Gurukul School
-
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నాం : సీఎం రేవంత్
-
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
గురుకుల బీసీ హాస్టల్లో చిన్నారి మృతి..
-
ములుగు జిల్లాలో కలకలం సృష్టిస్తున్న విద్యార్థులు
-
భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే! ఇకపై ఐదు అంచెల్లో
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో సాగనుంది. ఇందుకోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (బీటీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఒక అభ్యర్థి తన అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థి ఆన్లైన్లో ప్రతిసారి దరఖాస్తు సమయంలో వివరాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియను తీసుకొచ్చింది. గతంలో కేవలం ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉండేది. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మోడల్‌ను అనుసరిస్తూ ప్రతి అభ్యర్థికీ ఓటీఆర్‌ను తప్పనిసరి చేసింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తాయనే అంచనాతో.. సుదీర్ఘ కాలం తర్వాత గురుకుల బోర్డు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడంతో, దరఖాస్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ సులభతరంగా ఉండేందుకు బీటీఆర్‌ఈఐఆర్‌బీ ఐదు అంచెల పద్ధతి అనుసరిస్తోంది. దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థి ముందుగా బోర్డు వైబ్‌సైట్‌ను తెరిచి ఆన్లైన్ అప్లై అనే ఆప్షన్ ద్వారా పేజీ తెరిచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. తొలుత ఓటీఆర్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తయారవుతుంది. అనంతరం ఆ వివరాలతో లాగిన్ అయ్యాక పరీక్ష ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో పూరించి సబ్మిట్ చేయాలి. చివరగా వెబ్సైట్లో అప్లోడ్ అయిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు పత్రం అత్యంత కీలకం. ఉద్యోగానికి ఎంపికైన సమయంలో ఈ దరఖాస్తు పత్రం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం బీటీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఓటీఆర్ ప్రక్రియ బుధవారం నుంచి అందుబాటులోకి వచి్చంది. ఈ నెల 17వ తేదీ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు నంబర్ ద్వారా ఓటీఆర్ ఫారాన్ని తెరిచి, వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా బుధవారం తొలిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున వెబ్‌సైట్‌ను తెరిచారు. దీంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి పేజీ తెరుచుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. దీంతో బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం అధికారులు చర్యలు చేపట్టడంతో సాయంత్రానికి వెబ్సైట్ కాస్త స్పీడందుకుంది. -
ఎస్సీ గురుకులాల్లో సీబీఎస్ఈ బోధన
సాక్షి, అమరావతి: ఎస్సీ సంక్షేమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన ప్రారంభించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన కోసం టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో విద్యాబోధన మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ గురుకులాల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రారంభించామన్నారు. కొత్త విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు గురుకులానికి చెందిన ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. గురుకుల విద్యార్థులకు బోధన మరింత సరళీకృతం చేసేందుకు డిజిటల్ క్లాస్ రూములు, వర్చువల్ క్లాస్ రూముల ద్వారా పాఠాలు చెప్పేందుకు ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. పరీక్షల విధానంలోనూ మార్పులను తెచ్చామన్నారు. ముఖ్యంగా 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ప్రతివారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ముందుగా రెండు టెస్ట్‌లు నిర్వహించాకే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విధంగా వారాంతపు పరీక్షలు కాకుండా ప్రధానమైన ఏడు టెస్టులు, పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు వారు విన్న పాఠాలను పూర్తిగా అవగతం చేసుకుని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథం కోసం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ సంస్థలు ముందుకొచ్చాయని, వాటితో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, డిప్యూటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బీవీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జరిగే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ ఉత్సవాల్లో వారంతా అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన వారిలో ప్రిన్సిపల్స్ యం.అంజలీకుమారి, కె.శోభారాణి, యం.రాములు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ కె.సుచిత్ర, జూనియర్ కాలేజీ లెక్చరర్ కె.రాధిక, ఉపాధ్యాయులు కె.పుష్ప, జి.అన్నపూర్ణ, హెచ్.సంతోష్, బి.గురువయ్య, పి.గీత, కె.వెంకటరెడ్డి ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారందరినీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రత్యేకంగా అభినందించారు. -
గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం..వారికే సగం సీట్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం కానుంది. రెండు కేటగిరీల్లో స్థానికతను విశదీకరిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాసనసభ నియోజకవర్గం యూనిట్‌గా స్థానికతను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశాల ప్రక్రియను స్థానికత ఆధారంగానే నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థలు నిర్ణయించాయి. ప్రతి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లను అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు. నాలుగు సొసైటీల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష.. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష ఉంటుంది. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కలసి ఐదోతరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా వీటీజీసెట్ నిర్వహిస్తున్నాయి. పరీక్ష ఉమ్మడిగా నిర్వహించినప్పటికీ విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాగా, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తోంది. నియోజకవర్గం, జిల్లా యూనిట్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినా.. ఇంకా మిగిలితే అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. వచ్చే వారం ఫలితాలు? నాలుగు గురుకుల సొసైటీల్లో ఐదోతరగతిలో ప్రవేశాలకు మే 8న వీటీజీసెట్–2022 అర్హత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. -
విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ముగ్గురిలో రంజిత్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా.. రంజిత్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు!
పరీక్ష బాగా రాయలేకపోయానన్న బాధ, తప్పు చేశానేమో అన్న అపరాధ భావం, టీచర్ మందలించారనే ఆవేదన.. కలగలిపి ఆ విద్యార్థి ఆలోచనలకు అడ్డుకట్ట వేసేశాయి. ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించలేని స్థితికి నెట్టేశాయి. బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకుడిని బలవన్మరణానికి ఉసిగొల్పాయి. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మంగళవారం పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశానికి గురై తల్లిదండ్రులకు విషాదం మిగిల్చాడు. ఎచ్చెర్ల క్యాంపస్: ఎస్ఎంపురం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంచాడ వంశీ మంగళవారం పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. బడిలోని 9వ తరగతి గదిలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో విద్యార్థి ఫ్యాన్‌కు తాడు కట్టి ఉరి వేసుకోగా.. నైట్ వాచ్మెన్ అప్పారావు ఉద యం 5 గంటలకు చూసి ఉపాధ్యాయులకు స మాచారం అందించారు. ( చదవండి: ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులు.. ) తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రిన్సిపాల్ కిమిడి జగన్మోహన్రావు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జేఆర్ పురం సీఐ సీహెచ్ స్వామినాయుడు, ఎచ్చెర్ల ఇన్చార్జి ఎస్ఐ బాలరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిది సంతకవిటి మండటం మిర్తివలస గ్రామం. విషయం తెలుసుకున్న వి ద్యార్థి తల్లిదండ్రులు కొంచాడ సింహాద్రి, రమ ణమ్మ, బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పాఠశాలను రక్షణలోకి తీసుకున్నారు. టీచర్ మందలించారని.. తోటి విద్యార్థుల కథనం మేరకు.. విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వ హించాల్సి ఉంది. అందుకు సన్నాహకంగా పా ఠశాలలో సోమవారం 25 మార్కులకు హిందీ పరీక్ష నిర్వహించగా.. వంశీ బాగా రాయలేకపోయాడు. మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయంతో అదే ప్రశ్న పత్రం ఆధారంగా మరో జవాబు పత్రం రాసి అసలు ఆన్సర్ షీట్ స్థానంలో దీన్ని పెట్టేందుకు ప్రయతిచాడు. ఇది హిందీ టీచర్‌కు తెలియడంతో విద్యారి్థని మందలించారు. ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పారు. ( చదవండి: Vizag Tourist Places: వహ్ వైజాగ్.. భూతల స్వర్గమంటే ఇదేనేమో! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో ) అయితే ప్రిన్సిపాల్ దీనిపై స్పంది స్తూ.. ఇది సాధారణ పరీక్షేనని, మార్కులు త క్కువ వస్తే ఏమీ కాదని, ఇలా చేయడం తప్పని హితవు పలికారు. కానీ టీచర్ల మందలింపుతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సో మవారం రాత్రి రెండుమూడు సార్లు బాత్రూమ్కు వెళ్లే ప్రయత్నంగా చేయగా నైట్‌వాచ్‌మెన్ ప్రశ్నించడంతో మళ్లీ డారి్మటరీకి వెళ్లిపోయాడు. వేకువజామున 4 గంటలకు ఎవ్వరూ లేని సమయంలో 9వ తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. మందలించారని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇద్దరు కుమారులు ఈ పాఠశాలలోనే... సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన కొంచాడ సింహాద్రి, రమణమ్మలకు ఇ ద్దరు కుమారులు. వంశీ 10వ తరగతి చదువుతుండగా, అతని తమ్ముడు కిరణ్ ఇక్కడే 9వ త రగతి చదువుతున్నాడు. వంశీ మంచి విద్యార్థి కూడా. ఉపాధ్యాయులతోనూ మంచి సత్సంబంధాలూ ఉన్నాయి. వీరిద్దరూ 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందారు. చక్కగా చదువుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా ఇలా దూరమైపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. గ్రామస్తులు కూడా వంశీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసుల విచారణ.. పోలీసులు ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారిస్తున్నారు. ప్రాథమికంగా కావాల్సిన ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. -
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే..
పరీక్ష బాగా రాయలేకపోయానన్న బాధ, తప్పు చేశానేమో అన్న అపరాధ భావం, టీచర్ మందలించారనే ఆవేదన.. కలగలిపి ఆ విద్యార్థి ఆలోచనలకు అడ్డుకట్ట వేసేశాయి. ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించలేని స్థితికి నెట్టేశాయి. బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకుడిని బలవన్మరణానికి ఉసిగొల్పాయి. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మంగళవారం పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశానికి గురై తల్లిదండ్రులకు విషాదం మిగిల్చాడు. ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ఎస్ఎంపురం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంచాడ వంశీ మంగళవారం పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. బడిలోని 9వ తరగతి గదిలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో విద్యార్థి ఫ్యాన్‌కు తాడు కట్టి ఉరి వేసుకోగా.. నైట్ వాచ్మెన్ అప్పారావు ఉద యం 5 గంటలకు చూసి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రిన్సిపాల్ కిమిడి జగన్మోహన్రావు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జేఆర్ పురం సీఐ సీహెచ్ స్వామినాయుడు, ఎచ్చెర్ల ఇన్చార్జి ఎస్ఐ బాలరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిది సంతకవిటి మండటం మిర్తివలస గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కొంచాడ సింహాద్రి, రమణమ్మ, బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పాఠశాలను రక్షణలోకి తీసుకున్నారు. టీచర్ మందలించారని.. తోటి విద్యార్థుల కథనం మేరకు.. విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందుకు సన్నాహకంగా పాఠశాలలో సోమవారం 25 మార్కులకు హిందీ పరీక్ష నిర్వహించగా.. వంశీ బాగా రాయలేకపోయాడు. మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయంతో అదే ప్రశ్న పత్రం ఆధారంగా మరో జవాబు పత్రం రాసి అసలు ఆన్సర్ షీట్ స్థానంలో దీన్ని పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇది హిందీ టీచర్‌కు తెలియడంతో విద్యార్థిని మందలించారు. ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) అయితే ప్రిన్సిపాల్ దీనిపై స్పందిస్తూ.. ఇది సాధారణ పరీక్షేనని, మార్కులు తక్కువ వస్తే ఏమీ కాదని, ఇలా చేయడం తప్పని హితవు పలికారు. కానీ టీచర్ల మందలింపుతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సో మవారం రాత్రి రెండుమూడు సార్లు బాత్రూమ్కు వెళ్లే ప్రయత్నంగా చేయగా నైట్‌వాచ్‌మెన్ ప్రశ్నించడంతో మళ్లీ డార్మిటరీకి వెళ్లిపోయాడు. వేకువజామున 4 గంటలకు ఎవ్వరూ లేని సమయంలో 9వ తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. మందలించారని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇద్దరు కుమారులు ఈ పాఠశాలలోనే... సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన కొంచాడ సింహాద్రి, రమణమ్మలకు ఇ ద్దరు కుమారులు. వంశీ 10వ తరగతి చదువుతుండగా, అతని తమ్ముడు కిరణ్ ఇక్కడే 9వ త రగతి చదువుతున్నాడు. వంశీ మంచి విద్యార్థి కూడా. ఉపాధ్యాయులతోనూ మంచి సత్సంబంధాలూ ఉన్నాయి. వీరిద్దరూ 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందారు. చక్కగా చదువుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా ఇలా దూరమైపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. గ్రామస్తులు కూడా వంశీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..) పోలీసుల విచారణ.. పోలీసులు ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారిస్తున్నారు. ప్రాథమికంగా కావాల్సిన ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. -
స్కూళ్లలో వై‘రష్’.. గురుకులాలు, పాఠశాలల్లో పెరుగుతున్న కేసులు
సాక్షి నెట్వర్క్: పాఠశాలల్లో కరోనా కలకలం రేపు తోంది. గత కొన్ని రోజులుగా వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరుగు తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కలిపి 46 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, ఓ వంట మనిషికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. లక్షణాలు ఉన్న వాళ్లకు టెస్టులు చేయగా.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు జలుబు, తుమ్ములతో బాధపడుతుండగా శుక్రవా రం కరోనా పరీక్షలు చేశారు. అందరికీ వైరస్ సోకిం దని తేలింది. జిల్లాలోని మల్యాల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలం ఇంద్రేశంలోని మహత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం ముగ్గురు, గురువారం 25 మంది విద్యార్థినులకు కరోనా సోకగా శుక్రవారం మరో 19 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు, ఓ వంట మనిషికి కరోనా సోకింది. హనుమకొండ జిల్లా దామెర మం డలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయుడికి.. శాయం పేట మండలం పెద్దకోడెపాక రెవెన్యూ శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌గా తేలింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ బీసీ మెట్రిక్ హాస్టల్లో ఓ టీచర్‌కు, ఓ విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మాస్కు వేసుకోని వారికి జరిమానా కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భయపెడుతుండటంతో ప్రభుత్వం మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరికీ మాస్కు తప్పనిసరి చేసింది. పెద్దపల్లిలో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న 31 మందికి, యాద గిరిగుట్ట పట్టణంలో 10 మందికి రూ. వెయ్యి చొప్పున పోలీసులు జరిమానా విధించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. -
Telangana: గురుకులాల్లో హాజరు.. 57శాతమే
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ విద్యాసంస్థలు పునఃప్రారంభమై 12 రోజులు గడిచినా ఇప్పటికీ సగం మంది విద్యార్థులు గైర్హాజరులోనే ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చిలో మూతబడ్డ గురుకుల విద్యా సంస్థలు.. సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబర్ 21న పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని తరగతుల్లో ప్రత్యక్ష బోధన షురూ అయినా హాజరు శాతం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఎస్సీ గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్) పరిధిలోని 239 విద్యా సంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 1.38 లక్షల మంది విద్యార్థులుండగా, ఈనెల 2 నాటికి 57.46 శాతం మంది మాత్రమే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. అలాగే ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ హాజరు శాతం ఇలాగే ఉన్నట్లు ఆయా సొసైటీల అధికారులు చెబుతున్నారు. 2వ తేదీ నాటికి 57.46 శాతం మందే.. ప్రత్యక్ష తరగతుల హాజరుపై గురుకుల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికీ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేనట్లు తెలుస్తోంది. గురుకుల పాఠ శాలల పునఃప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు 20వ తేదీనే ఫోన్లు, వాట్సాప్, ఎస్ఎం ఎస్‌ల ద్వారా సమాచారాన్ని ఇచ్చారు. కానీ తొలి రోజు 6% విద్యార్థులే పాఠశాలలకు హాజరయ్యా రు. అనంతరం గైర్హాజరవుతున్న విద్యార్థులతో క్లాస్ టీచర్లు నేరుగా ఫోనులో సంప్రదించడం, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. అయినా హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఈనెల 2 నాటికి 57.46% మంది మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరును పెంచి నూరుశాతం ప్రత్యక్ష బోధనను విజయవంతంగా సాగించాలని గురుకుల సొసైటీలు క్షేత్రస్థాయిలోని రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమాధికారులు, గురుకుల విద్యా సంస్థల ప్రిన్స్‌పాల్స్‌కు, టీచర్లకు లిఖితపూర్వక ఆదేశాలు పంపాయి. గైర్హాజరవుతున్న విద్యార్థులు, తల్లిదం డ్రులతో ప్రత్యేక చొరవ తీసుకుని అవగాహన కల్పించాలని, విద్యార్థి పాఠశాల/ కళాశాలకు వచ్చేంతవరకు ఈమేరకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. ప్రిన్స్పాళ్లు, టీచర్లకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌ల ద్వారా సమాచారాన్ని సైతం చేరవేశాయి. రోజువారీగా హాజరు తీరును ఎప్పటికప్పుడు ప్రిన్సిపాళ్లు, రీజినల్ కోఆర్డినేటర్లకు బాధ్యతతో పంపాలని సూచించాయి. -
Telangana : గురుకులాలు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, ఇతర గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించవచ్చని స్పష్టంచేసింది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు భౌతికంగా తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తరగతుల నిర్వహణకు అనుమతినిస్తున్నట్లు పేర్కొంది. కేరళ సహా పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ అదుపులో ఉందని.. నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వ గురుకులాలు తెరవరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భౌతికంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలంటూ గత ఆగస్టు 24న ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గురుకులాల్లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరారు. గురుకులాలు తెరిచేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని, నాలుగు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గురుకులాల నిర్వహణపై స్థాయీ నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. కాగా, గురుకులాలు తెరవరాదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆర్థికం గా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, ఈ ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. -
గురుకులాల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అదనంగా గీజర్ సౌకర్యం కూడా కల్పించనుండడంతో విద్యార్థులకు నిరంతరం వేడి నీరు కూడా అందించే వీలుంటుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించిన గిరిజన గురుకుల సొసైటీ.. తాజాగా టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 110 గిరిజన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కరెంటు చార్జీల పొదుపు: వేసవి సీజన్ మినహాయిస్తే.. మిగతా రోజుల్లో గురుకుల విద్యాసంస్థల్లో వేడినీటి వినియోగం ఎక్కువే. శీతాకాలంలో వాడకం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో కరెంటుతో నడిచే గీజర్లతో విద్యుత్ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. కొన్ని స్కూళ్లలో నెలకు వచ్చే కరెంటు బిల్లుల్లో గిజర్ వినియోగానికే రూ.25 వేలకుపైగా చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బిల్లుల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో సోలార్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు, గీజర్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ బిల్లుల్లో దాదాపు 30 శాతం ఆదా అయ్యింది. దీంతో అన్ని స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వారంలోగా టెండర్లు ఖరారైతే పక్షం రోజుల గడువు విధించి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. -
గురుకులాలు తెరుద్దాం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యక్ష బోధనపై వైద్య, ఆరోగ్య శాఖ సూచనల నేపథ్యంలో, విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభు త్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ క్రమం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గురుకుల విద్యా సంస్థలను తెరిచే అంశంపై గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి. వీటిని ప్రత్యేక అనుమతులతో నిర్వహించొచ్చనే అభిప్రాయం ఉంది. వీటి పరిధి లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే ముందు గా పెద్ద పిల్లలున్నటువంటి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తెరిస్తే ఇబ్బందులుండని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదికఅందించేందుకు సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమావేశం కానున్నా యి. అన్ని విభాగాల అధికారులతో పాటు రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశంలో పాల్గొనున్నారు. ఆన్‌లైన్‌తో ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో 430 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 230 జూనియర్ కాలేజీలు 2021–22 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. వీటితో పాటు 60 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో బోధన సాగుతుండగా.. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫస్టియర్‌కు కూడా ఆన్లైన్ బోధన ప్రారంభించాలని భావిస్తున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా పిల్లలు పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంలో తడబాటుకు గురవుతున్నట్లు సొసైటీల పరిశీలనలో తేలింది. దీంతో ప్రత్యక్ష తరగతుల ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించిన అధికారులు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా సంస్థల వారీగా విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తారని, వీరికి తరగతులు నిర్వహించడం కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. కాగా, బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో హాస్టళ్లలో తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేసి కాలేజీలు తెరవొచ్చనే చర్చ జరుగుతోంది. మంగళవారం నాటి సమావేశంలో క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను సేకరించాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సొసైటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
గురుకుల సీట్లలో సగం స్థానికులకే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది గురుకుల పాఠశాలల ఐదో తరగతి అడ్మిషన్లలో స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగులు సీట్లను జిల్లాస్థాయిలోని విద్యార్థులతో భర్తీచేస్తారు. ఇంకా మిగిలితే రాష్ట్రస్థాయిలోని విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్ఈఐఎస్) సొసైటీలు ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్) నిర్వహిస్తున్నాయి. అనంతరం విద్యార్థులను కేటగిరీలవారీగా విభజించి ఆయా గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్ మాత్రం సొంతంగా ప్రవేశపరీక్ష, అడ్మిషన్లు చేపడుతోంది. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 50 శాతం సీట్లు నియోజకవర్గంలోని వారికే కేటాయిస్తారు. సీట్లు మిగిలితే జిల్లాను యూనిట్‌గా, ఇంకా మిగిలితే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. పైరవీలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకు ఒకసారి సమీక్ష.. రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యాసంస్థ మూడు నెలలకోసారి తప్పకుండా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యాసంస్థల పనితీరు, ఇతర సమస్యల్ని చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమావేశానికి నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీలతోపాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు
అనంతగిరి: గుండెపోటుతో గురుకుల ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా వోట్కూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖలీల్ హైమద్(38) వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గత నవంబర్ నుంచి ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు కొడంగల్ గురుకుల పాఠశాలలో పనిచేశారు. విధుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఓ ఉపాధ్యాయుడు డ్యూటీ చేస్తారు. హైమద్ శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు తర్వాత బాత్రూంకు వెళ్లారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ గార్డు సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఉపాధ్యాయుడు కుప్పకూలి ఉన్నారు. వెంటనే విషయాన్ని ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. 108లో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందారని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమించి పెళ్లాడిన భర్తను చంపిన భార్య బౌన్స్ స్కూటీల దొంగ అరెస్ట్ -
అమ్మానాన్న బాగున్నారా?
