
సాక్షి, హైదరాబాద్: కేబుల్‌బ్రిడ్జి పైనుండి యువతి చెరువులోకి దూకిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్క ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడారి హర్షిత(19) జ్ఞానదీపిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మెహిదీపట్నంలోని సప్తగిరి కాలనీ, రేతిబౌలిలో నివాసముంటుంది.
కాగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కేబుల్‌బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. పెట్రోలింగ్ పోలీసులు గమనించి లేక్ పోలీసులను ఆప్రమత్తం చేయగా లేక్ డిపార్ట్‌మెంట్ ఎస్సై భాను ప్రకాశ్ వెంటనే బోటు డ్రైవర్ మనోహర్‌తో కలసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment