Dada Saheb Phalke
-
Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ హీరోయిన్‌కి అరుదైన పురస్కారం
-
పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే?
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా పొలిమేర-2 చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. త్వరలోనే ఈ మూవీ పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. -
వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..
అలనాటి అందాల తార వహీదా రెహమాన్ 'దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు'కు ఎంపికైంది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియాలో నటి సేవలను కొనియాడారు. 5 దశాబ్దాలుగా సేవల.. 'భారతీయ చిత్రపరిశ్రమకు ఐదు దశాబ్దాలుగా వహీదా రెహమాన్‌గారు అందించిన అద్భుతమైన సేవలకుగానూ ఆమెకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వనున్నాం. ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించినందుకుగానూ నాకెంతో సంతోషంగా ఉంది. హిందీ సినిమాల్లో అత్యధికంగా నటించిన వహీదా విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వాటిలో ప్యాసా, కాగజ్ కే పూల్, చౌదావికా చంద్, సాహెబ్ బివి ఔర్ గులాం, గైడ్, కామోషి తదితర చెప్పుకోదగ్గ చిత్రాలున్నాయి అని ట్వీట్ చేశారు. తొలి సినిమాతోనే క్రేజ్.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. ఎన్టీఆర్ తన సొంత సంస్థలో 'జయసింహ' కథ తీసేందుకు రెడీ అవగా ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించాడు. అలా ఈ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. కానీ అప్పటికే రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్ చేయించడంతో ఇదే తన తొలి చిత్రంగా మారింది. 1971లో 'రేష్మా ఔర్ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema. Waheeda ji has been critically acclaimed for her… — Anurag Thakur (@ianuragthakur) September 26, 2023 చదవండి: మెగాస్టార్‌తో రొమాంటిక్ స్టెప్పులేసి తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన నటి ఎవరంటే? -
క్రియేటివిటితో పాటు అవి ఉంటేనే విజయం వరిస్తుంది: దిల్ రాజు
క్రియేటివిటితో పాటు కృషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారిని మాత్రమే సినిమారంగం విజయాలు అందిస్తుందని నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రముఖ దర్శకుడు ‘అంకురం’ ఉమామహేశ్వరరావు సారథ్యంలో నిర్వహించబడుతున్న ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ 6వ స్నాతకోత్సవం ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ... సినిమా రంగానికి అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..రాణించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్ కావొచ్చు అన్నారు.తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శకనిర్మాత డాక్టర్ గౌతమ్ విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. "దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి, ప్రిన్సిపాల్ నందన్ బాబు సమక్షంలో విద్యార్థినీ విద్యార్థులకు దిల్ రాజు సర్టిఫికెట్స్, పతకాలు అందించారు. శిక్షణలో భాగంగా స్టూడెంట్స్ తెరకెక్కించిన లఘుచిత్రాలపై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు -
విడుదలకు ముందే రికార్డ్.. ఏకంగా 37 అవార్డులు!
'గతం' అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల. ఈ చిత్రాన్ని 2020లో తెరకెక్కించారు. తాజాగా మరోసారి ఐడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిలీజ్ సిద్ధంగా ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సాయిచరణ్ పాకాల సంగీతమందించారు. ఈ మూవీని సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు నిర్మించారు. భార్గవ పోలుదాసు అద్భుతమైన పాత్రలో నటించారు. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇదిలా ఉండాగా త్వరలో కెనడాలో ఒకేవిల్లే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్‌తో సమానమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియాతో పాటు దేశాల్లోనూ ప్రశంసలు దక్కించుకుందని తెలిపారు. (ఇది చదవండి: ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!) -
‘ఖిల్జీ’కి అరుదైన పురస్కారం
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకూ ఎన్నో వివాదాలు, వాయిదాలు...ఇంకెన్నో ఆంక్షలు...చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కి, భద్రత నడుమ విడుదలైంది పద్మావత్ సినిమా. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలయ్యాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన విధానం, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌ల నటన పద్మావత్‌ను ఓ స్థాయిలో నిలిపాయి. ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్వీర్ సింగ్‌ను అరుదైన పురస్కారం వరించింది. ఖిల్జీ పాత్రను చరిత్రలో చదవడమే కానీ, ఎవరూ చూసి ఉండరూ. కానీ రణ్వీర్ తన నటనతో ప్రేక్షకులకు ఖిల్జీని చూపించేశాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రణ్వీర్ ఆ పాత్రను పండించిన తీరుకు దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్ని పాత్రలను అద్భుతంగా మలిచినా...ఖిల్జీ పాత్ర మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. -
దేశం మెచ్చిన నటుడు...
మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సందర్భంగా... పదేళ్లుంటాయి.లాహోర్ నుంచి ఢిల్లీకి కాందశీకులుగా వచ్చి పడ్డారు. స్నేహితులు విడిపోయారు. బంధువులు విడిపోయారు. ఆ అందమైన నగరం విడిపోయింది. ఆటలూ పాటలూ... ఇక్కడ ఢిల్లీ హడ్సన్ లేన్‌లో శరణార్థి శిబిరంలో... ఎవరు ఏమిటో... ఎలా బతకాలో... అప్పుడే తల్లి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్యం బాగలేదు. తల్లికీ బాగలేదు. హాస్పిటల్లో చేర్చారు. కాని ఇంకా గొడవలు ఆగిపోలేదు. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ సైరన్ మోగినప్పుడల్లా రక్షణ కోసం డాక్టర్లు నర్సులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లి దాక్కునేవారు. ఆ రోజు సైరన్ మోగింది. డాక్టర్లు నర్సులు పేషెంట్లను వదిలి పారిపోయారు. తల్లి వేదనతో డాక్టర్లను పిలుస్తోంది. ఆమె ఎందుకు పిలుస్తోందో ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కావడం లేదు. మళ్లీ మళ్లీ పిలుస్తోంది. కాని ఎవరూ రావడం లేదు. మరి కాసేపటికి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ అచేతనమైంది. పదేళ్ల వయసులో దేశం చేసిన గాయం ఇది.ఇది ఇలా ఎందుకు ఉంది? నా దేశం గొప్పది. ఆ గొప్పదనం నిలబెట్టేలాగే నేనూ ఈ దేశ ప్రజలూ ఉండాలి. అది ప్రేమే. అదొక్కటే ఉంది. అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. కాని ‘మనోజ్ కుమార్’ అని ముందే నిర్ణయించుకున్నాడు. శరణార్థి శిబిరంలో పొద్దు పోక మొదటిసారి సినిమా చూశాడు. దాని పేరు ‘జుగ్ను’. దిలీప్ కుమార్ హీరో. ఆ తర్వాత మరో సినిమా చూశాడు. దాని పేరు ‘షబ్నమ్’. అందులో కూడా దిలీప్ కుమారే హీరో. పెద్దయ్యి నేను దిలీప్‌కుమార్ అవుతాను అనుకున్నాడు. పేరు కూడా డిసైడ్ చేసుకున్నాడు. మనోజ్ కుమార్. అది షబ్నమ్లో దిలీప్ ధరించిన పాత్ర పేరు. అందరూ సినిమాల మీద పిచ్చితో బొంబాయి పారిపోయి వస్తాడు. మనోజ్ కుమార్ తల్లిదండ్రుల అనుమతితో బొంబాయి వచ్చాడు. యాక్టర్ కావాలి. హీరో కావాలి. కల. కాని తల తిప్పి చూస్తే అలాంటి కలలు వేలాది ఉన్నాయి. భుజానికి రాసుకు పూసుకు తిరుగుతూ వడపావ్‌తో పొట్ట నింపుకుంటున్నాయి. మరి అవకాశాలు ఎలా వచ్చాయి? నిలబడటం నేర్చుకోవడం వల్ల. అవును... సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం నేర్చుకున్నాడు. సినిమా అవకాశాల కోసం స్టుడియో బయట నిలబడటం నేర్చుకున్నాడు. సినిమాల్లో అవకాశం వచ్చాక వాటిని నిలబెట్టుకోవడానికి డెరైక్టర్ ముందు నిలబడటం నేర్చుకున్నాడు. రాత్రిళ్లు ఎప్పుడైనా రూమ్‌కు వెళ్లే ట్రైన్ మిస్సైపోతే స్టేషన్లో తల దాచుకోవడానికి స్టేషన్ మాస్టర్ ముందు వినయంగా నిలబడటం నేర్చుకున్నాడు. వంగి వంగి నడిచేదా ఈ దేశ యువత? దీనికో వెన్ను ఉందని గుర్తు చేయాలి. కోపం లేదు. ఉన్నది ప్రేమే. యువతను తట్టి లేపాలి. ఆలోచించాడు. భగత్ సింగ్. అవును... భగత్ సింగ్ మీద సినిమా తీయాలి. అప్పటికి చిన్న నటుడే. పైగా అంతకు ముందు రెండు సినిమాలు భగత్ సింగ్ మీద తేస్తే బోల్తా కొట్టాయి. కాని తాను కంకణం కట్టుకున్నాడు. ప్రొడ్యూసర్ కూడా చావో రేవో అంటున్నాడు. కాని భగత్ సింగ్ గురించి సమాచారమే లేదు. పంజాబ్‌లో ఉన్న తల్లి దగ్గరకు వెళితే ఆశీర్వాదం దక్కింది. బంధువుల దగ్గరకు వెళితే ఛీత్కారమే ఎదురయింది. చివరకు తాను పుస్తకాల్లో ఏరుకున్న సమాచారం నుంచే మనోజ్ కుమార్ కథను రాసుకున్నాడు. అయితే అసలు సమస్యంతా లొకేషన్లో వచ్చింది. దర్శకుడిగా పెట్టుకున్న రామ్శర్మకు దర్శకత్వం రాదు. వచ్చన్నావ్? అంటే అనుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ బరువు కూడా తనే నెత్తిన వేసుకున్నాడు. చివరకు షహీద్ విడుదల అయ్యింది. 1965... షహీద్ నామ సంవత్సరంగా నిలిచింది.పెద్ద హిట్. భగత్ సింగ్‌గా వేసిన ఆ నటుడు మనోజ్ కుమార్ పెద్ద హిట్. ఈ మాత్రం దేశభక్తిని చూపించే వాళ్లు ఏరి? మరో పొగడ్త కాచుకుని ఉంది. ఆ రోజు మనోజ్ కుమార్ ఫోన్ మోగింది. ‘మనోజ్ కుమార్?’ ‘ఎస్ సర్. మీరెవరు?’ ‘నేను లాల్ బహదూర్శాస్త్రిని. ఒకసారి టీ పుచ్చుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కు రాగలరా?’ షహీద్ చూసిన లాల్‌బహదూర్ శాస్త్రి మనోజ్ కుమార్‌ని ఒక కోరిక కోరారు. ‘జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని బలపరిచే సినిమా ఏదైనా తీయగలవా?’ ఒక ప్రధాని కోరిక. తన దేశం తన ప్రేమ ప్రకటనకు వీలైన కోరిక.ఒక మనిషికి ఎంతటి అంతర్గత శక్తి ఉంటుందనే దానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ప్రోత్సహించే తోడు దొరికితే ఆ శక్తి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఢిల్లీ నుంచి బొంబాయి తిరుగు ప్రయాణానికి మనోజ్ కుమార్ రైలు ఎక్కాడు. తన బెర్త్ మీదకు చేరాక రాయడం మొదలుపెట్టాడు. ఏం స్టేషన్ వస్తోందో ఏం స్టేషన్ పోతోందో అనవసరం.రాస్తూనే ఉన్నాడు. బొంబాయి వచ్చేసరికి చేతిలో స్క్రిప్ట్ ఉంది.పేరు- ఉప్కార్. మేరే దేశ్ కి ధర్తీ ఉగలే సోనా మోతీ మేరే దేశ్ కి ధర్తీ... ‘ఉప్కార్’ పెద్ద హిట్. హీరో తనే. నిర్మాత తనే. దర్శకుడూ తనే. జనం విరగబడి చూశారు. ఎందుచేతనో వాళ్లకు అతణ్ణి మనోజ్ కుమార్ అని పిలవడం ఇష్టమనిపించలేదు. ఇంకా దగ్గరగా పిలిచుకోవాలి. ప్రేమగా పిలుచుకోవాలి. గౌరవంగా పిలుచుకోవాలి. ఎస్. మిస్టర్ భారత్. ఆ రోజు నుంచి మనోజ్ కుమార్ ముద్దు పేరు మిస్టర్ భారత్ అయ్యింది. కల్చర్‌ను అరువు తెచ్చుకోవడం సినిమా వాళ్ల పని.కాని కల్చర్‌ను ప్రశ్నించడం మనోజ్ కుమార్ పని.డెబ్బైల కాలం నాటికి వెర్రి తలలు వేస్తున్న పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని ప్రశ్నించడానికి ఈ దేశ సంస్కారాన్ని గుర్తు చేయడానికి మనోజ్ కుమార్ సినిమా తీశాడు. పేరు ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’. పెద్ద హిట్. ఈ దేశంలో పేరుకు పోయిన అవినీతి, బ్లాక్ మార్కెటింగ్, లంచాలు వీటిని ప్రశ్నిస్తూ... వీటి వల్ల రగిలిపోతున్న నిరుద్యోగ యువత గుండె మంటలను చూపిస్తూ మరో సినిమా తీశాడు. ‘రోటీ కప్డా ఔర్ మకాన్’. అదీ పెద్ద హిట్టే.పార్కులూ చెట్లు పుట్టలూ త్రికోణాకార ప్రేమలూ... వీటన్నింటి మధ్య ఎప్పుడూ మనోజ్ కుమార్ దేశం కోసం ఆలోచించే ఒక నిజమైన హీరోలా మిగిలాడు. ఒక్క మనిషిలో చిన్న మార్పు వచ్చినా అది జాతీయ జెండాను ఎగురవేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదు. 1981. మనోజ్ కుమార్ జీవితంలో ఉత్తేజకరమైన సంవత్సరం. ఆ సంవత్సరమే ఎవరి పేరు పెట్టుకుని ఈ రంగంలోకి వచ్చాడో ఎవరి స్ఫూర్తితో నటన నేర్చుకున్నాడో ఎవరిని చూస్తూ కెరీర్‌ను నిర్మించుకున్నాడో ఆ హీరో- దిలీప్ కుమార్‌ను డెరైక్ట్ చేసే అవకాశం వచ్చింది. సినిమా- క్రాంతి. మనోజ్ కుమార్, శశి కపూర్, శతృఘ్న సిన్హా, హేమమాలిని... భారీ తారాగణం అంతా నటించింది. మరో శక్తివంతమైన దేశభక్తి సినిమా.సూపర్ డూపర్ హిట్. ఈ దేశానికి మనోజ్ ఎప్పుడూ అపకారం చేయలేదు. ఈ దేశం కూడా అతడికి ఎప్పుడూ అపకారం లేదు. ఒక రూపాయికి పది రూపాయలు ఇచ్చి అక్కున చేర్చుకుంది. మనోజ్ కుమార్ గొప్ప నటుడు అంటే కొందరికి అభ్యంతరం ఉండొచ్చు కాని అతడు గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు అంటే మాత్రం అంగీకారం ఉంటుంది. దర్శకత్వంలో చాలామంది శిష్యులను తయారు చేశాడు. అమితాబ్ బచ్చన్‌కు ‘రోటీ కప్డా ఔర్ మకాన్’లో మంచి వేషం ఇచ్చి అతడు నిలదొక్కుకునేలా చేశాడు. కెరీర్ తొలిరోజుల్లో ఉండగా ధర్మేంద్ర ఒక దశలో వేషాలు రాక విసుగెత్తిపోయి సొంత ఊరికి వెళ్లడానికి సిద్ధమై పోతే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇచ్చి ఈ ఒక్క నెల ఆగు... అప్పుడు కూడా అవకాశం రాకపోతే వెళ్దువుగాని అని ఆపాడు. ఆ నెలే ధర్మేంద్రకు హీరో అవకాశం వచ్చింది. ఆ సంగతి ఇప్పటికీ ధర్మేంద్ర కృతజ్ఞతగా చెప్పుకుంటాడు. మిస్టర్ భారత్ అనే బిరుదు మనోజ్ కుమార్‌కు గొప్ప గౌరవమే. కాని దానిని నిలబెట్టుకోవడం ఒక్కోసారి భారమైంది కూడా. అతడు సిగరెట్ తాగుతున్నా వచ్చి అంత పెద్ద బిరుదు ఉన్నవాడివి నిర్బాధ్యతగా ఉంటావా అని మందలించేవారు ఎదురయ్యేవారు. సినిమాల్లో రొమాన్స్ చేయడానికి వీలయ్యేది కాదు. అల్లరి చిల్లరి వేషాలూ వేసే అవకాశం పోయింది. కాని మనోజ్ ఇవన్నీ ఇష్టంగానే స్వీకరించాడు. ఎందుకంటే ప్రపంచానికి ముద్దుబిడ్డ- భారత్. భారత్‌కు ముద్దు బిడ్డ- మిస్టర్ భారత్.