ఉంటా... కానీ, మహేశ్‌గారు షేక్‌హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఎవరికైనా అంతే. లాస్ట్ డే అందరికీ హగ్ ఇచ్చాను.మహేశ్‌కి ఇవ్వాలా? వద్దా? అని అలా మలుపు తిరుగుతుంటే.. మహేశ్‌గారు చేతులు చాపి నాకు హగ్ ఇవ్వరా? అన్నారు. అది గ్రేట్ మూమెంట్’’ అన్నారు. ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణం మూడేళ్లకిందట మొదలైంది. అప్పుడే ‘మహర్షి’ ఐడియా చెప్పాడు వంశీ. ‘ఊపిరి’ రిలీజ్ రోజు రాత్రి మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడే మహేశ్‌గారు కాల్ చేసి మంచి సినిమా తీశారంటూ నన్ను, వంశీని అభినందించారు. ‘ఊపిరి’ విడుదలైన 9వ రోజు వంశీ వెళ్లి మహేశ్‌గారికి లైన్ చెప్పాడు.. పూర్తి స్క్రిప్ట్ తీసుకుని రమ్మన్నారాయన. ఈ రోజు తక్కువ మాట్లాడతాను. మే 18న విజయవాడలో సక్సెస్‌మీట్ పెట్టాం, అక్కడ ఎక్కువ మాట్లాడతాను’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో పేపర్స్ విసిరేసిన రోజులున్నాయి. ఫ్యాన్స్ టికెట్టు కొన్నప్పుడు ఏం కోరుకుంటారో మా అందరికీ తెలుసు. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ గార్లకి కృతజ్ఞతలు. ఈ నెల 9 సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే రోజు అవుతుంది. మహేశ్‌గారు యాక్టర్‌గానే సూపర్స్టార్కాదు. ఒక వ్యక్తిగా సూపర్‌స్టార్’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబు అభిమానిగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇంటర్మీడియట్ నుంచి మావోడు అనుకుంటుండే. నేను సినిమాలు చూడటం ‘మురారి’తో స్టార్ట్ చేశా. బాల్కనీలో చూశా. టికెట్ల కోసం పడే కష్టాలు.. అమ్మాయిల క్యూ తక్కువ ఉంటుంది.. వారి ద్వారా టికెట్లు తెప్పించుకునేవాణ్ణి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ చూసి విజయ్ అద్భుతంగా చేశాడు అని మహేశ్‌బాబుగారు చేసిన ట్వీట్ చదవగానే ఫిదా అయిపోయా. మీరు ట్వీట్ చేసే మంచి సినిమాలు చేయాలని ఆశ. ఈ నెల 9న నా బర్త్‌డే రోజు ‘మహర్షి’ రిలీజ్ అవుతుండటంతో ఒత్తిడిలా అనిపిస్తోంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పూజా హెగ్డే, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హీరోలు ‘అల్లరి’ నరేశ్, సుధీర్‌బాబు, నిర్మాత అనీల్ సుంకర, నటులు పోసాని కృష్ణమురళి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామేన్ కె.యు.మోహనన్, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్.జి.కె’ ఆడియో రిలీజ్
-
ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నా : సూర్య
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్.జి.కె’ (నంద గోపాలకృష్ణ). ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది. యూనిట్‌తోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్, 2డి టర్‌టైన్‌మెంట్స్ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. నా కల నిజమైన భావన కలుగుతోంది ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - ‘ఎన్.జి.కె’ చిత్రాన్ని పొటిలికల్ డ్రామా, థ్రిల్లర్ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్ చేసిన డైరెక్టర్ శ్రీరాఘవగారి దృక్కోణంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని నాతో సినిమా చేస్తారా? అని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఆనందాన్ని కలిగించింది. అంతేకాదు నా కల నిజమైన భావనను కలిగిస్తోంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నాను. సూర్య అద్భుతమైన నటుడు దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ ‘నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్. స్క్రిప్ట్ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా? అని నేను, నిర్మాతలు ప్రకాశ్, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా చక్కగా ఇచ్చారు. తను డైరెక్టర్స్ యాక్టర్. ఇక ప్రొడ్యూసర్స్ ప్రకాశ్, ప్రభు నుండి నిర్మాతలుగా ఎలాంటి సహకారం రావాలో.. ఆ సహకారం అందింది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించారు. యువన్ సంగీతం, శివకుమార్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ ఇలా ఓ వండర్ఫుల్ టీం కుదిరింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అన్నారు. ‘ఎన్.జి.కె.’ను మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ - ‘ఎన్.జి.కె’ విషయంలో చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. తొలిరోజు కథ ఎంత ఎక్సయిట్ అయ్యామో.. ఇప్పుడూ అదే ఎక్సయిట్మెంట్తో ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్ట్రయిక్ సహా పలు కారణాలతో బ్రేక్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తోంది. రకుల్, సాయిపల్లవి, యువన్ శంకర్ రాజా, శివకుమార్, ప్రవీణ్ ఇలా .. ఈ సినిమా విషయంలో టీం అందించిన సపోర్ట్ మరచిపోలేను. ఏం టైంలో అడిగినా కాదనకుండా సహకారం అందించారు. మంచి రిలీజ్ డేట్ కుదిరింది. యువన్, శ్రీరాఘవగారి కాంబినేషన్లో మూవీ అంటే సంగీతం ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ ఉంది. పాటలు అద్భుతంగా కుదిరాయి. రీరికార్డింగ్ జరుగుతోంది. మే 31న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. శ్రీరాఘవగారు ఇన్‌స్టిట్యూట్‌లాంటి వ్యక్తి సాయిపల్లవి మాట్లాడుతూ - ‘ఈ సినిమాలో పనిచేయడం స్కూల్‌కి వెళ్లినట్లుగా అనిపించింది. సాధారణంగా ఓ సీన్‌ను షూట్ చేస్తారనుకుంటే నేను ప్రిపేర్ అయి వెళతాను. కానీ ఎలాంటి ప్రిపేరేషన్ లేకుండా రమ్మన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు తొలి రెండు రోజుల్లోనే అర్థమైంది. సీన్‌ను మనం ఒకలా అనుకుని వెళితే శ్రీరాఘవగారు దాన్ని మరో లెవల్లో తెరకెక్కించేవారు. మన ఆలోచన గ్రౌండ్ లెవల్లో ఉంటే ఆయన ఆలోచన ఆకాశం రేంజ్లో ఉంటుంది. శ్రీరాఘవగారు ఇన్‌స్టిట్యూట్‌లాంటి వ్యక్తి. నేను ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమీ లేదని ఆయనతో సినిమా చేసిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పటివరకు తెలిసింది అంతా వదిలేసి నటించాలని నేర్చుకున్నాను. ఆయన్ని ఫాలో అయ్యాను. సూర్యగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనలో సగం నేర్చుకుంటే చాలు. ఆయన మిలియన్స్‌లో ఒకరు. ఇక యువన్గారితో నేను చేస్తోన్న రెండో సినిమా. పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్‌తో సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళతారు’ అన్నారు. ప్రతి సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట్‌లా చేశాం సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మాట్లాడుతూ - ‘శ్రీరాఘవతో చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి బ్రేక్ చేస్తూ వచ్చాం. అలా మేం చేసిన ప్రతి సినిమానూ ఓ ఎక్స్‌పెరిమెంట్‌లా చేశాం. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను’ అన్నారు. -
చూడలేని ప్రేమ
సంచారి విజయ్ కుమార్, మేఘా శ్రీ జంటగా ఎస్ఏఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ తులసి’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో యం. నారాయణ స్వామి, నాగలక్ష్మిలు తెలుగులో ‘తులసి కృష్ణ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మొదటి సీడీని డైరెక్టర్ సాగర్‌కి అందజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకునే ఈ రోజుల్లో అంధుడైన హీరో, అందమైన యువతి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్ అద్భుతంగా చూపించాడు’’ అన్నారు. ‘‘కనులతో ప్రేమించే ప్రేమకన్నా మనసుతో ప్రేమించే ప్రేమ గొప్పది’’ అన్నారు డైరెక్టర్ సాగర్. ‘‘కథా బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కన్నడలో కంటే తెలుగులో గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎస్ఏఆర్ అన్నారు. ‘‘మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ‘తులసి కృష్ణ’ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత డాక్టర్ మహేంద్ర. నిర్మాతలు సాయివెంకట్, మోహన్‌గౌడ్ మాట్లాడారు. -
ఇది యూత్ కోసమే
ఐదుగురమ్మాయిలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్’ ‘ఇది చాలా తక్కువ’ అనేది క్యాప్షన్. ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. హీరో శింబు గెస్ట్ రోల్ చేసి, సంగీతం అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించారు. కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో పఠాన్ చాంద్‌బాషా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సురేశ్ కొండేటి సీడీను ఆవిష్కరించి మాట్లాడుతూ – ‘‘యూత్‌ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ నెల 26న చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు పఠాన్ చంద్. ఈ వేడుకలో విజయరంగరాజు, మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్ రాము తదితరులు పాల్గొన్నారు. -
టోక్యో ఒలింపిక్స్ చూస్తారా...!
టోక్యో: జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టోక్యో ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా తిలకించాలనుకునే ప్రేక్షకుల కోసం టికెట్ కబుర్లను ఆర్గనైజర్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల కోసం ఆతిథ్య ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయి. దీంతో టికెట్ల విక్రయానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. 33 క్రీడాంశాల్లో 339 విభాగాల్లో జరిగే ఈవెంట్లను తిలకించేందుకు 78 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. వచ్చే నెల నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. సాధారణ టికెట్ల ధర రూ.1550 (2500 జపాన్ యెన్లు) నుంచి మొదలవుతుంది. అంగరంగవైభవంగా జరిగే ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా దగ్గరి నుంచి చూడాలనుకుంటే మాత్రం రూ. లక్షా 86 వేలు (3 లక్షల యెన్లు) వెచ్చించాల్సి ఉంటుంది. పురుషుల 100 మీటర్ల ఫైనల్‌ను దగ్గరి నుంచి వీక్షించాలనుకుంటే రూ.80,612 (లక్షా 30 వేల యెన్లు) చెల్లించాలి. ఇక మిగతా టికెట్లన్నీ రూ.4960 (8000 యెన్లు)కు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. 2020వ సంవత్సరంలో మెగా ఈవెంట్ జరుగుతుండటంతో జపాన్ వాసులకు ప్రత్యేకంగా 2020 యెన్లతో (రూ.1250) టికెట్లను విక్రయిస్తారు. ఇవి మే 9 నుంచి 28 వరకు లాటరీ పద్ధతిలో అందజేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ వీక్షకుల కోసం జూన్ 15 నుంచి అమ్మకాలు చేపడతారు. ఎవరైనా సరే ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మాత్రం తప్పనిసరి. జ్టి్టpట://్టజీఛిజ్ఛ్టు.్టౌజుyౌ2020.ౌటజ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 78 లక్షల టికెట్లలో 70 నుంచి 80 శాతం టికెట్లను జపాన్ వాసులకు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయి. -
వీకెండ్ పార్టీ ఛలో ఛలో
‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. ఇప్పుడాయన శ్రీనివాస్‌తో కలిసి ‘గీతా.. ఛలో’ వంటి మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రష్మికా మండన్నా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ‘గీతా.. ఛలో’ టైటిల్ క్యాచీగా ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే రష్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ‘గోల్డెన్‌స్టార్’ గణేశ్, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. ‘వీకెండ్ పార్టీ’ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సీడీలను సి.కల్యాణ్ ఆవిష్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాతలు శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాలాజీ నాగలింగం తదితరులు ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసింది. ‘గీతగోవిందం’ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలోనూ ఉన్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇది’’ అన్నారు. దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ముందుగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాం. కుదరలేదు. ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఆమె తప్ప ఎవరూ సరిపోరని డబ్ చేస్తున్నాం. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రేక్షకుల ఆదరణ
సాక్షి, హైదరాబాద్: భారీ పంచ్‌లు, ముష్టిఘాతాలకు నెలవైన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రేక్షకుల నుంచి అమితాదరణను పొందుతోంది. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్ పెద్ద సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు తలపడిన ఈ పోటీలకు ప్రేక్షక లోకం కళ్లప్పగించింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్ నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానుల ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ చానళ్ల ద్వారా భారత్‌లోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో ఈ పోటీలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్‌మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది. -
హంతకుడు ఎవరు?
అర్జున్, విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్’. ‘హంతకుడు’ అన్నది ఉపశీర్షిక. బి.ప్రదీప్ సమర్పణలో దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రం స్నీక్ పీక్ టీజర్‌ను రిలీజ్ చేయగా, బిగ్ సీడీని అర్జున్ విడుదల చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘అర్జున్‌గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే. ఆషిమా ఈ సినిమాతో ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావుగారు నాకు గాడ్ ఫాదర్. భాష్యశ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారు. మేలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేశా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ మంచి మనిషి. ఈ చిత్రంలో ‘కిల్లర్’ ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అన్నారు అర్జున్. ‘‘నాకు తెలుగు రాకున్నా తెలుగు వారికి నచ్చే సినిమా తీశా. విజయ్ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్‌గారు ఈ సినిమా చేయటమే మా మొదటి సక్సెస్. టెక్నికల్‌గా నెక్ట్స్ లెవెల్ మూవీ అవుతుంది’’ అన్నారు ఆండ్రూ లూయిస్. సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్, పాటల రచయిత భాష్యశ్రీ, అషిమా నర్వాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మ్యూక్స్. -
పాటలతో ప్రశ్నిస్తా
మనీష్ బాబు హీరోగా, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా హీరోయిన్స్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రారంభం రోజున మనీష్‌ని చూసాను. మంచి హైట్, ఫిజిక్‌తో బాగున్నాడు. ఇప్పుడు టీజర్ చూసాక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. భవిష్యత్తులో తను పెద్ద హీరోగా ఎదగాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలు డీల్ చేయడం చాలా కష్టం. కానీ, రాజా వన్నెంరెడ్డిగారు అలాంటి చిత్రాలు తీసి హిట్స్ కొట్టారు’’ అన్నారు.‘‘చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ ఐదు రెట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారయ్యింది. ఈ సినిమాతో మనీష్ 10కోట్ల రేంజ్ హీరో అవుతాడు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా పొలిటికల్ టచ్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాత మా సినిమాకి బిజినెస్ క్రేజ్ పెరిగింది’’ అని పి. సత్యారెడ్డి అన్నారు. మనీష్, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్ శివారెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్స్.. హారర్.. థ్రిల్
సమీర్‌ఖాన్ హీరోగా షేర్ దర్శకత్వంలో కె. వెంకటరాంరెడ్డి నిర్మించిన చిత్రం ‘కేఎస్ 100’. శైలజ, సునీతా పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. షేర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అమ్మాయిలు సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలతో పాటు యూత్‌కి కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉండటంతో ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘‘ట్రైలర్ చూసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకు. ‘ఆర్ఎక్స్ 100’ కంటే ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘లయన్’ సాయివెంకట్. -
త్వరలో ఎన్టీఆర్ నైట్ : వెన్నుపోటు ఈవెంట్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయినా వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో భారీ ఈవెంట్‌కు సంబంధించి ప్రకటన చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడపలో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది.. ఈవెంట్ పేరు ‘వెన్ను పోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచేయబడుతుంది.. జై ఎన్టీఆర్’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మాతలు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ . ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2019 -
ఆ కష్టాలు సినిమా వాళ్లకే తెలుసు
‘‘మా శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు కొత్త అయినప్పటికీ మంచి చిత్రాన్ని రూపొందించారు. మనకు పైకి కనిపించే సినిమా రంగులమయంగా ఉంటుంది. కానీ, దానిలో కష్టాలు సినిమా చేసే వాళ్లకే తెలుస్తాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో మా పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లే ఉండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాలి’’ అని మాజీ మంత్రి డి.కె. అరుణ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. సాబూ వర్గీస్ సంగీతం అందించిన పాటలను డి.కె. అరుణ విడుదల చేశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఆసక్తి. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో దర్శకుణ్ణి అవుదామని కృష్ణానగర్ వచ్చాను. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ల కష్టాలు చూసి ఇక్కడ మనం ఉండలేం అని తిరిగి వెళ్లిపోయాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. ఆనాటి నా ఆకాంక్షని ఈరోజు నిర్మాతగా మారి సినిమా చేశాను’’ అన్నారు మహంకాళీ శ్రీనివాస్. ‘‘నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. మహంకాళీ శ్రీనివాస్ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే ఈ చిత్రంలో నటించాను’’ అని పాటల రచయిత గోరటి వెంకన్న అన్నారు. ‘‘ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు0 ఎక్కడా లోటుండదు’’ అన్నారు నాగసాయి మాకం. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌన శ్రీ మల్లిక్, సినిమాటోగ్రాఫర్ తోట వి. రమణ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ సినిమా మీద ప్యాషన్‌తో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం చూసాను. ప్రశాంత్ బాగా నటించాడు. మరో మంచి నటుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా పియల్‌కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఎన్‌యస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కె.యల్.దామోదర ప్రసాద్ విడుదలచేశారు. పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సుబ్బారెడ్డిగారు అన్నివిధాలా సహకరించి సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ మంచి పాటలు ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌లో ప్రశాంత్ బాగా నటించాడు. మేము ఊహించిన దానికంటే అవంతిక బాగా చేశారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేసేలా ఉంటుంది’’ అని నల్లమోపు సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదు’’ అన్నారు ప్రశాంత్. ‘‘ప్రాణం ఖరీదు’ నా మూడో చిత్రం. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని అవంతిక చెప్పారు. -
ఇలకొచ్చె జాబిల్లి
జాన్, అంగనా రాయ్, గాయని కల్పన, ప్రియ, తేజ రెడ్డి, హర్షద, జయవాణి, ‘జబర్దస్త్’ ఆర్పీ, వినోదిని, అప్పారావ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అదృశ్యం’. వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్పై రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆల్డ్రిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కళాతపస్వి కె.విశ్వనాథ్ రిలీజ్ చేశారు. రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని ‘ఇలకొచ్చె జాబిల్లి...’ అనే మెలోడీ సాంగ్‌ని, ‘అందానికి అడ్రస్సే...’ అనే బీట్ సాంగ్‌ని వెన్నెలకంటిగారు రాశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి. ∙అంగనా రాయ్, జాన్ -
ఫుల్ ప్యాకేజీ
‘‘దుర్మార్గుడు’ చిత్రంలో శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. లిరిక్స్ అద్భుతంగా కుదిరాయి. విజయ్‌కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ పనితనం కనపడుతోంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఫుల్ ప్యాకేజీలా ఉంది’’ అని నటుడు సుమన్ అన్నారు. విజయ్ కృష్ణ, ఫిర్దోస్ భాను జంటగా సునీల్ జంపా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దుర్మార్గుడు’. బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను సుమన్ విడుదల చేశారు. ట్రైలర్‌ను నిర్మాతలు సి. కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేయగా, బిగ్ సీడీని సుమన్, సి.కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్, నిర్మాత టి. రామసత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్ జంపా మాట్లాడుతూ– ‘‘1980లో కాకినాడలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాజవంశీగారికి ధన్యవాదాలు. అపర్ణగారు కూడా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో 25 మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్ పరిచయమవుతున్నారు’’ అన్నారు. ‘‘కేవలం సంకల్ప బలంతోనే ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హీరో అయ్యాను. మా సినిమాను సపోర్ట్ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ కృష్ణ. ‘‘రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారాను’’ అన్నారు నిర్మాత రాజవంశీ. -
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ఆడియో విడుదల
-
నవ్వించి పంపించే బాధ్యత మాది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకలుగా నటించిన సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తరుణŠ æభాస్కర్ బిగ్ సిడీని ఆవిష్కరించి ‘హుషార్’ ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి అందించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమందరం కలిసి సైన్మా (షార్ట్ ఫిల్మ్), ‘పెళ్ళిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే.. అనుకోకుండా రోల్స్ రావడంతో యాక్ట్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘నా కథపై నమ్మకంతో సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమాను నిర్మించిన ప్రభాత్ కుమార్‌కి థ్యాంక్స్’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ‘‘నేను ఓ డాక్టర్ని. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అన్నారు ప్రభాత్. ‘‘ప్రశాంత్‌కు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చిన తర్వాత అంతా సెట్ అయ్యింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. ఒక్క అవకాశం ఇవ్వండి.. నవ్విస్తాం’’ అన్నారు ప్రియదర్శి. సంగీతదర్శకుడు వివేక్ సాగర్ పాల్గొన్నారు. -
‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. మిఠాయి విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ సైన్మా, పెళ్లి చూపులు చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. మిఠాయితో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్ గానీ... తను ఫాలో అయ్యే యాక్టర్స్ గానీ డిఫరెంట్ లెవెల్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం హుషారు షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు. సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం’ అన్నారు. -
అంతా కొత్తగా ఉంటుంది
కృష్ణ హీరోగా వచ్చిన ‘నెంబర్‌వన్’ చిత్రంతో బాలనటుడిగా పరిచయమైన దిలీప్‌కుమార్ చలవాది దాదాపు 30 సినిమాలు చేశారు. ఆ తర్వాత హీరోగా మారి నాలుగు సినిమాలు చేశారు. తాజాగా ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మించారు. పద్మనాభ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిలీప్ కుమార్ చలవాది మాట్లాడుతూ– ‘‘ఆడియో ఫంక్షన్ అనగానే చాలా మంది నన్ను ‘గెస్ట్ ఎవరు అని?’ అడిగారు. నాకు ఎవ్వరూ గెస్ట్‌లు వద్దు.. ప్రేక్షకులే నా అతిథులు అన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన రాజు అన్నకు థ్యాంక్స్. 1970 నేపథ్యంలోని కథతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. సినిమా కోసం చచ్చిపోతాం.. అలాంటి ఫ్యామిలీ మాది. ‘దిక్సూచి’ అనే ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఈ సినిమా చూసి నన్ను సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘దిలీప్ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ సినిమా చూశాక అనిపించింది.. నేనేనా ఈ చిత్రాన్ని నిర్మించింది అని. అంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అన్నారు నరసింహరాజు. చాందిని, సుమన్, అరుణ్, గాంధీ, చైల్డ్ ఆర్టిస్ట్ ధన్వీ తదితరులు మాట్లాడారు. -
ఎక్కడుంటాడు?
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరో, హీరోయిన్లుగా, రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేసి, నిర్మాత సి. కల్యాణ్‌కి ఇచ్చారు. ‘‘అక్కడొకడుంటాడు.. ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని శివ కంఠంనేని అన్నారు. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు శ్రీపాద విశ్వక్. ‘‘పైరసీలో కాకుండా థియేటర్లో చూస్తేనే మా సినిమా సాంకేతికంగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. ‘అల్లరి’ రవిబాబు మాట్లాడారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం
‘‘ఈశ్వర్‌కు హీరో కావాలనే గొప్ప కల ఉంది. ఆ కలను అతని తల్లి దండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లోనే కాదు. ఏ రంగంలో అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకుంటే రాణించడం కష్టం’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈశ్వర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బ్యానర్ లోగోను నిర్మాత కిరణ్, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆడియో బిగ్ సీడీని నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు అచ్చిరెడ్డి. ఆర్. రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని 75 రోజుల్లో పూర్తి చేశాం. టీమ్ ఎంతగానో సహకరించారు. ఇందులో మంచి సందేశం ఉంది. ఈ సినిమాను ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ డిఫరెంట్ పాయింట్‌ను టచ్ చేశాం’’ అన్నారు. ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఉదయ్ కుమార్. ‘‘తొలి సినిమాలోనే అన్నపూర్ణమ్మ, పోసాని, సురేష్‌గార్ల వంటి సీనియర్ నటులతో నటించడం హ్యాపీ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈశ్వర్. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు సురేశ్, కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు భీమ్స్, అంకిత, టువ మాట్లాడారు. -
సపోర్ట్ చేయడం నా బాధ్యత అనుకున్నా
‘‘సౌత్ ఇండియన్ సినిమాల్లో నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా వైరల్ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్లో వైరల్ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్ లవ్’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్, రోషన్ ముఖ్య తారలుగా ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు సౌతిండియా అంటే పిచ్చి. నా ప్రొఫెషన్లో సౌతిండియన్ యాక్టర్ అని రాసుకుంటాను. నేను దక్షిణాదికి చెందినవాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. మలయాళం, కర్ణాటకవాళ్లు కూడా నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్‌నే. నా సినిమాలను కేరళవాళ్లు సొంత సినిమాల్లాగా ఆదరిస్తున్నారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న మలయాళ సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయాలని భావించా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సమయంలో వినోద్ రెడ్డిగారిని ‘బన్నీ’వాసు పరిచయం చేశాడు. ఆయన అడగ్గానే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నేను ఎంత కాలం నిలబడగలనో తెలియదు కానీ.. అవకాశం ఉన్న ప్రతిసారీ నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరి కోసం నిలబడతా’’ అన్నారు. ‘‘మలయాళంలో ఎంత మంది స్టార్స్ ఉన్నా మా సినిమా వీడియోను ఎవరూ షేర్ చేయలేదు. అల్లు అర్జున్‌గారు మాత్రమే షేర్ చేశారు’’ అన్నారు ఒమర్ లులు. ‘‘అల్లు అర్జున్‌గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి స్టేజ్‌పై నిలబడే అవకాశం వస్తుందనుకోలేదు. ఆయన్ను కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ’’ అని ప్రియా ప్రకాష్ వారియర్ అన్నారు. ‘‘మా యూనిట్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్రసమర్పకుడు వినోద్ రెడ్డి. ‘‘సీతారామరాజుగారు, సురేశ్‌గారి సపోర్ట్‌తో ‘లవర్స్ డే’ సినిమా అవకాశం దక్కించుకున్నాను. అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అని ఎ.గురురాజ్ అన్నారు. నటుడు అలీ, నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ, పాటల రచయిత చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లవర్స్ డే’ వేడుకలో బన్నీ
-
పెద్దపులి
ఆయన ఒక సంగీత విద్వాంసుడు. వయొలిన్ వాయించాడంటే మండుటెండల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేరు. ఆయన ఒకసారి ఒక సర్కస్ చూడటానికి వెళ్లాడు. అక్కడొక సర్కస్ కళాకారుడు వయొలిన్ వాయిస్తుంటే ఒక ఎలుగుబంటి డాన్స్ చేసింది. ప్రేక్షకుల చప్పట్లతో సర్కస్ టెంట్ మార్మోగింది. అది చూసిన మన వయొలిన్ విద్వాంసుడు ‘‘బాగా తర్ఫీదునిచ్చిన ఎలుగుబంటి మాత్రమే నీ వయొలిన్‌కు తగినట్టు నాట్యం చేయగలదు. కాని నా సంగీతంతో ఎటువంటి జంతువు చేతనైనా నాట్యం చేయించగలను’’అన్నాడు గొప్పగా. ‘‘అది సాధ్యం కాదు’’ అన్నాడు సర్కస్ కళాకారుడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగి పోటీకి దారితీసింది. దాంతో వయొలిన్ విద్వాంసుడికి ఎదురుగా ఒక సింహాన్ని పంపాడు సర్కస్ కళాకారుడు. వయొలిన్ నాదానికి చిందులేస్తూ ఆడింది సింహం. ఆ తరువాత ఒక చిరుతపులిని పంపాడు. అది కూడా వయొలిన్ సంగీతానికి మైమరచి నాట్యం చేసింది. తరువాత ఒక పెద్దపులి వంతు వచ్చింది. ఏమాత్రం బెదిరిపోకుండా అద్భుతంగా వయొలిన్ వాయించసాగాడు విద్వాంసుడు. అయితే ఆ పులి సంగీతానికి అసలు ఏమీ మైమరచిపోకుండా పంజావిప్పి వయొలిన్ విద్వాంసుడి మీదికి దూకబోయింది. బిత్తరపోయిన ప్రేక్షకులు చెల్లాచెదరయ్యారు. విద్వాంసుడు కూడా వయొలిన్‌ను కిందపడేసి పరుగుతీసి పులిబారి నుంచి తప్పించుకున్నాడు. సర్కస్ సిబ్బంది ఒడుపుగా పులిని బోనులో బంధించారు. ప్రాణభయం నుంచి తేరుకున్న సంగీత విద్వాంసుడు సర్కస్ కళాకారుని ముందు తన ఓటమిని అంగీకరిస్తూనే, ఆ పెద్దపులి తన సంగీతానికి కట్టుబడకపోవడం తనకెంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. అందుకు సర్కస్ కళాకారుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘ఆ పెద్ద పులి పుట్టినప్పుడే దానికి చెవుల్లేవు. ఈ సంగతి గమనించిన ప్రేక్షకులు పారిపోవడం ప్రారంభించారు. మీరు అది గమనించకుండా వయొలిన్ వాయిస్తూనే ఉన్నారు’’అన్నాడు. సంగీత విద్వాంసుడు తల దించుకున్నాడు. ఈ కథను చెప్పిన గురువు తన శిష్యులతో– చదువు, తెలివి, చురుకుదనం మాత్రమే ఉంటే చాలదు. వర్తమానం గురించిన స్పృహ కూడా అవసరం. ఈ వివేకం లేనివారికి ఎన్ని తెలివితేటలున్నా ఏవిధమైన ప్రయోజనమూ ఉండదని గ్రహించాలి’’ అని బోధించాడు. – డి.వి.ఆర్. -
పెళ్లికూతురు కనిపించడం లేదు!
బెంగాలీ చిత్రం ‘అగ్నిపరీక్ష’ ఆధారంగా వచ్చి, అచ్చ తెలుగు చిత్రంలా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఆ దేవాలయ పరిసరాల్లో ఎవరిగోల వారిది అన్నట్లుగా ఉంది. ఆ గోల మధ్యలో నుంచే...‘పెళ్లికూతురు కనిపించడం లేదు’ అని పెద్దకేక ఒకటి వినిపించింది.తన కారు దగ్గర నిల్చున్న కైలాసం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకు వచ్చారు. ఆ ఇద్దరిలో అరవై సంవత్సరాల వ్యక్తి ఆందోళనగా...‘‘అబ్బాయ్ అబ్బాయ్...ఇటు పిల్ల పారిపోయి వచ్చింది. నీకేమైనా కనిపించిందా?’’ అని అడిగాడు.‘‘మీ అమ్మాయా?’’అడిగాడు కైలాసం.‘కాదు’’ అన్నాడు పెద్దాయన.‘‘మీ మనవరాలా?’’‘‘కాదు... నా పెళ్లాం’’ తాపీగా సమాధానం ఇచ్చాడు పెద్దాయన.అదిరిపడ్డాడు కైలాసం.‘‘నీకు పెళ్లాం కూడానా!’’ వెటకారం చేశాడు కైలాసం.‘‘ఆ... ఇంకా పెళ్లి కాలేదు. వీరికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకునేలోపే ఆ పిల్ల పారిపోయింది’’ అసలు విషయం చెప్పాడు ఆ పెద్దాయనపక్కాయన.‘‘మంచిపని చేసింది’’ మనసులోని మాటను గట్టిగా అన్నాడు కైలాసం.‘‘మంచిపని చేసిందా మంచిపని...’’ అంటూ కైలాసం పైకి ఒంటి కాలి మీద లేచాడు పెద్దాయన.‘‘లేకపోతే ఈ వయసులో పెళ్లేంటి... పండ్లవి ఊడిపోయి’’ వెటకారానికి పదును పెట్టాడు కైలాసం.‘అన్నావు... నువ్వు ఇదే అన్నావు. ఈరోజుల్లో ఈ కుర్రాళ్లందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు కలిసి శేరు బియ్యం తిను నీ సంగతి ఏందో తెలుస్తుంది’’ సవాలు విసిరాడు పెద్దాయన.‘‘మేము తినేది అన్నం. బియ్యం కాదు తాతయ్య’’ వ్యంగ్యంగా అ సవాలుకు చురక పెట్టాడు కైలాసం.తాత అనగానే ఆ తాతగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇలా విరుచుకుపడ్డాడు...‘‘తాతయ్యట తాతయ్య! నువ్వు నా కూతురి కొడుకువా? కొడుకు కొడుకువా!’’పరిస్థితి చేయిదాటుతుందని పసిగట్టిన పెద్దాయన పక్కాయన...‘‘వీడితో మనకెందుకండీ... పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం పదండి’’ అంటూ తొందరచేశాడు.‘‘పడుచోడు బయలుదేరారండి... బయలుదేరాడు’’ అంటూ కారు స్టార్టు చేశాడు కైలాసం.కొద్దిదూరం ప్రయాణం చేసిన తరువాత నీటి కోసం ఒక జలపాతం సమీపంలో ఆగాడు. జలపాతం దగ్గరికి వెళుతున్నప్పుడు ఒకచోట అమ్మాయి కనిపించింది.‘ఎవరది? వరూధినా? లేక కామిని పిశాచమా? ఆడమనిషే... ఆ సింగారమంతా చూస్తే ఎవరో ప్రియుడి కోసం వచ్చినట్లుంది’ అనుకున్నాడు చేతిలో డబ్బా పట్టుకున్న కైలాసం. అక్కడ ఆమె ఇలా అనుకుంది...‘వీడెవడు? చేతిలో డబ్బా వీడూనూ! ఆ డొక్కు కారు డ్రైవరు కాబోలు. నేను డిక్కీలో నుండి దిగడం చూశాడేమో’’‘ఇదే ప్రేమతతంగమైతే గంట ముందు వచ్చి మగాడు పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడా మగపురుగు కనబడడం లేదు. బహుశా ఆ మగధీరుడు ఏదో మోసం చేసి ఉండాలి’ అనుకున్నాడు కైలాసం. ‘ఎందుకైనా మంచిది కాస్త దగ్గరికి వెళ్లి చూద్దాం’ అంటూఅడుగులు వేశాడు.‘వీడికి ఏదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకలా నా వైపు చూస్తున్నాడు’ ఆమె అనుమానపడింది.కైలాసం తన వైపు రావడం గమనించి.‘హమ్మయ్యో ఇటే వస్తున్నాడు. ఈ మగాళ్లకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటపడతారు’ అని విసుక్కుంది.‘ఈ పిల్ల ఆ పిల్లే... పెళ్లిపీటల మీది నుంచి తప్పించుకొని వచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకొచ్చిందబ్బా? ముసలాడికి ఇచ్చి కట్టబెడితే ఏంచేస్తుంది? చావాలనే వచ్చి ఉంటుంది’ తనే ప్రశ్న వేసుకొని సమాధానం తనే చెప్పుకున్నాడు కైలాసం.ఛీ వెధవ బతుకు. చావడానికి కూడా అడ్డేనా నాకు’ తనను తాను విసుక్కుంది ఆ అమ్మాయి.‘నేను అడ్డనుకుంటుందేమో! నా దారిన నేను పోయినట్లు నాటకం ఆడతాను’ అని వెనక్కి వెళుతున్నట్లు నటించాడు కైలాసం.హమ్మయ్య వెళ్లిపోయాడు’ అని ఆమె ఆత్మహత్యకు సిద్ధపడుతున్న సమయంలో...‘‘ఏవండీ... ఆగండి... మిమ్మల్నే... మిమ్మల్నే’’ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు కైలాసం.‘‘ఏమిలేదండీ... ఏమీ లేదు’’ అని బుకాయించబోయింది ఆమె.‘‘లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి’’ ‘‘లేదండి’’ ‘‘చూడండి మీకు చావు అంటే అనుభవం లేనట్లుంది. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసళ్లు ఉంటాయి. అవి కరకర మింగి నములుతాయి’’ ‘‘అయ్యబాబోయ్.... ఈ నీటిలో మొసళ్లు ఉంటాయా?’’‘‘ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడైనా చూసి బయటికి లాగితే మీరు బతికిపోతారు. చావాలని చావకుండా బతికున్నందుకు పోలీసులు కేసులు పెడతారు’’‘‘కేసా? అమ్మయ్యో’’‘‘బతికి ఉంటే ఊరుకుంటుందా ప్రభుత్వం. శిక్ష వేస్తుంది. జైల్లోకి పంపించేస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీక మీదికి వస్తుంది’’‘‘మీకా?’’‘‘అవును. ఆత్మహత్య ప్రయత్నానికి సాయపడ్డానని మధ్యలో నన్ను జైల్లో కుక్కుతారు. చూశారా... చావంటే ఎంత చావో’’‘‘ఇవేమీ నాకు తెలియవండీ’’‘‘తెలియకపోతే నాలాంటి వాళ్లను అడిగి తెలుసుకోవాలి. అది సరే మీరు ఎందుకు చావాలనుకుంటున్నారో కాస్త టూకీగా చెబుతారా?’’‘‘బతకడం అనవసరం అనిపించింది’’ చెక్‌పోస్ట్ దగ్గర... ‘‘ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్లు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు?’’ అన్నాడు సీనియర్ కానిస్టేబుల్ జూనియర్‌తో.‘‘అంతే బాబాయ్’’ అన్నాడు జూనియర్ తల ఊపుతూ.‘‘ఛా... బాబాయ్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా! డ్యూటీలో ఉండగా సార్ అనాలి. జాగ్రత్త. ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏంచెప్పాలో చెప్పు!’’‘‘సరే సార్! ఆ రిపోర్ట్ అడిగిన వాళ్లను ఒక వివరం అడగడం మరిచిపోయాం సార్’’ అన్నాడు జూనియర్.‘‘ఏమిటది?’’ అడిగాడు సీనియర్.‘‘ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా?’’ -
డిఫరెంట్ ఉన్మాది
‘‘ఉన్మాది’ లాంటి సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎన్.ఆర్. రెడ్డిగారు ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. హీరోయిజమ్, విలనిజమ్ చూపించదగిన పాత్రలో ఎన్.ఆర్. రెడ్డిగారు నటించారు. తమిళ్లో రాజ్‌కుమార్‌గారు కూడా ఇదే వయసులో హీరోగా పరిచయం అయ్యారు’’ అని డైరెక్టర్ ఎన్.శంకర్ అన్నారు. ఎన్.ఆర్. రెడ్డి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉన్మాది’. ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో ఎన్. రామారావు నిర్మించారు. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత రాజ్‌కందూరి విడుదల చేయగా, ట్రైలర్‌ను ఎన్.శంకర్ ఆవిష్కరించారు. ‘‘స్వర్గీయ హరికృష్ణగారికి నేను ఫ్యాన్. ఆయనే నాకు స్ఫూర్తి. ‘ఉన్మాది’ సినిమాలో ఒక్కసారైనా ఆయనలా కనిపించాలని ప్రయత్నించాను. రాఘవ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు ఎన్.ఆర్.రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: దంటు వెంకట్, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి. -
విశాఖలో ‘ఎఫ్2’ ఆడియో విడుదల వేడుక
-
తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి
‘‘హలో వైజా........గ్.. సౌండ్ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్ ఉత్సవాల్లో మా ‘ఎఫ్ 2’ సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్ 2’ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నాకెంతో క్లోజ్. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్) రాలేదు. దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్ 2’ సినిమాకి మరో బ్రదర్ వరుణ్ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బాలయ్య బాబు (యన్.టి.ఆర్. కథానాయకుడు), చరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్ ఆల్మోస్ట్ ఓ ఫ్యామిలీ మెంబర్. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు. అనిల్ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అయితే ‘ఎఫ్ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్ కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్ 2’కి దేవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్ సార్ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్ వైజాగ్ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్ మెషీన్లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్ ప్రొడ్యూసర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
-
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
హైదరాబాద్‌లో శుక్రవారం ‘యన్‌టిఆర్’ సినిమా ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర హీరో బాలకృష్ణ, హీరోయిన్ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. వీరితో పాటు నటీనటులు జమున, గీతాంజలి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, సుమంత్, రానా, తారకరత్న, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ‘కళాబంధు’ టి.సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, నాజర్, నరేశ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మరో రజనీ రారు
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతున్నారు త్రిష. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. మంచి అవార్డులనూ సొంతం చేసుకున్నారు. నటన పట్ల ఎంతో తపన, ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే కానీ ఈ ఫీట్స్ సాధ్యం కావు. కానీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఉన్న క్వాలిటీస్లో తనకు పది శాతం ఉన్నా ఇంకా బెటర్‌గా ఉండేదాన్నని అంటున్నారు త్రిష. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రంలో నటించారు త్రిష. ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. అక్కడ త్రిష మాట్లాడుతూ– ‘‘కోలీవుడ్‌లో మరో రజనీకాంత్ రారు. ఆయనలో ఉన్న క్యాలిటీస్లో కనీసం పది శాతం నాలో ఉన్నా నేనూ ఇంకా బెటర్ పర్సన్ అయి ఉండేదాన్ని. ‘ఏదైనా పనికి ఒకసారి నువ్వు కమిట్ అయితే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే తిరిగి వెళ్లాలి’ అని రజనీకాంత్‌గారు షూటింగ్ టైమ్‌లో చెప్పిన విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘పేట్టా’లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి నటించారు త్రిష. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘పేట్టా’ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. -
‘కేజీఎఫ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే!
ప్రాణంగా ప్రేమించే అమ్మాయి హఠాత్తుగా కనిపించకపోతే, వెతికిన జాడ తెలియకపోతే అప్పుడా ప్రేమికుడు విరహంలోకి వెళ్లిపోతాడు. ఇటీవల శర్వానంద్ కూడా అలాగే వెళ్లిపోయి.. ‘‘ఏమైపోయావే నీవెంటే నేనుంటే.. ఏమైపోతానే.. నువ్వంటూ లేకుంటే’ అని పాడుకున్నారు. మరి.. ఆయన ప్రేమకథకు ఎలాంటి శుభం కార్డు పడింది? ఇంతకీ.. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం ఈ నెల 21న విడుదలయ్యే ‘పడిపడిలేచె మనసు’ సినిమాలో తెలుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో జ్యూక్‌బాక్స్‌ను మార్కెట్లోకి నేరుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. హైదరాబాద్, నేపాల్, కోల్‌కతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మురళీ శర్మ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా రామన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో...
‘‘యు’ చిత్రదర్శకుడు, హీరో కొవెర అసలు పేరు రాజేంద్ర. నేను, తను కలిసి ఇంటర్ చదువుకున్నాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాతో చాలా విషయాలు డిస్కస్ చేసేవాడు. తన సినిమాలో సెన్సిబుల్ పాయింట్ ఉంటుందనే నమ్మకం ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ, రాజేంద్ర తొలి సినిమాతోనే ఆ ప్రయత్నం చేయడం గొప్ప విషయం’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. కొవెర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ట్యాగ్ లైన్. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మి కొండా నిర్మించారు. సత్య మహావీర్ స్వరపరచిన ఈ సినిమా పాటలను శ్రీవిష్ణు విడుదల చేశారు. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్, అఖిల్, శ్రీవిష్ణు.. ఇలా అందరికీ కథలు చెప్పాను. ఓ డైరెక్టర్ హీరోను ఎలా ఒప్పిస్తాడు? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా. కథ బావుంటే డైరెక్షన్ అవకాశం ఇచ్చేయరు. ఎందుకంటే.. మనల్ని నమ్మి ఓ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు.. ఆ రిస్క్ డైరెక్టర్ భరిస్తాడా? లేదా? అనే కోణంలో నిర్మాతలు ఆలోచిస్తారు. రాజమౌళిగారే 400 కోట్ల రూపాయల సినిమా ఎందుకు చేయగలిగారు. ఆ రిస్క్‌ను తీసుకున్నారు కాబట్టి పెద్ద బడ్జెట్ మూవీ చేశారు. అందుకే నేనూ రిస్క్ తీసుకుని హీరోగా నటించి, దర్శకత్వం చేసి, ఈ సినిమా నిర్మించా. ఎక్కువ రిస్క్ తీసుకున్నాను కాబట్టే ఎక్కువ కష్టపడ్డానని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్స్‌ని మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. -
‘కేజీఎఫ్’ టీమ్ మూడేళ్ల కష్టం తెలిసింది
‘‘కేజీఎఫ్’ సినిమా నిర్మాణంలో మా అబ్బాయి కూడా పాలు పంచుకున్నాడు. ఈ సినిమా పార్ట్ వన్‌తో పాటు రెండో భాగం కూడా పెద్ద విజయాన్ని సాధించాలి. ఈ సినిమా ట్రైలర్ చూడగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. సినిమా ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావిస్తున్నా. సక్సెస్‌కు ట్రైలర్ ఓ నాందిగా అనిపిస్తోంది’’ అని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ అన్నారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కైకాల సత్యనారాయణ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా బిగ్ సీడీ, ఆడియో సీడీలను హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ఉన్నా. దాదాపు 800 సినిమాలు చేశా. కన్నడలో కంఠీరవ రాజ్‌కుమార్ నాకు మంచి మిత్రుడు. యష్ భవిష్యత్‌లో ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగుతాడు’’ అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఓ బస్ డ్రైవర్ కొడుకైన యష్ కన్నడ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయ్యారు.కొడుకు సూపర్‌స్టార్ అయినా తండ్రి ఇంకా బస్ డ్రైవర్‌గానే ఉన్నారు. యష్ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్.. ఆయనకు హ్యాట్సాఫ్. ఈ ఏడాది బెంగళూరుకి ‘ఆర్ ఆర్ ఆర్’ కథా చర్చలకు వెళ్లినప్పుడు యష్ నన్ను కలిసి, ‘కె.జి.ఎఫ్’ విజువల్స్ చూపించారు. వాళ్లు ఈ సినిమా కోసం పడ్డ మూడేళ్ల కష్టం తెలిసింది. ఏ భాష అయినా సినిమా నచ్చితే ఆదరించే ప్రేక్షకులు తెలుగువాళ్లు మాత్రమే. ఆ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఈ సినిమా తెలుగులోనే కాదు.. ఇండియా అంతటా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు.‘‘మేమంతా ఇక్కడ ఈరోజు నిలబడి ఉన్నామంటే కారణం రాజమౌళిగారు. ఆయన ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు. పెద్దగా కలలు కనండి అని మాకు నేర్పించారు. సినిమాలకు సరిహద్దులను చెరిపేశారు. ఇప్పుడు బడ్జెట్ చిన్న విషయమైపోయింది. విజన్ చాలా పెద్ద విషయంగా నిలుస్తోంది. కైకాల సత్యనారాయణగారి పేరుని మా పోస్టర్‌పైన వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ నీల్. ‘‘మా ‘కె.జి.ఎఫ్’ సినిమా తెలుగులో భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి కారణం సాయి కొర్రపాటిగారు’’ అన్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. ‘‘సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ రైతు రాజమౌళిగారు. మీ సినిమాలు బావుంటే మేం సపోర్ట్ చేస్తాం. మా చిత్రాలు బావుంటే మీరు సపోర్ట్ చేయండి’’ అని యష్ అన్నారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఎన్వీ ప్రసాద్, సాయి కొర్రపాటి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్ భువన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి పాల్గొన్నారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ ఆడియో లాంచ్
-
శ్రీకాంత్ నా లక్కీ హీరో
‘‘నాది ఖమ్మం. 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. డి.ఎస్.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అదే నాకు ఈ రోజు బాగా ఉపయోగపడింది’’ అని డైరెక్టర్ హరీష్ వడ్త్యా అన్నారు. శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సంగీత ముఖ్య తారలుగా హరీష్ వడ్త్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. నందన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను శ్రీకాంత్, మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ విడుదల చేశారు. హరీష్ వడ్త్యా మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నాకెవరూ గాడ్‌ఫాదర్ లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతగారే నా దేవుడు. మరో సినిమా కూడా నాతో చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు మొహ్మద్ జాకీర్ ఉస్మాన్. ‘‘మై లక్కీ హీరో శ్రీకాంత్. మేమిద్దరం ఐదు చిత్రాల్లో నటించాం. ఈ చిత్రం నా సెకండ్ ఇన్నింగ్స్’’ అన్నారు సంగీత. ‘‘ఎక్కడా ఏ పొరపాటు రాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని చాలా చక్కగా చేసిన చిత్రమిది’’ అని శ్రీకాంత్ అన్నారు. జిషాన్ ఉస్మాన్, మ్యూజిక్ డైరెక్టర్ నందన్, దర్శకుడు సాగర్, నటులు బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, దర్శకుడు రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
నా సెల్ఫీ.. ఓ సందేశం
శ్రీ చరణ్ సెన్సేషనల్ మూవీస్‌పై చిరుగురి చెంచయ్య, సుగుణమ్మ సమర్పిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్ ప్రభాకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సతీశ్రాయ్ కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మాలపాటి స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకులు యన్.శంకర్, దేవీ ప్రసాద్, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఇది నా సెల్ఫీ’ అనగానే అందమైన సెల్ఫీల గురించి అనుకుంటారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలను, జ్ఞాపకాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు యన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘నటీనటులందరూ బాగా నటించారు. పాటలన్నీ బాగున్నాయి. అన్ని ఎమోషన్స్‌తో కూడిన పాటలు ఉన్నాయి’’ అన్నారు. -
మాటంటే పడడురా
విజయ్ ఆంటోనీ నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘రోషగాడు’. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నివేథా పేతురాజ్ కథానాయిక. ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రోషగాడు రా.. వీడు మాటంటే పడడురా’ అంటూ సాగే థీమ్ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ పక్కా కమర్షియల్ చిత్రం తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ. -
సుడిగాలి వస్తోంది
వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత ముఖ్య తారలుగా రమేష్ అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘సుడిగాలి’. శివపార్వతి క్రియేషన్స్‌పై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. రాప్ రాక్ షకీల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎమ్మెల్సీ రాములు నాయక్, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ‘సుడిగాలి’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు రాములు నాయక్. ‘‘యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రంలో సుమన్‌గారు మంచి పాత్ర చేశారు. సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు’’ అన్నారు రమేష్ అంకం. ‘‘సుడిగాలి’తో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకటేశ్. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సమర్పణ: చెట్టుపల్లి లక్ష్మి. -
ప్రేక్షకులకు ఆ పట్టింపులు లేవు
‘‘బెక్కెం వేణుగోపాల్ నా వద్దకు వచ్చి సినిమా తీస్తున్నానని చెప్పగానే నవ్వాను. ఏదో విషయం ఉంటే తప్ప సినిమాలు ఆడటం లేదని చెప్పాను. ఎకానమీ బడ్జెట్లో తీస్తున్నానని చెప్పడంతో సరే అని చెప్పా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని ముఖ్య తారలుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘నానానా’ అనే పాటను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, వీళ్లేమో నన్ను పిలిచి పాటను విడుదల చేయమన్నారు. భవిష్యత్తులో వీళ్ల దారికే నేను రావాల్సి ఉంటుందేమో. ప్రేక్షకులిప్పుుడు మంచీ, చెడు ఆలోచించడం లేదు. ఎంటర్టైన్ అయ్యామా? లేదా? అని చూస్తున్నారు. అంతేగానీ లిప్‌లాక్‌లున్నాయా, ఇంకోటున్నాయా? అనే పట్టింపులు లేవు’’ అన్నారు. ‘‘శ్రీహర్ష చెప్పిన ‘హుషారు’ కథ నచ్చడంతో సినిమా మొదలుపెట్టి, పూర్తి చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత రథన్ సంగీతం అందించిన సినిమా ఇది. తేజస్ మినహా అందరూ కొత్తవారే అయినా బాగా చేశారు’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘ఈ రోజుల్లో లైఫ్‌కి గ్యారంటీ లేదు. ప్రతి సెకనూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారనే కథతో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు శ్రీహర్ష. అసోసియేట్ నిర్మాతలు లింగా శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు రథన్, భాస్కరభట్ల, తేజస్, అభినవ్, ప్రియా వడ్లమాని, తేజ పాల్గొన్నారు. -
నేను గర్వంగా ఫీల్ అయ్యే చిత్రం బేవర్స్
‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలే కాదు, పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే. సినిమా చూసిన తర్వాత టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. మంచి సామాజిక స్పృహ ఉన్న చిత్రం చేశా అనే తృప్తి మిగిలింది. మనకంటే మనం చేసిన పాత్రలే గుర్తుండాలి. పాత్రల వల్లే నటులు గుర్తుంటారు’’ అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. రమేష్ చెప్పాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో సంజోష్, హర్షిత జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్’. పొన్నాల చందు, ఎం.ఎస్. మూర్తి, అరవింద్ నిర్మించారు. అక్టోబర్ 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా ఫీల్ అయ్యే పది సినిమాల్లో ‘బేవర్స్’ ఉంటుంది. నేను రుణపడే దర్శకుల్లో రమేశ్ కూడా ఉంటారు. సుద్ధాల అశోక్‌తేజ మంచి పాటలు రాశారు’’ అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో కలసి నటిస్తాననుకోలేదు. ఆయనతో ప్రేమలో పడి పోయా. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు సంజోష్. ‘‘ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా పని చేసిన రమేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌గారిని జీవిత సాఫల్య పురస్కా రంతో సత్కరించడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు. ‘‘మహానటుడు రాజేంద్రప్రసాద్‌తో యాక్ట్ చేయడం గర్వంగా ఉంది. కాశం నమశివాయగారి వల్లే చిత్రం పూర్తి చేశాం’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘బేవర్స్ చెడ్డ పదం కాదు. ఎందుకూ పనికి రాని వాడు అని అర్థం. స్క్రీన్ మీద రాజేంద్రప్రసాద్ ఉన్నారు, రమేశ్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘రాజేంద్రప్రసాద్ అంటే నవ్వులే. ఆ నవ్వుల వెనక ఫిలాసఫర్ కనపడతారు నాకు. ప్రధాని పీవీ నరసింహా రావు కూడా ఆయన సినిమాలు చూసి సేద తీరేవారట. నాతో ప్రత్యేకంగా పాట రాయించుకున్నారు’’ అన్నారు సుద్ధాల అశోక్ తేజ. -
విపత్తు ఏంటి?
చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా, రాధిక హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గండభేరుండ’. సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. శ్రీసాయిదేవ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ని దర్శక–నిర్మాత సాయివెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘గండభేరుండ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సూర్యన్ మాట్లాడుతూ– ‘‘గండభేరుండ’ అనే పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే కథాంశంతో రూపొందిన సోషియో ఫ్యాంటసీ హారర్ ఎంటర్టైనర్ చిత్రమిది. మలేసియాలో చేయించిన 17 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5న విడుదల కానున్న మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు చల్లమళ్ల రామకృష్ణ. రాధిక, పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, డైరెక్టర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
‘దేవదాస్’ ఆడియో వేడుక
-
నేను అనుకున్నవన్నీ జరుగుతాయి
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే. లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు. ‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను. నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు. వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ. -
‘సర్కార్’ వేడుకకు రజనీ
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కార్. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన తుపాకి, కత్తి సినిమాలు ఘన విజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సన్ పిక్చర్స్ భారీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను అక్టోబర్ 2న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే వేదికపైకి రానుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనాల వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చెపాక్ స్టేడియంకు పర్మిషన్ రాని పక్షంలో నెహ్రూ ఇండోర్ స్టేడియం లేదా వైఎమ్‌సీఏ స్టేడియాలలో ఒకదానిని ఫైనల్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్ కల్యాణ్‌గారు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా హిట్ సాధించాలి. ఎ.ఎల్. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు క్రిష్. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్ చేసిన కల్యాణ్‌గారికి థ్యాంక్స్. హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్ సినిమా అనే కంటే ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్ డ్యాన్సర్’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు రాజ్ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
‘నీవెవరో’ ఆడియో రిలీజ్
-
ఎదురులేని మనిషి
హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై భాగ్యలక్ష్మి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రబృందం ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే సాంగ్ రూపొందించారు. ఈ పాటను వైఎస్ జగన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లా డుతూ –‘‘జగన్‌గారి అభిమాని, మా హీరో హరి కోరిక మేరకు ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించాం. ఈ పాట వైఎస్‌గారి అభిమానులకు, జగన్‌గారిని ప్రేమించే వారికి నచ్చేలా ఉంటుంది. సీడీలను ఆవిష్కరించిన జగన్‌గారు మా హీరో హరి, చిత్ర యూనిట్‌ను అభినందించారు’’ అన్నారు. ‘‘ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకులు జగన్‌గారి కోసం ఓ పాట చేద్దామనే ఆలోచన వచ్చింది. నాన్నగారికి చెప్పటంతో ‘ఎదురులేని మనిషి జననేత జగనన్న’ అనే పాటను రూపొందించారు’’ అన్నారు హరి జొన్నలగడ్డ. అక్షిత, ఝాన్సీ, గంగారావు నటించిన ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ చిత్రానికి కెమెరా: పి.ఎస్ వంశీ ప్రకాశ్. -
గీత గోవిందం ఆడియో విడుదల హైలైట్స్
-
‘ఈ మాయ పేరేమిటో ’ ఆడియో వేడుక
-
‘గీత గోవిందం’ ఆడియో రిలీజ్
-
అప్పుడు విజయ్ మాస్టర్ జాగ్రత్తలు చెప్పారు
‘‘సినిమాల్లో మేం చేసే ఫైట్లకు అప్లాజ్ వస్తుంది. అయితే వాటిని చేయించిన ఫైట్ మాస్టర్లను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ వారు పడే శ్రమ మెచ్చుకోవాల్సిందే. విజయ్ మాస్టర్, ఆయన శ్రీమతిగారు కలిసి కన్న కలలకు ప్రతి రూపం ఇద్దరు బిడ్డలు. వారిద్దరూ ప్రయోజకులు అవుతుంటే వాళ్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపర్ హీరోయిన్. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని సీడీ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విజయ్ మాస్టర్‌గారు నేర్పారు. విజయ్ మాస్టర్‌ది ప్రేమ వివాహం. ఆయన శ్రీమతి ఆయన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని విజయ్ మాస్టర్ ఎప్పుడూ వమ్ము చేయలేదు. చాలా కష్టపడి పైకి ఎదిగారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా ను’’ అన్నారు. ‘‘ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.. మీరేం సాధించారు అని ఒకరు అడిగితే ఇండస్ట్రీ అనేది తల్లి. ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే నేర్చుకుంటాం. కానీ ఇక్కడ సాధించడం ఏమీ ఉండదు. ఎన్టీఆర్ ఆనందంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేది నా నమ్మకం. మంచి మనసున్న మనిషి ఎన్టీఆర్. నేనేం సాధించానో నాకు తెలియదు కానీ ఎన్టీఆర్ ఫంక్షన్‌కి రావడం మాత్రం నా సాధనగానే భావిస్తున్నా. టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. మణిశర్మగారు మాకు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. మా పిల్లలు ఇంత దూరం రావడానికి కారణం మా టెక్నీషియన్లు. వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అన్నారు విజయ్. ‘‘ఇది నాకు ప్రత్యేకమైన రోజు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరూ నా చిన్నతనంలో నన్ను పెంచారు. తెలిసిన వాళ్ల మధ్యలో పని చేయడం కొత్తగా అనిపించలేదు. అందరి ఇళ్లల్లో జరిగే కథతో ఈ సినిమాను తీశాం. నటీనటులు చాలామంది ఉన్నారు. వాళ్లందరి దగ్గర నుంచి ఎలా పనిచేయాలో నేర్చుకున్నా’’ రాహుల్ విజయ్ అన్నారు. ‘‘నా తొలి సినిమా ‘బద్రి’ నుంచి విజయ్ మాస్టర్‌తో పనిచేస్తున్నాను. మాస్టర్ కొడుకును హీరోగా, కూతురుని నిర్మాతగా చేస్తూ సినిమా చేశారు. వాళ్ళకు శుభాకాంక్షలు’’ అన్నారు çపూరి జగన్నాథ్. ‘‘ఈ సినిమా సమష్టి కృషి. శ్యామ్‌గారు, చిన్నాగారు మా నాన్నకు పిల్లర్స్ లాగా పనిచేశారు. ఎన్టీఆర్ అన్నయ్య మా ఆడియో విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆడియో లాంచ్ అనుకుంటున్నామని అనగానే ఎన్టీఆర్ అన్నయ్య డేట్ ఏంటి? ఎక్కడ? అని అడిగారు’’ అన్నారు దివ్య. ‘‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో ఈ చిత్రకథ మొదలైంది. ఆ కథను నేను విజయ్‌గారికి చెప్పాను. ఆయన ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఈ పాయింట్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. రాహుల్ క్యారక్టర్ బావుంటుంది. విజయ్ మాస్టర్‌గారు నా వెన్నంటి ఉండి నడిపించారు’’ అన్నారు రాము కొప్పుల. -
అర్జున్ రెడ్డి చూసి బాగా డిస్ట్రబ్ అయ్యాను
‘‘తెలుగులో కొంతమంది మంచి నటులు, గొప్ప నటులు ఉన్నారు. విజయ్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇది ఫీమేల్ డామినేటెడ్ సినిమా. విజయ్ ఎంత బాగా చేశాడంటే హీరో.. హీరోయిన్‌కి సమానమైన కథలాగా చేశాడు. ఇద్దరూ ఈక్వల్ పాయింట్స్ కొట్టారు. పరశురామ్‌కి ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగా తీశాడు’’ అని అల్లు అర్జున్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. జీఎ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ –‘‘విజయ్ అడుగుతున్నాడు.. నేను ఎవరి కోసం ఈ ఫంక్షన్‌కి వచ్చాను అని. ‘బన్ని’ వాసు కోసమే వచ్చాను. ఇలా అన్నందుకు సారీ విజయ్. వాసు మంచి సినిమాలు తీస్తాడు. ఆల్ ది బెస్ట్. నా కెరీర్లో మా నాన్నగారి హెల్ప్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ హెల్ప్ వాసూది ఉంటుంది. ఈ సినిమా చూశా. చాలా అంటే చాలా బావుంది. విజయ్, రష్మిక ఇద్దరూ రాక్ చేశారు. నాకు గోపీ సుందర్ మ్యూజిక్ చాలా ఇష్టం. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. నా ‘పరుగు’ సినిమాకు పరశురామ్ అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి మెట్టు మెట్టు ఎదుగుతున్నారు. రష్మిక కన్నడ ‘కిర్రిక్ పార్టీ్ట’లో బాగా చేసింది అని విన్నాను. చూడటం కుదర్లేదు. ఈ సినిమాలో బాగా చేసింది. ఈ కథ చాలా మంది పెద్ద హీరోయిన్స్ దగ్గరకు వెళ్లింది. కానీ రష్మికకే రాసిపెట్టి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశాక వారం రోజులు నేను ఎవర్నీ కలవలేదు. ఏం సినిమాలు చేస్తున్నాం మనం? అనిపించింది. బాగా డిస్ట్రబ్ అయిపోయాను. విజయ్‌కు ఫిల్మ్‌ఫేర్ కచ్చితంగా రావాలి, వస్తుంది అనుకున్నాను. అవార్డ్ నామినేషన్స్‌లో ఉన్న హీరోల్లో విజయ్ అందరికంటే బాగా చేశాడు. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. డాడీ (అల్లు అరవింద్) నీ గురించి ఏం చెప్పాలి? బాగా డబ్బులు సంపాదించాలి. నాకు మంచి కార్ కొనివ్వు (నవ్వుతూ). నా నెక్ట్స్ సినిమా ఏంటో నాకే తెలియదు (అభిమానులను ఉద్దేశిస్తూ). టైమ్ పడుతుంది. వెయిట్ చేయండి ప్లీజ్’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘బన్నీగారి ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు బన్నీగారు ఓ మాట చెప్పారు. ‘100% లవ్’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది’ అన్నారు. కథకి హీరో ఎవరు అని అలోచిస్తుంటే విజయ్ ‘పెళ్లి చూపులు’ రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయింది. కచ్చితంగా స్టార్ అవుతాడు అనుకున్నాను. ఇతనితోనా మనం సినిమా తీయాల్సింది అని కంగారు పడ్డాం. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్’’ అన్నారు .విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను పాడిన పాటను విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. నిద్రపట్టలేదు. మీరెవరైనా పాడి పంపండి. సినిమాలో పెడతాను. ‘బాబు.. నువ్వు ఆడియో ఫంక్షన్లో రచ్చ చేయొద్దు అని మా టీమ్ అంతా చెప్పారు (నవ్వుతూ). మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తుంటే ఆ విజయ్‌తో జాగ్రత్త రా అంటున్నారట. ఈ సినిమా మీ పేరెంట్స్ అందరికీ చూపించి నేను మంచోడినే అని చెప్పండి. బన్నీ అన్న ఈ ఆడియోకి నాకోసం రాలేదు. రీసెంట్గా సినిమా చూశారట. ఇక్కడికి రావడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుంది’’ అన్నారు.‘‘గీత (సినిమాలో తను చేసిన పాత్ర) మేడమ్ నుంచి ఏం నేర్చుకోవాలో తెలియాలంటే అందరూ ఆగస్ట్ 15న థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు రష్మిక. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ రెండేళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఈ కథ అరవింద్‌గారికి ఎంత ఇష్టమంటే నన్ను గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. రెండేళ్ల నుంచి ఏ సినిమా రావట్లేదేంటి అని చాలామంది అడుగుతున్నారు. మా ఆవిడ కూడా అడిగేది – ‘ఏం చేస్తున్నావు రోజూ ఆఫీస్‌కి వెళ్లి?’ అని! నా రెండేళ్ల ఎఫర్ట్ ఈ సినిమా. మా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ అయింది. విజయ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని భయమేసింది. కానీ హిట్ ముందు ఎలా ఉన్నాడో తను ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఒక్క సీన్, డైలాగ్, ఎక్స్ప్రెషన్ ఇలానే ఎందుకు? అని అడగలేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. అనుకున్నదాని కంటే బాగా చేశాడు. గోపీ సుందర్ ఐదు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు’’ అన్నారు.‘‘పరశురామ్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చేస్తున్నప్పుడు ఈ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. నువ్వు వేసిన ముడి బావుంది, దాన్ని విప్పు అన్నాను. ఆ తర్వాత గంట కథ చెప్పాడు. బాగా నచ్చేసి అతన్ని ఆఫీస్‌లోనే కట్టేశాను.‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ తర్వాత కంగారు పడి కలిశాం. ఇతన్ని ఆడియన్స్ ఈ క్యారెక్టర్లో తీసుకోగలరా? అనిపించింది. విజయ్ జెంటిల్‌మేన్. మనిషి మంచోడు. ఏది ఉన్నా ఓపెన్‌గా మాట్లాడతాడు. అదే ట్రెండ్ అయిపోయింది. తను బాగా పాడలేదని క్రిటిసైజ్ చేస్తే దాన్ని కూడా పబ్లిసిటీగా వాడేశాడు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. ‘ఇంకేం కావాలే...’ సాంగ్ వేరే వాళ్లతో పాడించినది పెడదాం అనుకుంటే ‘వద్దు సిడ్ శ్రీరామ్ సాంగే కావాలి, అతనిది డిఫరెంట్ సౌండింగ్. క్లిక్ అవుతుంది’ అన్నాడు విజయ్. యంగ్‌స్టర్స్ అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే నా సక్సెస్ అనుకుంటున్నాను’’ అన్నారు అల్లు అరవింద్. ∙బన్నీ వాసు, అల్లు అరవింద్, పరశురాం, విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా, అల్లు అర్జున్, గోపీ సుందర్ -
సాగర తీరంలో....
‘‘దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర ధర్మారావు పని చేశాడు. టాలెంట్ ఉన్న దర్శకుడు. ‘సాగర తీరంలో’ ట్రైలర్ చాలా బాగుంది. భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మించిన చిత్రం ‘సాగర తీరంలో ’. ఈ చిత్రం పాటలను రేలంగి నరసింహారావు, నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘అమలాపురం, ముమ్మిడివరం, యానాం, ఎన్. రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. -
గీత గోవిందుల కోసం బన్నీ
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఫస్ట్ లుక్, టీజర్లతో పాటు ఇంకే ఇంకే ఇంకే కావాలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన వాట్ ద ఎఫ్ పాటను ఈ రోజు(గురువారం) రిలీజ్ చేశారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన గీత గోవిందం సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూలై 29 సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. -
శ్రీనివాస కళ్యాణం ఆడియో విడుదల
-
పెళ్లి జరుగుతున్న ఫీల్‌ని కలిగిస్తుంది
‘‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా అనుకున్న టైమ్‌కి పూర్తవడానికి నటీనటులు, టెక్నీషియన్స్ కృషి ఎంతో ఉంది. నితిన్ అన్నట్లు.. నేను ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ అసిస్టెంట్లాగానే పనిచేశా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా, రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకానుంది. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శతమానం భవతి’ తర్వాత పెళ్లి కాన్సెప్ట్‌తో సినిమా చేద్దామనుకుంటున్నా అని సతీష్ చెప్పాడు. ‘నేను లోకల్’ సినిమా రిలీజ్ తర్వాత తిరుపతికి వెళ్లా. ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్ పెట్టినప్పుటి నుంచే ఏదో వైబ్రేషన్. నాకే ఐడియాలు వచ్చాయి. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ కథ తయారయింది. నా కూతురి పెళ్లి చేశా.. మనవడు పుట్టినప్పుడు ఆనంద పడ్డా. నా భార్య చనిపోయినప్పుడు బాధపడ్డా. ఈ మూడు ఇన్సిడెంట్లు నా లైఫ్‌లో జరిగాయి. దీన్ని సతీష్‌తో షేర్ చేసుకుంటే ఈ చిత్రం కథకి రౌండప్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే ఎమోషనల్ మూమెంట్సే ఈ సినిమా. ఇందులో పెళ్లి గురించి అద్భుతంగా చెప్పినా, సినిమా చూసిన తర్వాత ఆయా పాత్రల్లో నటించిన వారిని హృదయంలో పెట్టుకుని వెళతారు. ఈ సినిమా చూస్తే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ ఎంత గొప్ప సినిమా అవుతుందనేది ఆగస్టు 9న తెలుస్తుంది. కానీ, ఓ మంచి సినిమా చేశామని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ‘దిల్’ తర్వాత నితిన్‌తో సినిమా అనుకున్నా కుదరలేదు. నితిన్ ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికొచ్చి.. అంకుల్.. నాకు ఓ సినిమా కావాలన్నప్పుడూ కుదరలేదు. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చేయాలని ఉంది కాబట్టే. అది మనకెవ్వరికీ తెలీదు. భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ బ్యూటిఫుల్ మెమొరీ. ‘అ ఆ’ తర్వాత మిక్కీ ఈ చిత్రానికి మంచి పాటలిచ్చాడు. ఇందులో ‘కల్యాణం వైభోగం’ పాట నా సినిమాల్లో టాప్ 3లో ఉంటుంది. ప్రతి పెళ్లిలోనూ ఈ పాట మార్మోగుతుంది. రాజుగారి గురించి నటుల్లో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. ఆయన ఫస్ట్ సినిమా ‘దిల్’ హీరో నేనే కాబట్టి. ‘దిల్’ షూటింగ్ లేకున్నా రాజుగారు పొద్దునే ఆఫీసుకి వెళ్లిపోయి రేపటి సీన్స్ గురించి ఆలోచించేవారు. ‘ఫస్ట్ సినిమాకి వీడికి ఎందుకంత బిల్డప్’ అనుకునేవారు. ‘దిల్’ చిత్రంలో ‘మై నేమ్ ఈజ్ రాజు అంటే.. ఎందుకంత ఫోజు’ అంటాను. ఈ డైలాగ్ కావాలనే సరదాగా పెట్టాం. ఆ సినిమా హిట్ అయింది. మళ్లీ మేం చేయాలనుకున్నా సెట్‌కాలేదు. ‘శ్రీనివాస కళ్యాణం’తో కుదిరింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రాజుగారి క్రమశిక్షణ చూసి నేను షాక్ అయ్యా. ‘దిల్’ టైమ్‌లో ఆయనది ఓవరాక్షన్ అనుకునే వారు. కానీ, అది ఆయన ప్యాషన్. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన అసిస్టెంట్‌లాగా పనిచేశారు. నా సినీ కెరీర్ అయిపోయాక చూస్కుంటే టాప్ 1,2 స్థానాల్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘యుగాలు మారినా, దేవుడు ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి గొప్పదనం గురించి చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలని చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ రోజుల్లో పెళ్లి ఈవెంట్‌గా మారిపోయింది. కానీ, అది బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారని నమ్ముతున్నా’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సమాజానికి విలువలున్న సినిమాలను ఇస్తూ గుర్తింపు పొందుతున్న మంచి సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అందుకే రాజు అంటే నాకు ఇష్టం’’ అన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ‘‘నా 41ఏళ్ల సినీ జీవితంలో ఎన్నోరకాల ఫంక్షన్స్ చూశా. నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినీ ఫంక్షన్‌కి వెళ్లలేదంటే మీరందరూ నమ్మి తీరాలి. కానీ, ఈ రోజు కుటుంబంతో సహా వచ్చానంటే ముఖ్య కారణం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘లేడీస్ టైలర్’, ‘అహనా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాక నాకు భయం వేసింది. ఇక ఎలాంటి సినిమాలు తీయాలని. ‘శతమానం భవతి’ వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ రెండో సినిమా ఏం తీస్తాడులే అనుకున్నవారికి ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తే తెలుస్తుంది. మా డాడీ రామానాయుడిగారి తర్వాత హ్యాట్సాఫ్ టు ‘దిల్’ రాజు. సినిమా అతని శ్వాస. ఇండస్ట్రీ, నాలాంటి నటీనటులు నాలుగు కాలాలపాటు బాగుండాలంటే రాజులాంటి వ్యక్తి ఉండాలి’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్. ‘‘నరేశ్, నేను తొలిసారి ‘పండంటి కాపురం’ లో నటించాం. అది విడుదలై శనివారంతో 46 ఏళ్లు అయింది. ఈ జర్నీలో ఎన్నో పాత్రలు చేశా. బహుశా రామానాయుడుగారి తర్వాత ‘ఆల్ ఇట్స్ ది వే ‘దిల్’ రాజుగారే అనుకుంటున్నా’’ అని జయసుధ అన్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, రాశీఖన్నా, నందిత శ్వేత, మిక్కీ జె. మేయర్, కెమెరామేన్ సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...
‘‘నిర్మాత చంద్రశేఖర్ అన్నీ తానే అయి కె.ఎస్.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్పుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్ సాంగ్ ఆలపించిన బాబూమోహన్ విడుదల చేశారు. కె.ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.బాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఏ.రెహమాన్. -
తర్వాత ఎవరు?
మనోజ్, ప్రియాంక శర్మ జంటగా కమల్ కామరాజు ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత ఎవరు’. జి. కృష్ణప్రసాద్, కె. రాజేష్ దర్శకత్వంలో లక్ష్మిరెడ్డి కె, రాజేష్ కోడూరు నిర్మించారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లాంచ్ చేశారు. మరో జర్నలిస్ట్ చందు రమేశ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. చిత్ర దర్శకులు కృష్ణప్రసాద్, రాజేష్ మాట్లాడుతూ ‘‘రియాలిటీ బేస్డ్ థ్రిల్లర్ మూవీ ఇది. నలుగురు కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన టీమ్‌కి థ్యాంక్స్. ఆగస్టు 3న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకులకు, నిర్మాతలకు థ్యాంక్స్. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మనోజ్. కథానాయిక ప్రియాంక శర్మ పాల్గొన్నారు. -
‘పరిచయం’ ఫస్ట్ డే చూస్తా
‘‘పరిచయం’ టైటిల్ బాగుంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. పృథ్వీ(పెళ్లి ఫేమ్)ఎనర్జిటిక్ ఆర్టిస్ట్. ఈ సినిమాను ఫస్ట్‌డే చూస్తా. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో రానున్న ఈ సినిమా విజయం సాధించాలి. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదల కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ– ‘‘లవ్, ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన చిత్రమిది. స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని, శర్వానంద్, సాయిపల్లవి, హరీష్ శంకర్, మారుతిగార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘దాదాపు 8ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నేరవేరింది. తొలి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్. ‘‘ఏడేళ్ల తర్వాత నేను తెలుగులో నటించిన సినిమా ఇది’’ అన్నారు పృథ్వీ. ‘‘మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహకారం మరవలేనిది’’ అన్నారు రియాజ్. -
కొత్తవాళ్ల ప్యాషన్ చూస్తుంటే ముచ్చటేసింది
‘‘ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్లందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ‘అంతర్వేదమ్’ చిత్రంలో నటించినవారు, యూనిట్ మెంబర్స్ అందరూ కొత్తవారే. సినిమా పట్ల వారి ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’’ అని రచయిత–నటుడు తనికెళ్ల భరణి అన్నారు. అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జె.యస్. నిథిత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ల భరణిగారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. చిత్రకథానాయకుడు అమర్, రైటర్ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు రాంప్రసాద్, ‘రైజింగ్’ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సహ నిర్మాత: ఎస్.ఎన్. -
జగపతిబాబు వాయిస్ ప్లస్ అవుతుంది!
