Anurag Kashyap
-
రాజకీయ ఒత్తిళ్లకు లొంగారు.. ‘నెట్‌ఫ్లిక్స్ ’పై అనురాగ్ కశ్యప్ ఫైర్!
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై సంచలన వాఖ్యలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా(Netflix India)లో పనిచేసే పై స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని, వారు నైతికంగా అవినీతిపరులేనని విమర్శించాడు. నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్‌ని ప్రశంసిస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులను భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తిరస్కరిస్తోందని ఆరోపించాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కమర్శియల్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ మండిపడ్డాడు.అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘మాక్సిమం సిటీ’ వెబ్ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ 2024లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయాన్ని అనురాగ్ అప్పుడే వ్యతిరేకించాడు. తాజాగా మరోసారి నెట్‌ఫ్లిక్స్‌పై తనకున్న అసంతృప్తిని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మాక్సిమం సిటీ’ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆయన ఆరోపించాడు. సృజనాత్మక స్వేచ్ఛపై నెట్ఫిక్స్ ఆంక్షలు విధిస్తోందని విమర్శించాడు.దీనికి యూకే వెబ్ సిరీస్ అడోలసెన్స్ని ఉదాహరణగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుక్త వయస్సు యొక్క చీకటి అంశాలను, ఆన్లైన్ ద్వేషం, మరియు సామాజిక సమస్యలను చూపిస్తుంది.ఇలాంటి సాహసోపేతమైన కథను నెట్‌ఫ్లిక్స్ ఇండియా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.‘మాక్సిమం సిటీ’ కథేంటి?సుఖ్‌దేవ్ సింగ్ సంధు రాసిన "మాక్సిమం సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్" పుస్తకం ఆధారంగా అనురాగ్ కశ్యప్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఈ సిరీస్‌లో ముంబై నగరం యొక్క చీకటి కోణాలను చూపించాలని భావించారు. అయితే, 2024లో నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రద్దు చేసింది, దీనిపై కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ‘సేక్రెడ్ గేమ్స్’మూడో సీజన్ కోసం కూడా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిగాయి. కానీ కంటెంట్‌తో పాటు బడ్జెట్‌పై వివాదాలు రావడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్
హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. హిందీ చిత్ర పరిశ్రమను వీడుతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందీ ఇండస్ట్రీ చాలా విషపూరితంగా మారిపోయిందని ఆయన అసహనం వ్యక్తంచేశాడు. ఇక్కడ మేకర్స్ ఆలోచనలు చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నానని, సౌత్ ఇండస్ట్రీలాగా ఇక్కడ (బాలీవుడ్లో) ప్రయోగాలు చేయడం కష్టమని ఆయన చెప్పాడు.బాలీవుడ్‌ను వదిలేసిన అనురాగ్ కశ్యప్ తాజాగా బెంగళూరుకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పాడు. 'నేను బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఇక్కడకు (బెంగళూరు) వచ్చాను. బాలీవుడ్ చిత్రపరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది..? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. హిందీలో ప్రతిఒక్కరూ సాధ్యం కాని టార్గెట్లతో సినిమాను ప్రారంభిస్తున్నారు. రూ.500 కోట్లు, రూ.800 కోట్లు వచ్చే సినిమాలను మాత్రమే తీయాలని ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. దీంతో అక్కడ ప్రతిభ, కొత్తదనానికి ఛాన్స్ లేకుండా పోయింది.' అని ఆయన తెలిపాడు. ఇక నుంచి తాను పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే ఉంటానని ఆయన చెప్పాడు.అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు. ప్రస్తుతం ‘డకాయిట్’లో ఆయన నటిస్తున్నాడు. అడివిశేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. -
కూతురి పెళ్లి తరువాత... నాన్న నాన్ స్టాప్‌గా పది రోజులు ఏడ్చాడు!
ఎంత గంభీరంగా ఉండే తండ్రి అయినా సరే, పెళ్లి తరువాత కూతురు అత్తారింటికి వెళుతుంటే భావోద్వేగానికి గురై ఏడుస్తాడు. ‘నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను. నాకు ఎలాంటి భావోద్వేగాలు లేవు’ అని చెప్పేవాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి తాజా ఉదాహరణ అనురాగ్ కశ్యప్.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటలు విన్నవారికి... ‘ఇతడు చాలా ప్రాక్టికల్ సుమీ. భావోద్వేగాలు మచ్చుకైనా కనిపించవు’ అనిపిస్తుంది.అయితే అనురాగ్ తన కూతురు పెళ్లి తరువాత నాన్‌స్టాప్‌గా ఏడ్చాడు. ఒకటి కాదు రెండు కాదు నిర్విరామంగా పదిరోజులు ఏడ్చాడు.అనురాగ్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లి జరిగింది. ఆ తరువాత అనురాగ్ ఏడుపు పర్వం మొదలైంది. పరిచయం లేని వ్యక్తుల ముందు కూడా ఏడ్చేవాడు.‘నా కూతురు పుట్టుక, పెళ్లికి సంబంధించి ఒకేరకమైన భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు. కాని ఏడ్చేవాడిని. ఒకసారి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి ప్రస్తావన రాగానే ఏడ్చేశాను’ అన్నాడు అనురాగ్ కశ్యప్.ఈ పదిరోజుల ఏడుపు ఎపిసోడ్ పుణ్యమా అని తనకు తాను ‘బిగ్గర్ క్రయర్’ అని పేరు పెట్టేసుకున్నాడు! -
'మీ అమ్మాయిలతో ఇలాంటి సినిమా తీయండి'.. స్టార్ డైరెక్టర్‌పై దర్శకుడు తీవ్ర విమర్శలు
అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్. ఈ మూవీని వర్ష భరత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ సినిమాపై మరో డైరెక్టర్ మోహన్ జి క్షత్రియ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించడం మీకు ఎల్లప్పుడూ బోల్డ్‌గా అనిపించొచ్చు.. కానీ వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఏం ఆశించాలని ప్రశ్నించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లిదండ్రులను దూషించమనేది పాతదే.. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని అన్నారు. ముందు మీ కులం అమ్మాయిలతో ఇలాంటి సినిమాలు తీసి వాటిని మీ కుటుంబానికి చూపించండి అంటూ కాస్తా ఘాటుగానే ట్వీట్ చేశారు. కుల ఆధారిత సినిమాలను తెరకెక్కించడం పట్ల వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌పై మోహన్ జి క్షత్రియ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అయితే ఈ బ్యాడ్ గర్ల్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ -54వ ఎడిషన్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టైగర్ కాంపీటీషన్ విభాగంలో ఈ మూవీ పోటీపడుతోంది. ఈ చిత్రంలో హృదు హరూన్, టీజే అరుణాసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధా శ్రీధర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఇందులో ఎప్పుడూ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకునే టీనేజ్ అమ్మాయిగా (అంజలి శివరామన్) కనిపించింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యుక్తవయస్సులో ఉండే పాత్రలో అంజలి శివరామన్ నటించింది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు టీజర్లో చూపించారు. ఊహించని ఓ సంఘటన ఆమెను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ నిర్ణయం ఆమె ఎప్పుడూ ఉండాలనుకునే వ్యక్తిగా మారేలా చేస్తుంది. డేటింగ్ యాప్ గురించి తల్లి, కూతురు మాట్లాడుకోవడంతో టీజర్ ముగుస్తుంది.టీజర్‌పై పా రంజిత్ ప్రశంసలు..అయితే బ్యాడ్ గర్ల్ టీజర్‌పై డైరెక్టర్ పా రంజిత్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సాహోసపేతమైన కథను అందించినందుకు వెట్రిమారన్‌ను కొనియాడారు. ఈ చిత్రం మహిళల పోరాటాలను సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తుందని.. డైరెక్టర్ వర్ష భరత్‌కు అభినందనలు తెలిపారు. అంజలి శివరామన్ అద్భుతంగా నటించిందని పా రంజిత్ ట్విటర్లో పోస్ట్ చేశారు. Portraying a brahmin girl personal life is always a bold and refreshing film for this clan. What more can be expected from vetrimaran, Anurag kasyap & Co.. Bashing Brahmin father and mother is old and not trendy.. Try with your own caste girls and showcase it to your own family… https://t.co/XP8mtnaFws— Mohan G Kshatriyan (@mohandreamer) January 27, 2025 -
ముంబై వదిలేసి సౌత్‌కు షిఫ్ట్ అయిపోతా: అనురాగ్ కశ్యప్
హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్‌పైనే విరక్తి చెందుతున్నాడు. జనాలు ఆలోచన చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నాను. ఎందుకంటే వారిలాగా నేను ఇక్కడ (బాలీవుడ్లో) ప్రయోగాలు చేయడం కష్టం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మొదటినుంచి లెక్కలుచేయాలన్న కసి నాలో ఉన్నా లాభనష్టాల బేరీజు వేసుకుని నిర్మాతలు వెనకడుగు వేస్తారు. నాకు లాభమే రాలేదు, నీవల్ల డబ్బు నష్టపోయా అని తిడుతుంటారు. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. అందుకే ఈ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది ముంబైని వదిలేస్తాను.మెదళ్లు మొద్దుబారిపోయాయిసౌత్ ఇండస్ట్రీకి మకాం మార్చేస్తాను. దక్షిణాదిలో ఎప్పటికప్పుడు కొత్తవి చేయాలన్న కోరిక వారిలో రగులుతూనే ఉంటుంది. నేను ఇక్కడికి రాకుండా బాలీవుడ్(Bollywood)లోనే ఉండిపోతే ఒక ముసలాడిగా అక్కడే చనిపోతాను. అక్కడి వారి ఆలోచనావిధానం నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది, అసహ్యమేస్తోంది. పోనీ కలెక్షన్స్ గుమ్మరించే పుష్ప వంటి సినిమాలను కూడా బాలీవుడ్ తీయలేకపోతోంది. ఎందుకంటే అక్కడవారికి మెదడే లేదు. సౌత్‌లో దర్శకుడిపై మొదట ఆధారపడతారు. వారిని పూర్తిగా నమ్ముతారు. బాలీవుడ్లో ఇగో ఎక్కువప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అలా ఎంతోమందిని నమ్మి కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేశారు. ఇలాంటివారిని బాలీవుడ్ నమ్మదు. వారి మాటల్ని అస్సలు లెక్క చేయలేదు. ఎందుకంటే ఇగో అని చెప్పుకొచ్చాడు. కాగా అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు!చదవండి: కోమాలో కుమారుడు.. కోలుకోగానే ఆ హీరో పేరే తలిచాడు: నాజర్ -
పెళ్లిలో కంటతడి.. అల్లుడిని వెనకేసుకొచ్చిన దర్శకుడు
ప్రముఖ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రియుడు షేన్ గ్రెగోయిర్తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులోని ఓ వీడియోలో పెళ్లికూతురిలా ముస్తాబైన ఆలియా మండపంలో నిల్చున్న తనవైపు నడుచుకుంటూ వస్తుంటే షేన్ సంతోషంతో ఏడ్చేశాడు.నా అల్లుడు అలాంటివాడుదీన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ఇదంతా డ్రామా.. అటెన్షన్ కోసమే ఇలా చేశాడని విమర్శించారు. తన అల్లుడిపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అనురాగ్ స్పందించాడు. నా అల్లుడు ఎంతో సున్నిత మనస్కుడు. అతడు నా కూతురిపై ప్రత్యేక ప్రేమ చూపిస్తాడు. ఇలా పెళ్లి ఏడవడమనేది ట్రెండ్ అని.. అది షేన్ ఫాలో అయిపోయి వైరల్ అవ్వాలని చూశాడనుకుంటే పొరపాటే అవుతుంది. ఇంత మంచి అల్లుడు దొరకాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. ఏడ్చినా తప్పేనా?ఒక తండ్రిగా చెప్తున్నా.. షేన్కున్న మంచితనంలో నాకు సగం కూడా లేదు అని చెప్పుకొచ్చాడు. అనురాగ్ రిప్లైకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిజమైన ఎమోషన్స్ చూపిస్తే కూడా జనాలు తప్పుపడుతున్నారేంటోనని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆలియా- షేన్ ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 11న పెళ్లి పీటలెక్కారు. View this post on Instagram A post shared by FOURFOLD PICTURES (@fourfoldpictures)చదవండి: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్ -
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో ఒర్రీ సందడి.. సెలబ్రిటీలందరితో పోజులు
-
అనురాగ్ కశ్యప్ కూతురి సంగీత్ వేడుక..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
స్టార్ డైరెక్టర్ ఇంట పెళ్లిసందడి.. హల్దీ వేడుకలో ఖుషీ కపూర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఆలియా కశ్యప్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కాగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ఈ హల్దీ వేడుకలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ అందమైన దుస్తులు ధరించి మెరిసింది. ఈ ఫోటోలను అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అనురాగ్ కశ్యప్ తన కుమార్తెతో వివాహానికి ముందు అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమాని చూడటానికి తండ్రీకూతుళ్లిద్దరూ వెళ్లారు.కాగా.. ఆలియా కశ్యప్ కొంతకాలంగా షేన్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమయ్యారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాల ప్రమోషన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ ఛానెల్లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
సెల్ఫీలకు పనికొస్తాం కానీ, ఇళ్లు మాత్రం అద్దెకు ఇవ్వరు: కల్కి
బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ విడాకులు తీసుకున్న తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌తో సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసి 2011లో పెళ్లి చేసుకుంది. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో 2015లో విడిపోయారు.పదేళ్ల తర్వాత తాను విడాకులు తీసుకున్నప్పుడు జరిగిన పలు సంఘటనలను కల్కి కొచ్లిన్ గుర్తుచేసుకుంది. అనురాగ్ కశ్యప్‌తో వివాహం ముగిసిన వెంటనే తన జీవితం అకస్మాత్తుగా ఎలా కష్టతరంగా మారిందో ఆమె తెలిపింది. ఒంటరి మహిళనని ముంబైలో తనకు అద్దెకు ఇళ్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. ఆ సంఘటనను నేను జీవితంలో మరిచిపోలేను. అంతకుమించిన ఇబ్బంది తన జీవితంలో మరోకటి లేదని కూడా చెప్పవచ్చని గుర్తు చేసుకుంది.'నేను, అనురాగ్ విడాకులు తీసుకున్నప్పుడు కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. చాలా సినిమాలతో నేను ఫుల్ బిజీగానే ఉన్నాను. అనురాగ్‌తో విడిపోయిన తర్వాత నాకు నివసించడానికి ఇళ్ల దొరకలేదు. ఒంటరి మహిళగా ఉన్న నాకు ముంబైలో అద్దెకు ఎవరూ ఇల్లు ఇవ్వలేదు. నేను పాపులర్ నటి కావడంతో అందరూ నాతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగపడటం చూశాను. కానీ, నాకు ఉండేందుకు ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.' అని ఆమె గుర్తుచేసుకుంది.కల్కి కొచ్లిన్ 2008లో అనురాగ్ దర్శకత్వం వహించిన దేవ్.డితో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచే వారు డేటింగ్ ప్రారంభించారు. ఆయనతో విడిపోయిన తర్వాత ఇజ్రాయెల్ మ్యుజీషీయన్ గయ్ హెర్ష్‌బర్గ్‌తో కల్కి లవ్‌లో పడింది. వీరి ప్రేమకు గుర్తుగా 2020లో కూతురు జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. దేవ్ డి, షైతాన్, జిందగీనా మిలేగి దొబారా, యే జవానీ హై దీవాని, వెయిటింగ్, మార్గరిట విత్ ఎ స్ట్రా, గల్లీ బాయ్, గోల్డ్ ఫిష్ ఇలా తదితర చిత్రాల్లో నటించింది. కల్కిస్ గ్రేట్ ఎస్కేప్ షోతో హోస్ట్‌గానూ మారింది. కల్కి చివరిగా 2023 నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖో గయే హమ్ కహాన్‌లో మెరిసింది. -
Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 50 మంది గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాల్ని హిమాచల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలు వెలికి తీశాయి. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది.గురువారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. #WATCH | Himachal Pradesh | The SDRF team at the spot in Shimla for the search and rescue operation where 36 people are missing and 2 bodies have been recovered so far after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. (Visual source - CMO) pic.twitter.com/WqF6vDk4Tx— ANI (@ANI) August 1, 2024 -
వంట మనిషి కోసం లక్షలు డిమాండ్: డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటీనటులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు నటీనటులు సమంజసం కాని డిమాండ్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షూటింగ్ సమయంలో కొంతమంది నటులు వ్యక్తిగత చెఫ్‌లను నియమించుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అంతే కాదు.. వారి చెఫ్‌కు ఒక్క రోజుకు ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా ఉంటాయని కశ్యప్ వెల్లడించారు. అయితే ఎవరనేది మాత్రం పేర్లు వెల్లడించలేదు.కొందరు నటులు తమకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే వారు చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని కశ్యప్ అన్నారు. అంతే కాకుండాహెయిర్, మేకప్ ఆర్టిస్టులు రోజుకు రూ.75,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది సాంకేతిక నిపుణుల కంటే ఎక్కువని కశ్యప్ పేర్కొన్నాడు. తాను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పటికే ధనవంతుడు అయ్యి ఉండేవాడినని తెలిపారు.ఇదంతా నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోందని.. నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్‌పై ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. కానీ నా సెట్స్‌లో ఇలాంటివి జరగవని చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ సెట్‌కు మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్‌ను ఓ నటుడు కోరినట్లు కశ్యప్ తెలిపారు. ఇలాంటి ఖర్చులు సినిమా మొత్తం నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.కాగా.. కశ్యప్ ఇటీవలే బాడ్ కాప్ సిరీస్‌లో నటించాడు. ఇందులో గుల్షన్ దేవయ్యకు విలన్‌గా నటించారు. -
హీరో వంటమనిషికి రూ.2 లక్షలా.. తన వంట చూస్తే..!
హీరోలు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా హిట్టయిందంటే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉండే పారితోషికం ఇప్పుడు కోట్లల్లోనే ఉంది. స్టార్ హీరోలైతే వంద కోట్లపైనే అందుకుంటున్నారు. ఇదంతా పక్కనపెడితే ఓ హీరోకు వంట చేసే మనిషి రూ.2 లక్షలు డిమాండ్ చేయడమే విడ్డూరంగా ఉందంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.రోజుకు రూ.2 లక్షలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఓ హీరో చెఫ్ రోజుకు రూ.2 లక్షలు ఇవ్వమని అడిగేవాడు. అతడు చేసే వంట ఓ పక్షి తినేంత ఉంటుందంతే! ఇదేంటి..? మరీ ఏదో పక్షికి వేసినట్లు ఇంత తక్కువ పెడితే ఏం సరిపోతుందన్నాను. అయితే ఆ హీరోకు ఏదో అనారోగ్య సమస్య ఉందట.. అందుకోసమని తక్కువ పరిమాణంలోనే తినాలని చెప్పాడు. ఈ మాత్రం దానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? అనిపించింది. టెక్నీషియన్ల కన్నా ఎక్కువహెయిర్, మేకప్ ఆర్టిస్టులు కూడా రోజుకు రూ.75,000 డిమాండ్ చేస్తున్నారు. సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లు కూడా అంత సంపాదించలేరు. ఇలాంటి పనికిమాలిన డిమాండ్లు ఎక్కువ అవడానికి కారణం నిర్మాతలే! వాళ్లు అడిగినదానికల్లా తలూపడం ముమ్మాటికీ తప్పే! నా సినిమాలో అయితే ఈ రకమైన డిమాండ్స్ అస్సలు ఒప్పుకోను' అని చెప్పుకొచ్చాడు.సినిమా..కాగా అనురాగ్ కశ్యప్.. దేవ్.డి, గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2, బాంబే టాకీస్, రామన్ రాఘవ్ 2, దొబారా, కెన్నడీ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. పలు చిత్రాలకు రచయితగా, నిర్మాతగా పని చేశాడు. ఘూంకెటు, హడ్డీ, మహారాజ వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. బ్యాడ్ కాప్ అనే వెబ్ సిరీస్‌లో విలన్‌గా కనిపించనున్నాడు. -
స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్వీఆర్ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే ‘మైఖేల్’లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుక్ ఖాన్గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
షారుక్‌తో సినిమా.. తన వల్ల కాదన్న స్టార్ డైరెక్టర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్టార్ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనురాగ్ కశ్యప్.. షారుక్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చారు. మీరు షారుక్‌తో కలిసి ఎందుకు పని చేయలేదని ఆయను ప్రశ్నించగా.. అనురాగ్ స్పందించారు. అతనికున్న స్టార్ క్రేజ్, అభిమానులను చూసి తాను భయపడుతున్నట్లు తెలిపారు. షారుక్ ఫ్యాన్స్ అంచనాలను అందుకునే సామర్థ్యం తనకు లేదన్నారు.అనురాగ్ మాట్లాడుతూ..'సోషల్ మీడియా యుగంలో పెద్ద పెద్ద స్టార్స్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. వారి క్రేజ్ చూస్తే నాకు భయం. స్టార్ హీరోల అభిమానులకు తమ నటుడిపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతిసారి ఫ్యాన్స్ వారి నుంచి మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు. ఒకవేళ వారి అంచనాలు అందుకోలేకపోతే అభిమానులు విమర్శిస్తారు. అందుకే హీరో కూడా కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్‌తో సినిమా తీసే సామర్థ్యంలో నాకు లేదు.' అని అన్నారు. కాగా.. గతేడాది పఠాన్, జవాన్,డుంకీ చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ సాధించారు. మరోవైపు అనురాగ్ తెరకెక్కించిన చిత్రం 'కెన్నెడీ' 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. -
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్‌కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్‌లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
నన్ను కలవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొత్త పాట పాడుతున్నాడు. ఇకనుంచి ఎవరినీ ఊరికే కలిసేది లేదంటున్నాడు. డబ్బులిస్తేనే పని జరుగుతుందంటున్నాడు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇకనుంచి ఏదీ ఫ్రీగా చేయనంటున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు సాయం చేయడం కోసం ఇప్పటికే నేను చాలా సమయాన్ని వృథా చేశాను. కొన్నిసార్లు టైం వేస్ట్ తప్ప ఏమీ మిగల్లేదు. కాబట్టి నేనో నిర్ణయానికి వచ్చాను. పావుగంటకు లక్ష.. గంటకు..? మేము తెలివైనవాళ్లం.. మా దగ్గర టాలెంట్‌కు కొదవే లేదని చెప్పుకుని తిరిగేవాళ్లతో నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ప్రతిదానికి ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్‌కట్స్ కావాలా? మీరు అంత డబ్బు ఇవ్వగలిగేవారైతేనే రండి. లేదంటే వెళ్లిపోండి. షార్ట్‌కట్స్ వెతుక్కుంటూ వచ్చేవారిని చూసి అలిసిపోయాను. మరో ముఖ్య విషయం.. ఆ డబ్బంతా కూడా ఒక్కసారే అడ్వాన్స్‌గా ఇచ్చేయాలి' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అతడి కూతురు ఆలియా.. నీకు ఫార్వర్డ్ చేయమంటూ నాకు స్క్రిప్టులు పంపుతున్న ప్రతిఒక్కరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ -
కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్.. గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్ చిత్రంలో విలన్‌గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్‌కుమార్ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్, కల్వన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్, సియాన్ విక్రమ్ 62వ చిత్రం, శివకార్తికేయన్ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార -
ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కెన్నెడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్, రాహుల్ భట్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన బాలీవుడ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఎదురైన పరిస్థితుల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) అదే సమయంలో తనకు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అందుకు గల కారణాలను కూడా అనురాగ్ వివరించారు. నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. నెగెటివిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఒకటి, రెండు సంవత్సరాల పాటు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా. 2021కి ముందు రెండేళ్లపాటు ఎక్కువగా ప్రభావితమయ్యా. ఆ సమయంలో బయటకు వెళ్లాలని అనుకున్నా. దక్షిణాదికి చెందిన నా స్నేహితులు తమిళంలో సినిమాలు చేయమని ఆహ్వానించారు. కేరళకు చెందిన నా స్నేహితుడు మలయాళంలో సినిమాలు చేయమని పిలిచారు. జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు చేయమని కూడా ఆహ్వానం అందింది. కానీ నాకు భాషలు తెలియక వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. అవీ నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.' అని అన్నారు. (ఇది చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) అనురాగ్ కెరీర్ అనురాగ్ కశ్యప్ మొదట రామ్ గోపాల్ వర్మ చిత్రం సత్యలో కో- డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్ -2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
Aaliyah Kashyap: స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. గురువారం ముంబయిలో జరిగిన ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు మెరిశారు. ఈ ఫంక్షన్లో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్ హాజరయ్యారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ( ఇది చదవండి: చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!) కాగా.. ఆలియా కశ్యప్.. తన ప్రియుడైన షేన్ గ్రెగోయిర్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఆలియా యూట్యూబర్‌గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా. ఇంతకుముందే ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమెకు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసినట్లు ఆలియా వెల్లడించింది. ఈ వేడుకలో అనురాగ్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ తన బేబీ, భర్తతో సహా హాజరైంది. ( ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) -
మహారాజా రెడీ
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్–థింక్ స్టూడియోస్ జగదీష్ పళనిసామి సమర్పణలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఆ డైరెక్టర్ నా పీరియడ్స్ డేట్ అడిగాడు: బాలీవుడ్ నటి
ఓపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తూ జోరు మీదుంది బాలీవుడ్ నటి అమృత సుభాష్. ద మిర్రర్, లస్ట్ స్టోరీస్ 2లోనూ యాక్ట్ చేసిన ఈమె తాజాగా తనకు షూటింగ్లో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చింది. 'నేను సాక్ర్డ్ గేమ్స్ 2 సిరీస్‌లో తొలిసారి శృంగార సన్నివేశాల్లో నటించాను. ఈ సీన్స్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అప్పుడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు. నీ పీరియడ్స్ డేట్ ఎప్పుడు? అని ప్రశ్నించాడు. నాకు కొద్ది క్షణాలపాటు ఏం అర్థం కాలేదు. అతడు తిరిగి.. నీ డేట్ ఎప్పుడో చెప్తే మనం ఇంటిమేట్ సీన్స్‌కు ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షెడ్యూల్ సర్దుబాటు చేద్దాం అన్నాడు. డైరెక్షన్ టీమ్‌తో మాట్లాడి షెడ్యూల్లో మార్పుచేర్పులు చేశాడు. అతడు చాలా మృదుస్వభావి. నటీనటులను ఎంతగానో అర్థం చేసుకుంటాడు' అని చెప్పుకొచ్చింది అమృత. కాగా అమృత సుభాష్ సాక్ర్డ్ గేమ్స్ రెండో సీజన్లో రా ఏజెంట్‌గా నటించింది. అలాగే కొంకణ సేన్ దర్శకత్వం వహించిన ద మిర్రర్‌లోనూ యాక్ట్ చేసింది. అయితే ఇందులో తన పాత్ర గురించి చెప్పినప్పుడు ఏదీ తన బుర్రకు ఎక్కలేదట. ఒకరకంగా అదే మేలంటోంది అమృత. తన పాత్ర గురించి పూర్తిగా తెలిసిపోతే రిలాక్స్ అయిపోతామని, అదే కాస్త సందిగ్ధంగా ఉంటే దాని గురించి తెలుసుకునేందుకు, అందులో లీనమైపోయేందుకు మరింత కష్టపడతామని చెప్తోంది. చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్ -
పాక్ నటి పెళ్లి.. హెల్ప్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్
పాక్ నటి ఉస్నా షా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తమ దేశానికి చెందిన గోల్ఫ్ ప్లేయర్ హమ్జా అమీన్ తో నిఖా చేసుకుంది. అయితే ఈ వేడుకలో ఉస్నా.. ఎర్రని లెహంగా ధరించడం సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద రచ్చ అయింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈమె డ్రస్ వేసుకోవడాన్ని కొందరు తప్పుబట్టారు. ఇప్పుడు ఏకంగా తన పెళ్లి జరగడానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కారణమని బయటపెట్టింది. పాకిస్థాన్‌కు చెందిన ఉస్నా షా.. సినిమాలు, సీరియల్స్ తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కాస్త బిజీగానే ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో తాను దిగిన ఫొటోని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆయన్ని జీనియస్ అని మెచ్చుకుంటూనే.. తన పెళ్లి జరగడానికి ఈ దర్శకుడే కారణమని చెప్పుకొచ్చింది. అయితే అది ఎప్పుడూ ఎలా అనేది మాత్రం బయటపెట్టలేదు. పాక్ నటికి బాలీవుడ్ డైరెక్టర్ తో ఎక్కడా ఎలా పరిచయం అయిందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!) View this post on Instagram A post shared by Ushna Shah-Amin (@ushnashah) -
Aaliyah Kashyap: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రముఖ దర్శకుడి కూతురి నిశ్చితార్థం, ఫోటోలు వైరల్
ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా షేన్ గ్రెగోయిర్ ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆలియా నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రేయసి వేలికి ఉంగరాన్ని తొడిగాడు షేన్. ఈ ఫోటోలను లవ్ బర్డ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇందులో తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని హైలైట్ చేసిన ఆలియా మరో ఫోటోలో ప్రియుడికి గాఢంగా ముద్దు పెట్టింది. 'మొత్తానికి మేము అనుకుంది జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్నర్, నా సోల్‌మేట్ ఇప్పుడు నా భర్త అయ్యాడు. నా జీవితానికి దొరికిన అమూల్యమైన ప్రేమవు నీవే.. అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు థ్యాంక్స్. నీ ప్రపోజల్‌కు ఎస్ చెప్పడం నేను చేసినవాటిలో అత్యంత సులువైన పని. నీతో జీవితాన్ని కొనసాగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఫియాన్సీ అని పిలిచే రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. కాగా ఆలియా- షేన్ గ్రెగోయిర్ 2020లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతేడాది జూన్‌లో తమ ప్రేమకు రెండేళ్లు నిండటంతో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు షేన్. ఆలియాను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తూనే ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగే రోజు కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధించడంతో షేన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Shane Gregoire (@shanegregoire) చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు -
నా జీవితంలో అత్యంత చెత్త సందర్భం అదే: సన్నీ లియోన్
బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కెన్నెడీ'. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. సన్నీ లియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆడిషన్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెన్నెడీ సినిమాకు ఆడిషన్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. రూమ్ మొత్తం మనుషులు ఉండటం చూసి చాలా కంగారు పడ్డానన్నారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' కెన్నెడీలో ఆఫర్ కోసం అనురాగ్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. దర్శక, నిర్మాతలు మాత్రమే ఆడిషన్ చేస్తారని తెలుసు. అందుకే ఎలాంటి భయం లేకుండా వెళ్లాను. తీరా చూస్తే అక్కడ సినిమా యూనిట్ అంతా ఉంది. సినిమా కోసం పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర టీమ్ మొత్తం అక్కడే రూమ్‌లో ఉన్నారు. దీంతో వాళ్లందర్నీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాలో చాలా కంగారు మొదలైంది. నేను ఆడిషన్ ఇవ్వడం పూర్తయిన వెంటనే అనురాగ్ వాళ్ల టీమ్ వైపు చూసి.. ఆమె ఎలా చేసింది? అని అడిగారు. ఆ క్షణం సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ఆడిషన్ అదే అనిపించింది,.' అని అన్నారు. అదృష్టవశాత్తు తాను ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సన్నీ లియోన్ తెలిపారు. -
ఆ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ టాలీవుడ్‌కు సుపరిచితమైన పేరు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లి చిత్రంలోనూ కనిపించింది పాయల్. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా కూడా చేసింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో తనదైన నటనతో మెప్పించింది. బెంగాలీ అయినా పాయల్ ఘోశ్ తాజాగా సంచలన ట్వీట్స్ చేసింది. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఇప్పటికే ఫిర్యాదు చేసిన నటి మరోసారి వరుస ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. పాయల్ ట్వీట్లో రాస్తూ..' నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. అతన్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఎందుకు సౌత్ గురించి గొప్పగా చెప్పుకోకూడదో చెప్పండి. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశా. కానీ అతను కూడా నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. ఆయనొక జెంటిల్మెన్. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.' అంటూ పోస్ట్ చేసింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. I have also worked with a Super star @tarak9999 but even him never behaved with me inappropriately , such a gentleman he was , I have all the love for south film industry ❤️ — Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023 I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!! — Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023 -
సుశాంత్ మరణించేముందు మెసేజ్ వచ్చింది, నేను పట్టించుకోలే!
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! బాలీవుడ్ సెలబ్రిటీలు సుశాంత్‌ను పట్టించుకోలేదని, అతడిని సైడ్ చేయడం వల్లే సుశాంత్ కుమిలిపోయి ఆత్మహత్యకు యత్నించాడంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ సుశాంత్‌ను తలుచుకుంటూ నిత్యం అతడి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తానిప్పటికీ బాధపడుతున్నానన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అందరి ముందు అరుస్తున్నానని నాకు చాలా లేట్‌గా తెలిసొచ్చింది. కొన్ని విషయాలను గ్రహించడానికి నాకు ఏడాదిన్నర పట్టింది. సోషల్ మీడియా వచ్చాక నేను వెనక్కు తగ్గాను. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని గ్రహించాను. సుశాంత్ మరణంతో చాలా కుంగిపోయాను. తను చనిపోవడానికి మూడు వారాల ముందు సుశాంత్ టీమ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అతడు నాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పారు. నేను మాత్రం కుదరదు, మాట్లాడనని చెప్పేశా. గతంలో నా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్న కోపంతో అలా మాట్లాడాను. కానీ సుశాంత్ చనిపోయాక ఎంత గిల్టీగా ఫీలయ్యానో! తర్వాత ఓసారి అభయ్కు ఫోన్ చేసి అతడికి సారీ చెప్పాను. ఎందుకంటే నేను పబ్లిక్‌గా అతడి గురించి మాట్లాడినందుకు తను హర్ట్ అయ్యాడని తెలిసింది. అందుకే మరేం ఆలోచించకుండా క్షమాపణలు చెప్పాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. I am sorry that I am doing this but this chat is from three weeks before he passed away. Chat with his manager on 22 May .. havent don’t it so far but feel the need now .. yes I didn’t want to work with him for my own reasons .. https://t.co/g4fLmI5g9h pic.twitter.com/cHSqRhW9BD — Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020 చదవండి: నా కన్నీళ్లు నేనే తాగి బతికిన.. నన్నాపకుండ్రి..: రచ్చ రవి కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడెవరో తెలిసిపోయింది -
మోదీజీ.. పరిస్థితి చెయ్యి దాటిపోయింది!
ముంబై: సొసైటీలో సినిమాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల చుట్టూరానే రాజకీయాలు కచ్ఛితంగా నడుస్తున్నాయి. తాజాగా.. సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే.. ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర నిర్మాత షరీఖ్ పటేల్ మాత్రం ప్రధాని సూచనపై సానుకూలంగా స్పందించారు. ఇకనైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏర్పడిన నెగటివిటీ కనుమరుగు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ఉత్త పుణ్యానికే బాయ్‌కాట్ ట్రెండ్ తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత పార్టీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ సలహా ఇవ్వడం విశేషం. కిందటి ఏడాది బాయ్‌కాట్ ట్రెండ్‌ను చాలానే ఎదుర్కొన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, దొబారా, లైగర్, బ్రహ్మస్త్ర: పార్ట్ వన్-శివ బాయ్‌కాట్ ట్రెండ్‌లో అల్లలాడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో షారూక్ ఖాన్ పథాన్ చిత్రం బాయ్కాట్ట్రెండ్ను ఎదుర్కొంటోంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్ సినిమాలకు నార్త్‌లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్ టీజర్ ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్‌పైనే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్లో వర్కౌట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అనురాగ్ పేర్కొన్నాడు. -
మూడేళ్లు డిప్రెషన్లో, ఇంతలో గుండెపోటు: స్టార్ డైరెక్టర్
స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒకానొక సమయంలో ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాడట. తన కూతురి గురించి ఆందోళనపడి మూడున్నరేళ్ల పాటు డిప్రెషన్లో ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నామీద, నా కుటుంబం మీద ఎంతో ద్వేషం చూపించారు. నా కూతుర్ని అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల ఆమె ఎంతో ఒత్తిడికి లోనయ్యేది. ఇంత నెగెటివిటీ భరించలేక ట్విటర్ నుంచి వైదొలిగాను. పోర్చుగల్ వెళ్లిపోయాను. కొంతకాలానికి ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండటంతో భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. నా కూతురు ఆలియా కశ్యప్ ఏదున్నా బయటకు మాట్లాడేస్తుంది. కానీ ఆమె లోలోపల పడే ఆందోళన నన్ను ఎంతగానో బాధపెట్టింది. సోషల్ మీడియాలో మొదలైన బెదిరింపుల వల్ల ఆమె చాలా డిస్టర్బ్ అయింది. తన కోసమే నేను అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాను. ప్రతిదానికీ ఆలియా కంగారుపడిపోతుంది, అదొక్కటే నన్ను టెన్షన్ పెడుతుంది. దాదాపు మూడేళ్లు డిప్రెషన్లో ఉన్నాను. గతేడాది గుండెపోటు వచ్చి ఆస్పత్రిపాలయ్యాను. కానీ కోలుకున్న వెంటనే తిరిగి సినిమాలు మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. కాగా అనురాగ్ డైరెక్ట్ చేసిన ప్యార్ విత్ డీజే మొహబ్బత్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు నిహారికతో బ్రేకప్.. సింగర్ క్లారిటీ -
హతవిధీ.. తాప్సీ సినిమాకు కూడా అదే గతి!
బాలీవుడ్‌కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకున్న బడా డైరెక్టర్లు, స్టార్ హీరోల ఆశ అత్యాశే అయింది. బస్తీమే సవాల్ అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో తాప్సీ కొత్త మూవీ దొబారా వచ్చి చేరింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా కేవలం 2 నుంచి మూడు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయట. అసలు జనాలే రాకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారట. మహా అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.30 లక్షలు, ఫుల్ రన్లో కోటిన్నర రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి సినీవిశ్లేషకులు. నిజానికి సినిమా ప్రమోషన్స్‌లో బాయ్‌కాట్ ట్రెండ్‌పై తాప్సీ, అనురాగ్‌లు స్పందిస్తూ.. దొబారా మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలని కోరారు. అన్నట్లే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు. కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్. For Me….#Dobaaraa is a Successful film, it SUCCESSFULLY MADE ME SLEEP inside the theatre also made me believe in TIME TRAVEL because I wanted to go back in time when I purchased the ticket for the film… 1.5*/5 ⭐️ ½ #DobaaraaReview #AnuragKashyap #TaapseePannu pic.twitter.com/XPFIuaelTz — Rohit Jaiswal (@rohitjswl01) August 19, 2022 #Dobaaraa is off to a DISASTROUS start at the box office, film is registering merely 2-3% occupancy while many early shows are getting canceled due to NO AUDIENCE.. — Sumit Kadel (@SumitkadeI) August 19, 2022 చదవండి: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ -
ఇద్దరు మాజీ భార్యలతో స్టార్ డైరెక్టర్, ఫొటో వైరల్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ల సినిమా వస్తుందంటే చాలు చూసేదే లేదని తెగేసి చెప్తున్నారు హిందీ ఆడియన్స్. ప్రేక్షకుల దెబ్బకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బడ్జెట్లో కనీసం పావు వంతైనా రాబట్టకపోవడంతో నిర్మాతలు అల్లాడిపోతున్నారు. త్వరలో తాప్సీ- అనురాగ్ కశ్యప్‌ల నుంచి కొత్త సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన దొబారా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. అయితే తమ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయాలని, అప్పుడే తమ చిత్రం అందరికీ రీచ్ అవుతుందని వింతగా స్పందించారు తాప్సీ, అనురాగ్. ఇక మరోవైపు తాప్సీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడీ డైరెక్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన మాజీ భార్యలతో కలిసి ఫొటోలను పోజిచ్చాడు. దొబారా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీరిద్దరూ తన రెండు పిల్లర్లు అని రాసుకొచ్చాడు. ఈ ఫొట నెట్టింట వైరల్ అవగా అనురాగ్- ఆర్తిల కూతురు ఆలియా కశ్యప్ ఐకానిక్ అంటూ ఈ పోస్ట్‌పై కామెంట్ చేసింది. కాగా అనురాగ్ కశ్యప్- ఆర్తి బజాజ్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆలియా జన్మించింది. ఆ తర్వాత 2009లో వీరు విడిపోయారు. అనంతరం అనురాగ్ 2011లో నటి కల్కి కొచ్లిన్ను పెళ్లాడగా 2015లో విడాకులు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే!
ఇండియన్ సినిమాకు ఆస్కార్ అన్నది ఒక కల. ప్రతీ ఏటా మనం సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపడం.. వారు మన సినిమాను రిజెక్ట్ చేయడం పరిపాటిగా మారింది. కాని 2023 ఆస్కార్ కు ఇండియా నుంచి వెళ్లే సినిమాను ఎంపిక చేయాల్సి వస్తే గుడ్డిగా ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేయమంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు మన దేశం తరుపున కమిటీ కనుక ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేసి పంపితే ఉత్తమ విదేశి చిత్రం క్యాటగరీలో ఆస్కార్ అందుకోవడానికి 99 శాతం చాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘దోబారా’. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే.. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు) హాలీవుడ్‌పై ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభావితం చేసిందని, అక్కడ తెరకెక్కిన మార్వెల్ మూవీస్ కంటే కూడా ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్. ఇక వెరైటీ అనే మరో హాలీవుడ్ మ్యాగజైన్ఆస్కార్ బెస్ యాక్టర్ క్యాటగరీస్ లిస్ట్ లో తారక్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందంటూ లిస్ట్ బయటపెట్టింది.మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. -
తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దొబారా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనురాగ్‌తో కలిసి తాప్సీ ఓ చానల్ ఇంటర్య్వూకు హాజరైంది. ఈ సందర్భందగా అనురాగ్ తాప్సీపై చేసిన వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్ నిలిచాయి. ఈ సందర్భంగా యాంకర్ రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై మీ అభిప్రాయం ఏంటని అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించాడు. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. అది తనకు నచ్చిందని, ప్రస్తుతం ఇలాంటివి సర్వసాధారణమని బదులిచ్చాడు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మీరు కూడా ట్రై చేయండి.. ఆ ఫొటోషూట్ బాగా వైరల్ అవుతుందంటూ యాంకర్ చమత్కిరించాడు. దీంతో తాప్సీ మధ్యలో మాట్లాడుతూ.. ప్లీజ్ హారర్ షోకు తెరలేపకండి అని సరదాగా కామెంట్స్ చేసింది. ఇక తాప్సీ కామెంట్స్‌కు రియాక్ట్ అయిన దర్శకుడు అనురాగ్.. నువ్వేందుకు భయపడుతున్నావ్.. ‘హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయి.. అందుకే తను అసూయ పడుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అతడి కామెంట్‌కి కాస్తా ఇబ్బంది పడ్డ తాప్సీ ఆ తర్వాత లైట్ తీసుకుని నవ్వేసింది. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. అనురాగ్ అంత అసభ్యంగా కామెంట్స్ చేయడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక తాప్సీ రియాక్షన్ చూసి ఆమెను తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
తాప్సీ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్!
సినిమా రిలీజ్ అవడానికంటే ముందే దాన్ని నిలిపివేయాలంటూ బాయ్‌కాట్ చేసే ప్రచారం ఈమధ్య పరిపాటి అయింది. బాలీవుడ్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బడా హీరోల నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు దాన్ని చూడొద్దంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో నేడు రిలీజైన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మరో సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విటర్ హోరెత్తిపోతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన దొబారా మూవీ ఆగస్టు 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన కథానాయిక. అయితే అన్ని బాలీవుడ్ సినిమాల్లాగే తమ మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా ఊగిపోవాలని తాప్సీ, అనురాగ్ కోరుకోవడం గమనార్హం. అసలు థియేటర్లలో రిలీజయ్యే అర్హత దొబారాకు లేనే లేదు, తాప్సీ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తుంది? మేము చూడటం ఆపేస్తే అప్పుడు తెలిసొస్తుంది, మన దేశం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ సహించాల్సిన అవసరం లేదు, ఇలాంటి చీప్ మనుషులను మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటూ క్యాన్సల్ దొబారా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. They used to show the capability of net together and will boycott your film.#CancelDobaaraa @anuragkashyap72 @taapsee pic.twitter.com/yHfKtcayFo — Rishabh (@rishi12300) August 10, 2022 Its not cool to create always controversies by speaking against our country #CancelDobaaraa pic.twitter.com/ThinlwbxWp — Rahul (@Rahul__Roy18) August 10, 2022 I think this #CancelDobaaraa trend has been planned by the two jokers Anurag Kashyap and Taapsee Pannu. — Debmalya Banerjee (@DebmalyaDgp) August 10, 2022 Fake people are @anuragkashyap72 & @taapsee don't deserve our attention at all #CancelDobaaraa 💯 pic.twitter.com/W3Ll5y9y0e — Nitin_Reddy (@Nitinreddy2003) August 10, 2022 #CancelDobaaraa is needy thing at this time of point.. We need to full boycott such films pic.twitter.com/ilx9WwE6EC — Aayan (@ayanali9563) August 10, 2022 చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో -
జోయా అఖ్తర్ యాక్టర్స్‌కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్‌గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్‌ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్‌కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్‌తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో యాక్టర్స్‌కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు. -
ప్రియుడితో పెళ్లికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ కిడ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. ఆలియా, షేర్ గ్రెగోయిర్ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలను వారివారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా షేన్.. 'నా ప్రియాతిప్రియమైన దేవతకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్ మాత్రమే కాదు, నా సర్వస్వం నువ్వే! నిత్యం నాకోసం సమయం కేటాయిస్తూ నాకు సంతోషాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం. ఐ లవ్యూ, నిజం చెప్పాలంటే నీ వేలికి ఎప్పుడెప్పుడు ఉంగరం తొడుగుదామా? అని తెగ ఆరాటపడుతున్నాను' అని రాసుకొచ్చాడు. షేన్ ఆదుర్దా చూస్తోంటే కాలం కలిసొస్తే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కనిపిస్తోంది. కాగా ఆలియా, షేన్ తొలిసారిగా డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరు డేటింగ్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిశారంటే చాలు రొమాంటిక్ ఫొటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకుంటారు. View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Shane Gregoire (@shanegregoire) చదవండి: -
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనురాగ్ కశ్యప్ మూవీ
‘మల్లేశం’దర్శకుడు రాజ్ రాచకొండ... బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలిసి నిర్మించిన మలయాళం సినిమా ‘పాక’. తెలుగులో ‘మల్లేశం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ‘పాక - ది రివర్ అఫ్ బ్లడ్’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మల్లేశం చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ కోసి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించటానికి ఎన్నికవ్వడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘మల్లేశం చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు పాక కథ బాగా నచ్చింది. ప్రేమ, క్రూరత్వం గురించి భావోద్వేగాలను ప్రదర్శించే లోతైన కథ. తరచూ గొడవలుపడే రెండు కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే పాక. మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్‌లో చిత్రీకరించాము. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్, జోసెఫ్ మాణికల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోచించారు. సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శింపబడుతోంది’ఆయన తెలిపారు. -
'మౌనంగా ఉండకండి.. ముక్కలైపోయిన హృదయంతో రాస్తున్నా'
అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. తాలిబన్లు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ అఫ్గనిస్తాన్ వదిలి పారిపోయారు. ఇక ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు అష్టకష్టలు పడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ దర్శకురాలు సహ్ర కరిమి తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై బహిరంగ లేఖను రాసింది. 'గత కొన్నివారాలుగా తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌లోని పలు బలగాలను తమ వశం చేసుకున్నారు. చాలామంది ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి పెద్ద వయసున్న వారికిచ్చి పెళ్లి చేశారు. ఓ కమెడియన్‌ను విపరీతంగా హింసించి చంపేశారు. మరో మహిళ కళ్లు పీకేశారు. ఇవే కాకుండా కొంతమంది రచయిలు, మీడియా, ప్రభుత్వ పెద్దలను చంపేశారు. తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గనిస్తాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశ అభ్యుదయం కోసం ఎంతో కష్టపడి సాధించుకున్నవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. తాలిబన్లు పాలిస్తే అన్ని కళలను నిషేధిస్తారు. మహిళల హక్కులను కాలరాస్తారు. భావ వ్యక్తీకరణను అడ్డుకుంటారు. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య సున్నా. కానీ ఇప్పుడు 9 మిలియన్లకు పైగా అఫ్గన్ బాలికలు స్కూల్‌కు వెళ్తున్నారు. తాలిబన్ల నుంచి మా ప్రజలను కాపాడటంతో మీరు నాతోచేతులు కలపండి. ముక్కలైపోయిన హృదయంతో, ఎంతో ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి దీన్ని అందరూ షేర్ చేయండి. మౌనంగా ఉండకండి' అంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సహా పలువురు రీట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) pic.twitter.com/q92voLc7Gi — Prithviraj Sukumaran (@PrithviOfficial) August 16, 2021 -
అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు!
స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్ అయ్యి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్‌ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్-2021’ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్ గేమ్స్, ఏ సూటబుల్ బాయ్’ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
తండ్రి రెస్టారెంట్ బిల్ కట్టిన అలియా: దర్శకుడు భావోద్వేగం
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కూతురు ఆలియాతో కలిసి రెస్టారెంట్‌కు లంచ్‌కు వెళ్లిన వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పాడు. ‘నా కూతురు ఈ రోజు నాకు లంచ్ ఆఫర్ చేసింది. తన సొంత డబ్బులతో ఈ రోజు నన్ను రెస్టారెంట్‌కు తీసుకువెళ్లింది’ అంటూ ఆలియా రెస్టారెంట్ బిల్ కడుతున్న వీడియోను అభిమానులు, సన్నిహితులతో పంచుకున్నాడు. బిల్ కట్టిన అనంతరం అలియా తండ్రిని సినిమాలు ఆపేమని కూడా సూచించింది. ఇది ఆయనను మరింత గర్వపడేలా చేసిందంటూ అనురాగ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఈ డబ్బులను ఆలియా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిందని, అలా వచ్చిన మొదటి సంపాదనతో తనకు లంచ్ ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించాడు. ఇక అనురాగ్ వీడియోపై అనురాగ్ సినీ స్నేహితుడు గుల్సాన్ దేవయ్య స్పందిస్తూ.. ‘భవిష్యత్తులో ఆలియా నీ సినిమాలకు ఫైనాస్ ఇస్తుంది చూడు’ అంటూ కామెంట్స్ చేశాడు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: ‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె -
‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె
1980-90ల కాలంలో తండ్రి అంటే పిల్లలకు అమితమైన భయం, గౌరవం. ఆయనతో ఏం మాట్లాడలన్నా మధ్యవర్తిగా అమ్మ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తండ్రి పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్. తమకు సంబంధించిన ప్రతి విషయం తండ్రితో పంచుకుంటున్నారు. ఎలాంటి సందేహం వచ్చినా సరే నిస్సంకోచంగా అడిగేస్తున్నారు. తండ్రులు కూడా పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు తప్ప తప్పించుకోవటం లేదు. సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారు ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఆయన కుమార్తెల మధ్య జరిగిన ప్రశ్నోత్తరాల వీడియో ఈ మాటలను నిజం చేస్తుంది. ఇందులో అనురాగ్ కుమార్తె అలియా తన బాయ్‌ఫ్రెండ్ దగ్గర నుంచి వివాహానికి ముందే శృంగారం వరకు పలు అంశాల గురించి తండ్రికి ప్రశ్నలు సంధిస్తుంది. వాటిపై అనురాగ్ తన అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుతం ఈ తండ్రికూతుళ్ల సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అలియా ఏడాదిగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రి ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్‌ను తండ్రి ఇష్టపడుతున్నాడా అని అలియా ప్రశ్నిచంగా.. అందుకు అనురాగ్.. ‘‘గ్రెగోయిర్ చాలా మంచివాడు.. ఎంతో పరిణితి కల వ్యక్తి. స్నేహితుల ఎంపికలో ముఖ్యంగా మగ స్నేహితుల ఎంపికలో నీవు ఎంతో జాగ్రత్తగా ఉంటావనే విషయం నాకు అర్థం అయ్యింది’’ అని తెలిపారు. ఇక అమ్మాయిలు రాత్రిపూట బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడం గురించి అనురాగ్ ఇలా స్పందించాడు.. ‘‘పర్లేదు. అయితే చాలా మంది భారతీయ తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేరు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి.. మారుతూనే ఉంటాయి. మన పిల్లలు మనలా అణచివేతను ఇష్టపడరు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఏమాత్రం భయపడరు. కనుక మన భయాల్ని, అభిప్రాయలను పిల్లల మీద రుద్దడం ఆపేయాలి’’ అన్నారు. ఇక పెళ్లికి ముందే శృంగారం, గర్భం దాల్చడం వంటి అంశాలపై అనురాగ్ స్పందిస్తూ.. ‘‘గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శృంగారం గురించి రహస్యంగా చాటుమాటుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను నీకు వివరిస్తాను. మంచేంటే చెడేంటో నీకు వివరిస్తాను. ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తాను’’ అన్నారు. ‘‘ఇక పెళ్లికి ముందే గర్బం దాల్చాను అని చెబితే.. నీవు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటాను.. నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. మద్దతుగా నిలుస్తాను. కానీ దాని మూల్యాన్ని భరించాల్సింది నీవే’’ అని చెప్పుకొచ్చారు. ఈ తండ్రికూతుళ్ల మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోని ‘‘ఇబ్బందికర ప్రశ్నలు’’ పేరుతో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. తల్లిదండ్రులు తన పిల్లలతో ఇంత ఒపెన్‌గా ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.. తప్పులు చేయరు అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఒళ్లంతా చెమటలు, ఆ క్షణం చచ్చిపోతున్నా అనుకున్నా -
షాకిస్తున్న దర్శకుడు అనురాగ్ కొత్తలుక్, ఏమైందంటే..
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఛాతీ నొప్పితో హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తూ కశ్యప్ కూతరు అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో పాటు వీడియో షేర్ చేసింది. ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఎప్పటి లాగే తమతో సరదాగా ఉంటున్నారంటూ ఆయన కూతురు తెలిపింది. అయితే ఈ ఫోటోల్లో అనురాగ్ గుండు చేయించుకుని, ఒత్తైన కను బొమ్మలు, గడ్డంతో దర్శనమిచ్చారు. ఆయనను అలా చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఏమైంది.. సార్ బాగానే ఉన్నారు కదా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్‌కు ఛాతిలో స్వల్పంగా నొప్పిరావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు ఆయనకు ఆంజియోప్లాస్టి సర్జరీ చేయాలని సూచించినట్లు కశ్యప్ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆయన ప్రస్తుతం మెడికేషన్లు ఉన్నారని.. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న ఆయన తాజా ఫొటోలు, వీడియోను అలియా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా తాప్సీ పన్ను లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘దోబారా’. మార్చిలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
ఒళ్లంతా చెమటలు, ఆ క్షణం చచ్చిపోతున్నా అనుకున్నా
ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కూడా ఒకానొక సమయంలో మానసిక వేదన అనుభవించిన వ్యక్తే. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. మానసిక సమస్యలతో తానో యుద్ధమే చేశానంటూ దానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడిచింది. "టీనేజర్‌గా ఉన్నప్పుడు అంటే 13-14 ఏళ్ల వయసులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనయ్యాను. ఇదేం నా జీవితాన్ని నాశనం చేసేంత ఇబ్బంది పెట్టలేదు. ఒక్కసారి బలంగా అనుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు, అది మన చేతుల్లోనే ఉందని నమ్మాను. కానీ డిప్రెషన్‌కు గురైనప్పుడు మాత్రం ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేకపోయాను. అప్పుడు చాలా భయమేసింది. నవంబర్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నేను కుంగుబాటుకు లోనయ్యాను. తెలియకుండానే కన్నీళ్లు జలజలా రాలేవి. నా బతుకుకు అర్థం లేదు అనుకునేంతవరకు వెళ్లాను. అసలు ఎందుకు బతకాలి? దేనికోసం బతకాలి? అని పిచ్చిపిచ్చిగా ఆలోచించాను. ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు నన్ను ఆసుపత్రి బెడ్ మీదకు చేర్చాయి. నా పరిస్థితి చూసి పేరెంట్స్ కంగారుపడ్డారు. వెంటనే వాళ్లు ఇండియా నుంచి అమెరికాకు వచ్చారు. నా ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మామూలు మనిషి అయ్యేవరకు నా వెంటే ఉన్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మార్చిలో నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది సడన్‌గా నేను బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోయాను, స్నానం చేయకుండా, పిడికెడు మెతుకులైనా తీసుకోకుండా అచేతనంగా ఉండిపోయాను. ఒళ్లంతా చెమటలు, మరోవైపు గుండె వేగం పెరిగింది. ఆ క్షణం నేను చచ్చిపోతున్నా అనుకున్నా.. హాస్పిటల్‌కు తీసుకెళ్తే ఇది యాంగ్జైటీ అటాక్ అని చెప్పారు. ఏ కారణం లేకపోయినా తీవ్రంగా ఆందోళన చెందేదాన్ని. ఇలా ఆందోళన చెందిన ప్రతిసారి నాకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని, ఛాతీలో నొప్పి నన్ను కుదిపేసేది. అప్పుడే మంచి సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అతడి దగ్గరకు వెళ్లాక నా పరిస్థితి కొంత మెరుగైంది" అని ఆలియా కశ్యప్ చెప్పుకొచ్చింది. చదవండి: ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్ కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు! -
మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు
మలయాళంలో సూపర్ హిట్ విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జయం మోహన్ రాజా దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. సురేరేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం జనవరి 21న లాంఛనంగా ప్రారంభమయ్యింది. (చదవండి: కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్) ఏప్రిల్ నెలలో సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుండటంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ సినిమాకు విలన్ వేటలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. చిరంజీవిని ఢీకొనే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ మెగాస్టార్‌తో నటించే అవాకాశాన్ని అనురాగ్ నిరాకరించినట్లు వినికిడి. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. (చదవండి: సినీ నటి రాధ కేసులో యూటర్న్..) ఇక అనురాగ్ నో చెప్పడంతో మరో కొత్త విలన్ కోసం మూవీ నిర్మాతలు జల్లెడ పడుతున్నారు. లుసిఫార్ రీమేక్‌ను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే సంక్రాంతి అనంతరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా .. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం లూసిఫర్‌లో ఎంటర్ కానున్నారు. చదవండి: ఆచార్యలో రామ్‌చరణ్ పాత్ర అదే -
ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ
సాక్షి, ముంబై: తన నివాసంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పారు. గత మూడు రోజులుగా వెలుగు చూసిన పరిణామాలపై ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు తన నివాసంలో ఏం సోదా చేశారో వెల్లడించారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదన్నారు తాప్సీ. అలానే తాను ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని.. కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్లో పేర్కొన్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ‘నేను ఎవరిపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. వీటిపై తాప్సీ తాజాగా స్పందించారు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత -
ప్లీజ్ ఏదైనా చెయ్యండి: తాప్సీ బాయ్ ఫ్రెండ్ రిక్వెస్ట్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రమోటర్లు అయిన తాప్సీ, అనురాగ్ కశ్యప్, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, వికాస్ బెహల్, మధు మంతెనకు సంబంధించిన ఇళ్లలో, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌లోని మొత్తం 28 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కాగా పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టగా.. ఈ మొత్తం దాడులకు ఫాంటమ్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ సంస్థ కారణమని అధికారులు గుర్తించారు. ఫాంటమ్ ప్రొడక్షన్ సంస్థ కోట్లలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తాప్సీ పన్ను ఆదాయాలపై జరుపుతున్న ఐటీ దాడులపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మాథియాస్ బోయ్ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తాప్సీకి మద్దతుగా నిలిచాడు. ‘ఈ విషయం నన్ను కొంచెం గందరగోళంలో పడేసింది. కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్‌గా నేను మొదటిసారిగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఇటీవల తాప్సీ ఇళ్ళపై ఐటీ శాఖ దాడులు చేయడం ఆమె కుటుంబంపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. మంత్రి కిరెన్ రిజిజు మీరు దయచేసి ఏదైనా చేయండి’ అంటూ క్రీడా మంత్రి కిరెన్ రిజిజును ట్యాగ్ చేశాడు. Finding myself in a bit of turmoil. Representing 🇮🇳 for the first time as a coach for some great athletes, meanwhile I-T department is raiding Taapsee’s houses back home, putting unnecessary stress on her family, especially her parents. 🤷♂️. @KirenRijiju please do something👍🏼. — Mathias Boe (@mathiasboe) March 4, 2021 అయితే మాథియాస్ ట్వీట్లో క్రీడా మంత్రి కిరెన్ రిజిజు తీవ్రంగా సమాధానం ఇచ్చారు. ‘చట్టం అత్యున్నతమైనది. దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఈ విషయం నాకు, మీకు చెందినది కాదు. మేము మా వృత్తిపరమైన విధులకు కట్టుబడి ఉండాలి’. అని రిప్లై ఇచ్చారు. కాగా మాథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు. అతను తాజాగా భారతదేశ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. అతను ప్రస్తుతం స్విస్ ఓపెన్ కోసం స్విట్జర్లాండ్‌లోని భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో ఉన్నాడు. Law of the land is supreme and we must abide by that. The subject matter is beyond yours and my domain. We must stick to our professional duties in the best interest of Indian Sports. https://t.co/nIIf5C8TXL — Kiren Rijiju (@KirenRijiju) March 5, 2021 చదవండి: బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ హైదరాబాద్‌లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత -
అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కక్ష్య కట్టి ఇలా దాడులు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. కావాలనే వారిని ఇబ్బంది పెట్టడానికి ఇలా దాడులు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం కూడా తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రొడక్షన్ కంపెనీకి సంభందించి వందల కోట్ల రూపాయలకు పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే దాన్ని లెక్కల్లో వెల్లడించలేదు. సుమారు 300 కోట్ల రూపాయలకు కంపెనీ అధికారులు సరైన పత్రాలు చూపించలేకపోతున్నారు. ప్రొడక్షన్ కంపెనీ లావాదేవీలను తారుమారు చేశారు. వాస్తవ విలువకు బదులు తక్కువ విలువను లెక్కల్లో చూపించారు. అంతేకాక దాదాపు రూ. 350 కోట్ల రూపాయలకు పన్ను ఎగవేశారు. ఇక ప్రముఖ నటి కేవలం 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు రశీదులను మాకు అందజేశారు. అలానే ప్రముఖ నిర్మాత/దర్శకుడికి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారు.. ఈ మొత్తాని కూడా పన్ను ఎగవేశారు.. నటి విషయంలో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తాం’’ అన్నారు. ఐటీ శాఖ అధికారులు తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో శుభాషిశ్ సర్కార్ తదితరుల నివాసాల్లో తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ముంబై, పుణెలోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ‘క్వాన్', ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధుల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దు పోయేదాకా కొనసాగాయి. పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం తాప్సీ, కశ్యప్‌ను అధికారులు ప్రశ్నించారు. కశ్యప్ 2011లో ‘ఫాంటమ్ ఫిల్మ్స్' పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. 2018లో దీన్ని మూసివేశారు. అయితే ఈ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐటీశాఖ దర్యాప్తు జరుపుతున్నది. అందులో భాగంగానే ఆ సంస్థ ప్రమోటర్లు అయిన అనురాగ్ కశ్యప్, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, నిర్మాత వికాశ్ బెహల్, డిస్ట్రిబ్యూటర్ మధు మంతెన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు ‘లోదుస్తులతో ఫోటోలు షేర్.. నీ రేటెంత’ -
తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ నివాసాల్లో బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కశ్యప్ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్ పాంథమ్ ఫిల్మ్ భాగస్వాములుగా ఉన్న వారందరిపైనా ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. అనురాగ్ కశ్యప్ మరికొందరితో కలిసి పాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలను నిర్మించారు. 2018లో ఈ ప్రొడక్షన్ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న దర్శక నిర్మాత విక్రమాదిత్య, నిర్మాత వికాస్ బహల్, నిర్మాత పంపిణీదారుడు మధుమంతేనాలపై దాడులు చేశారు. ఏకకాలంలో ముంబై, పుణేలోని 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి సహ ప్రచారకుడిగా వ్యవహరించినందుకే మధు మంతేనా నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పినందుకేనా ..? ఇటీవల కాలంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తాప్సీ పలు ట్వీట్లు చేశారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తిపోయినప్పుడు కశ్యప్ జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లను సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికే ఈ సోదాలు జరిపారని మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ వంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తూ ఉంటాయని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. నిజాలు మాట్లాడే వారిపై ఒత్తిడిని పెంచి వారిని మాట్లాడనివ్వకుండా కేంద్రసర్కార్ చేస్తోందని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆరోపించారు. -
ముంబై: ఐటీ దాడులు కలకలం
-
అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు
సాక్షి, ముంబై: ముంబైలో బాలీవుడ్ చిత్ర నిర్మాతలు, నటీ నటులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున దాడులు చేశారు. ముంబైలోని వారి నివాసాలు, ఇతర ఆస్థులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 22 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిలింస్‌కు సంబంధించి పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఫాంటమ్ ఫిలింస్ కార్యాలయం సహా ముంబై , పుణేలో దాదాపు 22 ప్రదేశాలలో ఈ శోధనలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నిర్మాత వికాస్ బాహెల్ ,మధు మంతేనా ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్సుబ్రమణ్యం (సీఈఓ క్వాన్)ఆస్తులపై కూడా శోధనలు కొనసాగుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు కశ్యప్, బాహెల్ , తాప్సీ మద్దతుగా నిలవడం గమనార్హం. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానే, మధు మంతేనా వికాస్ బహల్ సంయుక్తగా ఫాంటమ్ ఫిలింస్ నిర్మాణసంస్థను స్థాపించారు. . హిందీ, తెలుగు, బంగ్లాతో సహా పలు భాషల్లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అయితే వికాస్ బహ్ల్‌పైకంపెనీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదుల తర్వాత 2018 లో దీన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ తరువాత అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్ అనే సంస్థను స్థాపించగా, విక్రమాదిత్య , మధు మంతేనా కూడా తమ సొంత ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. -
‘లోదుస్తులతో ఫోటోలు షేర్.. నీ రేటెంత’
ఆలియా కశ్యప్.. ఈ పేరు ఎవరకీ పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం తెలిసిన ముఖమే. సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అతని మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా కశ్యప్. ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల ఆలియా ఓ వీడియోను పోస్టు చేస్తూ అందులో తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. లోదుస్తులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల విపరీతమైన ట్రోలింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ట్రోలింగ్ ఆమెను ఎంతలా ప్రభావితంచేసిందో చెబుతూ దాని నుంచి ఎలా బయటపడ్డారో వివరించారు. తనను వేశ్యగా సంబోధిస్తూ.. అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదరింపులు అందినట్లు పేర్కొన్నారు. లోదుస్తులలో దిగిన ఫోటోలను పోస్టు చేయడం వల్ల ఎదురైన విమర్శల గురించి తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడారు. ‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల నాకు ఓ విషయం అర్థమైంది. నేను ఎంత సున్నిమైన వ్యక్తినో, చిన్న వ్యతిరేకత కూడా నన్ను ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నాకస్సలు తెలీదు.. నేనింత సెన్సిటీవ్ అని. ఈ విషయం తెలిసి ప్రతిరోజు ఏడ్చాను. నేనొక భారతీయురాలిని కావడం వల్ల అలాంటి విషయాలు పోస్ట్ చేయడంతో సిగ్గుపడాలని ప్రజలు నాకు చెప్తున్నారు. ఇందుకు నన్ను రేప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నన్ను వేశ్య అని పిలుస్తూ.. నా 'రేటు' ఎంతని అడుగుతున్నారు. చంపేస్తామని నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇదంతా కేవలం ఆ ఫోటోలు పోస్టు చేయడం వల్లే జరిగింది. దీని కారణంగా చాలా బాధపడ్డాను. మానసికంగా ఎంతో కుంగిపోయాను. కానీ తరువాత అర్థమైంది. అనామక ముసుగు వెనుక దాక్కున్న ట్రోల్స్ నేను ప్రభావితం కాదని. ఎవరైతే పని లేకుండా ఖాళీగా ఉన్నారో వారే వీటి గురించి పట్టించుకుంటారు. వాళ్లందరినీ నేను నిజాయితీగా బ్లాక్ చేస్తాను. నా సోషల్ మీడియాలో ఏదైనా ప్రతికూలంగా ఉంటే, నేను దాన్ని బ్లాక్ చేస్తాను. ఎందుకంటే. నా సోషల్ మీడియా ఎప్పుడూ సానుకూల ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) కాగా తనకు సినీ పరిశ్రమలోకి వచ్చే ఆలోచన లేదని ఆలియా వెల్లడించారు. బాలీవుడ్ గ్లామర్‌తో ఎదగలేదని కుండబద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానన్నారు. ఇదిలా ఉండగా 1997తో ఈనురాగ్ కశ్యప్ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్‌ను వివాహం చేసుకున్నాబు. వీరికి ఆలియా అనే కుమార్తె ఉంది. అయితే, ఈ జంట 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2013 లో 'దేవ్డీ' చిత్రనిర్మాత నటి కల్కి కోచ్లిన్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కూడా 2015లో విడాకులు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) -
అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్
కుమార్తె కిడ్నాప్ అయితే ఏ తండ్రి అయినా చాలా ఆందోళన చెందుతాడు. అనిల్ కపూర్ మీద కక్షతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ అతని కుమార్తె సోనమ్ కపూర్‌ను కిడ్నాప్ చేశాడు. అతని నుంచి అనిల్ కపూర్ తన కుమార్తె ను ఎలా రక్షించుకున్నాడు?ఇది నిజంగా జరగలేదు. కాని నిజంలా జరిగింది. దానినే ఇప్పుడు ‘మెటా మూవీ’, ‘ఫిల్మ్ వితిన్ ఏ ఫిల్మ్’, ‘మాక్యుమెంటరీ’ అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా విడుదలైన ఈ సినిమా తండ్రి అనిల్ కపూర్ ఎలా ఉంటాడో అన్న ఆనవాలు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది.‘ఏకె వెర్సెస్ ఏకె’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన సినిమా. ఇందులో ఒక ఏకె అనిల్ కపూర్. మరో ఏకె అనురాగ్ కశ్యప్. ఒక హీరో ఒక దర్శకుడి మధ్యలో వచ్చిన తగాదా ఆ హీరో కుమార్తెను ఆ దర్శకుడు కిడ్నాప్ చేసే వరకూ వెళుతుంది. ఇది సినిమాయే అయినా అందరూ ఇందులో తమలాంటి ఫిక్షనల్ పాత్రలనే పోషించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇది పూర్తిగా కొత్త నేరేటివ్. డాక్యుమెంటరీలా అనిపించే సినిమా. లేదా సినిమాలా అనిపించే డాక్యుమెంటరీ. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని వచ్చి దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. పోలీస్ స్టేషన్‌కు వెళితే అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ఇంటికి వచ్చి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు. కిడ్నాపర్ అయిన అనురాగ్ కశ్యప్ ‘నువ్వొక్కడివే నీ కూతురుని కనుగొనాలి’ అని కండీషన్ పెట్టడంతో అనిల్ కపూర్ ఒక్కడే బయలుదేరుతాడు. అతన్ని నీడలా అనురాగ్ కశ్యప్ అనుసరిస్తాడు కెమెరాతో. కూతురి కోసం కలవరపడిపోయే తండ్రిలా అనిల్ కపూర్ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విక్రమాదిత్య మోత్వానే దీని దర్శకుడు. అనురాగ్ కశ్యప్ నటించి డైలాగులు కూడా రాశాడు. ‘వీడి హిట్ సినిమాలు తెచ్చిన కలెక్షన్లన్నీ కలిపి వీడి తమ్ముడి ఒక్క ఫ్లాప్ సినిమా తెచ్చింది’ అని అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్‌ను వెక్కిరిస్తాడు. మన మీద మనం జోక్ చేసుకోవడం ఎదగడానికి గుర్తు. అనురాగ్ కశ్యప్, అనిల్ కపూర్ ఎదిగి చేసిన సినిమా ఇది. ప్రయోగాలు నచ్చేవారు చూడాల్సిన సినిమా ఇది. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. క్షమాపణలు
ముంబై: లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి రిచా చద్ధాపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా ఆమెను క్షమాపణలు కోరుతున్నాని నటి పాయల్ ఘోష్ ముంబై హైకోర్టుతో పేర్కొన్నారు. రిచా కూడా క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా బాధపెట్టాడని ఇటీవల పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి రిచాపై పాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై పాయల్ నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందంటూ చద్ధా గత వారం ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాయల్ తన న్యాయవాది నితిన్ పాట్పుట్... హైకోర్టులో విచారణకు జస్టిస్ మీనన్ ఎదుట హాజరయ్యారు. రిచాపై చేసిన వ్యాఖ్యలకు పాయల్ చింతిస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఆమెను కించపరిచేందుకు చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. పాయల్, రిచా అభిమాని అని, ఆమెను గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ స్త్రీని కించపరచాలన్న ఉద్దేశం పాయల్‌కు లేదని నితిన్ పేర్కొన్నారు.(చదవండి: నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) తాము పాయల్ క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి నష్టపరిహారాన్ని పొందే ఆలోచన లేదని రిచా న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు కోర్టుకు వెల్లడించారు. అనంతరం రెండు పార్టీలు సమ్మతి నిబంధనలను అక్టోబర్ 12న కోర్టులో సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్ మీనన్ చెప్పారు. రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ఇకపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేశారు. అయితే ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ సబర్బన్ వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నటి రిచాతో పాటు మరో ఇద్దరూ మహిళా నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్) -
నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా
ముంబై : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు మోపిన నటి పాయల్ ఘోష్‌పై రూ.కోటి పది లక్షల పరువు నష్టం దావా వేశారు రిచా చద్ధా. 2013లో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు ఈ ఆరోపణలపై మరోనటి రిచా చద్దా స్పందించి పాయల్‌కు లీగల్ నోటీసులు పంపించారు. పాయల్ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు. చదవండి: దర్శకుడిపై అత్యాచారం కేసు దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్ కశ్యప్‌ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. -
లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు
ముంబై: తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిరాధారమైనవని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. 2013లో డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసుల నుంచి బుధవారం సమన్లు అందుకున్న కశ్యప్, తన లాయర్ ప్రియాంక ఖిమానీతో కలిసి గురువారం ఉదయం వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పాయల్ ఫిర్యాదు మేరకు అనురాగ్ కశ్యప్‌కు పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నటి పాయల్... కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో కలిసి మహారాష్ట్ర్ర గవర్నర్ బీఎస్ కోస్యారీని కలిశారు. కశ్యప్‌ను త్వరితగతిన అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరారు. అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయడంలో తాత్సారం చేయడంపై పోలీసులను ఆమె ప్రశ్నించారు. కశ్యప్‌ను అరెస్టు చేయకుంటే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పాయల్ వెల్లడించారు. (చదవండి: బయటపెట్టండి.. బయటపడండి!) ఇక రామ్‌దాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ బాధిత నటికి ప్రాణహాని ఉన్నందున ఆమెకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాయల్ కు న్యాయం జరిగేలా, సినీ నిర్మాత కశ్యప్‌ను అరెస్టు చేసేంత వరకు ఆమెకు ఆర్పీఐ రక్షణగా ఉంటుందని చెప్పారు. 2013లో ప్రముఖ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచార యత్నం చేసినట్లుగా పాయల్ ఆరోపణలు చేశారు. ‘తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే డైరెక్టర్లు చెప్పినట్లు చేయాల్సిందేనని, అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. (నా పేరెందుకు వాడారు?: నటి) ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై పాయల్ చేసిన లైంగిక ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని అందులో పేర్కొన్నారు. సదరు అరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, తప్పుడువని కొట్టి పారేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ ఆరోపణలున్నాయని, మీటూ వంటి ఉద్యమాన్ని ఇవి పక్కదోవ పట్టిస్తాయని తెలిపారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న కారణంగా నిజమైన అత్యాచార బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తన క్లయింటు దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తారని అనురాగ్ లాయర్ వెల్లడించారు. (ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్ ) ఇక బాధిత నటి తమపై చేసిన ఆరోపణలపై రిచా చద్దా, హ్యుమా ఖురేషీ స్పందించారు. ఆరోపణలు చేసిన నటికి రిచా చద్దా లీగల్ నోటీసులు పంపించారు. ఇక బాధిత నటిపై హ్యూమా ఖురేషీ ఘాటుగా స్పందించారు. అనురాగ్ కశ్యప్ తనతోనే కాదనీ, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కాదని ఆమె తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు. -
అనురాగ్ కశ్యప్‌కు సమన్లు
ముంబై: సినీనటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబై పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని అనురాగ్ కశ్యప్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం వెర్సోవా పోలీసు స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. అనురాగ్‌పై సెప్టెంబర్ 22న పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన తనపై 2013లో తనను వేధించాడని పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. అనురాగ్‌ను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
దర్శకుడిపై అత్యాచారం కేసు
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మంగళవారం రాత్రి నటి పాయల్ ఘోష్ తన లాయర్ నితిన్ సాత్పుటేతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 376 (ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదయ్యింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని నటి పాయల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ని ప్రశ్నించనున్నట్టు సదరు అధికారి తెలిపారు. మొదట పాయల్ తన లాయర్‌తో కలిసి ఒషివారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఈ ఘటన వెర్సోవా పీఎస్ పరిధిలో జరిగినందు వల్ల అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. వెర్సోవాలో ఘటన జరిగిందని చెప్తుండగా.. అనురాగ్ కశ్యప్ ఆఫీస్ ఒషివారా పరిధిలో ఉంది. ఇక ఈ ఆరోపణలు అనురాగ్ కశ్యప్ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఆయన మాజీ భార్యతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్) -
రూపా దత్తా తప్పులో కాలేశారా?
సాక్షి, ముంబై: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణల అనంతరం బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. అయితే ఇక్కడే తీవ్ర గందరగోళం ఏర్పడింది. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ దీనికి సంబంధించిన అనురాగ్ సఫర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మరోవైపు కశ్యప్‌కు స్త్రీల పట్ల ఏ మాత్రం గౌరవం లేదంటూ పాయల్ ఘోష్ ఆరోపణలను గట్టిగా సమర్ధించారు రూపా. అంతేకాదు ఆయన డ్రగ్స్ కూడా తీసుకుంటారని, కఠినంగాశిక్షించాలని కోరారు. ఎన్సీబీ తనిఖీలు చేపట్టాలని ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై రూపా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన) అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన రూపా దత్తా ... అనురాగ్ సఫర్ 2014 నాటి ఛాటింగ్ షేర్ చేయడం సరికొత్త వివాదాన్ని రేపింది. ఐర్లాండ్ కు చెందిన అనురాగ్ సఫర్ 2010, సెప్టెంబరు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. తాను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కాదని తనకూ అనురాగ్ కశ్యప్ కు సంబంధం లేదనే ఆ సమాచారాన్ని ట్వీట్ చేశాడు. అనురాగ్ సఫర్కి గతంతో అనురాగ్ కశ్యప్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉండేదని, పలు మీడియా సంస్థలు కూడా అతడిని కశ్యప్ గా భావించడంతో ఈ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. అయితే మీరు గొప్ప స్త్రీవాది అంటూ తాప్సీ పన్ను కశ్యప్‌కు కితాబివ్వడం విశేషం. ఈ ఆరోపణలు రుజువైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని తాప్సీ ప్రకటించారు. మీటూ ఉద్యమానికి చెడ్డపేరు తేవద్దంటూ నటి స్వర భాస్కర్ కూడా రూపాను తప్పుబట్టారు. అలాగే సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా తోపాటు, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కూడా కశ్యప్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలను అనురాగ్ ఇప్పటికే ఖండించారు. अनुराग कश्यप ख़ुद बोल रहा है मैं अनुराग कश्यप नहीं हूँ चैटिंग में।वाह ! पायेल घोष के साथ अश्लील हरकते करने के बाद भी बोल रहा है मैंने कुछ नहीं किया।गुनहगार गुनह करके स्वीकार नहीं करता ये स्वाभाविक है।अरेस्ट के बाद उसका भी तरीक़ा है गुनह कुबूलने की।चिन्ता ना करे सच सामने आएगा। — Rupa Dutta (@iamrupadutta) September 22, 2020 Pl Excuse me friends!!! I am not film director or producer Anurag Kashyap. I am another Anurag. Please do not bug me considering him. — Anurag Safar (@anurag_safar07) September 15, 2010 अनुराग कश्यप के नज़रों में किसी भी औरत का कोई इज्ज़त नहीं है।जो मुझे उसे जानने के बाद पता चला।इसीलिए पायेल घोष का इल्ज़ाम बिलकुल सही है।अनुराग कश्यप को कठोर से कठोर सज़ा मिलनी चाहिए।और यह ड्रग भी लेता है।अपने आर्टिस्ट को भी सप्लाई करता है NCB जांच करे कृपा।#arrestanuragkashyab pic.twitter.com/ckK5ZfUDOW — Rupa Dutta (@iamrupadutta) September 19, 2020 -
ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్
ముంబై: నటి పాయల్ ఘోష్ ఆరోపణలతో బాలీవుడ్లో మీటూ ఉద్యమం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ వంటి నటీమణులు పాయల్‌కు మద్దతు ప్రకటించగా, తాప్సీ, అనురాగ్ మాజీ భార్యలు నటి కల్కి కొచ్లిన్, ఎడిటర్ ఆర్తీ బజాజ్ సహా పలువరు సెలబ్రిటీలు అతడి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి హూమా ఖురేషి సైతం ఈ జాబితాలో చేరారు. అనురాగ్ తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగవద్దంటూ పాయల్‌పై మండిపడ్డారు. మీటూ ఉద్యమానికి ఉన్న పవిత్రతను నాశనం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరకు ట్విటర్లో ఓ లేఖ షేర్ చేశారు.(చదవండి: అంతా అబద్ధం: అనురాగ్ కశ్యప్) ‘‘అనురాగ్ నేను 2012-13 సంవత్సరంలో కలిసి పనిచేశాం. తను నాకు ప్రియమైన స్నేహితుడు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. నాకు తెలిసినంత వరకు తను నాతో గానీ, ఇతరులతో గానీ ఇంతవరకు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే ఆయనపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లు అధికారులకు, పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయంపై నేను స్పందించకూడదు అనుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా యుద్ధాలు, మీడియా విచారణలపై నాకు నమ్మకం లేదు. అయితే నా పేరును ఇందులోకి లాగడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎన్నో ఏళ్లుగా కఠిన శ్రమకోర్చి తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్న మహిళలు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నా ఫైనల్ రెస్పాన్స్ ఇది. ఈ విషయంలో ఇకపై నన్ను ఎవరూ సంప్రదించవద్దు’’ అని హూమా ఖురేషి మీడియాకు విజ్ఞప్తి చేశారు.(చదవండి:మేము బెస్ట్‌ఫ్రెండ్స్; నాకు చెప్పాల్సిన అవసరం లేదు! కాగా అనురాగ్ తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో హూమా బాలీవుడ్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల షేర్ చేసిన వీడియోలో పాయల్ సంచలన ఆరోపణలు చేశారు. అనురాగ్ తనను లైంగికంగా వేధించాడని, రిచా చద్దా, హూమా ఖురేషి వంటి వాళ్లు అతడు ఫోన్ చేసినప్పుడల్లా వెళ్లి సంబంధం కొనసాగిస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై ఫైర్ అయిన రిచా చద్దా పాయల్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా, హూమా ఖురేషి ఈ మేరకు స్పందించారు. pic.twitter.com/g0FGKyFxGi — Huma S Qureshi (@humasqureshi) September 22, 2020 -
మీ నాన్న ఉంటే సిగ్గుపడేవాడు; నోరు మూసుకోండి!
ముంబై: ‘‘మా నాన్న గురించి తమకు తెలుసు అని చెప్పుకొనే వారి పట్ల నేటితో గౌరవం పోయింది. అయితే ఒక్కటి మాత్రం నిజం నా కంటే మా నాన్న అన్ని విషయాల్లో బెటరే. మీ ద్వేషం కారణంగా నాకు ఈరోజు లిబరేషన్ అంటే ఏమిటో అర్థమైంది. అయినా మీరేం చేయలేరు. అయితే ఓ వ్యక్తి గురించి వెంటనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అన్నట్లు మీ నాన్న కూడా నిన్ను చూసి సిగ్గుపడుతారు. కాబట్టి నోరు మూసుకో. నేను, బాబా బెస్ట్‌ఫ్రెండ్స్. మా నాన్న ఏం చేసేవారో చెప్పడానికి అస్సలు ప్రయత్నించకండి. ఆయన నమ్మకాల గురించి తెలియకుండా మాట్లాడవద్దు’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ట్రోల్స్‌పై మండిపడ్డాడు. తన తండ్రి గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని చురకలు అంటించాడు. దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా నిలిచినందుకు తనను విమర్శించిన వాళ్లకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఇది మహిళల కోసం నిలబడే సమయం: పాయల్ ) కాగా నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆయన మాజీ భార్యలు ఆర్తీ బజాజ్, కల్కి కొచ్లిన్ సహా తాప్సీ వంటి సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. పాయల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ అనురాగ్‌కు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో బాబిల్ ఖాన్ సైతం ఇదే బాటలో నడిచాడు. అంతేగాక ఎంతో గొప్పదైన మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓ వ్యక్తిపై నిందలు వేయడం సులువేనని, అయితే నిజాన్ని నిరూపించడం కష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు ) అంతేగాక మీటూ అంటూ కొంతమంది చేసే నిరాధార ఆరోపణల వల్ల లైంగిక వేధింపుల బాధితులపై నమ్మకం పోయే అవకాశం ఉందని, అలాంటి వాళ్లు ఎప్పటికీ చీకట్లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి కలుగుతుందంటూ.. ‘‘చిన్ అప్ అనురాగ్ సర్’’అని ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరన్నట్లు ఒకరిపై అభాండాలు వేయడం తేలికే కావొచ్చు. ఇన్ని విషయాలు తెలిసిన వాళ్లు, ఎదుటి వ్యక్తి చెప్పేది కచ్చితంగా అబద్ధమేననే స్టాంఢ్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమే అయితే అప్పుడు ఏం చేస్తారు. మీ నాన్న ఉంటే నిజంగా సిగ్గుపడేవారు. ఆయనలా బతికేందుకు ప్రయత్నించు’’అంటూ బాబిల్‌ను విమర్శించారు. దీంతో తన జడ్జిమెంట్‌పై తనకు నమ్మకం ఉందని, ఒకవేళ ఇది తప్పని తేలితే అందుకు బాధ్యత వహిస్తానని బాబిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఇర్పాన్ ఖాన్- సుతాపా సికిందర్ దంపతులకు బాబిల్ ఖాన్. ఆర్యన్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Chin up, Anurag sir. I know you all are gonna hate me for this but I’ve got to stand up when something feels wrong. A lot of people in the comments are asking ‘What if the girl is right?’ I am trusting my judgement, I will take responsibility for my words if I’m wrong. A post shared by Babil (@babil.i.k) on Sep 21, 2020 at 4:37am PDT -
అందుకే సుశాంత్‌తో సినిమా చేయలేదు..
ముంబై: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, వికాస్ బల్ తదితరులతో కలిసి తాను నిర్మించిన ‘హసీ థో ఫసీ’ సినిమాలో తొలుత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌నే హీరోగా ఎంపిక చేశామని ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ అన్నాడు. అయితే పెద్ద బ్యానర్లో అవకాశం రావడంతో అతడు ఈ మూవీని వదులుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప తాము అతడిని కావాలని పక్కకు పెట్టామన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశాడు. అయితే హీరోయిన్ పరిణీతి చోప్రా వల్లే సుశాంత్‌కు బడా నిర్మాణ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బంధుప్రీతి కారణంగానే సుశాంత్ వంటి ప్రతిభ గల నటులకు అన్యాయం జరుగుతుందంటూ అతడి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ కూడా సుశాంత్‌తో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదంటూ పలువురు కామెంట్లు చేశారు. (చదవండి: సాయం చేయండి: మోదీకి పాయల్ ట్వీట్) ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జర్నలిస్టుతో మాట్లాడిన దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్.. ‘‘నిజానికి సుశాంత్ హసీ థో ఫసీ సినిమా చేయాల్సింది. అతడిని హీరోగా అనుకోగానే, హీరోయిన్ కోసం వెదుకులాట మొదలుపెట్టాం. అలా పరిణీతి చోప్రాను సంప్రదించాం. అయితే అప్పటికి సుశాంత్ టీవీ నటుడిగా ఉండటంతో ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. సీరియల్ నటుడితో కలిసి పనిచేయలేనంది. అప్పుడు మేమే తనకు అర్థమయ్యేలా చెప్పాం. సుశాంత్ కాయ్ పో చే, పీకే వంటి సినిమాలు చేస్తున్నాడని, మన సినిమా విడుదలయ్యే సమయానికి తనొక వెండితెర నటుడిగా ఉంటాడని చెప్పాం. అయితే అప్పటికే తను శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమా చేస్తోంది. నాకు తెలిసి తనే సుశాంత్ గురించి యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో మాట్లాడి ఉంటుంది. అప్పుడు వాళ్లు అతడిని పిలిచి.. ‘‘నువ్వు మా సినిమాలో నటించవచ్చు కదా. ఆ సినిమా వదిలెయ్’’అని చెప్పారు. అప్పుడు తను వాళ్లవైపే మొగ్గుచూపాడు’’అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పరిణీతి చోప్రా- సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో హసీ థో ఫసీ తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. 2016లో తాను సుశాంత్‌కు మరో ఆఫర్ ఇచ్చానని, అయితే ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదని తెలిపాడు. ఇదిలా ఉండగా.. నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
సాయం చేయండి: మోదీకి పాయల్ ట్వీట్
ముంబై: ‘ఇప్పుడు మహిళల కోసం నిలబడాల్సిన సమయం, ప్లీజ్ వారి వాదన వినండి’ అంటూ నటి పాయల్ ఘోష్ ప్రజలను కోరారు. అంతేగాక దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై వల్ల తనకు ప్రమాదం ఉందని, సాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె తాజాగా ట్విట్ చేశారు. అనురాగ్ తనను బలవంతం చేయబోయాడని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పాయల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. ‘‘అనురాగ్ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడు. దయతో అతడిపై చర్య తీసుకోండి. ఈ సృజనాత్మక వ్యక్తి వెనుక రాక్షసుడు ఉన్నాడు. అది ప్రజలంతా గ్రహించాలి. దయ చేసి నాకు సాయం చేయండి’’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అనంతరం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు, నటీనటులు పాయల్‌వి అసత్య ఆరోపణలని, అలాంటి వాడు కాదంటూ ఆయనకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు) ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ సోమవారం ఓ ట్వీట్ చేస్తూ.. ‘ప్రజలు ప్రతి విషయంలో మహిళలనే నిందిస్తూ మాతృస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు. ఇది మహిళల కోసం నిలబడే సమయం. వారి గొంతు వినండి. మహిళలు అణచివేతకు గురయ్యే కాలం పోయింది. ఇప్పుడు 2020లో ఉన్నాం అంటూ #metoo హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. పాయల్ తనపై చేసిన ఆరోపణలను అనురాగ్ ఖండించారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, ఇవి పూర్తిగా తప్పుడు వ్యాఖలుగా అనురాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందరూ పాయల్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. అనురాగ్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) People blame women for everything and post smash the patriarchy. It's time to stand with the women. Let them be heard. A voice suppressed is a generation of women oppressed. It's 2020. Come on, India! #MeToo — Payal Ghosh (@iampayalghosh) September 21, 2020 -
మీటూ.. దర్శకుడికి ఆర్జీవీ మద్దతు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనురాగ్ కశ్యప్‌కు మద్దతిచ్చారు. అనురాగ్ కశ్యప్ అత్యంత 'సున్నితమైన, భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అనురాగ్ కశ్యప్ ఎవరినీ బాధపెట్టడం తాను ఎప్పుడూ చూడలేదని, కనీసం వినలేదని ఆయన అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ‘నాకు తెలిసిన అనురాగ్ కశ్యప్ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కల వ్యక్తి. నాకు అతడు గత 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఎవరినీ బాధపెట్టడం గురించి నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు.. కనుక ప్రస్తుతం జరిగే దాని గురించి స్పష్టంగా చెప్పలేను’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. (చదవండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్) The @anuragkashyap72 i know is a highly sensitive and emotional person and I never ever saw or heard about him hurting anyone in all of the 20 years that I have known him ..So I frankly can’t picture what’s happening now — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2020 అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా వచ్చారు. తాప్సీ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, కల్కి కోచ్లిన్, ఆర్తి బజాజ్ వంటి ప్రముఖులు అందరూ అనురాగ్ కశ్యప్‌ను సమర్థించారు. తాప్సీ అనురాగ్ కశ్యప్ తనకు తెలిసిన అతిపెద్ద ఫెమినిస్ట్ అనగా.. అనుభావ్ సిన్హా ‘మీటూ ఉద్యమాన్ని మహిళల గౌరవం తప్ప మరే ఇతర కారణాల కోసం దుర్వినియోగం చేయరాదని' అభిప్రాయపడ్డారు. ఇక అనురాగ్ మాజీ భార్య కల్కి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనకు మద్దతు తెలిపారు. -
నా పేరెందుకు వాడారు?: నటి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తన పేరు వాడిన మూడవ వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ శనివారం లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడారు. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయపరమైన పోరాటానికి తాను సిద్దంగా ఉన్నట్లు రిచా ప్రకటించారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) ‘అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడవ వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్ రిచా చద్దా పేరు తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు ఆయన అన్నారు. ‘‘నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో లేవనెత్తి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దేబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు) View this post on Instagram 💪🏼 A post shared by Richa Chadha (@therichachadha) on Sep 20, 2020 at 3:42pm PDT సినిమా చాన్స్‌లు కావాలంటే ప్రతి నటి తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని దర్శకుడు అనురాగ్ తనతో చెబుతూ లైంగిక దుష్పవర్తనకు పాల్పడినట్లు నటి పాయల్ ఓ ఇంటర్యూలో ఆరోపించింది. దీనికి తాను అనురాగ్‌తో ‘మీరు రిచా చద్దాకు అవకాశం ఇచ్చారు. మహీ గిల్, హుమా ఖురేషిలకు సినిమా ఛాన్స్‌లు ఇచ్చారు. వారు చాలా నార్మల్‌గా కనిపించే అమ్మాయిలే అయినప్పటికీ మీరు వారికి మీ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసలు దర్శకులేవరు అలాంటి అమ్మాయిలకు అవకాశం ఇవ్వరూ కానీ మీరు గొప్ప పని చేశారు అని చెప్పి మానసికంగా నేను దీనికి సిద్దంగా లేను’ అని కశ్యప్‌తో చెప్పానన్నారు. అనురాగ్ కశ్యప్ 2012లో తన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో రిచా చద్దా.. నాగ్మా ఖటూన్ పాత్రలో నటించారు. హుమా ఖురేషి కూడా అదే ప్రాజెక్ట్ ఓ పాత్రలో కనిపిచారు. 2009లో కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దేవ్ డి’లో మహీ గిల్ నటించారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) -
మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య నటి కల్కి కోచ్లిన్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కల్కి... ‘ప్రియమైన అనురాగ్ సోషల్ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరమంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చుశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’ అంటూ కల్కి రాసుకొచ్చారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) అంతేగాక ‘‘ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడం, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ, చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అంటూ ఆమె ప్రకటన విడుదల చేశారు. అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ.. వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాలీవువడ్లో ఇలాంటివి సర్వసాధరమని, ఇకనైన ఇలాంటి ఘటనపై స్పందించాలన్నారు. అనురాగ్ వంటివి వాళ్లను అరెస్టు చేసి మరోసారి ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేయాలని మండిపడ్డారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) View this post on Instagram @anuragkashyap10 A post shared by Kalki (@kalkikanmani) on Sep 20, 2020 at 11:13pm PDT -
అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి పాయల్ ఘోష్. ‘ప్రయాణం’ సినిమాలో కథానాయికగా నటించిన ఆమె ‘ఊసరవెల్లి’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించారు. ‘‘అనురాగ్ నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. పని (సినిమా) చేయాలని వస్తే అన్నింటికీ సిద్ధపడి వచ్చినట్టు కాదు. అనురాగ్ మీద చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు పాయల్. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఈ ఘటన 2014–15 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ‘నాకు అమితాబ్ బచ్చన్‌తో పరిచయాలున్నాయి. నాతో పని చేసిన వేరే హీరోయిన్లు నాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు’ అని అనురాగ్ చెప్పేవారు’’ అని కూడా పాయల్ అన్నారు. పాయల్ ఆరోపణలకు మద్దతుగా కంగనా రనౌత్ మాట్లాడారు. ‘‘అనురాగ్‌ను అరెస్ట్ చేయండి. పాయల్‌తో అనురాగ్ ఏ విధంగా ప్రవర్తించాడో అది బాలీవుడ్లో ఎప్పటినుండో జరుగుతోంది. అవకాశాల కోసం వచ్చే అవుట్సైడర్స్ను సెక్స్ వర్కర్స్లా చూడటం ఇక్కడ అలవాటే’’ అని ట్వీటర్లో స్పందించారు కంగనా. తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘నేను ప్రేమించిన, పెళ్లి చేసుకున్న, నాతో పని చేసిన ఏ నటిని, ఫీమేల్ టెక్నీషియన్ని అడిగినా నా గురించి చెబుతారు. వీళ్లు కాకుండా నేను వేరే పనుల మీద కలిసే ఏ అమ్మాయిని అడిగినా నేనేంటో చెబుతారు. మీరు ఆరోపించే విధంగా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. అలా తప్పుగా ప్రవర్తించేవాళ్లను ప్రోత్సహించను కూడా. ఇదంతా నా నోరు మూయించడానికే’’ అని పేర్కొన్నారు కశ్యప్. అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా ఆయనతో పని చేసిన తాప్సీ, పలువురు దర్శకులు నిలిచారు. ‘‘నాకు తెలిసిన అతిపెద్ద స్త్రీ వాది (అనురాగ్‌ని ఉద్దేశించి) నువ్వే. మనిద్దరం మరో గొప్ప ఆర్ట్ సృష్టించడానికి కలసి పని చేద్దాం’’ అని ఆయన్ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు తాప్సీ. బాలీవుడ్ చిత్రాల ఎడిటర్, అనురాగ్ కశ్యప్ భార్య ఆర్తీ బజాజ్ పాయల్ చేసిన ఆరోపణలను ‘చీప్’ అని కొట్టేపారేశారు. ‘‘ఒకరి మీద ద్వేషం చిందించడానికి పెట్టే శ్రమను ప్రేమించడానికి పెడితే ఈ ప్రపంచం ఎంతో బావుంటుంది. నోరు తెరిచి మాట్లాడేవాళ్లందర్నీ అణచివేయాలనుకుంటున్నారా? అనురాగ్... నీ సినిమాల్లో అందరూ సురక్షితంగా పని చేసే విషయం నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు ఆర్తీ బజాజ్. అలాగే అనురాగ్ కశ్యప్‌తో పని చేసిన పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. -
నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్
బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ మౌనం వీడారు. అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. "వావ్, నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలు ఆడావు. మీరూ ఒక స్త్రీ అయినప్పటికీ ఎందరో ఆడవాళ్లను ఇందులోకి లాగారు." (చదవండి: కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు) కొంచెమైనా గౌరవాన్ని కాపాడుకోండి మేడమ్.. నేను చెప్పదలచుకుందేంటంటే.. మీ ఆరోపణలన్నీ నిరాధారమైనవే. నాపై ఆరోపణలు వేసే క్రమంలో బచ్చన్ కుటుంబాన్ని, నా ఆర్టిస్టులను ఇందులో లాగావు. కానీ విఫలమయ్యావు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. ఇది నేరం అంటే నేను అందుకు అంగీకరిస్తాను. కానీ నాతో కలిసి పని చేసిన మహిళలు ఎవరితోనూ చెడుగా ప్రవర్తించలేదు, అలాంటి వాటిని సహించను కూడా!" అని అనురాగ్ పేర్కొన్నారు. కాగా ఈ వివాదంతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. పాయల్‌కు కంగనా మద్దతు తెలుపుతండగా, అనురాగ్‌కు తాప్సీ సపోర్ట్‌గా నిలిచారు. కాగా పాయల్ ఘోష్ బాలీవుడ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో కనిపించారు. ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్, ప్రయాణం సహా పలు చిత్రాల్లో నటించారు. (చదవండి: డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత) -
కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్లో..‘అనురాగ్ కశ్యప్ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్ ఘోష్ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. -
కంగనాకు సారీ చెప్పేందుకు సిద్ధమే
హీరోయిన్ కంగనా రనౌత్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీలతోపాటు దర్శక, నిర్మాతలను సైతం ఏకిపారేసింది. అందులో దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఆయనను ఆమె 'మినీ మహేశ్ భట్' అని సంబోధించారు. దీనిపై కలత చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమె అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కావడం లేదదని వాపోయారు. ఒకానొక సమయంలో తనకు కంగనా మంచి మిత్రురాలని, ఆమెకు సినిమాల్లో సహాయం చేశానని, కానీ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన) తనకు కంగనా, తాప్సీ ఇద్దరూ స్నేహితులని, వారిద్దరి మధ్య గొడవలను సర్ది చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదన్నారు. పైగా ఈ విషయం గురించి ఆమెకు చేసిన మెసేజ్‌లను కూడా సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేసిందన్నారు. కానీ తాను ఒక స్నేహితుడిగానే ఆమె సమస్యలను పరిష్కరించాలనుకున్నానని తెలిపారు. ఒకవేళ తాను నిజంగానే ఆమెను బాధపెట్టి ఉంటే అందుకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేమేనని చెప్పుకొచ్చారు. అయితే ఎవరైతే ఆమె వైపు నిలబడరో వారందరినీ కంగనా శత్రువులుగానే చూస్తోందని అనురాగ్ పేర్కొన్నారు. (ఇండియా నుంచి ఈ ఇద్దరూ..) -
ఇండియా నుంచి ఈ ఇద్దరూ..
