సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి | Actor Jayam Ravi Announced Divorce With His Wife Aarthi, Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jayam Ravi Divorce: సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి

Published Mon, Sep 9 2024 1:21 PM | Last Updated on Mon, Sep 9 2024 1:49 PM

Actor Jayam Ravi Announced Divorce With His Wife Aarthi

కోలీవుడ్‌ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.

చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్‌ మోహన్‌ కుమారుడే జయం రవి. 2009లో ఆర్తిని జయం రవి వివాహం చేసుకున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయం గురించి జయం రవి ఒక నోట్‌ విడుదల చేశారు.

'మేము ఇద్దరం చాలా ఆలోచించి, అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. నాకు తప్పడం లేదు.  ఈ నిర్ణయం అంత తేలికగా తీసుకోలేదు. నాపై ఆధారపడిన వారి సంక్షేమం, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నాను. ఈ సమయంలో నా ప్రైవసీతో పాటు నా సన్నిహితుల గోప్యతను గౌరవించాలని  ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.  మీలో చాలామంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పాటు మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను.

ఈ నిర్ణయం నా సొంత నిర్ణయం మాత్రమే. ఈ విషయం నా వ్యక్తిగత విషయంగానే అందరూ భావిస్తారని ప్రార్థిస్తున్నాను. జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం. ఎప్పుడూ కూడా అనేక సవాళ్లు, అవకాశాలతో ముగుస్తుంది. నేను ఎప్పటికీ మీ జయం రవిగానే ఉంటానని అభిమానులను కోరుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ కృతజ్ఞతగా భావిస్తున్నాను.' అని జయం రవి పేర్కొన్నారు.

జయం రవి- ఆర్తి దంపతులకు అర్వ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలీవుడ్‌ మీడియా అనేకసార్లు ప్రచురించింది. దీంతో కొంత కాలంగా వారిద్దరూ కూడా వేరువేరుగానే జీవిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోనే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement