GANGULA KAMALAKAR
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
-
ప్రత్యేక దేశంగా ‘సౌత్ ఇండియా’.. ఎమ్మెల్యే గంగుల సెన్సేషనల్ కామెంట్స్
సాక్షి,కరీంనగర్ : దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనపై స్పందించారు. ప్రత్యేక తెలంగాణా తరహాలోనే ఆ డిమాండ్‌నూ తోసిపుచ్చలేం. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ’ అని వ్యాఖ్యానించారు.డీలిమిటేన్‌కు వ్యతిరేకంజనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది.స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. -
తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..
Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రభుత్వం ఫోకస్పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్‌కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్ చిట్‌చాట్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్ గంగుల.. 👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్‌షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు. -
ఇంకో 23 ఏళ్లయినా కష్టపడతా..సక్సెస్ తర్వాతే బయటకు వెళ్తా: అదిరే అభి
అదిరే అభి, స్వాతి మందల్ జంటగా గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’(the devil's chair). కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రసుబ్బా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది. నవీన్ గారు నిర్మాతగా మరో సినిమాను చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్న ప్రతీ ఒక్క నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న రాబోతోంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డాడు. అతని సపోర్ట్‌ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ చేసిన గడ్డం నవీన్ అన్నకి థాంక్స్’ అని అన్నారు. -
కరీంనగర్లో హీట్ పాలిటిక్స్.. మేయర్‌కు గంగుల సవాల్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ ల మధ్య మాటల యుద్ధం
-
శాసనసభలో కరీంనగర్ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది. -
నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా మలిదశ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘ధాన్యం విక్రయ టెండర్లలో రూ.750 కోట్ల గోల్మాల్’
సాక్షి, హైదరాబాద్: గోడౌన్లు, రైస్‌మిల్లులలో ధాన్యాన్ని ఖాళీ చేసేందుకు, విక్రయించేందుకు పిలిచిన టెండర్ల కేటా యింపులో రూ.750 కోట్ల మేర గోల్మాల్ జరిగిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం రాత్రి అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేస్తే, నాలుగు సంస్థలే అర్హత సాధించాయని, ఆ సంస్థలేవో ఇప్పటివరకు బహిర్గతం చేయలేదన్నారు.టెండర్లు దక్కించుకున్న ఆ నాలుగు సంస్థలు ఇప్పటివరకూ 35 కిలోల ధాన్యాన్ని కూడా సేకరించలేదని, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులుగా మిల్లర్ల నుంచి ఒక్కో క్వింటాలుకు రూ. 2,223 వసూలు చేశారని గంగుల ధ్వజమెత్తారు. ధాన్యానికి బదులు డబ్బులు వసూలు చేస్తే మిల్లుల్లో, గోడౌన్లలో ఉన్న ధాన్యం ఎలా ఖాళీ అవుతుందని ప్రశ్నించారు.అలాగే గురుకులాలు, మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలల్లో ఇచ్చే సన్న బియ్యంకు అవసరమైన 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి, అవే సంస్థల నుంచి కిలో బియ్యాన్ని రూ.57కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో కూడా కుంభకోణం ఉందని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. -
మైండ్‌గేమ్‌తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
మానకొండూర్ (కరీంనగర్): మైండ్‌గేమ్‌తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది’అని తెలిపారు.టీఆర్ఎస్గా మారుస్తాం..బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్ సునిల్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు. -
‘నామినేటెడ్’ ఎవరికో?
కరీంనగర్: పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదివరకు ప్రతిపక్ష నాయకులుగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. తాము కోరుకున్న కమిటీలో స్థానం కల్పించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హు జూరాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్(సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. గ్రంథాలయ సంస్థకు తీవ్ర పోటీ.. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఎలాంటి రాజ కీయ ఒత్తిళ్లు లేకుండా గౌరవప్రదమైన హోదా కలి గిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తమ మనసులో మాట చెప్పినట్లు సమాచారం. చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు సమితులు కొనసాగేనా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో రైతుబంధు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వీటిని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా.. కొనసాగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవులను తమకు ఇవ్వాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 7 మార్కెట్లు, 3 ఉప మార్కెట్లు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, మానకొండూర్, గోపాల్రావుపేటలతోపాటు 3 ఉప మార్కెట్లు కమలాపూర్, కేశవపట్నం, ఎల్కతుర్తి ఉన్నాయి. గత ప్రభుత్వం చైర్మన్ పదవులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం అదే పద్ధతిని పాటిస్తుందా లేదా పాత పద్ధతిలో కమిటీలను నియమిస్తుందో వేచిచూడాలి. దేవస్థాన కమిటీలు.. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామాలయం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్రోడ్లో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలకు రూ.25 లక్షల పైబడి ఆదాయం వస్తుంది. వీటికి దేవాదాయ పాలక కమిటీలు నియమించి, ఉత్సవాలను నిర్వహించే ఆనవాయితీ ఉంది. జిల్లాలో కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి, జిల్లా కేంద్రంలోని విజయగణపతి సాయిబాబా, గౌరీశంకర, భక్తాంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి(మంకమ్మతోట), పొద్దుటూరి వారి ధర్మసంస్థ, హరిహర, గిద్దెపెరుమాండ్ల స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కోతిరాంపూర్ పోచమ్మ, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ్‌నగర్ ప్రసన్నాంజనేయ, హనుమాన్(హుజూరాబాద్), సీతా రామస్వామి (నల్గొండ, తిమ్మాపూర్), వెంకటేశ్వర స్వామి(జమ్మికుంట) ఆలయాలకు దేవస్థాన కమిటీల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా అధికార పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్‌లలో కాంగ్రెస్ ఇన్‌చార్జీలుగా పురమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ వ్యవహరిస్తున్నారు. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాలకు వీరినే ఇన్‌చార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి చదవండి: సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి! -
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదీచదవండి.. కళ్యాణ కానుకేది..? -
మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం: గంగుల కమలాకర్
-
గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు. కరీంనగర్లో నేను చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ములేని వ్యక్తి నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందింది. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావు’ అంటూ కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్లో గెలిచేది బీజేపీ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం కరీంనగర్లో మహాబైక్ ర్యాలీ నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కిసాన్‌నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, రాజీవ్‌గాంధీ విగ్రహం, టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేశ్‌నగర్ బైపాస్, అంబేడ్కర్స్టేడియం, భగత్‌సింగ్ విగ్రహం, గోదాంగడ్డ, ఉమెన్స్‌కాలేజ్, రాంనగర్ మార్క్‌ఫెడ్, మంకమ్మతోట, శివ థియేటర్, జగిత్యాల రోడ్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా రేకుర్తి వరకు సాగింది. ర్యాలీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రారంభించారు. రేకుర్తి వద్ద ముగింపు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యకర్తలే తన హీరోలు అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కరీంనగర్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది తట్టుకోలేక గంగుల కమలాకర్ తనపై దొంగ వీడియో, ఆడియోలు సృష్టించి వైరల్చేసే పనిలో పడినట్లు సమాచారం ఉందని అన్నారు. దమ్ముంటే నేరుగా కొట్లాడాలని, అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. భూకబ్జాలు, రౌడీయిజం తన దగ్గర చెల్లవన్నారు. ఫాంహౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను ధర్నాచౌక్‌కు తీసుకొచ్చానని, నువ్వెంత అంటూ గంగులకు సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే అని, 30న కరీంనగర్లో బీజేపీకే ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి దుకాణం బంద్ చేసుకున్నాడని తెలిపారు. భూకబ్జాదారులు, అవినీతి పరులుకావాలా? మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజల కోసం పోరాడుతున్న తాను కావాలో? ఆలోచించండని అన్నారు. కమలంపువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మందకృష్ణ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలతోపాటు ఓసీ వర్గాలపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు జనాభాలో 1,2 శాతం జనాభా కూడా లేనివాళ్లే 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్లో ఒక్కరిని కూడా సీఎం చేయలేదన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు.. -
బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుకూల ఓట్లన్నీ ఒక్క చోటుకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి హిందుత్వమే తన నినాదమని ప్రచారం చేస్తున్నారు. మరొకరు సెక్యులర్ విధానమే మా నినాదం అంటున్నారు. రెండు విభిన్న ధృవాల మధ్య జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకీ ఆ సిటీ ఎక్కడో...ఆ ప్రత్యర్థులు ఎవరో చూద్దాం. కరీంనగర్ సిటీలో మరోసారి కమలం గుర్తుపై బండి సంజయ్, కారు గుర్తుపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా కుటుంబాల పరంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... ఎన్నికల గోదాలో దిగాక చావో రేవో అన్న విధంగా పోరాటం చేయక తప్పదు. అందుకే కారు, కమలం పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు భీకరంగా పేలుతున్నాయి. ఓట్ల పోలరైజేషన్ కోసం ఇరు పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తనను దాటి పోకుండా చూసుకునేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సంప్రదాయంగా గులాబీ పార్టీకి పడుతున్న ఓట్లతో పాటు...మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా మంత్రి గంగుల కమలాకర్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 55 వేల వరకూ ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. కారు, కమలం పార్టీలనుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్ గెలుపోటములను మైనారిటీల ఓట్లే నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లోనూ మైనారిటీల ఓట్లు గంపగుత్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కే పడటంతో..నాడు బండి సంజయ్ పుట్టి మునిగింది. అప్పటివరకూ టగ్ ఆఫ్ వార్ లా నడిచిన పోలింగ్‌లో.. మధ్యాహ్నం తర్వాత ముస్లిం మైనార్టీ ఓటర్లంతా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఆ ఓట్లన్నీ కారు గుర్తుకే గంపగుత్తగా గుద్దేసి కారును పరుగులు తీయించారు. గంగుల 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో హిందూ, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఇప్పుడు కరీంనగర్ వేదికైంది. ఈసారి తనకు హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తే..కాంగ్రెస్ పార్టీకి కూడా ముస్లిం మైనార్టీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మైనారిటీ ఓట్లను పంచుకుంటే.. ఇక తన గెలుపు నల్లేరుపైన నడకేనని బండి సంజయ్ ఆశిస్తున్నారు. ఆయన ప్రచారం కూడా దానికి అనుగుణంగానే సాగుతోంది. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని..ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లేకుండా కరీంనగర్ ప్రశాంతంగా ఉందని అంటూ..విధ్వంసకారులు కావాలా...నిర్మాణాత్మక నాయకత్వం కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలంటూ గంగుల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్, మిషన్ భగీరథ, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, కరీంనగర్ రోడ్లు, స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సిటీకి ఎంఐఎం మేయరంటూ బండి సంజయ్ ప్రచారం చేశారని.. పాడిందే పాట అన్నట్టుగా బండి ప్రచారం సాగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..సెక్యులర్ విధానమే..తమ నినాదమనీ గంగుల కుండబద్ధలు కొడుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లంటూ ప్రచారం చేశారంటూ..లోక్‌సభ ఎన్నికల్లో దాన్ని ముమ్మురంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్.. ప్రజల భావోద్వేగాలపై ముద్ర వేసే వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసి.. గంపగుత్తగా తనవైపు తిప్పుకునే క్రమంలో బండి సంజయ్ మరోసారి ఎత్తుకుంటున్న నినాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సెక్యులర్ నినాదమే తమ విధానమంటూ ముందుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఆసక్తి నెలకొంది. రోజులు గడిచేకొద్దీ..పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఈ నేతల ప్రచార యుద్ధం ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతుందోనన్న ఆసక్తికర చర్చ కరీంనగర్ సిటీలో జరుగుతోంది. -
RTCని ప్రభుత్వంలో విలీనం ఓ ముసుగు మాత్రమే: సంజయ్
-
స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!
వారిద్దరూ స్నేహితులు.. అంతేకాదు.. కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులైనా ఎప్పుడూ బయటపడి ఒకరినొకరు పెద్దగా విమర్శించుకోరు. ఆ సిటీలో రాజకీయవర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. తాజా ఎన్నికల్లో కూడా వారిద్దరూ చెరో పార్టీ తరపున తలపడుతున్నారు. ఇక తప్పనిసరిగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో విమర్శల జోరు పెరుగుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంచి స్నేహితులు. సామాజికవర్గ లెక్కలు వీరిద్దరినీ ఒక్కటిగా పెనవేశాయనే టాక్ ఎలాగూ ఉంది. గతంలో ఒకింత తీవ్రస్థాయిలోనే ఒకరిపై ఇంకొకరు అటాక్ చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చారనే అభిప్రాయం కరీంనగర్ జనంలో ఉంది. ఇక అప్పట్నుంచీ వీరిద్దరూ పార్టీల పరంగా కౌంటర్స్ విసురుకుంటారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి రాలేదు. ఒక సుహృద్భావమైన వాతావరణంలో రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాల్గోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా.. తన చిరకాల ప్రత్యర్థినెలాగైనా ఈ సారి ఓడించి తీరాలన్న కసితో.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో నిల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మాటల యుద్ధం రకరకాల రాజకీయ చర్చలకు తావిస్తోంది. కేబుల్ బ్రిడ్డ్ కూలిపోతోంది.. కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు చూసి జనం నవ్వుకుంటున్నారు.. ముందు అది చూసుకో.. ఆ తర్వాత నీ అభివృద్ధి గురించి చెప్పుకో అంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. మంత్రి గంగులపై కామెంట్స్ చేయడంతో ఈ రాజకీయ కాక మొదలైంది. అంతేకాదు.. గంగుల ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ ఇంతకాలం బీఫామ్ ఇవ్వలేదంటూ కూడా సంజయ్ చేసిన కామెంట్స్.. సహజంగానే మంత్రి గంగులకు కోపం తెప్పించాయి. దాంతో అసలు రేవంత్ పై బలి కా బక్రా అని సానుభూతి చూపించావు గానీ.. నువ్వూ, నీకోసం వచ్చిన రాజాసింగే అసలు బలి కా బక్రాలంటూ ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు. కరీంనగర్ లో మూడో ప్లేస్ కే బండి సంజయ్ పరిమితం కాబోతున్నారన్నారు. అంతేకాదు.. తనకు బీఫామ్ ఇవ్వలేదనడం హాస్యాస్పదమని.. మరి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థెవ్వరో బండి చెప్పాలన్నట్టుగా గత రెండు రోజులుగా గంగుల కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేసే నిధులను కేంద్రమే ఇస్తోంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్రానివే. నగరం అందంగా తీర్చిదిద్దే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. కాని బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లో సమర్థవంతంగా చెప్పుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. కాని అదే స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను తమకనుకూలంగా మల్చుకుని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి గంగుల వర్గం జనంలోకి వెళ్లుతుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గతంలో పరుష పదజాలం వాడి నాలుక్కర్చుకుని మళ్లీ తిరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎన్నికల వేళ నోటికి పని చెప్పి కౌంటర్ అటాక్స్ తో జనం మధ్య జరిగే చర్చల్లో భాగస్వాములవుతున్నారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్? -
ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్ సంపదపై ఆంధ్రావాళ్లు కన్నేశారని, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరువై ఏళ్లుగా ఆశీర్వదిస్తున్న ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన రక్తం ధారపోసి పనిచేస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేకపూజలు చేయించి బీఆర్ఎస్ నాయకులు కొత్త జైపాల్‌రెడ్డి, కంసాల శ్రీనివాస్, మెతుకు సత్యంతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి రెండుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలతో నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, వారిహయాంలో జరిగిన అభివృద్ధి, పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టాలని మళ్లీ ఆంధ్రా నాయకులు ఏకమవుతున్నారని, సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించి హైదరాబాద్ సంపదను దోచుకెళ్లేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేం.. తస్మాస్ జాగ్రత్త.. ఆ రెండు పార్టీలతో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 20 రోజులు తన కోసం పనిచేస్తే ఐదేళ్లు మీకోసం తన రక్తం ధారపోస్తా అని భరోసా ఇచ్చారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని, ముచ్చటగా సీఎం కేసీఆర్‌ను మూడోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మతోన్మాదంతో ఒక అభ్యర్థి, భూ కబ్జాలతో మరో అభ్యర్థి ఓట్ల కోసం వస్తున్నారని, నగరాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారికి ప్రజలే తగిన శాస్తి చేయాలని సూచించారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతుందని బండి సంజయ్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో సంజయ్ ఏనాడూ తిరగలేదు కాబట్టి ఆయన కళ్లకు ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి కనబడలేదని అన్నారు. నామినేషన్ వేసిన మంత్రి కమలాకర్‌కు ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, నాయకులు మద్దతు తెలిపారు. నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు పాల్గొన్నారు. గంగుల ఆస్తులు రూ.25.50 కోట్లు! మంత్రి కమలాకర్ తన అఫిడవిట్లో మొత్తం రూ.25.50 కోట్ల స్థిరచరాస్తులు, రూ.50 లక్షల బ్యాంకు రుణాలు, 8 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన తన వద్ద రూ.2.25 లక్షలు, 436 తులాల బంగారు కడియాలు, బ్రాస్లెట్లు ఇతర ఆభరణాలు(రూ.2.45 కోట్లు), 1995 మోడల్ యమహా బైక్, దాదాపు రూ.70 లక్షల విలువైన భారత్ బెంజ్ కారవాన్ వాహనాలు ఉన్నాయన్నారు. ఆయన భార్య రజిత వద్ద రూ.3.15 లక్షలు, 800 తులాల ఆభరణాలు(రూ.4.5 కోట్లు) ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.24.5 కోట్లు, అప్పులు రూ.3.4 కోట్లుగా చూపించారు. ఇవి చదవండి: ముధోల్ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు! -
మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట..
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఎన్నికల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదే: గంగుల
-
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
కేవైసీ కోసం క్యూ... రేషన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
TS Election 2023: అభివృద్ధి, సంక్షేమమే 'మా నినాదం!' : మంత్రి గంగుల కమలాకర్
సాక్షి, కరీంనగర్: మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించి, జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17కు ఒక విశిష్టత ఉందని, 75 ఏళ్లక్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. వీరులకు జోహార్లు.. ఇటీవలే దేశస్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆదివాసీ వీరుడు కుమ్రంభీం, దొడ్డి కొమురయ్యతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు బద్ధం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవాలని సూచించారు. చేతివృత్తులకు చేయూత.. చేతివృత్తిదారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు బీసీ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,700మందికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 174మందికి రూ.లక్ష చొప్పున రూ.1.74 కోట్ల విలువైన చెక్కులు అందించామని అన్నారు. అవార్డుల్లో ప్రథమం.. దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచామని, బీడీ టేకేదారులకు రూ.2016 అందిస్తున్నట్లు తెలి పారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 15గ్రామాలకు స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ–2023 అవార్డులు, గన్నేరువరం మండలం ఖాసింపేట, రామడుగు మండలం వెలిచాల రాష్ట్రస్థాయి అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో దళితబంధు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.1784 కోట్లు అందించినట్లు తెలి పారు. జిల్లాలోని 49,544మంది రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.261.19 కోట్లు జమచేశామన్నారు. వైద్యరంగానికి పెద్దపీట.. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కళాశాలలను స్థాపించుకున్నామని, 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని అన్నారు. నగరం ఏ మూలన చూసిన అద్భుతమైన రోడ్లు, విద్యుత్‌లైట్లు, కేబుల్బ్రిడ్జితో విరాజిల్లుతోందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ పనులు ఏడాదిలో పూర్తిచేసి, బోటింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సత్కారాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు! అనంతరం మంత్రి కమలాకర్ స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ.రామక్రిష్ణారావు, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఈడీ నోటీసులు.. సంబంధం లేదన్న గంగుల
సాక్షి, కరీంనగర్: తన కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు అందించిందన్న పరిణామంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు నోటీసులేవీ రాలేదని.. నోటీసులు అందుకున్నట్లుగా చెబుతున్న శ్వేతా గ్రానైట్స్‌తో తనకేలాంటి సంబంధం లేదని అంటున్నారాయన. గంగుల కుటుంబ సభ్యుల కు చెందిన శ్వేతా గ్రానైట్స్ విదేశాలకు ఎగుమతుల విష యంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై ఈడీ వివరణ కోరినట్లు తెలియవచ్చింది. గతేడాది నవంబర్‌లో శ్వేతా గ్రానైట్స్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. చైనాకు గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 3 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ అంశంపై మంత్రి గంగుల మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఈడీకి సంబంధించి తనకు నోటీసులేవీ రాలేదని, శ్వేతా గ్రానైట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే శ్వేతా గ్రానైట్స్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. శ్వేతా గ్రానైట్స్‌కు ఈడీ నోటీసులనేవి 2008 నుంచి కొనసాగుతున్నవేనన్నారు. ఈ విషయంలో ఆ సంస్థ వ్యాపారం గురించి లేదా తన గురించి ఈడీకి ఎలాంటి సమాచారమైనా ఇస్తానని, పూర్తిగా సహకరిస్తానని మంత్రి సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: ప్రసవాల్లో రికార్డు -
బండి సంజయ్‌కు రూ.50 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీరుపై హైకోర్టు అసహనం వ్య క్తం చేసింది. కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో అడ్వొకేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానా విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడాన్ని తప్పుబట్టింది. ఎన్నికల పిటిషన్లో విచారణను ముగిస్తామని హెచ్చరించింది. ఈ నెల 12న హాజరవుతారని ఆయన న్యాయవాది తెలపడంతో.. జరిమానాతో సరిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ సమీప ప్రత్యర్థి బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎ న్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చిల్లకూర్ సుమలత మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల సాక్ష్యాలను నమోదు చేయడంకోసం న్యాయమూర్తి జూన్ లో అడ్వొకేట్ కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి శైలజను నియమించారు. అయితే పార్లమెంట్ సమా వేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినే షన్‌కు నాలుగుసార్లు గైర్హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 6 నెలల జైలు కోర్టు ధిక్కరణ కేసులో విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసిన రత్నారెడ్డి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి వదిలేసినందుకు కమిషనర్ సత్యబాబుకు శిక్ష విధిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021, అక్టోబర్ 27 నాటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసినా చర్యలు లేవంటూ వీరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించారు. మంచిరేవుల గ్రామంలోని రెండు ఎకరాలను విశ్వభారతి లీజుకు తీసుకుని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. నిర్దిష్ట గడువులోగా అనుమతులు రాకపోవడంతో చట్ట ప్రకారం వచ్చినట్లుగా భావించి నిర్మాణాలు చేపట్టింది. మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయడంతో రత్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతులు ఇవ్వనందున నిర్మాణాలు చేపట్టినట్లుగా పిటిషనర్ సమాచారం ఇవ్వలేదని తప్పుపట్టింది. హెచ్ఎండీఏ నోటీసుల్ని పిటిషనర్ సవాల్ చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు కాగా, ఇటీవల పైవిధంగా తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: ఓవైపు పోలీసుల సమీక్ష.. మరోవైపు దొంగల చేతివాటం! -
మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
-
గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది కూడా. ఇక.. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు నిర్ధారించింది. అంతేకాదు.. గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ నిర్వహించాలని టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ గేటువైపు వెళ్లేందుకు టీఆర్టీ అభ్యర్థులు యత్నించారు. అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేట్లు ఎక్కేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. పలువురిని అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా: మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. క్యాంపు కార్యాలయంలోకి కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు పోలీసుల యత్నంచగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. చదవండి: రోజుకో ప్రచారం.. కేసీఆర్-చెన్నమనేని భేటీపై ఉత్కంఠ -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్.. వీకెండ్ మస్తీతో ఉర్రూతలు (ఫోటోలు)
-
కరీంనగర్: ఈసారి సర్వత్రా ఆసక్తి
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం. ► 40 వేల ఓట్లు మున్నూరు కాపులు ► 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ► 22 వేల ఓట్లు పద్మ శాలీలు ► 29 వేల ఓట్లు ఎస్సీలు ► 14 వేల ఓట్లు ముదిరాజ్ ► 9 వేల ఓట్లు గౌడ ► 8 వేల క్రిస్టియన్ ఓట్లు 1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు 2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది. గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు ఆర్థికంగా బలమైన నేత... మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21 ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం నిత్యం ప్రజలతో మమేకం బలమైన క్యాడర్ బలహీనతలు నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ. ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు. రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు. బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం. కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు. ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం. చేసిన పనులు కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి. ఐటీ టవర్ నిర్మాణం. 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. మెడికల్ కళాశాల మంజూరు. టీటీడీ దేవాలయం. కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్. చేయని పనులు 24 గంటల నీటి సరఫరా విలీన గ్రామాల సమస్య డంప్ యార్డ్ ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం నగరంలో పార్కింగ్ సమస్య నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం రక్షణ వాల్స్ కు బీటలు రావడం అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం ప్రత్యర్థులు... బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ : పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు? మేనేని రోహిత్ రావు : కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు.... వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి... ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. -
బండి సంజయ్ విచారణకు కోర్టు కమిషనర్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో బండి సంజయ్ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జిల్లా జడ్జి శైలజను కోర్టు కమిషనర్‌గా నియమించింది. ఈనెల 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గంగుల బీఆర్ఎస్ తరఫున గెలిచారు. అయితే అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని, అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలంటూ సమీప³ ప్రత్యర్థి బండి సంజయ్ 2019 జనవరిలో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ చిల్లకూర్ సుమలత సోమవారం మళ్లీ విచారణ చేపట్టారు. వాదనల అనంతరం కోర్టు కమిషనర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్‌కు నియమిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. -
TS: ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. కీలక ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ క్రమంలో.. సోమవారమూ ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. 19-11-2018వ తేదీన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ జరుపుతోంది ధర్మాసనం. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుకు నాంపల్లి కోర్టు ఆదేశం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో పిటిషనర్ రాఘవేంద్ర రాజు సాక్షితో మాట్లాడారు. ‘‘2022, ఆగస్టు 4వ తేదీన నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ వేశాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎన్నికల అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్ కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత ghmc కమిషనర్, సంజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, ఆర్థివో శ్రీనివాస్, పద్మ శ్రీ డిప్యుటీ కలెక్టర్, కే వెంకటేష్ గౌడ్, నోటరీఅడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, దానం సుధాకర్ ప్రపోజర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది అని తెలిపారు రాఘవేంద్ర రాజు. ‘‘ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదిక ఇచ్చాడని పిటిషన్ లో తెలిపాను. ఎన్నికల కమీషన్ వెబ్సైట్ టాంపరింగ్ కు పాల్పడ్డారని ఆధారాలు ఇచ్చాను. 11 సెప్టెంబర్ పూర్తి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ -
కరీంనగర్ నియోజకవర్గంలో అధికారం ఎవరిది?
కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరోసారి అంటే మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది , బిజెపి నేత బండి సంజయ్ మీద 14974 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయనకు 38500 ఓట్లు వచ్చాయి. కమలాకర్ 2009లో టిడిపి పక్షాన గెలిచారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో కి మారి మరో రెండుసార్లు గెలుపొందారు. గంగులకు 80983 ఓట్లు రాగా, సంజయ్‌కు 66009 ఓట్లు వచ్చాయి.2018లో గెలిచిన తర్వాత కమలాకర్‌కు మంత్రి పదవి దక్కింది. కాగా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో కసభ ఎన్నికలలో బిజెపి పక్షాన పోటీచేసి సంచలన విజయం సాదించారు. కమలాకర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో కరీంనగర్లో అత్యధికంగా వెలమ సామాజికవర్గం నేతలు గెలుపొందినా, మూడుసార్లుగా మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల గెలుపొందారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల గెలవడంతో ఇక్కడ బిసిలు మొత్తం మూడుసార్లు గెలిచినట్లయింది.తొమ్మిది సార్లు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ గెలిస్తే, ఒకసారి రెడ్డి గెలిచారు. ఒకసారి వైశ్య, మరోసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.1952 నుంచి 15 సార్లు కరీంనగర్ స్థానానికి ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలిస్తే, టిడిపి ఐదుసార్లు గెలిచింది. పిడిఎఫ్, సోషలిస్టులు ఒక్కోసారి, టిఆర్ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. 2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌గౌడ్, తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి 2009లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసి టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్‌ను ఓడిరచడం విశేషం. 1983 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఐ ఒకే ఒక్కసారి 2004లో మాత్రమే గెలిచింది. సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎమ్.సత్యనారాయణరావు గెలిచారు. 1989లో ఇక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన వి.జగపతిరావు 1972లో జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 1999లో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన కటారి దేవేందర్‌రావు 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత నేత జువ్వాది చొక్కారావు మూడుసార్లు ఇక్కడ నుంచి శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి శాసనసభకు ఎన్నికైన ఎమ్.సత్యనారాయణరావు కూడా మూడుసార్లు లోక్‌సభకు గెలుపొందారు. ఇక్కడ నుంచి గెలిచినవారిలో కమలాకర్ 2018 ఎన్నికల తర్వాత కెసీఆర్ క్యాబినెట్లో, చొక్కారావు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్లో, సి.ఆనందరావు 1989లో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లోను, ఎమ్.సత్యనారాయణ 2004 తరువాత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. 2007లో టిఆర్ఎస్ అదినేత కెసిఆర్‌పై రెచ్చగొట్టే ప్రకటనలు చేసి లోక్‌సభ ఉప ఎన్నికలకు కారకులయ్యారన్న అభిప్రాయం ఉంది. అప్పుడే ఎమ్మెస్సార్ మంత్రి పదవిని వదులుకున్నారు. తదుపరి ఆర్టీసి ఛైర్మన్ పదవితో సంతృప్తి చెందారు. కరీంనగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్‌పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్‌కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
‘లక్ష’ణంగా..300 మంది బీసీలకు! ఈ నెల 15వ తేదీ నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఈ మేరకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ శనివారం (ఈ నెల 15వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తొలివిడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మందికి సాయాన్ని అందిస్తామని, ఈ ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మంత్రి గురువారం తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లతో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులైన బీసీ కులవృత్తిదారులకు సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ చేపట్టాలని.. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకున్న వెంటనే కులవృత్తులకు సంబంధించిన యూనిట్‌ను గ్రౌండింగ్ చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా.. బీసీ కులవృత్తుల వారికి ఆర్థికసాయం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వాటి పరిశీలన పూర్తయిన వెంటనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ సొమ్ముతో కులవృత్తికి సంబంధించిన ముడిసరుకులు, పనిముట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. -
ధరణిపై రేవంత్ సంచలన ఆరోపణలు.. ఆ మంత్రికి భూములివ్వలేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్‌లో జరుగుతున్న అక్రమాలను వివరించారు. కాగా, రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద మాఫియా దాగుంది.. దీనిపై ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతాం. ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం. గజ్వేల్‌లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుంది. అమూల్ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారు. గంగుల కమలాకర్‌కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు. పూర్వీకులంతా భూకంపం వచ్చినట్లు.. సర్వం కోల్పోయినట్లు.. కేటీఆర్, కేసీఆర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. పరోక్షంగా వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒప్పుకున్నారు. మీ చీకటి నేర సామ్రాజ్యంలో వ్యక్తుల ఒప్పందాలతో మీకు ఆర్థిక ప్రమాదం ఉందో.. ప్రాణ భయం ఉందో తెలియడంలేదు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. కిషన్‌రెడ్డి.. కేసీఆర్ ధరణి దోపిడీలపై స్పందించాలి. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ,బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపాం. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ మోసం చేసింది. రాజేందర్‌కు భద్రత పెంచినా.. అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు?. నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ! -
వెలమ Vs కాపు: బీఆర్ఎస్ సీనియర్‌కు వ్యతిరేక పవనాలు..
రాజకీయాలు సహజంగా పార్టీలవారీగా నడుస్తుంటాయి. కానీ.. తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజికవర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఏది అంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజికవర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. వెలమ వర్సెస్ కాపు.. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో... పార్లమెంట్ సెగ్మెంట్లో వినోద్‌తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. వినోద్ డామినేటింగ్ శైలి.. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు.. అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్‌గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా.. ఎన్ని చేశామన్నది కాదు.. ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్‌గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ మార్చిన ఒవైసీ! -
పెట్టుబడిదారులకు మిల్లింగ్‌లో విస్తృత అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఇందులోభాగంగానే ప్రభుత్వమే సొంతంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మంత్రి బుధవారం పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, ఎస్‌పీపీజెడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందుకే రూ.రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లింగ్ పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్‌తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాలు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రత్యేక జోన్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సటాకే, సైలో తదితర ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతికతను మంత్రికి వివరించారు, గంటకు 20 నుంచి 1,200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని వారు చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పి స్తామని గంగుల తెలిపారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కాగా, పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబంధిత అంశాలపై గంగుల ప్రత్యేకంగా సమీక్షించారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు బియ్యం పంపిణీ వరకు వివిధ దశల్లో వృధా లేకుండా సాంకేతికతను అప్‌గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నెట్వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
కులవృత్తులకు పూర్వ వైభవం
మణికొండ: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తోందని, అందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరశివారు కోకాపేటలో గౌడ్లకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం వైన్స్‌ల కేటాయింపులో గౌడ్లకు 15శాతం రిజర్వేషన్ కల్పిస్తోందని, నీరా పాలసీతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఎప్పటినుంచో ఉన్న కల్లు దుఖాణాలను తాడి బార్లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామని, నీరా కేఫ్‌లను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.30 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని, కల్లు అంటే ఉన్న చులకన భావం పోగొట్టి, కల్లు దుఖాణాల రూపురేఖలను మార్చితే మరింత మందికి ఉపాధి కలుగుతుందన్నారు. గౌడ్ల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలను తేవాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, వారంతా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కల్లుగీత సహకార సంఘం చైర్మన్ పల్లె రవికుమార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజయ్యగౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బి.భిక్షమయ్య, సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, వనజ ఆంజనేయులుగౌడ్, పెద్ద ఎత్తున గౌడ కులçస్తులు పాల్గొన్నారు. -
బీసీలకు రూ. లక్ష నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు రూ. లక్ష సాయం అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలలో ఉన్న కుల, చేతి వృత్తులు చేసుకునే వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. బీసీలకు లక్ష పథకంపై శనివారం సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హాజరై ఇప్పటివరకు ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం మంత్రి కమలాకర్ వివరాలను వెల్లడించారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా... వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపిస్తున్న సీఎం కేసీఆర్ చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. కుల, చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ సాయాన్ని ప్రకటించారన్నారు. శనివారం నాటికి ఈ సాయం కోసం 2,70,000 దరఖాస్తులు అన్లైన్ ద్వారా నమోదయ్యాయని వివరించారు. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి పారదర్శకంగా చేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో అర్హత కలిగిన లబ్దిదారుల్లోని అత్యంత పేదవారికి సాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీనెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జా బితాలోని లబ్దిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీ దుగా సాయం అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు https://tsobmm sbc. cgg.gov.in వెబ్ సైట్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, ఆ ఫారంను ఏ ఆఫీసులోగానీ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్దిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుక్కోవాలని సూచించారు. లబ్ధిదారుల నిరంతర అభివృద్ధి కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్దిదారులతో కూడిన యూనిట్ల ఫొటోల ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుదన్నారు. -
రైతులకు ఒకేరోజు రూ.3 వేలకోట్లు
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విడుదల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రూ.3,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ నెల 20వ తేదీలోగా ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు సొమ్ము అందే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసారి యాసంగిలో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈ యాసంగిలో గురువారం నాటికి 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,383 కోట్ల విలువైన 65.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి తెలిపారు. ఇందు లో ఓపీఎంఎస్లో రూ. 10,439 కోట్ల రసీదులు అప్లోడ్కాగా.. ఇప్పటి వ రకు రూ.9,168 కోట్లు వి డుదల చేశామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి.. సాధారణం కంటే పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం సేకరణ మొదలుపెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,037 కొనుగోలు కేంద్రాలను తెరిచామని.. ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ çపూర్తవడంతో 6,366 కేంద్రాలను మూసేశామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లోనూ ఆది వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎక్కడైనా ఆలస్యంగా వరి కో తలు జరిగిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. కొనుగోళ్లు చేపట్టేందు కు కలెక్టర్లకు అధికారం ఇచ్చామని వివరించారు. గత యాసంగి సీజన్ కన్నా ఈసారి ఇప్పటికే 16లక్షల టన్నులు అధికంగా సేకరించామన్నారు. కేసీఆర్ రైతు అనుకూల విధానాలతోనే.. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలైన రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, అందుబాటులో సాగునీరు, మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి కారణాలతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేవలం తొమ్మిదేళ్లలో ధాన్యం సేకరణలో దేశం గరి్వంచే స్థితికి తెలంగాణ చేరుకుందని వివరించారు. ఓవైపు పంటను సేకరిస్తూనే, మరోవైపు అకాల వర్షాల నుంచి కాపాడేందుకు పౌరసరఫరాల యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. -
మరో 8 ‘సివిల్’ బంకులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 8 రిటైల్ పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ఇటీవలే 9 పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆమోదం లభించడంతో మొత్తంగా 17 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లయింది. ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. దీంతో జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ఆయిల్ కంపెనీలకు బంకులు కేటాయించేందుకు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలివిడతలో 9 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. ఇక రెండో విడతలో వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీలైనంత త్వరగా వినియోగదారులకు సేవలు అందుబాటులోకి తేవాలని ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో 3 పెట్రోల్ రిటైల్ బంకులను విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త బంకులు ఏర్పాటైతే వాటి సంఖ్య 20కి చేరనుంది. -
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లు దిగివచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, కన్వినర్ రవీందర్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సమక్షంలో వెల్లడించారు. వచ్చే నెలలోగా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో.. డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు తదితర 22 డిమాండ్ల కోసం డీలర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో అదే నెల 22న మంత్రి కమలాకర్ డీలర్ల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. 22 డిమాండ్లలో 20 డిమాండ్లు పరిష్కరించేందుకు మంత్రి కమలాకర్ పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రధాన డిమాండ్లు అయిన కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు అంశాలు ముఖ్యమంత్రి పరిధిలోనివని మంత్రి సర్ది చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు డీలర్ల సంఘం నాయకులు ప్రకటించారు. కానీ ఆకస్మికంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని 17,284 రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల మంగళవారం డీలర్ల జేఏసీ నాయకులు నాయికోటి రాజు, రవీందర్, మల్లికార్జున్ గౌడ్, అనంతయ్య, పుస్తె శ్రీకాంత్ తదితరులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల తరువాత సమావేశం ముగియగా, చర్చలు సఫలమైనట్లు డీలర్లు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల డిమాండ్ల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు మంత్రి కమలాకర్ సమక్షంలోనే ప్రకటించారు. జూలై లోపు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని, గౌరవ వేతనం, ఇన్సూరెన్స్ అంశాలు ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సమ్మెను విరమించి, రేషన్ దుకాణాలు తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు. డీలర్లకు గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం: గంగుల గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పూర్తి కాని కొనుగోళ్లు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం తలపెట్టిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడం రైతులను కలవరపెడుతోంది. చాలా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుకాకపోవ డంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఓవైపు రుతుపవనాలు సమీపిస్తుండటం, రబీ సీజన్ మొదలవుతుండటం.. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుపోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. మిల్లర్లు కుమ్మక్కై చాలాచోట్ల క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోత పెడుతున్నారు. అయినా సరే రైతులు కోతలకు సమ్మతించినా.. మిల్లర్లు చాలా చోట్ల కొర్రీలు పెడుతుండటం, ధాన్యాన్ని మిల్లుల్లో దింపకుండా అలాగే ఉంచడంతో లారీలు కొనుగోలు కేంద్రాలకు సరిగా వెళ్లడం లేదు. దీంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల దూరంలో.. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 62.16 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీలు) ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్ 6 నాటికి అందులో 3,181 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. కానీ, మధ్యలో మిల్లర్ల కొర్రీలు, అకాల వర్షాలు, లారీల కొరత తదితర కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 57.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ధాన్యం విలువ రూ.11,843 కోట్లుగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా? ఏరువాక ఉత్సవాలతో రబీ సీజన్ మొదలైంది. ఈసారి రబీని నవంబరు నాటికి పూర్తి చేసి, యాసంగి పంట కోతలను మార్చి నాటికి ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వేసవిలో అకాల వర్షాలు రైతులకు గత వందేళ్లలో ఏనాడూ చూడని నష్టాన్ని కలగజేశాయి. దీనికితోడు వేసవిలో కోతలు ఏప్రిల్ వరకు సాగితే, వరి నుంచి మర ఆడిస్తే నూక అధికంగా వస్తుంది. ఈ సమస్యలను అధిగమించి మార్చి నాటికి కోతలను ముగిస్తే.. రైతుకు ప్రకృతి విపత్తులు, నూకల బెడద తప్పుతుందన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ, కొనుగోళ్ల ప్రక్రియ జాప్యమవడంతో రబీ, యాసంగి సీజన్ల పంట ఆలస్యమయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లో పూర్తి మరో మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. ఎక్కడా రైతులకు ఇబ్బంది రానీయం. 95% ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమవుతాయి. –మంత్రి గంగుల కమలాకర్ కొనుగోళ్ల వేగం పెంచాం రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంగళవారం ఒక్కరోజే 1,31,703 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అకాల వర్షాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొంచెం జాప్యమైన మాట వాస్తవమే. రెండు మూడు రోజుల్లో మిగిలిన 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సైతం కొనేస్తాం. –సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల శాఖ, చైర్మన్ -
Karimnagar: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. కాగా, ఆలయ శంకుస్థాపన సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీవారి ఆలయం కరీంనగర్లో కొలువుదీరడం మా అదృష్టం. ఆలయానికి 10 ఎకరాల భూమి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం, 20కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం మాకు దొరికిన అదృష్టం అని తెలిపారు. అనంతరం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో మాదిరిగానే కరీంనగర్లోనూ సర్వకైంకకర్యాలు జరుగుతాయి. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాలు తదితరాలు ఉంటాయి. కరీంనగర్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’ -
గింజ కోత పెట్టినా ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించే ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల్సిందేనన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం, నూక శాతం తదితర అంశాలపై సచివాలయంలో ఆయన మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే ప్రభుత్వం తమదని, విపరీత పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై నిపుణుల కమిటీ గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రస్తుత పరిస్థితులకు ఎలా అన్వయించాలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంతోపాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి... నిర్ణీత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు అందజేయాలని సూచించారు. నూక శాతాన్ని త్వరగా తేల్చాలి... తమ సమస్యలను మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూక శాతం విషయాన్ని ప్రభుత్వం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. తమను రైతులకు శత్రువులుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్‌రావు, కోశాధికారి చంద్రపాల్‌తోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
మిల్లర్లు సహకరించకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం విక్రయాల కోసం రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అవసరమైన చోట ఇంటర్మీడియట్ గోడౌన్లలో మిల్లర్లతో సంబంధం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అవగాహన పెంపొందించాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని, తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకొని, అవసరమైన చోట స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని జగ్గయ్యపేట, రాయ్ చూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో సైతం ఇంటర్మీడియట్ గోదాంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
కరీంనగర్లో మారుతున్న పాలిట్రిక్స్.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే!
సాక్షి, కరీంనగర్: రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో షాక్‌కు గురవుతున్న ఆ నేత ఎవరు? షాక్‌లు సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షంగా ఉన్న పార్టీ నుంచి అయితే పరిస్తితి ఎలా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో వస్తున్న మార్పులేంటని తెలుసుకుందాం. కరీంనగర్ నగరానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్‌కు ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయా? ఆయన కోటరీయే ఇప్పుడాయన కొంప ముంచుతోందా అంటే అవును అనేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ కావాలనే చేయిస్తున్నారనే అనుమానాలూ ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్ లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్ చశారు. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్ విసిరారు. ఇప్పటికే నగరంలోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారినట్లు వారు చెప్పుకొచ్చారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణా హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్ లో పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోతున్నాయన్న టాక్ నడుస్తోంది. సవాల్ విసిరారు అయితే కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈద్ మిలాప్ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పైనా తమకున్న సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు సానుకూలంగా ఒక్క మాటా మాట్లాడకపోగా.. సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ చొరవ వల్లే స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్ కూడా విసిరారు. కరీంనగర్ నగరంలోని ముస్లిం మైనార్టీలెక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కొరవడిందని.. దర్గాలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివాటిని కనీసం పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం కరీంనగర్లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే....వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్ ను కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వినోద్ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్ నుంచి వినోద్ ను గెలిపించాలన్న కేటీఆర్ ప్రకటనతో ఇక కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో వినోద్ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గాని..గంగుల కనుక మళ్ళీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. -
బీసీలంటే వెనక్కు నెట్టివేయబడిన వాళ్లు
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: బీసీలంటే వెనుకబడిన వాళ్లు కాదని, వెనక్కు నెట్టివేయబడిన వారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని బీసీల బతుకులన్నీ వెనక్కు నెట్టివేయబడ్డాయని, కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ తొలి చైర్మన్‌గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, రైతుబంధులాంటి పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనన్నారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. సీఎం అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తా తనకు ఈ అవకాశం క ల్పించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్‌కు పల్లె రవికుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతతో నిర్వహిస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం పాల్గొన్నారు. -
దమ్ముంటే తమ మద్దతు లేకుండా గెలవాలంటూ గంగులకు చాలెంజ్
-
వందకు వంద శాతం నష్టం!
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ప్రకోపానికి గురైన అన్నదాతకు ఈసారి భారీ నష్టం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో గతంలో కూడా అకాల వర్షాలు పడ్డాయని, అలాంటప్పుడు 20 శాతం మేర నష్టం జరిగేదని.. కానీ వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు కొన్నిచోట్ల వందకు వంద శాతం పంట దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. వేగంగా సేకరణ ప్రక్రియ ‘పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇక ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా, వేగవంతంగా సేకరించే ప్రక్రియ జరుగుతుంది..’అని గంగుల తెలిపారు. తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ కోసం.. ‘తడిసిన ధాన్యంలో తేమ శాతం 20 వరకు వస్తే దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించాం. నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో తడిసిన ధాన్యాన్ని బాయిలŠడ్ రైస్‌గా మార్చడానికి ఆదేశాలు జారీ చేసి, ఆయా మిల్లులకు కేటాయింపులు జరిపాం. ఇప్పటివరకు మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చాం. పరిస్థితికి అనుగుణంగా పరిమాణం పెంచుతాం. రాష్ట్రంలో ఎక్కడ తడిసిన ధాన్యం ఉన్నా బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం..’అని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత కరీంనగర్ మండలం దుర్శేడ్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ తోపులాట చోటుచేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మంత్రి గంగుల మంగళవారం దుర్శేడ్ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్‌రావు, పద్మాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రిని కలిశారు. కేంద్రాల్లో టార్పాలిన్లు లేవని, ఒక్కో పరదాకు రైతులు రోజుకు రూ.30 కిరాయి చెల్లిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి, కాంగ్రెస్ నేతలకు మధ్య స్వల్ప వాగి్వవాదం జరిగింది. ఇరుపక్షాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. -
తడిసిన ధాన్యం కొంటాం..
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా వానకు తడిసిన ధాన్యంతో బాయిల్డ్ రైస్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యవసరంగా బాయిల్డ్ రైస్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని, ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచుతామని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన నల్లగొండ జిల్లాలో 22 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్‌లో 14,700, కరీంనగర్లో 7,350, యాదాద్రి, జగిత్యాలలో 5,000 మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ రైస్ కోసం ధాన్యం సేకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గంగుల వెల్లడించారు. ఇప్పటివరకు గత యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వివరించారు. గతేడాది ఇదే రోజునాటికి 3.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా.. ఈ సారి 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి, రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ రూ.1,543 కోట్లని తెలిపారు. నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్‌రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్‌సింగ్‌తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్‌ఫోర్స్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
Balagam Success Meet: కరీంనగర్ లో 'బలగం' మూవీ విజయోత్సవ వేడుక ( ఫొటోలు)
-
కేంద్ర నిర్ణయం బట్టి రాష్ట్రం స్పందన
సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి ధాన్యం సీఎంఆర్ విషయంలో కేంద్రం నిర్ణయించే లక్ష్యానికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎంత మేర ముడి బియ్యంగా, ఉప్పుడు బియ్యంగా తీసుకుంటారనే స్పష్టత వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని స్పష్టంచేశారు. కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రాత్రి సీఎంతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో సేకరించే ధాన్యం లక్ష్యం, సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యం గురించి వివరించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా కూడా బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఇవ్వడంలో ఉన్న ప్రతికూలతలపై చర్చించినట్లు సమాచారం. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేస్తే తప్ప రైతాంగానికి మేలు జరగదనే విషయంపై మరోసారి చర్చించినట్లు తెలిసింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి బకాయి ఉన్న విషయాలను కూడా సీఎంకు వివరించారని తెలిసింది. -
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్‌కార్డులు అందజేశారు. -
బీసీల సంక్షేమానికి పెద్దపీట: హరీశ్
మణికొండ: దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా తెలం గాణలో బీసీల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.48 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ సంవత్సరం 6,229 కోట్లను బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి గండిపేట మండలం కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు. ఆయా భవనాలకు అవసరమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ సముదాయాల నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. తుది దశకు చేరుకున్న యాదవ, కురుమ సంఘాల భవనాలను మార్చి 10న ప్రారంభిస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం అండ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు. ఇప్పటివర కు 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు బీసీల గురించి కేవలం మాటలే చెబుతాయని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ సర్కారు చేతల్లో చూపిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి జరుగుతున్న కృషిని ఆయా కులసంఘాల నేతలు, ప్రజలు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణలో 6,229 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, బండ ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమీషన్ సభ్యుడు ఉపేంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
CM KCR: మంత్రి గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించగా నేడు కరీంనగర్లో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రి గంగులను, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ఓదార్పునందించారు. -
కరీంనగర్: 26న తీగల వంతెన ఓపెన్!.. విశేషాలు ఇవే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనను ఈనెల 26వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వంతెనను ప్రారంభించనున్న నేపథ్యంలో బ్రిడ్జిపైకి 26వ తేదీ నుంచి వాహనాలను అనుమతించనున్నారు. ప్రస్తుతం అప్రోచ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. వంతెనకు రెండువైపులా ఇటు హౌజింగ్ బోర్డును అటు సదాశివపల్లిని కలిపేలా అప్రోచ్ రోడ్ పనులు వేగంగా నడుస్తున్న క్రమంలో వంతెనపై వాహనాలు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. 26 నుంచి హౌజింగ్ బోర్డు వద్ద పూర్తయిన అప్రోచ్ నుంచి వంతెనపైకి వాహనాలు నడిపించనున్నారు. అప్రోచ్ రోడ్డును కలిపే రెండు భారీ బీమ్స్ త్వరలోనే అధికారులు వంతెనకు అనుసంధానం చేయనున్నారు. దీంతో వాహనాలు వంతెనను ఎక్కేస్తాయి. డైనమిక్ లైటింగ్ పనులు..! వంతెనకు తుదిమెరుగులు దిద్దే కార్యక్రమం కూడా వేగవంతం నడుస్తోంది. ఇందులో భాగంగా.. వంతెనకు రాత్రిపూట మరింత అందాన్ని తెచ్చేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.8 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఎల్ఐఈడీ లైటింగ్ సిస్టం పనులు రెండుమూడు రోజుల్లో మొదలు కానున్నాయి. రాత్రిపూట కళ్లు జిగేల్ అనిపించేలా, పర్యాటకులకు కనువిందు చేసేలా రంగురంగుల ఎల్ఈడీ లైట్లు వంతెనకు ఏర్పాటు చేయనున్నా రు. ఈ లైట్లు వారధికి మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. నగర పర్యాటకానికి కొత్త శోభను తెచ్చేలా, చారిత్రక కరీంనగర్ పట్టణం సిగలో మరో మణిహా రంగా నిలిచిపోయే ఈ తీగల వంతెనను వచ్చే నెల తొలివారంలో ప్రారంభించేందుకు మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్ పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు డైనమిక్ లైటింగ్ ప నులపై నిరంతరం సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఒకే వరుసలో నాలుగు వారధులు..! శరవేగంగా తుదిమెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెనను ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీగల వంతెనను ప్రారంభించేందుకు జిల్లాకు రానున్నారు. అందుకే.. పట్టణ అభివృద్ధికి సాధారణ నిధులతోపాటు రూ.400 కోట్ల సీఎం అసూ్యరెన్స్ నిధులు, రూ.180 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఫిబ్రవరి నాటికి వంతెనను పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. జనవరి నెలాఖరునాటికి డైనమిక్ లైటింగ్ పూర్తవనుందని సమాచారం. ఇప్పటికే.. మానేరుపై నిర్మించిన ఎల్ఎండీ ఆనకట్ట, మధ్యలో రెండు వంతెనలు ఉన్నాయి. తరువాత తీగల వంతెన ప్రారంభమైతే.. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో నాలుగు భారీ వంతెనలు ఒకే చోట ఉన్నట్లవుతుంది. ఇప్పటికే ఎల్ఎండీ వంతెనకు ప్రత్యేక లైటింగ్ ఉంది, ఇక మధ్య వంతెనలపై కార్పొరేషన్ లైటింగ్ సిస్టం ఉంది. తీగల వంతెన వెలుగులు వీటికి తోడైతే.. రాత్రిపూట మానేరు తీరం అంతా రంగురంగుల విద్యుత్తు కాంతులతో ఈ వారధులన్నీ ధగధగలాడనున్నాయి. పలు దఫాల్లో లోడింగ్ టెస్టు.. తీరనున్న ట్రాఫిక్ చిక్కులు.. గతేడాది జూన్‌లో వంతెనకు లోడింగ్ టెస్టు నిర్వహించారు. 28 టిప్పర్లలో 30 టన్నుల చొప్పున ఇసుక నింపి మొత్తం 840 టన్నుల బరువును ఒకేసారి వంతెనపై వివిధ ప్రాంతాల్లో ఉంచి పరిశీలించి, ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నారు. అలాగే, ఫుట్‌పాత్‌లపై 110 టన్నుల ఇసుక బస్తాలను ఉంచి వాటి సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. రెండో దఫాలోనూ జూలై మొదటివారంలో ఇదే బరువుతో మరోసారి వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ అన్ని పరీక్షలను వంతెన విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ అతిపెద్ద ఇండస్ట్రీ. ఈ వంతెనపై నుంచి టన్నుల కొద్దీ బరువున్న గ్రానైట్ రాళ్లను కూడా తీసుకెళ్లవచ్చు. - అదే విధంగా ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పడనుంది. వరంగల్– హైదరాబాద్– కరీంనగర్ నగరాలకు అలుగునూరు కూడలిగా ఉంది. ఇప్పుడు అలుగునూరు కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే.. మూడు నగరాలకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. వరంగల్– కరీంనగర్ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంగా మారుతుంది. అదే సమయంలో ఈ రెండునగరాల మధ్య దూరం 79 కిమీలలో సుమారు 7 కి.మీలు తగ్గనుంది. ఫిబ్రవరి నాటికి సిద్ధం: మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. పనులు తుదిదశలో ఉన్నాయి. వంతెనకు ఇప్పటికే పలుమార్లు లోడింగ్ టెస్టు కూడా పూర్తి చేశాం. ప్రస్తుతం అప్రోచ్ పనులు వేగంగా నడుస్తున్నాయి. త్వరలోనే డైనమిక్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో నగర కీర్తి ప్రతిష్టలు రెండింతలు అవుతాయి. నగర పర్యాటకానికి సరికొత్త శోభ చేకూరుతుంది. వరంగల్– కరీంనగర్ నగరాల మధ్య దూరం కూడా 7 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఫిబ్రవరిలో సీఎం స్వయంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. వంతెన విశేషాలు ఇవే.. - 500 మీటర్ల పొడవైన రోడ్డు, నాలుగు వరుసల రహదారి.. - 26 పొడవైన స్టీల్ కేబుల్స్.. ఇటలీ నుంచి తెప్పించినవి. - వంతెనకు 2 పైలాన్లు, రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు - పైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు - రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్. - రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ - వెడల్పు 21.5 మీటర్లు, 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు.. - రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు - టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం - 2017 డిసెంబరులో శంకుస్థాపన - 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం - 2023 ఫిబ్రవరిలో వంతెన ప్రారంభం. -
మంత్రి గంగులకు పితృ వియోగం
కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య బుధవారం సాయంత్రం కరీంనగర్‌లోని తమ స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న మంత్రి గంగుల తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కమలాకర్ చిన్న కుమారుడు. సీఎం కేసీఆర్ సంతాపం: మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఫోన్ చేసి గంగులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు, స్పీకర్ పోచారం, ఇతర ప్రముఖులు మల్లయ్య మృతికి సంతాపం ప్రకటించారు. -
హైదరాబాద్‌పై కన్నేశారు
కరీంనగర్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్, షర్మిల, కేఏ పాల్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హైదరాబాద్‌పై కన్నేశారని, వారంతా ఒకేతాను ముక్కలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ వై.సునీల్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి సాధించిందన్నారు. చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, పవన్‌కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వారాహి ప్రచార రథాన్ని ప్రారంభిస్తాననడం, షర్మిల రాష్ట్రంలో పాదయాత్రలు చేయడం చూస్తుంటే గతంలో తెలంగాణ సంపదను దోచుకున్న వారి చరిత్ర, తీరు మార్చుకోలేదని నిరూపితమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసిన వారు మరోసారి తెలంగాణలో విషబీజాలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. మరోసారి ఎలాగైనా రాష్ట్రంలో టీడీపీ పాగా వేయాలని చూస్తోందని, అందుకే.. వెళ్లిపోయిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునివ్వడంతో బాబు నైజం బయటపడిందని విమర్శించారు. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, షర్మిల, కేఏ పాల్ బీజేపీ విసిరిన బాణాలేనని, వేర్వేరు వేషాల్లో గద్దల్లా వాలుతున్నారని దుయ్యబట్టారు. -
సత్యం రాజేష్ హీరోగా కొత్త చిత్రం.. షూటింగ్ షురూ
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్.కృష్ణయ్య
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. -
కొవ్విరెడ్డితో సంబంధం లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తనది కేవలం రెండు గంటల పరిచయం మాత్రమేనని, అంతకుమించి ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని, మున్నూరు కాపు సంఘంలో తిరుగుతాడని, ఐపీఎస్ అని విన్నానని తెలిపారు. అంతేతప్ప తానెప్పుడూ ప్రత్యక్షంగా అతన్ని కలుసుకోలేదని అన్నారు. అయితే ఇటీవల అరెస్టుకు వారం రోజుల ముందు ధర్మేందర్ అనే వ్యక్తి ద్వారా ఫిల్మ్‌నగర్‌లో జరిగిన ఓ గెట్ టు గెదర్‌లో శ్రీనివాసరావును కలిశానని చెప్పారు. శ్రీనివాస్ మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ అని గర్వంగా ఫీలయ్యామని, అతడి భార్య కూడా ఐఏఎస్ అని చెప్పడంతో వారిని కలిసేందుకు ధర్మేందర్ ద్వారా వెళ్లామన్నారు. ఆ సందర్భంగానే ఫొటోలు దిగడం జరిగిందని తెలిపారు. తనను అతను ఎలాంటి పనులు అడగడం కానీ, తాను అతడిని అడగటం కానీ జరగలేదని అన్నారు. మరుసటి రోజు గంటపాటు మామూలుగా మాట్లాడామే తప్ప అంతకుమించి ఏమీ లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన సమయంలో అతని ఫోన్లో తన ఫొటోలతో పాటు కాల్‌లిస్టులో పేరు ఉండటంతో విచారణకు పిలిచారని వివరించారు. తన బావ, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి సాయం అడిగాడని, దాంతో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఇప్పించాడని, ఆ డబ్బుల బకాయి ఇంకా ఉందని చెప్పారు. శ్రీనివాస్‌తో తామెలాంటి లావాదేవీలు జరపలేదని, సీబీఐ అధికారులకు ఇదే స్పష్టం చేశామని అన్నారు. -
వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ ఆఖరు నాటికి 25.84 ఎల్ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్‌ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. నిజామాబాద్ టాప్ వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్ జిల్లాలో 5,38,354 మెట్రిక్ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 3,22,047 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సన్నాలకు డిమాండ్‌తో... జై శ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. -
శ్రీనివాసరావుతో సంబంధమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలేమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. తమ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, ఇద్దరు నేతలు తెలిపిన విషయాలను బేరీజు వేసుకున్నారు. బుధవారం సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల, వద్దిరాజు గురువారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.40 గంటల వరకు సుమారు 8.40 గంటల పాటు జరిగింది. వేర్వేరుగా విచారణ అధికారులు గంగుల, వద్దిరాజు ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. శ్రీనివాసరావును కూడా వారికి ఎదురుగా కూర్చోబెట్టి వారు చెప్పిన సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ‘శ్రీనివాసరావుతో ఎప్పటినుంచి పరిచయం ఉంది? ఎక్కడెక్కడ కలిశారు? ఏమైనా ఆఫర్లు ఇచ్చాడా? లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఎవరినైనా పరిచయం చేశాడా? డబ్బు చెల్లింపులు జరిగాయా.?’లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొన్ని విషయాల్లో తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని సమాచారం. పూర్తిగా సహకరించాం: మంత్రి గంగుల విచారణ ముగిసిన తర్వాత గంగుల, వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో ఎలాంటి ఆలస్యం చేయరాదన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులు పిలవగానే మేం ఢిల్లీలో విచారణకు హాజరయ్యాం. ఎందుకంటే మేం చట్టాలను గౌరవిస్తాం. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పిన సమయాని కంటే ముందే వారి కార్యాలయానికి వచ్చాం. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో మా విచారణ జరిగింది. వారికి పూర్తిగా సహకరించాం. వారిని గుర్తుపట్టావా? అని శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతన్ని వారం క్రితం ఒక మున్నూరు కాపు సమావేశంలో కలిశామని మేం చెప్పాం. రెండుసార్లు మాత్రమే కలిశాం. మున్నూరు కాపు బిడ్డ, ఐపీఎస్ అధికారి అని చెప్పినందుకు గుర్తించామే కానీ, ఆయనతో లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు మాకు ఎవరికీ రాలేదు. ఈ విషయాలనే సీబీఐ అధికారులకు వివరించాం. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేశాం. మేం ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టే వాస్తవాలు చెప్పాం. దీనిపై శ్రీనివాసరావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మేం చెప్పిన ప్రతి విషయాన్నీ రికార్డు చేసుకున్నారు. మా సమాధానాలతో సీబీఐ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. మా సంతకాలు తీసుకొని పంపించారు. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఇదే ఫైనల్ విచారణ అన్నారు..’అని తెలిపారు. బయట జరుగుతున్న వదంతులు ఏవీ వాస్తవాలు కాదని మంత్రి గంగుల కొట్టిపారేశారు. మేం బంగారం కొనిచ్చామన్నది దుష్ప్రచారమే: ఎంపీ వద్దిరాజు ‘కాపు వ్యక్తిగా శ్రీనివాసరావు మాకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న ఫోన్లు, బంగారం ఆయన కొనుక్కున్నవే. మేము కొనిచ్చామన్నది0 దుష్ప్రచారమే. అది పూర్తిగా అవాస్తవం. అన్ని అంశాలు వివరించాం. అధికారులకు సహకరించాం. శ్రీనివాసరావును మా ఎదురుగా కూర్చోపెట్టి విచారించారు.. ’అని వద్దిరాజు చెప్పారు. -
ఢిల్లీ: సీబీఐ ఎదుట మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర హాజరు
-
సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల
న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారంలో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా హాజరవ్వాలని గంగుల, గాయత్రి రవికి సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా కొవ్విరెడ్డి శ్రీనివాస్ గత మూడేళ్లుగా నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు సాగిస్తూ అనేకమందిని మోసం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్లో శ్రీనివాస్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మున్నురుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిని శ్రీనివాస్ ఫోటోలు దిగినట్లు సమాచారం. అలాగే ఓ గెట్ టూ గెదర్ కార్యక్రమంలోనూ వీరిని శ్రీనివాస్ కలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో వీరిద్దరికి శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. నాకు నోటీసులు రాలేదు: బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫోన్స్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో రామ్మోహన్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్లో కలిసినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీబీఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానన్నారు. చదవండి: Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు -
మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, న్యూఢిల్లీ: ‘నకిలీ సీబీఐ అధికారి’ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గురువారం ఢిల్లీలో అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను సీబీఐ అధికారినంటూ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన కొవి రెడ్డి శ్రీనివాసరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అతడికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంగుల, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలతో పరిచయం ఉందని గుర్తించడంతో విచారణకు రావాలని ఆదేశించింది. బుధవారం ఉదయం ఇద్దరు సీబీఐ అధికారులు కరీంనగర్‌లోని గంగుల నివాసానికి వచ్చి సమన్లు అందించారు. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 51 జారీ చేసిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు రాష్ట్రంలో ప్రముఖులకు సమన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కులం పేరుతో కుచ్చుటోపీ! విశాఖపట్టణంలోని చినవాల్తేరు కిర్లంపూడికి చెందిన కొవిరెడ్డి తాను ఐపీఎస్ అధికారినని, సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కులం పేరు చెప్పుకుని పరి చయం పెంచుకున్నాడు. తమ కులంవ్యక్తి కావడం, అతడి పటాటోపం చూసి ఒకరి వెనుక మరొకరు నమ్మేశారు. అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యేలూ ఉన్నారు. అయితే శ్రీనివాసరావు ఢిల్లీలో వ్యాపారాలు, ఇతర అవసరాలున్న వారిని ఎంచుకునేవాడు. ఢిల్లీలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని.. కొలువులు, పర్మిట్లు ఇప్పిస్తానని, కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించేవాడు. ‘పని’ కావాలంటే ఖర్చవుతుందని చెప్పి విలువైన కాను కలు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో పోర్టర్ అనే కంపెనీకి చెందిన దాదాపు 2వేల వాహనాలకు ఢిల్లీలో ‘నో ఎంట్రీ’ నిబంధనలు లేకుండా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులోనే శ్రీనివాసరావును ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అరెస్టు చేసింది. రాష్ట్ర నేతల పరిచయాలతో.. తెలుగు రాష్ట్రాల్లో ఓ కులానికి సంబంధించిన నేత లను బాగా నమ్మింపజేసిన శ్రీనివాసరావు.. వారిలో కొందరు ప్రముఖుల నుంచి భారీగా బంగారం, నగదు తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో అతడి ఫోన్లో వద్దిరాజు రవిచంద్ర, ఆయనకు బంధువైన మంత్రి గంగుల కమలాకర్‌లతో కలిసి తీసుకున్న ఫొటోలు లభించినట్టు సమాచారం. దీనికితోడు గతంలో ఈడీ అధికారిని అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఏవైనా లావాదేవీలు నడిచాయా అని సీబీఐ అనుమానిస్తోందని సమాచారం. శ్రీనివాసరావుతో నాకేం సంబంధం లేదు ఇటీవల కొన్ని వేదికలపై శ్రీనివాసరావు కలిశాడే తప్ప అతడితో తనకేం సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సదరు శ్రీనివాసరావు తాను ఐపీఎస్ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడని వివరించారు. ఢిల్లీ వెళ్లి ఇదే విషయాన్ని సీబీఐ ఆఫీసర్లకు చెబుతానన్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు -
గంగుల, బండి ఒక్కటే?
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): ‘మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూట్లో రాయి తీయలేని వాడు.. ఏట్లో రాయి తీస్తడట. జిల్లాలో ఇంత అవినీతి జరుగుతుంటే.. ఏనాడైనా మాట్లాడావా’ అంటూ బండి సంజయ్‌ను నిలదీశారు. ఈడీ వచ్చి మంత్రి ఇంట్లో సోదాలు చేస్తుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. తొండ ముదిరి ఊసర వెల్లి అయినట్లు.. గంగుల ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడన్నారు. గ్రానైట్, ఇసుక, గుట్కా మాఫియాకు తోడు భూ కబ్జాలు చేస్తూ కరీంనగర్ డాన్ అయ్యాడని ఆరోపించారు. సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి.రాంరెడ్డి, డా.నగేష్, బి.అనిల్‌కుమార్, అక్కెనపల్లి కుమార్ పాల్గొన్నారు. -
నాటి విజిలెన్స్ నివేదికతోనే ఈడీ సోదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కొత్తపల్లి: గ్రానైట్ మైనింగ్‌లో అవకతవకలు, పన్నుల ఎగవేత, హవాలా తదితర ఆరోపణలపై కరీంనగర్లో రెండో రోజూ ఈడీ, ఐటీ శాఖల సోదాలు కొనసాగాయి. పట్టణ శివారులోని కొత్తపల్లిలో ఉన్న అరవింద గ్రానైట్స్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్, దక్కన్ గ్రానైట్స్, గాయత్రీ గ్రానైట్స్, సంధ్యా గ్రానైట్స్ తదితర కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో అధికారులు గురువారం సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి పంచనామాలను అందజేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న దాడులకు ఉమ్మడి ఏపీలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికే కారణం. ఆయా గ్రానైట్ కంపెనీల అవకతవకల వల్ల ప్రభుత్వానికి మొత్తంగా రూ.124.94 కోట్ల మేర నష్టం వచ్చినట్లు ఉమ్మడి ఏపీలో విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా కంపెనీలపై 5 రెట్లు పెనాల్టీ కలిపి రూ.749.66 కోట్ల మేర జరిమానా (సినరేజీ ఫీజు)ను అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులు విధించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయా కంపెనీలు ఐదు రెట్ల పెనాల్టీని ఒక వంతుకు (మెమో నం.6865/ఆర్1/2016) తగ్గించుకున్నాయి. గతేడాది ఆగస్టు నాటికి రూ. 11 కోట్ల వరకు పెనాల్టీ చెల్లించాయి. ఈ ఏడాదికాలంలోనూ మిగిలిన మొత్తాన్ని చెల్లించామని కంపెనీలు చెబుతున్నాయి. షిప్పింగ్ కంపెనీల నుంచి వివరాలు..! గ్రానైట్ మైనింగ్‌లో అక్రమాలపై ఈడీ అధికారులు అన్ని మార్గాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్లో ఉత్పత్తి అయిన గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణ్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు గుర్తించి ‘ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు ఇప్పటికే లేఖ రాశారు. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బక్సీ అండ్ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్/వేంకటేశ్వర లాజిస్టిక్స్ కంపెనీలు.. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్ విదేశాలకు తరలించాయి? కంపెనీల వివరాలు, యజమానులు/భాగస్వాముల తదితర వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారని సమాచారం. వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగనుంది. ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారు: గంగుల పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఈడీ దాడులకు నిష్పక్షపాతంగా సహకరిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్ధిపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ముందుకు సాగుతున్న తెలంగాణపై ఢిల్లీ పాలకులకు మంట మొదలైందని, తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు గుడ్డి దీపాలుగా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వెలుగులీనుతున్నాయన్నారు. కాళేశ్వరంతో చెరువులన్నీ నింపడంతో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని, ఉచిత విద్యుత్, రైతుబంధు, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతును రాజు చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులయ్యారని తెలిపారు. బొగ్గు, కరెంట్‌ను తీసుకెళ్లి తెలంగాణను అంధకారం చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై ఎందుకీ వివక్ష ? పైసలున్న వాళ్లంతా బీజేపీకి వేళ్తే సమ్మతమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంతకాలం అంబానీ, ఆదానీలకు తెలంగాణలో చోటు లేదని స్పష్టం చేశారు. -
Hyderabad: ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈడీ, ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దుబాయ్ పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల ఈడీ దాడులపై సమాచారం అందుకుని వెళ్లిన 17 గంటల్లోనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ ఈడీ, ఐటీ దాడులపై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇంట్లోని లాకర్లను తానే వీడియో కాల్లో ఉండి ఓపెన్ చేయించినట్లు చెప్పారు. 'ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ సోదాలు నిర్వహించారు. 31 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాం. మాపై చాలామంది చాలా సార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మేము ఎక్కడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: (మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే) -
Gangula Kamalakar: దుబాయ్ నుంచి గంగుల రిటర్న్.!
సాక్షి, హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతున్నట్టు తెలిసింది. మంగళవారమే కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన మంత్రి గంగులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. తాళం వేసి ఉన్న ఆయన ఇంటి తలుపులను గ్యాస్ కట్టర్‌తో కట్ చేయించి మరీ లోనికి వెళ్లారు. అధికారుల సోదాల విషయం ఫోన్లో తెలుసుకున్న గంగుల హుటాహుటిన హైదరాబాద్‌కు టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మరో నాలుగు చోట్ల, అలాగే బావుపేటలోని గ్రానైట్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు శ్వేతా గ్రానైట్ వ్యవహారాలు చూసుకుంటున్న మంత్రి గంగుల సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) ('గంగుల ఇంటిపై ఈడీ దాడులు: మంత్రి రూ.749 కోట్ల పెనాల్టీ కట్టాలి') -
మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్‌కమ్‌టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసింది తానేనని బీజేపీ లాయర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ దాడులపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ.. 'మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నేనే ఫిర్యాదు చేశా. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి 2020లో కంప్లైంట్ ఇచ్చాను. 2021లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని షిప్పింగ్ కార్పోరేషన్ చెన్నైని ఈడీ సూచించింది. పది రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సూచించినా.. ఇంతవరకు ఇవ్వలేదు. మీడియా ద్వారా ఈడీ దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. దాదాపు రూ.749 కోట్ల పెనాల్టీ (వడ్డీతో కలిపి) మైనింగ్ చేస్తున్న వారు కట్టాల్సి ఉంది' అని తెలిపారు. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) -
మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికలు ముగియగానే తెలంగాణలో ఐటీ, ఈడీ సోదాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్‌కమ్‌టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని మంకమ్మతోట కాలనీలో ఉండే మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి వచ్చిన అధికారులకు తాళాలు వేసి కనిపించాయి. గంగుల కమలాకర్ విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. మంత్రి గంగుల కమలాకర్ అందుబాటులో లేకపోవడంతో తాళాలను డ్రిల్ మిషన్‌తో పగులగొట్టి అధికారులు ఇంట్లోకి వెళ్ళారు. గ్రానైట్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటాయించిన మైన్లలో అనుమతికి మించి మైనింగ్ చేపట్టారన్న ఫిర్యాదులున్నాయి. వీటిలో జరిగిన అక్రమాలపై ఐటీ, ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే శ్వేతా ఏజన్సీ, ఏఎస్‌యూవై షిప్పింగ్, జేఎమ్ బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్ఆర్ ఏజన్సీస్, కేవీఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌కు నోటీసులు ఇచ్చారు. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో పాటు ఆదాయపన్ను ఎగవేతలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. చదవండి: (గవర్నర్ Vs టీఆర్ఎస్: తమిళిసై ప్రెస్‌మీట్ వేళ ట్విస్ట్ ఇచ్చిన సర్కార్) మంత్రి గంగుల కమలాకర్ సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా ఈడి సోదాలు నిర్వహిస్తోంది. ఆయన శ్వేతా గ్రానైట్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే వీరందరికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు హైదరాబాద్‌లో పంజాగుట్టలో ఉండే పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లలోని కొన్ని ఫ్లాట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. -
ప్రలోభాలకు తెలంగాణ లొంగదు
చౌటుప్పల్: ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగబోదని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ఆ పార్టీలో చేర్చుకునేందుకు చేసిన కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, బీజేపీ, రాజగోపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణలో తావు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి మునుగోడులో ఓటమి తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసిందన్నారు. అనంతరం వారు జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శిస్తూ తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
గత వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరో 17 ఎల్ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ వర్మ నవంబర్ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. యాసంగి ఫోర్టిఫైడ్ రైస్.. మరో 4 ఎల్ఎంటీకి కేంద్రం అనుమతి గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్ఎంటీ పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణ కోసం ఈసారి 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ధాన్యం కోసం అవసరమైన 25 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. -
ఈసారి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట సాగైన నేపథ్యంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజను సేకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవసాయ, పోలీస్, మార్కెటింగ్, సహకార శాఖలకు చెందిన అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండించిన స్థితి నుంచి ఏకంగా కోటీ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ సారి 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు, తేమ కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 17 జిల్లాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం అక్రమ దిగుమతిని అడ్డుకొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు తెచ్చే ధాన్యాన్ని విజిలెన్స్‌తో పాటు పోలీస్ శాఖ అడ్డుకోవాలని ఆదేశించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ధాన్యం నిల్వకు ఏర్పాట్లు మిల్లర్ల వద్ద ఇప్పటికే దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యానికి తగిన నిల్వ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి గంగుల ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా సీఎంఆర్ కింద అప్పగించి, తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
Telangana: ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో శుక్రవారం నుంచి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 2.83 కోట్ల లబ్ధిదారులున్నారని వివరించారు. వీరిలో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తోందని స్పష్టం చేశారు. మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాçష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు రేషన్ పంపిణీని పొడిగించిందని తెలిపారు. ఇందుకోసం కేవలం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని పేర్కొన్నారు. వీటికి నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా రూ.227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. పీఎంజీకేఏవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు కేవలం బియ్యం కోసం రూ.1,308 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండునెలలు అందజేసిన మొత్తం రూ.2,454 కోట్లని వివరించారు. -
తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
రాజమహేంద్రవరం రూరల్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, అహంభావానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు బాలాజీపేట సెంటర్లో ఏర్పాటు చేసిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారని, దీనిపై తెలంగాణ మంత్రి ‘మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల నీతి కలిగిన నాయకుడని, వైఎస్సార్ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తి అని, వైఎస్ జగన్ కష్టపడే ప్రతిచోటా ఆయన ఉంటారని తెలిపారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మున్నూరు కాపులను బీసీల్లో చేర్చి ఆదుకున్న విశాల హృదయం సీఎం జగన్మోహన్రెడ్డిదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దురహంకార వ్యాఖ్యలు సరైనవి కావని, తెలుగువారిగా విడిపోయినా మనసులు విరిగిపోయినట్టు వ్యాఖ్యలు ఉండకూడదని హితవు పలికారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వలసలు వస్తున్నారని చెప్పారు. -
కరీంనగర్ జిల్లాలో ఘనంగా కళోత్సవాలు (ఫొటోలు)
-
కరీంనగర్ ‘కారు’లో ఏం జరుగుతోంది?
అధికార పార్టీ అంటే గ్రూపులు తప్పవు. పదవుల పరుగు పందెంలో ఎవరికి వారు తామే ముందుండాలని అనుకుంటారు. కరీంనగర్ సిటీలో మంత్రికి, నగర మాజీ మేయర్ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. మధ్యలో మాజీ మేయర్ అల్లుడి వ్యవహారంతో రెండు గ్రూపుల మధ్య వైరం మరింత ముదిరింది. ఇంతకీ కరీంనగర్ కారుకు రిపేర్ జరుగుతుందా? కరీంనగర్ సిటీ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్దిరోజులుగా తనరూటే సెపరేటు అంటూ సింగిల్‌గా వెళ్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై నగర టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మూకుమ్మడి యుద్ధానికి దిగారు. రవీందర్ కుటుంబ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రవీందర్ సింగ్ అల్లుడు ఓ వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును టీఆర్ఎస్ కార్పొ రేటర్లు బహిర్గతం చేశారు. సింగ్ కుటుంబాన్ని పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని అధిష్టానాన్ని కోరారు. దీనిపై మంత్రి కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ దంపతులు సైతం స్పందించారు. ఉద్యమకాలం నుంచి తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఓ వ్యాపారితో మాట్లాడిన ఫోన్ సంబాషణను టీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌పై చేసిన వ్యాఖ్యల్ని డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, పలువురు కార్పొరేటర్లు ఖండించారు. తమ డివిజన్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, మంచినీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో కౌన్సిల్లో నిరసన తెలియచేస్తూనే, రాత్రికి రాత్రి జేసీబీతో రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు తవ్వి సమస్యను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్, ఆయన కుటుంబసభ్యులు పథకం ప్రకారం సమస్యలు సృష్టిస్తూ...వాటికి మంత్రి కారణమంటూ చెప్పడం వెనుక ఉన్న కుట్రలను ప్రజలు గ్రహించాలని కోరారు. పార్టీకి నష్టం చేకూర్చేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న రవీందర్ సింగ్, కార్పొరేటర్ కమల్ జిత కౌర్, ఆమె భర్త సోహన్ సింగ్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరీంనగర్ 40వ డివిజన్ మార్కెట్ ఏరియాలోని ఓ కల్వర్టు ధ్వంసం చేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వర్టు డ్రైనేజీని జెసిబితో ధ్వంసం చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ శాఖకు 2.5 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. ఆది నుంచీ తాము టీఆర్ఎస్లో ఉన్నామని తాము తప్పు చేసినట్టు నిరూపించాలని కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్త సొహాన్ సింగ్ సవాల్ విసిరారు. ఇప్పుడీ టాపిక్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ వెంట ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనపైన, ఆయన కుటుంబంపైనా చర్యలు ఉంటాయా? ఉండవా? అనే చర్చ జోరుగా సాగుతోంది. -
30 నుంచి కరీంనగర్ కళోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ కళా సంస్కృతులను పరిచయం చేస్తూ కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ‘కరీంనగర్ కళోత్సవాలు’ఈనెల 30న మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. కళోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం ఆ జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రానికి చెందిన పలువురు కళాకారులు, స్థానిక కార్యక్రమ నిర్వాహకులతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏయే రాష్ట్రాలు, దేశాల నుంచి ఎంతమంది కళాకారులు కరీంనగర్‌కు వచ్చి ప్రదర్శనలు ఇవ్వ బోతున్నారనే విషయంపై చర్చించారు. మూడు రోజుల్లో ఏయే రోజు ఎవరెవరు ప్రదర్శనలు ఇస్తారనే ప్రోగ్రాం షీట్‌కు తుది రూపం ఇచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ..దేశంలోని 20 రాష్ట్రాలతో పాటు మూడు దేశాల నుంచి 150కి పైగా కళాకారుల బృందాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వివరించారు. సినీనటులు ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలిపారు. కళోత్సవాల చివరిరోజైన అక్టోబర్ 2న సినీనటుడు చిరంజీవి హాజరవుతారని వెల్లడించారు. -
Karimnagar: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీలో అంతర్గతపోరుతో కరీంనగర్ జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందుతున్న క్రమంలో జిల్లాలో ఇంటిపోరు రచ్చకెక్కడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా రవీందర్‌సింగ్ అల్లుడు సోహన్‌సింగ్ మంత్రిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోహన్ సింగ్ తీరును మంత్రి వర్గీయులతోపాటు జిల్లా పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కమల్జిత్కౌర్ దంపతులకు పార్టీ షోకాజ్ జారీ చేసింది. మూడురోజుల్లో సమాధానం చెప్పాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే..! వాస్తవానికి ఈ విభేదాలు రాత్రికి రాత్రి మొదలవలేదు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని అలకబూనిన రవీందర్ సింగ్ తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారిపై మంత్రివర్గీయులు కేసులు పెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ రోజు సైతం రవీందర్‌సింగ్, ఆయన అన్న కూతురు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్‌లు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టపాసులు కాల్చారన్న అభియోగంపై రవీందర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. వెంటనే పార్టీలోకి పునరాగమనం చేశారు. రీ ఎంట్రీ తరువాత కూడా రవీందర్‌సింగ్, మంత్రి వర్గాల మధ్య విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. ఇటీవల కాలంలో కౌన్సిల్ సమావేశంలో నీటికొరతపై కమల్జిత్కౌర్ నిరసన తెలపడం, స్మార్ట్ సిటీ పనులపై రవీందర్‌సింగ్ ఆరోపణలతో మంత్రివర్గంతో అగాథం మరింత పెరిగింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యల ఆడియో లీకవడం పార్టీలో చిచ్చురేపింది. మంత్రికి, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నేతత్వంలో పలువురు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అయితే.. సీఎం కేసీఆర్ ఉత్తరభారతదేశ పర్యటనల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మంత్రి వర్గం తమపై రాజకీయ దాడి చేస్తోందని రవీందర్‌సింగ్ వర్గం ఎదురుదాడికి దిగుతోంది. మూడురోజులే గడువు..! పార్టీ ప్రతిష్ట మసకబారేలా, మంత్రి కమలాకర్‌కు పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, ఆమెభర్త సోహన్‌సింగ్‌లకు పార్టీ అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు బుధవారం జారీ చేసిన షోకాజుల్లో స్పష్టం చేశారు. దీంతో మూడురోజుల అనంతరం ఈ దంపతులు ఏమని వివరణ ఇస్తారు? ఆ సమాధానంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతృప్తి చెందుతారా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) -
కరీంనగర్ టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. ఆడియో లీక్ కలకలం!
సాక్షి, కరీంనగర్: జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. సదరు లేఖలో మాజీ మేయర్ కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, మంత్రిపై రవీందర్ సింగ్ అల్లుడు మాట్లాడిన ఆడియో లీక్ కలకలం సృష్టించింది. ఇక, ఆడియోలో టీఆర్ఎస్ మంత్రి, కలెక్టర్ గురించి మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు గుర్తించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడే సమస్యలు సృష్టించి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించరాదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ సీఎం బీహార్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా వెళ్లడం విశేషం. ఇది కూడా చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం -
హమ్మాయ్యా! టెన్షన్ పోయింది.. కేసీఆర్ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం
సాక్ష, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జరిగే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ ఉత్సవాల్లో వారంతా అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన వారిలో ప్రిన్సిపల్స్ యం.అంజలీకుమారి, కె.శోభారాణి, యం.రాములు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ కె.సుచిత్ర, జూనియర్ కాలేజీ లెక్చరర్ కె.రాధిక, ఉపాధ్యాయులు కె.పుష్ప, జి.అన్నపూర్ణ, హెచ్.సంతోష్, బి.గురువయ్య, పి.గీత, కె.వెంకటరెడ్డి ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారందరినీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రత్యేకంగా అభినందించారు. -
గంగులతో పోటీకి బండి సై అంటారా? ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తే..!
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే జిల్లా కేంద్రం కరీంనగర్ స్మార్ట్ సిటీగా వెలుగుతోంది. కేసీఆర్, బండి సంజయ్ సహా ఎందరో ఉద్ధండులను ఈ జిల్లా గెలిపించింది. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి. జిల్లా నుంచి వలస వెళ్ళే నాయకులెవరు? రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నియోజక వర్గం కరీంనగర్. తెలంగాణలో తొలి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో కొత్త అందాలను సంతరించుకుంది ఈ ప్రాంతం. ఇక్కడి నుంచి గత మూడు సార్లుగా గంగుల కమలాకర్ వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ నేత బండి సంజయ్ ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. గంగుల వర్సెస్ బండి? కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచే మరోసారి బరిలో నిలవాలని గంగుల కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉంటారా? లేదా అనేది క్లారిటీ లేదు. బండి హైదారాబాద్ సిటీలో ఏదైనా స్థానం నుంచి లేదంటే హుస్నాబాద్, వేములవాడలో ఒకచోటు నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన చల్మేడ లక్ష్మి నరసింహారావు టీఆర్ఎస్ లో చేరారు. గతంలో పోటీ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మళ్లీ పోటీ చేస్తారా అనేది చూడాలి. మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని సరైన టైమ్‌లో తెర మీదకి వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ వేరే నియోజకవర్గానికి వెళ్తే అంత స్థాయిలో గంగుల కమలాకర్ ను ఢీకొట్టే నాయకుడు బీజేపీలో ఎవరూ లేరనే చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధికి గంగుల తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా మంత్రి హోదాలో నిధులు బాగానే రప్పిస్తున్నారు. జరుగుతున్న, చేసిన పనులే తనను గెలిపిస్తాయని చెబుతున్నారాయన. అయితే కార్పొరేషన్లో కొందరు కార్పొరేటర్ల తీరు మంత్రికి మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు. (చదవండి: తగ్గేదేలే.. బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా!) దూసుకెళ్తున్న ఎమ్మెల్యే రవిశంకర్ ఎస్సీ నియోజకవర్గం చొప్పదండిలో టిఆర్ఎస్ పటిష్టస్థితిలో ఉంది. ఎమ్మెల్యే రవిశంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లు ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం అదనపు బలం. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు, ఎంపీ సంతోష్ గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. నియోజక వర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ కొంత బలంగా ఉన్నా.. నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కారు దిగి మళ్ళీ కమళం గూటికి చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఈ నియోజక వర్గంలో భారీగా ఓట్లు పడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయితే.. బీజేపీకి ప్లస్ కావచ్చు. కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నందున ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. మాన కొండూరులో మూడు ముక్కలాట! మాన కొండూరు నియోజక వర్గ అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మరో సీనియర్ నేత ఓరుగంటి ఆనంద్ లు కూడా అదే స్థాయిలో పర్యటిస్తుండటం గులాబీ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆరేపల్లి మోహన్ టికెట్ రాకుంటే మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీలో పెద్దల ఆశిస్సులున్నాయంటూ ఓరుగంటి ఆనంద్ చెప్పుకుంటున్నారు. ఆయన ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ పోస్టు రెన్యువల్‌తో సరిపెట్టుకుంటారో లేక.. ఎమ్మెల్యే సీటు కోసం పట్టుపడతారో చూడాలి. టికెట్ రాకపోతే ఓరుగంటి బీజేపీ వైపు వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి చాలా యాక్టీవ్ గా ఉన్న కవ్వంపల్లికి డాక్టర్‌గా మంచి పేరుంది. రెగ్యులర్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును స్థిరపడేలా చేశారు.. అదే అంశం తనకు కలిసొస్తుందన్న ధీమాలో ఉన్నారాయన. ఆరేపల్లి మోహన్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తే కవ్వంపల్లి భవితవ్యం ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గడ్డం నాగరాజు ఈ సారి కూడా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. (చదవండి: అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్.. గుజరాతీ గులామ్ అంటూ కేటీఆర్ ఫైర్) హుజురాబాద్ నుంచి ఈటల పోటీ చేయరా? హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయాలకు అసలు సిసలైన అడ్డాగా మారుతోంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచీ గులాబీ పార్టీని ఆదరించిన సెగ్మెంట్ గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో కమలం పార్టీలో కలిసిపోయింది. గత ఏడాది ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఇక్కడి నుంచే దళితబంధు పథకాన్ని ప్రకటించారు. మొత్తం 18 వేల కుటుంబాలకు పది లక్షల చొప్పున అందించారు. అయినప్పటికీ చావో రేవో అంటూ బీజేపీ తరపున బరిలో దిగిన ఈటల విజయం సాధించారు. కాంగ్రెస్ దారుణంగా మూడు వేల ఓట్లు మాత్రమే పొందగలిగింది. తొలిసారి హుజురాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరింది. 2021 ఉప ఎన్నిక హుజూరాబాద్ రాజకీయాలు స్వరూపాన్ని మార్చేసింది. కొంత కాలం నుంచి ఈటల రాజేందర్.. తాను సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో పోటీ చేస్తానంటున్నారు. మీరు రెడీనా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసరడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపిందనే చెప్పాలి. టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై విరుచుకు పడుతున్నారు. ఈటల నియోజకవర్గం మారితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీచేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఈటల సతీమణి జమున పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే నియోజకవర్గంలో ఊపందుకుంది. (చదవండి: బీజేపీ ప్రచారం కోసమే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారు: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు) -
సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్పరాజ్ అహ్మద్, ఎస్.హరిశంకర్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం: మంత్రి గంగుల
ఉప్పల్ (హైదరాబాద్): తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్ బగాయత్‌లో శనివారం సోమవంశ సహస్రార్జున క్షత్రియ కులసంఘం ఆత్మ గౌరవ భవనం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 41 కుల సంఘాలకు రూ.95.25 కోట్ల విలువ గల 82.3 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. దీంతో పాటు 25 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిన బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ప్రశంసించారు. 19 నుంచి 281 అత్యున్నత స్థాయి బీసీ గురుకులాలు, 791 బీసీ హస్టళ్లు, కల్యాణలక్ష్మి అందజేసి అందరికీ మేనమామగా గుర్తింపు పొందారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. క్షత్రియ సమాజ ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్, రవీందర్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. రాజకీయ వారసత్వాలు ఈ జిల్లాకు కొత్తేంకాదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యేల్లో మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ స్థానాల్లో ఉన్నవారు ఈ తరహాలోనే రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ తమ వారసులను బరిలో దింపేందుకు చాలామంది సీనియర్ నేతలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొందరు కుమారులను, కుటుంబసభ్యులను బరిలో దించే యోచనలో ఉండగా.. మరికొందరు తమ రాజకీయ వారసత్వాన్ని మూడోతరానికి అందించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. ‘బంధువులు రుతువుల్లాంటి వారు. వస్తారు.. పోతారు.. కానీ, వారసులు చెట్లలాంటివారు.. వస్తే పాతుకుపోతారు’ అంటూ ఓ సినిమాలోని డైలాగు ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు సరిగ్గా సరిపోతోంది. మొత్తానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ తమ కుటుంబ సభ్యులను, మనవళ్లను రాజకీయ యవనికపైకి తీసుకొస్తుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు శ్రీరాం ఇందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న శ్రీరాం.. నియోజకవర్గంలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి ఈసారి తాను హుజూరాబాద్ కాకుండా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి జమునారెడ్డిని రంగంలోకి దించుతారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటిదాకా హుజూరాబాద్ నుంచి మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల గెలిచారు. ప్రతిసారీ డమ్మీ అభ్యర్థిగా జమునారెడ్డి నామినేషన్ వేస్తూ వచ్చారు. నియోజకవర్గపు వ్యవహారాలన్నీ తెలిసి ఉండటం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ వయోభారం కారణంగా విద్యాసాగర్‌రావు తన కుమారుడు సంజయ్‌ని ఈసారి తన స్థానంలో పోటీ చేయిస్తారని సమాచారం. విద్యాసాగర్‌రావుకు ఉన్న అనుభవం, సంజయ్.. కేటీఆర్ కలిసి చదువుకోవడం కలిసి వచ్చే అంశాలని స్థానికులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభోత్సవం సమయంలో మంత్రి కేటీఆర్ పదే పదే సంజయ్ పేరును పలకడాన్ని కూడా ఉదాహరిస్తున్నారు. విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్.. కొంతకాలంగా వేములవాడ నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ స్థానికంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన కుటుంబ నేపథ్యంతో బీజేపీ నుంచి ఈసారి వేములవాడ నుంచి బరిలో దిగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెస్సార్ మనవడు మెన్నేని రోహిత్‌రావు మూడుసార్లు ఎంపీగా.. ఆర్టీసీ చైర్మన్‌గా.. రాష్ట్ర మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి.. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేసిన దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) మనవడు మెన్నేని రోహిత్‌రావు రానున్న ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాత ఎమ్మెస్సార్ చేసిన సేవలు, అభివృద్ధి తనకు కలసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంగుల కుమారుడు హరిహరణ్ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు గంగుల హరిహరణ్ రాజకీయ ప్రవేశం ఖాయమని ప్రచారం జోరందుకుంది. ఇటీవల హరిహరణ్ జన్మదిన వేడుకల సమయంలో గంగుల వారసుడిగా హరిహరణ్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేస్తారని అనుచరులు హడావుడి చేయడం త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న సంకేతాలు కేడర్‌కు వెళ్లినట్లయింది. జువ్వాడి చొక్కారావు మనవడు నిఖిల్ చక్రవర్తి తెలంగాణ సమరయోధుడు, మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి కూడా ఈసారి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిఖిల్ చక్రవర్తి తాత వారసత్వం తనకు అన్నివిధాలా కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరువారాలుగా నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్రంలో సీఎంఆర్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని రైస్‌మిల్లులను మిల్లింగ్‌కు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ నిలిచిపోయిన తరువాత తలెత్తిన పరిస్థితులు, వరదల వల్ల ధాన్యం నాని మొలకెత్తిన తీరు, మిల్లర్ల అసంతృప్తి తదితర అంశాలపై మంత్రి గంగుల శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు, ఎఫ్‌సీఐ సీఎంఆర్‌ను నిలిపివేసిన నేపథ్యంలో 3,200 మిల్లుల్లో సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సీఎంఆర్‌ను పునరుద్ధరించడంతో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి రైల్వే ర్యాక్‌లను పెంచాలని ఆయన ఎఫ్‌సీఐ జీఎంను కోరారు. కాగా మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో ఏం చేయాలనే అంశాన్ని చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాశరథి అవార్డును అందుకుంటున్న సంకోజు వేణును మంత్రి అభినందించారు. -
మంత్రి గంగులకు కరోనా పాజిటివ్
కరీంనగర్: బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలుండటంతో పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గంగుల సూచించారు. -
సంజయ్‌ది ఈర్ష్య దీక్ష!: గంగుల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధరణి పోర్టల్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టినది నిరసన దీక్ష కాదని, ఈర్ష్య దీక్ష! అని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. సోమవారం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ సునీల్, సుడా చైర్మన్ జీవీఆర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ దీక్షలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ప్రత్యారోపణలతో గంగుల తిప్పికొట్టారు. తొలుత సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ‘సంజయ్ మౌనదీక్షలో కేసీఆర్ కోసం మహారాజా కుర్చీ వేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నిజంగా మహారాజే’అని గంగుల కొనియాడారు. ధరణితో 98 శాతం భూసమస్యలు తగ్గి గ్రామాల్లో గొడవలు సమసిపోయాయన్నారు. అకాల వర్షాలతో రెవెన్యూ సదస్సులు వాయిదా పడ్డాయని చెప్పారు. కేంద్రం విస్మరించిన హామీలపై కూడా కుర్చీలు వేసి తనతోపాటు ధర్నాలు చేయాలని ఆహ్వానించారు. బీసీ కులగణన కోరుతూ నిరసన చేయాలి.. ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేయనందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు కుర్చీలేసి నిరసన తెలపాలని గంగుల సూచించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు యూపీఎస్సీ కార్యాలయం ముందు, విదేశాల నుంచి నల్లధనం తేనందుకు ఆర్బీఐ, ఈడీ కార్యాలయాల ముందు, గ్యాస్ సిలిండర్లు్ల, పెట్రోల్ ధరలు పెంచినందుకు బంకుల ఎదుట, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ ఆఫీసుల ముందు ధర్నాకు రావాలని సంజయ్‌కు సవాల్ విసిరారు. బీసీలు ఓట్లేస్తే గెలిచిన సంజయ్ బీసీ గణన చేపట్టాలని కోరుతూ నిరసన చేయాలని హితవు పలికారు. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గానికి ఎంపీ నిధులు విడుదల చేయడంలేదని, ముందు వాటిపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ సంజయ్ మతి భ్రమించిందని, ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాలని ధ్వజమెత్తారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వమిది: గంగుల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ వాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 41 కులాలకు హైదరాబాద్ నడిబొడ్డున రూ.వేల కోట్లు విలువ చేసే 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. ఇప్పటివరకు 24 కులాలు ఏకసంఘంగా ఏర్పాటు కావడంతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల బాధ్యతలను ఆయా సంఘాలకు అప్పగించామని తెలిపారు. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరు కులాలు ఏకసంఘంగా ఏర్పాటు కావడంతో ఆయా సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణ అనుమతి పత్రాలను గంగుల అందజేశారు. ఇందులో మున్నూరు కాపు, పెరిక, తెలంగాణ మరాఠా మండలి, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, నక్కాస/ఆరేటి క్షత్రియ కులాలున్నాయి. గంగుల మాట్లాడుతూ ఆయా కుల సంఘాలకు విద్యాపరంగా, సామాజికంగా, వసతిలో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, జల వనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. -
తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ తదితర అంశాలపై బుధవారం మంత్రి తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉందని, మరో 15 డిగ్రీ కాలేజీలనుఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశపె ట్టాలని, పారిశ్రామిక రంగం అవసరాల మేరకు వాటితో అనుసంధానం చేయా లని చెప్పారు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ వంటి కోర్సులను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలో గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించాలని, ఈ మేరకు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మరో 21 బీసీ స్టడీ సర్కిళ్లు:రాష్ట్రంలో మరో 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కొత్తగా మరో ఆరు కులా లు ఏక సంఘంగా ఏర్పడ్డాయని వీటికి ఈ నెల 8న నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటిని సైతం త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. -
బియ్యంపై కయ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్‌మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే సాకును చూపుతూ రాష్ట్రం నుంచి బియ్యాన్నే సేకరించకూడదనే తీవ్రమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఈనెల 7వ తేదీ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడాన్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3,250 రైస్ మిల్లులు మూతపడ్డాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనుచూపు మేరలో స్పష్టత కనిపించడం లేదు. సీఎంఆర్ లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సొమ్ము ఆగిపోయింది. మరోవైపు మిల్లుల్లో నిండిపోయిన ధాన్యం నిల్వలు మిల్లింగ్ లేక ముక్కిపోతున్నాయి. మిల్లుల ఆవరణల్లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యంపైన టార్పాలిన్లు కప్పినా, వర్షం, తేమకు మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు రాస్తున్న లేఖలకు ఎలాంటి స్పందన లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ అవుతున్న గత వానాకాలం వడ్లు 40 ఎల్ఎంటీలకు తోడు యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం మిల్లులు, వాటి ఆవరణల్లో పేరుకుపోయాయి. దాదాపు 90 ఎల్ఎంటీల ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ అయిన మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. తప్పు దిద్దుకున్నా స్పందించని ఢిల్లీ.... కరోనా ప్రబలిన తరువాత 2021 మార్చి నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (ఎన్ఎఫ్ఎస్సీ)లు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 53.68 లక్షల ఎన్ఎఫ్ఎస్ కార్డులకు గాను 1.92 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కోటా 1.90 ఎల్ఎంటీల బియ్యాన్ని పంపిణీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించింది. కానీ ఈ బియ్యాన్ని వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేదు. దీనిపై ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. బియ్యం పంపిణీ చేయనందున సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని, ఆ కోటాను ఈనెల 18 నుంచి ఆరునెలల పాటు ప్రతినెలా ఇస్తామని లేఖ రాసింది. ఈ మేరకు 18 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి మరీ అధికారులను కోరారు. అయినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు. రూ.1,700కు కొనేందుకు మిల్లర్లు సిద్ధం రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకోకుండా ఎఫ్‌సీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ధాన్యాన్ని వేలం పద్ధతిలో మిల్లర్లకే అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై మిల్లర్లు ఇటీవల సమావేశమై ప్రభుత్వం ధాన్యాన్ని తమకు విక్రయిస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1700 లెక్కన కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్‌గా విక్రయించుకుంటామని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. కేంద్రం తనకు తోచినప్పుడు ఇచ్చే డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తూ, భారమైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బియ్యం తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే విధానాన్ని తీవ్రంగా ఎండగడతాం. – గంగుల కమలాకర్, మంత్రి, పౌరసరఫరాల శాఖ -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
మున్నూరు కాపు ఐక్యత హర్షణీయం: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఐక్యతతో ముందుకు రావడం హర్షణీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. ఈనెల 9న ఆ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో రాష్ట్రంలోని వివిధ మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులంతా ఆదివారం సమావేశమయ్యారు. మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకమైతే ఉండే ప్రయోజనాలను, ఐక్యతతో ఉండాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనం భూమి పూజకు రాష్ట్రంలోని మున్నూరు కాపు సంఘాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కో–ఆర్డినేషన్ కమిటీలు హాజరవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మానికొండ వెంకటేశ్వరరావు, నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్ హాజరయ్యారు. -
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ పదిరోజుల్లో పూర్తికానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7.7 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని 13.69 కోట్ల గన్నీబ్యాగులు సేకరించి, కొనుగోళ్లు సాగిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాల అంచనాల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా, కోతలు పూర్తి కావలసిన ప్రాంతాల నుంచి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మొత్తంగా 11.43 ఎల్ఎంటీ ధాన్యం రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. -
పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు రావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీకి దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయాలని, తాము కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తామని, అప్పుడు జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చూసుకుందామని సవాలు చేశారు. శుక్రవారం మంత్రులు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రోజుకు పది జతల దుస్తులు మార్చడం తప్ప మోదీ ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని తలసాని విమర్శించారు. దావోస్‌లో పెట్టుబడులు రాబడుతున్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో దేశానికి నాయకత్వం వహిస్తారని మోదీ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. భారత్ బయోటెక్ సందర్శన సమ యంలో సీఎంను వెంట రావద్దని మోదీ కొత్త సం ప్రదాయానికి తెరలేపారన్నారు. హోం మంత్రి అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి కావడం కు టుంబ రాజకీయం కిందకు రాదా? అని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో ఓట్ల కోసం మూఢ విశ్వాసాలను వాడుకున్నది బీజేపీ మాత్రమేనని, సీఎం ఎన్నిక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని, బీజేపీ చెప్పినట్లు వ్యవస్థలు నడవవని ఆయన పేర్కొన్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులపరమైన చీలికలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి వచ్చారు: గంగుల తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని మోదీ వ్యాఖ్యానించడాన్ని మంత్రి గం గుల కమలాకర్ తప్పుబట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బండి సంజయ్‌కు అధికారం ఇస్తే మసీదులు తవ్వడం మినహా మరేమీ చేయరని ఎద్దేవా చేశారు. -
నిరంతరం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ న్నారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశా మని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినపక్షంలో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తా మని రైతులకు భరోసా ఇచ్చి, ప్రతి ధాన్యం గింజను కొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ధాన్యం కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే రూ.3 వేల కోట్లకు పైగా భారాన్ని భరిస్తూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ చేయిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.5,888 వేల కోట్ల విలువైన 30.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 4.72 లక్షల మంది రైతుల నుండి సేకరించాం..’అని గంగుల వివరించారు. కేంద్రం సహకరించకున్నా.. ‘కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష తనిఖీల పేరుతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విష యాన్ని రైతులు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మే 2 వరకు ఒక్క గన్నీ బ్యాగును రాష్ట్రానికి అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదు. 6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ 500 కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయింది. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నాం. 11.64 కోట్ల గన్నీ బ్యాగుల్ని సేకరించాం. వీటిలో 7.52 కోట్ల సంచులు వాడగా, ఇంకా 4.12 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఈ బ్యాగులు సరిపోతాయి. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలలో మరో వారం రోజుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆందోళనొద్దు.. ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని, ఆధైర్యపడాల్సిన అవసరం లేద న్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితు లతోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సోమవారం పౌర సరఫరాల భవన్లో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్నీ బ్యాగులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి.. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు మంత్రి గంగుల విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 2–3 రోజుల్లోనూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకొని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కొను గోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పా లిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 20.25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందడం లేదని మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ఏమాత్రం సహకరించ కున్నా.. కొత్తగా ఒక గన్నీ బ్యాగును ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు 9.97 కోట్ల గన్నీ బ్యాగులను సమకూర్చు కుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నా మని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటివరకు 6,369 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు గంగుల తెలిపారు. 3.18 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,961 కోట్ల విలువైన 20.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు. తరుగు తీస్తే చర్యలు తప్పవు... తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు. అవసరమైతే వారిని బ్లాక్ లిస్టులో పెట్టాడానికి కూడా వెనకడాబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాక అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచిం చారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, మెదక్ కలెక్టర్ హరీశ్, మెదక్, సిద్దిపేట అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు
వైరా: ధాన్యం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగం గా శనివారం ఆయన వైరా మార్కె ట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాము లునాయక్‌లతో కలసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ‘కుప్పలు.. తిప్పలు, ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న మిల్లర్లు ’శీర్షికతో గురువా రం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమై న కథనాన్ని పలువురు మంత్రి దృష్టికి తీ సుకొచ్చారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ తేమ శాతం ఎంత ఉంటే కొను గో లు చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల ద్వారా మిల్లర్ల అక్రమాలను అడ్డుకోవాల ని సూచించారు. పలువురు రైతులు కొణి జర్ల మండలంలోని ఎస్ఆర్ మిల్లు యజ మాని బస్తాకు పది కేజీలు తరుగు పేరుతో తీస్తున్నారని ఫిర్యాదు చేయగా.. వెంటనే ఆ మిల్లును సీజ్ చేయాలని కలెక్టర్ గౌత మ్ను మంత్రి ఆదేశించారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
ఏక సంఘం ఏర్పాటుకు వారమే
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కులాలకు నిర్మాణ అనుమతులు జారీచేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం మంత్రి కమలాకర్ తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 కులాలు ఏ కులానికి ఆ కులం ఏక సంఘంగా ఏర్పడి బీసీ సంక్షేమ శాఖను సంప్రదించాయని, వాటికి ఆయా కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల నిమిత్తం అనుమతి ప్రతాలు జారీ చేశామని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. మిగతా కులాలు కూడా ఏక సంఘంగా ఏర్పడాలని, ఇందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు విధిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గడువులోగా ఏకసంఘంగా ఏర్పడకుంటే ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీసీ కులాల కోసం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రూ.వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు, రూ.96 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే 80,039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్–1 కోచింగ్ ప్రారంభమైందన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. -
రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
నూకల పరిహారం ఎంతిద్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్‌కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. -
ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్లు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చే యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు (అన్లోడింగ్) మిల్లర్లు అంగీకరించారు. వేసవిలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వంతో కలసి నడుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు మిల్లర్లతో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ భవన్లో భేటీ అయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపుతున్న అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల ని కోరారు. అదే సమయంలో మిల్లర్లు రైతులను తరుగు, తాలు పేరుతో ధాన్యం కోతలతో వేధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. మిల్లర్‌కు, రైతుకు మధ్య సంబంధం ఉండరాదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నామని, అందువల్ల ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టరాదని ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ యాసంగి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. అలాగే రైస్ మిల్లర్ల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం... ఈ భేటీలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మిల్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికే నష్టాల్లో ఉండటం వల్ల యాసంగిలో ఎఫ్‌సీఐ కోరిన మేరకు 67 శాతం ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్‌లోడింగ్‌కు కొందరు మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500కుపైగా బాయిల్డ్ మిల్లులున్నా యని... ఎఫ్‌సీఐ, కేంద్రం తీరుతో వాటిపై ఆధారపడి న లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. రా రైస్ మర ఆడించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల తమకు నష్టాలు లేకుండా చూడాలని కోరారు. భేటీలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ జీఎంలు, మిల్లర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ కమిటీ భేటీ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి అందించాల్సిన ధాన్యంపై చర్చించారు. -
మిల్లింగ్‌పై కొర్రీలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతుల శ్రేయస్సు దృష్ట్యా అదనపు ఆర్థికభారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరిస్తున్నందున మిల్లింగ్ విషయంలో ఎఫ్‌సీఐ అనవసర కొర్రీ లు పెట్టొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలసి ధాన్యం సేకరణ, సీఎంఆర్, గోడౌన్ సమస్యలపై చర్చించారు. యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉం టుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. నూక శాతం పెరగడం వల్ల ఎదురయ్యే అదనపు భారాన్ని భరించి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యతాప్రమాణాల మేరకు ముడిబియ్యం అందిస్తామని కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖలు రాసినట్లు చెప్పారు. గత యాసంగికి సంబంధించి ఎఫ్‌సీఐ సేకరించాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ‘ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్’రూపంలో తీసుకోవాలని సూచించారు. వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని వేగంగా అందించేలా రైల్వే ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాలని కోరారు. ధాన్యం తక్కువ సేకరించే రాష్ట్రాలకు, అధి కంగా సేకరించే తెలంగాణకు సీఎంఆర్‌లో ఒకే గడువు ఇస్తున్నారని, ఈ అసమగ్ర విధానాన్ని పున:సమీక్షించాలని దీపక్ శర్మను కోరారు. ఈ యాసంగిలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఎఫ్‌సీఐ నుంచి డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పక్క రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకోవాలి ఎఫ్‌సీఐ జీఎంతో సమావేశం అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంత రం పర్యవేక్షించాలన్నారు. రీసైక్లింగ్ బియ్యం రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, వస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధాన్యం సేకరణలో ఉన్న ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. రుణాలపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, గత బకాయిలు వంటి అంశాలను చర్చించారు. -
రేపట్నుంచే కొనుగోళ్లు
సాక్షి , హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినప్పటికీ, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాబోతుందని తెలిపారు. యాసంగి కొనుగోళ్లపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి.. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్ఓలు, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెలాఖరుకు కోతలు ముమ్మరం ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్ చివరి వరకు కోతలు ముమ్మరమవుతాయని, మే 10వ తేదీ తరువాత అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుందని అన్నారు. 60 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమచేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సొమ్ము రూ.15 వేల కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. తెలంగాణ చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి కమలాకర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ శాఖ ద్వారా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సాగు లెక్కలు, పంట దిగు బడి అంచనాలకు అనుగుణంగా సాగైన 36 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఎకరాకు 28 క్వింటాళ్లలోపు ధాన్యం మాత్రమే దిగుబడిగా వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కల మేరకే కొనుగోళ్లు జరుపుతామన్నారు. కేంద్రంలో అమ్మడం వరకే రైతు బాధ్యత.. రైతు ఆధార్ కార్డుతో లింకైన పట్టాదారు పాస్ పుస్తకం ద్వారానే కొనుగోళ్లు సాగుతాయని, డాష్ బోర్డు విధానంలో ఏరోజుకారోజు ధాన్యం సేకరణ లెక్కలు అందుతాయని గంగుల చెప్పారు. రైతుకు మిల్లర్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడం వరకే రైతు బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొత్తగా 7.50 కోట్ల గన్నీబ్యాగులు కావాలి.. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలకు 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 1.60 కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న పాత బ్యాగులు పోగా, కొత్తగా 7.50 కోట్లు కావాలని అన్నారు. కేంద్రం పారిపోతే కేసీఆర్ ముందుకొచ్చారు ► కేసీఆర్ మెడలు వంచి ధాన్యం కొనేట్లు చేశా మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం సిగ్గుచేటని గంగుల విమర్శించారు. చేతగాని కేంద్రం తన బాధ్యత నుంచి పారిపోతే, మానవత్వంతో కేసీఆర్ రైతుల కోసం వేల కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లై సన్నద్ధమైందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయిని తెలిపారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కొనుగోళ్లు మొదలవుతాయని చెప్పారు. మే చివరి నాటికి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైతు అని నిర్ధారించుకోవడానికే ఈ సిస్టం ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందుల కారణంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముతారనే సమాచారం ఉందని తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు ధాన్యం చేరిన తర్వాత ప్రభుత్వానికి మెసేజ్ రాగానే మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగిలో 36 లక్షల వరి సాగు అయ్యిందని తెలిపారు. -
కోచింగ్.. స్టైపెండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రూ.50 కోట్ల వ్యయంతో 16 స్టడీ సర్కిళ్లతోపాటు 103 స్టడీ సెంటర్లలో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీ వర్గాలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీ లకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక 1.25 లక్షల మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రవేశ పరీక్ష కోసం ప్రతిష్టాత్మక ‘అన్ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని గంగుల తెలిపారు. ‘16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25వేల మందికి నేరు గా, మరో 50వేల మందికి హైబ్రిడ్ మోడ్ (ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానం)లో శిక్షణ ఇస్తాం. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా 50వేల మందికి శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 16న ఉద యం 11 గంటలకు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉం టుంది. దీనికోసం బుధవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈనెల 16 ఉదయం 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుం ది. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్–1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్‌తోపాటు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ ఇస్తాం. మిగతావారిని మెరిట్ ఆధారంగా గ్రూప్–2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తాం. వీరికి 3 నెలల శిక్షణలో నెలకు రూ.2వేల స్టైపెండ్ ఇస్తాం. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్ ఇస్తాం. ఈనెల 20 లేదా 21 నుంచి క్లాసులు ప్రారంభిస్తాం’ అని మంత్రి చెప్పారు. 100 మార్కులకు పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను https://studycircle. cgg.gov.in/, https://mjpabcwreis. cgg. gov.in/, https://unacademy.com/ scholarship/tsgovt&scholarship& test తోపాటు బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లోనూ చేసుకో వచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 90 నిమిషాలపాటు నిర్వహిం చే ఈ పరీక్షలో 5 విభాగాలు ఉంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగె టివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో టాంపరిం గ్‌కు అవకాశం ఉండదన్నారు. మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేలు విలువ చేసే స్టడీ మెటీరియ ల్ను ఇస్తామని ‘అన్ అకాడమీ’ ప్రతినిధి చెప్పారు. -
కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతాం: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: వరి ధాన్యం కొనే విషయంలో కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రం కడుపు మండీ కళ్ళ మంటతో పచ్చటి తెలంగాణలో చిచ్చు పెడుతుందని విమర్శించారు. కాగా యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ కమాన్‌పూర్‌లలో జరిగిన రైతుల ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని మంత్రి మండిపడ్డారు. వడ్లు కొనకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తిగా నూకలు చెల్లినట్లేనని మంత్రి గంగుల హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని చెప్పారు. కేంద్రం దిగి వచ్చే వరకూ తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిపై ఈ నెల 8న నల్లజెండాలు పెట్టుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు. -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నేతల దాడి చేశారు. తోట ఆగయ్య ఇంటిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ సందర్శించి ఆగయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదు, ఒక కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. బీజేపీలో అసమ్మతి, పార్టీలో లుకలుకల వల్లనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అక్కసుతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల మీద యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పిలుపునిస్తే బీజేపీ బలమెంత? అని ప్రశ్నించారు. మీరు(బీజేపీ) దాడులు చేసి మమ్మల్ని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపైన దాడులకు దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. -
హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ డీజే స్టెప్పులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో హోళీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా ఉన్న హోలీ వేడుకలకు దూరంగా ఉన్న జనం ఈసారి చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాలనీల్లో, ఇళ్లల్లో ఎక్కడా చూసినా రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కరీంనగర్ గీతా భవన్ చైరస్తాలో టీఆర్ఎస్ నాయకులు హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. హోళీ సంబరాలలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ అందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డీజే పాటలకు స్టెప్పులు వేశారు. చదవండి: అంబరాన్నంటిన హోలీ సంబరాలు: వైరల్ వీడియోలు -
హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
-
బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే గంగులపై పోటీ చెయ్ అంటూ..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గురువారం కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సంజయ్ ఏం అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం తప్ప బండి సంజయ్‌కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్ ఫైరయ్యారు. రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం, పనికి మాలిన మాటలు మాట్లాడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఈ సందర్భంగానే బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు ధ్యైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేయాలని సవాల్ చేశారు. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. -
17 లక్షల కుటుంబాలకు దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాల (202 యూనిట్లుగా, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్లు, 10 వరినాటు యంత్రాలు, 4 టిప్పర్లు, 3 మినీ బస్సులు, 2 టాటా హిటాచీ ఎక్స్కెవేటర్లు, 1 మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలు)ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.38 కోట్లకుపైగా విలువైన వాహనాలను కానుకగా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీలకంథరా దేవా..
వేములవాడ/వరంగల్/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. దర్శనానికి 6 గంటలు సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది. పిల్లలమర్రి కిటకిట... సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి ‘గంగుల’
సాక్షి, కరీంనగర్/సిద్ధిపేట: సిద్దిపేట పట్టణ శివారులోని రాజీవ్ రహదారి రంగీలా దాబా చౌరస్తా వద్ద మంగళవారం కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ తన కాన్వాయ్‌ను నిలిపి కాన్వాయ్‌లోని ఓ వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా ఆసుపత్రికి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. కారులో ఇరుక్కున్న డ్రైవర్‌ను సిద్దిపేట టూటౌన్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన చిలివేరి భాస్కర్ తన భార్య తిరుమల, కూతురు మౌనిక, అల్లుడు అమర్షు, అత్తమ్మ రాజమ్మలతో కలిసి కారులో కరీంనగర్‌లోని బంధువుల ఇంటిలో జరిగే వివాహానికి హాజరయ్యాడు. తిరిగి వీరు హైదరాబాద్ వస్తున్న క్రమంలో సిద్దిపేట శివారు రంగీలా దాబా చౌరస్తా రాజీవ్ రహదారిపై ఎడమ వైపు ఉన్న సూచిక బోర్డు, డివైడర్‌ను నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో డ్రైవర్ భాస్కర్, రాజమ్మ, తిరుమల, అమర్‡్ష, మౌనిక గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు? -
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 593 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా సేకరించినట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు 69.5 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిం దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు 69.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2 లక్షల టన్నుల వరకు సేకరించే అవకాశం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన పేచీలను అధిగమించి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇదే తొలిసారని వివరించారు. 12.72 లక్షల మంది నుంచి కొనుగోలు ‘గత సంవత్సరం వానాకాలంలో 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి అదనంగా మరో 22 ఎల్ఎంటీ ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సీజన్లో 6,878 కొనుగోలు కేంద్రాలను తెరవగా, దాదాపు 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరిగింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కొన్నిచోట్ల ఆలస్యంగా సాగు చేసిన కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరిగింది. 12.72 లక్షల మంది రైతుల నుంచి రూ.13,601 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశాం. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)లో నమోదైన 8.68 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. మరో రూ. 2,500 కోట్లు ఓపీఎంఎస్‌లోకి వివరాలు ఎక్కగానే రైతుల ఖాతాల్లోకి చేరతాయి. రైతులకు ధాన్యం సొమ్మును ఒక్కరోజు కూడా ఆపకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు అందుకు అనుగుణంగానే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడం హర్షణీయం..’ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. -
పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్‌పై విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు పర్యాటకుల్లాగా వచ్చి సీఎం కేసీఆర్‌పై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని రాష్ట్రమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఏ రంగంపైనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ తీరు మారకపోతే మధ్యప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని, వారి బెదిరింపులకు భయపడేదిలేదని హెచ్చరించారు. బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని, అభివృద్ధిపై ఢిల్లీలో చర్చించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యాదాద్రి, భద్రాద్రిలను చూసి ఆలయాల అభివృద్ధిపై మాట్లాడాలని తలసాని సవాల్ చేశారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టును తీసుకొస్తే బాగుంటుందన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని మరో రాష్ట్రానికి చెందిన సీఎం విమర్శించడం విడ్డూరంగా ఉందని, శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారంనాటి ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందని, మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం చేజిక్కించుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే చౌహాన్ కనీసం విమానం కూడా దిగేవారుకాదని, రాష్ట్రానికి అతిథి కాబట్టే సురక్షితంగా వెళ్లగలిగారని మంత్రి గంగుల అన్నారు. చౌహాన్ పాలన సక్రమంగా లేకపోవడం వల్లే ఉపాధి కోసం మధ్యప్రదేశ్వాసులు హైదరాబాద్‌కు వలస వస్తున్నారని, సీఎం చౌహాన్ మరోమారు హైదరాబాద్‌కు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన కార్మికులే అడ్డుకుంటారని హెచ్చరించారు. వనమా రాఘవేందర్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రులు వ్యాఖ్యానించారు. -
గురుకులాలు.. డిజిటల్ చదువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడతల వారీగా తరగతులను డిజిటలీకరిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం(2022–23) పూర్తయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనే జరుగుతుందన్నారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 281 గురుకుల పాఠశాలల్లో 1,696 తరగతులు డిజిటలైజ్ అవుతాయన్నారు. శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్(మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) బోర్డు సమావేశం మంత్రి గంగుల అధ్యక్షతన జరిగింది. 2022–23లో సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం చేయాలన్న నిర్ణయంపై బోర్డు తీర్మానించింది. అలాగే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు వేడినీటి వసతి కల్పన కోసం టీఎస్ రెడ్కో ద్వారా సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ పక్కగా జరిగేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి వాఖ్యానించారు. అకడమిక్ సెల్‌ను తీర్చిదిద్దాలని, అంతర్గత ఆడిట్ బృందాలను మరింత బలపర్చాలన్నారు. ఇదిలా ఉండగా, ‘గురుకులం.. దూరాభారం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై మంత్రి స్పందించారు. గురుకులాల నిర్వహణకు తీసుకునే అద్దె భవనాలతో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్‌పై సమీక్షను మంగళవారం నిర్వహించారు. ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తికావచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 ఎల్ఎంటీ బియ్యానికి సమానమైన 68.65 ఎల్ఎంటీ ధాన్యం సేకరణలో 3వ తేదీ నాటికే 65.20 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించినట్లు తెలిపారు. కేంద్రం విధించిన నిబంధనలతో సంబంధం లేకుండా ఎంత ధాన్యం వచ్చినా సేకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తయిందని, వాటిని మూసివేసివేశామని తెలిపారు. ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ఈ వానకాలానికి సంబంధించి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దీన్, పౌరసరపరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్ పెరిగితే ‘బండి’దే బాధ్యత
కరీంనగర్‌టౌన్: కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే బీజేపీ అధ్యక్షుడు దీక్ష పేరుతో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తి చెందితే బాధ్యులెవరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయన చేపట్టింది జాగరణ దీక్ష కాదని, డ్రామాదీక్ష అని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో ఒమిక్రాన్ ప్రబలితే దానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి తన దీక్షను ప్రధాని మోదీ ఇంటిముందు చేసి కోటి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేయాలన్నారు.అనుమతి తీసుకోకుండా దీక్ష చేసింది చాలక రాద్ధాంతం చేశారన్నారు. గుర్తింపు పొం దిన 8 సంఘాలతోపాటు వేరే సంఘాలు కూడా 317 జీఓ నిర్ణయంపై జరిగిన చర్చలో పాల్గొన్నాయని, అన్నీ చర్చించాకే జీవో తెచ్చామని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీసులు మంచి పనిచేశారని, లేకుంటే మహమ్మారి ప్రబలేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ అతీతులు కారన్నారు. కేంద్రం చెబుతున్న నిబంధనలను అదే పార్టీకి చెందిన ఎంపీ ఉల్లంఘించడం సరికాదన్నారు. తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. -
అడుక్కొనడానికి కాదు.. అమ్ముకొనడానికి..
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు కోట్లకు పైగా తెలంగాణ ప్రజల్ని, లక్షలాది తెలంగాణా రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కించపరిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు భిక్షగాళ్లు కాదని, పంటలు అమ్ముకోవడమనే తమ హక్కును సాధించుకుని తీరతామని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజకీయ సమావేశం నిర్వహించిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి కేవలం బీజేపీ ప్రతినిధి కాదని, గోయల్ దేశంలోని ప్రజలందరికీ ప్రతినిధిలా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రులు, ఎంపీలు, అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం వస్తే వారికి పనిలేదా అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తున్న వారికి కిషన్‌రెడ్డి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాతపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే.. ధాన్యం సేకరణ విషయంలో లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సమానమైన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని కేంద్రం గతంలో లేఖ ఇవ్వడం అన్యాయమని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో మిగిలే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగతేంటని ప్రశ్నించారు. వర్షాకాలంలో వచ్చే ముడి బియ్యం ఎంతైనా కొంటామంటున్న కేంద్ర మంత్రులు, దాని ప్రకారం రాతపూర్వక హామీ ఇవ్వమని అడిగితే వారికి ఉన్న సమస్య ఏంటని నిలదీశారు. గత రబీకి సంబంధించి తీసుకొంటామని నోటిమాటగా చెప్పిన దానిలో ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం తీసుకోవట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై తమకు ఉన్న అనుమానాలతోనే లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తాము పట్టుబడుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 6,857 కేంద్రాలకు గానూ 2,760 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగతా వాటిలో సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని గంగుల తెలిపారు. కేంద్రానికి పట్టవు: జగదీశ్ రెడ్డి కేంద్రానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు అవసరం లేదని విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రైతుల మేలు కోసం ఎవరు పని చేస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. ధాన్యం సేకరణ అంశంలో బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమని, సీఎం కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం బీజేపీ నాయకులకు ఏమ్రాతం సాధ్యం కాదని అన్నారు. -
గతంతో పోలిస్తే 30% అధికం
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు 30 శాతం అధికంగా ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి రూ.8, 268 కోట్ల విలువైన 42.22 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని 1,280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తవడంతో మూసివేసినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ.5,447 కోట్లు మళ్లించినట్లు చెప్పారు. ధాన్యం రవాణా సమస్య, గన్నీ బ్యాగుల కొరత లేదని మంత్రి వెల్లడించారు. గోదాములు ఖాళీ చేయని ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాములన్నీ దాదాపుగా నిండిపోయాయని, సూర్యాపేట, సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్‌లోని గోదాముల్లో ఖాళీ లేదని గంగుల తెలిపారు. మిల్లింగ్ అయిన బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. గోదాముల్లోని బియ్యాన్ని తరలించేందుకు ఎఫ్‌సీఐ రైల్వే వ్యాగన్లను పంపించకపోవడంతో మిల్లుల్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో కదలిక లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి విన్నవించినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతులపై కేం«ద్రం అనుసరిస్తున్న వైఖరిమీద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాష్ట్ర ప్రభు త్వం వానాకాలం ధాన్యం సేకరణ వేగవంతంగా చేస్తోందని చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషన అనిల్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. -
కరీంనగర్: అజ్ఞాతంలోకి రెబెల్స్.. మాజీ మేయర్ ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి, కరీంనగర్: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో ఎక్కడికి వెళ్లారన్నది అంతుపట్టని విషయంగా మారింది. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులుగా భానుప్రసాద్, ఎల్.రమణ బరిలో ఉన్నా.. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించ భంగపడ్డ నేత కావడంతో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న ఇండిపెండెంట్ అభ్యర్థులతో రవీందర్‌సింగ్ తెరవెనుక మంతనాలు సాగిస్తున్న విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం పలువురు అసంతృప్త, బరిలో నిలిచిన నేతలు, వారి మద్దతుదారులతో రవీందర్‌సింగ్ రహస్యంగా సమావేశమయ్యారు. వేములవాడలో కొందరు నేతలతో రహస్యంగా నిర్వహించిన సమావేశం తాలూకు ఫొటోలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక సిరిసిల్లలో మాదాసి వేణు నామినేషన్ ఆమోదం పొందింది. ఈయన కూడా ఎంపీటీసీల ఆత్మగౌరవం నినాదంతోనే ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ ఎన్నికై మూడేళ్లవుతున్నా.. పైసా విదల్చని పదవులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన పలువురు నేతలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. వేణును బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ఎంపీటీసీల గౌరవ అధ్యక్షుడు నగేశ్ యాదవ్ వీడియో వైరల్‌గా మారింది. అధికారాలు లేని తమ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని లేదా తమకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అభ్యర్థి కోసం యత్నాలు..! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ఇండిపెండెంట్లు, రెబెల్స్ అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెబెల్స్ మంతనాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో విడిపోయి పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని రవీందర్‌సింగ్ వేములవాడలో పలువురు అసంతృప్త నేతలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. శిబిరాన్ని సందర్శించిన మంత్రి హైదరాబాద్ వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడిది శామీర్‌పేటలోని ఓ రీసార్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారని తెలిసింది. ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారని.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. మరోవైపు శిబిరాల్లో ఉన్న నేతలు తమకే ఓటు వేస్తారా? లేక ఎదురు తిరుగుతారా? అన్న భయం గులాబీ సీనియర్ నేతలను వెంటాడుతోంది. ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వీరు పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఓటేయకుండా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. బరిలో 24 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ (నామినేషన్ల పరిశీలన) ముగియగా.. ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు బుధవారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, వాటిలో నుంచి శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్లు తిరస్కణకు గురైనట్లు చెప్పారు. బరిలో 24 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉందని వివరించారు. ఓటు మాదే.. సీటు మాదే.. ఎంపీటీసీల ఆత్మగౌరవం నిలిపేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో నిలిచానని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు న్యాయంగా రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఖజానాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన తాము.. వారికి ఏ పనీ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, పూర్వపు అధికార వైభవం తీసుకొచ్చేందుకు తాను పోటీ చేసి తీరుతానని తెలిపారు. తమ ఓట్లతో పారిశ్రామిక వేత్తలకు సీట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీనరేజీ గ్రాంట్లు, వెహికిల్స్ అలవెన్స్, ఈజీఎస్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే నిధులను తమకు రాకుండా మళ్లించడం ఎంత మేరకు న్యాయమని, తమ గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవం నిలవాలంటే తామే బరిలో ఉంటామని, ఓటు మాదే–సీటు మాదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. -
బీజేపీ మాటలను నమ్మొద్దు
కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగే దొంగ.. అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని, రైతులు ఆ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వానాకాలం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. యాసంగి వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పత్రాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తుంటే.. వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలకు దిగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధర్నాలు చేయాల్సింది తెలంగాణలో కాదని.. ఢిల్లీలో చేసి యాసంగి వడ్ల కొనుగోళ్లకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అన్ని వివరాలు చూసుకోవచ్చని బీజేపీ నేతలకు సూచించారు. -
ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని, తెలంగాణవాసిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ప్రోత్సహించడం వల్లే దేశవ్యాప్తంగా అనేక బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బు చెల్లిస్తోందని, కానీ కేంద్రం నుంచి ఆరు నెలల తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బు వస్తుండటంతో రాష్ట్రంపై వడ్డీ భారం పడుతోందన్నారు. వడ్డీ భారాన్ని భరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చలనం లేదని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చెప్తుం డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరి ధాన్యం పండించాలని చెప్తున్నారని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్‌తో కలిసి తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సంద ర్భంలో ఆయన వెకిలినవ్వుతో సమాధానం ఇచ్చారని మంత్రి గంగుల అన్నారు. -
పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్‌ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను దేశానికే ఆదర్శంగా, అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 15 కిలోమీటర్లు ప్రతిపాదించిన మానేరు రివర్ ఫ్రంట్‌లో తొలి విడతగా 4 కి.మీ మేర నిర్మాణాలు చేపట్టనున్నారు. సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం, ఈ ప్రతిపాదనలపై ఐ అండ్ క్యాడ్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. రోజువారీ పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయి డిజైన్లు రూపొందించాలని, టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, టీఎస్‌టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హరీశ్ గోయల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Telangana: యాసంగి వడ్లేవీ కొనం
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే యాసంగి సీజన్‌తో సహా ఏ యాసంగిలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. ప్రస్తుత వానాకాలంతో పాటు భవిష్యత్‌లో ఏ వానాకాలం సీజన్లోనైనా ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అయితే ఎఫ్‌సీఐ ద్వారా ఏ సీజన్లోనూ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. యాసంగి దొడ్డు వడ్లలో నూక ఎక్కువ ఉంటుందనే కారణంతో ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి ఎఫ్‌సీఐ తప్పుకున్న తర్వాత ఆ వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ యాసంగిలో పెసలు, మినుములు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలని వినమ్రంగా చెప్తున్నాం’అని వ్యవ సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కుండబద్దలు కొట్టారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని సాగు చేసే రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని జిల్లాల్లో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని వరి సాగు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో సాగు చేయకండి’అని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని గందరగోళానికి గురిచేయొద్దు.. ‘గత యాసంగిలో మిల్లింగ్ చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం నేటికీ తీసుకోలేదు. రైతులను రోడ్ల మీదకు తెచ్చి ధర్నాలు, నిరసనల ద్వారా లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను క్రమంగా నియంత్రించి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామనే ఉత్తర్వులను కేంద్రం నుంచి ఇప్పించాలి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతిచ్చాం’అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ‘రైతాంగానికి కేంద్రం మేలు చేయాలనుకుంటే కరోనా నేపథ్యంలో చేపట్టిన 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదారు నెలలు పొడిగించాలి. రాష్ట్రాలు బియ్యం ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్తోంది, కానీ, బియ్యం ఎగుమతి విధానాలు రాష్ట్రం పరిధిలో ఉండవు. వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. తన బాధ్యత నిర్వర్తించకుండా రాష్ట్రాలను బాధ్యులను చేయడం సరికాదు’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. పత్తికి ధర తగ్గితే కొనుగోలు కేంద్రాలు... ‘యాసంగిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే వరి వంగడాలను రూపొందించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను కోరాం. ప్రస్తుతం యాసంగిలో సాగుకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యాసంగికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని కలుస్తాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి షరతులు పెట్టం. ప్రస్తుతం పత్తి సాగు చేసిన రైతులు ఎంఎస్పీ కంటే అదనపు ధర పొందుతున్నారు. ఎంఎస్పీ కంటే దిగువకు పత్తి ధర పడిపోతే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధితో పాటు రైతు సంక్షేమానికి సీఎం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది వానాకాలంలో 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 62.08 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న కొన్ని పరిస్థితులను రైతులకు వివరించేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు’అని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలో ధాన్యం కుప్ప వద్ద రైతు మరణంపై కలెక్టర్ నివేదిక అందిందని, అది సహజ మరణమని పేర్కొన్నారు. కాగా, మిల్లులకు ధాన్యం తెస్తున్న రైతులను నియంత్రించేందుకు స్థానిక అధికారులు టోకెన్లు ఇస్తున్నారని గంగుల వెల్లడించారు. మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్దన్‌రావు పాల్గొన్నారు. ధాన్యం కొంటామని ప్రకటిస్తే కాళ్లు పట్టుకుంటా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి: ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధమని చెప్పే ధైర్యం బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు లేదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో ప్రకటన చేయిస్తే ఆయన కాళ్లు పట్టుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సహకార సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఖరీఫ్ ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ రూ.25 వేల కోట్లు కేటాయించి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తెలంగాణకు దొంగచాటుగా తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట కొనడం సాధ్యంకాదని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎకరాకు రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరం, అవమానకరం. ఈ విషయంలో కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రెండు పర్యాయాలు వెళ్లినా నిర్లిప్తవైఖరే చూపుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రంతో పంచాయితీ ఉండదు. – నిరంజన్‌రెడ్డి ప్రభుత్వపరంగా ధాన్యం కొనుగోలుకు సూర్యాపేట జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు రావడం లేదు. రాష్ట్రంలో కోతలు జరుగుతున్న కొద్దీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – గంగుల -
హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే
సాక్షి, కరీంనగర్: ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్లో నిస్తేజం నెలకొంది. ఊహించని విధంగా మంగళవారం కౌంటింగ్ ప్రారంభం నుంచే ఈటలకు మెజార్టీ పెరగడంతో కార్యకర్తల్లో నైరా శ్యం నెలకొంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి.. హుజూరాబాద్‌లోనే మూడు నెలలు మకాం వేసి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో లీడర్లతో పాటు క్యాడర్లో స్తబ్ధత నెలకొంది. మీసేవ కార్యాలయంలో మంత్రి.. మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్, తదితరులు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గడిపారు. రౌండ్ల వారీగా వస్తున్న ఫలితాలపై ద్వితీయ శ్రేణి నాయకత్వంతో చర్చిస్తూ గడిపారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ ఘన విజయం టీవీలకు అతుక్కుపోయిన జనం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల సరళిని తెలుసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, హోటళ్లలో ప్రజలు హుజూరాబాద్ ఫలితంపై ఆరా తీస్తూ చర్చల్లో మునిగిపోయారు. -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొంటామని పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఈసారి రైతుల నుంచి కోటి టన్నుల మేర ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నందున, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, వర్షం కురిసినా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లను పంపిస్తామని చెప్పారు. గన్నీ బ్యాగుల గురించి, కొనుగోలు కేంద్రాల గురించి జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి రవాణా సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, కోతల తీరును బట్టి జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,033 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. -
పంట చేతికొచ్చేవేళ.. గోనె సంచులేవీ?
వానాకాలం వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతోపాటే రైతులకు, అధికారులకు సమస్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే భారీయెత్తున ధాన్యం సేకరణకు పెద్ద సంఖ్యలో గోనె సంచులు కూడా అవసరం. కేంద్రానికి ఇండెంట్ పెట్టడంతో పాటు పాత సంచుల సేకరణకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సంచుల కొరత తీవ్రంగా ఉండటం ఓ సమస్యగా మారింది. ఇటు రైతు విషయానికొస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వరి కోసే యంత్రాల అద్దెలూ పెరగడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధాన్యంలో తరుగు తీయవద్దంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నదాతకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి. సాక్షి , హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకోగా, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. కోసిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా.. ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులు (గన్నీ బ్యాగులు) పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భావి స్తున్న పౌర సరఫరాల శాఖకు 25 కోట్ల వరకు గన్నీ బ్యాగులు అవసర మవుతాయి. పంట కొను గోళ్ల సీజన్లో గన్నీ బ్యాగుల సమస్య ఎదురవు తున్నా పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్ట డం లేదు. దీంతో ఈసారి ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కొత్త బ్యాగులు 5.41 కోట్లే వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా.. సమృద్ధిగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తద్వారా 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. రైతుల ఆహార అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాల కోసం పోగా 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 25.36 కోట్ల బ్యాగులు (సంచికి 40 కిలోల ధాన్యం చొప్పున నింపితే) అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖకు వివరాలు పంపింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద కొత్త గన్నీ బ్యాగులు 5.41 కోట్లు అందుబాటులో ఉండగా, ఒకసారి వాడిన బ్యాగులు 49 లక్షలు ఉన్నాయి. మరో 54 లక్షలు చౌకధరల దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్ల వద్ద ఒకసారి ఉపయోగించిన గన్నీ బ్యాగులు 1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న పాత గన్నీ బ్యాగులు కలిపి మొత్తంగా 8.06 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకా సుమారు 17.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది. బెంగాల్, ఏపీల్లో ఉత్పత్తిపైనే ఆధారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఇండెంట్ పెట్టినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. తదనుగుణంగా చెల్లించిన డీడీల ఆధారంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోని ఏలూరు, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దేశం మొత్తానికి పశ్చిమబెంగాల్, ఏపీల నుంచే గన్నీ బ్యాగులు సరఫరా కావలసిన నేపథ్యంలో లభ్యత ఆధారంగా సరఫరా జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అయితే వానాకాలం పంటలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున , కోతలు కోసినా ఆరబెట్టి మార్కెట్‌కు తెచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాదు రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం ఎంతైనా ప్రభుత్వమే కొంటుంది. సంచుల సమస్య ఉత్పన్నం కాదు. గన్నీ బ్యాగుల ఉత్పత్తిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు పంపిన ఇండెంట్ ఆధారంగా సప్లై జరుగుతుందని భావిస్తున్నాం. గన్నీ బ్యాగులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి -
యాసంగిలో వరి సాగొద్దు: మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయరాదని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్ణయించిందని ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తమ వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు అధికం గా ఉండడంతో పాటు వీటి వినియోగం తక్కు వగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపిందన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి శాఖాపరంగా తాము పలు ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2021–22 యాసంగిలో వరి సాగు చేపట్టవద్దని రైతులకు సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ యాసంగిలో శనగలు, వేరుశనగ, నువ్వులు, పెసలు, మినుములు, ఆముద, కూరగాయలు ఇతర పంటలు పండించవచ్చని సూచించారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ‘మీ ఉద్యమ బిడ్డను ఆశీర్వదించండి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుజూరాబాద్: ‘హుజూరాబాద్ బరిలో పోటీ చేస్తున్న మీ ఉద్యమబిడ్డను ఆశీర్వదించండి’అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలసి నామినేషన్ వేసేందుకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తొలిరోజు గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లోని ప్రతీ ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలసి తనకు ఓటేయాల్సిందిగా కోరుతానని.. తాను గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో.. అనంతరం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం పోరాడిన బడుగు బలహీనవర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇచ్చారన్నారు. అన్నంపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్, ఆత్మగౌరవం పేరుతో భారతీయ జనతా పార్టీ పంచన చేరారని విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్.. ఎక్కడ ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాల్లో పాలుపంచుకున్న గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా అన్న వైఎస్సార్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ మన్సూర్ అలీ అనే వ్యక్తి హుజురాబాద్ నుంచి పోటీకి నిలబడ్డారు. ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రతీ గింజనూ కేంద్రం కొనాల్సిందే: మంత్రి గంగుల
కరీంనగర్: తెలంగాణ రైతులపై వివక్ష చూపకండని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల కేటీఆర్‌తో పాటు తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి పంట కొనుగోలు విషయాన్ని సామాజిక కోణంలో చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్‌సీఐకి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరిగిందని గుర్తు చేశారు. కావున ఇదివరకే 19/20 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 20/21లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నామని , దాంతో 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బియాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని అడిగితే అవి బాయిల్డ్ రైస్ అని అందులో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటామని తెలిపడం సమంజసం కాదన్నారు. మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరూ కొంటారని కేంద్రమే చెప్పాలని ఆవేదని వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ మిల్లులో పేరుకుపోయి కొత్త ధాన్యం ఎక్కడ పెట్టాలని కనుక ఈ అంశంపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రతీ గింజనూ కేంద్రం తప్పకుండా కొనాలని, లేకపోతే నిలదీస్తామన్నారు. పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ మొత్తం కొన్న కేంద్రం, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షోభం గతంలో కూడా వస్తే వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తిగా ఏడు కోట్ల టన్నులు కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటే వివక్ష ఉండకూడదని, రాష్ట్ర రైతాంగం భవిష్యత్తును నాశనం చేయొద్దని ఆయన కోరారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అదరగొట్టిన మంత్రి హరీశ్‌రావు -
నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు.. పావలా బీసీ ఈటల
సాక్షి, హుజూరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నిఖార్సయిన బీసీ బిడ్డ అని, ఈటల పావలా బీసీ అని బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. పద్మశాలీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పద్మశాలీ కులబాంధవులు ఏకతాటిపై నిలిచి గెల్లు గెలుపునకు కృషి చేయాలని కోరారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్.. పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించారని, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి అడిగితే పట్టించుకోలేదని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.లక్ష వ్యక్తిగత రుణాల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అలాగే పద్మశాలీ వ్యాపారస్తులకు టూవీలర్ మోపెడ్ వాహనాలను అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ హుజూరాబాద్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి గంగులకు అందజేశారు. చదవండి: కరీంనగర్.. అతలాకుతలం కాంగ్రెస్ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా.. టీపీసీసీ ఓబీసీ సెల్ కార్యవర్గం రద్దు సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఓబీసీ సెల్ కార్యవర్గంతో పాటు జిల్లా చైర్మన్ పదవులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ తమరద్వజ్ సాహు ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని నియమిస్తామని, జిల్లాలకు కొత్త చైర్మన్లను ఎంపిక చేస్తామని, ఆసక్తి కలిగిన నేతలు తమ దరఖాస్తులను గాం«దీభవన్‌లో అందజేయాలని శ్రీకాంత్‌గౌడ్ సూచించారు. -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.