జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..? | Is Bangalore Based Singer The Reason For Jayam Ravi And Aarti Divorce? | Sakshi
Sakshi News home page

జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?

Published Fri, Sep 20 2024 1:51 PM | Last Updated on Fri, Sep 20 2024 3:16 PM

Jayam Ravi And Aarthi Divorce Reason

కోలీవుడ్‌ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనంతటికీ కారణం ఒక గాయని అనితెలుస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా  జయం రవి  విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు.విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే, వారిద్దరూ విడిపోవడానికి కారణం ఒక గాయని అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో ఆమె డేటింగ్‌ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

బెంగళూరుకు చెందిన గాయిని 'కెనిషా ఫ్రాన్సిస్'తో జయం రవి డేటింగ్‌లో ఉన్నారని నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతూ స్వతంత్ర గాయకురాలిగా ఆమె పేరు సంపాదించుకుంది. జయం రవి తన స్నేహితులతో కలిసి తరచూ గోవా వెళ్లేవాడు. ఆ సమయంలో  కెనిషా ఫ్రాన్సిస్‌ అనే యువతితో పరిచయం అయిందని సమాచారం. వారిద్దరూ ఆ తర్వాత  స్నేహితులు అయ్యారని, ఆపై ఇరువిరి ఇష్టంతోనే డేటింగ్ కూడా ప్రారంభించారని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.  తమిళంలో నటుడు జీవా నిర్మించిన ఆల్బమ్‌లో కూడా ఆమె పాటలు పాడింది. ఆమెకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు వస్తున్నప్పటికీ ఆమె భర్తకు సంబంధించిన సమాచారం మాత్రం బయటకు రాలేదు.

కెనిషా ఫ్రాన్సిస్‌తో  జయం రవి స్నేహం చేయడం ఆర్తికి నచ్చలేదు. ఆమెతో స్నేహం వద్దని చెప్పినా రవి వినిపించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు నాడు జయం రవి ఇంటి వద్ద లేరట. ఆ సమయంలో సినిమా షూటింగ్‌ ఉందని చెప్పి గోవా వెళ్లిపోయారట. అయితే, అక్కడ తన కారుకు జరిమానా పడటం వల్ల  అసలు విషయం బయటకొచ్చిందని చెప్పుకొస్తున్నరు. జులై 14న జయం రవి కారును వేగంగా నడిపినందుకు కెనిషా ఫ్రాన్సిస్‌కు జరిమానా విధించారు. 

ఈ విషయాన్ని  ధృవీకరిస్తూ పలు ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. జయం రవి, కెనిషా ఫ్రాన్సిస్‌ల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ వల్ల ఆర్తి డిస్టర్బ్ అయ్యారని సమాచారం. ఈ కోపంతోనే జయం రవితో ఉ‍న్న ఫోటోలను ఆమె తొలగించారని టాక్‌.  అనంతరం తాము విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement