cable bridge
-
చుక్ చుక్ బండిలో.. వెండి కొండల యాత్ర
(జమ్మూ–కశ్మీర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : 77 ఏళ్ల స్వతంత్ర భారతం నిరీక్షణకు గ్రీన్ సిగ్నల్ లభించింది! 25 ఏళ్ల నాటి ప్రణాళిక పట్టాలెక్కుతోంది! రెండు దశాబ్దాల అకుంఠిత దీక్ష ఫలిస్తోంది!! కశ్మీర్‌ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ మన రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చింది. హిమాలయాల మీదుగా భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన 338 కి.మీ. ‘ఉద్దమ్‌పూర్– శ్రీనగర్–బారాముల్లా’ రైల్వే లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఏకంగా 38 సొరంగాలు (టన్నెళ్లు), 931 చిన్నా, పెద్ద వంతెనలతో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చెనాబ్ వంతెన, దేశంలో మొదటి కేబుల్ రైల్వే వంతెనతోపాటు ఎన్నో ప్రత్యేకతలను ఈ విశిష్ట ప్రాజెక్టు సంతరించుకుంది. వ్యాపార, పర్యాటక, రవాణా రంగాల ప్రగతిని విప్లవాత్మక మలుపు తిప్పుతూ జమ్మూ–కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడనుంది. దేశ రక్షణ వ్యూహాత్మక అవసరాలను తీర్చడంలోనూ అత్యంత కీలకంగా మారనుంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతాపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దీన్ని చేపట్టారు. మొత్తం రూ.41 వేల కోట్లతో చేపట్టి.. 2025 జనవరిలో ప్రారంభించనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్ ప్రధాన అంశాలు ఇవీ..27 సొరంగాలు.. 37 వంతెనలు ఉద్దమ్‌పూర్– శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన 111 కి.మీ. కట్రా– బనిహల్ లైన్ నిర్మాణాన్ని రైల్వే శాఖ తాజాగా పూర్తి చేసింది. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు, లోతైన లోయలు, అతి వేగంగా ప్రవహించే నదులతో కూడుకున్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉండగా వాటిలో 27 ఈ లైన్లోనే ఉండటం గమనార్హం. ఇక 37 వంతెనలు కూడా ఈ లైన్లోనే నిర్మించారు. వాటిలో అత్యంత ప్రధానమైన చెనాబ్ వంతెన, ఆంజిఖడ్ వంతెనలున్నాయి. హిమాలయ ప్రాంత వాసులకు రైలు రవాణాను అందుబాటులోకి తెస్తూ కొత్తగా రియాసీ, బక్కల్, దుగ్గా, సావల్‌కోట్, సంగల్దాన్, సుంబుర్, ఖరీ రైల్వే స్టేషన్లను నిర్మించారు. హిమాలయాలను తొలిచి ప్రత్యేకంగా నిరి్మంచిన ఎత్తైన ప్రదేశాలు, సొరంగాల వద్ద ఈ రైల్వే స్టేషన్లను నిర్మించడం విశేషం. ఇక మిగిలింది 17 కి.మీ. లైనే కట్రా–రియాసీ మధ్య మరో 17 కి.మీ. మేర రైల్వే లైన్‌ను ఇంకా నిరి్మంచాల్సి ఉంది. ఆ ప్రాంతంలో హిమాలయాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. ఆంజిఖడ్ కేబుల్ వంతెనకు ఆవల ఓ సొరంగాన్ని నిర్మించి ఈ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆ పనులను కొన సాగిస్తూ పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.ఉగ్ర దాడులను తట్టుకునేలా.. చెనాబ్ వంతెన పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 45 కి.మీ. దూరంలోనే ఉండటంతో రక్షణశాఖ సమన్వయంతో రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. వంతెన సమీపానికి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 24/7 సీసీ కెమెరాల నిఘాతో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఒక్కొక్కటి రూ.500 ఖరీదు చేసే ఐదు లక్షల బోల్టులను నిర్మాణంలో వినియోగించారు. ఒకసారి బిగించిన వాటిని ఇతరులు విప్పలేని రీతిలో తయారు చేసిన భారీ బోల్టులను వంతెన నిర్మాణంలో ప్రత్యేకంగా వాడారు. చెనాబ్ వంతెన సమీపంలో డ్రోన్లు ఎగుర వేయడాన్ని నిషేధించారు. సరిహద్దులకు అవతలి వైపు నుంచి 40 కేజీల గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంతెనపై ఒక అడుగు ఎత్తులో ఇనుప జాలీలతో ఫ్లోర్ నిర్మించారు. గ్రెనేడ్లు విసిరినా అవి నేరుగా వంతెనను తాకకుండా ఈ ఇనుప జాలీలు అడ్డుకుంటాయి. దేశంలో తొలి రైల్వే కేబుల్ వంతెన కట్రా– రియాసీ సెక్షన్లో అంజీఖడ్ వద్ద దేశంలోనే తొలి రైల్వే కేబుల్ వంతెనను నిర్మించారు. భూకంపాలు, వరదలు, ప్రకృత్తి విపత్తులకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో రెండు కొండలను అనుసంధానిస్తూ కేబుల్ వంతెన నిర్మాణమే సరైన పరిష్కారమని ఇంజనీరింగ్ నిపుణులు నిర్ణయించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ సాంకేతిక పరిశోధన సహకారంతో 725.5 మీటర్ల వంతెనను నిర్మించారు. అందులో 290 బలమైన కేబుల్ వైర్లతో నిర్మించిన వంతెన 473.25 మీటర్ల పొడవు ఉంటుంది. పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా..చలి కాలంలో పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా ఉండేందుకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులను నిరి్మంచారు. దీంతో పట్టాలపై చేరే నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. చలికి గడ్డ కట్టదు. రైళ్లకు నీటి సరఫరా కోసం రక్షణ శాఖ సహకారంతో హీటెడ్ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలోని టాయిలెట్లలో గీజర్ల సదుపాయం ఉంటుంది. సెంట్రల్లీ హీటెడ్ స్లీపర్ వందే భారత్ రైళ్లను ఈ లైన్లో ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బ్రిడ్డిపైన ఉన్న డివైడర్ని ఢీకొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై అతివేగంగా బైక్ నడపడటంతో డివైడర్‌ను ఢీకొని వంతెనపై నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు యతి్నస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు. Madhapur Traffic Police's intervention saved a woman's life as they prevented her from jumping off the Durgam Cheruvu Cable bridge.A 25-year-old woman has been taken to Vikram Hospital for treatment after reportedly ingesting pills.#CyberabadTrafficPolice pic.twitter.com/e22GP5bYL7— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 17, 2024 -
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహ్మ, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటే వరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన 23 మందికి చలానా విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని పేర్కొంటున్నారు. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి!
కరీంనగర్: న్యూ ఇయర్ సందర్భంగా లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా! -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
Hyderabad: డ్రైవర్ అత్యుత్సాహం.. కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతోవ వైరల్‌గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటుమరో ఇద్దరికి స్పల్పంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యంత వేగంతో ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత -
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్.. వీకెండ్ మస్తీతో ఉర్రూతలు (ఫోటోలు)
-
HYD: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న కారు కేబుల్ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్తున్న బ్రీజా కారు(B.No: TS09FB4896) పల్టీ కొట్టింది. కాగా, కారు డ్రైవర్ హైస్పీడ్‌లో ఉండటం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కారును ఘటనా స్థలం నుంచి తొలగించారు. ఇది కూడా చదవండి: సంధ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. ఆటోడ్రైవర్‌కు అర్ధరాత్రి ఫోన్.. -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
HYD: కేబుల్‌బ్రిడ్జి దగ్గరకు వెళ్తున్నారా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.!
హైదరాబాద్(మాదాపూర్): కేబుల్‌బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్‌బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మాదాపూర్‌లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. ►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది. ►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు. ►కేబుల్‌బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్‌పోలీసులు తెలిపారు. ►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు. ►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు ► కాగా సందర్శకులు కేబుల్‌బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు. ►అనుమతులు లేకుండా డ్రోన్లు వాడకూడదన్నారు. ►లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు జమీందర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు. ►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు ►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు. ►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు. ►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమస్యలకు చావు పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్‌ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు. –మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి -
ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారు?
బంజారాహిల్స్: ట్రాఫిక్‌లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి డింపుల్ హయతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఫొటోను ట్యాగ్ చేస్తూ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి ఘోరంగా ఉందని, ఇంటికి చేరుకోవాలంటే గంటకుపైగా సమయం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఒక వేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి..? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా..? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు అంటూ పోస్టు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నగర వాసులు ఆమెను సమర్ధిస్తూ రీ ట్వీట్లు చేశారు. ఆమెను సమర్థించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
ప్రపంచంలోనే రెండవాదిగా తీగెల వంతెన
-
కరీంనగర్ :కేబుల్ బ్రిడ్జి వద్ద అలరించిన ఆటపాటలు (ఫొటోలు)
-
కన్నులవిందుగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
కేటీఆర్ సార్ ఈవెంట్‌కు రారా.. ఫైన్ కట్టాల్సిందే!
-
కేటీఆర్ సార్ మీటింగ్‌కు వస్తారా.. లేకుంటే ఫైన్ కడతారా?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని మహిళా సంఘాలకు బెదిరింపు కాల్ వెళ్లింది. రానిపక్షంలో ప్రతీ ఒక్కరికి రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించిన ఆడియో కాల్ చక్కర్లు కొడుతోంది. అయితే, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ మహిళా సంఘాలకు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ సమన్వయ కార్యకర్త మహిళా సంఘాలకు ఫోన్ చేసి..‘కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వస్తారా.. లేక, ఫైన్ కడతారా?. దశాబ్ది ఉత్సవాల్లో మీరెవ్వరూ ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ కాకపోయినా మేం పట్టించుకోలేదు. మేమే వెళ్లాం.. కానీ, ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్‌కు మాత్రం మంత్రి కేటీఆర్ వస్తున్నారు. కాబట్టి మీరంతా హాజరు కావాలి. ఒక్కో గ్రూప్ నుంచి కనీసం పది మంది రావాల్సిందే. ఎవరైనా ఒకరో, ఇద్దరో ఆరోగ్యపరంగా బాగా లేకపోతే సరేగానీ.. మిగిలిన వాళ్లంతా హాజరు కావాల్సిందే. లేకపోతే.. హాజరుకాని మహిళా సంఘాల్లో ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల జరిమానా వసూల్ చేయమని మేడమే చెప్పారని ఆమె అన్నారు. ఇక, ఈ ఫోన్ కాల్ ఇప్పుడు కరీంనగర్లో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. కేసీఆర్ మీద పోటీకి రెడీ -
కరీంనగర్‌కు మణిహారం.. సుందరమయంగా కేబుల్ బ్రిడ్జి (ఫొటోలు)
-
Karimnagar: అద్భుతం.. ఆకర్షణీయం
ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ 14న వంతెన ప్రారంభించాలి. కానీ.. పనులు పూర్తికాకపోవడం.. ఓ సభలో మంత్రి కాలికి గాయంకావడం తదితర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండురోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. #KarimNagar Cable Bridge 🌉. pic.twitter.com/MJgXbQHadO — Aravind Alishetty (@aravindalishety) June 16, 2023 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యాటకంలో కలికితురాయిగా నిలి చే కేబుల్ బ్రిడ్జిని తొలుత నగరవాసులకు పరిచయం చేయాలని మంత్రి కమలాకర్ నిర్ణయించారు. స్థాని కులు వంతెనపై తిరిగేందుకు వీలుగా ప్రతీ ఆదివా రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. పర్యాటకులను రంజింపజేసేలా మ్యాజిక్ షో, మ్యూజిక్ షో, కళకారుల ఆటాపాటలు తదితర వినోద కార్యక్రమాలు సిద్ధంచేశారు. రకరకాల ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయనున్నారు.దసరా వరకు కు టుంబాలతో వచ్చి సరదాగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వంతెన వద్ద కొరియా సాంకేతికతతో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేపథ్యమిదీ.. వరంగల్ – కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7. కి.మీల దూరం తగ్గించడం, హైదరాబాద్–కరీంనగర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన తర్వాత తెలంగాణలో రెండో బ్రిడ్జి కరీంనగర్‌దే కావడం విశేషం. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో వంతెనను నిర్మించారు. రేపటి నుంచి కార్పొరేషన్ పరిధిలోకి.. వంతెన నిర్వహణ బాధ్యతలు గురువారం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్(ఎంసీకే) చేతుల్లోకి వెళ్లనుంది. వంతెనపై లైటింగ్, పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్ తదితరాలు ఇకపై బల్దియా చూసుకుంటుంది. రెండేళ్లపాటు వంతెనకు సంబంధించిన సాంకేతికపరమైన నిర్వహణను మాత్రం ఆర్ అండ్ బీ అధికారులు చూస్తారు. వంతెనపై రెండు భారీ పిల్లర్ల అంచున నాలుగు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చే యాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి విశేషాలు.. 500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్‌లేన్ ఇటలీ నుంచి తెప్పించిన 26 పొడవైన స్టీల్ కేబుల్స్ వంతెనకు రెండు పైలాన్లు.. వీటి మధ్యదూరం 220 మీటర్లుపైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్వెడల్పు 21.5 మీటర్లు, ఒక్కోటి 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం 2017 డిసెంబర్లో నిర్మాణానికి శంకుస్థాపన 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 2023 జనవరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి2023 జూన్ 21న వంతెన ప్రారంభం పర్యాటక కేంద్రంగా.. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్‌గా నిలపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో భాగంగానే తీగల వంతెన ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు కరీంనగర్ మీద ఉన్న మమకారం అలాంటిది. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి, రూ.410 కోట్లు వెచ్చించి మానేరు పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్(ఎంఆర్ఎఫ్) ప్రాజెక్టును మంజూరుచేశారు. – మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ పర్యటన ఇలా.. కేబుల్ బ్రిడ్జితోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కె.తారకరామారావు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ.10 కోట్లతో కశ్మీర్గడ్డలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 5.05 గంటలకు రూ.7 కోట్లు వెచ్చించి నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐసీసీ వీడియో వాల్ కంట్రోల్ రూం, 14 జంక్షన్ల ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్), 18 చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్ అండ్రసింగ్ సిస్టం(పీఏఎస్), 8 చోట్ల వేరియబుల్ మెసేజింగ్ సిస్టం, ఐదుచోట్ల వాతావరణ సూచికలు, 18 ప్రాంతాల్లో వైఫై హాట్స్పాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు కమాన్‌మీదుగా ఓపెన్‌టాప్ జీపులో ర్యాలీగా వెళ్లి కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన డైనిమిక్ లైటింగ్ సిస్టమ్‌కు స్విచ్ఛాన్ చేయనున్నారు. -
బిహార్‌లో కూలిన తీగల వంతెన
-
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.