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్లో స్క్రీనింగ్ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో డిజిటల్లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు. -
సంసారబంధపు ఉక్కిరిబిక్కిరి చోక్డ్
చెడ్డ భర్తలతోనే కాదు మంచి భర్తలతో కూడా ఇబ్బందులుంటాయి. వీళ్లు కష్టపెట్టరు. బాధించరు. ప్రేమిస్తారు కూడా. కాని పని చేయరు. ఇంటిని నడపరు. ఇంటి చాకిరీయే అనుకుంటే ఇల్లు నడిపే చాకిరి అప్పుడు స్త్రీ మీద పడుతుంది. దానికి తోడు ఆర్థిక కష్టాలు. ఆ సమయంలో ఒక వింత జరిగితే? దానిని ఆమె తన భర్త నుంచి దాచి పెడితే? అనురాగ్ కశ్యప్ సినిమా ‘చోక్డ్’ ప్రేక్షకులకు వాస్తవ ప్రపంచపు మానవ ప్రవర్తనలను చూపిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బు తెల్లడబ్బు అవుతుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు నల్లడబ్బు అవుతుంది. అవినీతి, పాపం, నేరం, మోసం చేస్తే ఈ నల్లడబ్బు పోగవుతుంది. అది ధారబోస్తే సౌఖ్యాలు దక్కుతాయి. కాని దానిని ఎలా సంపాదించామో తెలిసిన మనసుకు బురద అంటుతూనే ఉంటుంది. ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక ఫ్లాట్‌లో ఎమ్మెల్యే అక్రమంగా సంపాదించిన డబ్బును దాచి పెడుతుంటాడు. అందులో తాను కొంత నొక్కేసి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చుట్టి బాత్రూమ్లోని డ్రయినేజీ పైపులో ఉంచుతుంటాడు. ఆ గలీజు గొట్టంలో దాగిన గలీజు డబ్బు కింద ఫ్లాట్‌లో కాపురం ఉంటున్న ఒక గృహిణికి అంటుకోవడమే ‘చోక్డ్’ కథ. 2016లో ఈ కథ జరుగుతుంటుంది. సవిత ఒక సాధారణ గృహిణి. ముంబై శివార్లలోని దిగువ మధ్యతరగతి ఫ్లాట్‌లో కొడుకుతో, భర్తతో కాపురం ఉంటుంటుంది. ఆమెకు లోకల్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం ఉంది. ఇంటికి అదే ఆధారం. ఎందుకంటే భర్త పెద్దగా పని చేయడు. అతడు గిటార్ ప్లేయర్. భావుకుడు. శ్రమ తెలియదు. సంపాదనా తెలియదు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒకప్పుడు గాయని. కాని భర్త కోసం గాయనిగా తన కెరీర్ వదులుకుని ఉద్యోగానికి పరిమితమైంది. ఆ ఉద్యోగం ఆమెకు ఇష్టం లేదు. అందులో ఆమెకు ఒక ఊపిరాడనితనం ఉంటుంది. ఇంట్లో కూడా ఊపిరాడనితనమే. ఆ పాత ఫ్లాటు... మురికి గోడలు... పెచ్చులూడే శ్లాబులు... మంచి డోర్ కర్టెన్లకు కూడా నోచుకోని ఆర్థిక దుర్భరత్వం... రిపేరు చేయక ఎప్పుడూ గలీజు పైకి తేలే కిచెన్ డ్రయినేజీ... దానిని పట్టించుకోని భర్తపై చచ్చిపోయిన ప్రేమ... దీనినుంచి విముక్తి లేదా అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక అర్థరాత్రి ధనలక్ష్మి దొడ్డిదారిలో ఆమె కిచెన్ డ్రయినేజీ నుంచి ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తుంది. భర్తతో కొట్లాడిన సవిత ఒక రోజు రాత్రి కిచెన్‌లో కూచుని ఉంటే సింక్ కింద ఉండే డ్రయినేజీ పైపులో గురగుర మొదలవుతుంది. ఎప్పుడూ ఉన్న సమస్యే అనుకుంటుంది. అందులో నుంచి యథావిథిగా మురుగు నీళ్లు పొంగుతాయి. దాంతోపాటు రెండు ప్లాస్టిక్ చుట్టల్లో చుట్టిన కొద్దిపాటి డబ్బు కూడా. సవిత వాటిని తెరిచి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. ఆనందపడుతుంది. భర్తతో చెప్దామా వద్దా అని తటపటాయించి దాచుకుంటుంది. ఆ రోజు నుంచి ఆమె దినచర్య మారిపోతుంది. ప్రతి రోజూ రాత్రి ఎప్పుడవుతుందా డ్రయినేజ్ పైప్ ఎప్పుడు పొంగుతుందా ఎప్పుడు డబ్బు బయటకు వస్తుందా అని ఎదురు చూడటమే పని. ఆమె కొద్ది కొద్దిగా వచ్చిన డబ్బును దాచుకుంటూ ఉంటుంది. ఈలోపు డీమానిటైజేషన్ వచ్చి పడుతుంది. రాత్రికి రాత్రి పాత నోట్లు చెల్లకుండా పోతాయి. తన దగ్గర ఉన్నవి బ్యాంకులో రహస్యంగా మార్చుకుంటుంది. అయితే మరికొందరు కూడా ఆమెను డబ్బు మార్చిపెట్టమని వెంటపడుతుంటారు. ఆర్థికకష్టాల నుంచి బయటపడుతున్నాననుకుంటున్న సవిత వేరే ప్రమాదాల్లోకి పోబోతూ ఉందా అని ప్రేక్షకులకు భయం వేస్తుంది. అయితే కథ మలుపులు తిరిగి సుఖాంతం అవుతుంది. మనిషికి డబ్బు ఎంత కావాలి? ఒకవైపు చిన్న అవసరాలకు కూడా బాధపడే జనం. మరోవైపు అక్రమంగా సంపాదించి బాత్రూముల్లో దాచుకునే నికృష్టం. బ్లాక్‌మనీ బయటకు వస్తుంది అని భావించిన డీమానిటైజేషన్ ఎందరు సామాన్యులను ఇబ్బంది పెట్టిందో ఈ సినిమాలో చూపించడం ఒక ముఖ్యమైన అంశం. సవితకు ఈ సినిమాలో డబ్బు దొరికినా దానిని ప్రదర్శించడానికి, ఉపయోగించుకోవడానికి లేదు. భర్త నిఘా ఉంటుంది. ఇరుగు పొరుగు గమనింపు ఉంటుంది. పక్కవారు సడన్‌గా బాగుపడినా సవాలక్ష పుకార్లు లేస్తాయి. కొద్దిపాటి డబ్బు సామాన్యులను ఇంత గందరగోళం చేస్తే అన్ని వేల కోట్లు అక్రమడబ్బు దాచుకున్న పెద్దలు స్థిమితంగా ఎలా ఉంటారనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి నగర జీవితంలో సగటు స్త్రీ జీవన విధానాన్ని, ఆమె నివాసంలో ఇరుగు పొరుగు స్త్రీలతో ఆమెకు ఉంటే స్నేహాన్ని, ఆ స్నేహంలో మంచి/చెడు సగటు ప్రవర్తనని అనురాగ్ కశ్యప్ చాలా శక్తిమంతంగా చూపించాడు. కనీస అవసరాలు తీరే వీలు లేని సంపాదన ఉన్న కాపురాలు ఎంత ఘర్షణాయుతంగా, అమానవీయంగా, ఒకరినొకరు హీనపరుచుకునే విధంగా ఉంటాయో కూడా చూపించాడు. అనురాగ్ కశ్యప్ తన ధోరణికి పక్కకు జరిగి మిడిల్ క్లాస్ డ్రామాను చూపించ యత్నించిన సినిమా ఇది. ఇంకా స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టాల్సింది అని ఎక్కువమంది భావిస్తున్నా ఒక భిన్నమైన వీక్షణ అనుభూతి కలిగించినందుకు సంతృప్తి పడుతున్నారు. ఇందులో ముఖ్యపాత్రలు పోషించిన ముగ్గురు సయామి ఖేర్, రోషన్ మేథ్యూ, అమృతా సుభాష్‌ల నటన చూడతగ్గది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. – సాక్షి ఫ్యామిలీ. మూవీ: చోక్డ్; నిడివి: 1 గం.54 నిమిషాలు; నిర్మాణం/ప్రదర్శన: నెట్‌ఫ్లిక్స్; దర్శకత్వం: అనురాగ్ కశ్యప్; విడుదల: జూన్ 5, 2020 -
కరోనా టెస్ట్ కిట్ల కోసం.. ట్రోఫీల వేలం
ముంబై : కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు కొందరు బాలీవుడ్ ప్రముఖులు సిద్దమయ్యారు. ఇందుకోసం వారు పొందిన అవార్డులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, గేయ రచయిత వరుణ్ గ్రోవర్, కమెడియన్ కునాల్ కామ్రా ఉన్నారు. ఈ వేలం ద్వారా 10 టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసేందుకు రూ. 13,44,000 సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కిట్ల ద్వారా దాదాపు వెయ్యి మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ మేరకు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రానికి గానూ తాను సొంతం చేసుకున్న ఫిల్మ్ ఫేర్ ట్రోపిని వేలం వేస్తున్నట్టు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. ఎక్కువ ధర కోట్ చేసినవారికి ఈ ట్రోపిని అందజేయనున్నట్టు తెలిపారు. మరోవైపు దమ్ లగా కే హైషా చిత్రంలోని తను రాసిన పాటకు అందుకున్న టీవోఐఎఫ్‌ఏ ట్రోఫిని వేలానికి ఉంచనున్నట్టు వరుణ్ గ్రోవర్ వెల్లడించారు. అలాగే కునాల్ కూడా తన యూట్యూబ్ బటన్ అవార్డును వేలం వేయనున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ ద్వారా సేకరించిన మొత్తాన్ని నేరుగా మై ల్యాబ్ డిస్కవరీ సోల్యూషన్ బదిలీ చేయబతుందని మిలాప్ క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. తద్వారా ఆస్పత్రులకు, ప్రయోగశాలలకు కరోనా టెస్టింగ్ కిట్లను అందజేయనున్నట్టు తెలిపింది. While each ruppee counts I appreciate the hell out of Comrade @anuragkashyap72 who is giving away his 2013 gangs of Wasseypur critics award to the highest donor of this charity with my YouTube button Link - https://t.co/xm5mNd2qDZ I urge other artists to help in their own way! https://t.co/izrv9CaxQT — Kunal Kamra (@kunalkamra88) May 20, 2020 -
పబ్లిసిటీ స్టంట్ అయితే ఏంటి?
న్యూఢిల్లీ: ‘ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు’ అంటూ బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్ ప్రమోషన్ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్ చేస్తూ.. సినిమాకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. (‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’ ) ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ... ‘ఆయిషీ ఘోష్ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు.. ‘నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను’ అని చెప్పడం. తన చర్య ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీపిక.. జేఎన్యూకు వెళ్లడం ద్వారా ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారుమ్రోగిపోతుంది’ అని దీపికపై ప్రశంసలు కురిపించాడు. తను ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తిపోయిన ప్రజలు... దానిని దాటుకుని ముందుకు సాగుతారని అభిప్రాయపడ్డాడు. (ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు: దీపికకు కేంద్రం అండ) ఇక అనురాగ్ కశ్యప్ సైతం ట్రోలింగ్ బాధితుడన్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ.. మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోను ట్విటర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో దీపిక ఫొటో పెట్టి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. కాగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక ఓ నిర్మాతగా వ్యవహరించాన్న సంగతి తెలిసిందే.(ప్రొఫైల్ పిక్ మార్చిన డైరెక్టర్.. ట్రోలింగ్!) -
ప్రొఫైల్ పిక్ మార్చిన డైరెక్టర్.. ట్రోలింగ్!
ముంబై : తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు తన ట్విటర్ ప్రొఫైల్ ఫోటోనే కారణమైంది. అనురాగ్ తన ట్విటర్ ప్రొఫైల్ ఫోటోను ఆదివారం మార్చారు. ఇందులో ఏముంది అనుకోకండి.. తన పాత పిక్చర్‌ను మార్చి మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రిఅమిషాల ఫోటోను పెట్టారు. ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దుండగుల దాడిని వ్యతిరేకిస్తూ.. మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ అనురాగ్ ఈ ఫోటోను పెట్టారు.(అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి) కాగా ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై, ఉపాద్యాయులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే అధికార బీజేపీ ఇలా ముసుగులు ధరించి ఎవరికీ తెలియకుండాప్రజలపై దాడికి పాల్పడుతోందన్న ఉద్దేశంతో అనురాగ్ ఇలా చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ దాడిని నిరసిస్తూ ప్రతిపక్షాలు, బాలీవుడ్ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న(జనవరి 6)రాత్రి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో అనురాగ్ కశ్యప్ కూడా పాల్గొన్నారు. ఇక అనురాగ్ పెట్టిన ఈ ఫోటోకు వేల మంది లైకులు కొట్టడంతోపాటు, అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫైల్ ఫోటోను మార్చడంతో కొంతమంది అనురాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. #NewProfilePic pic.twitter.com/sQdfTFAY8B — Anurag Kashyap (@anuragkashyap72) January 6, 2020 అయితే అత్యధిక మంది ‘స్టాండ్ విత్ అనురాగ్ కశ్యప్’ హ్యష్‌ట్యాగ్‌తో...అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ‘‘ మీ ప్రతి ట్వీట్ మమ్మల్నీ ప్రేరేపిస్తోంది. గర్వంగా ఉంది సార్, దాడి తప్పు అని ప్రజలకు తెలిసినా..వారు మౌనంగా ఉన్నారు. వారికి చెడుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు’’ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతూ.. అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. -
బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?
ముంబై : తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన నాటి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న కల్కి.. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె... జెరూసలేం(ఇజ్రాయెల్)కు చెందిన పియానిస్ట్ గయ్ హర్ష్‌బర్గ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం గర్భం దాల్చిన కల్కి.. తాను త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించబోతున్నానంటూ సన్నిహితులు, అభిమానులతో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బేబీ బంప్‌తో కనిపిస్తున్న కల్కి ఫొటోలను కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ బిడ్డను కంటున్నావు సరే. మరి నీ భర్త ఎక్కడ. నువ్వసలు ఇలా చేస్తావని అనుకోలేదు. సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకో’ అంటూ చివాట్లు పెడుతూనే జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన కల్కి పింక్‌విల్లాతో మాట్లాడుతూ... ‘ నేను సెలబ్రిటీ కాబట్టి అందరూ నాపై దృష్టిసారిస్తున్నారు. ఒకవేళ నేను కూడా సెలబ్రిటీ కాకపోయినా నా అభిప్రాయాలు, నిర్ణయాలకు అందరి ఆమోదం లభించదు. నన్ను తిడుతున్న వాళ్లతో పాటు అండగా నిలిచేవాళ్లు కూడా ఉన్నారు. అయితే వారంతా నాకు నేరుగా ఎదురుపడటం లేదు. ఎవరు ఏమన్నా ఇది నా జీవితం. ఇక ఎవరి సంగతి ఎలా ఉన్నా మా అపార్టుమెంటులో చాలా మందికి తెలుసు... నేను డివోర్సీని. నాకు ఇప్పుడు పెళ్లి కాలేదు అని. అయినా కొంతమంది ఆంటీవాళ్లు నా పట్ల ప్రేమపూర్వకంగానే ఉంటున్నారు. తినడానికి ఏమైనా చేసి పెట్టాలా అమ్మా అని అడుగుతున్నారు. వాళ్లు నిజంగా నాకు ఎంతో మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇరవైల్లోనే.... డివోర్సీ అయిన అనురాగ్‌ను పెళ్లి చేసుకున్న కల్కి స్వల్ప కాలంలోనే అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నారు. -
తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి
ముంబై : త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తెలిపారు. తన సహచరుడు గయ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. గోవాలో ప్రసవం కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్‌్డ జెండర్ అయినా ఫరవాలేదని.. తన కోసం సూటయ్యే పేరును ఇప్పటికే ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు. కాగా దేవ్ డీ, రిబ్బన్, గల్లీబాయ్ వంటి పలు చిత్రాల్లో నటించిన కల్కి.. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2015లో వీరిద్దరు సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన పియానిస్ట్ గయ్‌తో సహజీవనం చేస్తున్న కల్కి.. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం వచ్చినందున బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుండటం గురించి కల్కి మాట్లాడుతూ.. ‘నా బిడ్డతో ఎప్పుడు కనెక్ట్ అవాలో నాకు తెలుసు. ఇందుకోసం ప్రత్యేక నియమ నిబంధనలు ఏవీ పెట్టుకోలేదు. తను ఆడైనా, మగ అయినా, గే అయినా నా ప్రేమలో తేడా ఉండదు. లింగవివక్ష వేళ్లూనుకుపోయిన ఈ ప్రపంచంలో నా బిడ్డ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పెరగాలన్నదే నా అభిమతం. తన కోసం ఇప్పటికే పేరును కూడా ఎంపిక చేశాను. గర్భవతిని అయ్యాక నాలో చాలా మార్పులు వచ్చాయి. నెమ్మదిగా నడుస్తున్నా. ఓపిక బాగా పెరిగింది. మాతృత్వంలో ఉన్న గొప్పదనం అంటే ఇదేనేమో. గోవాలో పురుడుపోసుకోవాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని తప్పు చేశానని.. ఇప్పుడు తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఇక అనురాగ్ కశ్యప్ కూడా భార్య నుంచి విడిపోయిన అనంతరం కల్కిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కల్కితో కూడా అతడి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. -
బిల్గా బాద్షా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నెక్ట్స్ ఏ చిత్రంలో నటించబోతున్నారు? అనే ప్రశ్నకు బాలీవుడ్లో భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ హిందీలో రీమేక్ కానుందట. నటుడు–నిర్మాత నిఖిల్ దివేది హిందీ సినిమా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని బాలీవుడ్ టాక్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నిఖిల్. ఆల్రెడీ ప్రీ–ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించారట. ఈ సినిమాలో విలన్ బిల్ పాత్రలో నటించాల్సిందిగా షారుక్‌తో సంప్రదింపులు జరిపారట నిఖిల్. మరి.. షారుక్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు తమిళ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో షారుక్ ఓ అతిథిగా నటించారని ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ హీరోగా నటించిన ‘జీరో’ గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్స్ లేవు కాబట్టి, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయమని, కొడుకు అబ్రామ్తో టైమ్ గడుపుతూ షారుక్ చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు ఆయన సతీమణి గౌరీ ఖాన్. -
కొత్త లుక్‌లో థ్రిల్
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాల్లో భయపెట్టడానికి దెయ్యం, పాడుబడిన భవంతులు, చీకట్లో కొన్ని సన్నివేశాలు తీయడం కామన్. ఇవేమీ లేకుండా ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. తాప్సీ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఇది వరకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మర్జియా’, ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సాంద్ కీ ఆంఖే’లో హీరోయిన్గా నటించారు తాప్సీ. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ విశేషాలను తాప్సీ తెలుపుతూ – ‘‘ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి అంశాలు మా సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో పలు గెటప్స్‌లో కనిపిస్తాను. గుర్తుపట్టలేనటువంటి లుక్ కాదు కానీ ఇప్పటివరకూ మీరు చూడని గెటప్‌లో మాత్రం కచ్చితంగా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం విదేశాల్లో చేస్తాం. అనురాగ్‌తో సినిమా అంటే మానసికంగా ప్రిపేర్ అయ్యుండాలి. షూటింగ్ ముందు ఏదో ఓ బాంబ్ వేస్తాడు. ‘మన్మర్జియా’ షూటింగ్ రెండు రోజుల ముందు జుత్తు మొత్తం రంగు వేసుకోమన్నాడు. అందుకే ఈసారి నేను రెడీగా ఉన్నాను. గుండు చేయించుకోవడానికి తప్ప ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను (నవ్వుతూ)’’ అన్నారు. -
ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ డైరెక్టర్
సామాజిక కోణంలో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు అనురాగ్ కశ్యప్. వ్యక్తిగతంగానూ అలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అంశాలపై అనురాగ్ స్పందించే తీరు వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ ట్విటర్‌కు గుడ్ బై చెప్పారు. తన కారణంగా తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన అనురాగ్ చాలా సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ‘దొంగలు రాజ్యమేలుతారు, దుర్మార్గం జీవన విదానం అవుతుంది. సరికొత్త భారతదేశంలో నివసిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేనపుడు నేను మౌనంగానే ఉండిపోతాను గుడ్ బై’ అంటూ చివరి ట్వీట్ చేశారు అనురాగ్. -
కలియుగాన్ని చూడాలంటే..
ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగంలో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నటి స్వర భాస్కర్ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్ చేశారు. మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్ రేప్ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు’
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెచ్చు మీరుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనలను ఖండిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సినిమా సెలబ్రిటీలు అదూర్ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్‌లు, అపర్ణ సేన్, కొంకణా సేన్ శర్మలతో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మనేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటి ఘటనలు దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ద్వారా తెలిసి మేము అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని ’ అని లేఖలో పేర్కొన్నారు. ‘దళితులు, ముస్లింల జరుగుతున్న ఊచకోతపై మీరు పార్లమెంటులో స్పందించిన విషయం తెలుసు గానీ.. వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి’ అని ప్రధాని మోదీని కోరారు. కాగా చారిత్రకవేత్త రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్ బినాయక్ సేన్, ఆశిష్ నంద్యా కూడా లేఖపై సంతకాలు చేశారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్‌గా ముద్ర వేయకూడదని, అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడదని వీరంతా లేఖలో పేర్కొన్నారు. -
తాప్సీ.. కాపీ కొట్టడం మానేయ్
హీరోయిన్ తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా రనౌత్ సోదరి రంగోలీ. కంగన నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాప్సీ కూడా ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశారు. అయితే తాప్సీ ట్వీట్‌పై కంగనా సోదరి రంగోలీ స్పందిస్తూ.. ‘కొంతమంది కంగనను కాపీ కొడుతూ బతికేస్తుంటారు. వారంతా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి.. ట్రైలర్‌ను బాగుందని ప్రశంసించేటప్పుడు కనీసం కంగన పేరు కూడా ప్రస్తావించరు. ఓసారి తాప్సి కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యనించారు. తాప్సీ.. ముందు మీరు ఇలా చీప్‌గా ఇతరుల వర్క్‌ను కాపీ కొట్టడం ఆపండి’ అంటూ రంగోలీ ట్వీట్ చేశారు. Kuch log Kangana ko copy kar ke he apni dukaan chalate hain, magar pls note, they never acknowledge her not even a mention of her name in praising the trailer, last I heard Taapsee ji said Kangana needs a double filter and Tapsee ji you need to stop being a sasti copy 🙏 https://t.co/5eRioUxPic — Rangoli Chandel (@Rangoli_A) July 3, 2019 దాంతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలగజేసుకుని రంగోలీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది. నేను నీ సోదరి కంగనతో, తాప్సితో కలిసి పనిచేశాను. ట్రైలర్‌ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఇందుకు రంగోలి స్పందిస్తూ.. ‘సర్.. మీరు ఉదయం నుంచి కంగనకు ఫోన్లు చేస్తూ.. ‘తాప్సీ నీకు పెద్ద ఫ్యాన్’ అని చెబుతున్నారు. తాప్సీ ఆ మాట ఏ సందర్భంలో అన్నారో నిరూపిస్తారా? ఆవిడ ఎప్పుడూ కంగనను విమర్శిస్తూనే ఉంటారు’ అని మండిపడ్డారు రంగోలీ. ప్రకాశ్ కోవేలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. Come on Rangoli.. this is going too far.. this is really really desperate.. I really don’t know what to say to this . Having worked with both your sister and Taapsee .. I just don’t get this ..praising the trailer means praising all aspect of it. Which includes Kangana https://t.co/tkG5KwyFHi — Anurag Kashyap (@anuragkashyap72) July 3, 2019 -
‘ఆరోజే నా జీవితం నాశనమైంది’
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున తన జీవితం నాశనమైందని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనోజ్ బాజ్‌పేయ్, రిచా చద్దా, రీమాసేన్ తదితర తారాగణంతో తెరకెక్కిన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అనురాగ్ కశ్యప్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. బొగ్గు మాఫియా అక్రమాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులు తనను చూసే విధానం మారిందని కశ్యప్ పేర్కొన్నాడు. ఈ మూవీ మొదటి భాగం విడుదలై ఏడేళ్లు పూర్తైన సందర్భంగా...‘ ఏడేళ్ల క్రితం సరిగ్గా ఈరోజునే నా జీవితం పూర్తిగా నాశనమైంది. అప్పటి నుంచి ప్రేక్షకులు నా నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు. కానీ నేను వారి అంచనాలను అందుకోలేకపోతున్నాను. ఏదైతేనేం 2019 నాటికి సాడే సాతీ పూరైంది’ అంటూ అనురాగ్ కశ్యప్ చమత్కరించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. కాగా గత కొంతకాలంగా అనురాగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మర్జియాన్’ ప్రేక్షకులను నిరాశపరిచింది. -
ఆట ముగిసింది
గేమ్ ఓవర్ అంటున్నారు తాప్సీ. ఇంతకీ ఏ ఆట? ఎవరు ఎవరితో ఆడారు? చివరికి ఎవరి ఆట ముగిసింది? అన్నది తెలియాలంటే ఈ నెల 14 వరకూ వేచి చూడాల్సిందే. తాప్సీ లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ– ‘‘భారతీయ సినీ చరిత్రలో ఇంత వరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ మూవీ ప్రత్యేకతలు. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజవుతోంది. మూడు భాషల్లోని చిత్ర ప్రముఖులు ‘గేమ్ ఓవర్’ ట్రైలర్‌ను చూసి ప్రశంసలతో ట్వీట్స్ చేయటంతో ప్రేక్షకుల్లో మా చిత్రంపై అంచనాలు పెరిగాయి. మా బ్యానర్లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’ నిలుస్తుంది’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తుంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన తీరే దీనికి కారణం’’ అన్నారు తాప్సీ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర. -
వన్ ప్లస్ వన్
ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటారో అంతే బాగా పర్సనల్ లైఫ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం ముంబైలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్న ఈ బ్యూటీ తాజాగా మరో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కి ఓనర్‌గా మారారు. గతంలో తాను ఉన్న అపార్ట్మెంట్లోనే తాప్సీ ఈ కొత్త ఫ్లాట్‌ను తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటీరియర్ డెకరేషన్ వర్క్ జరుగుతోందట. తాప్సీ సిస్టర్ శాగున్ దగ్గరుండి మరీ ఈ పనులన్నీ చూసుకుంటున్నారట. ఇలా పర్సనల్‌గా కూడా తాప్సీ మంచి జోరుమీద ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.... ఇటీవల ‘బద్లా’ చిత్రంతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న తాప్సీ ‘సాండ్‌కీ అంఖే, మిషన్ మంగళ్’ అనే హిందీ సినిమాలను పూర్తి చేశారు. తమిళం, తెలుగు భాషల్లో తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం జూలై 14న విడుదల కానుంది. బాలీవుడ్లో తాప్సీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు ఈ సినిమా హిందీ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రం విడుదల చేయనున్నారు. -
మాయా దర్శకుడి చేతికి తాప్సీ చిత్రం
తాప్సీ చిత్రాన్ని నయనతార చిత్ర విలన్ చేజిక్కించుకున్నారు. బాలీవుడ్లో కథానాయకిగా మంచి మార్కెట్‌ను తెచ్చుకున్న నటి తాప్సీ. దీంతో దక్షిణాదిలో మళ్లీ అవకాశాలు వరిస్తున్నాయి. అలా ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఓవర్. తాప్సీ సెంట్రిక్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ఇరుదుచుట్రు, విక్రమ్‌వేదా, తమిళ్ పడం – 2 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన వైనాట్ స్టూడియోస్‌తో కలిసి రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. చిన్న గ్యాప్ తరువాత నటి తాప్సీ తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు నయనతార నటించిన మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సరవణన్ ఈ గేమ్ ఓవర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నిర్మాణంలో ఉండగానే ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులు హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయన్నది తాజా వార్త. నటి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రం ద్వారా నటుడిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని గేమ్ ఓవర్ చిత్ర నిర్మాతలు స్వయంగా వెల్లడించారు. ఇందులో నటి తాప్సీ కొత్తకొత్త గేమ్‌లను రూపొందించే వైవిధ్యభరిత కథా పాత్రలో నటిస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం నిర్మాణంలో తనూ భాగస్వామి అవడం. నటి వినోదిని వైద్యనాథన్, అనీశ్ కురువిల్లా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాన్ ఇదన్ యోహన్ సంగీతాన్ని, ఏ.వసంత్ ఛాయాగ్రహణం అందించారు. హిందీ రీమేక్‌లో నటి తాప్సీనే నటిస్తుందా లేక వేరే నటిని నటింపజేస్తారా అన్నది తెలియాలంటే కాస్త వేచి చూడాలి. -
లవ్‌స్టోరీ లేదు
దాదాపు పదమూడేళ్ల క్రితం కంగనా రనౌత్‌కు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్‌స్టర్’ (2006) సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటిగా తనను తాను నిరూపించుకున్న కంగనా రనౌత్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయారు. గత ఏడాది అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న ‘ఇమాలీ’ (వర్కింగ్ౖ టెటిల్ అట) సినిమాలో నటించనున్నట్లు కంగన ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకున్నారామె. ‘ఇమాలీ’లో నటించడం లేదని స్పష్టం చేశారు. దానికిగల కారణాన్ని కంగన చెబుతూ – ‘‘ఇమాలీ’ మంచి ప్రేమకథా చిత్రం. గత ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సింది. నేను ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాతో చాలా బిజీగా ఉండటంతో కుదర్లేదు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా ‘పంగా’ను స్టార్ట్ చేశాం. ఇటీవల ‘జయ’ (ప్రముఖ నటి, తమిళనాడు మాజీ సీయం జయలలిత బయోపిక్ హిందీ టైటిల్)కు సైన్ చేశాను. త్వరలో నా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేశాం. ఇలా చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి సమయం లేదు. అందుకే అనురాగ్ బసుతో సినిమా చేయడం లేదు. ఈ విషయం గురించి ఆయనతో కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పంగా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు కంగన. -
నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు
సినీ పరిశ్రమకున్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనది. ఆ తళుకుబెళుకులకు అలవాటు పడిన వారు సాధరణ జీవితం గడపలేరు. అవకాశాలు తగ్గిపోతే డిప్రెషన్లోకి వెళ్లడం.. నేరాలకు పాల్పడటం.. ఆఖరుకి ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి నేడు.. సెక్యూరిటీ గార్డుగా అనామక జీవితం గడుపుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షించడమే కాక అభినందనలు కూడా అందుకుంటుంది. వివరాలు.. ‘బ్లాక్ ఫ్రైడే’, ‘గులాల్’, ‘పాటియాల హౌస్’ వంటి పలు చిత్రాల్లో నటించిన సావి సిద్ధు ప్రస్తుతం అవకాశాలు లేక సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి.. సెక్యూరిటీ గార్డుగా చేరాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ‘12 గంటల ఈ ఉద్యోగం చాలా కష్టమైనది. చాలా మెకానికల్ జాబ్. బస్సు టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఇక సినిమా టికెట్ కొనడం అనేది నా జీవితంలో ఓ కలగా మారింది. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు’ అంటూ సావి వీడియోలో తన కష్టాల గురించి తెలిపారు. ఆన్లైన్లో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో రాజ్‌కుమార్ రావ్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు సదరు యూ ట్యూబ్ చానెల్‌కి కృతజ్ఞతలు తెలపడమే కాక సావి ఎంచుకున్న మార్గం ఎందరికో ఆదర్శంగా నిలిచిందంటూ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. అంతేకాక తన పరిచయస్తులకు సావి గురించి చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని తెలిపాడు. ఇక ఈ వీడియో గురించి అనురాగ్ కశ్యప్ ‘నేను సావి సిద్ధును గౌరవిస్తాను. అవకాశాలు రాని వారు చాలా మంది తాగుతూ.. ఇతర మార్గాల్లో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ సావి మాత్రం గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. బతకడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం చాలా ఉత్తమైనది. డబ్బులిచ్చి ఆయన స్వాభిమానాన్ని దెబ్బ తీయకూడదు. వారికి సాయం చేయాలనుకుంటే డబ్బు చెల్లించి వారి కళను ఆస్వాదించండి’ అంటూ ట్వీట్ చేశారు. There are so many actors out there who don’t have work. I respect Savi Siddhu as an actor and have cast him thrice when he earned the role. I respect him that he chose to live his life with dignity and picked a job unlike so many entitled out of work actors who have either — Anurag Kashyap (@anuragkashyap72) March 19, 2019 -
షూటింగ్ సులువు కాదు
నా కెరీర్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్నానని అంటున్నారు కథానాయిక తాప్సీ. తుషార్ హీరానందన్ దర్శకత్వంలో తాప్సీ, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలుగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘శాండ్ కీ ఆంఖ్’. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షార్ప్ షూటర్స్ చంద్రోస్, ప్రకాషి తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రతిరోజూ ఉదయాన్నే గన్ షూట్ సాధన మొదలుపెడతాం. రోజూ నాలుగు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను. నా కోచ్ విశ్వజిత్ షిండే మంచి శిక్షణ ఇస్తున్నారు. గన్ ఎలా పట్టుకోవాలి? గన్ పేల్చుతున్నప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలనే అంశాలపై మరింత పట్టు సాధిస్తున్నాను. సరైన సాధనతో ఇప్పుడు షూటింగ్ బాగానే చేస్తున్నాను. కానీ గన్ షూటింగ్ అంత సులభంగా రాలేదు. మొదట్లో ప్రయత్నించడానికే భయం వేసింది. దాంతో మోస్ట్ చాలెంజింగ్ రోల్ అనిపించింది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి ‘బద్లా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారామె. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్యతారలుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. -
షూటింగ్లో షూటింగ్
ఇన్ని రోజులు గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేసిన తాప్సీ ఇప్పుడు ఫీల్డ్‌లోకి దిగారు. ఆమెకు భూమి ఫడ్నేకర్ తోడయ్యారు. మరి.. వీరిద్దరూ ఎన్ని పతకాలు సాధించారు? అనేది వెండితెరపై తెలుసుకోవాలి. తాప్సీ, భూమి ఫడ్నేకర్ ముఖ్య తారలుగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాషి తోమర్ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూతన దర్శకుడు తుషార హీరా నందానీ తెరకెక్కిస్తున్నారు. ‘‘కూలెస్ట్ అండ్ ఓల్డెస్ట్ షూటర్స్ చంద్రో, ప్రకాషిలను కలిశాం. షూటింగ్ మొదలుపెట్టాం’’ అని పేర్కొంటూ రియల్ షూటర్స్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు తాప్సీ. సో.. ఈ సినిమా షూటింగ్లో తాప్సీ, భూమి గన్ షూటింగ్ చేస్తారన్న మాట. -
అంజలి.. చాలా పవర్ఫుల్
నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్’. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆర్. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సీజే జయకుమార్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్ రోల్లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రమేష్ తిలక్, దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
ట్రాన్స్‌జెండర్ అనుకుంటే హ్యాపీనే!
ముంబై : ఓ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర పోషించిన నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పాత్రను చూసిన నెటిజన్లు నిజంగానే ట్రాన్స్‌జెండర్ నుకుని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సాక్రిడ్ గేమ్స్’ ఫేమ్ కుబ్రా సైత్. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్లు ప్రధాన పాత్రలు పోషించారు. నటి కుబ్రా సైత్ కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ రోల్లో కనిపించారు. అయితే వెబ్ సిరీస్ చూసిన నెటిజన్లు కుబ్రా సైత్ నిజంగానే ట్రాన్స్జెండరేనా అని అనుకునేలా నటించారు. దీంతో గూగుల్‌లో కుబ్రా అని టైప్ చేయగానే జెండర్ అనే కీవర్డ్ కనిపిస్తోంది. దీనిపై నటి కుబ్రా స్పందించారు. తనను ట్రాన్స్‌జెండర్ అని ప్రేక్షకులు భావించినందుకు గర్వంగా ఉందన్నారు. ’నాకు ఆ పాత్ర దక్కినందుకు సంతోషంగా ఉన్నా. నా నటనకు దక్కిన గౌరవంగా భావిస్తా. చిన్నప్పుడు స్కూల్లో ఓ నాటకంలో చెట్టు పాత్రను ఎంత నిజాయితీగా పోషించానో.. సాక్రిడ్ గేమ్స్‌లో ట్రాన్స్‌జెండర్ కుక్కూ పాత్రలోనూ అలాగే నటించా. నా సీన్లు బాగా రావడంతో మరిన్ని సీన్లు తీశారు. తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందింటే నా నటనకు మంచి మార్కులు పడ్డాయని తేలిపోయిందని’ నటి కుబ్రా సైత్ వివరించారు. విక్రమ్ చంద్రా రాసిన నవల ఆధారంగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకులుగా సాక్రిడ్ గేమ్స్ రూపొందిన విషయం తెలిసిందే. న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా! : నటి -
‘బోర్‌కొట్టినప్పుడు విడాకులు తీసుకుంటాం
దర్శకుడు అనురాగ్ కశ్యప్, విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దేవ్ డీ’, ‘బ్లాక్ ఫ్రైడే’, ‘రామన్ రాఘవ్ 2.0’ మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ తీసిన ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ ప్రధాన ప్రాతలో నటించారు. అయితే నవాజుద్దీన్‌తో కలిసి పనిచేయడం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘నేను చేసే పనిలో కొత్తదనం ఉంటేనే నవాజ్‌ను సంప్రదిస్తాను. ఇప్పటి వరకూ మేము చేసిన వాటిల్లో ఒక్కటి కూడా పునరావృతం కాలేదు. ఇప్పటి వరకూ మా ఇద్దరి కాంబినేషన్లో ఏం వచ్చాయి అనే దాని గురించి మాకు ఒక అవగాహన ఉంది. కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏం లేకపోతే ఖాళీగా ఉంటాను, తప్ప రొటీన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించను’ అన్నారు. అంతేకాక.. ‘మా ఇద్దరి కాంచినేషన్ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. మా ఇద్దరికి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు విడాకులు తీసుకుంటాం. కలిసి పనిచేయం’ అన్నారు. నవాజుద్దీన్ గురించి మాట్లాడుతూ ‘నవాజుద్దీన్ ఎంత గొప్ప నటుడో మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. అతనికి తన పని అంటే ప్రాణం.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఇప్పుడు నేను నవాజుద్దీన్‌ను కొత్తగా చూపకపోతే నాకు, మిగితా వారికి తేడా ఉండదు. ఈ పరిశ్రమలో నటులైన, సంగీత దర్శకులైన ఒక్కసారి విజయం సాధిస్తే ఇక మిగతా వారు కూడా వారిని అలానే చూపిస్తుంటారు. ఇక వారు జీవితాంతం అలాంటి పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా చేయలేను. విసుగ్గా ఉంటుంది’ అన్నారు. అందుకే ‘అతన్ని ఒకే రకం పాత్రలకు పరిమితం చేయలేను’ అన్నారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన రాజకీయ పరిణమాలు ఫలితంగా మొదలైన ముంబై అండర్ వరల్డ్ ఇతివృత్తంగా ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్ సత్రాజ్ సింగ్ అనే నిజాయితి గల పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నవాజుద్దీన్ సిద్దిఖి అండర్ వరల్డ్ డాన్ గణేష్ గేంతోడ్ పాత్రలో నటిస్తున్నారు. -
న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా!
ముంబై : ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావ్ అని నాకు తెలుసు. కానీ అలా చేయవద్దు. సీన్ మరింత బాగా రావడానికి మరోసారి న్యూడ్(నగ్నం)గా కనిపించాలని’ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పలుమార్లు చెప్పారని నటి కుబ్రా సైత్ అన్నారు. హాలీవుడ్లో విజయవంతమైన వెబ్ సిరీస్‌ల బాటలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీసే సాక్రిడ్ గేమ్స్. జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ వెబ్ సిరీస్‌లో కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించాను. కొన్ని సీన్లలో నేను నగ్నంగా కనిపించాల్సి ఉంటుందని దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ ముందుగానే చెప్పారు. అయితే వచ్చిన చిక్కేంటంటే.. నగ్నంగా నటించిన సన్నివేశాన్ని పలుమార్లు చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన ప్రతిసారి మరో టేక్ చేద్దామనేవారు. ఇలా కనీసం 7సార్లు అలాంటి సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో నేను దాదాపు ఏడ్చేశాను. ఆ సీన్లు పలుమార్లు తీస్తున్నానని తప్పుగా భావించవద్దని, సీన్ మరింత అందంగా, ఆకర్షణీయంగా రావడానికి అలా చేయాల్సి వచ్చిందని కశ్యప్ చెప్పేవారు. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసునని, అయితే దయచేసి ఆ పని చేయవద్దని కశ్యప్ పదే పదే నన్ను అడిగేవారు. వెబ్ సిరీస్ విడుదలయ్యాక ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారు. న్యూడ్ సీన్లను కూడా చాలా అందంగా చిత్రీకరించారు. మంచి టీమ్‌తో పని చేశానని మీరు భావిస్తారని’ అనురాగ్ కశ్యప్ తనతో చర్చించేవారని నటి కుబ్రా సైత్ వివరించారు. 1980, 90 దశాబ్దాలలో ముంబైలో గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య జరిగే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. సాక్రిడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
అవును.. నిజమే
‘కొత్తబంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. అప్పట్లో ఆమె వరుసగా సినిమాలు చేసినా ఆ తర్వాత స్లో అయ్యారు. వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. ఇప్పుడు శ్వేతా గురించి బాలీవుడ్లో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో శ్వేతా బసు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని, గతేడాదే వీళ్ల నిశ్చితార్థం జరిగిందన్నది ఆ న్యూస్. ఆ వార్తలకు శ్వేతాబసు స్పందిస్తూ ‘‘రోహిత్‌తో నా ఎంగేజ్మెంట్ జరిగిన మాట వాస్తవమే. మేం ఇద్దరం కూడా మా పర్శనల్ లైఫ్ ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునేవాళ్లమే. అందుకే ఈ విషయం గురించి బయట మాట్లాడలేదు’’ అని పేర్కొన్నారామె. విశేషం ఏంటంటే... వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారట. తన దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా ఉన్న శ్వేతాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోహిత్‌కు పరిచయం చేసింది అనురాగ్ కశ్యపే అని సమాచారం. వీళ్ల లవ్స్టొరీలో మొదట గోవాలో రోహిత్‌కు శ్వేతా ప్రపోజ్ చేయగా, పూణేలో శ్వేతాకు రోహిత్ ప్రపోజ్ చేశారట. వచ్చే ఏడాదిలో వీళ్లిద్దరి పెళ్లి ఉండొచ్చని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్లో ‘ది తస్కెంట్ ఫైల్స్’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. -
గుడి గంట మోగింది
మనసు ఏం కోరుకుంటే అది జరగాలనుకుంటాం. ప్రస్తుతం తాప్సీ ఒక్క కోరిక కోరుకున్నారు. అది పెళ్లి గురించి కాదు. సినిమా హిట్టవ్వాలని మనసులో అనుకున్నారు. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ‘మన్మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అంటే.. మనసుకి ఇష్టమైనది అని అర్థం. ఈ సినిమా కోసమే తాప్సీ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు గుడి గంట మోగించి, మంచి జరగాలని కోరుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, తాప్సీ, విక్కీ కుశాల్ ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘మన్మర్జియా’. ఈ సినిమా షూటింగ్‌ను ప్రేమికుల రోజున అమృత్‌సర్‌లో స్టార్ట్ చేశారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆల్మోస్ట్ టు మంత్స్ అమృత్‌సర్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్లు.. అక్కడి గుడి సందర్శించి, తొలి సీన్‌కి క్లాప్ కొట్టడానికి ముందే గుడి గంట మోగించారు తాప్సీ. -
సినిమా చూడకుండానే విమర్శలా..?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్‌గా టైటిల్ మార్చుకుని సీబీఎఫ్సీ క్లియరెన్స్ పొందినా సినిమాను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నా పద్మావత్‌పై అభ్యంతరాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇక సినిమాకు శ్యామ్ బెనెగల్, సుధీర్ మిశ్రా వంటి పిల్మ్ మేకర్లు మద్దతుగా నిలిచారు. చారిత్రక డ్రామాగా తెరకెక్కిన సినిమాపై నానా రాద్ధాంతం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అండగా నిలిచారు. దేశంలో సినీ రూపకర్తలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వీరికి తోడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ సైతం పద్మావత్ సినిమాకు మద్దతు పలికారు. పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు మూవీనే చూడలేదని విరుచుకుపడ్డారు. సినిమాను చూడని వీరందరికీ పద్మావత్‌లో అంత వివాదాస్పద అంశాలు ఏం గుర్తించారని నిలదీశారు. చిత్ర రూపకర్తలు బాధ్యతాయుత వ్యక్తులను వారు కేవలం ప్రేమనే పంచుతారని వ్యాఖ్యానించారు. -
యావరేజ్ ‘లైఫ్’ ఇష్టం
శోభితా ధూళిపాళ్ల తెనాలి అమ్మాయి. 1992 బ్యాచ్. ఆ ఇయర్లో పుట్టింది. ఉండడం ముంబైలో. 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ టైటిల్ తనదే. అనురాగ్ కాశ్యప్ మూవీ ‘రమణ్ రాఘవ్ 20.0’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పక్కన హీరోయిన్ తనే. శోభిత ఫస్ట్ మూవీ అది. ఆ మూవీ కాన్స్ ఫెస్టివల్‌కు కూడా వెళ్లింది. ‘‘అరె! అక్కడ అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా మంచి మంచి మూవీలకు, మరి అంత మంచి మూవీలు తీసికూడా, చూసి కూడా మనకు మనం రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చుకోమో.. నాకు స్ట్రేంజ్‌గా ఉంటుంది’’ అని శోభిత ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. మన ఇండస్ట్రీలో శోభితకు నచ్చనిది ఇంకోటి కూడా ఉంది. బాలీవుడ్ సినిమాల్లో అమ్మాయిలు షార్ట్స్, ట్యాంక్ టాప్ వేసుకుని, కాళ్లకు స్నీకర్స్ తొడుక్కుని, హెయిర్‌ని బ్లో డ్రై చేయించుకుని కనిపించడం! కనిపించడం అంటే.. ఈ దర్శకులు, నిర్మాతలు చూపించడం. మెట్రోపాలిటన్స్‌లో సింపుల్‌గా జీన్స్, షార్ట్ కుర్తా వేసుకుని కాలేజీలకు, ఉద్యోగాలకు పరుగులు తీస్తుండే యావరేజ్ అమ్మాయిల లైఫ్ స్టెయిల్‌ని ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా మనం చూపించలేమా అని శోభిత తరచూ వండర్ అవుతుంటుంది. హోమ్ మేకర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, ఒక టైలరు కూతురు.. ఇలాంటి పాత్రలు వేయడం ఆమెకు ఇష్టం. అయితే ఇచ్చేవారెవరు? శోభితను చూస్తే ఇవ్వాలనే అనిపిస్తుంది. (అంత ‘డౌన్ టు ఎర్త్’గా ఉంటుంది శోభిత) కానీ తీసేవాళ్లెవరు? జనవరి 12న ఆమె నటించిన బ్లాక్ కామెడీ బాలీవుడ్ మూవీ ‘కాలకాండీ’ విడుదల అవుతోంది. అందులో సైఫ్ అలీ ఖాన్ పక్కన శోభిత నటించింది. బహుశా అందులో ఆమె అభీష్టం నెరవేరే ఉంటుంది. ‘కాలకాండీ’ అంటే మరాఠీలో ఏదీ కోరుకున్నట్లు జరగకపోవడం. -
నా కొడుకు కెరీర్‌తో ఆ డైరెక్టర్స్ ఆడుకున్నారు!
అలనాటి బాలీవుడ్ కథనాయకుడు, సీనియర్ హీరో రిషి కపూర్ మరోసారి తన వ్యాఖ్యలతో కలకలం రేపాడు. తన కొడుకు రణ్‌బీర్ కపూర్ కెరీర్‌తో అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు ఆడుకున్నారని, రణ్‌బీర్ కెరీర్ దెబ్బతినడానికి వారే కారణమని దుమ్మెత్తిపోశాడు. నేహా ధూఫియా టాక్‌షో 'నో ఫిల్టర్ నేహా'లో ముచ్చటించిన ఆయన.. 'అనురాగ్' అన్న పదంపై ఒక నిమిషం పాటు మాట్లాడాలని కోరగా.. ఆ ఇద్దరు డైరెక్టర్లను టార్గెట్ చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో అనురాగ్ కశ్యప్ తీసిన 'బొంబే వెల్వెట్' అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా అపకీర్తి ముటగట్టుకోగా.. రణ్‌బీర్ తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'జగ్గాజాసూస్' సినిమాను అనురాగ్ బసు తెరకెక్కించాడు. 'అనురాగ్ కశ్యప్ 'బొంబే వెల్వెట్' తీశాడు. అంతకుముందు అతను తీసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' మంచి సినిమా. కానీ అతను తీసిన 'బొంబే వెల్వెట్'లో తలేమిటో తోకేమిటో నాకు అర్థం కాలేదు. ఇక బసు బర్ఫీ అనే అద్భుతమైన సినిమా తీశాడు. ఈ సినిమాలో నా కొడుకును తీసుకున్నందుకు ఆనందమే. ఈ సినిమాతో నా కొడుకుకు గొప్ప గుర్తింపు వచ్చింది. కానీ, ఆ తర్వాత అతను 'గజ్జా జాసూసో'.. 'జగ్గాజాసూసో' ఓ సినిమా తీశాడు. ఇది కూడా పూర్తి గందరగోళంగా తీశాడు. ఈ ఇద్దరు దర్శకులు మరీ అతిగా తమ సినిమాలను ఊహించుకున్నారు' అని రిషీ అసహనం వెళ్లగక్కాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయాలన్న కోరికతో ఈ ఇద్దరు దర్శకులు తన కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారని, భారీ బడ్జెట్ సినిమాలంటే వీరికి కోతుల చేతుల్లో బొమ్మలాగా మారిపోయిందని విమర్శించాడు. గతంలోనూ 'జగ్గా జాసూస్' సినిమా తీసిన అనురాగ్ బసుపై రిషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం
ముంబై: భారత్-పాక్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ప్రశ్నించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి విమర్శలపాలయ్యారు. ఇంటర్వూ చేసేందుకు కశ్యప్ ఇంటికి వెళ్లిన మహిళా జర్నలిస్టు వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తాను ఇంటర్వూ ఇవ్వనని చెబుతున్నా వినకుండా హెడ్ లైన్ వార్తల కోసం జర్నలిస్టులు కక్కుర్తి పడుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా తనను కలవాలనే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు. జర్నలిస్టుతో వాట్సాప్ సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి.. జర్నలిస్టు: అనురాగ్ మీరు మాట్లాడాలి డైరెక్టర్: కుదరదు జర్నలిస్టు: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న మీరు ఎందుకు మాట్లాడలేరు? డైరెక్టర్: బాధ్యత లేకుండా కేవలం శీర్షికల కోసమే పనిచేసే మీడియాతో నేను మాట్లాడను. జర్నలిస్టు: ఈ మాటలు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కంటే కెమెరా ముందు చెప్పండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను మీ ఇంటి వద్దే ఉన్నాను. మీరు అందుబాటులో ఉన్నారా? డైరెక్టర్: లేదు. సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టిన కొంతసమయంలోనే నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ పోస్టులను తన అకౌంట్ నుంచి తొలగించి తన ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆయనపై నెటిజన్ల ఆగ్రహం తగ్గలేదు. టెర్రిరిజంపై దేశం అట్టుడుకుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొంతమంది కశ్యప్ కు హితవు పలికారు. -
మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు?
ముంబై: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై గాయకుడు అభిజీత్ భట్టాచార్య విరచుకుపడ్డారు. కశ్యప్ ను ఊరికే వదిలిపెట్టబోనని హెచ్చరించారు. 'ఎంత ధైర్యం? ఏమాత్రం ప్రాధాన్యత లేని పాకిస్థాన్ నటీనటుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తావా. నువ్వు అథమస్థాయికి పడిపోతావు. పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడేవారిని వదిలిపెట్టబోము' అని ట్విటర్ లో మండిపడ్డారు. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కశ్యప్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అభిజీత్ ఈవిధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్ 25న పాకిస్థాన్ ప్రధానమంత్రిని కలిసినందుకు మోదీ ఇంకా క్షమాపణ చెప్పలేదు. అదే సమయంలో కరణ్ జోహర్ 'యే దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్ జరుపుకుంద'ని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. 'యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు మద్దతుగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కశ్యప్ వ్యాఖ్యలను దర్శకుడు మధుర్ బండార్కర్ కూడా తప్పుబట్టారు. ‘అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ పాకిస్థాన్ నటీనటుల సినిమాలను నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్ పేర్కొన్నారు. -
డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్.. మాటల వార్!
బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ క్రియేటివ్ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. పాకిస్థాన్ నటులపై నిషేధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించగా.. ఆయన విమర్శలపై మరో టాప్ దర్శకుడు మధుర్ బండార్కర్ మండిపడ్డారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారన్న కారణంతో కరణ్ జోహర్ తెరకెక్కించిన ’యే దిల్ హై ముష్కిల్’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన అనురాగ్ కశ్యప్.. 'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా పాక్‌కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ’యే దిల్ హై ముష్కిల్’ ను షూటింగ్ ప్రారంభించారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ అకస్మాత్తుగా కరాచీ వెళ్లి నవాజ్ షరీఫ్ మానవరాలి పెళ్లిలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ‘యే దిల్ హై ముష్కిల్’ షూటింగ్ ప్రారంభించిన కరణ్.. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయన్న ఉద్దేశంతో పాకిస్థాన్ నటుడ్ని తన సినిమాలో తీసుకున్నారు. అప్పుడు దీనిని ఎవరూ వ్యతిరేకించలేదు. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి, పాకిస్థాన్‌లో భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ నటులతో తీసిన భారతీయ సినిమాలను నిషేధిస్తామని ఎమ్మెన్నెస్ ప్రకటించడంతో కరణ్ సినిమాకు చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్‌కు అండగా నిలిచిన అనురాగ్.. ఈ సినిమా నిషేధాన్ని తప్పుబట్టారు. అయితే, ఈ సినిమా నిషేధం విషయంలో నేరుగా ప్రధాని మోదీపై అనురాగ్ విమర్శలు చేయడాన్ని మధుర్ బండార్కర్ తప్పుబట్టారు. ‘అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్ పేర్కొన్నారు. -
మోదీజీ.. క్షమాపణలు చెప్పండి: దర్శకుడు
ముంబై: గతేడాది డిసెంబర్లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాల ప్రదర్శనపై థియేటర్ల యజమానులు నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టాడు. 'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్లో పాక్‌కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ తీశారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. ఉడీ ఉగ్రవాద దాడి, పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడుల అనంతరం పాక్ నటులపై నిర్మాతల మండలి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే పాక్ నటులు నటించిన సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాక్ నటుడు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు కష్టాలు ఎదురయ్యాయి. కరణ్ జోహార్‌కు మద్దతుగా కశ్యప్ ట్వీట్ చేశాడు. -
నయనతార విలన్‌కి వెల్కమ్!
‘నాన్ దాన్ రుద్ర’ (నేనేరా రుద్ర).. అంటూ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ డైలాగులు చెబుతున్నారు. తమిళ భాషపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. హిందీ వదిలేసి తమిళ సినిమా ఏదైనా తీస్తున్నారా? అనుకుంటున్నారా? దర్శకుడిగా కాదు, విలన్‌గా తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారాయన. నయనతార పోలీసాఫీసర్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగల్’. ఇందులో రౌడీ రుద్ర పాత్రలో అనురాగ్ నటించనున్నారు. విలన్‌గా అనురాగ్ కశ్యప్‌కి రెండో చిత్రమిది. ఆల్రెడీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘అకీరా’లో విలన్ ఈయనే. ఆ సినిమాలో అనురాగ్ విలనిజంకి ఫిదా అయిన మురుగదాస్ తాజా తమిళ సినిమాకి ఆయన పేరును సూచించారట. ‘‘అనురాగ్ జీ.. వెల్కమ్ టు తమిళ ఇండస్ట్రీ’’ అని చిత్రదర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పేర్కొన్నారు. ఇందులో నయనతార, అనురాగ్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో అథర్వ, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
'ఆ హీరో గ్రాఫ్ పడిపోవడానికి నేనే కారణం'
రణ్‌బీర్ కపూర్ నిన్నమొన్నటి వరకు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదుగుతాడని అంతా భావించారు. 'వేకప్ సిద్', 'బర్ఫీ', 'యే జవానీ హై దీవానీ' వంటి వరుస విజయాలతో జోరుమీద ఉన్న రణ్‌బీర్ కు 2013లో 'బేషరమ్' సినిమాతో బ్రేక్ పడింది. అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ తీసిన భారీ సినిమా 'బాంబే వెల్వెట్' (2015) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. రణ్‌బీర్‌ను కోలుకోలేనివిధంగా దెబ్బ తీసింది. ఆ తర్వాత హిట్టు కోసం రణ్‌బీర్ అల్లాడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి తానే కారణమన్న బాధ తనను వెంటాడుతోందని, ఇందుకు తనదే బాధ్యత అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ''బాంబే', 'బేషరమ్' రెండు సినిమాలు నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీశాయి. ఈ విషయాలన్నీ (రణ్‌బీర్ కెరీర్ దెబ్బతినడం) నన్ను ప్రభావితం చేశాయి. ఎవరి చేసిన పనికి వారిదే బాధ్యత కాబట్టి. ఇందుకు నాదే బాధ్యత' అని అనురాగ్ 'పీటీఐ'తో చెప్పారు. 'రణ్‌బీర్ చాలా మంచి నటుడు. ప్రయోగాలు చేసుందుకు సిద్ధపడేవాడు. మేమంతా కలిసి ఉమ్మడిగా అతని వైఫల్యానికి కారణమయ్యాం' అని చెప్పాడు. అనురాగ్, అతని సోదరుడి వల్ల 'బర్ఫీ' స్టార్ రణ్‌బీర్ కెరీర్ కుదేలైందని కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఈ రెండు సినిమాలు అట్టర్‌ప్లాప్ అయినా.. రణ్‌బీర్‌తో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, తాము మామూలుగానే మాట్లాడుకుంటామని అనురాగ్ చెప్పాడు. -
టాప్ హీరోల భారీ పారితోషికాల వల్లే..!
సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా స్టార్ హీరోలు భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ కు మించి వారి పారితోషికాలు ఉంటున్నాయి. దీంతో వారితో సినిమాలు తీయాలంటేనే నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్తా తలకిందులైనా.. నిర్మాతలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేదు. ఈ పరిస్థితిని తట్టుకోలేకనే డిస్నీ ఇండియా భారత్ లో దుకాణం మూసేసింది. హిందీ సినిమాల నిర్మాణం నుంచి తప్పుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనదైనశైలిలో స్పందించారు. ఎలాంటి మోహమాటం లేకుండా బాలీవుడ్ అగ్రహీరోలను ఈ విషయంలో ఎండగట్టారు. ' షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి నటులు తమ పని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడితే నిర్మాతల పరిస్థితి ఘోరంగా మారిపోతున్నది. ముందే పారితోషికాలు తీసుకుంటుండటంతో సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు సులభంగా బయటపడుతున్నారు. దీనివల్ల ఒక్క డిస్నీయే కాదు భారత్ లోని చాలా నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. మున్ముందు మరిన్ని ప్రొడక్షన్ హౌస్ లు మూతపడుతున్నాయి' అని ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పేర్కొన్నారు. హాలీవుడ్ లో పారితోషికం పెద్ద విషయం కాదని, కానీ బాలీవుడ్ లో నటులు తమకు చెల్లింపులు అయిన తర్వాత నటించడానికి ఒప్పుకొంటారని, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఎవరి ఓటమి, గెలుపు కాదు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాంబే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడతానని, న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎవరి ఓటమి, గెలుపు కాదని వ్యాఖ్యానించారు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తన పని తాను చేశానని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి నిర్మాతకు ఉందని తెలిపారు. తమకు పెద్ద ఎత్తున మద్దతు రావడం పట్ల 'ఉడ్తా పంజాబ్' సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ, ప్రజలు, మీడియా నుంచి ఊహించని మద్దతు లభించిందని అన్నారు. -
ఒక్క కట్ చాలు..
‘ఉడ్తా పంజాబ్’కు 48 గంటల్లో సర్టిఫికెట్ ఇవ్వండి - సెన్సార్ బోర్డును ఆదేశించిన బాంబే హైకోర్టు - కాలానికి తగినట్టు మారాలని సీబీఎఫ్‌సీకి సూచన ముంబై: సెన్సార్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగాయి. సెన్సార్ బోర్డు సూచించిన 13 కత్తిరింపులతోకాక ఒకే కత్తిరింపుతో బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. 48 గంటల్లో ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డును ఆదేశించింది. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం ఇతివృత్తం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు తొలుత 89 కట్స్ చెప్పింది. రివ్యూ కమిటీ పరిశీలన తర్వాత 13కు కుదించింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆదేశాలను సవాలు చేస్తూ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు చెందిన పాంటామ్ ఫిల్మ్స్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు ఒక్క కట్‌తో చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 6న రివ్యూ కమిటీ సూచించిన సినిమాలోని మూత్ర విసర్జన సన్నివేశం తొలగింపు, డిస్‌క్లయిమర్‌లో మార్పులకు మాత్రం కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు అమ్మమ్మ మాదిరిగా వ్యవహరించొద్దని, కాలానుగుణంగా బోర్డూ మారాలని, కళలకు సంబంధించిన అంశాల్లో సీబీఎఫ్సీ ఓవర్ సెన్సిటివ్‌గా వ్యవహరించడం తగదని, సృ జనాత్మకతకు కోత విధించడం తగదని పేర్కొంది. సృజనాత్మక వ్యక్తులను అకస్మాత్తుగా ఆపడం తగదని, ఇది వారిని నిరుత్సాహానికి గురిచేస్తుందని, ఇది సృజనాత్మకతను చంపేస్తుందని పేర్కొంది. సెన్సార్ బోర్డు అధికారాలపైనా న్యాయస్థానం ప్రశ్నలు కురిపించింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అనే పదమే లేదంది. ఒక వేళ ఒక చిత్రంలో ఏమైనా కట్స్ చెప్పాలంటే అవి రాజ్యాంగబద్ధంగా, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలంది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా కోర్టు ఆదేశాలపై స్టే విధించాలన్న సెన్సార్ బోర్డు అభ్యర్థనను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను తాము చదివామని, ఇందులో పంజాబ్‌ను చెడుగా చిత్రీకరించేందుకు, భారత సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీసే అంశాలేవీ లేవని గుర్తించామని పేర్కొంది. అయితే ఈ చిత్రం, ఇందులోని పాత్రలు, ఫిల్మ్ మేకర్స్.. డగ్స్ వినియోగాన్ని, దుర్భాషలను ఏవిధంగానూ ప్రోత్సహించ డం లేదని డిస్‌క్లయిమర్‌లో మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. -
కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ
హృదయం... అన్నీ కావాలంటుంది! మైండ్... ‘అదెలా కుదురుతుంది’ అంటుంది! ‘సహజంగా ఉంటే చాలు... సహస్రకోటి భావాలకు వ్యక్తీకరణ ఉంటుంది’ అని హృదయం అనుకుంటే... ‘సహజంగా ఉండడానికి మనమేమన్నా పశువులమా, మృగాలమా? సహజం నాట్ ఎలౌడ్ ఇన్ సమాజం’ అని మైండ్ అంటుంది. మనిషికున్న అమూల్యమైన హక్కు - ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’. అలాంటి స్వేచ్ఛను వికసింపజేయాలన్నది... హృదయం ఆశ! భావప్రకటనకు కూడా హద్దులు ఉండాలన్నది మైండ్ మాట! హృదయంతో తీస్తున్న సినిమాలను... మైండ్‌తో కోస్తున్న సెన్సార్‌బోర్డ్ వైఖరికి హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ వివాదం తాజా ఉదాహరణ. ‘‘ఇది నాకూ, అక్కడ (సెన్సార్ బోర్డ్‌లో) అధికారంలో కూర్చొని, కొద్దిమంది గొప్పవాళ్ళ చేతిలోని రాజ్యంలా వ్యవహరిస్తున్న ఒక నిరంకుశుడికీ మధ్య జరుగు తున్న పోరు. ఇదంతా చూస్తుంటే, నేను ఏ ఉత్తర కొరియాలోనో ఉన్నట్లుంది.’’- ‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సహ నిర్మాత, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక సృజనశీలి కడుపు చించుకొని వచ్చిన ఆవేశం ఇది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్ళపై సమాజంలోని అనేక మంది సినీ కళాకా రుల ఆక్రందనకు అద్దం ఇది. అవును. సమాజానికి దర్పణం పట్టాల్సిన సినిమాలో, సృజనాత్మక భావ వ్యక్తీకరణకు వేదిక అయిన సినిమాలో... మన చుట్టూ కళ్ళెదురుగా జరుగుతున్నది చూపిస్తే తప్పు అంటే ఆవేదన, ఆవేశం కాక ఏమొస్తాయి? ఇవాళ భారతీయ సినీ ప్రపంచమంతా హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ (కొత్త హుషారుతో ఎగసిపడుతున్న పంజాబ్ అని స్థూలంగా అర్థం) గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది అందుకే! ఈ నెల 17న రిలీజ్ కావాల్సిన ఈ హిందీ సినిమా పంజాబ్‌లో పెచ్చ రిల్లిన డ్రగ్స ఉపద్రవంపై తీసిన సమకాలీన సినిమా. అయితే, అలా తీయ డమే ఇప్పుడు ఇబ్బందిగా తయారైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సార్ బోర్డ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపడం మొదలుపెట్టింది. దాంతో, దేశంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ సైతం రాజకీయ ఒత్తిళ్ళకు అతీతం కాదని మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి, 2015లో పగ్గాలు చేపట్టిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ సారథ్యంలోని సెన్సార్‌బోర్‌డపై విమర్శలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఆధునిక జీవితంలో సర్వసాధారణమై పోయిన కొన్ని తిట్లని సైతం సినిమాలో అనుమతించేది లేదంటూ బోర్డ గత ఏడాది ఒక జాబితానే సిద్ధం చేసింది. ఫలానా సినిమా ఏ వయస్సువాళ్ళు చూడచ్చో నిర్దేశిస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడమే బాధ్యతగా ఉండాల్సిన సెన్సార్ బోర్డ ‘నైతిక పోలీసింగ్’ చేయసాగింది. సెన్సార్‌వ్యవస్థపై బాగా విమర్శలు రావడంతో కొన్ని నెలల క్రితం దర్శకుడు శ్యావ్‌ుబెనెగల్ సారథ్యంలో ఒక సిఫార్సుల సంఘాన్ని కేంద్రం వేసింది. సినిమాల్ని కట్ చేసి పారేయడం కాక, 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకీ, పెద్దలకీ మాత్రమే అంటూ రకరకాల వర్గీకరణ చేయాల్సిందిగా ఆ సంఘం సిఫార్సులూ చేసింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామన్న ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని పట్టించుకొన్న పాపాన లేదు. ఇవాళ ‘ఉడ్తా పంజాబ్’పై కత్తెర వేటు దానికి తాజా ఉదాహరణ. సామాజిక ఉపద్రవమైన డ్రగ్స గురించి సినిమాల్లో ప్రస్తావిస్తే తప్పే మిటని అనురాగ్ వాదన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘‘ఉడ్తా పంజాబ్ ఒక నిజాయతీ సినీ ప్రయత్నం. ఈ సిన్మాను వ్యతిరేకి స్తున్న పార్టీలు, వ్యక్తులు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లే లెక్క!’’ వాస్తవ పరిస్థితులపై అందరి దృష్టీ పడేలా చేసి, జనాన్ని జాగృతం చేసే ప్రయత్నాలకు కత్తెర అడ్డం పెడితే తప్పెవరిది? తీసినవాళ్ళదా? కట్ చేసిన వాళ్ళదా? మీ పిల్లలు డ్రగ్స్ బారినపడ్డారా? ఇవాళ హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతు న్నట్లు ఆరోపణలున్నాయి. యుక్తవయస్సులోని వారు తెలిసీ తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అలా ఇరుక్కున్నవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే... కళ్ళు ఎర్రబారి ఉంటాయి. కనుపాప సాధారణం కన్నా మరీ చిన్నది, లేదా పెద్దది అయిపోతుంది ముక్కుతో పీల్చే కొకైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు వెంట తరచూ రక్తం కారుతుంటుంది తిండి, నిద్ర అలవాట్లు మారిపోతాయి. అకస్మాత్తుగా బరువు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది శ్వాసలోనూ, ఒంటి నుంచి, దుస్తుల నుంచి అసాధారణ వాసనలు వస్తాయి కాళ్ళూ చేతులు వణకడం, మాట నత్తిగా రావడం, మనిషిలో కుదురు లేకపోవడం కనిపిస్తాయి క్లాసులు తరచూ ఎగ్గొడుతుంటారు. ఆటపాటలు, హాబీల మీద ఆసక్తి పోతుంది వినే సంగీతం, వేసుకొనే దుస్తులు, గదిలోని పోస్టర్లపై డ్రగ్స్, మద్యం అలవాట్లను ప్రతిబింబిస్తుంటాయి చటుక్కున మూడ్స్ మారిపోతుంటాయి. తరచూ తగాదాలకు దిగుతుంటారు. ఎవరితోనూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరు. గది తలుపులు ఎప్పుడూ బిడాయించుకొని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. సెన్సార్‌తో సమస్యేంటి? ఏం తీసేయమంటోంది? పంజాబ్‌లో కేవలం మరో 9 నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని డ్రగ్స్ ఉపద్రవంపై అభిషేక్ చౌబే దర్శకత్వంలో రూపొందిన ‘ఉడ్తా పంజాబ్’ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది. సినిమా గనక అలాగే రిలీజైతే తమకు కష్టమని అధికార ‘శిరోమణి అకాలీదళ్’ (కేంద్రంలో గద్దెపై ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌లో భాగస్వామ్యపక్షం) సహజంగానే భావించింది. మొదట 40... ఇప్పుడు 89 కట్స్! నిజానికి, మొదట ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ’ (సి.బి.ఎఫ్.సి. జనం భాషలో ‘సెన్సార్ బోర్డ్’) 40 కట్స్ చేయా లంది. సినిమాలోని భాష, డ్రగ్స్ వినియోగ దృశ్యాలపై ఈ కట్స్ ఇచ్చింది. నిర్మాతలు దీనిపై అప్పీలు చేసుకున్నారు. కట్స్ లేకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తారని ఆశించారు. కానీ, సినిమా చూసిన ‘రివైజింగ్ కమిటీ’ (ఆర్.సి) ఏకంగా సినిమా పేరులో ఉన్న ‘పంజాబ్’ అనే పదాన్నే తొలగించమంది. మొత్తం 89 కట్స్ చేయాలంది. పంజాబ్ రాష్ట్రం పేరు, రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తొలగించాలంది. ‘వాస్తవికతను చూపించడం’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహలానీకి నచ్చినట్లు లేదు. దాంతో, అసలు ఈ సినిమా కథ అంతా ఏ రాష్ట్రంలోనూ జరిగినట్లు కాకుండా, ఎక్కడో కల్పిత ప్రాంతంలో జరిగినట్లు చూపమని బోర్డ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బోర్డ్ వర్గాలు ఆ వార్తల్ని ఖండిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదంటూ, ‘‘మేము కేవలం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపాం. కావాలంటే, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించవచ్చు’’ అంటున్నాయి. సినీ వివాదాలు... నిషేధాలు... మూకీల కాలం నుంచి మన భారతీయ సినిమాకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. మతం, రాజకీయాలు, సెక్స్ లాంటి అంశాల కారణంగా సినిమాల్లో భావప్రకటన స్వేచ్ఛకు చాలా సార్లు సంకెళ్ళు పడ్డాయి. తెలుగునాట పెద్ద ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’, ‘శ్రీమద్వి రాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’ సహా పలు చిత్రాలు సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్నాయి. విప్లవ చిత్రాల మాదాల రంగారావు ‘విప్లవ శంఖం’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్రమట్టి’ లాంటి చిత్రాల రిలీజ్ కోసం సెన్సార్‌బోర్డ్‌తో, ప్రభుత్వంతో పోరాటాలు, నిరాహార దీక్షలు చేయాల్సొచ్చింది. గత 4 దశాబ్దాల్లో వచ్చిన వివాదాల్లో కొన్ని... 1972 ‘సిద్ధార్థ’: పంపిణీ నుంచి నిషేధించిన తొలి చిత్రం. నటి సిమీ గరేవాల్ నగ్న సన్నివేశం కారణం. చివరకు 1996లో టీవీలో రిలీజ్ చేశారు. 1975 ‘ఆంధీ’: ఇందిరా గాంధీతో పోలికలున్నాయంటూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో నిషేధించారు. తర్వాత గద్దె నెక్కిన జనతాపార్టీ ప్రభుత్వం రిలీజ్‌కు అనుమతించింది. 1978 ‘కిస్సా కుర్సీ కా’: ‘ఎమర్జెన్సీ’లో సంజయ్ గాంధీ అనుసరించిన విధానాలపై రాజకీయ వ్యంగ్య చిత్రం. సినిమా మాస్టర్ ప్రింట్‌నూ, కాపీలనూ సెన్సార్ బోర్డు నుంచి తీసుకెళ్ళి, కాల్చేశారు. తర్వాత కొంతకాలానికి సినిమా రిలీజైంది. 1994 ‘బ్యాండిట్ క్వీన్’: ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా లేదంటూ మాజీ బందిపోటు రాణి ఫూలన్‌దేవి వాదన. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం. 1996 ‘ఫైర్’: హిందూ కుటుంబంలోని ఆడవారి మధ్య స్వలింగ సంపర్కం గురించి చూపారు. దర్శకురాలు దీపా మెహతాను చంపుతామంటూ బెదిరింపులొచ్చాయి. దాంతో, సెన్సార్ బోర్డ్ తలొగ్గింది. తర్వాత కట్స్ ఏమీ లేకుండానే రిలీజ్. 1996 ‘కామసూత్ర... ఎ టేల్ ఆఫ్ లవ్’: మీరా నాయర్ తీసిన సినిమా. దృశ్యాలు మరీ ‘బాహాటంగా’ ఉన్నా యని వాదన. అన్నీ బాగా తగ్గించేసిన వెర్షన్ రిలీజ్. 2003 ‘పాంచ్’ : 1976 -77 ప్రాంతంలో జరిగిన జోషీ - అభ్యంకర్ వరుస హత్యలపై అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. సెన్సార్‌బోర్డ్ చాలా కట్స్‌తో అనుమతించింది. 2004 ‘బ్లాక్ ఫ్రైడే’: 1993 నాటి బొంబాయి పేలుళ్ళపై తీసిన సినిమా. ప్రభావం చూపుతుందంటూ, తీర్పు వచ్చేదాకా రిలీజ్ ఆపేశారు. ఆనక 2007లో రిలీజ్. 2005 ‘పర్జానియా’: గుజరాత్ అల్లర్లపై సినిమా. నేషనల్అవార్డ్ వచ్చింది. గుజరాత్లో నిషేధించారు. 2005 ‘వాటర్’: వారణాసిలోని వితంతువుల అవస్థపై దీపా మెహతా తీసిన సినిమా. ఛాందసవాదుల విధ్వంసంతో శ్రీలంకలో సిన్మా తీశారు. 2007లో ఇండియాలో రీరిలీజ్. 2013 ‘మద్రాస్ కేఫ్’: రాజీవ్ గాంధీ హత్య, శ్రీలంక అంతర్యుద్ధంలో భారత జోక్యం చుట్టూ తిరిగే సినిమా. తమిళనాట ప్రదర్శించనివ్వలేదు. 2015 ‘ఎం.ఎస్.జి - ది మెసెంజర్ ఆఫ్ గాడ్’: పంజాబ్‌లోని ‘దేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, ప్రచారం చేసిన సినిమా. పలు సిక్కు వర్గాలు సినిమాను నిషేధించాలని ఆందోళన చేశాయి. 2015 జనవరిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తరువాత కొంతకాలానికి కట్స్‌తో ఇచ్చింది. ‘‘ఈ ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను నిషేధించే బదులు పంజాబ్ ప్రభుత్వం ‘ఉడ్తా’ (ఎగసిపడుతున్న) డ్రగ్స్‌ను నిషేధించాలి. అది చేతకాకపోతే, వాళ్ళు తమను తాము నిషేధించుకోవాలి!’’ - రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘ఈ దేశంలో అత్యంత విలువైన ఆస్తి అయిన భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ, దేశ పురోగతి గురించి ఎంత డబ్బా కొట్టుకొన్నా అది అర్థం లేని పని.’’- మహేశ్‌భట్, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘నా ఈ పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ఇది కేవలం నా హక్కులకూ, సెన్సార్‌షిప్‌కూ మధ్య జరుగుతున్న పోరాటం. ... మిగిలినవాళ్ళు వారు పోరాటాలు వారు చేసుకోండి. నా పోరాటానికి ఎలాంటి రాజకీయ రంగులూ పులమద్దు.’’ - అనురాగ్ కశ్యప్, ‘ఉడ్తా పంజాబ్’ సహ-నిర్మాత, ప్రముఖ దర్శక - రచయిత ‘‘సెన్సార్ బోర్డ్ పనిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోదు. నా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదు. సినిమా పూర్తిగా చూస్తే కానీ, మేము ‘పంజాబ్’ అనే పదం ఎందుకు తొలగించ మన్నామో మీకు అర్థం కాదు. ...అనురాగ్ కశ్యప్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆయన ‘ఉత్తర కొరియా’ అనీ, మరొకటనీ ఏమైనా అనగలుగుతున్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు నేను విన్నాను. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు.’’ - పహ్లాజ్ నిహలానీ, కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ - ప్రముఖ నిర్మాత -
'అనవసర కామెంట్స్ చేయను'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ నిరాకరించింది. ఈ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్స్ చెప్పడంతో దుమారం రేగింది. సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బహిరంగంగా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అనురాగ్- ఏక్తా కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించేందుకు ఏక్తా నిరాకరించింది. 'మా అభిప్రాయాలను అధికార ప్రతినిధి ద్వారానే వెల్లడించాలని నేను, కశ్యప్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ వివాదంపై నేను మాట్లాడను. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను అనవసరంగా ఎటువంటి కామెంట్స్ చేయన'ని స్పష్టం చేసింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన తన తాజా చిత్రం 'ఎ స్కాండల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొంది. -
'ఫిలిమ్ ఇండస్ట్రీని అవమానించారు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమాకు బాలీవుడ్ నటులు, దర్శకులు బాసటగా నిలిచారు. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ పై అసత్య ఆరోపణలు చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహలానీ క్షమాపణలు చెప్పాలని దర్శకులు డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు మీడియాతో మాట్లాడారు. మన దేశం సౌదీ అరేబియాలా మారరాదని దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. సమాజంలో జరిగిన వాటినే సినిమాలు మలుస్తున్నామని, ఊహించి లేదా సృషించి సినిమాలు తీయడం లేదని మరో దర్శకుడు రాహుల్ దొలాకియా తెలిపారు. ఈ సినిమాలోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని హీరో షాహిద్ కపూర్ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా సినిమా వర్గాలు సైలెంట్ గా మద్దతు తెల్పుతుంటాయని, మొదటిసారిగా ఒక సినిమాకు బహిరంగంగా సపోర్టు చేస్తున్నారని నటుడు, దర్శకుడు సతీశ్ కౌషిక్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ ధ్వజమెత్తారు. -
'ప్లీజ్.. మూవీపై అలా ప్రచారం చేయవద్దు'
షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఒకేతెరపై కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. అలియా భట్ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ మూవీపై నిషేధం విధించారని వస్తున్న వదంతులపై ఉత్తా పంజాబ్ నిర్మాతలలో ఒకరైన అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఆ మూవీపై ఎవరూ బాన్ చేయలేదని, కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడానికి నిరాకరించారని ట్వీట్ చేశారు. షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజులు అయిన ఈ సినిమాకు సర్టిఫికేట్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. దయచేసి ఈ సినిమాపై నిషేదం విధించారని వదంతులను మాత్రం ప్రచారం చేయవద్దని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమాలో డైలాగుల్లో ఎక్కువగా అసభ్యపదాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ భావించిందని, ఆ సీన్లను కొంతవరకు కట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చిత్ర యూనిట్ మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం కట్ చేసే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోంది.. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది. For the record ,"Udta Punjab" is not banned. The examining committe has deferred the decision to Revising and due process is on. — Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016 A film is banned only when examining, revising and FCAT all three refuse certificate . And then you fight it out in Supreme Court — Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016 -
రామన్ రాఘవ్ ఏం చేశాడు?
ముంబై: విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్ ప్రధానపాత్రల్లో నటించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడుదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో ఈ పోస్టర్ ను పెట్టారు. చేతివేళ్లను గుండ్రంగా మడిచి ఎర్రటి కళ్లతో చూస్తున్న నవాజుద్దీన్ వెనుక రక్తంతో తడిసిన ఇనుప రాడ్లు ఉన్నట్టుగా ఫొటోలో చూపించారు. మొత్తం పోస్టర్ నీలం రంగులో ఉంది. క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ నోటోరియస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. 1960 దశకంలో ముంబైని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. 1960లో 23 మందిని, 1968లో డజను మందిని హత్య చేసినట్టు పోలీసులకు పట్టుబడినప్పుడు అతడు అంగీకరించాడు. అయితే అతడు చేసిన హత్యలు ఇంకా ఎక్కువే ఉంటాయని పోలీసులు అనుమానించారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్ పోస్టర్లను అనురాగ్ కశ్యప్ ఆదివారం విడుదల చేశారు. 69వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ లో 'డాక్టర్స్ ఫోర్ట్ నైట్' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. తెరపై రామన్ రాఘవ్ ఏం చేశాడో చూడాలంటే చిత్రం జూన్ 24 వరకు ఆగాల్సిందే. -
'చూద్దాం ఎవరు నన్ను జైల్లో పెడతారో'
ముంబై: డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రాంరహీం సింగ్‌ను అనుకరించి హాస్యం పండించినందుకు టీవీ నటుడు, కామెడియన్ కికు శార్దాను అరెస్టు చేయడంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రంగా ప్రతిస్పందించింది. కికు శార్దాకు అండగా నిలిచింది. తనను తాను 'రాక్‌స్టార్ బాబా'గా పేర్కొంటూ సినిమాలు చేస్తున్న గుర్మీత్‌సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు గుర్మీత్‌సింగ్ తీరును తప్పుబట్టారు. కికు శార్దాకు మద్దతుగా బాలీవుడ్ అలనాటి హీరో రిషీకపూర్ ట్విట్టర్లో స్పందించారు. గుర్మీత్ సింగ్ ఫొటోను చూపిస్తూ 'ఈ ఫొటోను చూడండి. ఈ రాక్‌స్టార్ తరహాలో నేను సినిమాలో నటించాలనుకుంటున్నా. చూద్దాం నన్ను ఎవరు జైల్లో పెడతారో' అని ట్వీట్ చేశారు. ఆరో తరగతి పాసై.. ఎంఎస్‌జీ వంటి సినిమాలు తీసే గుర్మీత్ రాం రహీంను ఎందుకు అరెస్టు చేయలేదని అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఘోర కలియుగంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయంటూ నెటిజన్లు కూడా కికు శార్దాను అరెస్టును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో ఫేమస్ అయిన కికు శార్దా తాను గుర్మీత్సింగ్ను అనుకరించడంపై క్షమాపణలు చెప్పారు. అయినా ఆయనను అరెస్టుచేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. దీనిపై స్పందించిన గుర్మీత్‌సింగ్ కికు శార్దాను క్షమిస్తున్నట్టు తెలిపారు. See this picture!I would like to play this rockstar in a film. Let me see who puts me behind bars? Go Kiku Sharda! pic.twitter.com/8Dfre237NY — rishi kapoor (@chintskap) January 13, 2016 -
తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!
‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్. తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట. అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ! -
'సినిమా పరాజయానికి దర్శకుడిదే బాధ్యత'
ముంబై: సినిమా పరాజయానికి దర్శకుడిదే బాధ్యతని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. ప్రాజెక్ట్ చేయాలా వద్దా అని నిర్ణయించే అధికారం దర్శకుడికి మాత్రమే ఉంటుందని చెప్పారు. 'సినిమా విజయవంతమైతే ఆ ఘనత యూనిట్ మొత్తానికి చెందుతుంది. అదే సినిమా ఫెయిలయితే దర్శకుడిదే బాధ్యత' అని అనురాగ్ కశ్యప్ అన్నారు. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2015 ప్రివ్యూకు హాజరైన కశ్యప్ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాజెక్ట్ అయినా నచ్చనపుడు దాన్ని తిరస్కరించకుంటే దర్శకుడు విఫలమైనట్టేనని చెప్పారు. ఏ చిత్రాన్నయినా తీయాలా వద్దా అనే విషయాన్ని తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. కశ్యప్ ఇటీవల బాంబే వెల్వెట్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలు తీశారు. -
మూడో భాగానికి దర్శకుడి మార్పు
బాలీవుడ్లో రెండు భాగాలుగా విడుదలై మంచి విజయం సాధించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' సిరీస్ లో ఇప్పుడు మూడో భాగాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మాఫీయా, గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు అనురాగ్ కశ్యప్ దర్శకుడు, జైషాన్ ఖాద్రీ కథా కథనాలు అందించారు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో భాగానికి మాత్రం అనురాగ్ దర్శకత్వం వహించటం లేదు. తొలి రెండు భాగాలకు కథా రచయితగా వ్యవహరించిన ఖాద్రి మూడో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. 'మిరుతియా గ్యాంగ్ స్టర్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఖాద్రి ఆ సినిమా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించాడు. 'మిరుతియా గ్యాంగ్స్టర్స్' ప్రివ్యూ చూసిన అనురాగ్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' మూడో భాగానికి కథ రెడీ చేయాల్సిందిగా కోరారని, ఆ సినిమాకు తననే దర్శకత్వం కూడా వహించాల్సిందిగా సూచించారని తెలిపారు. ఇప్పటికే ఆ మూవీ కోసం లైన్ వినిపించానన్న ఖాద్రి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. -
సెప్టెంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు అనురాగ్ కశ్యప్ (దర్శకుడు), అతుల్ కులకర్ణి (నటుడు) జయం రవి (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది. ఎంతోకాలంగా ఉన్న కోర్టుకేసులలో విజయం కలుగుతుంది. విద్యార్థులు మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. యూనిఫారం ధరించే ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అయితే కుజుని ప్రభావం వల్ల ఆయుధ లేదా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తత అవసరం. అదేవిధంగా అనాలోచితమైన మాటతీరు వల్ల ఎనలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడటం మంచిది. వీరి పుట్టిన తేదీ అయిన 10 సూర్యునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ కార్యాన్నైనా ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా, ధైర్యసాహసాలతో చేసి, మంచి పేరు తెచ్చుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరెంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్ ; లక్కీ డేస్: మంగళ, గురు, ఆదివారాలు. సూచనలు: గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరోగ్యపరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యారాధన, శివాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, వికలాంగులకు ఊతమివ్వడం, సోదరులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్
ఇటీవలి కాలంలో సినిమాల కంటే డాక్యుమెంటరీలే నయంగా ఉంటున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అంటున్నారు. దివంగత పాప్ గాయని అమీ వైన్హౌస్పై రూపొందించిన ‘అమీ’ డాక్యుమెంటరీని తిలకించిన తర్వాత కాశ్యప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథాచిత్రాలతో పోలిస్తే, ఇటీవలి కాలంలో వస్తున్న డాక్యుమెంటరీలే ప్రభావశీలంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. -
'ఆ సినిమా చూడాలనుకుంటున్నా'
ముంబై: రణవీర్ కపూర్ హీరోగా నటించిన 'బాంబే వెల్వెట్' సినిమాను చూడాలనుకుంటున్నట్టు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఈనెల 15న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చరిత్రకారుడు జ్ఞాన్ ప్రకాశ్ రాసిన 'ముంబై ఫ్యాబ్లెస్' పుస్తకం ఆధారంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను తెరకెక్కించారు. సోషల్ మీడియాలో 'బాంబే వెల్వెట్'ను వెక్కిరిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారని, తానింకా సినిమా చూడలేదని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూశానని, యూనిట్ బాగా కష్టపడినట్టు తెలుస్తోందన్నారు. ఈ సినిమా బాలేదనడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇప్పటికీ ఈ సినిమా చూడాలనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'బాంబే వెల్వెట్' కోసం ముందుగా ఆమిర్ ఖాన్ ను అనురాగ్ కశ్యప్ సంప్రదించాడు. ఏడాది వేచి చూసిన తర్వాత రణబీర్ కపూర్ తో తీశాడు. పీకూ, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలు కూడా చూడాలనుకుంటున్నానని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. -
నా సినిమా ప్లాప్ అంటున్న డైరెక్టర్
-
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'
ముంబై: దక్షిణాది నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో ఆదివారం నుంచి వాట్సప్ లో చక్కర్లుకొడుతుండటంతో దర్శకుడు ముంబాయి పోలీసులని ఆశ్రయించారు. ఈ వీడియో క్లిప్‌లు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్లోవి. తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్‌చిత్రంలో హీరోయిన్గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటించింది. కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం. -
‘బాబు’కు కోపమొచ్చింది!
ఒకరు తీసుకున్న నిర్ణయం మరెవరికో ఇబ్బంది కలిగించడమంటే ఇదే! మనం ‘బాబు’ అని పిలుచుకొనే హీరోలకు ఎవరికి కోపమొచ్చినా, ఆ దెబ్బ దర్శక - నిర్మాతల మీదే పడుతుంది. తాజాగా, యువ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కోపం రావడంతో, దర్శకుడు - రచయిత అనురాగ్ కాశ్యప్ పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. వాళ్ళిద్దరూ మిత్రులే కదా, మరి విషయం ఏమిటయ్యా అంటే... దానికో పెద్ద కథే ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పత్రికా విలేకరుల సమావేశాల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా, తాజా చిత్రం ‘బాంబే వెల్వెట్’ చిత్ర ప్రచారానికి రావడానికి హీరో రణ్‌బీర్ కపూర్ నిరాకరిస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమా ప్రచారం కోసం ఏ కార్యక్రమం పెట్టినా, పత్రికా విలేకరులు పనిలో పనిగా నటి కత్రినా కైఫ్‌తో ఉన్న అనుబంధం గురించి, ఇద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారనీ రణ్‌బీర్‌ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. దాంతో చిర్రెచ్చుకొచ్చిన రణ్‌బీర్ ‘బాంబే వెల్వెట్’ ప్రచార కార్యక్రమాలను వీలైనంత తగ్గించుకుంటున్నాడు. కొద్దిపాటి మీడియా వాళ్ళతోనే మాట్లాడేందుకు మొగ్గుచూపుతున్నారు. దాంతో, దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌కు చిక్కొచ్చిపడింది. క్రితంసారి కూడా రణ్‌బీర్ ఇలాగే ‘రాయ్’ చిత్రం ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఆ దెబ్బ ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్ళపై పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకూ అదే ఇబ్బంది వస్తుందేమోనని అనురాగ్ తెగ భయపడుతున్నారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఆసక్తికరమైన అంశాలే అయినా, వాళ్ళ ప్రతిభా ప్రదర్శన సంగతి వదిలేసి, కేవలం వ్యక్తిగత విషయాల పైనే దృష్టి పెడితే ఎలాగన్నది రణ్‌బీర్ సమర్థకుల వాదన. అయితే, కష్టపడి, బోలెడంత ఖర్చుపెట్టి తీసిన సినిమా ప్రచారానికి హీరో గారు రాకపోతే, వసూళ్ళు ఎలాగన్నది దర్శక, నిర్మాతల బాధ. మరి, మిత్రుడైన రణ్‌బీర్‌ను అనురాగ్ ఎలా ఒప్పిస్తారో వేచిచూడాలి. -
'పీకే' తెలివైన సినిమా: కశ్యప్
ముంబై: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. మత సంబంధ సున్నితమైన విషయాన్ని చాలా తెలివిగా తెరకెక్కించారని అన్నారు. 'ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను చాలా తెలివిగా తీశారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా మతం, దేవుడు, స్వాములపై సినిమా తీయడం మామూలు విషయం కాదు. రాజ్‌కుమార్ హిరానీ ఎంతో సాహసంతో ఈ సినిమా తెరకెక్కించారు' అని అనురాగ్ కశ్యప్ ప్రశంసించారు. తాము ఇలాంటి సినిమాలు వెనుకాడతామని, కాని హిరానీ, నిర్మాత విదూ వినోద్ చోప్రా, హీరో ఆమిర్ ఖాన్ ధైర్యంగా ముందుకెళ్లారని పేర్కొన్నారు. -
అలసిపోయా.. అందుకే చెయ్యట్లేదు: శిల్పా
అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడి నుంచి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఓ నటి మాత్రం తాను నటించలేను.. వద్దనేసింది. చక్ దే ఇండియా, ఖామోష్ పానీ లాంటి చిత్రాల్లో నటించి.. మంచి పేరు సంపాదించుకున్న శిల్పా శుక్లా కేవలం విశ్రాంతి కోసం 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సినిమాలో నటించనని తెగేసి చెప్పింది. తాను బాగా అలసిపోయానని, బెనారస్‌కు వెళ్లి అక్కడ కొంతకాలం పాటు ఉన్నానని, కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాలనే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తాను ఒప్పుకొన్న 'కఫిన్ మేకర్' చిత్రాన్ని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానని శిల్పా (32) చెప్పింది. వరుసపెట్టి సీరియస్ పాత్రలు చేసిన తర్వాత.. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తోంది. ఇప్పుడు తాను వరుసగా రెండు కామెడీ చిత్రాల్లో నటిస్తున్నానని, దాంతో ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ మారుతుందని అంటోంది. మరోవైపు లడఖ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని కూడా ఆమె ఆస్వాదించింది. అక్కడ ప్రదర్శించే ఇరానీ చిత్రాలను చూడాలని భావిస్తున్నట్లు తెలిపింది. -
సినిమాలో సినిమా నటుడిగా!
‘‘ఇప్పటివరకూ ఎన్నో రకాల పాత్రలు చేశాను. కానీ, సినిమాలో సినిమా నటుడిగా చేయడం కొత్త అనుభూతినిస్తోంది. ఇది అతిథి పాత్రే అయినప్పటికీ నిడివి తక్కువేం కాదు’’ అని అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఏడు పదుల వయసులోనూ ఆయన ఉత్సాహవంతంగా సినిమాలు, టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ‘గూమ్కేతు’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వంలో విక్రమాదిత్య మొత్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమాదిత్య కోసమే ఈ సినిమా అంగీకరించానని అమితాబ్ చెబుతూ - ‘‘విక్రమ్ రూపొందించిన ‘ఉడాన్’ నాకు చాలా ఇష్టం. మంచి వ్యక్తులతో కలిసి ఆయన నిర్మి స్తున్న ఈ చిత్రంలో నటించాలనిపించింది. పైగా, సినిమాలో సినిమా నటుడిగా నటించాలన్నారు. దాంతో థ్రిల్ అయ్యాను. మామూలుగా ఇతర చిత్రాల షూటింగ్‌కి మేకప్ వేసుకుని లొకేషన్‌కి వెళుతుంటాను. కానీ, ఈ సినిమాలో నేను స్టార్‌ని కాబట్టి, మేకప్ వేసుకుని, షూటింగ్‌కి తయారవ్వడం... ఇలా అన్నింటినీ చిత్రీకరిస్తున్నారు. సో.. నేను షూటింగ్‌కి ఎలా రెడీ అవుతానో ప్రేక్షకులు ఈ సినిమాలో చూడొచ్చు. ఇందులో నేను పలు రకాల గెటప్స్‌లో కనిపించబోతున్నాను’’ అన్నారు. -
ప్రశంసలు ఇచ్చే కిక్కే వేరబ్బా!
లైఫ్‌బుక్: అదితీరావ్ హైదరి చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ ఒక విషయం చెప్పేవారు... ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే...వాటిని జాగ్రత్తగా మనసులో దాచుకోండి. మీలో ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినప్పుడు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎంతో శక్తి వచ్చినట్లుంటుంది’’ అని. ఈ సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. అమితాబ్, మీరా నాయర్, అనురాగ్ కశ్యప్...మొదలైన వారు మెచ్చుకున్న సందర్భాలను తరచుగా గుర్తు తెచ్చుకుంటాను. యౌవనం అంటేనే పెద్ద అలంకరణ. మళ్లీ ప్రత్యేకంగా అలంకరించుకోవడం ఎందుకనేది నా భావన. వీలైనంత ఎక్కువగా మేకప్‌కు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అందంగా కనిపిస్తాం. నేను నటించిన సినిమాలు నాకు ఒక విషయాన్ని చెప్పాయి. ‘‘స్వేచ్ఛగా జీవించు. గౌరవంగా జీవించు’’ అని. అలా అని విశృంఖలమైన స్వేచ్ఛను ఇష్టపడను. గౌరవంగా జీవించగలిగే స్వేచ్ఛను ఇష్టపడతాను. సిఫారసులతో మంచి పాత్రలు వస్తాయని నేను అనుకోను. మనలో నటించే సత్తా ఉంటే ఎలాంటి సిఫారసులూ అక్కర్లేదు. అయితే విధి కూడా మన విషయంలో కాస్త చల్లని చూపు చూడాలి. ‘నేను ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కొన్ని సందర్భాలలో వాటి వల్ల కెరీర్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా పట్టించుకోను. మనసుకు నచ్చని పని చేయను. శక్తిసామర్థ్యాలు ఎక్కడి నుంచో రావు. మన ఇష్టం నుంచే వస్తాయి. మనకు ఒక పని మీద ఇష్టం ఉంటే, శక్తిసామర్థ్యాలు వాటంతట అవే బయటపడతాయి. ఇష్టం లేక పోతే ఉన్నవి కూడా వెనక్కి పోతాయి. -
టీవీ సీరియల్లో బిగ్ బీ
‘‘భారతీయ సినిమా వయసు వందేళ్లు. ఈ వందేళ్లల్లో సినిమా ఎంతో ఎదిగిన విషయం తెలిసిందే. వెండితెర అంత వయసు బుల్లితెరకు లేకపోయినా.. దాని ఎదుగుదల మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేను, ఇరవై ఏళ్లల్లో సినిమా వసూళ్లను సైతం తగ్గించే స్థాయికి బుల్లితెర ఎదిగింది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఇప్పుడో ధారావాహికలో నటిస్తున్నారు. ‘యుద్ధ్’ పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్లో అమితాబ్ పాత్ర పేరు ‘యుధిష్ఠిర్’. ఈ ధారావాహిక గురించి బిగ్ బీ చెబుతూ -‘‘ఎప్పటి నుంచో ఓ సీరియల్లో నటించాలనుకున్నా. ‘యుద్ధ్’ కథాంశం, పాత్ర నచ్చడంతో నటించాలనుకున్నా. దర్శకుడు అనురాగ్ కశ్యప్ విభిన్న తరహాలో ఈ సీరియల్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ, అద్భుతంగా తీస్తున్నారు’’ అని చెప్పారు. ఈ సీరియల్లో నటించడమే కాదు.. యశ్‌రాజ్ ఫిలింస్‌తో కలిసి దీన్ని ఆయన నిర్మిస్తున్నారు కూడా. ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఆరోగ్యం, ఇతర విషయాలపరంగా అతను ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంతో అతని అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. అతని జీవితమే ఓ యుద్ధంలాంటిది కాబట్టే, ‘యుద్ధ్’ అని టైటిల్ పెట్టారు. -
చిత్రమైన నిశ్శబ్ద లఘు చిత్రం!
ఆ మధ్య కమల్‌హాసన్‌తో కలసి తమిళంలో ‘ఉన్నై పోల్ ఒరువన్’, తెలుగులో ‘ఈనాడు’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు చక్రి తోలేటి గుర్తున్నాడా? హిందీ హిట్ ‘ఎ వెడ్నెస్ డే’ను అలా రెండు భాషల్లో రీమేక్ చేసిన చక్రి చిన్నప్పుడు ‘సాగర సంగమం’ చిత్రంలో ఓ బుజ్జి కెమేరా పట్టుకొని, ‘‘భంగిమ’’ అంటూ తిరిగిన బాల నటుడు. పెద్దయ్యాక, దర్శకుడయ్యాడు. తాజాగా చక్రి ‘అన్‌రీడ్’ అనే మాటలు లేని ఓ సెలైంట్ లఘు చిత్రం రూపొందించాడు. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో, కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండే కెమేరాతో చిత్రీకరించారు. వీధుల్లో తిరుగుతూ, తిండి కోసం కష్టపడే ఓ అబ్బాయికి ఓ రోజు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలే ఈ చిత్రం. పాతకాలం పద్ధతుల్లో లాగా కెమేరా కదలకుండా స్థిరంగా ఉంటే, నటీనటులే ఫ్రేములోకి వస్తూ వెళుతూ ఉండేలా చిత్రీకరణ జరపడం కొత్త అనుభవమని చక్రి అన్నారు. మనసుకు హత్తుకుపోయే కథతో లఘు చిత్రాలు తీయమంటూ సీగ్రామ్స్ సంస్థ ప్రసిద్ధ దర్శకులు అనురాగ్ కాశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వారితో పాటు చక్రిని కోరింది. అందులో భాగంగా చక్రి ఈ చిత్రం తీశారు. దీని చిత్రీకరణ కోసం మామూలు సినీ కళాకారులను కాకుండా, బస్తీలలోని వ్యక్తులను చక్రి ఎంచుకున్నారు. మూకీ చిత్రాల రోజుల్లో లాగా ఇందులోనూ సన్నివేశాల మధ్యలో సంభాషణల టైటిల్ కార్డులు వస్తూ, అప్పటి చిత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. ‘బాక్సాఫీస్ లెక్కల ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా చిత్రీకరించే సౌకర్యం లఘు చిత్రాలకు ఉందని, ఇది మనసు పెట్టి చేసిన ప్రయత్నం అని’ చక్రి తోలేటి అన్నారు. ‘యు’ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ‘అన్‌రీడ్’ లఘు చిత్రం వీక్షకుల మనసుల్ని కూడా ఆకట్టుకుంటే చక్రికి అంతకంటే ఏం కావాలి! -
ప్లీజ్... ఆ ఒక్కటీ అడక్కండి!
దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్లిన్లు విడిపోవడానికి తానే కారణమంటూ వచ్చిన వదంతులపై నటి హుమా ఖురేషి పెదవి విప్పడం లేదు. అనురాగ్ కశ్యప్, హ్యుమా ఖురేషిల మధ్య సాన్నిహిత్యం కారణంగానే కల్కి కొచ్లిన్ భర్త నుంచి విడిపోయిందంటూ బాలీవుడ్లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాలో తన నటనా కౌశలంతో విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలందుకున్న హుమా ఖురేషి...ఈ వదంతులను కొట్టిపారేసింది. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా ‘అనురాగ్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. నేనేమి చెప్పదలుచుకున్నానో అది ఇప్పటికే చెప్పా. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు’ అని కుండ బద్దలుకొట్టింది. ఇదిలాఉంచితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానే దంపతులు విడిపోయారు. వీరి వివాహబంధం తెగిపోవడానికి అర్జున్ రాంపాల్ కారణంగా కనిపిస్తోంది. అయితే సుజానేతో తనకు సంబంధం లేదని అర్జున్ ప్రకటించినప్పటికీ అనురాగ్ విషయంలో హుమా ఖురేషి తేల్చిచెప్పడం లేదు. ‘ఇతరుల జీవితాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది సమంజసం కూడా కాదు. ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే ఎప్పుడో మాట్లాడేదాన్ని. నా వైఖరేమిటనేది ఎప్పుడో వెల్లడించా. ఇప్పుడిక కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు’ అని హుమా తెలిపింది. ‘నాకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తల గురించి బాధపడను. అయితే మా కుటుంబం ప్రతిస్పందన విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. నా కుటుంబీకులకుగానీ లేదా నా తమ్ముడు కుటుంబీకులపైగానీ ప్రభావం చూపుతుందేమోననేదే నా బాధంతా’ అని అంది. కాగా దేడ్ ఇష్కియా సినిమాలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌తో పాటు హుమా ఖురేషి కనిపించనుంది. -
అవసరమైతే ‘సుప్రీం’కెళతా అనురాగ్ కశ్యప్
ముంబై: ‘అగ్లీ’ సినిమాలో పొగ తాగే దృశ్యం వచ్చినపుడు ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్’ ప్రకటన (డిస్‌క్లెయిమర్) వేయనని చెప్పినప్పటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరంపై తుదివరకు పోరాడతానని దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పేర్కొన్నాడు. అవసరమైతే సుప్రీంకోర్టుదాకా వెళతానన్నాడు. అటువంటి డిస్క్లెయిమర్లతో సినిమాను విడుదల చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికెటేషన్ను సవాలుచేస్తూ అనురాగ్... బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అది అసలు సమంజసం కాదనేది నా భావన. ఇది పూర్తిగా మతి లేని చర్య. నా విన్నపాన్ని బాంబే హైకోర్టు ఆలకించకపోతే సుప్రీంకోర్టుకు వెళతా’ అని తెలిపాడు. దర్ మోషన్ పిక్చర్స్, ఫాంటం ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన అగ్లీ సినిమా వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీనే విడుదల కావాల్సిఉంది. అయితే డిస్క్లెయిమర్లు వేసేందుకు అనురాగ్ అంగీకరించకపోవడంతో వచ్చే సంవత్సరానికి వాయిదాపడింది. ‘అటువంటి ప్రకటనలతో ఈ సినిమాను విడుదల చేయడం నాకు ఇష్టం లేదు. కడదాకా పోరాడతా. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం నాకు ఉంది. నా సినిమాలు నేను తీసుకుంటా. తీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య దేశం అయినందువల్ల పోరాటాన్ని కొనసాగిస్తా. ఎందుచేతనంటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదురొడ్డి నిలబడాల్సిందే. పోరాటం జరపాల్సిందే. అటువంటి డిస్క్లెయిమర్లు ఎవరికైనా అవమానకరంగానే అనిపిస్తుంద’ని ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’, ‘దేవ్ డి’, ‘గులాల్’, ‘నో స్మోకింగ్’ తదితర సినిమాలతో బాలీవుడ్లో తళుక్కుమన్న అనురాగ్ చెప్పాడు. -
ఫేక్ మెసేజ్ తెచ్చిన తంటా!
సైబర్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా అందాల భామ అనుష్కశర్మ కూడా చేరడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఆకతాయిలు చేసిన అల్లరి పని వల్ల బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్. ఖాన్ని అనవసరంగా నిందించి, చటుక్కున నాలిక కరుచున్నారు అనుష్క. వివరాల్లోకెళితే... మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘దట్డే ఆఫ్టర్ ఎవ్విరిడే’ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ లఘుచిత్రం విపరీతంగా నచ్చేయడంతో ‘అనురాగ్ ప్రయత్నం చాలా బాగుంది’ అని ట్విట్టర్ ద్వారా అభినందించారు అనుష్క. ఎప్పుడైతే ట్విట్టర్లో అనుష్క ఈ మెసేజ్ పోస్ట్ చేశారో... అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకు వేధింపులు మొదలయ్యాయి. కమల్ ఆర్ ఖాన్ పేరు మీద ఉన్న ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ ఈ వేధింపులకు సాధనం అయ్యింది. అనురాగ్ కశ్యప్‌తో అక్రమ సంబంధాన్ని అంటగడుతూ చాలా అసభ్యకరంగా మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. ఈ మెసేజ్‌లు చూసి ఖంగు తినడం అనుష్క వంతైంది. ఇంకేముందీ... కమల్ ఖానే ఈ మెసేజ్‌లను పోస్ట్ చేశాడనుకొని తనకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది అనుష్క. ఆమెతో పాటు ఆమె అభిమానులు కూడా ఖాన్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని చూసి ఖంగు తిన్న ఖాన్... అసలు విషయం చెప్పడంతో నాలిక కరుచుకోవడం అనుష్క వంతైంది. వెంటనే ఖాన్ని క్షమాపణ కోరారు అనుష్క. ఈ ఆకతాయి పని చేసిన వారిని పట్టుకునే పనిలో ప్రస్తుతం క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు ఉన్నారు.