విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము | Snake Bite In Gurukul School Vizianagaram | Sakshi
Sakshi News home page

నిద్రలో పిల్లల్ని కాటేసిన విషసర్పం.. విజయనగరం గురుకులంలో విషాదం

Published Fri, Mar 4 2022 12:46 PM | Last Updated on Fri, Mar 4 2022 12:46 PM

Snake Bite In Gurukul School Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విషాదం నెలకొంది.  నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది.  ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది.  నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

ముగ్గురిలో రంజిత్‌ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన  నెలకొనగా.. రంజిత్‌ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement