madhapur
-
మాదాపూర్ : పెటెక్స్ భారతదేశంలో అతిపెద్ద ఎక్స్పో (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ‘రివైవింగ్ రూట్స్’.. ఆర్ట్ ఎగ్జిబిషన్
సాలార్జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ వంటి మ్యూజియాలలో ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, చారిత్రక చిహ్నాలు (రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి, అక్కన్న, మాదన్న) ఇతర స్థానిక ప్రముఖుల నుంచి పౌరాణిక వ్యక్తులు, శకుంతల సిరీస్‌కు ప్రసిద్ధి. సందేశాత్మక, సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన చిత్రాలే. ఆయనే కళాకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. ఆయన వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – మాదాపూర్ ఆకర్షణగా రామాయణ ప్రధాన ఘట్టాల చిత్రాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆయన కుమారుడు వేణుగోపాల్‌రావు అధ్వర్యంలో రివైవింగ్ ది రూట్స్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. 1940 నుంచి 2012 వరకూ గీసిన 250 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రతి సన్నివేశాన్నీ చిత్రరూపంలో గీసి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేశారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రప్రదర్శన ద్వారా నేటి యువతరం తెలుకునే విధంగా వివరించారు. యువతరం చిత్రరంగంలో రాణించడానికి ఈ ప్రదర్శన స్ఫూర్తినిస్తుందని పలువురు చిత్రకారులు చెబుతుండడం విశేషం. నేటి యువకళాకారులకు చిత్రకళపై ఆకర్షణ పెరిగేందుకు ఈ ప్రదర్శన తోడ్పడుతుందన్నారు. ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్న ఈ ప్రదర్శనను నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా...కళాకారుడు శేషగిరిరావు చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. యువతను ఆలోచింప జేస్తాయి. ఆయన చిత్రరంగంలో రాణించేందుకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. నేటి భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఆయన కోడలు కొండపల్లి నిహారిక చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు పేరిట జీవిత చరిత్రను రాశారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలసి చూడాల్సిన ప్రదర్శన. – డాక్టర్ కె.లక్ష్మి ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్ ప్రదర్శన ఉపయోగకరం.. చిత్రరంగంలో రాణిస్తున్న వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగకరం. రామాయణ ఘట్టాలను చిత్రరూపంలో అద్భుతంగా చిత్రించారు. వీటి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పొచ్చు. చిత్రకారులు వీటి ద్వారా ఎన్నో మెళకువలను తెలుసుకోవచ్చు. – కీర్తి, జేఎన్‌ఏఎఫ్‌యూ విద్యార్థినిఇవీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
మాదాపూర్: శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(Food Safety Department) రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్‌ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం -
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. -
హైడ్రా మళ్లీ వీకెండ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వాపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో దాదాపు ప్రతి వీకెండ్లోనూ ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత ఉండేది. అక్రమ నిర్మాణాలెన్నో.. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్డులో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐదు అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణమని తేల్చి, కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్‌కు అనేక చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూడ్చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇటీవల సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటల వరకు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవీ రంగనాథ్, భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న ‘బాహుబలి క్రేన్’కూల్చివేత మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేత కొనసాగింది. అక్కడ పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అనుమతిచ్చిన అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నాం.. హైకోర్టు అక్రమం అని తేల్చినా భవన నిర్మాణం కొనసాగడానికి కారణమైన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నాం. బాధ్యులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఆ భవనాలకు ఫైర్ ఎన్ఓసీ, భవన నిర్మాణ అనుమతి కూడా లేదు. అయ్యప్ప సొసైటీలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీతో కలిసి సమీక్షిస్తాం. హైకోర్టు నుంచి స్పష్టమైన కూల్చివేత ఉత్తర్వులు ఉన్న వాటిని తొలి దశలో కూల్చేస్తాం. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్. -
హైడ్రా దూకుడు.. 6 అంతస్తుల భవనం కూల్చివేత
-
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
-
HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. ఆదివారం నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ఇక, అంతకుముందు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్ మాదాపూర్(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు భవనాన్ని కూల్చివేశారు. -
మాదాపూర్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.ఆఫీస్‌లోని యూపీఎస్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. సెలవు కావడంతో ఆఫీస్‌లో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేద. మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాల్లోని సిబ్బంది కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. -
సిటీ చూసొద్దామని బయలుదేరి.. మృత్యుఒడికి..
మాదాపూర్: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఆకాం„Š (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తరువాత ఆకాంక్షా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్ డివైడర్‌ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024 -
Hyderabad: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలతో అదుపు చేస్తున్నారు. -
హైదరాబాద్ మాదాపూర్ లో అగ్ని ప్రమాదం
-
మాదాపూర్: ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీ కంపెనీ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం..మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మాదాపూర్ శిల్పారామంలో లోక్ మంథన్ ఉత్సవాలు (ఫొటోలు)
-
మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
-
మాదాపూర్: చికెన్ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఓ కస్టమర్ ఆర్డర్ తెప్పించుకున్నారు. పార్శిల్ ఓపెన్ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న కస్టమర్ అనిరుధ్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
బోర్డ్ తిప్పేసిన మరో కంపెనీ
-
‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు)
-
HYD: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకుని మాదాపూర్‌లోని మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో, మోసపోయామని భావించిన దాదాపు 200 మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. ఉద్యోగం ఆశ చూపించి దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసింది సదరు కంపెనీ. ఇలా.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది.ఈ క్రమంలో శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. అనంతరం.. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో బాధితులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీంతో, మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
మాదాపూర్ స్టేట్ ఆర్ గ్యాలరీలో అన్ డిసిఫర్డ్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
మరో రేవ్ పార్టీ భగ్నం
-
నేతి రుచులు.. మాదాపూర్‌లో ఆకట్టుకుంటున్న రామేశ్వరం కేఫ్
మాదాపూర్: స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన అల్సాహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని ఆహార ప్రియులు ఒక్కసారైనా ఈ కేఫ్‌లో నేతితో తయారు చేసిన ఆహారపదార్థాలు రుచిచూడకమానరు. ఇక వారాంతాల్లో అయితే నగరవాసులు టోకెన్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కడుతుంటారు. వీరితోపాటు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం రామేశ్వరం కేఫ్‌ను విజిట్ చేస్తుంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో అల్పాహారానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంది. అందుకే నగరవాసులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడి టిఫిన్లను రుచిచూస్తుంటారు. టెంపుల్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రముఖులు, సినీతారలు సైతం వచ్చి చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. దాదాపు 150 రకాలకుపైగా టిఫిన్స్, స్నాక్స్, భోజనం, మాక్టైల్స్, జూసులు అందుబాటులో ఉంటాయి.ప్రతి రోజు 800వందల నుంచి 1000 మంది టోకెన్లు తీసుకుంటుంటారు. ఇక శని, ఆదివారాల్లో 1200 నుంచి 1400 వందల వరకూ టోకెన్స్ తీసుకుంటుంటారు. టెంపుల్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రైస్‌లో టెంపుల్ పులహోర, బిసిబెల్లాబాత్, కర్డ్‌రైస్, గొంగూరరైస్లు అందుబాటులో ఉన్నాయి. టిఫీన్స్లో స్పైసీ వడ, చక్కెర పొంగలి, నెయ్యి దోశ, నేతి ఇడ్లీ ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి.రకరకాల దోశెలు...మల్టీ గ్రెయిన్ దోశ, బటర్ మసాలా దోశ, ఘీ పొడి దోశ, మసాలా దోశ, రవ్వ మసాలా దోశ, ఘీ రాగి దోశ, ఘీ ఆనియన్ దోశ, ఘీ ఆనియన్ ఊతప్పం, గార్లిక్, పుదీనా, మసాలా, ఉప్మా, జైన్ మసాలా దోశలు ప్రత్యేక ఫ్లేవర్‌తో తయారు చేయడంతో వీటి కోసం అల్పాహార ప్రియులు ఎగబడుతుంటారు. వీటితోపాటు సాంబార్ వడ, పెరుగు వడ, క్యారెట్ హల్వా, మిర్చి బజ్జీ, వంటి వెరైటీలూ భలే రుచిగా ఉంటాయని ఆహార ప్రియులు చెబుతుంటారు.పసందైన పానీయాలుబ్లాక్కాఫీ, బాదంమిల్్క, బూస్ట్, కాఫీ, హర్లిక్స్, లెమన్‌టీ, మసాలా బటర్మిల్్క, వివిధ రకాల పళ్ల రసాల మిల్‌్కõÙక్లు అందుబాటులో ఉంటాయి. -
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు యతి్నస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు. Madhapur Traffic Police's intervention saved a woman's life as they prevented her from jumping off the Durgam Cheruvu Cable bridge.A 25-year-old woman has been taken to Vikram Hospital for treatment after reportedly ingesting pills.#CyberabadTrafficPolice pic.twitter.com/e22GP5bYL7— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 17, 2024 -
డ్రగ్స్ ఉచ్చులో డీజే సిద్ధార్థ్
-
మోషే పబ్: టార్గెట్ బిజినెస్మెన్.. యువతి ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.కాగా, మోషే పబ్‌లో జరిగిన అక్రమాలపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం బిల్లులో నుంచి తన కమీషన్ తాను తీసుకుంది. ఇలా వ్యాపారులను బోల్తా కొట్టించింది. వారి నుంచి లక్షన్నర రూపాయలు కాజేసింది.ఇక, ఈ పబ్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు 10 మందిపై కేసు నమోదు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మోషే పబ్ ముగ్గురు యజమానులతో పాటు.. మేనేజర్‌పైనా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సదరు యువతి తక్షణ టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా నాగపూర్‌కు చెందిన గ్యాంగ్ అని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో భాగంగా వ్యాపారవేత్తలకు వలవేస్తున్న యువతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
మాదాపూర్ లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Madhapur: ఆకట్టుకున్న ‘గీగిల్ ఫెస్ట్’
-
ఫోర్జరీ సాంబకు భారీ షాక్..
-
మాదాపూర్‌లో గ్రాండ్‌గా ఎఫ్ కేఫ్ లాంచ్ ప్రారంభం.. సందడి చేసిన స్టార్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్ నగరంలో ఆకర్షణగా కళాత్మక చిత్రాలు
-
బీజేపీ నేత కొడుకు పేర్లు బయటపెట్టిన మాదాపూర్ డీసీపీ
-
యాంకర్ సాంబశివరావు అక్రమాలకు చెక్
హైదరాబాద్, సాక్షి: టీవీ5 యాంకర్ సాంబశివ రావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తమనే బురిడీ కొట్టించిన ప్రయత్నంపై హెచ్‌పీసీఎల్(Hindustan Petroleum Corporation Limited ) తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో.. మాదాపూర్‌లో నకిలీ ల్యాండ్ ధ్రువ పత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్‌పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. ఇటు భూమి యజమానిని, అటు హెచ్‌పీసీఎల్‌ను సాంబశివరావు కుటుంబం బురిడీ కొట్టించాలని చూశాడు. ఈ క్రమంలో.. ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నడుపుతున్న విషయాన్నీ హెచ్‌పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు.. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంక్ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. -
HYD: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన వినయ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య -
హైదరాబాద్ మాదాపూర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
కుమారి ఆంటీ ఎపిసోడ్లో ట్విస్ట్!
Kumari Aunty News: సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. అయితే.. ఈ విషయం అదే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్‌ఫుడ్ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి కారణమైన ‘ఎక్స్ట్రా టూ లివర్స్’ కస్టమర్‌తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. త్వరలో ఆమె ఫుడ్‌కోర్టును సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. Unemployed protest at Kumari Aunty's food stall! Unemployed protest that Revanth Reddy said he will come to your food stall, tell him to cancel Jivo 46. #KumariAunty #RevanthReddy pic.twitter.com/NZhG4iVU4L — MD HAJI (@MDHAJI63535465) February 3, 2024 Video Credits: MD HAJI ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్ మీడియా వరమా? శాపమా? -
Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: నిత్యం టీవీ5 వేదికగా తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఫీలయ్యే సాంబశివరావు పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసారు. మీడియా వృత్తితో పాటు సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారన్నది ప్రధాన అభియోగం. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. దీంతో కంగారు పడ్డ కంపెనీ అధికారులు.. మూడేళ్లుగా లీజు ఎరియర్స్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ, స్థలం విషయంలో సాంబశివరావు, కుటుంబ సభ్యులు చేసిన మోసానికి ఏం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కింద చూడవచ్చు. -
మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ
హైదరాబాద్, సాక్షి: ఫుడ్ స్టాల్‌తో నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఫేమస్ అయ్యి.. ఆపై సోషల్ మీడియా ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకుంది కుమారి ఆంటీ. అయితే ఆ ఫేమ్ వల్లే జనాలు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర గుమిగూడడం.. అది ట్రాఫిక్ జామ్‌కు దారి తీయడంతో ఆమె స్టాల్‌ను పోలీసులు బలవంతంగా తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తీవ్ర చర్చ నడవగా.. చివరకు తెలంగాణ సర్కార్ ఆమెకు ఊరట ఇచ్చింది. ఈ పరిణామంపై ఆమె సాక్షితో స్పందించారు. ‘‘గత 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నా. ముందు మాకు తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని మేం అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారామె. కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్‌స్టాల్ నడిపిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువ చర్చ నడిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె ఫుడ్ స్టాల్‌కు జనాల రాక మొదలైంది. ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ వస్తోంది. దీంతో మంగళవారం ఆమె షాప్‌ను సీజ్ చేసి.. మరో చోటుకి తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే మిగతా వాళ్లను వదిలేసి తననే తొలగించాలని ఆదేశించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీ అందుకే టార్గెట్ అయ్యిందా? మరోవైపు ఈ పరిణామంపై అదే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. సీఎం జగన్ తనకు మంచి చేశారని.. ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. దీంతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చక ముందే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె ఫుడ్‌కోర్టును యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్ర డీజీపీతో పాటు ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఆమె స్టాల్‌కు వెళ్లనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. -
Hyd: కుమారి ఆంటీకి బిగ్ షాక్
నాన్నా.. నాన్నా.. అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ.. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని సోషల్ మీడియాను షాక్ అయ్యేలా చేసి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి. అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించగా.. తనకు మాత్రమే బంద్ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని.. ఈలోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు. కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు. This is the reason y police halted #Kumariaunty hotel at ITC kohinoor Mari intha picholu unaru endi ra#hyderbad pic.twitter.com/b4yArC7pQR — Nandeeshwar (@SNandeeshwar) January 30, 2024 ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయటంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్‌కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం.. చాలారోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా.. ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తని మరోచోట బిజినెస్ చేస్కోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు.. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్‌సైడ్ ఈటరీ స్టాల్స్‌కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు ఫర్వాలేదు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేం ఏం చేయలేం. ఒకవేళ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయ్‌దుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
-
మాదాపూర్ లో స్నైల్స్ , హెయిర్, బ్యూటీ & నెయిల్స్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించిన జబర్దస్త్ రితు చౌదరి, డైరెక్టర్ సందీప్ రాజ్ (ఫోటోలు)
-
HYD: క్షణాల్లో నేలమట్టమైన భవనాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇవాళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాదాపూర్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని రెండు పక్కపక్క భవనాలను క్షణాల్లో నేలమట్టం చేసేశారు. పేలుడు పదార్థాల అమర్చి.. అధునాతన టెక్నాలజీతో ఈ కూల్చివేత చేపట్టారు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని రెండు భవనాలను క్షణాల్లో నేలమట్టం చేశారు. డిజైనింగ్‌లో లోపంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసి నుండి అనుమతి లభించింది. భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు బిల్డింగ్ ఓనర్స్ తెలిపారు. కూల్చివేసిన స్థానంలో భారీ భవనాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. *Video from earlier today showing the controlled demolition of Mindspace Madhapur Buildings 7 & 8 carried out by Edifice Engineering & Jet Demolition!..* #Hyderabad pic.twitter.com/sdwmZMSFpu — DONTHU RAMESH (@DonthuRamesh) September 23, 2023 -
డ్రగ్స్ కేసులో నవదీప్‌కు బిగ్ షాక్!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవదీప్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) పిటిషన్‌పై హై కోర్టులో విచారణ సినీ నటుడు నవదీప్ పిటిషన్‌పై హై కోర్టు లో విచారణ జరిగింది. అయితే నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు వివరించారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరఫున అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్ హైకోర్టుకు వివరించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. (ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో 41 ఏ కింద నవదీప్‌కు నోటీస్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చి విచారణ జరపాలని ఆదేశిస్తూ నవదీప్ పిటిషన్ కొట్టివేసింది. -
డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్ ఇంటికి నార్కోటిక్ పోలీసులు!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అసలేం జరిగిందంటే... మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతనికి సంబంధమున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసులో నవదీప్‌ను ఆరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. (ఇది చదవండి: హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు) అసలేం జరిగిందంటే.. మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. అయితే దీనిపై వెంటనే హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదు తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు. (ఇది చదవండి: అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!) నవదీప్ స్నేహితుడు అరెస్ట్ అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. -
సాక్షి చేతిలో మాదాపూర్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో నార్కోటిక్ విభాగం పోలీసులు పేర్కొన్నారు. గత నెల 31 గుడిమల్కాపూర్, మాదాపూర్‌లో దాడి చేసి వెంకట్ రత్నాకర్ రెడ్డి, బాలజీ, మురళిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 13న ఎనిమిది మంది(ముగ్గురు నైజీరియన్లు, ఐదుగురు వినియోగదారులు) డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజేరియన్లను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుల సమాచారంతో హీరో నవదీప్ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు తేలిందన్నారు. హీరో నవదీప్ ఈ కేసులో ఏ29గా ఉన్నారని, ఆయనతో పాటు మరో 17 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో తరుచూ డ్రగ్స్ పార్టీలు నిర్వయించే వారని, వైజాగ్‌కు చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పార్టీలు చేశారని తెలిపారు. ఏ5 నుంచి ఏ16 వరకు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 తో పాటు పలు సెక్షన్ లు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ కేసులో 8 మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా.. ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిందితులను కోర్టు నుంచి పోలీసులు జైలుకు తరలించారు. -
పరారీలో టాలీవుడ్ హీరో నవదీప్..క్లారిటీ !!
-
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మాదాపూర్ డ్రగ్స్ కేసు: నిందితుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిన్వివగా, బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 18 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. సినీ రంగానికి చెందిన పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. చదవండి: పెరుగు అడిగితే చంపేశారు! కాగా, టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్‌ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్‌తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పార్టీలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకట రత్నారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్‌హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకట రత్నారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచ్చిన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్‌గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్‌మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పార్టీలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకట రత్నారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకట రత్నారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్‌పై ప్లేట్లో ఉంచిన కొకైన్‌ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. డ్రగ్ పెడ్లర్‌గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్‌మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్‌తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్‌లో ఫోన్‌నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కారు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు.. వెంకట్ లీలలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన సినీ ఫైనాన్షియర్ వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు పాల్పడినట్లు తేలింది. నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్ఎస్ అధికారినంటూ రూ.30 లక్షలకుపైగా వెంకట్ కొట్టేశాడు. ఒక ఐఆర్ఎస్ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేసి.. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు, పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ నంటూ విదేశీ యువతలను సైతం వెంకట్ మోసం చేసినట్లు బట్టబయలైంది. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్న వెంకట్.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించాడు.వెంకట్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు? -
మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్‌ను అమ్మకాలు చేసినట్లు బాలాజీ, వెంకట్లు అంగీకరించారు. ఆ 18 మంది ఎవరు, అందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సినీ నిర్మాత కేసీ చౌదరి అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. కేపీ చౌదరి లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేపీ చౌదరి వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్దం అవ్వగా, దర్యాప్తుకు సమయంలో పైస్థాయి నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు.. బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా ? ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. కేపీ చౌదరికి సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే.. టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 18 మంది కస్టమర్లు, నలుగురు డ్రగ్ పెడ్లర్స్ కోసం గాలిస్తున్నట్టు టీఎస్–నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) ఎస్పీ (వెస్ట్) డి.సునీతరెడ్డి గురువారం వెల్లడించారు. నేవీ నుంచి బాలాజీ బయటకొచ్చాక... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్‌ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్‌తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పారీ్టలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కూడా...: గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన కె.వెంకటరమణారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్‌హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకటరమణారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచి్చన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్‌గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్‌మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పారీ్టలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకటరమణారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో బుధవారం రాత్రి మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. గుడిమల్కాపూర్‌లో చిక్కిన బాలాజీ: రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకటరమణారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్‌పై ప్లేట్లో ఉంచిన కొకైన్‌ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. స్నాప్‌చాట్‌లో కోడ్ నేమ్స్ డ్రగ్ పెడ్లర్‌గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్‌మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్‌తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్‌లో ఫోన్‌నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రమణారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కారు. చదవండి: గందరగోళంగా కోరుట్ల దీప్తి కేసు.. -
Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కోణం బయటపడింది. డ్రగ్స్ పార్టీలతో పాటు వ్యభిచారం దందా కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులో లోతుకు పోయే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాదాపూర్‌లోని విఠల్ రావు నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులకు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలోనూ వెంకట్, బాలాజీలపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు తేలింది. తాజాగా మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టుబడగా.. ఫ్లాట్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు ఉండడంతో వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది. పలు చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వెంకట్ ఈ డ్రగ్స్ సప్లై ప్రధాన సూత్రధారిగా తేలింది. సినిమా వెంకట్‌తో పాటు బాలాజీలు ఆ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట ఆ ఇద్దరినీ రెండు రోజులుగా అదే అపార్ట్మెంట్లో ఉంచినట్లు సమాచారం. ఈ అసాంఘిక కార్యకలాపాల కోసం రూమ్ నెంబర్ 804ను ఉపయోగించుకుంటున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ దందాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే.. గతంలోనూ వ్యభిచారం నిర్వహిస్తుండగా రెండుసార్లు ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సోదాల్లో అధికారులు వెంకట్ దగ్గర నుంచి 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్ టి పిల్స్ తొ పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వెంకట్.. తాను ఉపయోగించడంతో పాటు మరికొందరికి అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు? సినీ పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాలు తీస్తోంది. -
మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పలు చిత్రాలకు ఫైనాన్షియర్ వ్యవహరించిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో వెంకట్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే.. నార్కోటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్‌తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించాడు వెంకట్. వెంకట్‌తో పాటు పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్ర్‌రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్‌ల నుంచి కోకైన్, ఎల్ఎస్డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు సైతం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు.. ఇక వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతుండగా.. విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టింటి నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే.. వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణను నిర్ధారించుకున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇక.. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. వెంకట్ వాట్సాప్‌లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వెంకట్ ఫ్లాట్‌లో ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్ -
మాదాపూర్ బీజేపీ నేత చరణ్ చౌదరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ బీజేపీ నేత చరణ్ చౌదరి అరెస్ట్ అయ్యారు. తనపై నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్ EOW అధికారులు చరణ్ చౌదరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా సోమవారం చరణ్ చౌదరి మిస్సింగ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. తన భర్తను నలుగురు కిడ్నాప్ చేశారని ఆరోపించారు -
హైదరాబాద్ మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై హైస్పీడ్‌లో వెళ్తున్న స్కూటీ సైడ్వాల్ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయి మృతిచెందింది. వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి -
మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
-
మాదాపూర్ నారాయణ కాలేజీ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: కార్పోరేట్ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్‌కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. -
HYD: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న కారు కేబుల్ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్తున్న బ్రీజా కారు(B.No: TS09FB4896) పల్టీ కొట్టింది. కాగా, కారు డ్రైవర్ హైస్పీడ్‌లో ఉండటం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కారును ఘటనా స్థలం నుంచి తొలగించారు. ఇది కూడా చదవండి: సంధ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. ఆటోడ్రైవర్‌కు అర్ధరాత్రి ఫోన్.. -
మాదాపూర్: ఆకట్టుకున్న ఇంటీరియర్ ప్రదర్శన (ఫొటోలు)
-
Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ హెల్త్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్‌లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో శేజల్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శేజల్ ఆయుర్వేదిక్‌కు సంబంధించిన నిద్రమాత్రలు వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా పలువురు నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. సూసైడ్ లెటర్ స్వాధీనం శేజల్ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. ఇందులో బాధితురాలు పలు విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్‌ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం -
హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అప్రమత్తం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నగరవాసులను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరకు 040-29555500కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్: మాదాపూర్ లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ సదస్సు
-
మాదాపూర్ కొత్తగూడెం TCS ఆఫీసుకు బాంబు బెదిరింపు
-
Hyderabad: టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్‌తో కంపెనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఫేక్ కాల్ అని, బాంబు లేదని నిర్ధారించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: పెళ్లైన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం -
మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని శరణి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించగా.. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాలి. -
మీ సొంతింటి కల సాకారం కోసం ‘సాక్షి’ ప్రాపర్టీ షో వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను మరింత చేరువ చేసేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు వచ్చింది. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సాక్షి 14వ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. నగరానికి చెందిన 20కి పైగా నిర్మాణ సంస్థలతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంకులు కూడా ఈ షోలో పాల్గొననున్నాయి. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షోను ప్రారంభించనున్నారు. ప్రవేశం ఉచితం. మెయిన్ స్పాన్సర్: అపర్ణా అసోసియేట్ స్పాన్సర్లు: వాసవి గ్రూప్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ కో–స్పాన్సర్లు: సాకేత్ ఇంజనీర్స్, శిల్పా రాఘవ ప్రాజెక్ట్స్ పాల్గొనే ఇతర సంస్థలు: ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, కపిల్ ప్రాపర్టీస్, ఎన్సీసీ అర్బన్, శ్రీరాధే రియాల్టీ, వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఏలియాంటో గ్రూప్, అసెట్ప్రీ, హస్తినా, గ్రీన్ హోమ్ ఐటీ లేక్‌సిటీ, మహిధరా ప్రాజెక్ట్స్, సీతా షెల్టర్స్, రిధిరా జెన్, శ్రీ విజయ గణపతి అవెన్యూస్, యోషిత ఇన్ఫ్రా, కెనరా, ఎస్బీఐ బ్యాంకులు. -
ఊరెళ్లేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టొద్దు: డీసీపీ శిల్పవల్లి
-
మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ముగిసిన సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూ కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 150 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలుపై సీఐడీ ఆరాతీస్తోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ స్పైరా సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. మిలాంట్ టవర్ పదో అంతస్తులో ఉన్న ఆ కార్యలయంలో రెండు రోజులపాటు కొనసాగిన ఈ సోదాలు బుధవారం ముగిశాయి. ఈ మేరకు ఎన్ స్పైరా సంస్థలో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ సంస్థల నుంచి రామృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లిన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 10 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మాదాపూర్‌లోని ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లినట్లు గుర్తించారు. ఈ డబ్బులతో నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. -
ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కుమారుడు విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 17న థాయ్‌లాండ్‌లో పెళ్లి జరగగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి దంపతులు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి, మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ మంత్రు లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్, ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీవీ కృష్ణారెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి, డాక్టర్ విజయానంద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వ«ధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస) -
మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి
మాదాపూర్: మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి పిలుపునిచ్చారు. మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో ’సాధికారత– తెలంగాణ మహిళ’’అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళల సాధికారత ఆవశ్యకత, వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చ సాగింది. ఈ సందర్భంగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న 11మంది తెలంగాణ మహిళలను జస్టిస్ హిమాకోహ్లి సత్కరించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యభిక్షపతి, ముఖరా(కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి, సర్పంచ్ మొండి భాగ్యలక్ష్మితోపాటు మాదాపూర్ డీసీపీ కె. శిల్పవల్లి, రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, సెర్ప్ నుంచి ఎస్ కృష్ణవేణి, బుర్రి మంజుల, మారు సత్తవ్వ, ఉద్యానవన శాఖ నుంచి ఎస్. విజయలక్ష్మి, మంగళంపల్లి నీలిమ, యట్ల వెంకమ్మను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ ఐపీఎస్ జీ మమతాశర్మ, ఐపీఎస్ అధికారి పద్మజ, జీవన్‌దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత, వీహబ్ సీఈవో దీప్తిరావుతో సహా సదస్సుకు 90 మంది వివిధ సంస్థల పత్రినిథులైన మహిళలు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లింపులపై అవగాహన కల్పించాలి
మాదాపూర్: పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత సీఏలపై ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)సంస్థ ఆధ్వర్యంలో సీఏ విద్యార్థుల కోసం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ మాట్లాడుతూ సీఏలు అందరూ తమ వృత్తిలో నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఆదాయపు పన్ను పత్రాలను, లెక్కలను అర్థం చేసుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేదని, కానీ కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో సులువుగా మారిందన్నారు. పన్నుల చెల్లింపుల విషయంలో ప్రజలకు ఉండే అపోహలను, భయాలను తొలగించి వారు పన్నులను సక్రమంగా చెల్లించే విదంగా సీఏలు పనిచేయాలన్నారు. ఐసీఏఐ అధ్యక్షుడు డేబాసిస్ మిత్ర మాట్లాడుతూ ఐసీఏఐలో దాదాపు 325000 మంది సభ్యులు ఉన్నారని, 8 లక్షల మంది విద్యార్థులు సీఏ కోర్సు చదువుతున్నారన్నారు. చార్టర్డ్ అకౌంట్ రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్లు వంటి అంశాలపై విద్యార్థులకు, వృత్తి దారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ప్రతినిధులు దయా నివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
కేబుల్‌బ్రిడ్జి పైనుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: కేబుల్‌బ్రిడ్జి పైనుండి యువతి చెరువులోకి దూకిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్క ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడారి హర్షిత(19) జ్ఞానదీపిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మెహిదీపట్నంలోని సప్తగిరి కాలనీ, రేతిబౌలిలో నివాసముంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కేబుల్‌బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. పెట్రోలింగ్ పోలీసులు గమనించి లేక్ పోలీసులను ఆప్రమత్తం చేయగా లేక్ డిపార్ట్మెంట్ ఎస్సై భాను ప్రకాశ్ వెంటనే బోటు డ్రైవర్ మనోహర్‌తో కలసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది, ఎగబడుతున్న జనం!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్‌గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. కండ్లకోయలో సైబర్ టవర్స్‌ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ -
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’
సాక్షి, హైదరాబాద్: పాఠశాల, కళాశాలలో యోగా నేర్చుకొనేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హైకోర్టు జడ్జీ వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం నిర్మాణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. 2050 భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగథాన్‌లో 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్ నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయటాన్ని అలవాటుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేకమైన పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాదిమంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ కళాశాలల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు గోల్డ్ ఛాలెంజ్ విభాగంలో 108 సార్లు, సిల్వర్ ఛాలెంజ్ విభాగంలో 54 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. -
హైదరాబాద్‌లో వీర్‌దాస్ స్టాండప్ కామెడీ షో.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: నగరానికి మరో స్టాండప్ కమెడియన్ రాక ఖాయమైంది. డెహ్రాడూన్‌కి చెందిన వీర్‌దాస్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీ షోలకు ప్రసిద్ధి చెందారు. అయితే చాలా మంది కమెడియన్లకు భిన్నంగా ఆయన అటు కమెడియన్‌గా ఇటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. గతంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇటీవల వరుసగా కొన్ని షోస్‌లో ఆయన హాస్యంపై సంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 10న బెంగళూరులో ఆయన ప్రదర్శన రద్దయింది. అనంతరం తమ నగరంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వాంటెడ్ టూర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నగరానికి వచ్చి మాదాపూర్ శిల్పకళావేదికలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ప్రదర్శనకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. (క్లిక్: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!) -
ఇండో జపనీస్ బ్రిడ్జ్ ఇకెబనా
సాక్షి, హైదరాబాద్: ఇండో జపనీస్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నగరంలోని మాదాపూర్‌లో అద్భుతమైన పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఇకెబనా చాప్టర్ బృందం. జపాన్‌కు అలంకరణ విధానమై ఇకెబనా... పూలతో అద్భుతమైన కళాఖండాలను ఎలా చేయవచ్చో చెబుతుంది. ఈ ఆర్ట్ ద్వారా పువ్వుల కొమ్మలతో వేర్వేరు రూపాలను తయారు చేసి ప్రదర్శించారు హైదరబాద్ చాప్టర్ ఆఫ్ ఓహర ఇకెబనా. ఇండో జపనీస్ దేశాల మధ్య స్నేహాన్ని, ఒకరిపై మరొకరి అభిమానాన్ని చాటిచెప్పేలా ముదిత్ మత్సురి థీమ్‌తో ఈ ప్రదర్శన చాప్టర్ సభ్యులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జపనీస్ ఫెస్టివల్ లో ఇకెబనా, ఒరిగమి, జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఈ ప్రదర్శనలో చూపించారు. మనం జరుపుకునే పండుగల పరమార్థం వచ్చేలా ఈ ప్రదర్శనను తయారు చేశామని హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ నిర్మల అగర్వాల్ తెలిపారు. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాటే ఆర్ట్ అన్నారు మాజీ డిజి జయ చంద్ర. ఇకబన ఆర్ట్ ప్రకృతికి దగ్గర చేస్తూ.. ఒక్క పువ్వుతో కూడా ఎంతో అందంగా కళా ఖండాలను తయారు చేయవచ్చని తెలిపారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఇకెబనా ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తోంది.