
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి గురించి అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు.
అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే అని' అనురాగ్ కశ్యప్ తెలిపారు.
గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. రైఫిల్ చిత్రంతో పాటు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఆయన చేతిలో ఐదు సౌత్ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్‌గా బాలీవుడ్ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు.