పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే? | Satyam Rajesh Movie Polimera 2 Gets Special Honour | Sakshi
Sakshi News home page

Polimera 2 : పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే?

Published Mon, Apr 29 2024 7:30 PM | Last Updated on Mon, Apr 29 2024 7:30 PM

Satyam Rajesh Movie Polimera 2 Gets Special Honour

సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ‍ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే తాజాగా పొలిమేర-2 చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్‌ వెల్లడించారు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. త్వరలోనే ఈ మూవీ పార్ట్‌-3 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement