హైదరాబాద్(మాదాపూర్): కేబుల్‌బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్‌బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు.
మాదాపూర్‌లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది.
►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.
►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది.
►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు.
►కేబుల్‌బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్‌పోలీసులు తెలిపారు.
►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు.
►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు
► కాగా సందర్శకులు కేబుల్‌బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి.
►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు.
►అనుమతులు లేకుండా డ్రోన్‌లు వాడకూడదన్నారు.
►లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు జమీందర్‌లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు.
►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.
►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు
►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు.
►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు.
►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.
సమస్యలకు చావు పరిష్కారం కాదు
ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్‌లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్‌ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు.
–మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment