
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో నార్కోటిక్ విభాగం పోలీసులు పేర్కొన్నారు. గత నెల 31 గుడిమల్కాపూర్, మాదాపూర్‌లో దాడి చేసి వెంకట్ రత్నాకర్ రెడ్డి, బాలజీ, మురళిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 13న ఎనిమిది మంది(ముగ్గురు నైజీరియన్లు, ఐదుగురు వినియోగదారులు) డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజేరియన్లను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో నిందితుల సమాచారంతో హీరో నవదీప్ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు తేలిందన్నారు. హీరో నవదీప్ ఈ కేసులో ఏ29గా ఉన్నారని, ఆయనతో పాటు మరో 17 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో తరుచూ డ్రగ్స్ పార్టీలు నిర్వయించే వారని, వైజాగ్‌కు చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పార్టీలు చేశారని తెలిపారు. ఏ5 నుంచి ఏ16 వరకు నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 తో పాటు పలు సెక్షన్ లు నమోదు చేసినట్లు తెలిపారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో 8 మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా.. ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిందితులను కోర్టు నుంచి పోలీసులు జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment