అటు డాక్టర్‌గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్‌ టక్కర్‌.. | Dheeraj Double Tucker Movie Audio Launch Highlights | Sakshi
Sakshi News home page

హీరోగా రాణిస్తున్న డాక్టర్‌.. త్వరలోనే సినిమా రిలీజ్‌

Published Mon, Mar 18 2024 10:35 AM | Last Updated on Mon, Mar 18 2024 11:54 AM

Dheeraj Double Tucker Movie Audio Launch Highlights - Sakshi

ధీరజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్‌ టక్కర్‌. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్‌ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతాన్ని, గౌతమ్‌ రాజేంద్రన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్‌ భాస్కర్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్‌ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్‌ స్పెషల్‌గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్‌ మాట్లాడుతూ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయ్‌, షారుక్‌ ఖాన్‌ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్‌ టక్కర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్‌ చేసిన దర్శకుడు రవికుమార్‌, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్‌ టక్కర్‌ టైటిల్‌.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్‌ అయిన ధీరజ్‌ ఇప్పుడు యాక్టర్‌గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్‌ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్‌ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్‌ హీరోయిన్‌కు పెళ్లయిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement