కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్) భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయ్యింది. ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తీ (Aarthi) నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇందరు మళ్లీ కలిసి జీవించడానికి సామరస్య చర్చలకు అవకాశం ఇచ్చింది.
(ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు)
ఇప్పటికే జయం రవి (Jayam Ravi), ఆర్తీల మధ్య మూడు సార్లు సామరస్య చర్చలు జరిగాయి. కాగా శనివారం ఈ కేసు మరోసారి న్యాయమూర్తి తేనెతోమొళి సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో జయం రవి,ఆర్తల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. నటుడు జయం రవి, ఆర్తీ కూడా ఆన్‌లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. కాగా వారి న్యాయవాదులు తమ క్లైంట్‌ల మధ్య శనివారం సామరస్య చర్చల కోసం మధ్యవర్తులు ఆహ్వానించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో సామరస్య చర్చలు పూర్తి అయిన తరువాత తీర్పును ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.
పేరు మార్చుకున్న జయం రవి.. కారణం ఇదే
జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని కొద్దిరోజుల క్రితమే తెలిపాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం ఎంటో ఇలా చెప్పాడు. 'ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను' అని అన్నాడు.
జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment