ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ (ఫైల్ ఫోటో)
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకూ ఎన్నో వివాదాలు, వాయిదాలు...ఇంకెన్నో ఆంక్షలు...చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కి, భద్రత నడుమ విడుదలైంది పద్మావత్ సినిమా. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలయ్యాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన విధానం, దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్‌ల నటన పద్మావత్‌ను ఓ స్థాయిలో నిలిపాయి. ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్‌వీర్ సింగ్‌ను అరుదైన పురస్కారం వరించింది.
ఖిల్జీ పాత్రను చరిత్రలో చదవడమే కానీ, ఎవరూ చూసి ఉండరూ. కానీ రణ్‌వీర్ తన నటనతో ప్రేక్షకులకు ఖిల్జీని చూపించేశాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రణ్‌వీర్ ఆ పాత్రను పండించిన తీరుకు దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్ని పాత్రలను అద్భుతంగా మలిచినా...ఖిల్జీ పాత్ర మాత్రం ఎంతో ప్రత్యేకమైంది.
Comments
Please login to add a commentAdd a comment