న్యూశాయంపేట : పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేస్తోంది. చదువుకునే సమయంలో రోజుల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా ఫోన్ల వాడకాన్ని భద్రతా చర్యల కారణంగా ప్రిన్సిపాళ్లు అనుమతించడం లేదు. తద్వారా ఎపుడో వారం, పదిహేను రోజులకోసారి తల్లిదండ్రులు వస్తే తప్ప మాట్లాడే వెసలుబాటు కలగడం లేదు. దీనికి పరిష్కారం ఓ మార్గం అందుబాటులోకి వచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో... విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి, వారియోగ క్షేమాలు తెలుసుకోవడానికి ఇటీవల అలైన్ గ్రూప్ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రిన్సిపాళ్లు తమ క్యాంపస్ ఆవరణలో ఉండే విద్యార్థుల సంఖ్యకు తగిన సామర్థ్యంలో ఫోన్ అమరుస్తారు. ఏ విద్యార్థి అయితే తగిన రుసుము చెల్లించి స్మార్ట్ కార్డ్ తీసుకుంటారో వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను మాత్రమే ఆ ఫోన్లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ముందస్తు నమోదు చేసి నంబర్‌కు మాత్రం ఫోన్ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. దీంతో ఫోన్లు దుర్వినియోగం అవుతాయనే బాధ కూడా ఉండదు. తాజాగా ఈ ఫోన్లను వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని బాలికల మైనార్టీ గురుకులం(హన్మకొండ) పాఠశాలలలో ఏర్పాటు చేశారు. సురక్షితం స్మార్డ్ కార్డ్ ఫోన్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫోన్లో ఔట్‌గోయింగ్ కాల్స్ మాత్రమే చేసుకోవచ్చు. తగిన రుసుము చెల్లించి కార్డు కొనుగోలు చేసిన విద్యార్థి పేరెంట్స్ అందించిన మూడు ఫోన్ నంబర్లు నిక్షిప్తం చేస్తారు. బిగించిన ఫోన్లో మూడు బటన్లు ఉంటాయి. ఓ విద్యార్థి తన కార్డును స్వైప్ చేశాక ఏదో ఒక నంబర్ నొక్కితే అందులో ముందే ఫీడ్ చేసిన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ వెళ్తుంది. ప్రిన్సిపాళ్లు నిర్ణయించిన సమయంలో ఫోన్ చేసేలా నిబంధన విధించారు. హాస్టళ్లలో ఉచితంగా బిగింపు హాస్టళ్లలో ఈ ఫోన్లను ఎలాంటి రుసుము తీసుకోకుండానే ‘అలైన్’ సంస్థ బాధ్యులు ఏర్పాటు చేస్తారు. ప్రతినెల ప్రతినిధి వచ్చి ఫోన్ బాగోగులు చూసి వెళ్తాడు. లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ప్రతీ నిమిషానికి 60 పైసలు కట్ అవుతాయి. స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు రూ.200 చెల్లించాలి. అందులో రూ.వంద టాక్‌టైమ్ వస్తుంది. టాక్‌టైమ్స్ అయిపోయాక తిరిగి తగిన రుసుము చెల్లించి రీచార్జ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఈ ఫోన్‌తో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. గతంలో స్కూల్ ఫోన్ ఒకటే ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్త ఫోన్‌తో వారికి కేటాయించిన సమయాల్లో ఫోన్ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.– వాసవి, పిన్సిపాల్, బాలికల మైనార్టీ గురుకులం -
చాలీచాలని అన్నంతో సరిపెడితే సహించేదిలేదు
అనంతపురం, కణేకల్లు: చాలీచాలని అన్నం, పల్చటి మజ్జిగతో విద్యార్థులను పస్తులు ఉంచితే సహించేదిలేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, సిబ్బందిని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాత్రి కణేకల్లుక్రాస్‌లోని గురుకుల పాఠశాలను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, సాంబారు, వంకాయకూరలను విప్ కాపు పరిశీలించారు.అన్నం, మజ్జిగ తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూరగాయలను సంబంధిత కాంట్రాక్టర్ ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ను విప్ ప్రశ్నించగా రోజూ కూరగాయలు సరఫరా చేస్తారని ఆమె సమాధానమిచ్చారు. అదే సమయంలో మెస్ కేర్‌టేకర్ వేణుగోపాల్‌రావు అక్కడికి రాగా.. విప్ కాపు మెనూ, కూరగాయల సరఫరా గురించి అడిగారు. ప్రిన్సిపాల్, మెస్ కేర్‌టేకర్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై రోజూ తాజాకూరగాయలు కాంట్రాక్టర్‌తో తెప్పించుకోవాలని కాపు సూచించారు. స్టోర్ రూం పరిశీలన .. అనంతరం స్టోర్‌రూమ్‌కెళ్లి కూరగాయలు, పప్పుదినుసులను విప్ కాపు పరిశీలించారు. క్యారెట్, కూరగాయలు వాడిపోయి ఉండడంతో ఇలాంటివి విద్యార్థులకు వండిపెడితే అనారోగ్యానికి గురికారా? అని ప్రశ్నించారు. ఇలాంటివి మన ఇళ్లలో తింటామా? అని మెస్ కేర్‌టేకర్‌కు చురకలంటించారు. సిబ్బంది క్వార్టర్స్‌పై ఆరా.. గురుకులంలో పని చేసే ఉపాధ్యాయుల నివాసంపై విప్ ఆరా తీశారు. ఇక్కడెన్ని క్వార్టర్స్ ఉన్నాయి..ఎవరెవరు ఉంటున్నారని ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కన్న, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, కణేకల్లు పట్టణ కన్వీనర్ టి.కేశవరెడ్డి, మాజీ సర్పంచ్ పాటిల్ చెన్నకేశవరెడ్డి, నాయకులు గంగలాపురం ముత్తు, గోవిందరాజులు, ప్రతాప్, పెద్దదేవర ఖలందర్ పాల్గొన్నారు. -
గురుకులం నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్ జి.నివాస్ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్‌ను ప్రశ్నించారు. కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. నాలుగో వంతు పిల్లలు కూడా లేరు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్ ఎన్.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జి.నివాస్ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్.వరప్రసాద్, తహసీల్దార్ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో మనబడి–మనగుడి
సాక్షి, ఆదిలాబాద్ రూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ‘మన బడి – మనగుడి’ పేరుతో శనివారం నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంస్థ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రూపకల్పనలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు విద్య, విద్యేతర కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని సుశిక్షితులుగా తయారు చేయాలనే సంకల్పంతో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతిమంగా గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలతో సత్ఫలితాలిస్తుండటంతో తాజాగా ‘మనబడి–మనగుడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కార్యక్రమం ఉద్దేశం... విద్యార్థులతో పాటు తల్లిదండ్రులనూ భాగస్వాములను చేస్తూ వారిలో సంస్థపై మరింత బాధ్యతను పెంచేలా చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం, ఫలితంగా సంక్షేమ గురుకుల విద్యార్థులకు మనోధైర్యం పెంచడమే కాకుండా క్రమ శిక్షణ, చదువుపై నిబద్ధత కలిగేందుకు అస్కారం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 17సాంఘిక సంక్షేమ గరుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 17 పాఠశాలలు, 10 ఇంటర్ కళాశాలలున్నాయి. ఆయా కళాశాల, పాఠశాలలో సుమారు 9,200 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి రెండో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో పిల్లలు చదువుకునే పాఠశాల, వసతి గృహాల్లో అందుతున్న వసతులు, చదువుతున్న తీరు, దిన చర్యను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. దీంతో తమ పిల్లల విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతున్నాయో, తల్లిదండ్రులుగా పిల్లల చదువుకు ఇవ్వాల్సిన సహకారం, వారి భవిష్యత్‌కు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు తెలుసుకునే వీలుంటుంది. మనబడి–మనగుడి కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమం అనంతరం ఆ గురుకుల పాఠశాల, కళాశాల వర్గాలు కొంత మేర సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుందని సంస్థ సూచించింది. కావాల్సిన సామగ్రి ఈ కార్యక్రమంలో భాగంగా 5లీటర్ల వరకు ఫినాయిల్, 2లీటర్ల యాసిడ్, 10 బ్రూమ్స్, 5బక్కెట్లు, 5మగ్గులు, 10 డస్టర్లను కొనుగోలు చేయడంతోపాటు నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమస్యలు కొంత మేర పరిష్కారం కావడమే కాకుండా తమ తల్లిదండ్రులతో వసతి గృహాంలో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించడం గమనార్హం. ఈ కార్యక్రమం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసరాల శుభ్రతకు దోహదం సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆదేశం మేరకు ప్రతి నెలా రెండో శనివారం గురుకుల విద్యాలయం ఆవరణలో నిర్వహించే మనబడి మనగుడి కార్యక్రమంతో వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను, విద్యార్థుల స్థితిగతులను అంచనా వేయడానికి అస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు అధ్యాపకులకు మరింత బాధ్యత పెంచినట్లు అవుతుంది. విద్యా పరంగా మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశము ఉంది. – గంగన్న, ఆర్సీవో, సాంఘిక గురుకుల పాఠశాల, ఆదిలాబాద్ -
టెన్త్ కోసం టైం టేబుల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుకు గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సమయపాలనకు అదనంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 94.5 శాతం సగటు ఉత్తీర్ణతను సాధించాయి. ఈసారి నూరు శాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించేలా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నాలుగు గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే నెల రెండో వారం నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాయి. 4 గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణ సైతం రోజువారీగా నిర్వహించనున్నాయి. గురుకుల సొసైటీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను గురుకుల ప్రిన్సిపాళ్లు సంబంధిత సొసైటీ కార్యాలయాలకు పంపించాలి. అలా వచ్చిన వివరాలను సొసైటీలు అంచనా వేస్తాయి. దీంతో సొసైటీ పరిధిలోని పాఠశాలల పనితీరుపై స్పష్టత వస్తుంది. ప్రతిరోజు రెండు స్పెషల్ క్లాసులు గురుకుల సొసైటీలు రూపొందించిన ఉమ్మడి ప్రణాళికను ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వారికే అమలు చేయనున్నారు. ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో వారంలో ప్రతి సబ్జెక్టును రెండు సార్లు ప్రత్యేక తరగతుల్లో బోధిస్తారు. ఇందులో ఒక తరగతిలో రివిజన్, మరో తరగతిలో అభ్యాసన కార్యక్రమాలు ఉంటాయి. వారాంతంలో శని లేదా ఆదివారాల్లో స్లిప్‌టెస్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. సబ్జెక్టులో వెనుకబడినట్లు గుర్తిస్తే వారికి మరింత సాధన చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి. -
బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాల వసతిగృహంలో బుధవారం రాత్రి విద్యార్థులకు బెండకాయ కూర, పప్పుతో భోజనం అందించారు. వసతిగృహంలో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో బయట నుంచి నీళ్లు తెప్పిం చారు. భోజనం చేసిన విద్యార్థులు ఆ నీళ్లు తాగారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వసతిగృహ వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆ మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రక్తపు విరేచనాలు.. మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడకపోగా ఒకరిద్దరు రక్తపు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసున్న ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో ముజాఫర్ ఖాద్రి, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఈవోపీఆర్డీ ఎన్.వివేక్‌రాం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఇందుకు గల కారణాలను ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే.. కలుషిత నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కాగా పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో వసతిగృహ అధికారులు పట్టణంలోని ఓ ప్లాంట్ నుంచి మినరల్ వాటర్ తెప్పించారు. మినరల్ వాటర్ తాగినా విద్యార్థులకు ఇలా జరగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని, విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల కోరుతున్నారు.