Padmavat
-
సినిమాలో రాణి మిస్సయింది.. కానీ
సినిమాలో రాణి మిస్సయ్యింది కానీ నిజ జీవితంలో మాత్ర రాణి తనకే దక్కిందంటున్నారు బాలీవుడ్ ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ రణ్వీర్ సింగ్. ‘స్టార్ ప్లస్’ వారు నిర్వహించిన స్టార్ స్క్రీన్ అవార్టుల కార్యక్రమంలో ‘పద్మావతి’ చిత్రంలో చేసిన ఖిల్జీ పాత్రకు గాను ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు రణ్వీర్ సింగ్. పెళ్లైన తరువాత అందుకున్న తొలి అవార్డ్ కావడంతో కాస్తంతా ఉద్వేగానికి గురయ్యారు రణ్వీర్. అంతేకాక ఈ అవార్డ్‌ను తన భార్య దీపికకు అంకితమిచ్చారు రణ్వీర్ సింగ్. ఈ సందర్భంగా రణ్వీర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు రాణి లభించలేదు.. కానీ నిజ జీవితంలో రాణి దొరికింది. బేబీ థాంక్యూ.. ఈ ఆరేళ్లలో నేను ఎన్నో సాధించాను.. ఎందకంటే నువ్వు ఎల్లపుడు నాతోనే ఉన్నావు కాబట్టి. ధన్యవాదాలు’ అంటూ వేదిక మీద భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. View this post on Instagram " BABY I LOVE YOU "😍😍😍,,Yasssss we know 😭😭😭😭Ranveer's speech in #starscreenawards 🖤 . Look at @vickykaushal09 😭😭 . #deepveer #deepveeraddict #mrandmrsbhavnani #starscreenawards #couplegoals #cutest😍😍 @deepveer_addict_ 🖤 A post shared by #DeepVeer ❤❤ (@deepveer_addict_) on Dec 16, 2018 at 10:16am PST -
ఆస్కార్‌కి భారత్ తరపున ‘విలేజ్ రాక్‌స్టార్స్’
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు భారత్ తరపున ఈ అస్సాం చిత్రం ఎంపికైనట్లు తెలిసింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్ అవార్డుకు పోటీపడుతోందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) శనివారం ప్రకటించింది. 2019 ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ నుంచి 28 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో పాటు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’, ఆలియాభట్ ‘రాజీ’, రాణీముఖర్జీ ‘హిచ్కీ’, శూజిత్ సిర్కార్ ‘అక్టోబర్’ చిత్రాలున్నాయి. ఇన్ని భారీ చిత్రాలతో పోటీ పడి ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు ఎంపికైనట్లు ఎఫ్ఎఫ్ఐ తెలిపింది. అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన పదేళ్ల అమ్మాయి ‘ధును’కు గిటార్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాక తనే సొంతంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ధును తనకు వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించింది.. చివరకు తన కలను ఎలా సాకారం చేసుకుని రాక్‌స్టార్‌గా ఎదిగింది అనేదే ‘విలేజ్ రాక్‌స్టార్స్’ కథ. రీమా దాస్ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో ఉత్తమ ఫీచర్ సినిమాగా జాతీయ అవార్డు సాధించింది. అంతేకాక ఈ చిత్రంలో ధును పాత్రలో నటించిన భనిత దాస్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకుంది. గతేడాది వచ్చిన ‘న్యూటన్’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన ‘కోర్ట్’, ‘లయర్స్ డైస్’, ‘విసరానై’, ‘ద గుడ్ రోడ్’ వంటి చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు చిత్రాల్లో నిలవలేదు. చివరిసారిగా 2001లో ‘లగాన్’ చిత్రం మాత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు 1958లో ‘మదర్ ఇండియా’, 1989లో ‘సలాం బాంబే’ కూడా టాప్ 5కి వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఒక్క భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డ్ రాలేదు. -
కుందనపు బొమ్మ... మైనపు బొమ్మ
కళ్లు తిప్పుకోలేని అందం దీపికా పదుకోన్‌ది. ఇక నుంచి ఈ అందాల ముద్దు గుమ్మ లండన్‌లో మైనపు బొమ్మలా కనిపించనున్నారు. ఎందుకంటే.. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా పదుకోన్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. సోమవారం ఈ మైనపు విగ్రహానికి కావాల్సిన నమూనాలను తుస్సాడ్స్ టీమ్‌కు ఇచ్చారు దీపికా పదుకోన్. ఈ ఏడాది దీపికా పదుకోన్‌కు బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ‘పద్మావత్’ సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్’ లిస్ట్‌లో ఆమె చోటు దక్కించునున్నారు. అలాగే ఈ ఏడాది చివర్లో ప్రియుడు రణ్వీర్ సింగ్‌తో వివాహం కూడా ఖరారు అయింది. ఇన్ని గుడ్ న్యూస్‌లన్నింటికీ తోడు ప్రతిష్టాత్మక మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహానికి చోటు దక్కడం మరో గుడ్ న్యూస్. ఈ విషయాన్ని దీపికా ట్వీటర్లో ‘ఇట్స్ ఆల్ ఎబౌట్ ది డీటైల్స్’ అంటూ తుస్సాడ్స్ మ్యూజియంకి కావాల్సిన కొలతలను ఇస్తున్న ఫొటోను పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. విశేషం ఏంటంటే.. ఈ కుందనపు బొమ్మ మైనపు విగ్రహాన్ని బాలీవుడ్ సెలబ్రిటీస్ విగ్రహాలతో పాటుగా కాకుండా ఎ– లిస్ట్ సెక్షన్ పర్సనాలటీలు హాలీవుడ్ తారలు హెలెన్ మిర్రెన్, ఏంజెలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. హాలీవుడ్ స్టార్స్‌ని ‘ఎ’ లిస్ట్ సెక్షన్ అని తుస్సాడ్స్ వారు అంటారు. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సంవత్సరం దీపిక కెరీర్లో బెస్ట్ ఇయర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. -
దుమ్మురేపిన టాప్-5 సినిమాలు ఇవే!
సాక్షి, సినిమా : పద్మావత్ సినిమాతో బాలీవుడ్లో ఈ ఏడాది శుభారంభం మొదలైంది. దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడుతూ జనవరిలో విడుదలైంది. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. మొదటి వారాంతంలోనే 114 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నంటిలో పద్మావత్ సినిమానే వీకెండ్ కలెక్షన్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో భాగీ-2 నిల్చింది. తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ నటించారు. ఈ యాక్షన్, సస్పెన్స్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ 41కోట్ల రూపాయలతో మూడోస్థానంలో, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్మాన్’ 40 కోట్ల రూపాయలతో నాలుగోస్థానంలో, కరీనా కపూర్, సోనమ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ 36 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది. -
ఆ సినిమాను విడుదల కానివ్వం: వీహెచ్‌పీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా ‘లవోరాత్రి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సినిమా పేరును ‘లవోరాత్రి’ అని నిర్ణయించారు. ఈ విషయం గురించి విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేశారు. ఈ సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించడానికి వీలులేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటా’మని తెలిపారు. ‘సుల్తాన్’, షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’, చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అభిరాజ్ మినావాలా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్ శర్మకు జోడీగా నటిస్తున్న వారినా హుస్సెన్‌కు కూడా ఇండస్ట్రీకి తొలి పరిచయం కావడం గమనార్హం. -
నవంబర్‌లో ఆ నటి వివాహం..?
ప్రస్తుతం బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్నో ఊహాగానాల నడుమ సోనమ్ కపూర్ పరిణయ ఘడియలను కూడా ప్రకటించారు. ఈ నెల 8న అనిల్‌కపూర్ గారాల పట్టి సోనమ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి రణ్వీర్ సింగ్ - దీపిక పదుకోణ్ల వివాహం గురించే. ‘పద్మావత్’ సినిమా విడుదలయిన నాటి నుంచి వీరి వివాహానికి సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. దీపిక పుట్టిన రోజు నాడే వీరిరువురి నిశ్చితార్ధం అయ్యిందని, త్వరలోనే వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు గతంలో బీ టౌన్లో చక్కర్ల కొట్టాయి. ఇన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి వివాహానికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో వీరిరువురు ఓ ఇంటివారు కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ఇరు కుటుంబాలు వారు తరచు కలుసుకుంటున్నారని, రణ్వీర్ - దీపికల వివాహవేడుక గురించి చర్చించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది నవంబర్‌లో రణ్వీర్ - దీపికల వివాహం చేయ్యాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అటు దీపిక, ఆమె కుటుంబ సభ్యులుగానీ, రణ్వీర్, అతని కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే గతంలో రణ్వీర్ తన వివాహం గురించి ప్రస్తావిస్తూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరిని పిలిచి మరీ చెప్తాను అన్న సంగతి తెలిసిందే. 2017, డిసెంబరు 11న అనుష్క, విరాట్ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఈ హీరో పారితోషికం రూ.32 కోట్లు!
చిత్ర పరిశ్రమలో హీరోల పారితోషికాన్ని నిర్ణయించడానికి ఓ పద్దతి అంటూ ఏమి ఉండదు. వారి గత చిత్రాల విజయాల మీదే పారితోషికం ఆధారపడి ఉంటుంది. ఒక సినిమాకు ఒప్పుకునే ముందు హీరోలు ఆ చిత్ర నిర్మాత, చిత్రాన్ని నిర్మించే సంస్థకు ఉన్న పేరు ఆధారంగా తమ పారితోషికాన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పారితోషికం గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్ ధావన్ రెమో డిసౌజ దర్శకత్వంలో నటించబోత్ను చిత్రం కోసం ఏకంగా 32 కోట్ల రూపాయాల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం బీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా 2019లో విడుదలకానున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ కుర్ర హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘సుయీ ధాగ’ చిత్రానికి, గతంలో కరణ్ జోహర్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలకు కూడా కేవలం 8కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 32 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే వరుణ్ ఇంత పెద్ద పారితోషికాన్ని ఎలా తీసుకుంటున్నాడనే విషయం ఇప్పుడు బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలీవుడ్లో ఏ హీరో ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఓ సారి చూడండి... అక్షయ్ కుమార్ ఈ ‘ఖిలాడి’ హీరో ప్రస్తుతం గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘మొగల్’ చిత్రానికి అక్షరాల 54 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుని ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. మేథోపరమైన హక్కులను కూడా కలుపుకుని ప్రస్తుతం ఈ హీరో మార్కెట్ విలువ 54 కోట్లు. ఇది ఈ హీరో లక్కినంబర్ని కూడా సూచిస్తుంది. 9 ఈ హీరో లక్కి నంబర్. అజయ్ దేవగన్ ‘రైడ్’ సినిమా తరువాత నుంచి ఈ హీరో కూడా తన పారితోషికాన్ని పెంచి అక్షయ్‌కు సమానంగా వరుసలో రెండో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో బయట సంస్థల్లో నటించబోయే మూడు చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు, మేథోపర హక్కుల్లో వాటాను కలుపుకుని ఇంత భారీ పారితోషికాన్ని పొందుతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఈ ఇద్దరూ ఖాన్ హీరోలు సమాన పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ ఇద్దరు బడా హీరోలతో సినిమాలు తీసే ఓ ప్రముఖ దర్శకుడు ఓ సందర్భంలో మీరిద్దరు నాకు సమానమే కాబట్టి ఇద్దరికి పారితోషికం కూడా సమానంగానే చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు 50కోట్ల పారితోషికంతో పాటు మేథోపరమైన హక్కుల్లో 50శాతం వాటా తీసుకుంటున్నారు. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఈ హీరో ‘ఆనంద్ కుమార్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కోసం 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే తన తదుపరి చిత్రానికి కూడా ఇంతే పారితోషికం తీసుకోనున్నాడని సమాచారం. షారుక్ ఖాన్ కింగ్ ఖాన్ షారుక్ మాత్రం పారితోషికం విషయంలో చివరి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరోగారి పారితోషికం ‘సున్నా’. అవును అక్షరాల సున్నానే. ఎందుకంటే ఈ హీరో తన సొంత బ్యానర్లోనే చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘రాయిస్’ సినిమా నుంచి ఇప్పుడు నటిస్తున్న ‘జీరో’ వరకూ ఈ హీరో నటించిన సినిమాలన్ని తన సొంత బానర్లో తానే స్వయంగా నిర్మిస్తూ నటించాడు, కాబట్టి ఈ హీరో పారితోషికం ‘సున్నా’. రనవీర్ సింగ్ ‘పద్మావత్’ సినిమా విడుదల తర్వాత ఈ హీరో కూడా పారితోషికాన్ని పెంచాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సింబా, 83(కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం) కోసం 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. రణ్‌బీర్ కపూర్ ఈ కుర్ర హీరో కూడా ఒక్కో చిత్రానికి 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. ‘రాయ్’, ‘తమాషా’ సినిమాలకు కలిపి 30 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు షాహిద్ కపూర్ ‘పద్మావత్’ సినిమా విడుదల తర్వాత ఈ హీరో కూడా తన పారితోషికాన్ని పెంచాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘బట్టీ గల్ మీటర్ చలు’ సినిమా కోసం 11 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. జాన్ అబ్రహం ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘పర్మాణు : ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ చిత్రం కోసం 12 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. -
‘ఖిల్జీ’కి అరుదైన పురస్కారం
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకూ ఎన్నో వివాదాలు, వాయిదాలు...ఇంకెన్నో ఆంక్షలు...చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కి, భద్రత నడుమ విడుదలైంది పద్మావత్ సినిమా. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలయ్యాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన విధానం, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌ల నటన పద్మావత్‌ను ఓ స్థాయిలో నిలిపాయి. ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్వీర్ సింగ్‌ను అరుదైన పురస్కారం వరించింది. ఖిల్జీ పాత్రను చరిత్రలో చదవడమే కానీ, ఎవరూ చూసి ఉండరూ. కానీ రణ్వీర్ తన నటనతో ప్రేక్షకులకు ఖిల్జీని చూపించేశాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రణ్వీర్ ఆ పాత్రను పండించిన తీరుకు దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్ని పాత్రలను అద్భుతంగా మలిచినా...ఖిల్జీ పాత్ర మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. -
సూపర్‌స్టార్ సినిమాను దాటేసిన పద్మావత్
సాక్షి, న్యూఢిల్లీ : దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ల అభినయంతో సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్ వసూళ్ల పరంగానూ రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ 300 కోట్ల మార్క్ దాటిన పద్మావత్ అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన ఆరవ చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 301 కోట్లు కలెక్ట్ చేసిన పద్మావత్ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ లాలా తెలిపారు. 52 రోజుల పద్మావత్ ఆలిండియా వసూళ్లు రూ 301 కోట్లతో సుల్తాన్ లైఫ్‌టైమ్ వసూళ్ల (రూ 300.45 కోట్లు)ను అధిగమించి దేశంలో ఆల్‌టైం టాప్ 6 హిందీ మూవీగా నిలిచిందని ఆయన ట్వీట్ చేశారు. అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి -2, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, పీకే, భజరంగి భాయ్‌జాన్ చిత్రాల తర్వాతి స్ధానాన్ని పద్మావత్ దక్కించుకుంది. దేశ చరిత్రకు సంబందించిన కథాంశానికి ఇంతటి ఆదరణ లభించడం పట్ల మూవీలో నటించిన రణ్‌వీర్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినిమాకు దక్కిన ప్రశంసలు, వసూళ్లు ఎంతో సంతృప్తి కలిగించాయని ఇదే తన తొలి రూ 300 కోట్ల మూవీ అని పేర్కొన్నారు. పద్మావత్ మూవీ ఆ రకంగా తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. -
పారితోషికంపై నటి భిన్న స్పందన
ముంబై : సినీ ఇండస్ట్రీలో హీరోల కన్నా హీరోయిన్ల పారితోషికం తక్కువన్న విషయం తెలిసిందే. ఇందుకు బాలీవుడ్ మినహాయింపేమీ కాదు. సోనమ్ కపూర్ నుంచి ప్రియాంక చోప్రా వరకూ ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులో మార్పు వస్తోంది. అందుకు నిదర్శనం 'పద్మావత్' సినిమానే. ఈ సినిమాలో రాణి పద్మావతిగా నటించిన దీపికా పదుకొనే తీసుకున్న పారితోషికం రణవీర్ సింగ్, షాహీద్ కపూర్ కన్నా అధికం. ఆ సంగతలా ఉంచితే హీరోయిన్ల తక్కువ పారితోషికం విషయంపై... రాణి ముఖర్జిని అడిగితే ఆమె భిన్నంగా స్పందించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పనికే ప్రాధన్యత ఇస్తానని తెలిపారు. తానెప్పుడు పనిచేయడం గురించే ఆలోచిస్తానని, ఆర్థిక వ్యవహారాలన్ని తన తల్లిదండ్రులే చూసుకుంటారని తెలిపారు. 'ఈ మధ్యకాలంలో నటించడం రానివాళ్లు కూడా పారితోషికం గురించి మాట్లాడుతున్నారు. మనం చేసే పనికి సంబంధించి మెళకువలు నేర్చుకుంటే డబ్బు దానంతట అదే వస్తుంది' అన్నారు. నటులు ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాణిముఖర్జి 'హిచ్కి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె 'టౌరెట్ సిండ్రోమ్' తో బాధపడే ఉపాధ్యాయురాలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది. -
పద్మావతికి పట్టు చీర
ధైర్యంగా నిలబడినవాళ్లకే ఏదైనా దక్కుతుంది! ‘పద్మావత్’ లీడింగ్ లేడీ దీపికా పదుకోన్‌కు ఆ సినిమాలో నటించినందుకు.. ఇంకా బెదరింపులు వస్తూనే ఉన్నాయి. నిందారోపణలూ కురుస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ తట్టుకుని చిరునవ్వుతో నిలబడ్డారు దీపిక. ‘బయటికి వస్తే నీ ముక్కు కోసి, కాళ్లు విరగ్గొడతాం’ అని కర్ణసేన బెదిరిస్తే.. ‘కావాలంటే కాళ్లు విరగ్గొట్టండి కానీ, నా ముక్కును మాత్రం ఏం చేయకండి’ అని దీపికా సెటైర్ వేశారు. ‘పద్మావత్’ చూసి వచ్చి, ‘స్త్రీ అంటే అవయవమేనా, శీలాన్ని కాపాడుకోడానికి మంటల్లోకి దూకేయడం ఏంటి?’ అని స్వరా భాస్కర్ అనే బాలీవుడ్ నటి భన్సాలీని తిట్టిపోస్తే.. అందుక్కూడా దీపికే ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ‘సినిమా ఆరంభంలో డిస్‌క్లెయిమర్‌ను వేస్తున్నప్పుడు స్వరా.. పాప్‌కార్న్ కొనుక్కోడానికి వెళ్లినట్టున్నారు’ అని మరో సెటైర్ వేశారు. ఇవన్నీ అలా ఉంచండి. సినిమాలో దీపిక పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్లు థియేటర్ నుంచి బయటికి రాగానే, నేరుగా దీపిక ఇంటికి గిఫ్టుతో వెళుతున్నారు! లేటెస్టుగా అమితాబ్ ఈ అమ్మాయికి పూలగుత్తి పంపించి, ‘వెల్డన్ రా’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా లేటెస్టుగా రేఖ.. దీపికకు ఒక పార్శిల్ çపంపారు. ఖరీదైన పట్టుచీర అది! వెంటనే దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘గెస్ హూ?’ అని అభిమానులకు పజిల్ పెట్టారు దీపిక. ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రాన్ని చూసి వచ్చాక కూడా రేఖ ఇలాగే దీపికకు పట్టుచీర పెట్టారు. దీపికలో ఎక్కడో తనని చూసుకుంటున్నట్లున్నారు అలనాటి అందాల నటి రేఖ. -
ముక్కు వద్దు.. కాళ్లు తీసుకోండి
...ఇలాంటి ఆఫర్ ఎవరైనా ఇస్తారా? కోట్లు ఇస్తామన్నా ఇవ్వరు. కానీ దీపికా పదుకోన్ మాత్రం చాలా ధైర్యంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. బాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. అసలు సంగతి ఏంటంటే.. దీపికా పదుకోన్ లీడ్ రోల్లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పద్మావత్’. ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు మొదలైన వివాదాలు సినిమా విడుదలైనా ఆగడం లేదు. భన్సాలీని చంపేస్తామని, దీపిక తల.. ముక్కు నరికిన వారికి లక్షల్లో నజరానా ఇస్తామని ‘పద్మావత్’ సినిమాని వ్యతిరేకిస్తున్న వారు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపుల గురించి దీపిక స్పందించారు. ‘‘పద్మావత్’లో నటించినందుకు నా తల, ముక్కు నరికేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నాకు నా ముక్కు అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని కత్తిరించొద్దు. కావాలంటే పొడవైన నా కాళ్లు కత్తరించుకోండి. ఇలా బెదిరించే వాళ్లను లైట్‌గా తీసుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడానికి నేను భయపడను’’ అంటూ చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారీ బ్యూటీ. ‘‘నాకు 14ఏళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి బయటికెళ్లాను. అప్పుడో వ్యక్తి కావాలనే నన్ను రాసుకుంటూ వెళ్లాడు. అతని చెంప ఛెళ్లుమనిపించా ’’ అన్నారు దీపికా పదుకోన్. -
బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అదే!
రీసెంట్ (జనవరి 5)గా బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు దీపికా పదుకోన్. ఆ రోజు ఆమెకు ఎన్నో గిప్ట్స్ వచ్చి ఉండొచ్చు. ఎందరో విషెస్ చెప్పి ఉండొచ్చు. ‘‘అయితే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అంటే దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చెప్పిన ఒక మాట’’ అంటున్నారు దీపికా పదుకోన్. ‘పద్మావత్’ చిత్రం జనవరి 25న రిలీజైన విషయం తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా సెన్సార్ జనవరి 5న కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ ఏమంటుందో? రివైజింగ్ కమిటీకి పంపడంటూ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందేమో అనే టెన్షన్ చిత్రబృందంలో ఉండేది. అయితే సెన్సార్ వైజ్‌గా యూనిట్ ఇబ్బందిపడలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే.. దీపికా బర్త్‌డే నాడే ‘పద్మావత్’ సెన్సార్ కంప్లీట్ అయిన విషయాన్ని భన్సాలీ ఫోన్లో దీపికకు చెప్పారట. ‘‘ఫ్యామిలీ మెంబర్స్‌తో బర్త్‌డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ టైమ్‌లో సంజయ్‌లీలా భన్సాలీ ఫోన్ చేసి ‘పద్మావత్’ సెన్సార్ కంప్లీట్ అయిన విషయాన్ని చెప్పారు. మోస్ట్ ప్రిషియస్ అండ్ బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అదే’’ అని దీపికా పదుకోన్ పేర్కొన్నారు. -
రూ . 143 కోట్లు రాబట్టిన పద్మావత్
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక చిత్రం పద్మావత్ వివాదల నడుమ విడుదలైనా వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పద్మావత్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 143 కోట్లు కలెక్ట్ చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓవర్సీస్లో తొలి వారాంతంలోనే రూ 76.24 కోట్లను కొల్లగట్టింది. రాజ్పుట్లు, హిందూ సంస్థల నిరసనల మధ్య విడుదలైన మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటంతో చిత్ర యూనిట్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాణీ పద్మావతిగా టైటిల్ రోల్లో దీపికా పదుకోన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. షాహిద్ కపూర్, రణ్‌వీర్‌ల నటనకూ మంచి ప్రశంసలు దక్కాయి. -
పద్మావత్..పైసా వసూల్..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక చిత్రం పద్మావత్ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. సహజంగా తొలి వారాంతం దాటిన తర్వాత వసూళ్లు నెమ్మదించడం జరిగే క్రమంలో పద్మావత్ మూవీ సోమవారం గండం నుంచి విజయవంతంగా గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా పద్మావత్ మూవీ కలెక్షన్లు నిలకడగా ఉన్నాయని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సోమవారం బాక్సాఫీస్ వద్ద రూ 15 కోట్లు కొల్లగొట్టిన పద్మావత్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 129 కోట్ల వసూళ్లు దక్కాయని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ సహా ఓవర్సీస్లోనూ పద్మావత్ భారీగా వసూలు చేస్తోందని చెప్పారు. ఈ మూవీలో రాణి పద్మినిగా దీపికా పదుకోన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. -
వై పద్మావతి?!
‘పద్మావత్’ చిత్రంలో పద్మావతి కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ.. ఢిల్లీలో తన రాజ్యాన్ని వదిలేసి చిత్తోడ్‌ఘడ్ చేరుకుని అక్కడి ఎడారిలో గుడారం వేసుకుని కూర్చుంటాడు! ‘తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ కూర్చున్నా..’ అని 1978 నాటి ‘ఇంద్రధనస్సు’ సినిమాలో కృష్ణ పాడతాడు కదా, శారద కోసం.. అలా ఇక్కడ ఖిల్జీ.. పద్మావతి కోసం అలమటిస్తుంటాడు. అతడి కళ్లు చెమ్మగిల్లుతాయి కూడా. ‘ఏంటి అంతటివాడికి ఇంత ఖర్మ?’ అని అనిపిస్తుంది ప్రేక్షకులకు. ‘పద్మావతంత అపురూపమైన మానవ స్త్రీ ఈ భువిలో లేదని’.. నమ్మకద్రోహి అయిన చిత్తోడ్‌ఘడ్ రాజగురువు ఢిల్లీ వెళ్లి ఖిల్జీకి చెప్పి, అతడిని రెచ్చగొట్టడంతో ఆ మాయలో పడిపోతాడు ఖిల్జీ! అతడి భార్య మెహరున్నీసా కూడా అందాలరాశే. అంత అందాన్ని కళ్లెదుట పెట్టుకుని, వేరే రాజ్యపు స్త్రీ కోసం ఖిల్జీ పాకులాడటం కూడా ఆడియన్స్‌కి అతడిపై గౌరవాన్ని తగ్గిస్తుంది. సినిమా చూస్తున్నవారికి హాల్లోంచి ఒక మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. ‘అరె.. ఈవిడ కూడా అందంగా ఉంది కదా. ఖిల్జీకి ఇదేం పోయేకాలం?’ అని! ఖిల్జీ భార్యగా అతిథి రావ్ హైదరీ నటించారు. నిజంగానే ఆమె దీపికా పదుకోన్‌కి దీటుగా ఉన్నారు. -
నా ధైర్యం ఆ ఇద్దరే
‘పద్మావత్’ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు గురించి తెలిసిందే. విడుదలకు ముందు, ఆ తర్వాత ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు. దీపికా పదుకోన్ పై దాడులు చేస్తామని కొందరు, చెవి, ముక్కు నరికి తెస్తే నగదు బహుమతి ఇస్తామని మరికొందరు బహిరంగంగా పేర్కొన్న విషయమూ విదితమే. ఈ బెదిరింపులను దీపికా పదుకోన్ ఎలా ఎదుర్కొని నిలబడగలుగుతున్నారు అనే సందేహం కలగవచ్చు. దానికి కారణం మా పేరెంట్స్ నన్ను పెంచిన విధానమే అంటున్నారు దీపికా పదుకోన్. ‘‘ఈ వివాదాలు జరిగిన అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మా పేరెంట్స్ ‘నీ దగ్గరకు వచ్చి ఉంటాం’ అనలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు.. నేను ఈ సిచ్యువేషన్స్‌ను హ్యాండిల్ చేయగలనని. సమస్యలను మా అంతట మేం డీల్ చేసుకొనేలా నన్ను, నా చెల్లెల్ని (అనీషా పదుకోన్) మా పేరెంట్స్ పెంచారు. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవటం నేర్పించారు మా తల్లిదండ్రులు. మా ధైర్యం ఆ ఇద్దరే’’ అని చెప్పారు దీపికా పదుకోన్. ‘పద్మావత్’ చూశాక తన తల్లిదండ్రులు ఎలా స్పందించారనే విషయం గురించి చెబుతూ – ‘‘ఈ సినిమా చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. సినిమా చూసిన వెంటనే నాకు వీడియో కాల్ చేశారు. వాళ్ల ముఖాలు గర్వంతో వెలిగిపోవటం నాకు కనిపించింది. వాళ్లు వీడియో కాల్ చేసేటప్పటికి నేను పైజామాలో ఉన్నాను. సినిమాలో రాణీ పద్మావతిగా చూసి, మళ్లీ మాములుగా చూసేసరికి ఈ అమ్మాయినేనా మేము స్క్రీన్ పై అంత అద్భుతంగా చూసింది అనే ఆశ్చరం కనిపించింది అమ్మానాన్న కళ్లలో’’ అని పేర్కొన్నారు దీపికా. -
100 కోట్ల క్లబ్ చేరువలో పద్మావత్
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్ వివాదాల నడుమ విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీపికా పడుకోన్ టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్లో చేరనుంది. బుధవారం ప్రీమియర్ షోల ద్వారానే రూ 5 కోట్లు రాబట్టిన పద్మావత్ గురువారం రూ 19 కోట్లు, శుక్రవారం రూ 32 కోట్లు, శనివారం రూ 27 కోట్లు కొల్లగొట్టి మొత్తం రూ 83 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం వసూళ్లు కలుపుకుంటే మూవీ 100 కోట్ల క్లబ్లో చేరుతుందని స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించారంటూ పద్మావత్ మూవీని రాజపుత్రులు, హిందూ సంస్థలు నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు సైతం చిత్ర విడుదలను నిషేధిస్తున్నట్టు ప్రకటించినా సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌తో వివాదాల నడుమ విడుదలైన పద్మావత్ వసూళ్లలో దూసుకుపోతుండటం పట్ల చిత్ర యూనిట్ ఊపిరిపీల్చుకుంది. -
కర్ణిసేన నేత అరెస్ట్
గుర్గావ్: బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు వ్యతిరేకంగా హింసకు పాల్పడిన కేసులో స్థానిక కర్ణిసేన చీఫ్ ఠాకూర్ కుషాల్పాల్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గుర్గావ్లో విధ్వంసానికి కారణమైన వారిలో ఇప్పటివరకూ 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పద్మావత్ చిత్ర ప్రదర్శనను నిరసిస్తూ ఆందోళనకారులు బుధవారం గుర్గావ్లో ఓ పాఠశాల బస్సుపై దాడిచేయడంతో పాటు ప్రభుత్వ బస్సుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్‌చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీస్ పీఆర్వో రవీందర్ కుమార్ చెప్పారు. -
పద్మావత్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..
సాక్షి, ముంబయి : వివాదాల నడుమ విశ్వవ్యాప్తంగా విడుదలైన సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక చిత్రం పద్మావత్ తొలిరోజు భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. పలు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు, రాజపుత్రుల ఆందోళనలు కొనసాగినా వసూళ్లపై వాటి ప్రభావం కనిపించలేదు. నిరసనల భయంతో కొన్ని చోట్ల పలు థియేటర్లు ఈ మూవీని ప్రదర్శించేందుకు వెనుకాడినా బాక్సాఫీస్ వద్ద మూవీ తొలిరోజు సంతృప్తికర వసూళ్లు సాధించింది. తొలిరోజు పద్మావత్ మూవీకి దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు దక్కాయి. టాక్ బాగుండటంతో ముందుముందు కలెక్షన్లు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. పద్మావత్‌లో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇక రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్లూ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
భద్రత నడుమ ‘పద్మావత్’
న్యూఢిల్లీ/ముంబై: రెండు నెలలుగా విడుదలకు ఊరిస్తున్న పద్మావత్ చిత్రం పటిష్టమైన భద్రత నడుమ గురువారం దేశవ్యాప్తంగా విడుదలైంది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, గోవా మినహా మిగిలిన రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించారు. గుర్గావ్లో భారీ సంఖ్యలో సినిమాభిమానులు థియేటర్ల ముందు బారులు తీరారు. సినిమా చూసిన వారు.. ఆందోళలనలు అర్థరహితమని, చిత్రంలో నిరసన చేపట్టాల్సిన సన్నివేశాలేమీ లేవని పేర్కొన్నారు. గుర్గావ్లో చిత్ర విడుదల సందర్భగా మాల్స్, సినీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ హాల్స్ వద్ద పోలీసులతోపాటు బౌన్సర్లతో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. పద్మావత్ చిత్రాన్ని విడుదలైన తొలిరోజే 10 లక్షల మంది వీక్షించారని ఈ చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తెలిపింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో చిత్రం విడుదల కానప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కర్ణిసేన బంద్ పాక్షికంగానే కొనసాగింది. చిత్ర విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. -
పిల్లల్నీ విడిచిపెట్టరా..?
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు, దళితులను మట్టుబెట్టిన వారు ఇప్పుడు మన పిల్లల్నీ విడిచిపెట్టడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురుగ్రామ్‌లో చిన్నారులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావత్ మూవీకి వ్యతిరేకంగా గురుగ్రామ్‌లో నిరసనకారులు స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘ముస్లింలు, దళితులను ఊచకోత కోసిన వారు ఇప్పుడు మన పిల్లలపై రాళ్లు రువ్వుతున్నారు..మన ఇళ్లలోకి దూసుకొస్తున్నారు..ఇక ఇప్పుడు మనం మౌనం వీడి గొంతెత్తాల్సి ఉంద’ని వ్యాఖ్యానించారు. సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం తలెత్తిందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. స్కూల్ చిన్నారులపై రాళ్లు విసరడం సిగ్గుచేటని, నిందితులకు రావణుడికి రాముడు ఇచ్చిన శిక్ష కంటే కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై హింసను ఏ మతం ప్రోత్సహిస్తుందని కేజ్రీవాల్ నిలదీశారు. -
పద్మావత్‌పై పంతం
-
తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మావత్’ సెగ
సాక్షి, కరీంనగర్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న చిత్రం పద్మావత్. ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈసినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న కర్ణిసేన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆసెగ తెలుగు రాష్ట్రాలకు పాకింది. సినిమా విడుదలను అడ్డకుంటూ తెలంగాణలోని కరీంనగర్లో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పద్మావతి చిత్ర యూనిట్‌కు శవయాత్ర నిర్వహించారు. అనంతరం సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్ద దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పద్మావత్ చిత్రం భారీగానే విడుదలైంది. దాదాపు 400పైగా థియేటర్లలో రిలీజైంది. -
పద్మావత్ ప్రభంజనం సృష్టిస్తుంది
-
విఘ్నేశ్వరా.. నీదే భారం!
ఎట్టకేలకు ‘పద్మావత్’ ఇవాళ రిలీజ్ అవుతోంది! అవనిస్తారా అని డౌట్. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికీ నిరసన కారుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. పిక్చర్ రిలీజ్ కావడానికి వీల్లేదని వాళ్లంతా హఠం పట్టారు. సెన్సార్ ఓకే చెప్పింది. సెన్సార్ చెప్పిన మార్పులకు నిర్మాతలు ఓకే చెప్పారు. మార్పుల తర్వాత ప్రివ్యూలు చూసినవాళ్లు ఒకే చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అయినప్పటికీ సెంటిమెంట్స్ బలంగా పని చేస్తున్నాయి. ‘‘మా రాణిగారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఉన్న పద్మావత్ విడుదల అవుతుంటే.. చూస్తూ కూర్చోడానికి మేమేమీ చేవ చచ్చిన వాళ్లం కాదు’ అని రాజ్‌పుత్‌లు అంటున్నారు. మంగళవారం నాడు మీడియా ప్రతినిధులు ‘పద్మావత్’ను చూసి వచ్చి, రివ్యూ రాశారు. ఈ కాల్పనిక చరిత్ర ‘చూడ్డానికి బాగుంది’ అని సమీక్షించారు. అయితే అసలు చూడ్డానికే ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నవారు ఇష్టపడడం లేదు. వాళ్ల వాదనను సమర్థిస్తున్న ఇతర రాష్ట్రాలవారు కూడా ‘మేము చూడం, చూడనివ్వం’ అని థియేటర్ల దగ్గర కాపుకాశారు. ఇంకోవైపు ‘పద్మావత్’ స్టార్ దీపికా పదుకోన్, దర్శకుడు భన్సాలీ గట్టి భద్రత నడుమ మాత్రమే బయటికి రాగలుగుతున్నారు. ప్రివ్యూలు వేసిన రోజు దీపికా పదుకోన్ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చారు. ఆలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. పద్మావతిగా నటించినప్పటి నుంచి ఎక్కడా మాట్లాడే అవకాశమే ఆమెకు రావడం లేదు! ఇక ఆమె తరఫున సినిమానే మాట్లాడాలి. -
ఇలాగైతే జాబ్‌లు కష్టమే..
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన వివాదాస్పద చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్‌పై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పద్మావత్ మూవీ చుట్టూ ముసిరిన వివాదం, దాన్ని డీల్ చేసిన విధానం భారత్‌లో పెట్టుబడుల ప్రవాహంపై, ఉపాధి అవకాశాలపై సందేహాలను ముందుకుతెచ్చిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు సైతం ఒక సినిమాను విడుదల చేయలేక చేతులెత్తేస్తే ఇక పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడులను పక్కనపెడితే..దేశీయ పెట్టుబడిదారులే ఈ పరిస్థితులను జీర్ణించుకోలేకపోయారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది కాదని..దేశంలో నెలకొన్న పరిస్థితులు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద పద్మావత్ మూవీ విడుదలను నిరసిస్తూ రాజ్పుట్, హిందూ సంస్థల ఆందోళనల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పద్మావత్ థియేటర్ల ఎదుట ఆందోళన
-
పద్మావత్ థియేటర్లను తగలపెట్టిన కర్ణిసేన
పద్మావత్(పద్మావతి) సినిమా విడుదల సందర్భంగా గుజరాత్లో హింస చెలరేగింది. వివాదాలకు చిరునామాగా నిలిచిన పద్మావత్ చిత్రం విడుదల సందర్భంగా గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్ మాల్స్‌పై దాడులకు దిగారు. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్ వన్ మాల్స్, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితి అదుపు తప్పడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు సెక్యూరిటీ పెంచారు. ఆందోళనలపై స్పందించిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు సంబంధించిన వీడియోని గుజరాత్ పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ఉన్న వ్యక్తులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్‌లు ధరించి థియేటర్లపై రాళ్లతో దాడులకు పాల్పడగా మరికొంత మంది రోడ్డుపై ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. గుజరాత్లో చెలరేగిన హింస, గంటల్లోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. మద్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కాన్పూర్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు, అక్కడి సిబ్బందిపై దాడలకు పాల్పడ్డారు. సినిమా ప్రదర్శించొద్దంటూ అక్కడున్న సినిమా పోస్టర్లను చించిపడేశారు. ఇండోర్, మొరేనా, గ్వాలియర్లలో ఆందోళనలు నిర్వహించారు. ఉజ్జయనీలో ఓథియేటర్‌పై దాడికి యత్నించిన వారిని స్థానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ ఎవరూ గుంపులగా తిరగొద్దంటూ అహ్మదాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. వరుస ఆందోళనల నేపథ్యంలో థియేటర్ యజమానులు సినిమా ప్రదర్శించట్లేదంటూ బయట బోర్డులు పెట్టారు. -
‘పద్మావత్’పై తీర్పు మారదు: సుప్రీం
న్యూఢిల్లీ: పద్మావత్ సినిమా విడుదలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పును గౌరవించాలన్న విషయం ప్రజలకు అర్థం కావాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం పేర్కొంది. పద్మావత్’ విడుదలపై తీర్పును మరోసారి పరిశీలించాలని రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. సినిమాను నిలిపేయాలని రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, అఖిల భారతీయ క్షత్రియ మహాసభ దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం కొట్టేసింది. దీంతో జనవరి 25న పద్మావత్ విడుదలకు అడ్డంకులు తొలగి పోయాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్‌లో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
‘పద్మావత్’ రివ్యూ
పద్మావత్ సినిమా ఒక మహిళ వీరత్వానికి, చతురత్వానికి, ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే... ‘ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని నొక్కి వక్కాణించిన భన్సాలీ... చివరికి పోరాడలేక నిస్సహాయురాలై నిశ్చేష్టురాలై సంక్షోభాన్ని గట్టెక్కలేక తనతో పాటు వందల మంది మహిళల్ని (గర్భిణులు, పిల్లలకు కూడా ఉన్నారు) పద్మావతి బూడిద చేస్తుందని చూపించాడు! సినిమా చూడ్డానికి బాగుంది. నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా బాగుండాల్సింది. రూపమా? గుణమా? ఏది ముఖ్యమన్న ప్రశ్న ఎదురైనప్పుడు, గుణం అంటుంది రాణి పద్మావతి. ఆ గుణాన్ని నిరూపించుకోవడం కోసం తన రూపాన్ని కూడా ఆహుతి చేస్తుంది. ఇదీ ఒక్క మాటలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమా. అది ఎలాంటి గుణం? శత్రువు దగ్గర తలవంచని గుణం. శత్రువు తన గౌరవాన్ని మట్టుబెట్టడానికి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడే గుణం. రాజపుత్రిక ఖడ్గంలో ఎంత శక్తివుందో రాజపుత్రిక గాజుల్లో కూడా అంతే శక్తి వుందని నమ్మే గుణం. ఒక స్త్రీ గౌరవం స్త్రీ శీలంతో బలంగా ముడిపడిన 13వ శతాబ్దపు నాటి కథ ఇది. చారిత్రక కల్పన. భార్య కోసం ముత్యాలు కొనడానికి సింహాళ్ వెళ్లిన మహారావల్ రతన్ సింగ్ ‘ప్రమోదవశాత్తూ’ పద్మావతి వేటాడుతుండగా ఆమె బాణపు వేటుకు గాయపడుతాడు. పద్మావతి! ఎలాంటి అపురూప సౌందర్యవతి? ‘ఆమె నీడ కూడా మోహం కలిగించేంత అందం’! అంతటి దివ్యవిగ్రహం కాబట్టే, ఆమెను వివాహం చేసుకుని చిత్తోఢ్కు తెచ్చిన తర్వాత, రతన్‌సింగ్ రాజగురువు కూడా తన వ్యక్తిత్వాన్నీ, తనకు రాజ్యం తరఫున అందుతున్న గౌరవాన్ని కూడా పక్కనపెట్టి పద్మావతిని దొంగచాటుగా చూడటానికి ప్రయత్నిస్తాడు. దాంతో రతన్‌సింగ్ ఆయనకు దేశబహిష్కార శిక్ష విధిస్తాడు. అల్లాహ్ సృష్టించిన ప్రతి అందమైన దానిమీదా అల్లావుద్దీన్ ఖిల్జీకి హక్కు ఉంటుంది అనుకునేంత వాంఛాపరుడు ఖిల్జీ. పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం ఉన్నవాడు. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసినవాడు. కిరీటం ఎంత చెడ్డది, అది తలల్నే మార్చేస్తుంది అని చమత్కరిస్తాడు కూడా. ఇంకా బైసెక్సువల్ కూడా. మాలిక్ కాఫుర్ ‘ఆయనకు పెళ్లాంలాంటివాడు’ అనిపిస్తాడు దర్శకుడు ఒక పాత్రతో. అలాంటి ఖిల్జీకి తన పన్నాగంతో పద్మావతిని పొందని జన్మ జన్మే కాదనీ, ఆమె వుంటే స్వర్గం నేలమీదే వున్నట్టనీ ఊరిస్తాడు రాజగురువు. అలా విపరీతమైన లాలసను పెంచుకున్న ఖిల్జీ చిత్తోఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. రతన్‌సింగ్‌ను సంధి పేరుతో కుయుక్తిగా బంధించి ఢిల్లీకి పట్టుకెళ్లడమూ, అంతే యుక్తిగా పద్మావతి మళ్లీ రతన్‌సింగ్‌ను విడిపించుకు రావడమూ, దీనికి ఖిల్జీ భార్య మల్లికయే సాయం చేయడమూ, దాన్ని అవమానంగా భావించిన ఖిల్జీ భార్యను బంధించి తిరిగి చిత్తోఢ్కు భారీ ఫిరంగులతో వెళ్లడమూ (ఆ ఫిరంగి సామర్థ్యం చిత్తోఢ్కు లేదు), రతన్‌సింగ్ యుద్ధంలో మరణించడమూ(ఇక్కడా కుయుక్తిగానే), భర్త మరణించాడని తెలిసిన పద్మావతి సహా ఏడువందలమంది రాజపుత్రికలు సతీసహగమానానికి పాల్పడటమూ గగుర్పొడిచే ఘట్టం! ఖిల్జీ కనీసం పద్మావతి కొనగోటిని కాదుగదా, కనీసం కొనచూపుతో కూడా చూడకుండానే ఆమె బూడిదైపోతుంది. రాజపుత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి పూర్తి కంకణం కట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది. దీన్ని బట్టి రాజపుత్ర కర్ణిసేన చేసిన నిరసన ప్రదర్శనలు ఎంత అర్థరహితమో అనిపిస్తుంది. ఏ వ్యక్తుల, కులాల, మతాల, జాతుల విశ్వాసాలను కించపరచడానికి ఈ సినిమా తీయలేదు అని ముందుగానే జాగ్రత్తగా ప్రకటించిన ఈ సినిమాలో నిజానికి గాయపడటానికి అవకాశం ఉన్న పాత్ర ఖిల్జీది మాత్రమే. ఒక దృశ్యంలో తన పేరులేని చరిత్ర పుటల్ని ఖిల్జీ చించేస్తాడు. ఖిల్జీ కోణంలోంచి చూస్తే గనుక ఈ సినిమా కూడా చిరిగిన పుటే. ఖిల్జీ పాత్రకు ఎక్కడా కూడా ఒక సానుకూల కోణాన్ని ఇవ్వలేదు. కొన్నిసార్లు కవిత్వాన్ని ఆస్వాదించినట్టూ, తానే స్వయంగా కవితలు అల్లినట్టూ చూపినప్పటికీ ఆ కవిత చెప్పగలగడానికి కారణమైన సున్నితత్వాన్ని ఏ దృశ్యంలోనూ చూపలేదు. అతడు మొదటినుంచీ లాలసుడే. రతన్‌సింగ్ మొదటి భార్య వ్యక్తిత్వంగానీ, రతన్‌సింగ్– పద్మావతి మధ్య అద్భుతమైన ప్రేమ పండినట్టుగానీ ఆవిష్కరణ జరగదు. దాంతో ఏ పాత్ర ఉద్వేగంతోనూ నడవడానికి ఆధారం దొరకదు. కానీ భన్సాలీ అన్ని సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ రిచ్. ఇది బాగా తీయబడిన సినిమాయేకానీ బాగా రాయబడిన సినిమా కాదు అనిపిస్తుంది. చివరి అరగంట సతీసహగమన ఘట్టంలో మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ భారంతోనే సినిమాకు తెర పడుతుంది కాబట్టి సినిమా బాగుంది అనేలా చేస్తుంది. టాప్‌క్లాస్ విజువల్స్ రాజ్‌పుత్ రతన్‌సింగ్‌కు తాను పంపిన వర్తమానానికి సమాధానం కోసం ఎదురుచూస్తుంటాడు అల్లావుద్దిన్ ఖిల్జీ. ఆ వర్తమానంలో ఏం పంపాడో చూసిన పద్మావతి దాన్ని కాల్చేస్తుంది. అల్లావుద్దీన్ ఎదురుచూస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్స్ ఒక చిన్న ఉదాహరణ మేకింగ్ పరంగా ‘పద్మావత్’ టాప్‌క్లాస్ అని చెప్పడానికి. యుద్ధం మొదలైందని తెలిశాక, పద్మావతి పరిగెత్తుకుంటూ కోట గుమ్మం వరకూ వెళ్లే సన్నివేశంతో పాటు చాలా చోట్ల కొన్ని అన్‌కట్ లాంగ్ టేక్స్ చూడొచ్చు. ఇలాంటివి సంజయ్ లీలా భన్సాలీ లాంటి మాస్టర్స్‌కే సాధ్యమనిపించే షాట్స్. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీలో అన్నీ మెరుపులే! కాస్ట్యూమ్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్ వేరే లెవెల్ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. అదేదో మెయిన్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతీ క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్ టాప్‌క్లాస్ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్ కలర్స్ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. క్లైమాక్స్ ఎలివేట్ అయ్యేదంతా స్కోర్‌తోనే! పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, అదితిరావు హైదరి లాంటి స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను చూస్తేనే ఏదో మ్యాజిక్ చెయ్యగలరన్న నమ్మకం కలిగించే స్టార్స్ అంతా. ఆ నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చెయ్యలేదు. ప్రతీ ఒక్కరిదీ టాప్‌క్లాస్ పర్ఫార్మెన్స్. రణ్వీర్ సింగ్ వరుసగా తాను నెక్స్›్ట జనరేషన్ సూపర్‌స్టార్ అనిపించుకునేలానే నటించేశాడు. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి ‘‘ఈ చిత్రం సతీసహగమనాన్ని ఏవిధంగానూ సమర్థించడం లేదు.’’ అనే కార్డ్‌తో మొదలవుతుందీ సినిమా. అది సమర్థించాల్సిన విషయం కాదన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే! మరి సినిమా ఏం చెప్తోంది? సమర్థ్ధించాల్సిన విషయం కాదన్న రోజు ఈకథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా? ఈ ప్రశ్నలు రాకుంటే సినిమా ఎలాగూ మెప్పించడానికి చాలా సెల్లింగ్ పాయింట్స్‌నే పెట్టుకుంది. వస్తేనే.. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి వెళ్లిన, ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదన్న సినిమాగా కనిపిస్తుంది. మరోరకంగా ఆలోచిస్తే హిస్టారికల్ ఫిక్షన్లో ఇదిలా ఉండాలని కోరలేని అవసరంగా కూడా కనిపించొచ్చు! -
సుప్రీంకోర్టులో పద్మావత్‌కు మరోసారి ఊరట
-
‘పద్మావత్’కే సుప్రీం మద్దతు ; రాష్ట్రాలకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ యధావిధిగా విడుదలకానుంది. రాష్ట్రాలదే బాధ్యత : పద్మావత్ ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వెనక్కి తగ్గిన కర్ణిసేన? : అత్యున్నత న్యాయస్థానంలో పద్మావత్‌కు అనుకూలంగా తీర్పులు వస్తుండటంతో ఇరకాటంలోపడ్డ కర్ణిసేన పునరాలోచనలోపడ్డట్లు సమాచారం. సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న కర్ణిసేనకు పద్మావత్ దర్శకుడు భన్సాలీ సైతం ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ముందు మీరంతా సినిమా చూడండి. ఆ తర్వాత మీ ఇష్టం..’ అని భన్సాలీ కోరారు. సోమవారం కూడా ఉధృతంగా సాగిన ఆందోళనలు.. మంగళవారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడాన్ని బట్టిచూస్తే భన్సాలీ లేఖకు సానుకూలఫలితం వచ్చినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆందోళన విరమించే విశయమై కర్ణిసేన ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రక్షణ కల్పిస్తాం : ముంబై, హరియాణా పోలీసులు ‘పద్మావత్’ విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసు శాఖ ప్రకటించింది. అటు హరియాణా ప్రభుత్వం కూడా సినిమా హాళ్ల వద్ద పహారాకు హామీ ఇచ్చింది. థియేటర్ యాజమాన్యాలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని పోలీసులు పేర్కొన్నారు. -
ఖిల్జీ టు గల్లీ బాయ్
కండలు కరిగాయి. హెయిర్ స్టైల్ కంప్లీట్‌గా మారింది. గడ్డం, మీసాలు ట్రిమ్ అయ్యాయి. ఫేస్‌లో కోపం పోయి అమాయకత్వం వచ్చింది. ఇక్కడున్న ఫొటోల్లో మధ్య తేడాలు చెప్పమంటే బహుశా.. ఇలాగే చెప్పుకుంటామేమో. కానీ పేరులో మాత్రం ఏ మార్పు లేదు. ఇతని పేరు రణ్వీర్సిం గ్. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ‘గల్లీ బాయ్’. ఇందులో ఆలియా భట్ కథానాయిక. ఈ సినిమాలోని కంప్లీట్ లుక్‌ను ‘పద్మావత్ టు గల్లీ బాయ్ ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రణ్వీర్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘పద్మావత్’ చిత్రంలోని ఖిల్జీ పాత్రకు భారీగా బరువు పెరిగిన రణ్వీర్ ‘గల్లీబాయ్’ కోసం బరువు తగ్గారు. అన్నట్లు... ఎన్నో వివాదాల నడుమ రూపొంది, ఎన్నో అడ్డంకుల మధ్య ‘పద్మావత్’ ఈ 25న విడుదల కానుంది. సుప్రీమ్ కోర్టు అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల విడుదల చేయకూడదనే వివాదం సాగుతోంది. కొన్ని థియేటర్ల ముందు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి.. విడుదల రోజున ఏం జరుగుతుందో చూడాలి. -
'మేం చూశాకే ఆ సినిమా భవిష్యత్ తేలుస్తాం'
సాక్షి, ముంబయి : అభ్యంతరకర అంశాలు ఏవీ కూడా పద్మావత్ చిత్రంలో లేవని కావాలంటే ఆ సినిమాను ముందే చూడొచ్చని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఇచ్చిన ఆఫర్‌కు శ్రీ రాజ్పుట్ కర్ణిసేన అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లో పద్మావత్ చిత్రాన్ని విడుదలకానివ్వబోమని ప్రకటించిన కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మరికొద్ది సేపటికే తాను పద్మావత్ చూసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనతోపాటు తన ఉద్యమ బృందంలో పనిచేస్తున్నవారు కూడా ఈ సినిమాను చూస్తారని తెలిపారు. 'మాకు ఓ లేఖ అందింది. మేం ఆ చిత్రాన్ని చూడాలని కోరుతూ ఆ లేఖలో భన్సాలీ రాశారు. బహుశా మేం తిరస్కరిస్తామని ఆయన అనుకోవచ్చు.. కానీ మేం అంగీకరిస్తున్నాం. సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం చూశాకే ఆ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా లేదా కొంతమందే ఈ సినిమా చూడాలా అనే విషయం చెబుతాం. అలాగే, సెన్సార్ బోర్డు ముగ్గురు మాత్రమే ఈ సినిమా చూడాలని మరో ఆరుగురుని పక్కన పెట్టింది. అయితే, ఆ ఆరుగురితోపాటు జర్నలిస్టులు కూడా ఈ సినిమాను చూడాలి' అని కల్వి అన్నారు. -
‘పద్మావత్’ని ఆపండి
న్యూఢిల్లీ/జైపూర్: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రం విడుదలపై రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా జనవరి 25న పద్మావత్ చిత్ర ప్రదర్శనకు అనుకూలంగా ఇంతకుముందు ఇచ్చి న తీర్పును వెనక్కి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాయి. ఇరురాష్ట్రాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం, ఈ మధ్యంతర పిటిషన్లను మంగళవారం విచారించేందుకు అంగీకరించింది. పద్మావత్ చిత్ర ప్రదర్శనపై గుజరాత్, రాజస్తాన్ ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని ఈ నెల 18న కోట్టేసిన సుప్రీం.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు అనుమతిచ్చింది. ఈ సినిమా బృందంతో పాటు ప్రేక్షకులకు సైతం రక్షణ కల్పించాలనీ, చిత్ర ప్రదర్శనను అడ్డుకునే చర్యలు తీసుకోరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పద్మావత్ చిత్రం విడుదలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రాజస్తాన్‌లోని చిత్తోడ్గఢ్లో నిర్వహించిన ‘స్వాభిమాన్ ర్యాలీ’లో రాజ్‌పుత్ మహిళలు కత్తులు పట్టుకుని భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలను నిషేధించకపోతే ఆత్మగౌరవంతో చనిపోవడానికి వీలుగా యాక్టివ్ యూథనేషియా (అనాయాస మరణం)కు అనుమతించాలని వీరు రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించారు. పద్మావత్ చిత్రం విడుదలను నిలిపివేయకుంటే రాణి పద్మిని తరహాలోనే తామంతా ఆత్మాహుతి చేసుకుంటామని జోహర్ క్షత్రానీ మంచ్ కార్యదర్శి సంగీతా చౌహాన్ హెచ్చరించారు. -
దేశంలో కనీవినీ ఎరుగని నిరసన
జైపూర్/అహ్మదాబాద్ : దేశ చరిత్రలోనే ఊహించని మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా 2వేల మంది మహిళలు ఆత్మార్పణకు సిద్ధమైన అరుదైన ఘట్టం. ‘‘మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం..’’ అని రాజ్‌పుత్ మహిళలు శపథంపూనారు. మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘పద్మావత్’ విడుదలకానున్న నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మాహుతికి పేర్లు నమోదు చేసుకున్న 2వేల మంది మహిళలు : రాజ్‌పుత్ కులానికి చెందిన రాణి పద్మావతిది గొప్ప చరిత్ర అని, సినిమాలతో ఆమె పరువును మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 3వేల మంది రాజ్‌పుత్ మహిళలు పాల్గొన్నారు. సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ(జౌహార్) చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. జౌహార్‌కు సిద్ధమంటూ ఇప్పటికే 2వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు. బస్సులు బంద్.. మంత్రి అనూహ్య వ్యఖ్యలు : గుజరాత్లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హెహసానా రీజియన్‌లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనేఉన్నాయి. పలుచోట్ల గుజరాత్ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి భూపేంద్రసింహ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటివి చాలా సహజం’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంపైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 25న దేశవ్యాప్త ఆందోళన : పద్మావత్ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కర్ణిసేన.. సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ‘‘ఇప్పటికే థియేటర్ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్ మీడియాతో అన్నారు. -
పద్మావత్ ప్రదర్శించి తీరుతాం
సాక్షి, భోపాల్ : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్‌ను విడుదల చేసి తీరుతామని మధ్యప్రదేశ్‌లో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పద్మావత్ సినిమాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించి సుప్రీం ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని మధ్యప్రదేశ్ సర్కార్ యోచిస్తున్నా థియేటర్ యజమానులు మాత్రం వెనక్కితగ్గలేదు. మధ్యప్రదేశ్‌లో జనవరి 25న 150కి పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నామని, దీనికి తగిన భద్రత కల్పించాలని థియేటర్ల యజమానులు, పంపిణీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి అదనపు భద్రత కోరాలని కూడా సినిమా థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, డీజీపీ రిషికుమార్ శుక్లాలను థియేటర్ యజమానుల అసోసియేషన్ త్వరలోనే కలవనుంది. మరోవైపు సినిమా విడుదలను నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన రాజ్పుట్ కర్ణిసేన పద్మావత్‌ను ప్రదర్శిస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. -
‘పద్మావత్’కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: వివాదాస్పద బాలీవుడ్ చిత్రం పద్మావత్ ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఈ చిత్ర ప్రదర్శనపై నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో(రాజస్తాన్, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్) విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాలు పద్మావత్‌పై నిషేధం విధించకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. పద్మావత్ విడుదలైన తరువాత శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. చిత్ర నిర్మాతల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వాదిస్తూ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తరువాత నిషేధం విధించే అధికారం రాష్ట్రాలకు లేదని అన్నారు. గుజరాత్, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పద్మావత్ విడుదలైతే ఆ రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు నెలకొంటాయని నిఘా వర్గాల సమాచారం ఉందని, సెన్సార్ బోర్డు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే విడుదలకు అనుమతిచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు ‘సూపర్ సెన్సార్ బోర్డు’లా వ్యవహరించరాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. పద్మావత్‌ను ఆడనీయం: కర్నిసేన సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాజ్‌పుత్ కర్నిసేన కార్యకర్తలు, హిందూ అతివాదులు విధ్వంసానికి దిగారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కర్నిసేన కార్యకర్తలు ఓ సినిమా థియేటర్‌పై దాడికి పాల్పడి, పద్మావత్ పోస్టర్లను చించేశారని పోలీసులు తెలిపారు. పద్మావత్ ప్రదర్శనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గం కర్నిసేన ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామని పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకునేలా సహకరించాలని సంస్థ నాయకుడు స్వచ్ఛంద సంస్థలను కోరారు. -
సినిమా కష్టాలు
-
బయో పీక్స్
► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా? చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది. ► బయోపిక్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. బాక్సింగ్ రింగ్‌లో మేరీ కోమ్ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న హార్టులు కూడా స్వీట్ సిక్స్టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్ స్టోరీతో ‘డర్టీ పిక్చర్’ తీస్తే ఎగబడి చూశారు. గ్రౌండ్లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్లో ఆడటానికి ఏ రేంజ్లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్.ధోని’ హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్ స్టోరీస్ ఏంటంటే... ► ట్రిపుల్ ధమాకా కిలాడీ కుమార్... బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ విషయంలో అక్షయ్ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. సోషల్ మెసేజ్ ఉన్న ‘ప్యాడ్‌మేన్’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్కిన్’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్’. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్లాంటి మాస్ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్. ఈ ఒక్క బయోపిక్‌లోనే కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే... ► గోల్డెన్ జూబ్లీ ఇయర్లో గోల్డ్ లాస్ట్ ఇయర్ అక్షయ్‌కుమార్ గోల్డెన్ జూబ్లి ఇయర్లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అక్షయ్ ‘గోల్డ్’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్ పూర్తయింది. హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్ సింగ్ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్’ తీశారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► గుల్షన్ జీవిత కథలో... ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్ కుమార్ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్ మ్యూజిక్ లేబుల్ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్’ చిత్రంలో గుల్షన్ కుమార్ పాత్ర చేయబోతున్నారు అక్షయ్. 1997లో గుల్షన్ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్ఎల్బి 2’ తెరకెక్కించిన సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► క్వీన్ కంగనా ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► దత్‌గా కపూర్ హీరో సంజయ్ దత్ జీవితం కథతో రాజ్‌కుమార్ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ చేస్తున్నారు. యంగ్ ఏజ్, ఓల్డ్ సంజయ్గా కనిపించడం కోసం రణ బీర్ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సంజయ్ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ► హృతిక్.. ఫస్ట్ బయోపిక్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్ ‘సూపర్ 30’ అనే కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్ ఇది. విశాల్ బాల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ ‘సూపర్ 30’. నవంబర్‌లో రిలీజ్ కానుంది. ► అతని గోల్ గెలుపే ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్ అయ్యింది. సందీప్ సింగ్ తిరిగి హాకీ స్టిక్ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్ గెలుపువైపు. హాకీ స్టిక్ పట్టుకున్నారు.. గోల్ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్ కథనంపై రీల్ లైఫ్ స్టోరీ రూపొందుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ► గురి ఎలా కుదిరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్. గోల్డ్ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్ బింద్రా పాత్రను హర్షవర్థన్ కపూర్ పోషించనున్నారు. ► సెట్స్‌కు సై! దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె జీవితం సిల్వర్ స్క్రీన్కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ► ఆడ.. ఈడ..అదే జోరు! పది బయోపిక్స్ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్ నటిస్తారని టాక్. రచయిత షాహిర్ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్ నటిస్తారట. ఆల్రెడీ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్ స్టోరీస్ రీల్ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్) కూడా బయోపిక్స్ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్’ చేస్తుండటం విశేషం. ► నో ఫైట్! సందీప్సింగ్కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్ ఏంటి గురూ అంటే.. రియల్ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్ సింగ్ బయోపిక్)ను జూన్ 29న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్ బయోపిక్కు పరిశీలనో ఉన్న టైటిల్) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సో.. నో ఫైట్ అన్నమాట. -
పద్మావత్’పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ‘పద్మావత్’ బాలీవుడ్ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అనుకుంటున్న సమయంలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను నిషేధించారు. ఆది నుంచి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, వ్యయ ప్రయాసాలకోర్చి సినిమాను పూర్తి చేసిన నిర్మాతలకు సెన్సార్ బోర్డు తలనొప్పులు కూడా తప్పలేదు. (సాక్షి ప్రత్యేకం) చివరకు బోర్డు సూచన మేరకు పద్మావతి పేరును పద్మావత్‌గా మార్చగా ఐదు కట్లతో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యూ–ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేశాక సినిమా విడుదలను అడ్డుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఉంటే అది న్యాయబద్ధమే అవుతుందా? ఈ అంశాలను తేల్చుకునేందుకే సినిమా నిర్మాతలు బుధవారం నాడు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) వెబ్సైట్ ప్రకారం సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం కనుక సినిమా ఆటోగ్రపీ చట్టం–1952 నిబంధనలను అమలు చేసే అధికారం కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. ఈ కారణంగా తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను (ఆందోళనలను) పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు అధికారం ఉందనే విషయం స్పష్టమవుతుంది. (సాక్షి ప్రత్యేకం) సీబీఎఫ్సీ చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషిని కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వమే నియమించింది. ( సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సెన్సార్ బోర్డును లెక్క చేయక పోవడం కాదా? ఓ ప్రజాస్వామ్య సంస్థ ఉనికికే ప్రమాదం తీసుకరావడం కాదా? సొంత పార్టీ ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌ను అవమానించడం కాదా? సెన్సార్ బోర్డు తొందరపడి సినిమా విడుదలకు నిర్ణయమేమీ తీసుకోలేదు. కేంద్ర పార్లమెంటరీ ప్యానెల్, చరిత్రకారుల కమిటీ ఆమోదంతోనే సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ కారణంగా బీజేపీ సీఎంల ప్రవర్తన పార్లమెంటరీ ప్యానల్ అభిప్రాయాన్ని కూడా అగౌరవపర్చడమే అవుతుందికదా? సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం అనేదే తమకు ప్రాతిపదికగా భావిస్తే ఇక రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సినిమాల విషయాల్లో తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదకర పరిస్థితులకు దారితీయదా? తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగదా?(సాక్షి ప్రత్యేకం) వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి అడుగడుగున సినిమా నిర్మాతలకు అడ్డం పడడం, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేయడం, హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తే లక్షల రూపాయలు ఇస్తాననడం, హీరోలు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లను బెదిరించడం, సినిమా పేరు మార్చినంత మాత్రాన సినిమాను అనుమతించాలని ఎక్కడైన ఉందా? అంటూ సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రశ్నించడం, సెన్సార్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖతోపాటు ప్రధాని కార్యాలయం మౌనం వహించడం తదితర అన్ని పరిణామాలు భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కడమే అవుతుంది. మరి సుప్రీం కోర్టు సినిమా ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రాల పరిధిలోనివి అంటుందా? సమాఖ్య స్ఫూర్తి, భావ ప్రకటనా స్వేచ్ఛను దష్టిలో పెట్టుకొని తీర్పు చెబుతుందా? చూడాలి!((సాక్షి ప్రత్యేకం) -
గుజరాత్‌లోనూ పద్మావత్‌కు చుక్కెదురు
సాక్షి, ముంబయి : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్‌కు సెన్సార్ క్లియరెన్స్ లభించినా చిక్కులు తప్పడం లేదు. సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేసేందుకు అనుమతించమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పగా తాజాగా గుజరాత్ సైతం పద్మావత్ మూవీని బ్యాన్ చేసింది. పద్మావత్ సినిమా తమ రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల కాదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. జనవరి 25న పద్మావత్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పద్మావత్‌లో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్ కర్ణి సేన ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పద్మావత్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సీబీఎఫ్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రాజ్పుట్ కర్ణి సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సినిమా చూడకుండానే విమర్శలా..?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్‌గా టైటిల్ మార్చుకుని సీబీఎఫ్సీ క్లియరెన్స్ పొందినా సినిమాను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నా పద్మావత్‌పై అభ్యంతరాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇక సినిమాకు శ్యామ్ బెనెగల్, సుధీర్ మిశ్రా వంటి పిల్మ్ మేకర్లు మద్దతుగా నిలిచారు. చారిత్రక డ్రామాగా తెరకెక్కిన సినిమాపై నానా రాద్ధాంతం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అండగా నిలిచారు. దేశంలో సినీ రూపకర్తలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వీరికి తోడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ సైతం పద్మావత్ సినిమాకు మద్దతు పలికారు. పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు మూవీనే చూడలేదని విరుచుకుపడ్డారు. సినిమాను చూడని వీరందరికీ పద్మావత్‌లో అంత వివాదాస్పద అంశాలు ఏం గుర్తించారని నిలదీశారు. చిత్ర రూపకర్తలు బాధ్యతాయుత వ్యక్తులను వారు కేవలం ప్రేమనే పంచుతారని వ్యాఖ్యానించారు. -
'పద్మావత్' సినిమాకు షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న 'పద్మావత్' సినిమాకు మరో షాక్ తగిలింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు అంగీకరించినా.. ఇందుకు తాము అంగీకరించబోమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు అంగీకరించబోమని రాజస్థాన్ ప్రకటించింది. మరోవైపు రాజ్‌పుత్‌లు కూడా 'పద్మావత్’ సినిమాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేవలం సినిమా పేరును మాత్రమే మారిస్తే సరిపోదని, సినిమాలోని పాత్రధారుల పేర్లను కూడా మార్చాలని రాజ్‌పుత్ కర్ణిసేన డిమాండ్ చేసింది. ‘ఈ సినిమా విషయంలో మేం మొదటినుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ సినిమాను నిషేధించాలనే కోరుతున్నాం. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ సినిమా బాగా లేదని, చరిత్రని వక్రీకరించారని, కేవలం డబ్బుల కోసమే ఈ సినిమాను తీశారని నివేదించింది’’ అని కర్ణిసేన సభ్యుడు మణిపాల్ సింగ్ మకర్ణ మీడియాతో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మేం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నామని, విషయాన్ని నేను ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. లేదంటే సినిమా విడుదల తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సినిమా విషయంలో సీబీఎఫ్సీ చైర్మన్ జోషి, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా విడుదలైతే.. పెట్రోల్ పోసి థియేటర్లను తగులబెడతామని కర్ణిసేన సభ్యులు హెచ్చరిస్తున్నారు. -
'పద్మావత్'కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఇటీవల తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. వివాదాల నేపథ్యంలో 'పద్మావతి' టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చుకొని ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు 'సీబీఎఫ్సీ' అనుమతి ఇచ్చింది. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిన 'పద్మావతి' సినిమాపై కర్ణిసేన నేతృత్వంలోని రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో డిసెంబర్ నెలలో రావాల్సిన ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాపై వివాదం తలెత్తకుండా సీబీఎఫ్సీ పలు మార్పులు సూచించింది. పలుచోట్ల కత్తెరలు వేసింది. ఇందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. సినిమా టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చేందుకు అంగీకరించింది. దీంతో ఈ నెల 25న సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. -
ఏకమవుతున్న రాజ్‌పుత్‌లు.. పూర్తిగా బ్యాన్!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్ బోర్డు ప్యానెల్ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు. చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్‌పుత్ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్‌ఘడ్‌లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు. చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 30న సెన్సార్ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్‌ను పద్మావత్‌గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేస్తామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. -
‘పద్మావత్’ రిలీజ్ డేట్..!
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా పద్మావతి. చారిత్రక కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మహారాణి పద్మావతి పాత్రను అభ్యంతరకరంగా చూపించారని కర్ణిసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. షూటింగ్ సమయంలో దాడి దిగిన కర్ణిసేన రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాకు కొన్ని మార్పులతో సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేసేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసేందుకు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ ను పద్మావత్ గా మార్చాలన్న సూచనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టుగా సమాచారం. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే భావిస్తున్నారు. ఈ రోజు పద్మావతిగా నటించిన దీపికా పదుకొణే పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పద్మావత్ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట. -
‘పద్మావతి’ పేరు మార్పు?!
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా బన్సాలీ భారీ సెట్టింగ్‌లతో తీసిన వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెల్సింది. అలాగే సినిమా పేరును కూడా ‘పద్మావత్’గా మార్చాలని సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులకు చూపించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన అర్వింద్ సింగ్, జైపూర్ యూనివర్శిటీకి చెందిన చంద్రమణి సింగ్, కేకే సింగ్‌లతో కలిసి సెన్సార్ బోర్డు ప్యానెల్ ఈ చిత్రాన్ని తిలకించి కొన్ని కత్తిరింపులతో యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెల్సింది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రానికి 26 కట్లను సెన్సార్ బోర్డు సూచించినట్లు ‘న్యూస్ 18’ ఛానెల్ వెల్లడించింది. జైపూర్ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెల్సింది. సెన్సార్ బోర్డు సభ్యుల సూచనలను పాటిస్తామని సినిమా నిర్మాతలు హామీ ఇచ్చినట్లయితేనే సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. సర్టిఫికేట్ ఇచ్చేముందు ప్యానెల్ మరోసారి సమావేశమై చర్చిస్తుందని సెన్సార్ బోర్డు వర్గాలు వెల్లడించగా, సినిమా నిర్మాతలు మీడియాతోని మాట్లాడేందుకు నిరాకరించారు.