జై భారత్. - నెటిజన్ కిశోర్ టాప్ టెన్ ఓ కౌన్ థీ 1964 షహీద్ 1965 హిమాలయ్ కి గోద్ మే 1965 గుమ్నామ్ 1965 దో బదన 1966 ఉప్కార్ 1967 పూరబ్ ఔర్ పశ్చిమ్ 1968 రోటీ కప్డా ఔర్ మకాన్ 1974 దస్ నంబరి 1976 క్రాంతి 1981 -
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే
క్రీడలు .ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా ధోని ఐసీసీ ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపికయ్యాడు. ధోనితోపాటు మరో ముగ్గురు భారత క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్‌లకు కూడా ఈ జట్టులో స్థానం లభించింది. విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా శిఖర్ ధావన్ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌తోపాటు మరో నలుగురు క్రికెటర్లు.. ర్యాన్‌హారిస్ (ఆస్ట్రేలియా), క్రిస్‌రోజర్స్ (ఆస్ట్రే లియా), జో రూట్ (ఇంగ్లండ్), ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ ఎడ్వర్డ్స్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013లో కనబరిచిన ఉత్తమ ఆటతీరుకు వీరిని ఎంపిక చేశారు. విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నిలిచాడు. మానవ్‌జిత్‌కు స్వర్ణం ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ పురుషుల ట్రాప్ విభాగంలో భారత షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధు స్వర్ణం సాధించాడు. సంధు నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్లోను విజేతగా గెలిచాడు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన మైకేల్ డైమండ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20 టోర్నీ విజేతగా బరోడా జట్టు నిలిచింది. ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది. దక్షిణాసియా జూడోలో భారత్‌కు పది స్వర్ణాలు నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగిన దక్షిణాసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఏప్రిల్ 10 నుంచి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతో పాటు చెరో రజతం, కాంస్యం సాధించింది. టెక్సాస్ రన్నరప్ దీపిక భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ టెక్సాస్ ఓపెన్‌టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్‌ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక ఓడిపోయింది. జాతీయం ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 7న చేరింది. ఈ రైలు డెకర్గావ్ (అసోం) నుంచి ఇటానగర్‌కు సమీపం లోని నహర్లగున్కు చేరింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ 2008 జనవరి 31న ప్రకటించిన ప్యాకేజీలో ఈ రైలు సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో భారత రాజధాని న్యూఢిల్లీతో అనుసంధానిస్తూ రైల్వే సర్వీసులను ప్రవేశపెడతామని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌తుకీ ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించిన ‘హార్ట్‌బ్లీడ్ వైరస్‘ అత్యంత ప్రమాదకరమైన హార్ట్‌బ్లీడ్ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తోంది. హార్ట్‌బ్లీడ్ వైరస్‌తో లక్షలాది పాస్వర్డలు, క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని హ్యాకర్లు తేలిగ్గా చేజిక్కించుకోగలుగుతారు. హ్యాకింగ్‌పై పోరాడుతున్న భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం ఈ వైరస్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుమానిత ఈ-మెయిళ్లు, సందేశాలు,ఆడియో, వీడియో క్లిప్‌లు, ఈ-లింకులను వెంటనే తొలగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వినియోగదారులు తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని, ఓపెన్ ఎస్.ఎస్.ఎల్ ను 1.0.1జి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్,ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సైబర్ భద్రతా సంస్థ సూచిస్తోంది. ఉత్తమ రైల్వే స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో విజయవాడ ఉత్తమస్టేషన్‌గా ఎంపికైంది. అదే విధంగా పునర్నిర్మించిన ప్రాంగణాల్లో ఉత్త మ స్టేషన్ పురస్కారానికి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎంపికైంది. 59వ రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డులను ప్రక టించినట్లు రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. భారత వృద్ధిని అంచనావేసిన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ రేటును 2013లో 4.4 శాతం, 2012లో 4.7 శాతంగా పేర్కొంది. 2015-16 వృద్ధిని 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇది లా ఉండగా.. 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఏప్రిల్ 9న విడుదల చేసిన సౌత్ ఏసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బలపడుతున్న రూపాయి మారకపు విలువ, పలు భారీస్థాయి పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం లభించడంతో వృద్ధి రేటులో అనుకూలత చోటుచేసుకుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు తెలిపాయి. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం బ్లాక్-3 రకానికి చెందిన ఆధునీకరించిన అణ్వాయుధ సామర్థ్యం గల సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఏప్రిల్ 7న సైన్యం పరీక్షించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ఈశాన్యప్రాంత రాష్ట్రాల్లో చైనా చొరబాటును ఎదుర్కొనేందుకు పర్వత ప్రాంతాల్లో వినియోగించడానికి అనువుగా బ్లాక్-3 రకానికి చెందిన క్షిపణిని తీర్చిదిద్దారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకొనేందుకు భారత్ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ ను పశ్చిమ బెంగాల్‌లోని పానాఘర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన బ్రహ్మోస్‌ని ఇక్కడే మొహరిస్తారు. బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యానికి అప్పగించారు. దీన్ని ఉపరితలం, జలాంతర్గామి, ఆకాశం నుంచి ప్రయోగించేందుకు అనువుగా రూపొందించారు. బ్రహ్మోస్‌ను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వార్తల్లో వ్యక్తులు విజ్డ్డన్ ముఖచిత్రంపై సచిన్ విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్-2014 పుస్తకం 151వ సంచిక ముఖచిత్రంపై భారత మాజీ క్రికెటర్ సచిన్టెండూల్కర్ చిత్రాన్ని ప్రచురించింది. తద్వారా ఈ అల్మనాక్ పుస్తకంపై ముఖచిత్రంగా ప్రచురితమైన తొలి భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఈ పుస్తకం ఏప్రిల్ 10న లండన్‌లో విడుదలైంది. ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ రోహిణి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్రకెక్కారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తికి దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏప్రిల్ 11న ఆమోదముద్ర వేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోథా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోథా (64) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 27న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం తరువాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.ఎం.లోథాయే అత్యంత సీనియర్ న్యాయమూర్తి. వయో పరిమితి రీత్యా లోథా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనుండటంతో ఐదు నెలల కాలమే ఈ పదవిలో కొనసాగనున్నారు. జోధ్‌పూర్‌లో జన్మించిన లోథా రాజస్థాన్, బాంబే హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పాట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 డిసెంబర్ 27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు బృందానికి లోథాయే నేతృత్వం వహిస్తున్నారు. ఔషధ పరీక్షలకు సంబంధించిన కేసులనూ ఆయన నేతృత్వంలో ధర్మాసనమే విచారించింది. అలాగే మైనారిటీ పాఠశాలల్లో విద్యా విధానాలను పరిశీలించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలోనూ లోథా ఉన్నారు. నాస్కామ్ చైర్మన్‌గా ఆర్.చంద్రశేఖరన్ కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛీఫ్‌మేనేజింగ్ డెరైక్టర్ అయిన బీవీఆర్ మోహన్‌రెడ్డి నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అవార్డులు గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రముఖ కవి, సినీ గేయరచయిత, దర్శక-నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు, కథ, మాటల రచయితగా , దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ పురస్కారాన్ని అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. అవార్డు కింద రూ. 10 లక్షల నగదుతోపాటు స్వర్ణకమలం అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్‌సర్‌లో స్థిరపడింది. 2002లో ఆయనకు సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు గాను ఏఆర్‌రెహ్మాన్‌తో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది. రతన్‌టాటాకు బ్రిటిష్ అవార్డు టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాస్ లభించింది. బ్రిటన్, భారత్‌ల మధ్య సంబంధాలు, బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ఏప్రిల్10న ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీస్ వెల్లడించింది. 2014కి ఐదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటీష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్‌టాటా ఒకరు. 2009లో టాటాకు నైట్ కమాండర్ అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది. విజయ్ శేషాద్రికి పులిట్జర్ భారత సంతతికి చెందిన విజయ్‌శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. శేషాద్రి కవితా సంకలనం ‘3-సెక్షన్స్’ కుగాను ఈ పురస్కారం లభించింది. 98 వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ఎంపిక కమిటీ జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రకటించింది. అవార్డు కింద 10 వేల డాలర్లను అందజేస్తారు. శేషాద్రి 1954లో బెంగళూర్‌లో జన్మించారు. అమెరికాలోని కొలంబియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో సారాలారెన్స్‌లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో పద్యవిభాగంలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అంతర్జాతీయం స్వాతంత్య్రం ప్రకటించుకున్న తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్ తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్‌లో రష్యా అనుకూల కార్యకర్తలు ఏప్రిల్ 7న ఉక్రెయిన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. డొనెస్క్‌లోని ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ డొనెస్క్‌ను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ నుంచి విడిపోతున్న్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజాభిప్రాయం సేకరించి మే 11 లోగా రష్యాలో చేరాలని పీపుల్స్ కౌన్సిల్ నిర్ణయించింది. -
100 ఏళ్ల మన సినిమా
సినిమా.. ఓ అద్భుతం.. ఓ చారిత్రాత్మకం.. మానవ జీవనశైలి, ఆలోచనలు, ఆహార్యం.. చివరికి మానవసంబంధాలపైనా తనదైన ముద్రవేసిన ఊహా ప్రపంచం. భారతీయ ప్రజల వినోదక్షేత్రంలో విస్తరించిన సినీ ప్రపంచానికి వందేళ్లు పూర్తయ్యూరుు. భారతీయ సినిమా ఆవిర్భావం దాదా సాహెబ్ ఫాల్కే చేసిన తొలి స్వదేశీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’తో జరిగింది. నూరేళ్ల కిందట అంటే 1931 మే 3న ఆ చిత్రం విడుదలైంది. కేవలం మూగచిత్రాలతో మొదలైన భారతీయ సినిమా 1931లో హెచ్ఎం రెడ్డి తీసిన ‘భక్తప్రహ్లాద’ తొలి టాకీ సినిమాగా జన సామాన్యానికి చేరువైంది. రఘుపతి వెంకయ్యనాయుడు, గూడవల్లి రామ బ్రహ్మం, ఎల్వీ ప్రసాద్ తదితరుల విశేషకృషితో ముందుకు సాగిన తెలుగు సినిమా కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, చక్రపాణి వంటి మహనీయుల నీడలో విస్తృతమైంది. భారతీయ సినీ వినీలాకాశంలో తెలుగువారు ధ్రువతారల పాత్ర పోషించారు. 1950 తరువాత మనజిల్లాకు చెందిన ఎందరో నటీనటులు తమదైన ముద్రతో సినీ ప్రపంచాన్ని విస్తరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోపాటు ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ, కనకం, కైకాల సత్యనారాయణ, శోభన్‌బాబు, కోట శ్రీనివాసరావు వంటి మేటినటులు తెలుగు కీర్తిపతాకను అంతర్జాతీయంగా ఎగుర వేశారు. ప్రస్తుతం చెన్నైలో వందేళ్ల సినీ వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో మనజిల్లా తారాప్రస్థానాన్ని పరికిస్తే.. నటసింహం.. రాజకీయ దిగ్గజం.. చిత్తశుద్ధి ఉన్నవారికి లక్ష్యసిద్ధి లభిస్తుంది. విజయం వరిస్తుంది. చరిత్ర కీర్తిస్తుంది. ఇది నందమూరి తారక రామారావు జీవిత, నట, రాజకీయ జీవిత వైవిధ్యాలను విశ్లేషిస్తే వచ్చే సారాంశం. అప్పటి గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరులో 1923 జనవరి 28న జన్మించిన ఎన్టీఆర్ విజయవాడలో చదువుకునే రోజుల్లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రోత్సాహంతో రంగస్థల ప్రవేశం చేశారు. ‘రాచమల్లుని దౌత్యం’ నాటకంలో నాగమ్మ పాత్రను మీసాలు తీయకుండా పోషించి మీసాల నాగమ్మగా పేరు పొందారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి ‘వేనరాజు విప్లవం’ నాటకాన్ని ప్రదర్శించారు. కొద్దిరోజులు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎన్టీఆర్ అక్కడ పద్ధతులు నచ్చక మద్రాస్ చేరుకున్నారు. 1949లో ఎల్వీ ప్రసాద్ ప్రోత్సాహంతో ‘మనదేశం’ చిత్రంలో ఇన్స్పెక్టర్ పాత్రతో సినీరంగ ప్రవేశం చేశారు. నాటినుంచి 1996లో కీర్తిశేషులయ్యే వరకు దాదాపు 300 చిత్రాలలో ధీరోదాత్తంగా నటించారు. 1983లో రాజకీయరంగ ప్రవేశంచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యూరు. ఎవర్గ్రీన్ హీరో.. నటనలో అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక స్టరుుల్. 1924 సెప్టెంబర్ 20న గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించిన అక్కినేని, చిన్ననాటి నుంచే నాటకరంగంవైపు ఆకర్షితులయ్యారు. అనేక నాటకాల్లో నాయిక పాత్రలు పోషించారు. 1940లో విడుదలైన ‘ధర్మపత్ని’ ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే, పూర్తిస్థాయిలో కథానాయకుడిగా నటించిన చిత్రం 1944లో వచ్చిన ‘శ్రీసీతారామ జననం’. అందులో రాముడిగా నటించారు. నాటి నుంచి నేటి వరకు తిరుగులేని మహానటుడిగానే నిలిచిపోయారు. మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషిచేశారు. గుడివాడలో జూనియర్ కళాశాల నిర్మాణానికి భూరి విరాళం అందించారు. సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. నటనా యశస్వి ఎస్వీఆర్ సంభాషణలతో నిమిత్తం లేకుండా కంటిచూపుతో, ముఖ కవళికల విన్యాసంతో పాత్రపరంగా నటనను ఆవిష్కరించిన ఏకైక నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీఆర్). జులై 3, 1918న నూజివీడులో జన్మించిన రంగారావు విద్యార్థి దశలోనే రంగస్థలంపై నటించారు. కొద్దికాలం ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన నటనే ప్రాణంగా జీవించేవారు. ఆయన బంధువైన బీవీ రామానందం తీసిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడి పాత్ర పోషించారు. ఆ తరువాత మనదేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల చిత్రాల్లో చిన్నచిన్న వేషాలు ధరించిన రంగారావుకు పాతాళభైరవి రూపంలో అదృష్టం తలుపుతట్టింది. నాటి నుంచి 1974 జులైలో చనిపోయే నాటికి 150 తెలుగు, 87 తమిళ, రెండు కన్నడ, మూడు మలయూళ, మూడు హిందీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన నర్తనశాల చిత్రం విదేశాల్లో కూడా ప్రదర్శితమై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. సోగ్గాడు శోభనాద్రి 1959లో విడుదలైన ‘దైవబలం’ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఉప్పు శోభనాచలపతిరావు (శోభన్‌బాబు) 1937 జనవరి 14వ తేదీన జి.కొండూరు మండలంలోని కోడూరు పక్కన చిన నందిగామలో జన్మించారు. హైస్కూల్ విద్య మైలవరంలోనూ, ఇంటర్మీడియెట్ బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనూ, బీఎస్సీ గుంటూరు ఏసీ కాలేజీలోనూ పూర్తిచేశారు. తన 20వ సినిమా ‘వీరాభిమన్యు’లో హీరోగా అభిమన్యుడి వేషంలో నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. వెంటనే ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ సినిమాలో సోలో హీరోగా నటించారు. 1969లో విడుదలైన ‘మనుషులు మారాలి’ చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడటంతో శోభన్‌బాబు నట జీవితంలో మైలురాయిగా మారింది. మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడిగా వెలుగొందారు. ఆయన విజయవాడ వస్తే రామకృష్ణాపురంలోని కోడూరు రాజు ఇంటికే వెళ్లేవారు. విలక్షణ నటుడు కైకాల విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ బంటుమిల్లి గ్రామం లో 1935 జులై 25వ తేదీన జన్మించారు. 1959లో ‘సిపాయి కూతురు’ చిత్రంలో తొలిసారిగా నటించారు. విఠాలాచార్య ‘కనకదుర్గ పూజామహిమ’ చిత్రంలో ప్రతినాయకుడిగా వేషంవేసి ఏళ్లపాటు తిరుగులేని నటుడిగా కొనసాగారు.. కొనసాగుతు న్నారు. 1996లో రాజకీయాల్లోకి ప్రవేశించి మచిలీపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమకు కంచు‘కోట’ తెలుగు ప్రేక్షకులు ముద్దు గా కోటా అని పిలుచుకునే కోట శ్రీనివాసరావు 1945 జులై 10న కంకిపాడులో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎస్బీఐలో పనిచేశారు. 20ఏళ్ల రంగస్థల అనుభవంతో సినిమాల్లోకి ప్రవేశించారు. 1978-79 సంవత్సరంలో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా నిర్మాత, దర్శకుడు క్రాంతికుమార్ చూసి ఆ నాటకాన్ని సినిమాగా తీశారు. అలా.. కోటా సినీరంగప్రవేశం జరిగింది. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. నాటి మేటి కథానారుుక సావిత్రి ఏ హీరోతో నటించినా తన పాత్రకు అసాధారణ నటనా ప్రజ్ఞతో ప్రాణంపోసి కేవలం ముఖకవళికల ద్వారా, కంటిచూపుతో, పంటి విరుపుతో నవరసాలను సమసామర్థ్యంతో పోషించి మెప్పించిన మేటి మహానటి సావిత్రి విజయవాడలోనే పుట్టారు. 1936 డిసెంబర్ 6న జన్మించిన సావిత్రి నాట్యం, నటనలో శిక్షణ పొంది అనేక ప్రదర్శనలిచ్చారు. 1950లో ‘సంసారం’ చిత్రంలో చిన్న పాత్రలోనూ, ‘పాతాళభైరవి’లో ఒక నృత్య సన్నివేశంలోనూ నటించారు. 1952లో ‘పల్లెటూరు’ చిత్రంలో నాయికగా తొలిసారి నటించారు. ఆ వెంటనే ‘దేవదాసు’లోని పార్వతి వేషంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చారుు. పుష్కరకాలం తెలుగు, తమిళ సినీపరిశ్రమలో తిరుగులేని కథానాయికగా వెలుగొందారు. ప్రేక్షకులను తన నటనతో కనువిందు చేశారు. నటనలో విజయం సాధించిన సావిత్రి జీవితంలో మాత్రం మోసపోరుు 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు. వీరేకాకుండా.. తొలితరం కథానారుుకలు కన్నాంబ, కనకం, నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, హీరోలు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ, నేటితరం కథానాయికలు లయ, రంభ, హాస్యనటులు గుండు హనుమంతరావు, కళ్లు శ్రీనివాస్, పిళ్లా ప్రసాద్, రఘునాథరెడ్డి, కోట శంకర్రావు మనజిల్లా నుంచి సినీరంగంలోకి వెళ్లినవారే.. ఉయ్యూరుకు చెందిన పరుచూరి బ్రదర్స్ సినీపరిశ్రమలో తిరుగులేని రచయితలుగా వెలుగొందుతున్నారు.