
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్‌గా టైటిల్ మార్చుకుని సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ పొందినా సినిమాను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నా పద్మావత్‌పై అభ్యంతరాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇక సినిమాకు శ్యామ్ బెనెగల్, సుధీర్ మిశ్రా వంటి పిల్మ్ మేకర్లు మద్దతుగా నిలిచారు. చారిత్రక డ్రామాగా తెరకెక్కిన సినిమాపై నానా రాద్ధాంతం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అండగా నిలిచారు. దేశంలో సినీ రూపకర్తలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక వీరికి తోడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ సైతం పద్మావత్ సినిమాకు మద్దతు పలికారు. పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున‍్న వారు మూవీనే చూడలేదని విరుచుకుపడ్డారు. సినిమాను చూడని వీరందరికీ పద్మావత్‌లో అంత వివాదాస్పద అంశాలు ఏం గుర్తించారని నిలదీశారు. చిత్ర రూపకర్తలు బాధ్యతాయుత వ్యక్తులను వారు కేవలం ప్రేమనే పంచుతారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment