Satyam Rajesh as Hero New Movie Started Today - Sakshi
Sakshi News home page

సత్యం రాజేష్ హీరోగా కొత్త చిత్రం.. షూటింగ్‌ షురూ

Published Thu, Dec 22 2022 5:35 PM | Last Updated on Thu, Dec 22 2022 5:51 PM

Satyam Rajesh New Movie Started - Sakshi

సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది.

కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.  సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement