11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు  | Telangana: 11 BC Gurukul Teachers Received Awards: Gangula Kamalakar | Sakshi
Sakshi News home page

11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు 

Published Mon, Sep 5 2022 3:57 AM | Last Updated on Mon, Sep 5 2022 9:22 AM

Telangana: 11 BC Gurukul Teachers Received Awards: Gangula Kamalakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జరిగే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ ఉత్సవాల్లో వారంతా అవార్డులు అందుకోనున్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన వారిలో ప్రిన్సిపల్స్‌ యం.అంజలీకుమారి, కె.శోభారాణి, యం.రాములు, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ కె.సుచిత్ర, జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌ కె.రాధిక, ఉపాధ్యాయులు కె.పుష్ప, జి.అన్నపూర్ణ, హెచ్‌.సంతోష్, బి.గురువయ్య, పి.గీత, కె.వెంకటరెడ్డి ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారందరినీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రత్యేకంగా అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement