ఆహ్లాదంగా.. హాయిగా... | Y Taruni Rana Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఆహ్లాదంగా.. హాయిగా...

Feb 25 2020 6:56 AM | Updated on Feb 25 2020 6:56 AM

Y Taruni Rana Movie Audio Launched - Sakshi

దీపాలి రౌత్

శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్‌ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్‌ చిన్నా, రవీందర్‌ ముఖ్య తారలుగా వి. అంబికా విజయ్‌ దర్శకత్వంలో బాన వెంకట కొండారెడ్డి నిర్మించిన∙చిత్రం ‘వై తరుని రాణా’. నటుడు ‘జెమిని’ సురేష్, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సీఈఓ నరేంద్ర ఈ సినిమా ఆడియో బిగ్‌ సీడీ, ట్రైలర్‌లను విడుదల చేశారు. ‘జెమిని’ సురేష్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నా మంచి ఫోటోగ్రాఫర్‌. ఇప్పుడు నటుడిగా మారాడు. తనకు సినిమాలంటే ప్యాషన్‌. అలాంటివాళ్లు ఎప్పుడూ విజయం సాధిస్తారు.

ఈ సినిమాలోని ప్రతి పాట డైరెక్టర్‌ వంశీగారి సినిమాల్లో ఉన్నట్లు ఆహ్లాదంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘నా మీద నమ్మకంతో కొండారెడ్డిగారు అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని బెస్ట్‌ రిజల్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను’’ అన్నారు అంబికా విజయ్‌.  ‘‘మా నాన్న కొండారెడ్డిగారు ముందు ఈ సినిమా నిర్మించనన్నారు. స్టోరీ విని, స్క్రిప్ట్‌పై మేం పడుతున్న కష్టం చూసి అంగీకరించారు. మార్చిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాత తనయుడు బుల్‌రెడ్డి. శాంతి రాజు, రాయంచ, కెమెరామేన్‌ బాలకృష్ణ, పాటల రచయిత సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్‌.ఎం. ప్రేమ్‌ రాయంచ, సదా చంద్ర, కెమెరా: రామ శ్రీనివాస్, నేపథ్య సంగీతం: ఆనంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement