mishap
-
ట్రాక్టర్ బోల్తా.. కూలీల దుర్మరణం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముప్పాళ్ల: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్‌పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్యంత బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
అచ్యుతాపురం ఘటన: దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ దుర్ఘటన అప్డేట్స్పరిహార ప్రకటన చేసిన చంద్రబాబుఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు సర్కార్బాధిత కుటుంబాల ఆందోళన, వైఎస్సార్సీపీ డిమాండ్‌కు తలొగ్గిన వైనంఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం జిల్లా మెడికవర్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబుఅనంతరం మీడియాతో పరిహార ప్రకటనమృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారంఅవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు,గాయాలు అయిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబుచికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణపరిహారం ఎప్పటిలోగా అందిస్తామనేదానిపై ఇవ్వని స్పష్టతగత ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేశాయంటూ అసందర్భోచిత వ్యాఖ్యలుప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, పరిహారంపై స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ ప్రభుత్వ స్పందన సరిగా లేదు: బొత్స ఫైర్అచ్యుతాపురం ఘటన బాధాకరంప్రభుత్వం స్పందించిన తీరు సరికాదుబాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమంత్రులు, ఎమ్మెల్యేలు బాధితుల్ని పరామర్శించలేదుచంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలిగతంలో మా ప్రభుత్వం ఈ తరహా ప్రమాదాలు జరిగితే సత్వరమే స్పందించిందిమా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిందిసెజ్ ప్రమాద బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలిరేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారుపరిహార ప్రకటనపై బాబు సర్కార్ డ్రామాలుఅచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. పరిహారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలుగత ప్రభుత్వం మాదిరే పరిహారం ఇవ్వాలని కోరుతున్న బాధిత కుటుంబాలుఅటు విశాఖ, ఇటు అనకాపల్లి మార్చురీల వద్ద ఆందోళనపరిహారంపై స్పష్టమైన ప్రకటన తర్వాతే పోస్ట్‌మార్టానికి సహకరిస్తామని బైఠాయింపుపోలీసులు, రెవెన్యూ అధికారుల బుజ్జగింపులతో తలొగ్గని కుటుంబ సభ్యులుప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇస్తుందని ప్రకటించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్తక్షణం సాయం అందించాలని బాధిత బంధువుల డిమాండ్కాసేపటికే జాయింట్ కలెక్టర్ జాహ్నవి విరుద్ధమైన ప్రకటనపరిహారం ఇవ్వాలంటే ముందు బాధితుల బంధువుల్ని గుర్తించాలంటూ మెలికమూడు రోజుల సమయం పడుతుందని వ్యాఖ్యపరిహారం చంద్రబాబే ప్రకటిస్తారంటూ తెలిపిన జాహ్నవిజేసీ ప్రకటన తర్వాత.. ఆందోళన ఉధృతానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు, బంధువులుమెడికవర్ ఆస్పత్రికి చంద్రబాబువిశాఖ మెడికవర్ ఆస్పత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరామర్శచికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబువైద్యం అందుతున్న తీరును వైద్యుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబుకేజీహెచ్కు వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరుల పరామర్శఅధికార యంత్రాగం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయిన బాధితులుఏ ఒక్కరూ పట్టించుకోలేదని కంటతడి పెట్టిన మహిళలుచలించిపోయి.. బాధితుల్ని ఓదార్చిన బొత్స ‘సీఎం రమేష్‌కు సిగ్గుందా?’అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతమార్చురీ గేటు ముందు నిరసనకు దిగిన మృతుల కుటుంబ సభ్యులుప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ నినాదాలుమృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్.అచ్యుతాపురం ప్రమాద ఘటనపై కేంద్రం రూ. రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం దుర్మార్గంసీఎం రమేష్ కు సిగ్గుందా?బాధిత కుటుంబాలు రోదిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదు..:::ఘంటా శ్రీరామ్, వామపక్ష నేతఅచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది పరిశ్రమల కాలుష్య నియంత్రణ నా శాఖ పరిధిలో ఉంది కానీ, భద్రత వేరే శాఖ కిందికి వస్తుంది పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పాను అలా చేస్తే పరిశ్రమలు మూతపడతాయని నిర్వాహకులు భయపడుతున్నారుకానీ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాల్సిందేఇలాంటి ఘటనలప్పుడు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరంసెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాంరాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం ఖర్గే దిగ్భ్రాంతిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతిఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలిబాధితులకు న్యాయం చేసి, తగిన నష్టపరిహారం ఇవ్వాలిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిపరిహారాన్ని సీఎం ప్రకటిస్తారు: విశాఖ జేసీవిశాఖ కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలిసిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవి.మృతుల వారసుల్ని విచారణ చేసి గుర్తిస్తాం: జేసీ జాహ్నవిపరిహారం చెల్లించటానికి వారసుల గుర్తింపు కార్యక్రమానికే మూడు రోజుల టైం పడుతుంది: : జేసీ జాహ్నవిపరిహారం ఎంత అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు : జేసీ జాహ్నవిప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక వెల్లడిస్తాం : జేసీ జాహ్నవిజేసీ ప్రకటన నేపథ్యంలో.. మీడియా ముందుకు బాధిత కుటుంబాలుపరిహారం ప్రకటించేదాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనీయమని స్పష్టీకరణపరిహారంపై ప్రకటనేది?ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మృతుల బంధువుల వాగ్వాదం నష్ట పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ మృతదేహలను తీసుకెళ్ళేది లేదని తేల్చేసిన బంధువులుమృతుల బంధువులను బుజ్జగిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందివిశాఖ కేజీహెచ్ వద్ద ఇదే తరహా ఆందోళనఅందుకే ప్రమాదం!: అధికారుల వెర్షన్అనకాపల్లి ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై అంచనాకి వచ్చిన అధికారులురియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరగలేదు అని క్లారిటీ తెచ్చుకున్న అధికారులు!ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ సాల్వెంట్ లో MTBE లిక్విడ్ లీక్ అవ్వడంతోనే ప్రమాదం?లీక్ అవుతున్న సాల్వెంట్ మీద ఎలక్ట్రికల్ స్పార్క్ పడటంతో పేలుడు సంభవించిందని అంచనాపేలుడు దాటికి కుప్పకూలిన బ్రిక్ వాల్మరో నలుగురి పరిస్థితి విషమంఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమంమెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అధికారుల సూచన18కి చేరిన మృతుల సంఖ్య కొనసాగుతున్న ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల ఆందోళన విశాఖ కలెక్టర్ హామీ తర్వాత కూడా వెనక్కి తగ్గని మృతుల కుటుంబ సభ్యులుఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టిన కుటుంబ సభ్యులుఅధికార ప్రజాప్రతినిధులెవరూ రాలేదని మండిపాటుఅధికార యంత్రాంగం కూడా ఆలస్యంగా స్పందించిందంటున్న బాధితులుకోటి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పోస్టుమార్టంకు సహకరిస్తామని స్పష్టీకరణగత ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే ఆదుకుంది కదా అని గుర్తు చేస్తున్న మృతుల బంధువులు అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబుఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎంనగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబుతర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లనున్న సీఎంఘటనా స్థలాన్ని సందర్శించనున్న చంద్రబాబుఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఆస్పత్రిలో ఏడు మృతదేహాలు.. ఆరింటి గుర్తింపుమార్చురీ వద్ద ఉన్న మృతుల బంధువులపై ఆంక్షలువిశాఖ కేజీహెచ్ వద్ద పరిహారంపై స్పష్టమైన హామీ కోరుతూ బంధువుల ఆందోళనఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని ముందు జాగ్రత్తమృతదేహన్ని చూస్తామని చెప్పినా లోపలకు పంపించని పోలీసులుపోలీసులతో బంధువుల వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తత సాక్షి చేతిలో ప్రమాదంపై ఫిర్యాదు కాపీరాంబిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాంబిల్లి తహశీల్దార్ భాగ్యవతిమధ్యాహ్నాం 2:15 కి పేలుడు జరుగున్నట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్సాల్వెంట్ కెమికల్ పేలి ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని రిపోర్ట్ఒకట్రెండు రోజుల్లో పరిహార ప్రకటన: విశాఖ కలెక్టర్కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌ను ముట్టడించిన మృతుల బంధువులు.ప్రమాదం జరిగిన తరువాత యాజమాన్యం ఎందుకు స్పందించలేదని నిలదీసిన మృతుల బంధువులు.ప్రభుత్వం నుండి పరిహారం ప్రకటన స్పష్టం గా వచ్చేవరకు మార్చురీ వద్ద ఆందోళన చేస్తామంటున్న బాధిత కుటుంబాలు.ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పిన కలెక్టర్ కలెక్టర్ ప్రకటనపై బాధితుల కుటుంబాల అసంతృప్తి.. కొనసాగుతున్న ఆందోళనతగిన న్యాయం చేయాల్సిందే: బాధిత కుటుంబాల ఆందోళనకేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకేజీహెచ్ మార్చురీకి వచ్చిన జిల్లా కలెక్టర్.కలెక్టర్‌ను చుట్టుముట్టిన బాధితులుతమకు న్యాయం చేయాలని డిమాండ్జరిగిన ప్రమాదంపై ఇప్పుడు వరకు ప్రభుత్వ స్పందించలేదు: బాధిత కుటుంబాలుస్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు: బాధిత కుటుంబాలుకంపెనీ ప్రతినిధులు ఎవరూ రాలేదు: బాధిత కుటుంబాలుగతంలో జగన్ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది : బాధిత కుటుంబాలుఅదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలి: బాధిత కుటుంబాలుపరిహారంగా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి: బాధిత కుటుంబాలుకేజీహెచ్ వద్ద ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వద్ద ఫార్మా కంపెనీ మృతుల బంధువుల ఆందోళననష్టపరిహారంపై స్పష్టమైన ప్రభుత్వం హామీ ఇవ్వాలని బంధువుల డిమాండ్కేజీహెచ్లో 12 మృతదేహాలుబంధువులతో రెవెన్యూ అధికారుల చర్చలు అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తతనష్టపరిహారం పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పంచనామాకు సహకరించేది లేదంటున్న మృతుల బంధువులు..మృతుల బంధువులను బుజ్జగిస్తున్న రెవెన్యూ అధికారులుపంచనామాకు సహకరించాలని మిగతా వివరాలు ఆపై మాట్లాడదామంటున్న రెవెన్యూ సిబ్బందిఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్ కలెక్టర్మృతుల బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న జాయింట్ కలెక్టర్నష్టపరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాని స్పష్టతఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు బీఎన్ఎస్ సెక్షన్లు 106(1), 125(b),125(a) కింద కేసులు నమోదుఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసునిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రాంబిల్లి పోలీసులుప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటనఅచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య 18!అచ్యుతాపురం సెట్ దుర్ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్యకేజీహెచ్ మార్చురీకి 12 మృతదేహాలుకొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్17 మృతదేహాల గుర్తింపు.. మరొకటి గుర్తించాల్సి ఉంది!విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్న మృతుల వివరాలు1)నీలపు రామిరెడ్డి అస్సోసియేట్ జెనరల్ మేనేజర్ 2)మహంతి నారాయణారావు అసిస్టెంట్ మనేజర్ 3)మొండి నాగబాబు అసిస్టెంట్ మేనేజర్ 4)చల్లపల్లి హారిక ట్రైనీ ఇంజినీర్ 5)మారిశెట్టి సతీష్ అసిస్టెంట్ మేనేజర్ 6)యళ్లబిల్లి చిన్నారావు పెయింటర్ 7)పైడి రాజశేఖర్ ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ తండ్రి ధర్మారావు శ్రీకాకులం జిల్లా వంజంగి కులం కాలింగ 8) కొప్పర్తి గణేస్ కుమార్ M దుర్గా భవాని 9) ప్రశాంత్ హంస మేల్ W/o జ్యోతి 10) వేగి సన్యాసి నాయుడు11)పూడి మోహన్ దుర్గా ప్రసాద్ 12)జవ్వాది చిరంజీవిఅనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలుఈ ఐదు మృతదేహలకు పంచనామా నిర్వహించనున్న అధికారులుఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న మృతుల బంధువులుఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్న మృతుల వివరాలు..జావేది పార్థసారిది, పార్వతీపురం మన్యంపూసల వెంకట సాయి, చిన గంట్యాడమారేణి సురేంద్ర, గాజువాకభి. ఆనందరావు, విజయనగరంబిఎన్. రామచంద్రరావుఎసెన్షియా (scientia) కంపెనీ ఎదుట రోదిస్తున్న బాధితుల బంధువులుఅచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం పేలిన రియాక్టర్ తమ వారి ఆచూకీ ఇంకా తెలియదు అంటూ రోదిస్తున్న బాధితులుఇంకా శిథిలాల కిందే చిక్కుకున్న కొంతమంది కార్మికులు?సహాయక చర్యల్లో జాప్యం చేస్తున్నారనే విమర్శఎవ్వరూ పట్టించుకోక పోవడంతో.. కంపెనీ ఎదుట బైఠాయించిన బాధితులుఅధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోందిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని అన్నివిధాలా ఆదుకోవాలిబాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలిఅచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.గత కొంతకాలంగా విశాఖ సమీపంలోని కంపెనీలలో వరుస ప్రమాదాలునిరంతరం ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది:::సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ -
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
రష్యాలో ఘోర రైలు ప్రమాదం... 70 మందికి తీవ్రగాయాలు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. Passenger train derails in Komi Region, Russia pic.twitter.com/Ywh4s6NEaH— RT (@RT_com) June 26, 2024 -
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బంధువులకు ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది
-
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్‌మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్‌గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్‌గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
చీమలపాడు: ఆ తిండి తిని పశువులకు అస్వస్థత.. మూడు మృతి
క్రైమ్: ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ శ్రేణులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చగా.. వేదికకు దగ్గర్లోని ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, ఆర్పడానికి వెళ్లిన వాళ్లు అందులోని సిలిండర్ పేలి మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలు అయ్యాయి కూడా. ఈ విషాదంతో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకుంది బీఆర్ఎస్. అయితే.. సమ్మేళనం కోసం వండిన వంటకాలను గ్రామ సమీపంలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని కొన్ని పశువులు ఆ కుళ్లిపోయిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యాయి. మూడు ఆవులు మృతి చెందగా, మరికొన్నింటికి వైద్యం అందిస్తున్నారు. నలుగురు గ్రామస్తుల మృతితో విషాదంలో ఉన్న తాము అక్కడ తిండి వదిలేసిన సంగతి గమనించలేదని, పశువులు నిత్యం అటువైపు మేతకు వెళ్తుండడంతో తాము పెద్దగా పట్టించుకోలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పశువుల యజమానులు వాపోతున్నారు. -
ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 36 మందిని బలిగొన్న ఆలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయి. సోమవారం ఉదయం బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రమాదానికి కారణమైన అక్రమ కట్టడాన్ని కూల్చివేతను అధికారులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ఇండోర్ మున్సిపల్ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. కూల్చివేతలకు ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. సుమారు నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్‌సిబ్బంది అక్కడ మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా, ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు దగ్గరుండి ఆ కూల్చివేతలను పర్యవేక్షించారు. #WATCH | Madhya Pradesh: Indore municipality deploys bulldozer & demolishes illegal structure at Indore temple where 36 people died after the stepwell collapse there last week. pic.twitter.com/gpRJB6zWhN — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023 ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.. ఆలయంలో మెట్లబావిని మూసేస్తూ కాంక్రీట్స్లాబ్వేయగా.. శ్రీరామ నవమి నాడు ఆ స్లాబ్ ఉన్న ప్రాంతంలోనే యాగం చేయడం, భక్తుల బరువును మోయలేక ఆ పైకప్పు కూలిపోయి భక్తులు బావిలో పడిపోయి మరణించడం తెలిసిందే. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. అది అక్రమ కట్టడం అని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కిందటి ఏడాది ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు పంపింది. అంతేకాదు.. ఆ పైభాగానికి కూల్చివేసేందుకు మార్క్ కూడా చేసింది. కానీ, ఆ సమయంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆలయ ట్రస్ట్ నిరసన వ్యక్తం చేయడంతో.. అధికారులు వెనక్కి తగ్గారు. ఒకవేళ అధికారులు ఆనాడే దూకుడుగా స్పందించి ఉంటే.. నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. ఇండోర్ స్నేహ్ నగర్లో పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తోంది. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావిని కేవలం నాలుగు ఐరన్ గ్రిడ్స్‌తో.. పైన సన్నని కాంక్రీట్ లేయర్, టైల్స్‌తో కప్పేసి పూజల కోసం ట్రస్ట్ నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అక్రమ కట్టడంతో పాటు చుట్టుపక్కల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సైతం కూల్చేస్తున్నారు అధికారులు. మరోవైపు.. ఇండోర్ ఆలయ ప్రమాద ఘటనతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆలయ కట్టడాలను, బావుల్ని గుర్తించి.. తక్షణమే వాటిని మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే ఆలయాల ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే గుర్తించి తక్షణమే వాటిని తొలగించడం లేదంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. -
గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఇండోర్ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్‌పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. -
నెల్లూరు: తోడేరు చెరువులో ఆరుగురు యువకుల గల్లంతు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన. -
కేంద్ర ప్రభుత్వ అనుచిత నిర్ణయాలు వల్లే ప్రమాదాలు
-
కందుకూరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందజేత
సాక్షి, నెల్లూరు: కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘనటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందజేశారు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌లను కాకాణి ఆ కుటుంబాలకు అందజేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్న మంత్రి కాకాణి.. ఘటనపై దర్యాప్తు వీలైనంత త్వరగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
విషాదం: చిన్నా.. నీ సాహసం వృథా అయ్యిందిరా!
ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్‌ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంగ్లండ్‌లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్‌లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది. కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు. నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్‌తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విమాన కూల్చివేత కేసు.. ఎనిమిదేళ్లకు న్యాయం
ఆమ్స్టర్డ్యామ్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 298 మంది మృతికి కారణమైన నిందితులకు ఆలస్యంగా అయినా కఠిన శిక్ష పడింది. ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది డచ్ కోర్టు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రష్యా పాత్ర ఉందనే విషయం స్పష్టమైందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన 196 మంది, 43 మంది మలేసియన్ వాసులు, 38 మంది ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు.. ఇలా మొత్తం పది దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటువాదుల పని అయ్యిండొచ్చని, అందులో మాస్కో ప్రమేయం ఏం లేదని పాత పాటే పాడుతోంది. -
తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్
అహ్మదాబాద్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రెటరీని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది. అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు! -
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం
అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందినట్లు సమాచారం. పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవాళ్లలో మరొకరి మృతితో.. మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటన దర్గాహోన్నూరు ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారాయన. అంతేకాదు.. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారాయన. -
మోర్బీ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన
లక్నో: ఛట్ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. #WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw — ANI (@ANI) October 31, 2022 ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే.. -
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
మోర్బీ విషాదం.. అరెస్టులు షురూ
గాంధీనగర్: దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు తీసిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన కేసులో పోలీసుల చర్యలు మొదలయ్యాయి. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టిన ఓరేవా కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అయితే వాళ్లిద్దరూ మధ్య స్థాయి ఉద్యోగులని తెలుస్తోంది. బ్రిడ్జి దుర్ఘటన జరిగినప్పటి నుంచి కంపెనీ సీనియర్లు పత్తా లేకుండా పోయారు. వాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జి పునఃప్రారంభ విషయంలో ఒరేవా ఎన్నో తప్పిదాలకు పాల్పడిందని.. ఫిట్నెస్ సర్టిఫికెట్ దగ్గరి నుంచి బ్రిడ్జిని తిరిగి ప్రారంభించడం దాకా.. అన్నింట్లోనూ వైఫల్యాలే ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముందు ముందు మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని విచారణ జరుపుతున్న సిట్ ప్రకటించింది. ఇక ప్రమాదానికి ముందు కొందరు కుర్రాళ్లు.. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తాళ్లను విపరీతంగా ఊపారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. #WATCH | An injured survivor in the #MorbiBridgeCollapse recounts the harrowing moment when the suspension bridge collapsed and how he saved himself pic.twitter.com/MWX3HpwqmT — ANI (@ANI) October 31, 2022 -
బిడ్డకు పేరుపెట్టే సంబురం.. కమ్మేసిన విషాదం
యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు -
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
దైవ దర్శనానికి వెళ్తుండగా.. పల్టీలు కొడుతూ నీట పడ్డ ట్రాక్టర్
లక్నో: కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కువ మందిని తీసుకెళ్తున్న సమయంలో.. ఓవర్‌లోడ్ కారణం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది. మరో పది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్ వెల్లడించారు. మృతులంతా సీతాపూర్ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు. मुख्यमंत्री जी ने दिवंगत के परिजनों को ₹4 लाख की राहत राशि प्रदान करने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए उनके उपचार की समुचित व्यवस्था करने के निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2022 -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
విషాదం: మజాక్ మజాక్‌ల దోస్త్ ప్రాణం పోయింది
గాంధీనగర్: కొన్ని పనులు నవ్వులాట కోసమే చేసినా.. అవి ఊహించని ఫలితాన్ని ఇస్తుంటాయి. స్నేహితుడితో సరదాగా వ్యవహరిద్దామనుకుంటే.. అది కాస్త బెడిసి కొట్టింది. ఒక ప్రాణం పోవడంతో పాటు మరో యువకుడిని జైలు పాలు చేసింది. సరదా ఆట పేరుతో ఎయిర్ కంప్రెషర్‌ను వెనుక భాగంలో(పెద్ద పేగు చివరిభాగము) పెట్టడంతో.. ఓ టీనేజర్ ప్రాణం పోయింది. గుజరాత్ మెహ్సనా జిల్లా కడీ తాలుకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు, అతని స్నేహితుడు.. ఇద్దరూ అలోక్ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్నారు. అది వుడ్‌వర్క్ కావడంతో.. పనయ్యాక ఎయిర్ కంప్రెషర్‌తో దుస్తుల్ని శుభ్రం చేసుకుంటారు. ఈ క్రమంలో.. భోజన సమయంలో కంప్రెషర్‌తో బాధితుడు, ఆ స్నేహితుడు సరదాగా ఆడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ చర్య వికటించి బాధితుడు స్పృహ కోల్పోగా.. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు స్నేహితుడు. కడీలోని ఓ ఆస్పత్రికి బాధితుడిని హుటాహుటిన తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుహరంలోకి అకస్మాత్తుగా గాలి రావడంతో అంతర్గత గాయాలతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. రెచ్చగొట్టడంతోనే తాను సరదాగా అలా చేయాల్సి వచ్చిందని నిందితుడు చెప్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సరదాగా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
ఏయ్ ఆపు.. నోర్ముయ్: ప్రభుత్వాధికారిణి జులుం!
బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ఆడదానిగా ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోలేకపోయిందని, అధికారం ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తుందా? అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మోదీనగర్‌లో పదేళ్ల అనురాగ్ భరద్వాజ్ అనే కుర్రాడి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బుధవారం ఎప్పటిలాగే తన స్కూల్ బస్సులో వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా బండి నడపడం, హఠాత్తుగా మలుపులు తిప్పడంతో.. అనురాగ్ తన తల బయట పెట్టి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ మరోసారి మలుపులు తిప్పడంతో.. ఓ స్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో డ్రైవర్, బస్సులో ఉన్న మరో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిట్నెస్ లేని బస్సును నడిపించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా.. అనురాగ్ తల్లిదండ్రులతో పాటు మరికొందరు పేరెంట్స్ ధర్నాకు దిగారు. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం మీద ఏప్రిల్ 1వ తేదీనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బతికేవాడని రోదిస్తూ నినాదాలు చేసింది అనురాగ్ తల్లి నేహా. ఈ క్రమంలో.. మోదీనగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చారు. ‘‘ఎందుకు అర్థం చేసుకోవట్లదమ్మా? చెప్తున్నాగా నోరు మూస్కో’’ అని నేహాను గద్దించింది శుభాంగి. ‘చనిపోయింది నీ కొడుకా? నా కొడుకు?’’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది నేహా భరద్వాజ్. దీంతో కోపోద్రిక్తురాలైన శుభాంగి.. ఎన్నిసార్లు చెప్పాలి. అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నా.. నీ కొడుకు చచ్చాడు’’ అంటూ నోరు పారేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. స్కూల్‌యాజమాన్యంపై చర్యలతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను తక్షణమే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరిశీలించాలని ఆదేశించాడు. అయితే అధికారిణిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో.. ఆమెపై వేటు వేయాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. అయితే ప్రమాదంలో కుర్రాడి తప్పే ఉందని, వాంతులు వస్తున్న విషయం బస్సులో ఉన్న టీచర్‌కు చెప్పకుండా తల బయటకు పెట్టాడని ఎస్డీఎం శుభాంగి శుక్లా అంటున్నారు. చదవండి: యువకుడ్ని లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే -
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ సంతాపం..
-
దియోఘర్ రోప్‌వే ప్రమాదం: 40 గంటల తర్వాత..
Deoghar Ropeway Accident: జార్ఖండ్: దియోఘర్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. గందరగోళం, సరైన రక్షణ చర్యలు లేకుండానే సహాయక చర్యలు చేపట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. మంగళవారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. త్రికూట్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఎయిర్‌ఫోర్స్.. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రజల్ని కాపాడడమే లక్ష్యంగా జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరిగినందుకు చింతిస్తున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని అని ప్రకటించారు. అయితే.. #Deoghar tragedy - one killed while rescue #DeogharRopewayAccident pic.twitter.com/j0i7RvRUyS — Amit Shukla (@amitshukla29) April 11, 2022 మంగళవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యాక మృతుల సంఖ్య మూడుకి పెరిగిందని సమాచారం. త్రికూట్ హిల్స్ ప్రమాదం నుంచి మొత్తం 43 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో 12 మందికి గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించింది జార్ఖండ్ హైకోర్టు. ఏప్రిల్ 26న ఈ కేసులో వాదనలు విననుంది. అయితే అంతకు ముందు.. దర్యాప్తు నివేదికను జార్ఖండ ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక మంగళవారం ఉదయం 5 గంటల నుంచే రెస్క్యూ సిబ్బంది చర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ పది మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. దేశంలోనే 766 మీటర్ల పొడవైన అతిపెద్ద రోప్‌వే టూరిజంగా పేరున్న త్రికూట్ రోప్‌వేపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. The Indian Air Force @IAF_MCC continues rescue operations of stranded people at the #DeogharRopewayAccident site Operations re-commenced early in the morning today & progressing briskly @SpokespersonMoD @drajaykumar_ias @SWComd_IA @suryacommand @salute2soldier @adgpi @mygovindia pic.twitter.com/I8DguVV2IO — PRO Jaipur MoD (@PRODefRjsthn) April 12, 2022 శ్రీరామ నవమి రోజున ఆనందంగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దేవ్‌గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో బాబా బైద్యనాథ్ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతంపై వెళ్లేందుకు రోప్ వే ఎక్కుతుంటారు. ఆదివారం ఆ రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు సాంకేతికలోపంతో ప్రమాదానికి గురయ్యాయి. కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. పలువురు గాయపడగా.. 12 క్యాబిన్లలో 50 మంది 19 గంటలకుపైగా చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఈ ప్రమాదం జరగ్గా.. సుమారు 40 గంటలపాటు కేబుల్ కార్లలో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగింది. #DeogharRopewayAccident: A woman fell during the rescue operations after her rope broke. She was immediately rushed to the hospital for treatment where she was declared brought dead pic.twitter.com/WHtN6orOkM — Zee News English (@ZeeNewsEnglish) April 12, 2022 గాల్లోనే ప్రాణాలు గాల్లోనే.. ఇదిలా ఉండగా.. రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రతికూల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా సహాయక చర్యలు మొదలుకాగా.. రెస్క్యూ ఆపరేషన్ సాగదీతగా కొనసాగడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రాకేష్ నందన్ అనే మధ్యవయస్కుడు సేఫ్టీ బెల్ట్ తెగిపోయి లోయలో పడిపోవడంతో మరణించాడు. మరో మహిళ తాడు తెగి పడిపోవడంతో మరణించింది. రోప్ వే కార్లు అత్యంత ఎత్తులో ఉండడం, పైగా పొగమంచు కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్ల సాయంతో ఆహారం, నీటిని సరఫరా చేశారు అధికారులు. అయినప్పటికీ విమర్శలు చల్లారడం లేదు. -
విషాదం: సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. సంబంధిత వార్త: ఆ ముగ్గురూ ఎక్కడ? -
విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ముగ్గురిలో రంజిత్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా.. రంజిత్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది
ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్ అందిస్తూ అభయం అందించినా.. భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. నాన్‌స్టాప్ ఆపరేషన్ పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. Morocco moves a mountain to save a child 🇲🇦#SaveRayan 🇲🇦 humanity first ✊🏿✊🏿 pic.twitter.com/fp2jaSW8fL — Distinguished Senator (@Senatorisiaq) February 5, 2022 Minutes after the announcement of the death of the child #Rayan in Morocco, a young man from Palestine, Hamza Mansour, has a child and calls him #Rayan, in solidarity with the cause of the Moroccan child Rayan and in honor of his memory 💔🇲🇦🇵🇸 #Ryan pic.twitter.com/9m28efE78x — Simø Elyouzghi (@Mohamed365076) February 6, 2022 బా అంకుల్ కంటతడి పెట్టిన వేళ.. రయాన్ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్‌స్టాప్‌గా పని చేసిన బా అంకుల్.. చివరికి చిన్నారి రయాన్ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు. Rest In Peace to Rayan 👼🏻 So sad. Was praying he would make it out of the well safe, but God had other plans for this little boy 💔Praying for his family 🙏🏼 #Rayan pic.twitter.com/6ESpSoehFT — ENISA (@IAmENISA) February 5, 2022 All the love & respect to Ba (uncle) Ali who dug with his hand for more than 100 straight hours to help in Rayan's rescue operation. Ba Ali, a well-drilling expert who never cared about the looming risk & insisted on contributing his long experience to save the little #Rayan. 😞 pic.twitter.com/escoatEs8Z — Zouhir • ⵣⵓⵁⵉⵔ (@oskai_z) February 6, 2022 #Rayan may have not survived but they are still heroes. Along with parents of Ryan No one can estimate the immense pain of the rescue workers who worked 24x7 to save him May Allah grant them paradise also 🤲🏽 #Ryan#PrayforRayan #ريان_المغرب #الطفل_ريان pic.twitter.com/C4948V9mbN — Mubeen ❄️ (@MubeenFatma) February 5, 2022 -
కరెంట్ తీగలు తెగిపడి 26 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్లో హై వోల్టేజ్ కేబుల్ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్షాసా శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?
Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్ గీవెన్ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్ నుంచి ఎవర్ గీవెన్‌ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. సూయజ్‌లో ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్ గీవెన్ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మూడు నెలల తర్వాత సూయజ్ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్ నౌకను సూయజ్ కెనాల్ అథారిటీ సీజ్ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్ బ్లాక్ అయినందుకు గాను 916 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్ కెనాల్ అథారిటీ, ఎవర్‌గీవెన్ నౌక యాజమాన్యమైన షోయ్ కిసెన్ ఖైషా, ఇన్సురెన్స్ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్‌గీవెన్ నౌకను జులై 7న రిలీజ్ చేశారు. సూయజ్ టూ ఇంగ్లండ్ సూయజ్ కెనాల్ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌టోవ్ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆగస్టు 20న ఇంగ్లండ్ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్ గీవెన్ ఆగస్టు 20న మరోసారి సూయజ్ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్ కెనాల్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది. 22వ సారి ఎవర్‌గీవెన్ నౌకను తైవాన్‌కు చెందిన తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ షిప్టింగ్ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్‌గీవెన్‌పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్ కాలువను దాటింది. -
వైరల్ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం
హైదరాబాద్ : తమిళ స్టార హీరో విశాల్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమిళ స్టార్ హీరో విశాల ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా విశాల్ తలకు గాయమైంది. డూప్ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్ తీసుకోకుండా విశాల్ నటించడం విశేషం. ఇక ఈ ప్రమాదంపై హీరో విశాల్ స్పందిస్తూ.. తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్ తప్పేమీ లేదని చెప్పారు. టైమింగ్ మిస్ అయ్యిందని, అయినా యాక్షన్ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమేనని పేర్కొన్నారు. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేశామని, యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు ఫైట్ మాస్టర్ రవివర్మకు థ్యాంక్యూ అని విశాల్ పేర్కొన్నారు. ఫైట్ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక విశాల్31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. A close call,lucky escape,no fault of de stunt artist,just mistiming,mishaps do happen in action sequences, God willing&with all blessings,back 2 shoot&successfully done fight sequence&continuing shoot @ Hyd tks 2 RaviVarma Master 4 lovely fight sequence,will be a treat 2 watch pic.twitter.com/3wE61jjZ1U — Vishal (@VishalKOfficial) June 18, 2021 చదవండి : Vishal31 : మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన విశాల్ -
మరో విషాదం : పాపులర్ సింగర్ దుర్మరణం
సాక్షి,న్యూఢిల్లీ : కేరళకు చెందిన ప్రసిద్ధ కర్ణాటక, హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలో చికాగోలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. జయరాజ్‌కు భార్య, మేఘన, గౌరీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా కర్ణాకట సంగీతంలో 14 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన జయరాజ్ నారాయణన్ శాస్త్రీయ కళాకారుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శాస్త్రీయ,భక్తిగీతాలను పాడారు. కేరళలో పుట్టి పెరిగిన జయరాజ్ పలు ప్రపంచ వేదికలపై భారతీయ సంగీత గొప్పదనాన్ని చాటిచెప్పారు. అమెరికాలో క్లాసికల్, సెమిక్లాసికల్ అనేక కన్సర్ట్లు నిర్వహించారు. ఈ క్రమంలో చిన్న వయస్సులోనే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. -
విశాఖ తీరంలో విషాదం
-
కలియుగాన్ని చూడాలంటే..
ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగంలో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నటి స్వర భాస్కర్ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్ చేశారు. మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్ రేప్ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
పోలవరం పనుల్లో అపశృతి
సాక్షి, పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాజెక్టు స్పిల్‌వే 32వ బ్లాక్‌లో సోమవారం ఉదయం గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్ సహాయంతో గేట్లు దించుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన భీమిలేష్ కుమార్ రామ్ (22)పై రాడ్డు పడి తీవ్రగాయాలయ్యాయి. పోలవరం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. 15వ బ్లాక్‌లో పనిచేస్తున్న సతీష్ అనే కార్మికుడు స్పిల్‌వే పైనుంచి జారిపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని పోలవరం వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్సకు రాజమండ్రికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే భీమిలేష్ మృతిచెందాడంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వడంతో అక్కడున్న ఓ వాహనం స్వల్పంగా దెబ్బతింది. అక్కడి నుంచి 150 మంది కార్మికులు నవయుగ గెస్ట్‌హౌస్‌కు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. తమకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో లేబర్ కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. -
చేబ్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర ప్రమాదం; ఆటో నుజ్జు నుజ్జు
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం బీతావహంగా ఉంది. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విశాఖపట్నం జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో గృహప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చేబ్రోలు రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
హెలికాప్టర్ రెక్క తగిలి..
కఠ్మాండు: మానస సరోవర యాత్రకు వెళ్లిన ముంబైకి చెందిన భక్తుడు మంగళవారం ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ వెనుక ఉండే ఫ్యాన్ రెక్క తగిలి నేపాల్‌లో మరణించారు. ఫ్యాన్ రెక్క తగలడంతో ఆయన తల తెగి ఘటన స్థలంలోనే చనిపోయారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. హిల్సా ప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద ఉన్న హెలికాప్టర్‌ను ఎక్కేందుకు ఆయన వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుణ్ని కార్తీక్ నాగేంద్ర కుమార్ మెహతా (42)గా గుర్తించామనీ, సిమికోట్‌లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. -
కలచివేసిన రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు : మితిమీరిన వేగం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట వద్ద చోటుచేసుకుంది. దంపతులతో సహా మూడేళ్ల చిన్నారి దుర్మరణం పాలయింది. మృతులు తాడేపల్లికి చెందిన శ్రీకాంత్, సరిత, అక్షరగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన తీరు, మృతుల్లో దంపతులతో పాటు మూడేళ్ల పాప ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బంధువులను రైల్వేస్టేషన్లో దింపిరావడానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇసుక లారీల వేగంపై గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సమీక్షలు నిర్వహించినప్పటికి.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. ఈ ఘటన పై ఆగ్రహించిన బాధితుల బంధువులు మంగళగిరి - విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు దుర్మరణం
నెల్లూరు: గూడూరు మండలం కొండగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరుజిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామస్తులుగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఏర్పేడు ప్రమాదంలో కుట్రకోణం'
-
చెన్నైలో ఘోర ప్రమాదం
చెన్నై: చెన్నైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పల్లవాన్పాంగన్ సమీపంలో ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు అదుపుతప్పి కింద పడిపోయారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు యువకులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత కూన వెంకటేశ్‌కు గాయాలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కూన వెంకటేష్ గౌడ్ ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. షిర్డీకి కారులో బయలుదేరిన ఆయన.. తుల్జాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కారు బెలూన్లు తెరుచుకోవడంతో కూన వెంకటేష్ గౌడ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
కారు ఢీకొని ఆర్ఎంపీ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నార్సింగికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కొండయ్య(58) మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న కొండయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
బెంగాల్ లో రోడ్డు ప్రమాదం.. 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
కోల్ కతాః పశ్చిమబెంగాల్ అలిపుర్దౌర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్నఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 17 మంది పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకొన్న స్కూల్ బస్ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలిపుర్దౌర్ జిల్లా మదరిహత్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో స్థానిక ప్రైవేట్ ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ను.. వేగంగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్ళేందుకు బస్ లో బయల్దేరిన విద్యార్థుల్లో 17 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని అలిపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచీ తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 11 మందికి గాయాలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిలో ఆరుగురికి కాళ్లూచేతులు విరగ్గా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉలవపాడు మండలం రామాయపట్నం వాసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగులను సంప్రదించగా.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందని, కారు వెనుక టైరు బాగా దెబ్బ తినడంతో అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొని తిరగబడిందని చెప్పారు. దాంతో ముందుసీట్లో కూర్చున్న డ్రైవర్ దాసు, భార్య సత్యవాణి బయటకు పడిపోయారని, కారు అలాగే 50 అడుగుల పాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయిందని అన్నారు. రోడ్డు మీద పడిపోవడంతో తలకు గాయాలై సత్యవాణి, డ్రైవర్ వాసు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు తిరగబడిన కారు -
భర్తను విదేశానికి పంపేందుకు వెళుతూ..
హైదరాబాద్: భర్తను విదేశానికి సాగనంపేందుకు పిల్లలతో సహా ఎయిర్ పోర్టుకు బయలుదేరిన మహిళ మృత్యువాతపడింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాధురి (28) అనే మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. కీసర సమీపంలోని నాగారంలో మాధురి కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేందుకు పిల్లలతోపాటు కారులో బయలుదేరారు. ఔటర్ పై తుక్కుగూడ వద్ద.. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిని కనుగొనడంలో పొరపాటు తలెత్తడంతో రోడ్డు మధ్యనే బ్రేక్ వేశారు. దీంతో వెనుకనుంచి వస్తోన్న మరో కారు మాధురి కుటుంబం ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
టిప్పర్ రూపంలో మీదపడ్డ మృత్యువు
- ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోపై టిప్పర్ బోల్తా: 16 మంది దుర్మరణం - మృతుల్లో ఏడుగురు చిన్నారులు.. ఇటుక బట్టీల్లో కూలీలుగా జీవనం - భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం వద్ద అర్ధరాత్రి ఘటన భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16 మంది మృతిచెందారు. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మహారాష్ట్ర బల్లాడ్ గ్రామానికి చెందిన 18 మంది ఇటుక కార్మికులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భైంసా వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టి ఆటోపై పడింది. దాంతో ఆటో నుజ్జునుజ్జై అందులో ప్రయాణిస్తున్న 16 మంది మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలతో సహా నలుగురు పురుషులు ఉన్నారు. ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అధికారులు క్రేన్ తో టిప్పర్‌ను తొలగించారు. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బలిచ్చేందుకు తీసుకెళ్తున్న మేక ప్రమాదం నుంచి బయటపడింది. మృతులు వివరాలు: గణపతి, రత్నాభాయి, నారుంగ్, వందనభాయి, రాజేష్, మహేంద్ర, దీప, సాయి ప్రసాద్, సుశీల భాయి, అర్జున్, ప్రియాంక, ప్రేమ్, చాకులి, శ్యామలాభాయి, సంపంగి భాయి, అర్చన. -
ఉద్యోగం కోసం వెళుతూ నవదంపతుల దుర్మరణం
భూత్పూర్: వివాహం జరిగి నెల రోజులైనా గడవకముందే నవదంపతులు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయలుదేరిన ఆ ఇద్దరూ అనూహ్యరీతిలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి పట్టణంలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన కాటి రవికుమార్‌కు (28), తెల్కపల్లి మండలంలోని చిన్నముద్దునూరు వాసి శ్రీలత (25)తో నెలరోజుల క్రితమే వివాహమైంది. రవికుమార్ వనపర్తిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, శ్రీలత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగానూ పనిచేస్తున్నారు. కాగా, నర్సింగ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు శ్రీలత ఊరు చిన్న ముద్దునూరు నుంచి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు బైక్ పై బయలుదేరారు. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. భర్త అక్కడికక్కడే చనిపోగా, భార్య శ్రీలత జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మార్చురీలో రవి, శ్రీలతల మృతదేహాలు. -
లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలు పోర్టు క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: పది మంది దుర్మరణం
చెళ్లకెరె రూరల్ (కర్ణాటక) : చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా హెగ్గెరె వద్ద బీదర్-శ్రీరంగపట్నం రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందాగా, ఐదుగురు గాయపడ్డారు. మృతులను బళ్లారిలోని పార్వతీనగర్‌లో ఉన్న బీసీఎం హాస్టల్ విద్యార్థులుగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. బీసీఎం హాస్టల్ విద్యార్థులు బళ్లారిలోని పరిపూర్ణ ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్లో శిక్షణ పొందారు. వీరిని ఇంటర్వ్యూల కోసం సంస్థకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి గురువారం రాత్రి క్రూజర్ వాహనంలో బెంగళూరుకు పిలుచుకెళ్లాడు. బెంగళూరు నుంచి తిరిగి వస్తుండగా క్రూజర్ డ్రైవర్ అజాగ్రత్తతో వాహనం నడిపాడు. ముందు వెళుతున్న ప్రైవేట్ బస్సును అతివేగంగా ఓవర్టేక్ చేయబోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీకొంది. వెనుక వస్తున్న ఎస్ఆర్ఈ బస్సు కూడా అదే వేగంతో క్రూజర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ చంద్రేగౌడ(25), శాంతి(20), సుధ (21), సరిత (22), జయశ్రీ (22), భారతి (20), గిరిజ(19), హర్షిత (16) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రుతి(20), కావ్య (21) చిత్రదుర్గం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రదీప్, జ్యోతి, నాగరత్న, రేణుక, హులిగమ్మ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం చిత్రదుర్గం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని చిత్రదుర్గం జిల్లా అదనపు ఎస్పీ పరశురాం, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కె.సమీవుల్లా, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేష్ పరిశీలించారు. -
కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..
కన్న కొడుక్కి సంతోషాన్ని పంచేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. తమిళనాడులోని అత్తూరుకు చెందిన సగ్గు బియ్యం ఫ్యాక్టరీ యజమాని బాలాజీ(28)ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలాజీ తన స్నేహితుడితో కలిసి కుమారునికి బొమ్మ కొందామని సేలం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వాల్పడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇతని కారు, ఎదురుగా వస్తున్న మినీలారీ మీదికి దూసుకుపోయింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. -
బస్సులోకి దూసుకొచ్చిన మృత్యువు
- పక్క బస్సు రాడ్ గొంతులో దిగడంతో యువకుడి మృతి - రవీంద్రభారతి చౌరస్తా వద్ద దారుణం హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదిలాడు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో రవీంద్రభారతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వి.ఈశ్వర్రావు(23) కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ క్యాంటీన్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని లింగంపల్లి నుంచి కోఠి వెళ్తున్న 127కే (ఏపీ28జెడ్0547) బస్సులో బయల్దేరాడు. రవీంద్రభారతి సిగ్నల్ వద్ద.. పక్కన ఉన్న మరో మెట్రో బస్సును ఓవర్టేక్ చేస్తూ బస్సు ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మెట్రో బస్సు అద్దాల వద్ద ఉన్న ఇనుప రాడ్డు 127కే బస్సు చివర అద్దానికి తగిలి.. నేరుగా లోపలికి దూసుకొచ్చింది. బస్సు వెనుక సీట్లో కిటికీ వద్ద కూర్చున్న ఈశ్వర్రావు గొంతులోకి దిగింది. దీంతో ఈశ్వర్రావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం
- మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు - విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం: విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు నాలుగు రోజుల కిందట స్పోర్ట్స్ మీట్లో భాగంగా అమలాపురం వెళ్లారు. సోమవారం తిరిగి అమలాపురం నుంచి ధనుంజయ ట్రావెల్స్ బస్సు(ఏపీ 28 టీబీ 1166)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో గొల్లపూడి సమీపంలోని సూరయ్యపాలేనికి వచ్చేసరికి మలుపు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు విద్యార్థులు సీట్ల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతిచెందారు. డ్రైవర్, ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు సీట్ల కింద చిక్కుకుపోయాయి. మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతిచెందిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు: మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడే భోజనాలు చేశారని సమాచారం. బస్సు డ్రైవర్ ను వేముల వెంకట శివయ్య గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనా స్థలికి ప్రిన్సిపాల్ ప్రభాకర్, డీఎంఈ రమణి చేరుకున్నారు. విద్యార్థులను ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించాల్సిన నెంబర్లు: 86868 64656, 94407 52310, 040 24653992 -
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్‌నగర్: శివరాత్రి పండుగను స్వస్థలంలో జరుపుకోవాలనుకుని కారులో బయలుదేరిన ఓ కుటుంబం.. మార్గం మధ్యలోనే మృత్యులోకాలకు చేరుకున్న విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి తమ స్వస్థలం కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు సోమవారం కారులో బయలుదేరిన కుటుంబం.. కొడంగల్ శివారుల్లోని చిట్లపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా దూసుకొచ్చిన లారీ వారి కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు నుజునుజ్జు కావడంతో మృతదేహాల వెలికితీత ఇబ్బందికరంగా మారింది. -
ఘోర రోడ్డుప్రమాదం: 11 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందారు. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులతో వెళుతున్న జీప్ ధాటియా ప్రాంతానికి వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిప్రి బజార్ కు సమీపంలోని డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన ఈ ఘటనలో ట్రక్క్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. -
రైలు ఢీకొట్టి నలుగురు చిందరవందరగా..
ముంబయి: నలుగురు కాంట్రాక్టు రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో నిమగ్నమై ఉన్న నలుగురు రైల్వే గ్యాంగ్మెన్లను ఓ లోకల్ రైలు ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా ఉదయం 6.15గంటల నుంచి 6.30 గంటల మధ్య ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు కాంట్రాక్టు రైల్వే గ్యాంగ్ మెన్ ఉద్యోగులు ఉదయాన్నే పనుల నిమిత్తం సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య పట్టాలపక్కన నడుస్తుండగా అనూహ్యంగా చత్రపతి శివాజీ టర్మనల్కు చెందిన లోకల్ రైలు వారిని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. కొంచెం చీకటిగా ఉండటం వల్ల రైలు రాకను గుర్తించపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 3, 2013లో కూడా నలుగురు గ్యాంగ్ మెన్లు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన.. మృతులు కడప జిల్లావాసులు మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మర ణం చెందారు. మృతులు ఏపీలోని కడప జిల్లావాసులు. కడప జిల్లా చిన్నమండెం మండల కేంద్రానికి చెందిన హరి కిరణ్, స్వప్న, బంధువులు చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన శ్రీధర్, జ్యోతి దంపతులు, వీరి కుమారుడు సాయితో కలసి కడప జిల్లా మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి తిరిగి హరి కిరణ్‌కు చెందిన కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని భూత్పూర్ సమీపంలోని ఫ్లైఓవర్ దిగిన వెంటనే ముని రంగస్వామి దేవాలయం ఎదుట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పింది. పక్క నుంచి వెళ్తున్న లారీ కిందకు కారు వెళ్తుం దేమోనని భావించి హరికిరణ్ స్టీరింగ్‌ను డివైడర్ వైపు తిప్పాడు. దీంతో కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలి వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్(30) జ్యోతి(27), సాయి(8) అక్కడికక్కడే మృతి చెందా రు. తీవ్రంగా గాయపడిన హరి కిరణ్(27), స్వప్నలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా హరికిరణ్ మృతి చెందాడు. నిద్రమత్తులో హరికిరణ్ డ్రైవింగ్ చేస్తుండడంతో మార్గమధ్యంలో పలుసార్లు కారు అదుపు తప్పబోయింది. ఈ క్రమంలో భార్య స్వప్న అతడిని హెచ్చరించి అప్రమత్తం చేసింది. హరికిరణ్ హైదరాబాద్ బోడుప్పల్లో భార్యతో కలసి నివాసముంటున్నాడు. అతడు మెగాటెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. శ్రీధర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పీఈటీ. హరికిరణ్, స్వప్నలకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి పిల్లలు లేరు. -
వోల్వో బస్- లారీ ఢీ: ఒకరి మృతి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు వద్ద హౌవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు పాలమూరు 4 లేన్ల వంతెనపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికుడు ఒకరు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తిరుపతికి చెందిన శ్రీరామ్ ఆదిత్య(18) గా గుర్తించారు. శ్రీరామ్ విశాఖపట్నం గీతం కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రాడ్డు ఆదిత్య శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విజయనగరం నుంచి ఒంగోలుకు వెళుతోంది. -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
పటాన్చెరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన వరుణ్‌తో పాటు పెదనాన్న కుమారుడు అమిత్, స్నేహితుడు జ్ఞాన్దేవ్ కూడా మృతి పాల ట్యాంకర్‌ను అమిత వేగంతో ఢీకొట్టిన స్కోడా కారు పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను చుట్టి ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ (21)తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ పవార్‌తో పాటు అమిత్ పవార్ (21), జ్ఞాన్దేవ్ (21) మరణించారు. మరో యువకుడు రాహుల్ పవార్ (22) తీవ్రగాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుభకార్యానికి వెళ్లివస్తూ.. పేర్వారం రాములు కుమార్తె రేవతి కుమారుడే వరుణ్ పవార్. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య వద్దే ఉంటున్నాడు. అమిత్ పవార్, రాహుల్ పవార్ వరుణ్ పెదనాన్న కుమారులు. మంగళవారం రాత్రి పటాన్చెరులో ఓ స్నేహితుడి ఇంట్లో శుభాకార్యానికి వరుణ్ పవార్, అమిత్పవార్, రాహుల్పవార్లతో పాటు వారి స్నేహితుడు కుందన్‌బాగ్‌కు చెందిన జ్ఞాన్దేవ్ కలసి వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో పటాన్‌చెరులోని ఫాంహౌస్‌లోనే ఉండి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. ఉదయం 6.30 ప్రాంతంలో ఓఆర్ఆర్పై కోకాపేట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అమిత వేగంతో ఉన్న వారి వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్ (టీఎస్ 08 యూఏ 0086)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్, అమిత్, జ్ఞాన్దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ కారును వరుణ్ నడుపుతుండగా.. ముందు సీట్లో జ్ఞాన్దేవ్, వెనుక సీట్లలో మిగతా ఇద్దరూ కూర్చున్నారు. నుజ్జునుజ్జయిన కారు.. ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న స్కోడా వాహనాన్ని పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అమిత వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోవడంతో తీసేందుకు దాదాపు గంటసేపు పట్టింది. అనంతరం కారు ముందు భాగం నుంచి ఇద్దరి మృతదేహాలను తీసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలోని పేర్వారం నివాసానికి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి పేర్వారం రాములును పరామర్శించారు. మృతదేహాల్ని వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు తరలించారు. ప్రమాదానికి పొగమంచే కారణమా? కోకాపేట్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు ఉన్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే ముందు వెళుతున్న వాహనాన్ని వరుణ్ గమనించక ఢీకొట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాల ట్యాంకర్ వెనుక బంపర్ ఎత్తులో ఉండటంతో పాటు కమాన్పట్టీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదికూడా ప్రమాద తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ్ముళ్లు చనిపోయారు.. అన్నది బతుకుపోరాటం నిజామాబాద్‌కు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే సతీశ్‌పవార్ సోదరులు దిగంబర్ పవార్, సుభాష్ పవార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దిగంబర్ పవార్ కుమారులే రాహుల్, అమిత్. మేడ్చల్‌లోని సీఆర్పీ కాలేజీలో రాహుల్ బీటెక్ ఫైనలియర్, అమిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అమిత్ చనిపోగా.. రాహుల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. --------------- నీలో కూతురిని చూసుకుంటున్నా.. నిజామాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుభాష్పవార్, పేర్వారం రాములు కుమార్తె రేవతి దంపతులు. వారికి వరుణ్ (23) ఏకైక కుమారుడు. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య పేర్వారం రాములు ఇంట్లోనే ఉంటున్నాడు. వరుణ్‌ను రాములు భార్య ఇందిర ప్రాణంగా చూసుకుంటారు.11:19 గంటలకు 11/25/2015 ప్రమాదంలో వరుణ్ మరణించడంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారు. ‘నీలో నా బిడ్డను చూసుకుంటున్నా.. ఇక ఎవరిని చూడాలి’ అని ఆమె చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. --------------- టీమ్1లో చేరతానని అన్నాడు ‘‘వరుణ్ బీఆర్క్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చివరి ఏడాది ట్రైనింగ్ పేరిట కాలేజీ బయటే జాబ్ చేస్తుంటారు. వరుణ్‌కు గచ్చిబౌలిలోని టీమ్1 కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బుధవారం అందులో చేరుతున్నానని మంగళవారమే మాకు చెప్పాడు. కానీ అదేరోజున మరణించాడు. వరుణ్ ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం..’’ - ప్రొఫెసర్ కేజేఏబీ బాబు, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
-
అయ్యో ఇస్మాయిల్..!
త్రిసూర్: ఇసాక్ ఇస్మాయిల్‌కు ఇప్పుడు 39 ఏళ్లు. పొలంలేని, ఇల్లు నడవని పరిస్థితుల్లో కొన్నేళ్ల కిందట తల్లి, భార్య, పిల్లల్ని వదిలి, పొట్ టచేతపట్టుకుని పనికోసం గల్ఫ్ వెళ్లాడు... కష్టపడ్డాడు. తాను తిన్నా తినకున్నా ఇంటికి మాత్రం ఠంచనుగా డబ్బు పంపేవాడు. కుటుంబం కుదురుకుంది. ఇక సొంత ఊళ్లోనే బతకొచ్చనే నమ్మకంతో ఇంటిబాటపట్టాడు. ఇస్మాయిల్‌ను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబమంతా ఎయిర్ పోర్టుకు వెళ్లింది. ఆలింగనాల తర్వాత అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ఆనందభాష్పాలు ఆరిపోకముందే ఆ కుటుంబంలో నలుగురి ప్రాణాలు ఆవిరైపోయాయి. కేరళలోని త్రిసూర్ జిల్లా పుతుక్కాడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్మాయిల్ కుటుబంతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి కారు, ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి లోతైన నీటిగుంటలో పడిపోయింది. ఈ ఘటనలో ఇస్మాయిల్ సహా అతని తల్లి హొవమ్మ(58), భార్య హఫ్సాత్ (32), కూతురు ఇర్ఫానా (3)లతోపాటు బావమరిది మన్సూర్(42), డ్రైవర్ కృష్ణప్రసాద్(36) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్నపోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని, ఇస్మాయిల్ కొడుకు హయాస్(10)ను మాత్రం కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడ్డ హయాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
లారీ కిందికి దూసుకెళ్లిన బైక్: ఇద్దరి మృతి
నాయుడుపేట: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ కిందపటంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న లారీ 16వ నంబరు జాతీయ రహదారిలోని నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే వేంగంగా వచ్చిన ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. -
లారీ డ్రైవర్ సజీవదహనం
-
లారీ డ్రైవర్ సజీవదహనం
ద్వారకాతిరుమల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రెండు లారీల మధ్య ఇరుక్కోవడంతో.. మంటల నుంచి తప్పించుకోలేక అందులోనే చిక్కుకొని మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నారాయణ పురం పంచాయతి పరిధిలోని బుట్టాయగూడెం వద్ద సోమవారం ఉదయం జరిగింది. రాజమండ్రి నుంచి చింతపండు లోడుతో వస్తున్న లారీ, ఏలూరు నుంచి కాగితాల లోడుతో వస్తున్న లారీ బుట్టాయగూడెం వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాగితాల లోడు లారీలో ఉన్న డ్రైవర్ రెండు లారీల మధ్య ఇరుక్కున్నాడు. అదే సమయంలో లారీ బ్యాటరీలలో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడి కాగితాలకు అంటుకోవడంతో.. మంటలు ఒక్కసారిగి లారీ అంతా వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. -
బొగ్గు టిప్పర్, బైక్ ఢీ: ఇద్దరు యువకుల దుర్మరణం
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్, బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామానికి చెందిన జొన్నల శ్రీను(17), చాట్ల రాంబాబు(24) మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన శివకృష్ణను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
-
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు విద్యార్థుల మృతి
మునగాల: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను కోదాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
రక్తమోడిన రాజీవ్ రహదారి
మెదక్: రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. -
పుష్కర ప్రయాణంలో అపశ్రుతి
- చిన్నారి మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు కొవ్వూరు: పుష్కర ప్రయాణంలో అపశ్రుతి దొర్లింది. గుంటూరు జిల్లా నుంచి పుణ్యస్నానం కోసం పశ్చిమగోదావరికి బయలుదేరిన భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న నందిని (7) అనే చిన్నారి అక్కడికక్కడే మరణించగా మరో ఎనిమిదిమందికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పెదపాడు మండటం తిమ్మాపురానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ప్రమాదంలో ఇద్దరు 'పుష్కర' భక్తుల మృతి: 9 మందికి గాయాలు
గండేపల్లి: గోదావరి పుష్కరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పుణ్య స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమైన విజయనగరం జిల్లా వాసులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లికి సమీపంలో భక్తులు ప్రయాణిస్తోన్న టాటా ఏస్ వాహనం పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలోనూ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. -
బోల్తా పడిన ఆర్టీసి బస్సు - కండక్టర్ మృతి