గాంధీనగర్: దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు తీసిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన కేసులో పోలీసుల చర్యలు మొదలయ్యాయి. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టిన ఓరేవా కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అయితే వాళ్లిద్దరూ మధ్య స్థాయి ఉద్యోగులని తెలుస్తోంది.
బ్రిడ్జి దుర్ఘటన జరిగినప్పటి నుంచి కంపెనీ సీనియర్లు పత్తా లేకుండా పోయారు. వాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జి పునఃప్రారంభ విషయంలో ఒరేవా ఎన్నో తప్పిదాలకు పాల్పడిందని.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ దగ్గరి నుంచి బ్రిడ్జిని తిరిగి ప్రారంభించడం దాకా.. అన్నింట్లోనూ వైఫల్యాలే ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముందు ముందు మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని విచారణ జరుపుతున్న సిట్ ప్రకటించింది.
ఇక ప్రమాదానికి ముందు కొందరు కుర్రాళ్లు.. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తాళ్లను విపరీతంగా ఊపారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు.
#WATCH | An injured survivor in the #MorbiBridgeCollapse recounts the harrowing moment when the suspension bridge collapsed and how he saved himself pic.twitter.com/MWX3HpwqmT
— ANI (@ANI) October 31, 2022
Comments
Please login to add a commentAdd a comment