Satyam Rajesh
-
'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి'.. ఆసక్తిగా టీజర్
పొలిమేర మూవీ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్(satyam Rajesj>). తాజాగా మరో హిస్టారికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్.సింహ, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను(Tribanadhari Barbarik Teaser) మేకర్స్ రిలీజ్ చేశారు. పురాణాల్లో పాత్రల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అనే డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ క్రేజీ మూవీ.. అనౌన్స్మెంట్తోనే అదరగొడుతోంది!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఇప్పటికే పార్ట్-3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పొలిమేర-3ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో నందిపాటి వంశీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పొలిమేర-3 గ్లింప్స్ రిలీజ్ చేశారు. పొలిమేర-3 అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ట్విటర్లో ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని పొలిమేర-3 లోడింగ్ అంటూ మేకర్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. The Much Awaited #Polimera3 Announcement Crosses Borders💥"#Polimera3Loading.." Trending at the Top in India on @X ❤️🔥Journey begins!🤩A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2… pic.twitter.com/MAUaItl2tF— GSK Media (@GskMedia_PR) July 10, 2024Let's BEGIN the SHOW❤️🔥Get Ready for the Spine-Chilling #Polimera3, next part of #Polimera Franchise🤩#Polimera3Loading..A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2 #DrKamakshiBhaskarla… pic.twitter.com/iLCJE0tYkZ— GSK Media (@GskMedia_PR) July 10, 2024 -
మరో ఓటీటీలో 'టెనెంట్' సినిమా స్ట్రీమింగ్
టాలీవుడ్లో సత్యం సినిమాతో పాపులర్ అయిన నటుడు 'రాజేశ్'. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో సత్యం రాజేశ్‌గా ఇండస్ట్రీలో సత్తా చాటాడు. పొలిమేర సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఆపై జూన్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.వెండితెరపై టెనెంట్ చిత్రం పెద్దగా మెప్పించలేదు. కానీ, ఓటీటీ విషయంలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో కూడా 'టెనెంట్' ఎంట్రీ ఇచ్చింది. నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వై.యుగంధర్ తెరకెక్కించిన 'టెనెంట్' చిత్రాన్ని ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఇందులో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ లాంటి వాళ్లు నటించారు.'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్మెంట్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రీసెంట్గా మళ్లీ హీరోగా చేస్తూ హిట్ కొట్టిన సత్యం రాజేశ్ లేటెస్ట్ మూవీ 'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం.. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు గడవకముందే ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ 'టెనెంట్' ఓటీటీ రిలీజ్ సంగతేంటి? సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూసేద్దాం.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్.. గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ 'పొలిమేర' మూవీలో లీడ్ రోల్ చేసి కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీని సీక్వెల్ 'పొలిమేర 2'తోనూ మరో హిట్ అందుకున్నాడు. దీంతో ఇతడు హీరోగా పలు సినిమాలు తీస్తున్నారు. వీటిలో ఒకటే 'టెనెంట్'. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాని ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు.'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్మెంట్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'లవ్ మౌళి' సినిమా రివ్యూ) -
పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే?
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా పొలిమేర-2 చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. త్వరలోనే ఈ మూవీ పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. -
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేశ్
‘క్షణం’ సినిమాలో నేను పోషించిన పోలీస్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నా దగ్గరకు 50 పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేయడం నాకిష్టం లేదు. అందుకే రిజెక్ట్ చేశాను. కామెడీ చేసే పోలీసు పాత్రలు కాకుండా పవర్‌ఫుల్‌గా ఉండేవి వస్తే మాత్రం మళ్లీ పోలీసుగా నటిస్తాను. ప్రకాశ్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక అన్నారు నటుడు ‘సత్యం’ రాజేశ్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టెనెంట్’.వై.యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సత్యం రాజేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► టెనెంట్ సినిమా అనేది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్మెంట్లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్ఫెక్ట్గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది. ► కథ నచ్చడంతో చిన్న సినిమాగా స్టార్ట్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం. ► ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ► ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ► ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. అందుకే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్షన్, డ్యాన్స్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ బడ్జెట్ సినిమాలు ఎంచుకోను. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు. ► ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా. ► నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా. ► ప్రస్తుతం స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి -
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్' ట్రైలర్
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర సీక్వెల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్ విడుదల చేశారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రస్తుత కాలంలో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
‘టెనెంట్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్‌తో గీతాంజలికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్‌లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్‌పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్‌తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్‌లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్‌ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్‌గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్‌ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్‌గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్‌గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సత్యం రాజేష్ హీరోగా ‘టెనెంట్’.. రిలీజ్ అప్పుడేనా?
'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
జతనై రమ్మంటావా..
‘అచ్చట.. ఇచ్చట... ముద్దొచ్చే ముచ్చట..’, ‘అందంగా అల్లుకుంటే ఆనందం..’ అంటూ సాగుతుంది ‘టెనెంట్’ చిత్రంలోని ‘నా కథలో..’ పాట. ‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి జంటగా వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘నా కథలో నువ్వున్నావా... నీ కథనే నేనయ్యానా... నా జతగా రానున్నావా... నీ జతనై రమ్మంటావా’ అంటూ సాగే ‘నా కథలో..’ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రం సంగీత దర్శకుడు సాహిత్యసాగర్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ఎన్జే సురేంద్రనాథ్, జయశ్రీ పల్లెం పాడారు. ‘‘భార్యాభర్తల అనురాగాన్ని, ఆ΄్యాయతను తెలిపే పాట ఇది. జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు పాత్రల మధ్య జరిగే కథే ఈ చిత్రం. మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ, వారిని అలర్ట్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు వై. యుగంధర్. -
‘మా ఊరిపొలిమేర 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!) -
‘మా ఊరి పొలిమేర 2’ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
Kamakshi Bhaskarla: పొలిమేర-2 హీరోయిన్ ‘కామాక్షి భాస్కర్ల’ (ఫోటోలు)
-
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ రివ్యూ
టైటిల్: మా ఊరి పొలిమెర2 నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు నిర్మాతలు: గౌరీ కృష్ణ దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి ఎడిటింగ్ : శ్రీ వర విడుదల తేది: నవంబర్ 3, 2023 రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ.. ఊహించని విజయం సాధించడమే కాకుండా..సీక్వెల్‌పై ఆసక్తిని పెంచింది. అందుకే ‘మా ఊరి పొలిమేర 2’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సీక్వెల్‌ని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ని నిర్వహించారు. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 3)థియేటర్స్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘మా ఊరి పొలిమెర’ మూవీ క్లైమాక్స్‌లో కొమురయ్య అలియాస్ కొమిరి(సత్యం రాజేశ్) బతికి ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అతను చేతబడి చేసి చంపిన గర్భవతి కవిత(రమ్య) కూడా బతికున్నట్లు, కొమిరితో కలిసి వెళ్లినట్లు చూపిస్తూ ముగించారు. అక్కడ నుంచి పార్ట్ 2 కథ ప్రారంభం అవుతుంది. చేతబడి చేస్తూ ఊరి సర్పంచ్, అతని కూతురు చావులను కారణమైన కొమురయ్యను పట్టుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు, కానిస్టేబుల్ జంగయ్య(బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. జంగయ్య మిస్సింగ్ కేసు కొత్తగా వచ్చిన ఎస్సై(రాకేందు మౌళి) చేతికి వెళ్తుంది. అతను కొమురయ్య భార్య లక్ష్మీ(కామాక్షి భాస్కర్ల), స్నేహితుడు బలిజ(గెటప్ శ్రీను)లను అనుమానిస్తాడు. ఓ సారి శబరి వెళ్లిన బలిజకు కొమిరి కనిపిస్తాడు. అతన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని బలిజకు వివరిస్తాడు కొమురయ్య. అసలు కొమురయ్య ఎందుకు కేరళ వెళ్లాడు? చనిపోయిన రమ్య మళ్లీ ఎలా బతికొచ్చింది? బలిజ భార్య రాముల(సాహితి దాసరి) ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఆ ఊరిలో ఉన్న గుడి వందేళ్ల కిత్రం ఎందుకు మూసేశారు? ఆ గుడికి కొమిరి చేతబడులకు ఉన్న సంబంధం ఏంటి? అన్న కోసం వెళ్లిన జంగయ్య ఎలా మిస్ అయ్యాడు? భర్త కొమురయ్య గురించి లక్ష్మీ తెలుసుకున్న నిజాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘మా ఊరి పొలిమేర 2’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్(చేతబడి) అంశాన్ని జోడించి తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ అందరిని భయపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ అంటే.. అంతకు మించిన ట్విస్టులు, భయపెట్టే సీన్స్ ఉంటాయని అంత భావించారు. కానీ అలాంటి అంచనాలతో వెళ్లిన ఆడియన్స్‌ని ‘మా ఊరి పొలిమేర 2’ అంతగా ఆకట్టుకోదు. మొదటి భాగానికి వచ్చిన హైప్ వల్ల దర్శకుడిపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించింది. ఆడియన్స్‌కి ఊహించని ట్విస్టులు ఇవ్వాలనుకొని కథ, కథనంపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చేతబడి సీన్స్ బాగున్నప్పటికీ.. పార్ట్ 1లోలాగా కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలనుకొనే..టిస్టులను రాసుకున్నాడు కానీ అవి కథకు ఏ మేరకు అవసరమనేది పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం కారణంగా..ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఏర్పడుతుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా.. పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే. పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2ని ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి.. కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. కొమురయ్య, బలిజ కలిశాక వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. అసలు కవిత ఎలా బతికొచ్చింది? ఎందుకు చేతబడి చేయాల్సి వచ్చింది? అతని కలలోకి ఊర్లో ఉన్న గుడి రహస్యాలు ఎందుకు వస్తున్నాయి? అనే సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. గుడిలో కొమురయ్య చేసే పూజకు సంబంధించిన సీన్ భయపెడుతుంది. పార్ట్ వన్‌లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే.. ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. దీంతో కథ కాస్త ‘కార్తికేయ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. పార్ట్ 1లో లాగే పార్ట్ 2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి.. వాటిని సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశాడు. ఎవరెలా చేశారంటే.. కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ ఒదిగిపోయాడు. పార్ట్ 1లో నటించిన అనుభవం ఉంది కాబట్టి.. ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేర నటించాడు. అయితే పార్ట్ 1తో పోలిస్తే.. ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువ. బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'Maa Oori Polimera 2': ‘మా ఊరి పొలిమేర -2’ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అలా చేస్తే నన్ను చేతబడుల దర్శకుడు అంటారు: 'పొలిమేర 2' డైరెక్టర్
'మాఊరి పొలిమేర' సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న డా.అనిల్ విశ్వనాథ్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌తో రాబోతున్నారు. 'మా ఊరి పొలిమేర 2' నవంబరు 3న థియేటర్లలోకి రానుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు ఇందులో లీడ్ రోల్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) కథ రాసుకున్నప్పుడే కచ్చితంగా సీక్వెల్ చేద్డామని అనుకున్నాం. పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప 'కార్తికేయ' సినిమాకు మా దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్‌లు వుంటాయి. అలానే పొలిమేర 3 కూడా ఉంటుంది. దీనికి కథ సిద్ధంగా ఉంది. అయితే మూడో పార్ట్ కంటే మరో సినిమా చేస్తాను. లేదంటే నన్ను చేతబడుల దర్శకుడు అంటారేమో! (నవ్వుతూ) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) -
మర్డర్ మిస్టరీ
‘సత్యం’ రాజేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆడవాళ్లు చూడాల్సిన సినిమా ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ‘ఆడుకాలం’ నరేన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, సహ–నిర్మాత: ఎన్. రవీందర్ రెడ్డి. -
సత్యం రాజేష్ హీరోగా ‘టెనెంట్’
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. -
పొలిమేర 3 ఉంటుంది
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల, ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను పంపిణీదారుడు వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన వేడుకకు అతిథులుగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత ‘బన్నీ’ వాసు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ తరహా సినిమాలను థియేటర్స్‌లో చూస్తే ఆడియన్స్ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. ‘‘పొలిమేర 1’ మాదిరి ‘పొలిమేర 2’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘ఫస్ట్ పార్ట్ చూడనివారికి కూడా ‘పొలిమేర 2’ స్క్రీన్‌ప్లే అర్థం అవుతుంది. ‘పొలిమేర 3’ కూడా ఉంటుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘పొలిమేర’కు మించి ‘పొలిమేర 2’ ఉంటుంది. సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. -
‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్ ఎప్పుడంటే..
‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్‌లో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పోలిమేర–2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 2న విడుదల చేయనున్నారు. డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘మా ఊరి పోలిమేర ’ కన్నా రెండో భాగం ఇంకా ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి. -
Maa Oori Polimera 2 : కవిత ఎలా బతికొచ్చిందో తెలిసేది ఆ రోజే!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోన సమయంలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ని చిత్రబృందం వెల్లడించింది. ‘మా పూరి పొలిమేర-2’ ఈ సారి డైరెక్ట్‌గా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. కవిత ఎలా బతికొచ్చింది? మొదటి భాగంలో కొమిరి(సత్యం రాజేశ్)..గర్భిణి కవిత(రమ్య) బంధువుల చెతిలో దెబ్బలు తిని, ఆమె చితిలోనే పడి చనిపోయినట్లు చూపించారు. అయితే చితిలో పడి చనిపోయింది కొమిరి కాదని ఆయన తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) గుర్తిస్తాడు. క్లైమాక్స్‌లో కొమిరి కేరళలో ఉన్నట్లు చూపించారు.అంతేకాదు చనిపోయిన కవిత కూడా బతికే ఉన్నట్లు, కొమిరితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ.. శుభం కార్డు వేశారు. అసలు చనిపోయిన గర్భిణి ఎలా బతికొచ్చింది? అనేది తెలియాలంటే నవంబర్ 2 థియేటర్స్‌లో ‘పొలిమేర-2’చూడాల్సిందే. అంచనాలకు తగ్గట్టే సీక్వెల్ మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత గౌరికృష్ణ అన్నారు. `గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించాం. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది’అని దర్శకుడు విశ్వనాథ్ అన్నారు. -
మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ చూశారా?
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు. నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. 'మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం' అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సిక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తాం` అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; కో-డైరక్టర్ః ఆకుల నాగ్; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్. చదవండి: సింగర్‌తో ఛత్రపతి డేటింగ్... ఎగిరి గంతేసిన నటి -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్‌కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్‌గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్‌గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్‌ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్‌లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్‌తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్‌గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
పొలిమేరలో...
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో ఓ చిత్రం రూ΄పొందింది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరి నేపథ్యంలో, ఊరి పొలిమేర చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ న్ .సి. సతీష్ కుమార్. -
‘మా ఊరి పొలిమేర` సీక్వెల్ వచ్చేస్తుంది!
సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్లో డైరెక్టర్‌గా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. వాస్తవికతకు దగ్గరగా ఊహించని ట్వీస్టులతో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ‘ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో డా. కామాక్షి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సత్యం రాజేష్ హీరోగా కొత్త చిత్రం.. షూటింగ్ షురూ
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
సత్యం రాజేష్ హీరోగా కొత్త సినిమా, హీరోయిన్ ఎవరంటే?
తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా ఓ కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. మధు సూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి. రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. రియా సచ్చదేవా హీరోయిన్. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. చదవండి: రోడ్డు మీద తిరుగుతుంటే తిన్నావా? అని జాలిగా చూసేవారు -
‘కళాపురం’మూవీ రివ్యూ
టైటిల్ : కళాపురం నటీనటులు : సత్యం రాజేష్, ప్రవీణ్ యండమూరి, కాశీమా రఫి, చిత్రం శ్రీను, సన, జబర్దస్త్ అప్పారావు తదితరులు నిర్మాణ సంస్థలు: ఆర్4 ఎంటర్టైన్మెట్స్ నిర్మాతలు: రజనీ తాళ్లూరి దర్శకత్వం: కరుణకుమార్ సంగీతం : మణిశర్మ విడుదల తేది: ఆగస్ట్ 26, 2022 పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. ఆయన నుంచి తాజా చిత్రం ‘కళాపురం’. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 26)విడుదలైంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. ‘కళాపురం’ కథేంటంటే.. కుమార్(సత్యం రాజేష్) సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలని ప్రయత్నిస్తుంటాడు. అతని స్నేహితుడు ప్రవీణ్(ప్రవీణ్ యండమూరి)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడని తెలుసుకొని హైదరాబాద్ వస్తాడు. ఇద్దరు కలిసి సినిమాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఇదే సమయంలో కుమార్ ప్రాణంగా ప్రేమించిన ఇందు(కాశిమా రఫి)చేతిలో మోసపోతాడు. దీంతో సినిమా ప్రయత్నాలు ఆపి, ఉద్యోగం చేసుకుందామనే సమయంలో అప్పారావు అనే నిర్మాత కలిసి సినిమా చేద్దామని చెప్తాడు. అతని కారణంగానే కుమార్ కళాపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ కుమార్‌కి ఎదురైన పరిస్థితుల ఏంటి? కళాపురంలో శారద(సంచిత)తో పరిచయం కుమార్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకు కుమార్ సినిమాని తెరకెక్కించాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. చిత్ర పరిశ్రమ ఉండే మోసాలు, కష్టాలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘కళాపురం’కూడా అదే కోవకు చెందినదే. కాకపోతే కరుణ కుమార్ ఈ సినిమాతో అంతర్లీనంగా చెప్పిన కథ, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే నటీనటుల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి, కథను పూర్తి స్థాయిలో విస్తరించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. పేరున్న నటీనటులు లేకపోవడం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది. ఎలాంటి అశ్లీలత లేకుండా చక్కటి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్స్ వెతక్కుండా చూస్తే ‘కళాపురం’ఎంజాయ్ చేసేయోచ్చు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత రాజేష్ ఫుల్లెంత్ పాత్ర చేశాడు. కుమార్ పాత్రలో ఆయన మెప్పించాడు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. కుమార్ స్నేహితుడు ప్రవీణ్ పాత్రలో ప్రవీణ్ యండమూరీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లుగా సంచిత, కాశీమా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినప్పటికీ.. తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా రాహు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. ‘కొత్త సబ్జెక్ట్స్‌తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు. ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది’ అన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ ఫిలిం స్కూల్లో పట్టా పొందిన సుబ్బు.. రాహు సినిమాను టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
ఊహకు అందని విషయాలతో...
అందరూ మనవాళ్లే అనుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు అనుకోకుండా ఓ కష్టం వచ్చింది. ఆమెకు సహాయంగా ఓ అజ్ఞాత వ్యక్తి నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సస్పెన్స్ వీడాలంటే మా ‘విశ్వామిత్ర’ సినిమా చూడాలంటున్నారు దర్శకుడు రాజకిరణ్. నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్ జంటగా రాజకిరణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మించారు. ఈ సినిమాను మేలో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా రాజకిరణ్ మాట్లాడుతూ – ‘‘మనిషి ఆలోచనలకు అందని చాలా విషయాలు సృష్టిలో జరుగుతాయి. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులం ఉండేది కొంతకాలమే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది’’ అని అన్నారు. జీవా, రాకెట్ రాఘవ, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీ కృష్ణ ఆకెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
కథ చెబుతానంటే ఎవరూ వినలేదు
రాజకిరణ్ సినిమా పతాకంపై రాజకిర ణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇది హారర్ సినిమా కాదు కానీ హారర్ టచ్ ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు. అశుతోష్ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్ పాయింట్ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్ ‘మీరే మెయిన్ లీడ్’ అన్నారు. రాజేశ్ మెయిన్ లీడ్ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్ గారికి ఫ్యాన్. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ భండారి, ఎడిటర్: ఉపేంద్ర. -
థ్రిల్లర్ లవ్‌స్టోరీ
నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్, విద్యుల్లేఖా రామన్ ముఖ్య తారలుగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన నటుడు అశుతోష్ రాణా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్ భర్త పాత్రలో నటిస్తున్నాను. రాజ్‌కిరణ్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు బీవీఎస్ రవి. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జానర్లదే హవా. యూఎస్, స్విట్జర్లాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి సిట్టింగ్‌లోనే సినిమా ఓకే చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ‘సత్యం’ రాజేశ్‌ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్స్‌ను సంప్రదించినప్పుడు ‘సత్యం’ రాజేశ్ హీరో అని చెప్పగానే కొందరు డ్రాప్ అయ్యారు. సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నందితా రాజ్‌కు థ్యాంక్స్. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం రాజ్‌కిరణ్‌గారు ఓ పాయింట్ చెప్పారు. బాగుంది. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. అశుతోష్ రాణాగారు, మల్లికగారు, మాధవిగారు నాకన్నా ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇదొక థ్రిల్లర్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు తెలుగులో రాని కథాంశంతో రూపొందిస్తున్నాం’’ అన్నారు మాధవి. -
నిజజీవిత సంఘటనల ఆధారంగా ‘విశ్వామిత్ర’
గీతాంజలి సినిమాతో దర్శకుడి మంచి విజయం సాధించిన రాజ్‌కిరణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన త్రిపుర సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి విశ్వామిత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్, సత్యం రాజ్, విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ కిరణ్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్‌లు నిర్మిస్తున్నారు. -
సత్యం రాజేష్‌తో సరదాగా కాసేపు
-
'ఆ 'క్షణం' నా జీవితాన్ని మార్చేసింది'
చెన్నై: గత పదేళ్లుగా కమిడీయన్గా అలరిస్తున్న 'సత్యం' రాజేశ్ కెరీర్ 'క్షణం' సినిమాతో కొత్త మలుపు తిరిగింది. ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సీరియస్ క్యారెక్టర్‌ను సమర్థంగా పోషించి మెప్పించాడు రాజేశ్. 'క్షణం' సినిమాలో తన నటనపై ప్రశంసల జల్లు కురుస్తున్న రాజేశ్ గురువారం విలేకరులతో మాట్లాడారు. 'నేను ఇప్పటివరకు 350 సినిమాల్లో నటించాను. ఎప్పుడూ ఇలాంటి పాత్రలో నటిస్తానని అనుకోలేదు. నేను సీరియస్ క్యారెక్టర్లో నటిస్తానంటే ఎవ్వరు నమ్మరు. అయినా 'క్షణం' సినిమా ఆ అభిప్రాయాన్ని మార్చింది. నేను కూడా ఇలాంటి పాత్రలో నటించగలననే నమ్మకం కలిగించింది' అని అన్నారు. 'ఈ సినిమాకు ముందు డెరైక్టర్ నన్ను కలిసినప్పుడు నన్ను హీరో స్నేహితుడిగా చేయమని అడుగుతాడనుకున్నాను. కానీ పోలీసు క్యారెక్టర్ చేయమని అనడంతో నేను నమ్మలేక పోయాను. హీరో స్నేహితుడిగానే మొదట చేయాలనుకున్నాను. కానీ 'క్షణం' కథ విన్న తరువాత ఆ పాత్ర చేయాలన్న ఉత్సాహం వచ్చింది' అని చెప్పారు. 'ఈ సినిమాకు నా పాత్రలో సంపత్ రాజ్ నటించాల్సింది. చివరిక్షణంలో నన్ను తీసుకున్నారు. 'క్షణం' రిలీజ్ అయిన్నప్పటి నుంచి ప్రసంశలు వస్తున్నాయి' అని వివరించారు. 'నేను ఈ పాత్రలో నటించినందుకు ఆశ్చర్యపోతున్నామని అభిమానులు ఫోన్లు చేసి చెబుతున్నారు. నా నటన చాలా బాగుందని, సినిమా ఇండ్రస్ట్రీకి మంచి నటుడు దొరికాడని చాలామంది అంటున్నారు' అని రాజేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత ఒకరు మరో సినిమాలో విలన్ కారెక్టర్లో నటించమని ఆఫర్ ఇచ్చారని, ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. -
హీరోగా మరో హాస్యనటుడు
హాస్యనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తరువాత హీరోగా మారిన వారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇలా హీరోగా మారిన నటులు సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇదే బాటలో మరో హాస్య నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సత్యం సినిమాతో కమెడియన్‌గా అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తరువాత కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా అలరించనున్నాడు. త్రిష లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా నాయకీ సినిమా ద్వారా రాజేష్ హీరోగా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేష్, త్రిషకు జంటగా నటించడంలేదు. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేష్‌కు జోడిగా సుష్మారాజ్ నటించనుంది. త్రిష జోడిగా డమరుకం ఫేం వెంకట్రామన్ కనిపించనున్నాడు. 1980లలో జరిగే కథగా తెరకెక్కనున్న ఈ సినిమాను హార్రర్ జానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు గోవర్థన్ రెడ్డి దర్శకుడు. -
విలాసం మూవీ స్టిల్స్
-
‘విలాసం’గా...
పవన్.జి, సనంశెట్టి జంటగా పి.ఎ. రాజగణేశన్ దర్శకత్వంలో పవిత్రన్ ప్రశాంత్ నిర్మించిన ‘విలాసం’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ -‘‘సరికొత్త సినిమా ప్రపంచాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ రెండు వేల ఎకరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సినిమా సిటీ నిర్మించలేదు. చిన్న సినిమా నిర్మాతలకు అండగా నిలబడటం కోసం త్వరలో తెలంగాణ సినీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నాకిది తొలి సినిమా. మంచి కథ, సంగీతం కుదిరింది’’ అన్నారు. పాటలు అందరికీ నచ్చుతాయని సంగీత దర్శకుడు రవి రాఘవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వరరెడ్డి, సత్యం రాజేశ్ తదితరులు మాట్లాడారు. -
సినిమా రివ్యూ: గీతాంజలి
హారర్ కామెడీ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉంటారని ‘కాంచన’, ‘ప్రేమకథా చిత్రం‘ ఇతర చిత్రాలు నిరూపించాయి. అదే హారర్, కామెడీ కథాంశంతో పేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ఫీల్‌గుడ్ టైటిల్‌తో తాజాగా ‘గీతాంజలి’ అనే చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అంజలి, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డిలతో కథా రచయిత కోన వెంకట్,దర్శకుడు రాజ్కిరణ్లు సంధించిన సరికొత్త అస్త్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం. కథ: దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారి ఓ నంది అవార్డును సంపాదించాలనే లక్ష్యంతో నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ స్మశానంకు సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది. దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’. సమీక్ష దెయ్యాలున్నాయా అనే ప్రశ్నకు సమాధానం పక్కనపెడితే.. దెయ్యాల కథతో వెండితెరపై వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కొత్త ఒరవడిని సొంతం చేసుకున్నాయి. దెయ్యాల కథ ఎప్పటికి ఓ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్. సరిగ్గా అలాంటి కథను ఎంచుకుని రెగ్యులర్ పాయింట్‌తో కోన వెంకట్ చేసిన సరికొత్త ప్రయోగం చేశాడు. కోన వెంకట్ పాయింట్‌ను దర్శకుడు రాజ్‌కిరణ్ తెరకెక్కించిన విధానం.. అనుసరించిన కథనం ఖచ్చితంగా సినీ అభిమానులను కొత్త అనుభూతికి గురిచేస్తుంది. హారర్ సినిమాకు కావాల్సిన సీన్లను పక్కాగా సిద్ధం చేసి.. కామెడీ రంగు అద్ది తెరపైన అందంగా గీతాంజలిని తీర్చిదిద్దడంలో కోన వెంకట్ టీమ్ ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. కథకు అసవరమైన నటీనటులు అంజలి, బ్రహ్మనందం, శ్రీనివాస్‌రెడ్డి, రావు రమేశ్, శంకర్, సత్యం రాజేశ్, మధుల ఎంపిక చక్కగా కుదిరింది. కథ డిమాండ్ మేరకు శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్ ఇతర పాత్రల క్యారెక్టరైజేషన్‌ను పకడ్బందీగా డిజైన్ చేశారు. దాంతో శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్‌లు వ్యక్తిగతంగా ఎక్కడ కనిపించరు.. కేవలం పాత్రలే తెరమీద కనిపిస్తాయి. ఇప్పటి వరకు గ్లామర్ తారగానే ప్రేక్షకులకు సుపరిచితులైన అంజలిని ఓ కొత్త కోణంలో కనిపించిడమే కాకుండా గ్లామర్‌తోనూ మెరిసింది. తన కెరీర్లో అంజలికి ఈ చిత్రం దిబెస్ట్‌గా మిగిలడం ఖాయం. కామెడీ పాత్రలకే పరిమితమైన శ్రీనివాస్‌రెడ్డిని ఓ నటుడిగా ఆవిష్కరించిన చిత్రంగా మారనుంది. కమెడియన్ శంకర్, రాజేశ్‌లు మరోసారి తన సత్తాను చాటారు. ఇక సైతాన్ రాజ్‌గా బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా తెరమీద చూడటమే సమంజసం. నిర్మాత దిల్‌రాజు తొలిసారి తెలుగు సినీ తెరపై కనిపించడం విశేషం. టెక్నికల్: సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫిని, ఎడిటర్ ఉపేంద్ర నుంచి మెరుగైన పనిని రాబట్టుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హారర్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి కథకు ప్రాణం పోసింది. లక్కరాజు ప్రవీణ్ అందించిన ట్యూన్లకు సాయి శ్రీరామ్ తెరమీద అందమైన దృశ్యాలుగా మలిచారు. కాఫీ సాంగ్, ఎండింగ్ టైటిల్స్‌లో బ్రహ్మనందంపై వచ్చే థీమ్ సాంగ్‌లను ఈ చిత్రనికి అదనపు ఆకర్షణ. ప్రేక్షకుల్లో ఓ భయాన్ని కలిగించే విధంగా దృశ్యాలను మలచడంలో సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి, ప్రవీణ్ నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా మారింది. ముగింపు: చిత్ర తొలిభాగంలో వినోదానికి పెద్ద పీట వేసి.. రెండవ భాగంలో కథలోకి వెళ్లడం వల్ల కొంత వేగం త గ్గినట్టు అనిపిస్తుంది. అయితే సానుకూల అంశాలు ఎక్కువ మోతాదులో ఉన్న కారణంగా కొన్ని లోపాలు అంతగా బయటకు కనిపించవు. హారర్, కామెడి చిత్రాలను ఆదరించేవారికి, కొత్తదనం, వెరైటీ చిత్రాలను ఆశించే వారికి ’గీతాంజలి’ ఓ చక్కటి చిత్రం. ఈమధ్యకాలంలో విడుదలైన హిట్ చిత్రాల్లో ‘గీతాంజలి’ చోటు సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. -రాజబాబు అనుముల