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి చేతుల మీదగా ఇటీవల విడుదలైన మా సినిమా పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. వీడియో పాటలను జయప్రదగారు, క్రిష్, రవితేజగారు రిలీజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది మా హరికృష్ణకి సపోర్ట్ చేయడం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘వైఎస్ జగన్‌గారు విడుదల చేసిన మా చిత్రం పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘అట్ట చూడమాకే...’ సాంగ్ విడుదల చేసిన జయప్రదగారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరువలేను. క్రిష్‌గారు, రవితేజగారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు’’ అన్నారు హరికృష్ణ. అక్షిత, సంగీత దర్శకుడు యాజమాన్య, పాటల రచయిత రాంబాబు గోసాల, ‘ఆదిత్య’ నిరంజన్ పాల్గొన్నారు. -
పంచభూతాలే ఈ సినిమా చేయించాయి
‘‘నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్ ట్రైలర్, పంచభూతాల సాంగ్ మాట్లాడేశాయి. కొత్త కథలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని ఈ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నాను. పంచభూతాల సపోర్ట్‌తోనే ఈ సినిమా జరిగిందనుకుంటాను. పంచభూతాలే నాతో ఈ సినిమా చేయించాయి అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను, ఆడియో సీడీలను పార్లమెంట్ సభ్యులు, టీ న్యూస్ ఎండీ సంతోశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బడ్జెట్ ఎక్కువైనా సరే నిర్మాత అభిషేక్ కథను నమ్మి కాంప్రమైజ్ అవ్వలేదు. హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్థర్ విల్సన్ కెమెరా, చంటిగారి ఎడిటింగ్, అనంత శ్రీరామ్ లిరిక్స్ హైలైట్స్‌గా నిలుస్తాయి. విలన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణాని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక దర్శకుడికి శ్రీనివాస్‌లాంటి హీరో దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్పినా చేసేవాడు. ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్తాడు. పూజా హెగ్డే సౌందర్యలహరి క్యారెక్టర్‌కి మౌల్డ్ అయిపోయింది’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘ఇంత మంచి సినిమాను నాకిచ్చినందుకు శ్రీవాస్ గారికి థ్యాంక్స్. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి కథను నమ్మి నిర్మించినందుకు నిర్మాత అభిషేక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శ్రీవాస్‌గారు ఇందులో డిఫరెంట్ రోల్ ఇచ్చారు. సాయి చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. అభిషేక్ గారికి చాలా డబ్బులు రావాలి’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అనంత శ్రీరామ్‌గారి సపోర్ట్ లేకపోతే పంచభూతాల సాంగ్ ఇలా వచ్చేది కాదు’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘సాంగ్ చూడగానే ‘లెజెండ్’ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘శ్రీనివాస్‌తో ఓ సినిమా తీశాను. చాలా ఎనర్జిటిక్. కోపరేటివ్. ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘సినిమాను ఇష్టపడే వ్యక్తి శ్రీవాస్. బ్లాక్‌బస్టర్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు దశరథ్. -
'సాక్ష్యం' చిత్రం ఆడియో
-
జగన్‌గారంటే ఎంతో అభిమానం
‘‘మా అబ్బాయి హరికృష్ణకు వైఎస్ జగన్‌గారంటే అభిమానం. మా ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రంలోని ఒక్క పాటైనా ఆయన చేతుల మీదగా లాంచ్ చేయాలని మా అబ్బాయి పట్టు పట్టాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తోన్న జగన్‌గారిని కలిశాం. మా సినిమా పాటలను ఆయన విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా భాగ్యలక్ష్మి సమర్పణలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం ఆడియోను వైఎస్. జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ జగన్‌గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమా పాటలు లాంచ్ చేసి, మా అబ్బాయికి ఆశీర్వాదాలు అందించారు. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం సంతోషాన్ని ఇచ్చింది. ఈనెల రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేనెంతో అభిమానించే జగన్‌గారు మా చిత్రం ఆడియో లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాకూ మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరికృష్ణ జొన్నలగడ్డ. -
జగన్ చేతుల మీదుగా పాటల సీడీ ఆవిష్కరణ
-
‘లవర్’ ఆడియో విడుదల
-
కంటెంట్‌ని నమ్మి ఇంత దూరం వచ్చాం
‘‘ఆరు బంతులకి ఆరు సిక్స్ (వరుసగా 6 చిత్రాల హిట్స్‌ని ఉద్దేశించి)లు కొట్టిన బ్యాట్స్‌మెన్ తర్వాతి బాల్కి ఎలా నెర్వస్‌గా ఫీల్ అవుతాడో నా పరిస్థితి అలా ఉంది. ‘అలా ఎలా’ సినిమాని ఫ్యామిలీ అంతా కలసి బాగా ఎంజాయ్ చేశాం. ఈ సినిమాని కూడా ‘అలా ఎలా’లానే ఎంటర్టైనింగ్ వేలో చేశాడు అనీష్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన చిత్రం ‘లవర్’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘సోలోగా సినిమా చేస్తాను.. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని హర్షిత్ (‘దిల్’ రాజు అన్న కొడుకు) అనడం మొదలుపెట్టాడు. ఇన్నేళ్లుగా శిరీష్, నేను ట్రావెల్ అవుతున్నాం. కంటెంట్‌ని నమ్మి ఇంత దూరం వచ్చాం. నేను బిగినింగ్ డేస్‌లో ఏం చేశానో హర్షిత్ అలానే చేశాడు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. గతేడాది నుంచి మాకు వస్తున్న సక్సెస్‌లు ఆగకూడదు. తనకి తొలి సక్సెస్ రావాలి. రాజ్ తరుణ్ ఫ్లాప్‌లో ఉన్నా ఫస్ట్ లుక్ ట్రెండ్ అయిందంటే మా బ్యానర్‌కి ఉన్న వేల్యూ అది. రాజ్‌కి సరిపోయే కథలున్న ప్రతిసారీ మేం తనతో సినిమాలు చేస్తాం’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ సినిమాలాగే భావించి ఈ సినిమా చేశాను. నా లుక్ మారడానికి హర్షిత్ కారణం. నా గురించి నాకన్నా ఎక్కువ కేర్ తీసుకున్నారు. నన్ను భరించి ఈ సినిమా తీసినందుకు అనీష్‌కి థ్యాంక్స్. సినిమా చాలా బాగా తీశాడు. సంగీత దర్శకులందరూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాజుగారు నాతో ఏడాదికి ఓ సినిమా చేస్తానని మాటిస్తే ఇంకే సినిమాలు ఒప్పుకోను’’ అన్నారు. హర్షిత్ మాట్లాడుతూ – ‘‘మాములుగా అబ్బాయి సినిమాల్లోకి వస్తానంటే తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేస్తారు. నన్ను నమ్మి నా బాబాయ్‌లు 10 కోట్లు దాకా ఖర్చు పెట్టారు. టోటల్ టీమ్ అంతా కష్టపడి పని చేశారు’’ అన్నారు. ‘‘రాజు, శిరీష్గార్లు సినిమా చూసే కంటే ముందు హర్షిత్ నా సినిమాలు ఎడిట్ టేబుల్ మీద చూసేవాడు. తనకి మంచి జడ్జిమెంట్ ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘లాస్ట్ ఇయర్ ఈ బేనర్లో రిలీజైన ఫస్ట్ సినిమా ‘శతమానం భవతి’, ఈ ఇయర్ ‘లవర్’ రిలీజవుతోంది. ఇది కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘అలా ఎలా’ చూసి, సినిమా చేద్దాం అన్నారు రాజుగారు. 20 నిమిషాలు కథ విని ఓకే అన్నారు. ‘60 శాతం మందికి నచ్చితే చాలని నువ్వు చేశావు. దాన్ని 100 శాతం మందికి రీచ్ అయ్యేలా చేస్తాను’ అని రాజుగారు అన్నారు’’ అని చెప్పారు అనీష్. -
హిట్ గ్యారంటీ... గో ఎహెడ్ అన్నాను
‘‘చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని నాతో కల్యాణ్ దేవ్ ఓసారి చెప్పాడు. ‘సినిమా అన్నది మహా సముద్రం లాంటిది. ఎంత మందినైనా తనలో చేర్చుకుంటుంది. సినిమాకు మనం ఏం ఇస్తున్నాం? అన్నదాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గ్లామర్ ఉంది. నీలో ఆ జోష్ ఉందా? లేదా? తపన ఉందా? లేదా? ఎంత స్థాయిలో ఉంది? అన్నదాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని చెప్పాను’’ అన్నారు చిరంజీవి. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘విజేత’ టైటిల్ పెట్టిన వెంటనే నేను చేసిన ‘విజేత’ గుర్తుకు వచ్చింది. ఆ కథకు, ఈ కథకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఫస్ట్ హియరింగ్‌లోనే చాలా నచ్చింది. ‘చక్కటి కుటుంబ కథా చిత్రం. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్షిప్ మనసుకు హత్తుకునేలా ఉంది. కచ్చితంగా సక్సెస్ అవుతుంది. గో ఎహెడ్’ అన్నాను. అప్పట్లో మాస్ యాక్షన్ సినిమాలు చేసేప్పుడు అరవింద్‌గారు నాకు ‘విజేత’ కథ వినిపించినప్పుడు కొంచెం బెరుకుగా అనిపించింది. అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనుకున్నాను. ఆ సినిమా కొత్త ఆడియన్స్ కోసం, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేశాం. అంతకంత ఆదరణ లభించింది. ఎలాంటి ఇమేజ్ లేని కల్యాణ్‌కు కొత్త ఆడి యన్స్, అభిమానం లభిస్తుందని నమ్ముతున్నాను. కంట తడి పెట్టించే సీన్స్ రాకేశ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తన మార్క్‌తో ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. దర్శక–నిర్మాతలు అమ్మ, నాన్నలు లాంటి వాళ్లు అంటారు. రాను రాను నిర్మాత పాత్ర క్యాషియర్లాగా అయిపోయింది. డబ్బులు పెట్టడం తప్ప తను ఇన్వాల్వ్ అవ్వడం కానీ, తనని ఇన్వాల్వ్ చేయడం కానీ లేదు. ఇలాంటి రోజుల్లో సాయిగారు కథల్లో మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఈ కథను ఎంతమందికి అందించగలం? ఆడియన్స్‌ని ఎలా అలరించాలి? మన బ్యానర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించే నిర్మాత కొర్రపాటి సాయిగారు. ఆయన తీసిన ‘ఈగ’, జో అచ్యుతానంద, లెజెండ్’ చాలా బావుంటాయి. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. సెంథిల్ కెమెరా అంటే విజువల్స్ పరంగా చూసుకునే పని ఉండదు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ‘కొ కొ కోడి...’ నా ఫేవరేట్ సాంగ్. సినిమాల్లోకి ఎవరూ వెల్కమ్ చేయరు. ట్రైనింగ్ తీసుకుని ప్రయత్నించు అని కల్యాణ్‌తో అన్నాను. సత్యానంద్ దగ్గర తీసుకున్నాడు. ట్రైనింగ్‌లో ప్లస్‌లు మైనస్‌లు తెలుసుకున్నాడు. ఎంతో పరిణితితో చేశాడు. డ్యాన్స్ బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ చెప్పనక్కర్లేదు. రాకేశ్ తనకు కావల్సింది రాబట్టాడు. మాళవికా కొంటెగా, ఇంటెన్స్‌గా చేసింది. ఇందాక రాజమౌళి చెప్పినట్టు ఆ ‘విజేత’ ఎంత సక్సెస్ ఆయ్యిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాను జూలై 12న విడుదల చేస్తున్నాం. తేజ్ సినిమా 6న ఉంది. అభిమానులు ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు. వాడికీ ఆశీస్సులు లభిస్తాయి. కల్యాణ్‌కీ ఆశీస్సులు లభిస్తాయి’’ అన్నారు. కల్యాణ్ దేవ్ మాట్లాడుతూ – ‘‘సాయిగారు చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను వాళ్ల లాగే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. రాకేశ్‌కి క్లారిటీ ఉంది. ప్రతీ ఫ్రేమ్ బాగా తీశారు. సెంథిల్‌గారు చాలా కూల్. మ్యూజిక్ హర్షవర్థన్ రామేశ్వర్ అమేజింగ్ ఆల్బమ్ ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు మంచి యాక్టర్, డ్యాన్సర్, ఫైటర్. అది అందరికీ తెలిసిందే. ఆయన స్టోరీని బాగా జడ్జ్ చేయగలుగుతారు. స్టోరీ విన్న వెంటనే ఏది తగ్గించాలి? పెంచాలి అని చెబుతారు. ‘మగధీర’ కథ ఫస్ట్ చిరంజీవిగారికే చెప్పాను. ఆయన అప్రూవ్ తీసుకొనే చేశాం. ఈ సినిమా కూడా ఆయనకు నచ్చాకే చేశారు. అదే బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో సాయిగారు ఎక్కడా తగ్గలేదు. సాంగ్స్ చాలా బావున్నాయి. అప్పుడు ‘విజేత’ చిరంజీవిగారికి ఎంత సక్సెస్ తెచ్చిందో, ఈ సినిమా కూడా కల్యాణ్‌కి అంతే సక్సెస్ తేవాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి వరుసగా యాక్షన్ పిక్చర్స్ చేస్తున్నపుడు ‘విజేత’ సినిమా కథ విన్నాను. నచ్చింది చేయాలనుకున్నాను. చిరంజీవిని అడిగితే ‘నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాత సాయిగారు కొత్త టాలెంట్ ఎక్కడున్నా వెతికి సినిమా నిర్మిస్తుంటారు. అటువంటి నిర్మాతలు మనకి ఉండాలి. మెగా కుటుంబం నుంచి ఎవరు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నా ఒక ధైర్యం చిరంజీవిగారి అభిమానులు. దానికి హీరోలు టాలెంట్‌ని యాడ్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. కల్యాణ్ కూడా అలాంటి టాలెంట్‌తో సక్సెస్ అందుకుంటాడని ఆశీస్తూ, ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. రాకేశ్ శశి మాట్లాడుతూ– ‘‘కథ మొదలుపెట్టక ముందు ‘మన కథే హీరోని తీసుకురావాలి’ అని సాయిగారు నాతో అన్నారు. ఆ కథే మమ్మల్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకువెళ్ళింది. చిరంజీవి అల్లుణ్ణి సినిమాలో హీరోని చేసింది. చిరంజీవిగారి ముందు కూర్చుని కథ చెప్పినప్పుడు నాలో ఉన్న ఎమోషన్ జీవితాంతం గుర్తుంటుంది. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోని ఎంత బాగా ప్రజెంట్ చేయాలో అంత బాగా ట్రై చేశాం. ఈ చిత్రంలో కల్యాణ్ చేసిన క్యారెక్టర్‌కి, రియల్ లైఫ్ పర్శనాలిటీకి చాలా తేడా ఉంది. తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం’’ అన్నారు.కీరవాణి మాట్లాడుతూ – ‘‘మన హృదయాల్ని గెలుచుకుని శాశ్వత విజేతగా నిలిచిపోయిన చిరంజీవిలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు అలానే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సాయిగారు మా ఫ్యామిలీ మెంబర్‌లాగా. ఈ సినిమాతో కల్యాణ్ దేవ్‌కి మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను. రామేశ్వర్ మంచి కంపోజర్’’ అన్నారు. -
చిరంజీవి పోలికలు రావడం అదృష్టం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : శ్రేయ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రం ఆడియో విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయిధరమ్‌తేజ, కధానాయకి అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు ఎ.కరుణాకరన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తేజ్ ఐ లవ్యూ ఓ కలర్‌ఫుల్ లవ్ స్టోరీ అని దర్శకుడు కరుణాకరన్ చెప్పారు. సాయిధరమ్ తేజ్..: కలర్‌ఫుల్ లవ్ స్టోరీ మేనమామ చిరంజీవి పోలికలు రావడం అదృష్టం. ఆయనలా నటిస్తున్నానని అభిమానులు చెబుతున్నపుడు ఆనందంగా ఉంటుంది. ఆయన్ని అనుకరించకుండా నటిస్తున్నాను. చిత్రం సక్సెస్‌ను దేని ఆధారంగా నిర్ణయిస్తున్నారు.. యూ ట్యూబ్, ట్విట్టర్‌లోని సందేశాలు, సినిమాలోని పాటలను రింగ్ టోన్స్గా డౌన్లోడ్ చేసుకోవడం, వివిధ సెంటర్లలోని కలñక్షన్ వంటి పలు అంశాల ఆధారంగా చిత్ర విజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. చిత్రంలో మీ పాత్ర.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు.. ప్రభాస్, వెంకటేష్‌లు నా అభిమాన హీరోలు. సమంత నా ఫేవరేట్ హీరోయిన్. సమంతకు వివాహం అయిపోయినా అభిమానానికి వివాహానికి సంబంధం లేనందువల్ల ఆమెను నా ఫేవరేట్ కథానాయికనే చెబుతాను. తరువాత చిత్రం.. మైత్రి మూవీ బ్యానర్ మీద త్వరలోనే కొత్త చిత్రం రాబోతుంది. విశాఖతో మంచి అనుబంధం : అనుపమ పరమేశ్వరన్.. విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సముద్రతీర అందాలంటే చాలా ఇష్టం. విశాఖ వచ్చినపుడల్లా చాలాబాగా ఎంజాయ్ చేస్తాను. ఆడియో విజయోత్సవ సభ సందర్భంగా విశాఖ రావడం ఆనందంగా ఉంది. తేజ్ ఐలవ్యూ చిత్రం అనుభవం తేజ్ ఐ లవ్యూ చిత్రం మంచి అనుభవాన్ని ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. కథానాయకుడు సాయిధరమ్‌తేజతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. కథానాయకుడు రామ్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది. ఆగస్టులో విడుదలవుతుంది. తొలిప్రేమ సమయంలో విశాఖ వచ్చా... : దర్శకుడు.. ఎ.కరుణాకరణ్ మెగా కుటుంబం తోటలో నేనొక చెట్టును మాత్రమే. నాకు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం చాలా ఉంది. తొలిసారిగా పవన్ కల్యాణ్‌లో తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు సాయిధరమ్‌తేజ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇది నాకు పదో సినిమా.తొలి ప్రేమ చిత్రం షూటింగ్ సమయంలో లొకేషన్స్ చూసేందుకు విశాఖపట్నం తొలిసారిగా వచ్చాను. స్టీల్‌ప్లాంట్, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలన్నీ తిరిగాను. చివరకు సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంది. తేజ్ ఐ లవ్యూ కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం తేజ్ ఐ లవ్యూ సినిమా సకుటుంబంగా చూడగలిగే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. కలర్‌ఫుల్ లవ్ స్టోరీ. తొలిప్రేమ చిత్రంలో కథానాయికతో ఎలా హైలైట్ సీన్స్‌ను క్రియేట్ చేశామో అదే విధంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అనుభూతినిస్తాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : కరుణాకరన్ ఈ పేరు చెబితే ప్రేమికుల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయని..ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ అని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం ఆడియో విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ వైజాగ్‌తో తెలియని అనుబంధం ఏర్పడిందన్నారు. నటనకు ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడే. కె.ఎస్. రామారావు నిర్మాణ సారధ్యంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపిచంద్ర చాలా మంచి పాటలు అందించారన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ వైజాగ్‌కు సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంట్‌గా మారిందన్నారు. జాగ్లో షూటింగ్‌ల అనుమతులకు త్వరలోనే సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టనున్నామన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో వైజాగ్‌తో లవ్ పడ్డానని అన్నారు. డైరెక్టర్ కరుణకర్ మాట్లాడ్లుతూ మా సినిమా పాటలను ఆదరించిన ప్రేక్షకులకు «కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తేజ్‌కు విలువైన వాచ్‌ను నిర్మాత కేఎస్ రామారావు బహుమతిగా అందజేశారు. సింగర్ సింహా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గోపి చంద్ర తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్లుడు ఆడియోకి అతిథి
చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. ఆ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కానున్నారు. రాకేశ్ శశి దర్శకత్వంలో వారాహి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. మామ మూవీ టైటిల్‌తో, ఆయనే ముఖ్య అతిథిగా వస్తున్న ఈ ఫంక్షన్ అల్లుడికి సూపర్ స్పెషల్‌గా ఉండబోతుందని ఊహించవచ్చు. -
ఆశల హరివిల్లు
‘ఆకాశంలో ఆశల హరివిల్లు.. ఆనందాలే పూసిన పొదరిల్లు’ అంటూ ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ చేసిన నృత్యాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఆ పాట కూడా పాపులర్ అయింది. తాజాగా ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య తారలుగా క్రాంతి కిరణ్ దర్శకత్వంలో బి. సత్యశ్రీ నిర్మించారు. శ్రీనివాస్ మాలపాటి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ఎస్విఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ– ‘‘కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకీ చాన్స్ ఇచ్చిన సత్యశ్రీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో, హీరోయిన్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా తీయగలిగాను.వారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు సత్యశ్రీ. -
‘తేజ్ ఐ లవ్ యు’ ఆడియో రిలీజ్
-
ఈ జన్మకు ఇది చాలదా అనిపిస్తుంటుంది
‘‘మీ (ఫ్యాన్స్) ఈలలు, చప్పట్లు, కేరింతలు ఎప్పుడు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంతటి ఆనందం అనుభవిస్తా’’ అని హీరో చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1980వ దశకంలో చిరంజీవికి ఎక్కువ సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయన్నా, నవలా కథానాయకుడని పేరు తెచ్చుకున్నాడన్నా, ఎవరికీ లేని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయన్నా.. ముఖ్యంగా ఇళయరాజాగారి నుంచి వచ్చాయన్నా.. సుప్రీమ్ హీరోగా ఉన్న నా పేరుని ఈ రోజు మెగాస్టార్ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తున్నారన్నా, ఆ పేరు నాకు ఎవరు ఆపాదించారన్నా వాటన్నింటికీ సమాధానం ఒక్కటే ‘క్రియేటివ్ కమర్షియల్స్’. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం’.. వరుస హిట్లు వచ్చాయి. అలాంటి మంచి సినిమాలిచ్చిన నిర్మాత రామారావుగారు. ‘అభిలాష’ సమయంలో నాకు ఆయన పరిచయం. నెల్లూరులో మా అమ్మగారు యండమూరి ‘అభిలాష’ నవల చదివారు. అందులో హీరో పేరు చిరంజీవి. ‘ఆ నవల చదువుతుంటే నువ్వే గుర్తొచ్చావు, సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రామారావుగారు ‘అభిలాష’ నవల హక్కులు తీసుకున్నా. మీరు డేట్స్ ఇస్తే సినిమా చేద్దామన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్లో రామారావుగారిని మరచిపోలేను. ఇన్నేళ్ల తర్వాత ఆయనకి సభా ముఖంగా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం లభించింది. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చాక కూడా ఆయన మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. అలాంటి ఆయన బ్యానర్లో ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్’ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాం. ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే తప్పు ఆయనది కాదు నాది. కథ నచ్చింది. డైరెక్టర్‌గా యండమూరిని పెడదామన్నారు. ఆయన డైరెక్షన్లో చేయాలనే కోరిక నాకూ ఉండటంతో సరే అన్నాను. దానికంటే ముందు యండమూరి తీసిన ‘అగ్నిప్రవేశం’ అనుకున్నంత సక్సెస్ కాలేదు. బయ్యర్స్ నుంచి ఒత్తిడి ఉండటంతో పునరాలోచనలో పడి డైరెక్టర్ని మారుద్దామన్నారు రామారావుగారు. నేను వద్దన్నాను. ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయిందని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు యండమూరిగారు. రామారావుగారి అభిరుచి మేరకు డైరెక్టర్ని మార్చుంటే ఫలితం ఎలా ఉండేదో? ఆ తర్వాత ఆయన ‘చంటి’ వంటి మంచి సినిమాలు తీస్తూ హిట్స్ అందుకున్నారు. ఈ మధ్యలో కొంచెం మా మధ్య గ్యాప్ వచ్చింది. మెగాస్టార్‌తో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ సినిమా తీయలేకపోతున్నాననే లోటు ఆయన నాతో వ్యక్తపరిచారు. అయితే తేజూతో ఈ సినిమా తీయడం ద్వారా ఎంతో కొంత తృప్తి చెందానని ఆయన చెప్పడం హ్యాపీ. ఈ మధ్య రామ్ చరణ్ ‘డాడీ.. నేనిప్పటి వరకూ డైరెక్టర్, కథ ఏంటని చూసి ఆ తర్వాత నిర్మాత ఎవరని చూస్తా. ఎందుకో రామారావుగారితో ఓ సినిమా చేయాలనిపిస్తోంది.. కచ్చితంగా చేస్తాను’ అన్నాడు. ఈ జనరేషన్ వాళ్లు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారంటే ఆయనేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఈ సినిమాతో మళ్లీ తన వైభవాన్ని తీసుకొస్తారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకు కారణం కరుణాకరన్. లవ్‌స్టోరీస్ తీయడంలో అతనికి అతనే సాటి. తెలుగు మేగజైన్స్ కవర్ పేజీలోని నా ఫొటోలను కట్ చేసి, వాటిని ఆల్బమ్‌గా చేసినటువంటి పెద్ద ఫ్యాన్ కరుణాకరన్. చదువుకున్న విజ్ఞులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, యంగ్ డైరెక్టర్స్.. వీళ్లందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారంటే ఈ జన్మకు ఇది చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంటుంది నాకు. వీళ్లందరికీ (మెగా హీరోలు) నా నుంచి సంక్రమించింది నా ఇమేజ్ మాత్రమే కాదు కష్టపడే మనస్తత్వం. కష్టపడి పనిచేస్తున్నారా? లేదా? క్రమశిక్షణగా ఉంటున్నారా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. అంతేకానీ వారి సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నవి సెకండ్రీ. తేజ్ నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ల అమ్మకంటే ముందు వార్న్ చేసేది నేనే. ఆ అవకాశం తేజు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. ‘తేజ్ ఐ లవ్ యు’ రషెస్ చూశా. కనుల పండువగా ఉంది. చక్కటి ఫ్యామిలీ, లవ్‌స్టోరీ. మిమ్మల్నందర్నీ అలరిస్తుంది. గోపీసుందర్ పాటలు చాలా బాగున్నాయి. అనుపమ మంచి నటన, భావోద్వేగాలు కనబరిచింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే మెగాస్టార్. ఆయన్ను చూసి ఇండస్ట్రీ ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరుణాకరన్‌గారు నాకు కావాల్సిన సినిమా తీసిపెట్టారు’’ అన్నారు. ‘‘నాకు మామూలుగానే మాట్లాడటం రాదు. చిరంజీవి అన్నయ్య ఉన్నప్పుడు గుండె దడదడలాడుతుంది. సినిమా కల ఇచ్చింది పెద్ద అన్నయ్య చిరంజీవి. డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది చిన్న అన్నయ్య కల్యాణ్.ఇప్పుడు తమ్ముడు తేజ్‌తో సినిమా చేశా’’ అన్నారు కరుణాకరన్.‘‘నేను నిద్ర లేవగానే మా మావయ్య చిరంజీవిగారి ముఖం (ఫొటో) చూసి గుడ్ మార్నింగ్ చెబుతా. ఆయన ఆశీర్వాదం లేకుండా నా జీవితం సాగదు’’ అన్నారు సాయిధరమ్. సహనిర్మాత వల్లభ, కెమెరామెన్ అండ్రూ.ఐ, సంగీత దర్శకుడు గోపీసుందర్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకు ప్రతిరూపమే ఈ చిత్రం: బగ్గిడి గోపాల్
మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవితం ఆధారంగా అర్జున్ కుమార్ దర్శకత్వంలో బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. టైటిల్ రోల్లో బగ్గిడి గోపాల్ నటించారు. సుమన్, కవిత, గీతాంజలి తదితరులు నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో సీడీని అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య రిలీజ్ చేశారు. బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ– ‘‘నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. కాబట్టి సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేదనకు ప్రతి రూపమే ఈ ‘బగ్గిడి గోపాల్’. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి జమున, ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆడియో టేపు కలకలం
సాక్షి, ముంబై : సంచలనంగా మారిన ఆడియో టేపు వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ ఆయన కార్యకర్తలతో చెప్పిన మాటల టేపును శివసేన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఎడిట్ చేసిన ఆడియో అని ఫడ్నవిస్ చెబుతున్నారు. శనివారం ఓ మీడియా ఛానెల్‌తో సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. ‘ఆ టేపును నేనూ విన్నాను. అందులో గొంతు నాదే. కాదనను. కానీ, అది ఎడిట్ చేసింది. సామ దాన దండ భేదోపాయాలను ఉపయోగించండి అని చెప్పిన మాట వాస్తవం. కానీ, అది వేరే సందర్భంలో చెప్పాను. పలు సందర్భాల్లో నేను మాట్లాడిన మాటల్ని జత చేసి ఆడియో టేపును సృష్టించారు. పైగా 14 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్ అసంపూర్తిగా ఉంది. త్వరలో ఆ ఆడియో క్లిప్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నా. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫర్వాలేదు’ అని రిపోర్టర్‌తో ఫడ్నవిస్ చెప్పారు. కాగా, పాల్ఘడ్ లోక్‌సభ స్థానానికి త్వరలో(మే 28వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే శుక్రవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ ఆడియో టేపును విడుదల చేశారు. ‘బీజేపీ అంటే ఏంటో ప్రత్యర్థులకు చూపాలని, అవసరమైతే ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని’ ఫడ్నవిస్ చెప్పారంటూ థాక్రే ఆ క్లిప్‌ను విడుదల చేశారు. -
చాటింగ్‌తో చీటింగ్
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి. వెంకటేశ్ జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాటలు రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్ ఆవిష్కరించారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది’’ అన్నారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్‌తో ఏ విధంగా మోసపోతున్నారు? అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? అనే నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు రహమాన్. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్ కుమార్.